Tuesday, August 19, 2008

దేశభక్తి అంటే?!?

15 ఆగష్టు, 26 జనవరి రాగానే "సహజంగా" మనందరిలో దేశభక్తి పొంగిపొర్లి ప్రవహిస్తుంది. ఎక్కడ దేశభక్తి సినిమాపాటలో, ప్రైవేటు ఆల్బమ్సో లేక ప్రభుత్వం చేత ఆమోదింపబడిన జాతీయగేయాల పట్టికలోంచో ఏపాట ఎక్కడ వినిపించినా శరీరంలోని "కండిషన్డ్ హార్మోన్లు" అకస్మాత్తుగా విడుదలై, ఆవేశాన్ని పుట్టించేసి, కళ్ళు చెమర్చింపజేసి ఉద్వేగానికి గురిచేస్తాయి. మన ఛాతీ మామూలు రోజులకంటే ఒక ఇంచి పెరిగిమరీ గర్వాన్ని కలిగిస్తుంది. మువ్వన్నెల జెండా తగిలించుకుని పొద్దున్నే జెండా వందనానికై స్కూలుకెళ్ళే చిన్నపిల్లల్ని రోడ్డుపక్కనున్న కాకాహోటల్లో కాఫీతాగుతూనో, బాల్కనీలో నిల్చునో చూసి మనం "ఆహా ఎంత గొప్ప దేశం మనది" అని సంతోషించి, చక్కగా హాలిడే జరుపుకోవడానికి సిద్ధమైపోతాం. కాకపోతే ఎవరైనా, "దేశభక్తి అంటే ఏమిటి?" అని ప్రశ్నిస్తే మాత్రం ఆ ప్రశ్నించినవాడొక దేశద్రోహిగానో లేక అధమం unpatriotic గానో అనిపిస్తాడు.
నావరకూ దేశభక్తి అంటే, "కేవలం మనం ఈ దేశంలో పుట్టామన్న ఒకేఒక్క కారణం చేత ఈ దేశాన్ని ప్రేమించడం". చాలా పచ్చిగా అనిపించినా అది కాదనలేని నిజం. By chance నేను పాకిస్తాన్ లో పుట్టుంటే, ఆ దేశాన్ని విజయవంతంగా ప్రేమిస్తూ, భారతదేశాన్ని ద్వేషించకపోతే అది unpatriotic అనుకుంటూ బ్రతికేసేవాడినే కదా! దీనిప్రకారం దేశభక్తి అంటే, ఎవరోనిర్ణయించిన హద్దుల్ని ఆధారంచేసుకుని, అవి physicalగా తెలియకపోయినా, మానసికంగా వాటిని అంగీకరించి, ఆ హద్దుల్ని ఓక దేశంగా దానిలో నివసించే సమూహాన్ని దేశ ప్రజలుగా భావించి, unconditionalగా ప్రేమించడం. చాలా romantic idea. వినడానికీ, అనుభవించడానికీ చాలా బాగుంది, కానీ ఆలోచించడానికి...ఏమో నాకైతే తెలీదు.
కాకపోతే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడప్పుడూ నాకు దేశం మీద unconditional ప్రేమంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా మనదేశం, తన ప్రజలపైనే జరుపుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, కొందరు ‘సందేహంగా’ నా నిబద్ధతను శంకించినప్పుడు ఇలాంటి భావన కలుగుతుంది. దేశాన్ని, లేక దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నింఛడంకూడా unpatrioticగా ఈ మధ్య చాలా మంది భావించెయ్యడాన్ని వారి తెలియనితనం అనుకోవాలో లేక వారికి జరిగిన దేశభక్తి conditioning విధానం వారి patriotismని కాస్తా jingoism గా మార్చేసిందేమో అనిపిస్తుంది. వారి హద్దు "మనదేశం అన్యాయం చేస్తే సరేగానీ, పక్కదేశంవాడు అదే అన్యాయాన్ని చేస్తే మాత్రమే తప్పు" అనిపించేలా ఉంటుంది. బహుశా మన దేశం ఒక అర్థంకాని జిగ్సా పజిల్ లాంటి విభిన్న సంసృతులూ, భాషల నేపధ్యం నుంచీ తయారు చెయ్యబడటం వలన ఈ confusions మనలో ఇంకా ఎక్కువే ఉన్నాయనుకుంటాను.ఏదిఏమైనా దేశభక్తి ఎవరో చెబితేనో, ఏదో చేస్తేనో వచ్చేదైతే కాదు. మహా అయితే ఆవేశం, ఉత్సాహం ఆ క్షణానికి "జై హింద్" అంటే వస్తుందేమోగానీ, క్రియాశీలక దేశభక్తి నిర్థిష్టమైన మానవత్వం నుంచీ వస్తుందనుకుంటాను. అప్పుడు కూడా నాలాంటివాడు పాకిస్తాన్ నూ, అమెరికాను కూడా సమానంగా ప్రేమించేసి అపవాదు మూటగట్టుకోగలడు. అందుకే ఇప్పటికీ దేశభక్తంటే నాకు అర్థం కావటం లేదు...ఏమిటో ఈ విచిత్రం. నామట్టుకూ నాకు అశరీరంగా భావంలో,ఆలోచనలో మాత్రమే ఉండే దేశంకన్నా, నాకుటుంబాన్ని ప్రేమించడం సులువనిపిస్తుంది. నాకు అదే ముఖ్యంకూడా !


