ఇప్పటివరకూ ‘స్త్రీవాదానికి' (feminism) కి వ్యతిరేకం‘పురుషాహంకారం’ (Male chauvinism) అనుకుంటూవచ్చాను. కానీ, ఈ మధ్య నేను రాసిన ‘స్త్రీపక్షపాతానికి మరోవైపు’, ‘వక్రీకరించిన వరం’ టపాలకు వచ్చిన వ్యాఖ్యలకు సమాధానాలు తెలుసుకునే శోధనల నేపధ్యంలో, అంతర్జాలంలో ఒక గమ్మత్తైన వెబ్ సైట్ చూడటం తటస్థించింది. National Coalition of Free Men (NCFM) అనే ఈ సైట్ మగాళ్ళకు వ్యతిరేకంగా జరిగే లింగవివక్షకు (sex discrimination) వ్యతిరేకంగా అమెరికాలో 1977 వ సంవత్సరం నుండీ పనిచేస్తోంది. అంటే ‘స్త్రీవాదానికి’ వ్యతిరేకం ‘పురుషస్వాతంత్ర్ర్యం’ అన్నమాట. చాలా చిత్రంగా ఉందికదూ! మొదట చదివినప్పుడు నాకూ అలాగే అనిపించింది.
కాకపోతే నా ‘అర్బన్ మేల్’ మిత్రుడు చెప్పిన నగరవాసంలో మారుతున్న జెండర్ సమీకరణలను దృష్టిలో పెట్టుకుంటే, ఇలాంటి ఒక సంఘం త్వరలో భారతదేశంలో పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు. నాకు బాగా నచ్చిన విషయం వీరి సైధ్ధాంతిక వివరణ (Philosophy of the organization). అందునా ముఖ్యంగా ఈ సిద్ధాంతం ఆఖర్న FREE MEN, ‘మగాడికి ముక్తిని ప్రసాదించండి’ అని వీరు చేసిన విశ్లేషణ నాకు అమితంగా నచ్చి ఇక్కడ స్వేచ్చానువాదం చేసి అందిస్తున్నాను. ఈ విశ్లేషణను ఆంగ్లంలో చదవాలనుకునేవారు లంకె ద్వారా మాతృకని చదవొచ్చు.
మగాళ్ళని విముక్తుల్ని చెయ్యండి...
- వారి పాత్రలకున్న కఠిన నిర్వచనాలనుంచీ
- సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలు అతిగా పొందిన జాతి అనే అపోహలనుంచీ
- అసాధ్యాలని సుసాధ్యాలు చేస్తారనే లేనిపోని ఆదర్శాలతూనికల నుంచీ
- నెత్తిన రుద్దిన పోటీలనుంచీ, వైఫల్యాల భయాలనుంచీ
- సహజభావాలూ, సహజ ప్రేరణలూకాక, తర్కాన్ని ఆధారం చేసుకుని నిర్ణయాలు చేసే బలవంతం నుంచీ
- అపాదిత అంతస్తులనుండీ, పాత్రలనుంచీ
- తమ భయాన్ని ప్రకటించలేని నిస్సహాయతనుంచీ
- ఉద్యొగం పురుషలక్షణం అనే సామెత నుంచీ
- హింసాత్మక ప్రవర్తన తమ మగతనానికి చిహ్నమనుకునే భ్రమలనుంచీ
- తమ శరీరపు అవసరాలను నిర్లక్ష్యం చేసే బాధనుంచీ
- స్త్రీలను లైంగికంగా సంతృప్తిపరచాల్సిన భాధ్యతనుంచీ,ఆడవారి భావప్రాప్తి నాటకాలనుంచీ
- సాటి మగాళ్ళతో సన్నిహిత ఆత్మిక సంబంధాలు నెరిపడానికిగల సామాజిక అవరోధాలనుంచీ
- రక్షకులు,పోషకులుగా తమ పటిమ ప్రదర్సించాల్సిన బలవంతం నుంచీ
- చట్టపరమైన శిక్షల తీవ్రతలో వివక్షతనుంచీ
- పిల్లలను పెంచడంలోని ఆనందాన్ని అందుకోలేకపోవడం నుంచీ
- స్త్రీలను అణచివేసే వర్గంగా తమను చూపెట్టే ఈ మూసలనూ, లక్షణాలనూ ఆపాదించడం నుంచీ
పైనున్నవాటిల్లో కొన్ని కేవలం అమెరికన్ సంస్కృతికి మాత్రమే చెందినవైనప్పటికీ, చాలావరకూ మన భారతీయ నగరజీవనానికి అన్వయించుకోవచ్చనిపించింది. ముఖ్యంగా మగాడి మారుతున్న పాత్ర నేపధ్యంలో, అతివాద స్త్రీవాదుల బారినుండీ రక్షణ మగాడికీ ఒక హక్కుగా కావల్సిన పరిస్థితి వస్తే ఇలాంటి సంఘాల రూపకల్పన అవసరంగా కనిపించొచ్చు.
