Saturday, August 9, 2008

మందు ఫిలాసఫీ

అవి కాలేజిలో జీవిత ప్రయోగాలు చేసే రోజులు. మైసూరులో జరిగిన నా కాలేజి జీవితం, అనుభవాల పిటారా అని చెప్పుకోవచ్చు. స్నేహం, ప్రేమ, అభిమానం, ఆదరణ లాంటి అనుభవాలతో పాటూ, తినడం, తాగడంలో కూడా హద్దులు నేర్చుకున్న అపురూపమైన జీవితం అనుభవం అది. ఆ అనుభవసారాల్ని జీవన వేదాలుగా భావించి, బ్రతుకుని మలుచుకున్న నాకూ, నాతోటి చాలా మంది మిత్రులకు ఆ క్షణాలు తలుచుకోవడం, వేయి పుణ్యతీర్థాల దర్శనమంత పవిత్రం. ఆ జ్ఞాపకాల హరివిల్లులోంచీ ఒక అల్లరి అనుభవాన్నీ అందులో నేను నేర్చుకున్న సారాన్నీ ఇక్కడ టపాబద్ధం చెయ్యడానికి ప్రయత్నిస్తాను.



కాలేజీలో చేరిన రెండో సంవత్సరం. అప్పటికీ చుట్టుపక్కలున్న హోటళ్ళూ, బార్లూ కరతలామలకమై, కర్ణాటక చప్పిడి కూడుకు నిరసనగా, కారంకూడు పెట్టే ఆంధ్రా హోటళ్ళూ, కనీసం చిల్లీ చికెనూ, మటల్ మసాలాలు అందించే రెస్టారెంట్లకు వందనగీతాలు పాడేసాం. అప్పటికే ‘బీరుప్రాసనైన’ మందు ప్రయోగాన్ని, మరో మెట్టుకు తీసుకెళ్ళి బీరునుంచీ అసలుసిసలైన బారు బాపతు విస్కీ, బ్రాందీ, రమ్ముల రుచులుగ్రోలే సువర్ణసమయానికి శ్రీకారం చుట్టేసాం. నేనూ, నాతోపాటూ కొందరు మిత్రులకు, నెల పుట్టగానే వచ్చే మనియార్డరు చేతికందిన రోజు, ఈ అందమైన అనుభవాల ప్రయోగాల రోజుగా మారిపోయేది.



అప్పటికే, కొందరు మిత్రులు తమ ఆనందాల అనుభవాల్ని భరించలేక, వాంతులూ, హేంగోవర్ల బాధలుపడిలేచినా, మళ్ళీ ఆ అద్వితీయ ఆనందం కోసం సగర్వంగా ప్రతినెలా తయారయ్యేవాళ్ళు. ఆ నెల, నా మనియార్డర్ ఒక వారం ముందేవచ్చేసింది. ఇంకేం, నామిత్రులు ఊరకుంటారా! ఉదయం 11 గంటలకు డబ్బుచేతికొస్తే, సాయంత్రంవరకూ ఆగలేక, మధ్యాహ్నం క్లాసుందనైనా పట్టించుకోక, లంచ్ కే రెస్టారెంటుకు నన్నెత్తుకెళ్ళిపోయారు. ఎంతైనా బిల్లుకట్టే భాధ్యత ఆ రోజు నాదేకదా!



తీరా అక్కడికెళ్ళాక, "తినడంతోపాటూ, తాగాల్సిందే" అనే తీర్మానం కూడా చేసేసారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని బీరు ప్రమాణకంగా పాడేసుకుని, బిరియానీతో పాటూ, బీరుపానం కానించి, కాలేజీకొచ్చిపడ్డాం. అప్పుడు గుర్తొచ్చింది, మద్యాహ్నం లంచ్ తరువాత 2 గంటలకు క్లాసు మా ప్రొఫెసర్ రఘునాథ్ దని. అదీ అప్పుడే ఇంగ్లీషు సాహిత్యంలోని రొమాంటిక్ పొయటీ తాటతీస్తున్న మా రఘునాధ్ క్లాసు ఎలా మిస్ చేసేదీ అని తర్జనభర్జనలు పడి, మందు ముఖాలతోనే క్లాసు వైపు నడిచాం.