****

13 comments:

Rama said...

Mr. Mahesh Kumar I never expected a post like this from you. If you are thinking like this what is the difference in between you and a selfish political leader. By thinking like this only now a days we seeing heredity in politics directly and in indirectly in all areas.
Do you think all the people in India are thinking just Pakistan as our enemy country for the sake of just it is as neighbour country or just it is as another country. In that case why we are not treating all the countries in the world like US, Germany, Japan, Canada etc as that of our enemies.

Anonymous said...

కన్న తల్లి, కన్న భూమి రెండూ ఒకటే. వారి ఋణం సామాన్యంగా తీర్చుకునేదా?

cbrao said...

మనం భారతీయులం. ఈ ప్రపంచ పౌరులం. భాషలు, సరిహద్దులు, మతాలు విడదీయలేని విశ్వమానవులవుదాము. ప్రేమను పంచుదాము. ఆకలిని, భయాన్ని తరిమివేద్దాము. దేశ భక్తి కంటే ప్రపంచభక్తి ఇంకా ఉన్నతమైనదని చాటి చెప్పుదాము. యుద్ధాలు చరిత్రలో మాత్రమే కనిపించే, శాంతిప్రపంచాన్ని నిర్మిద్దాం. ప్రపంచ పౌరులంతా ఒకటే. శాంతి, సౌభాగ్యం వెల్లి విరియటానికి నిరంతర కృషి చేద్దాము.

కత్తి మహేష్ కుమార్ said...

@రమ గారూ:నా ప్రయత్నం emtionsని పక్కనపెట్టి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మాత్రమే. దేశభక్తి అనేది చిన్నప్పటినుండీ మనకు "నేర్పిన" (conditioned) విధానాల నేపధ్యంలోంచీ పుట్టిన భావన.దానికి ఉన్న గౌరవం ఎలాగూ ఉంది,you cannot seperate it that easily.కాకపోతే,to have a false sense of nationalism/patriotism for the sake of ritualism is not something that is very acceptable to me.

కాస్త emotionని పక్కనపెడితే, Nation is a notion and patriotism a sense of misplaced emotion.అందుకే మనం ఈ హద్దుల్ని దాటుకుని " క్రియాశీలక దేశభక్తి నిర్థిష్టమైన మానవత్వం నుంచీ వస్తుందనుకుంటాను" అంటూ ఆ విశ్వమానవత్వం దిశగా ప్రయాణించాలేమో! అని నేననుకుంటున్నాను. అయినా నాకు ఈ విషయం పెద్దగా ఇప్పటికీ అర్థమవలేదు లెండి.