నాకు కాస్త సరదాగా అనిపించినా, ఇప్పటికే ఇలాంటి సంఘాల ఆవశ్యకతను కోరుకునే మగాళ్ళ జాబితా పెరుగుతోందనడానికి నా ‘స్త్రీపక్షపాతానికి మరోవైపు’ టపాకొచ్చిన స్పందనబట్టి అనిపిస్తోంది. వాళ్ళల్లో ఒకరు భారతీయ ఫ్రాంచైజ్ తీసుకుని దీన్ని మొదలెట్టినా ఆశ్చర్యం లేదు.
‘మక్బూల్’ అనే హిందీ సినిమాలో ఓంపురి ఒక డైలాగ్ అంటాడు "సృష్టిలో సమతౌల్యం (balance) చాలా అవసరం. నిప్పుకెప్పుడూ, నీటి భయం ఉండాల్సిందే!" అని. దానినిక్కడ అన్వయించుకుంటే, జెండర్ యుద్దంలో ఇంతకాలం సాగిన మగవారి పైచేయికి స్త్రీవాదం సమాధానమైతే, ‘స్త్రీవాదం’ మితిమీరిన రోజున ‘పురుషస్వాతంత్ర్యం’ ఉద్భవించి సమతౌల్యం సృష్టిస్తుందన్నమాట!
"Wah...what an IDEA sirji!!!!"
9 comments:
Thanks for introducing this site!! I wud have never searched this by myself.
"సృష్టిలో సమతౌల్యం (balance) చాలా అవసరం. నిప్పుకెప్పుడూ, నీటి భయం ఉండాల్సిందే!" - Thanks again, I would never see maqbool by myself.
Great Post!!
ఇప్పుడు కొత్తగా దీని ఫ్రాంచైజ్ అవసరం లేదు సుమారు రెండు దశాబ్దాలక్రితమే నాగపూర్,పూనా ఎక్కడొ ఇలాంటి సంఘం ఒకటి ఏర్పడింది.ఓపికాతీరికాఉంటే పాత ఇండియాటుడే పత్రికల్లో ఈ వివరాలు లభిస్తాయి.
పెద్ద ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.
గృహహింస నిరోధ చట్టాన్ని స్త్రీలు దుర్వినియోగం చేస్తూ మొగుడిమీదా, అత్తింటి వారిమీదా అన్యాయపు కేసులు పెడుతున్న తీరుని ప్రతిఘటించాలని, మొగుళ్ళ హక్కుల్ని కూడా రక్షించాలని ఇప్పటికే కొన్ని సంఘాలు ఏర్పడి చురుకుగా పని చేస్తున్నాయి. ఎప్పుడైతే సుహృద్భావం, సహజీవనం కల్లలు ఐపోతాయో, ఎప్పుడైతే ఒకరి హక్కు కాపాడటం అంటే ఇంకొకరి హక్కుని అణగదొక్కడం అన్నట్టుగా సమాజం (చట్టం) ప్రవర్తిస్తుందో అప్పుడు ఇలాంటి ప్రతిఘటనలు తెలెత్తుతాయి. అండుకు పెద్దగా ఆశ్చర్య పడనక్కర్లేదు.
ఐతే మీరు వెలికి తీసిన ఈ సంస్థ ఆశయాలు ఇటువంటి పరిస్థితికి భిన్నమైనవీ, మరింత సూక్ష్మమైనవి అని నాకనిపిస్తోంది. మగాడు ఇంటి బాధ్యత మొయ్యాలి. బయటికెళ్ళి ఉద్యోగం చెయ్యాలి. ప్రయాణం చేస్తే బరువులు మొయ్యాలి. వాహనం ఉంటే అతనే తోలాలి. మగాడు ఏడవ కూడదు. ఎక్కడా అధైర్యం ప్రకటించ కూడదు. బ్లా బ్లా బ్లా .. ఇలాంటి ఎక్స్పెక్టేషన్లు అన్నిటికీ తరతరాలుగా ఎందరో మినహాయింపు ఉదాహరణలుగా మనకి కనిపిస్తూనే ఉంటారు. ఐనా ఆ ఎక్స్పెక్టేషన్లు అలా చెలామణి ఐపోతూనే ఉంటాయి. ఇలాంటివే ఆడవాళ్ళ విషయంలో పాతివ్రత్యం గురించీ మాతృత్వం గురించీ ఉన్నాయి. ఎప్పుడో పూర్వ కాలంలో .. అసమర్ధుని జీవయాత్ర సీతారామారావులాంటి వాళ్ళకి చెల్లిందేమో ఇంట్లో పెళ్ళాం పిల్లలకి తిండి లేకపోయినా తను తినేసి రావడం. ఈనాటి నాగరిక మొగుడికీ తండ్రికీ చెల్లుతుందా అలాగ?