ఎలాగూ తాగింతర్వాత తిన్నాం, ఆ తరువాత మౌత్ ఫెష్నర్లూ గట్రా నోట్లోనానేసాం కాబట్టి, మన గౌరవాలకొచ్చిన ఢోకాలేదని అల్రెడీ మొదలైపోయిన క్లాసులోకి చల్లగా "మే ఐ కమిన్" అని చెప్పి , ఎంటరైపోయాం. అసలే గండరుగండడైన మా ఫ్రోఫెసర్ మా వాలకాలు, నడకలూ, గుభాళింపులూ చూసి, విషయం పట్టేసాడు. క్లాసులో మాకు క్లాసు పీకలేదుగానీ, మర్యాదగా క్లాసు తర్వాత తన రూములో కలవమన్నాడు.



"నిండా మునిగినోడికి ఇంకా చలేమిటి" అని మనసులో అనుకుని నలుగురం క్లాసుతరువాత, తన క్లాసుకోసం గది గుమ్మం దగ్గర నిలబడి తలుపు సున్నితంగా బాదేసాము. "కమిన్" అని రఘునాధ్ గొంతు ఖంగుమనే సరికీ అప్పటికే గుండేల్లోఉన్న గుబులుకాస్తా, ఎగిరిపోయి ఏకంగా గుండే గొంతులోకొచ్చి కూర్చుంది. ఎదురుగా వరుసతీరి నిల్చున్న మమ్మల్ని ఆసాంతం చూసి, "I have no issues with you guys boozing. But, coming to class is not appreciated" అని ఒక ముక్కలో తన నిరసన విజయవంతంగా తెలిపేసాడు. మేము "సారీ సర్, మీ క్లాసు అస్సలు మిస్ కాకూడదని ఈ సాహసం చేసాం" అని కొంచెం, వెన్నా-జామూ కలిపిన సున్నితత్వాన్ని ఒలికించి, బాధగా ముఖాలుపెట్టి నిలబడ్డాం. తనేమనుకున్నాడో ఏమో, " It's OK. Why don't you guys come down to my place this evening...at 7 O'clock " అని చెప్పి మాకు బయటకు దారి చూపించేసాడు. "ప్రస్తుతానికి లెక్చర్ తప్పిందనుకుంటే, మళ్ళీ ఇంటికి రమ్మంటాడేమిటా" అని ఒక మూలపీకుతున్నా, "ఏమైతేనేం చూద్దాం" అని సాయంత్రం వరకూ ఎదురు చూసాం.



7 గంటలకు ఠంఛనుగా మా క్యాంపస్ పక్కనే ఉన్న రఘునాధ్ ఇంట్లో తేలాం. మాకు ఎదురొచ్చిమరీ, రఘునాధ్ అథిదులకిమల్లే స్వాగతించేసరికీ కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా, "తన రూటే సపరేటు" కాబట్టి కొంచెం తమాయించుకున్నాం. మమ్మల్ని ఆదరంగా సోఫాలో కూర్చోబెట్టి, తన పెళ్ళానికి స్నాక్స్ తయారు చెయ్యమని పురమాయించి, తన దగ్గరున్న స్కాచ్ విస్కీ బాటిలొకటి బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు. అంతే మా పై ప్రాణాలు పైనే పోయాయ్! ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా మా ముందున్న గ్లాసుల్లో పెగ్గులుపోసి, "సోడా నా వాటరా?" అని అడిగేసరికీ మేమీ లోకానికొచ్చిపడి, నానా ఇబ్బందీ పడ్డాం. ఒకడు వద్దంటే, మరొకడు గ్లాసువైపు చూసి లొట్టలేస్తే, మరొకరు బిత్తరచూపులు చూసాం. నాకైతే మైండ్ బ్లాంకై ఏమీతెలీలేదు.