ఇక రాజకీయనాయకుల గురించి అంతతేలిగ్గా అనుకోవడానికి వీలులేదు. they are more patriotic than most of us middle class who are only busy living and don't care about anything, till it hits our homes.

మనం అమెరికానో, లేక మరే ఇతరదేశన్నైనా అసహ్యించుకోకపోవడానికి కారణం అక్కడ మన బ్రతుకుతెరువులు కనపడటం. పాకిస్తాన్ మన natural శత్రువని ఎలాగూ మనం declare చేసేసాం కదా, మరి సమస్యెందుకు?

@నవీన్ గారూ: మీ నమ్మకం మీద నాకు గౌరవం ఖచ్చితంగా ఉంది. కాకపోతే దేశాన్ని గురించి ఆలోచించేటప్పుడు రాష్ట్రం యొక్క emotionని ఎలా పక్కనపెడతామో ప్రపంచాన్ని గురించి ఆలోచించేటప్పుడు దేశభక్తినీ పక్కన పెట్టగలగాలి.నా బాధల్లా unconditional ప్రేమ సాధ్యమా? అని. లేదూ దేశానికన్నా గొప్పదైన విశ్వప్రేమని పెంపొందించుకోగలమా అని మాత్రమే. నాకు చాలా సందేహాలున్నాయి. వాటినే ఇక్కడ నా ఆలోచనతోసహా రాసాను.

@రావుగారూ: మీరు నా మూల ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నట్లున్నారు. ధన్యవాదాలు.

Anonymous said...

>>పాకిస్తాన్ మన natural శత్రువని ఎలాగూ మనం declare చేసేసాం కదా,

మహేశ్ గారు,

నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. "పాకిస్తాన్ మన natural శత్రువని" ఎవరు, ఎప్పుడు declare చేసేసారో దయచేసి చెప్తారా? పాకిస్తాన్ మన శత్రువైతే ఎందుకు మన ప్రభుత్వాలు ఎప్పుడూ పాకిస్తాన్ తో చర్చలు జరపడం, వాణిజ్య సంబంధాలు నెరపడం, Most favoured nation హోదా ఇవ్వడం/కోరడం లాంటివి చేస్తున్నాయి?

అబ్రకదబ్ర said...

ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం. 'నేను గానీ పాకిస్తానులో గానీ పుట్టుంటే ఇండియాని ద్వేషించుండేవాడినే కదా' అన్న ఆలోచన నాకూ చాన్నాళ్ల క్రితమే వచ్చింది. అప్పటినుండీ పొరలు తొలగిపోయాయి. పాకిస్తానీల్లో మిత్రులు కనపడసాగారు. దేశాలని ప్రేమించటం, ద్వేషించటం మానేసి ఆయా దేశాల విధానాలని సమర్ధించటం, విమర్శించటం నా పద్ధతయింది. అది మన దేశానికీ వర్తించటం మొదలయింది. కాశ్మీరాన పాకిస్తాన్ రాజేస్తున్న చిచ్చు గురించి ఆవేశపడ్డ మిత్రులతో సింధ్ లో మన 'రా' (RAW) పెడుతున్న పుల్లల గురించీ, ఎల్టీటీయీకి తమిళనాట మన ప్రభుత్వాలు నడిపిన శిక్షణా క్యాంపుల గురించీ వివరించటం మొదలు పెట్టాను. దేశాల మధ్య జరిగే ఈ ఆటలో ఎవరూ పరిశుద్ధులు కారు, ఎవరూ పాపులు కారు. దేశభక్తనేది కేవలం కొన్ని నిజాలని కప్పిపెట్టి ప్రజల్ని ఏమార్చటానికి ప్రతి ప్రభుత్వమూ వాడుకునే అందమైన ముసుగు మాత్రమే. ఈ మధ్య కొన్నేళ్లుగా ఈ ముసుగు సినిమా వాళ్లకి కాసులు రాల్చిపెట్టే అద్భుతమైన మసాలా దినుసుగానూ ఉపయోగపడుతుంది.