Come, my gentlemen friends, you don't have to be Atlases all the time .. you can shrug every now and then. While you are at it, don't hesitate to show your vulnerable side.
Cool website, thanks for introducing.
ఒప్పుకోవాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి ఈ టపాలో! ఆ సైట్లు చూసాక అప్పుడేమన్నా కొత్త పాయింట్లు తడతాయేమో చూద్దాం!
చివరి పేరా బాగుంది.
కానీ మీరు ఎడతెగని వివాదాలను సృష్టించే ఇటువంటి టపాల కంటే మంచి balanced చర్చకు దారి తీసే టపాలు రాస్తే నేను మీ అభిమానిగా సంతోషిస్తాను.
ఈ 'ఇజాలకు ' సంబంధించిన విషయాల్లో నిజాలను ఒప్పుకోడానికి చాలా మందికి 'అహం ' అడ్డొస్తుంది. దాన్లోంచి అర్థం లేని వాదన మొదలవుతుంది. దానికి ఎదురు దాడి మరోవైపు నుంచి! తీరా నిజం ఏమిటన్నది తేలకుండా రెండు వైపుల నుంచీ వాదాలు, మాత్రం మిగులుతాయి.
అన్యధా భావించరని తలుస్తాను.
@సుజాత గారూ;అనుభవాలనుంచీ,శోధనల నుంచీ,ఆలోచనల నుంచీ నా టపాల విషయాలు పుట్టుకొస్తాయి. అలాగే, ఇదికూడా. నేను conscious గా ఎంచుకున్నది ఏమాత్రం కాదు.ఇదివరకటి టపానుంచీ Just a spill over అంతే.ఇక వివాదాలంటారా,అవి చదివేవారి విచక్షణపై ఆధారపడిన విషయం. నిజంగా నా కంట్రోల్ లో ఉన్నాయంటారా?
నేను ఎంత distance చేసుకున్నా, "నా మిత్రుడి అనుభవాలు బాబోయ్" అంటున్నా ‘స్త్రీపక్షపాతానికి మరోవైపు’ టపాని వదిలారా? కాబట్టి, మీ కోరిక సబబే అయినా చాలా అసాధ్యమైనదండి!అయినా ప్రయత్నిస్తాను.
@వేణూ;ధన్యవాదాలు.
@కొత్తపాళీ గారూ ఎప్పటిలాగే మీ అనుభవజ్ఞానానికి నా కృతజ్ఞతలు.
@రాజేంద్రగారూ; అలాగా. వాళ్ళవివరాలు ఇప్పుడే అంతర్జాలంలో వెతికిపట్టుకోవాలి.
@పూర్ణిమ; Its my pleasure.
మహేష్,
నిజమే మగాళ్ళకు కూడా కష్టాలుంటాయి . ఒప్పుకుంటాను. ముఖ్యంగా ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో ఐనా మగాడు గట్టిగా ఏడవలేడు. కాని అతని హృదయం భోరున ఏడుస్తుంది. పైగా ఈ సామెత కూడా ఏడిచింది కదా. ఏడ్చే మగవాడిని , నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు అని. అసలు ఈ రూల్స్ అన్నీ ఎవరు పెట్టారు.మనం అవి ఎందుకు పాటించాలి, ఎందుకు భయపడాలి??
ఇలాంటి సంస్థలు ఇండియాలో వున్నాయన్న విషయం మీకు తెలీకపోటం కొంచం ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి సంస్థల గురించి చాలా రోజుల నుంచి వింటున్నా. ముఖ్యంగా డొమస్టిక్ వయలెన్స్ యాక్ట్ వచ్చాక తయారైన సంస్థలు. వీళ్ళు ప్రస్తుతం ఈ యాక్ట్ ని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. Politically incorrect concepts తలకెత్తుకున్నారు కాబట్టి పెద్దగా వినపడరు, కనపడరు. మొన్నే మన రేణుకా చౌదరి మీ డిమాండ్లు పరిశీలిస్తాం రండి అని పిలిచి, చివాట్లు పెట్టి పంపించింది.
Very interesting.. మావారి లాప్ టాప్ లో ఈ సైట్ ని అర్జెంట్ గా బ్లాక్ చేయాలి :)))
Post a Comment