మా ఖంగారు చూసి మందహాసంతో, మా జేమ్స్ బాండ్ (అదే మా ప్రొఫెసర్ నాధ్...రఘునాథ్) "Don't worry boys this is the time to enjoy a drink" అని మాకు నచ్చజెప్పి, తన దగ్గరున్న అతివిలువైన స్కాచ్ వడ్డించాడు. ఒక డ్రింక్ తరువాత కొంచెం బెట్టు సడలిన మేము, "sorry for what happend today sir" అని చల్లగామళ్ళీ మన్నింపు దండకం మొదలెట్టేసరికీ తను నవ్వుతూ, "I can understand your excitement. That's why I have invited you guys to suggest a right time to do the right thing" అని మాకళ్ళు తెరిపించాడు. ఇంతలో మా హరీష్ ఊరికే ఉండక, "మందు మంచిది కాదని అందరూ అంటారుకదా, మీకా వాల్యూడ్జిమెంట్ లేదా?" అని అడిగేసాడు. "Any thing with limits is always good. There is no point in attaching value to a lifeless thing like drink. The 'value' actually comes from the person who consumes it" అని సత్యం పలికాడు.



మేమింకా కాస్త సందేహంగా చూస్తుంటే, తనే కొనసాగించి, "we must always know our limits. Take the drink for an example, if you sit with friends in a beutiful evening with a glass of drink, its great fun. You enjoy it till a point of time, but after a point if you still continue, you reach a stage where you don't know what you are doing. Then whats the point in boozing?" అని మాకు జ్ఞానోదయం కలిగించాడు. నిజమే, మనమేంచేస్తున్నామో మనకే తెలీని స్థితివస్తే, ఆ తాగుడికి అర్థం లేదుకదా? ముఖ్యంగా సొషియల్ డ్రింకింగ్ లో, తాగేది మిత్రులతో కలిసినప్పుడో, లేక కంపెనీ పార్టీల్లోనో అలాంటప్పుడు మనం మన లిమిట్స్ దాటితే అటు వ్యక్తిగా మనకు విలువా ఉండదు, మన ఎంజాయ్ మెంట్ కు అర్థమూ ఉండదు.



ఈ సంఘటన తరువాత మా నలుగురు మిత్రులూ ఎప్పుడూ లిమిట్స్ దాటి తాగెరుగం. ఇప్పటికీ మా జీవితాల్లో అది ఒక ముఖ్యమైన సూత్రంగా మిగిలిపోయింది. "Booz till you enjoy boozing. After a point of time you don't know what you are doing. Then what's the point is boozing?"



****

30 comments:

Purnima said...

బాగుంది. Everything and anything is good, as long as it is in the limits అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. మీ టపా దానికి రైట్ రైట్ అని చెప్తుంది.

The 'value' actually comes from the person who consumes it - True!!

cbrao said...

తెలుగు బ్లాగరులలో తాగే వారున్నారు. కాని తాగుతామని ఒప్పుకునేవారు నాకు తెలిసి ముగ్గురే. ఆ ముగ్గురూ 1) మహేష్ కుమార్ 2) cbrao 3) ఇన్నయ్య. నేను తాగుతూ, బ్లాగుతానంటే నిరసనలు వెల్లువెత్తాయి గతంలో. ఆ విమర్శలు మంచి రచనలెలా చేయాలి? అనే టపా కొచ్చిన కామెంట్లలో చూడవచ్చు.

బాధ్యతాయుతంగా, రసాస్వాదన చేస్తూ తాగటంలో ఆనందముందన్న సంగతి నేను, మా మిత్రులు ధృఢంగా విశ్వసిస్తాము. బ్లాగటం కోసం ఏదైనా చెయ్యవచ్చు; కాని బ్లాగటం , తాగటం మానెయ్యాల్సిన అవసరం లేదు. ఈ రెంటినీ సమన్వయపరచటానికి, కొంత పరిణితి కావాలి. ఈ పరిణితికి వయస్సుకు సంబంధం లేదు. ఈ మాటలు తాగటాన్ని ప్రోత్సహించటానికి కాదు. Drink లేక పోయినా జీవితాన్ని ఆనందించవచ్చు, చక్కటి రచనలు చెయ్యవచ్చు. ఇది వాస్తవం.