ప్రసాద్ said...

దేశభక్తి కూడా ఒక విశాలమైన సంకుచితత్వం మాత్రమే! పైగా ఎక్కువ మంది దేశభక్తులకు భరతమాతకు (భావనకు) మొక్కడమే దేశభక్తి. అవినీతితో పోరాడ్డటం కానీ, అజ్ఞానాన్ని అడ్డుకోవడం కానీ, కనీసం ఆకలితో వున్న వాడికి అన్నం పెట్తడం కూడా దేశభక్తి కాదు.

విశ్వమానవ సౌభ్రాతృత్వమే అసలైన దేశభక్తి కాదు కాదు సర్వ ప్రాణికోటి సౌభ్రాతృత్వమే సరైన దేశభక్తి.

--ప్రసాద్
http://blog.charasala.com

కత్తి మహేష్ కుమార్ said...

@సాహిత్యం గారూ: మీరెప్పుడూ క్రితం ప్రభుత్వాలు చూఫిన పాకిస్తాన్ బూచిని,ప్రస్తుతం హిందూ మతతత్వవాదుల ఇస్లాం = పాకిస్తాన్ attitudeని చూసినట్లు లేరు.ఆ ఆలోఛనలన్నీ పాకిస్తాన్ ను మన శతృవనే భ్రమింఫజేస్తున్నాయి.

విధానాలో స్నేహానికి ప్రయత్నింఛినా,రాజకీయాలకోసం ఇప్పటికీ పాకిస్తాన్ భయాన్నివాడుతున్న దేశం మనది.

@అబ్రకదబ్ర గారూ:propaganda పాలైన చాలా మంది ప్రభుత్వం చెప్పిందో లేక రాజకీయ పార్టీలు బోధించిందో నిజమనుకుని, అదే దేశభక్తిగా అపోహపడి ఆవేశపడటమేగానీ, దేశభక్తి దేశం తన అవసరాలకోసం సృష్టించుకున్న భావజాలంగా గుర్తించలేకపోతున్నారు. విడమర్చి చెప్పడానికి ప్రయత్నిస్తే కన్వీనియంట్ గా "unpatriotic" అని ముద్రవెయ్యడమే వారికి తెలిసింది.

@ప్రసాద్ గారూ: మీరు చెప్పింది చాలా సరైంది. ఆ భావన రానిదే దేశభక్తి పేరుతో మనకు మిగిలేది jingoism తప్ప మరోటికాదు.

saisahithi said...

ప్రశ్నలు వేసి వేసి చివర్లో అంతర్లీనంగా జవాబు కూడామీరే ఇచ్చేసారు..ఇక్కడ మీరు ఆశించింది....? అయినా