Prashanth.M said...

ఇండియా లో బీరు నుండి నేరు గా విస్కి, రమ్ములు కి వెళ్ళేందుకు కారణం మధ్యలో యేది లెకపోవడం. నేను సూచించేది Red Wine/White Wine. వీటిని వర్ణించాలంటే కష్టమే!..కాని బీరు కంటే స్తైలిష్ గా, తక్కువ మోతాదులో ఉండడం, విస్కికంటే తక్కువ alcohol ఉండి సాఫీ గా ఎంజాయి చెయ్యొచ్చు ! నాకు తెలిసినంతవరకు మహరష్త్ర లో వినె తయారౌతుంది. హైదరబాదు లో కూద ఒకప్పుడు Golkonda wine చాలా famous ayyindi.

సుజాత వేల్పూరి said...

సిగరెట్లు, మందు ఇలాంటివి ఎవరికి వారు ఆలోచించుకోవలసిన అలవాట్లు, ఇష్టాలు! "మీరు సిగరెట్లు తాక్కండి, మందు తాక్కండి" అని మరొకళ్ళు చెప్పడం నాకు నచ్చదు. అవి రెండూ పుచ్చుకునే వారి వయసుకి అవి ఏ లెవెల్లో తీసుకుంటే ప్రమాదకరం కాదో తెలుసనుకుంటా నేను! మా ఆయన స్నేహితులతో(కొలీగ్స్ కాదు) కలిసినపుడు సంతోషం పట్టలేక బీరు తీసుకుంటారు.నాకు ఓకే! ఆఫీసు పార్టీల్లో వైన్ తీసుకుంటారు! అదీ ఓకే! ఎందుకంటే ఒక్క బీరు మించి తీస్కోరు!అంతమంది స్నేహితుల సంతోషాన్ని నా మొహం మాడ్చుకోవడంతో చెడగొట్టడం నాకిష్టం ఉండదు.

ఒప్పుకుంటే అందరి దృష్టిలొ చులకన అయిపోతామని భయం కాబోలు!

Kranthi M said...

నేను కూడా తాగాన౦డి ఒకసారి మాత్రమే.అది కూడా నా ఇ౦జనీరి౦గ్ లోనే.అది కూడా మా కోతి బ్యాచ్ తో ప౦చుకునే ఆన౦ద౦ కోసమే. ఆ తరువాత ఎ౦దుకో మళ్ళీ తాగాలనిపి౦చలేదు.
కానీ ఏదైనా లిమిట్స్ లో ఉ౦డలని మీ మాస్టారు చెప్పి౦ది మాత్ర౦ చాలా నిజ౦.

Bolloju Baba said...

నేను యానంలో పుట్టి పెరగటం వల్ల (ఎందుకంటే అక్కడి సొసైటీ ఈ విషయంలో కొంచెం థిక్ స్కిన్డ్ అని నా అభిప్రాయం) మిత్రబృందంతో కలసి "ఎప్పుడూ " స్టేజ్ లో ఉండే వాళ్లం.
తరువాత తరువాత మందు విషయంలో సొసైటీ కొంత స్టిగ్మా చూపిస్తుందని తెలుసుకొన్నతరువాత " అప్పుడప్పుడూ " స్టేజ్ కి వెళ్లాం..
ఇక పెళ్లయి, పిల్లలు పుట్టి భాధ్యతలు పెరిగి, మరీ ముఖ్యం గా ప్రశాంతం గా ఉండటం కోసం జీవితాన్ని తీసికెళ్లి బిళ్ళకుడుములా మా ఆవిడ చేతిలో పెట్టేసిన తరువాత ప్రస్తుతం " ఎప్పుడో " స్టేజ్ లో ఉన్నాను.
i feel this kind of change happens to every one.

p.s. oh almighty let this comment be not visible to my wife
సరదాగా

బొల్లోజు బాబా

కొత్త పాళీ said...

Amen .. I'll drink to that! :)

@Prashanth - Golconda was marketed as a wine but it was actually port .. totally different beast. There is a whole science and art to appreciating wine.

@బాబా గారు .. మీ స్టేజీలు బాగున్నై. :)

Naga said...
This comment has been removed by the author.
Naga said...

బాబా గారి స్టేజీలు బాగున్నాయి. తాగని వాడు అనానిమస్సయి పుడతాడు :)

రాధిక said...

తన "పెళ్ళానికి" స్నాక్స్ తయారు ....what is this sir?

Anonymous said...

థాంక్స్ రాధిక గారూ..నేనూ గమనించా అది...సముద్రపు ఒడ్డున, సన్నని ఇసకలో, సాయంత్రం పూట, సరదాగా నడచుకుంటూ వెళ్తుంటే, ఒక్కసారి కసుక్కున కాలిలో ముళ్ళు దిగిన ఫీలింగ్!.

సరిగ్గా చదివానా, లేదా అని మళ్ళీ ఒకసారి చదివి ముందుకు సాగిపోయా..

మళ్ళీ మాట్లాడితే, 'పెళ్ళాం' రైట్ వర్డే..దాన్ని చదివే వాళ్ళే దానికి ఒక వాల్యూ ఆపాదిస్తారు..అంటూ మళ్ళీ దండెత్తుతారేమో జనాలు అని ఊరకుండిపోయా.కాని మీరు red flag raise చేశాక ఇక ఉండలేకపోయా.

ఇంకొకరెవరో, "నేను, నాన్న, ఆండ్రూ అగాస్సీ, పీట్ సంప్రాస్, విలియంస్ సిస్టర్స్" అంటూ ఒక బ్లాగు రాస్తూ...అందులో.."నెను williams sisters match" చూస్తూంటే, అప్పుడే వచ్హిన మా అమ్మ..'ఎవరా నల్ల ముండ అలా ఎగురుతుంది" అని అడిగింది" అని రాసాడా అబ్బాయి..

అప్పుడు కూడా అంతే...same feeling..No one pointed it out..leaving me completely surprised..

Anyway..nice blog Mahesh...

saisahithi said...

Nice post,
బాబాగారి వివరణ బాగుంది, వారి పరివర్తనని వారి భార్య చూస్తే
సంతోషిస్తుందేమో.

Unknown said...

నాకయితే కాలేజీ రోజుల్లో ఇలా తాగేవాళ్ళంటే భలే చిరాకు.

సొంత డబ్బులతో కాక అమ్మా నాన్నల డబ్బులతో చదువుకునే వారికి ఇలాంటి చెత్త అలవాట్ల మీద ఒక పైసా అయినా ఎలా ఖర్చు పెట్టబుద్ధి అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.
మళ్ళీ దానికి ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అనే సమర్థన ఒకటి.

ఇక్కడ డబ్బుండటం అనేది విషయం కాదు.

ఎక్కడ ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కడ ఇంట్లో ఒక రూపాయి ఎక్కువ అడగాల్సి వస్తుందో అని అనిపించేది నాకయితే.

సొంత డబ్బయినప్పుడు తగలేసినా ఎవరిష్టం వాళ్ళది !
ఇది నా అభిప్రాయం. మీ మీదో ఇంకెవరి మీదో రుద్దాలని కాదు.

Anonymous said...

"తాగని వాడు అనానిమస్సయి పుడతాడు" -మంచి శాపం! :)

కానీ మహేష్, మీ అభిప్రాయం ఒకదాంతో నేనేకీభవించను.. తూగేదాకా, ఇంగ్లీషులో వాగేదాకా తాక్కపోతే తాగేదెందుకంట? :) తూగినా, వాగినా.. మీరన్నట్టు, మళ్ళీ నెలనాటి ఆ ఆనందం అద్వితీయమే!