By chance...
మీరన్నట్లు దేశభక్తి ఒక induced emotion అయితే..
By chance మీరు పాకిస్తాన్లో పుట్టుంటే..
అంటే ఆ దేశమ్లో పుట్టినవారందరూ....
భారతదేశాన్ని ద్వేషిస్తారు. If they do not, they will be treated unpatriotic (or rather conspirator) How far this is apt. భారత దేశాన్ని ప్రేమించే ఆ దేశ పౌరులు ఎంతోమంది ఉన్నారు.ఆ దేశమ్లో పుట్టినంత మాత్రాన పొరుగుదేశాల్ని ద్వేషించడమేనా..Thank god వారి భావ స్వాతంత్ర్యాని కి ఇన్నాళ్ళకి తెరలేచింది. (తాజా పరిణామాల్ని చూస్తే..వారిలో మెజారిటి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటు న్నారు. ...) ఇది పక్కన పెడదాం...
2. కేవలం పుట్టినంత మాత్రాన...
దేశాన్ని ప్రేమించడానికి ఇదొక్క టే కారణం కాదనిపిస్తూంది. మనం పుట్టినప్పటినుండి మన జీవితాల్లో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మన విద్య వైద్య రక్షణ ఇలా అనేక సామోజిక అవసరాలలో దేశం(ప్రభుత్వం)తన పాత్రని (సమర్ధ వంతగాకాకపోయినా)పోషిస్తూనేఉందనేది నిజం(మనం పన్నులు కడుతున్నాంకదా అంటే అది వేరే విషయం). ఈ రకంగా లెక్కలు వేసుకుంటే మనం దేశానికి చేసే సేవకంటే మనం పొందేదే ఎక్కువనుకుంటాను.
నా దృష్టిలో దేశం పట్ల చూపించే ' gratitude' నే దేశభక్తి అన వచ్చనిపిస్తూంది. Now does it matter whether 'it' is conditional or unconditional ?ఈ గ్రాటిట్యూడ్ మోతాదు మీరితే it leads to jingoism. ఈ emotional extremes లో supporting one's own country is far beyond question..
3. దేశభక్తి ..మానవత్వం ..ఇందులో అర్ధం కానిదేది లేదు.
బైబిల్ లో చెప్పినట్లు ...Love thy neighbour as thy self.మనం ఒక మంచి పని చేస్తూన్నపుడు వచ్చే వ్యతిరేకత సహజం . ఇదేమీ విచిత్రం కాదు.

Aruna said...

అవునండి. మన సైనికులకు ఈ మాత్రం తెలివి లేదు. గడ్డకట్టుకుపోయే చలిలో నానా కష్టాలు పడుతున్నారు. పోనీలెండి ఇన్నాళ్ళకి మేధావి వర్గం నిర్ణయించింది గా, దేశభక్తి అంటే ఏమిటో. వాళ్ళనందరిని వెనక్కి పిలిపిద్దాం. మరి సమానత్వం అన్నిటిలో కావాలి కదండి. హిందూ జాతి ని రక్షించడానికి రాజులు, రాజపూత్ లు, సిక్కు లు ఎందుకు కంకణం కట్టుకోవడం.. ఓహ్హో అర్ధం అయ్యింది. అప్పటి వాళ్ళు బుధ్ధి జీవులు కారు కదా..:) మత చాందసవాదులు కదా. శివాజి, సమర్ధ రామదసు మత చాందసవాదులు. వల్లభాయి పటేల్ దెశభక్తి అంటే ఏమిటో తెలియని ఆయన. అరరె బుధ్ధి జీవుల పుట్టుక ఇంకొన్ని దశాబ్దాల ముందు జరిగి వుంటే మన వాళ్ళు బ్రిటిష్ పాలనలోని మంచితనాన్ని గ్రహించి వారికింద స్వర్గ సుఖాలు అనుభవించేవారేమో.

Sirji...Really you rock. :)

Aruna said...
This comment has been removed by the author.
Aruna said...
This comment has been removed by the author.
Anonymous said...

నేను మా అమ్మకు పుట్టకుండా మరో మహిళకు పుట్టి ఉంటే ఆమెను ప్రేమిస్తూ ఆమె మా(ఇప్పటి) అమ్మని ద్వేషిస్తూ ఉండుంటే నేనూ ద్వేషిస్తూ ఉండే వాణ్ణి
ఐతే ఏంటంటా ఆమె కోసం మా అమ్మని వదిలెయ్యాలా
అమ్మ అందరికీ అమ్మ అయ్యినంత మాత్రాన అందరినీ అమ్మంత ప్రేమించలేం, గౌరవిస్తే చాలు. అందుకు అమ్మని ప్రేమించడం మానక్కరలేదు.
(అమ్మ ఉదాహరణగా చెప్తే తేలికగా చెప్పగలం గనుక)