అయితే, బహుశా నాన్న డబ్బులో, ఆనాటి పైలాపచ్చీసు తత్వమో, బాధ్యతారాహిత్యమో, ఆ స్నేహాలో మరోటోగానీ.. అప్పటి ఆ అనందం ఇప్పుడు లేదు. (ప్రవీణ్, మీ అభిప్రాయంపై గౌరవమే నాకు!)

రవి వైజాసత్య said...

కాలేజీ రోజుల్లో చాలా సార్లు తాగి మతిసుతిలేకుండా నిద్రపోవటానికే తాగేవాళ్ళం..అందుకని నలుగురు తాగాలంటే ఖరీదయ్యే బీర్లు..వైనుల జోలికి వెళ్ళకుండా నీటుగా రమ్మో, విస్కీనో లాగించేవాళ్లం..కాస్త డబ్బులుంటే అప్పుడప్పుడు బీర్లు. అప్పుడప్పుడు సరదాగా వైను తాగి ఆస్వాదించాలనుకున్నా మిత్రబృందమెక్కువై కుదిరేది కాదు..
సో నేను ప్రవీణంత మంచి బాలున్ని కాదన్నమాట ;-)

ప్రతాప్ said...

నేను ప్రవీణ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కాకపోతే బాధ్యత తెలియని వయస్సు కదా అందుకని అవేవి గుర్తు రావేమో, గుర్తుండవేమో? సురాపానం అంటూ, ఇవి దేవతలు మాత్రమే తాగగలరు రా, నీలాంటివాళ్ళు తాగలేరు, తాకలేరు అంటూ నా మీద మావాళ్ళ దండయాత్రొకటి. మా బాచ్ ఎప్పుడు పార్టీలో కుర్చోవాలన్నా నేను లేకుండా మాత్రం కుర్చొనే వారు కాదు. అబ్బ నేనంటే వీళ్ళకెంత ప్రేమ అనుకొనేవాడిని మొదట్లో, తర్వాత చెప్పారు, అందరు తాగి పడిపోతూ ఉంటే మమ్మల్నెవరు ఇంట్లో డ్రాప్ చేస్తారురా? అదీ కాక ప్రతాప్ గాడితో ఉన్నామంటే మా పేరెంట్స్ ఏమీ అనరు అని నా నోరు కుట్టేసేవారు, ఎంతైనా స్నే"హితున్ని" కదా భరించక తప్పేది కాదు.

Srinivas said...

తాగుడు సంభాషణకి లూబ్రికెంట్‌లా పనిచేస్తుందనుకుంటా!

పెళ్ళాం అచ్చ తెలుగు మాట, ముచ్చటైన మాట. భాష సంస్కృతీకరించబడే క్రమంలో ఆ మాటకు ఈ ఖర్మ పట్టింది. మించి పోయిందేం లేదు, వాడుతూ ఉంటే ఆ మాటకూ నాగరికుల వొప్పుదల తిరిగి వస్తుంది.

cbrao said...

నేను పైన ఇచ్చిన ముగ్గురి లిస్ట్ సవరించాలేమో, ఈ కామెంట్లు చదివాక. ఇంకెవరన్నా confess అవుతారా? చివాస్ రీగల్, అమెరికాలో ఎక్కువమంది తెలుగు వాళ్ల ఇళ్లలో, అతిధులకు ఇచ్చే డ్రింక్. ఇది కాక ఇంకేదన్నా అక్కడ తెలుగు వారి మనసు దోచుకుంటే, అలాంటి వాటిలో ఒకటి జాక్ డేనియల్, రెండోది టెకీలా. ఇవి మన భారత దేశంలో ఐదు నక్షత్రాల హోటళ్లలో లభ్యం.

Unknown said...

ఇప్పటివరకు ఎవరూ ఈ పోస్ట్ ని ఖండించలేదు కాబట్టి ఆ పనేదో నేనే చేస్తున్నాను. విషం తీస్కోవడం కల్చరా? మద్యపానాన్ని సమర్ధించడమే గాకుండ, అదేదో సర్వ సాధారణ విషయం లాగా కామెంటిన వాల్లు కూడా భావించడం బాలేదు. మద్యపు షాపుల లైసెన్సులతో ఇలాంటి సంస్క్రుతి ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని నిందించాల? లేక మందు కొట్టడాన్ని చాలా common గా తీస్కుంటున్న నయా educated society ని చూసి బాధపడాలా? ఎవరి ఇష్టం వాళ్ళది అనుకుని నేను కూడా ఒక సాధారణ మహిళ లాగా నోర్మూసుకు కూర్చోవాలా? బాధ్యత గా రచనలు చెయ్యాల్సిన బ్లాగుల్లో, ఇలాంటి రచనలు చూసి, బ్లాగుల్లొ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాస్కోవచ్చు లెమ్మని నన్ను నేను సముదాయించుకోనా?

Anonymous said...

మందుకొట్టడం...జీవ హింస ప్రోత్సహించడం...థూమపానం లాంటి పాతకాలు సర్వసాథారణం అనిపించేంత తమో ప్రపంచం ఇది. దీని మాయలో పడని వారెవ్వరు. నాన్న డబ్బులతోనే కాదు, మన డబ్బుతో తాగినా జబ్బులు వస్తాయి?

Anonymous said...

మందుకొట్టడం...జీవ హింస ప్రోత్సహించడం...థూమపానం లాంటి పాతకాలు సర్వసాథారణం అనిపించేంత తమో ప్రపంచం ఇది. దీని మాయలో పడని వారెవ్వరు. నాన్న డబ్బులతోనే కాదు, మన డబ్బుతో తాగినా జబ్బులు వస్తాయి

Kathi Mahesh Kumar said...

@cbrao: మా ప్రొఫెసర్ చెప్పినట్లు, తాగడానికి ఒక 'విలువ' అంటూ లేదు. తాగినోడ్నిబట్టి ఆ విలువ మారుతుంది. తాగి గొడవచేస్తేనో, పెళ్ళాన్ని కొడితేనో లేక కేవలం తాగడాన్ని ఒక వ్యసనంగా మార్చుకుంటేనో సమస్యగానీ, ఖర్చుపెట్టగలిగే స్తోమతుండి, ఆనందించేంత మోతాదులో తాగితే దానికి "తప్పు" అంటగట్టడం వృధా. మనసుకూ మెదడుకూ సరైన లంకె ఉంటే, మోతాదు మించి తాగినా, అవాకులూ చవాకులూ పేలకుండా నిలకడగా ఉండొచ్చని నా నమ్మకం. ఇంతవరకూ నేనైతే ఇప్పటివరకూ మోతాదు మించలేదు.Thanks to my professor. ఇక రచనల సంగతంటారా, ఒక ఆలోచనవస్తే ఎలాంటి పరిస్థితిలోవున్నా రాసెయ్యొచ్చనుకుంటా....!

@ప్రశాంత్ గారూ, మనదగ్గర వైన్లున్నా కాస్త ఖర్చెక్కువని ఇలా అన్నప్రాసన తరువాతే ఆవకాయ అన్నట్లు బీరు తరువాత బ్రాదీ విస్కీలకి వెళ్ళిపోతున్నారు.

@సుజాతగారూ, నేను మీతో అర్జంటుగా ఏకీభవించేసాను.

@క్రాంతి: కొందరి షరీరాలకు యాంటీబయాటిక్ తీసుకున్నా నెగిటివ్ రియాక్షనొచ్చినట్లు, కొందరికి ఈ "మందులు" పడవులెండి.
అదౄష్టవంతులు.

@బాబా గారూ,మీ స్టేజిలు నాకు తెగనచ్చేసాయి....

@కొత్తపాళీ గారూ,నేనూ మీ కామెంటు చూసిన ఆనందంలో హైదరాబాదులో మిత్రులతో కలిసి ఒక పెగ్గేసా...!

@రాధిక గారూ, "పెళ్ళాం" అనే మాట అంత ఘాటుగా ఎందుకనిపించిందో కాస్త చెప్పి పుణ్యంకట్టుకోండి.


@ఇండిపెండెంట్ గారూ, మీకు "కస్సుక్కు" మనడానికి కారణం?

@ప్రవీణ్ గారూ, "కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుకతో..." అని ఏదో అంటారు లెండి. నేను కురాడిగా ఉన్నప్పుడు కుర్ర చేష్టలే చేసాను. చాలామంది అంతే అనుకుంటా...మీ అంత మెచ్యూరిటీ అప్పుడే వచ్చేస్తే కష్టం కదండీ! ఏది ఏమైనా మీకు అంత పెద్దరికం చిన్నప్పుడే రావటాన్ని అభినందించకుండా ఉండలేను.

@చదువరి గారూ, మీరు చెప్పిన పాయింటూ ఆలోచించాల్సిందే!

@రవివైజా సత్య; చాలామంది "మంచిబాలుళ్ళు" కారులెండి...కుర్రకారు అంతే!

@ప్రతాప్: ప్రతి బ్యాచ్ లోనూ మీలాంటి "హితుడు" ఖచ్చితంగా ఉంటారు..ఉండాలి కూడా.

@అరుణగారూ, నా టపా టైటిలు "మధ్యపానం- ఒక గొప్ప సంస్కౄతి" కాదు. కేవలం నా అనుభవం మాత్రమే. దీన్నుంచీ అందరూ తాగడం నేర్చుకోవాలనో లేక తాగడం ఒక గొప్ప విద్యనో నేను భోధించడం లేదు. ఒకవేళ నేనలా చెప్పినా నన్ను గుడ్డిగానమ్మే జనాలిక్కడున్నారని నేననుకోను.

మరొక్కమాట, బ్లాగుల్లో భాధ్యతాయుతమైన రచనలు మాత్రమే చెయ్యాల్ని మీకు ఎవరు చెప్పారో నాకు తెలీదిగానీ, వారు ఖచ్చితంగా మీకు తప్పే చెప్పారు.

@నవీన్ గారూ,ఆ జబ్బులొచ్చే అతినే ఇక్కడకూడదని చెప్పడం జరిగింది చూడగలరు.

Chivukula Krishnamohan said...

హమ్మ మహేష్ గారూ, ఇప్పటిదాకా మీరు మీ బ్లాగులో బాధ్యతాయుతమైన రచనలు చేస్తున్నారు అనుకుని అవి మీ 'ఇజాలు' కాబోలు అనుకుని నమ్మేద్దామనుకున్నా. మీరు మీ బ్లాగులో బాధ్యతారహితమైన టపాలు కూడా వ్రాస్తారని ఇప్పుడు తెలిసిపోయింది. జాగర్తగా ఉంటా. :)
మరొక్కమాటఅండి. మధ్య మద్యపానం కూడా చెయ్యవచ్చు కానీ - మీరిక్కడ మద్యపానం గురించి కదా మాట్లాడుతున్నారు. అలాగే అది 'బాధ్యత'. ఊరికే. ఆకట్టుకునే శైలితో మీ వాదాల్ని present చేస్తూ ఉంటారు కదా - ఇలాంటి ముద్రా రాక్షసాలు లేకుంటే ఇంకొంచెం మంచిది కదా!
మీ ఆనందయుత మందు వేదాంతానికి అనేక శుభాకాంక్షలు.

పూర్ణిమగారూ, లిమిట్ లో ఉంటే అన్నీ మంచివే అన్నారు - లిమిట్ లో అంటే - అటూ కాకుండా - ఇటూ కాకుండా ఉండడం. అది middle class mentality ని సూచిస్తుందనుకుంటాను. అప్పుడు మీరు ఏ గమ్యస్థానానికీ చేరరు. నిజంగా అది మంచిదేనా? అయినా తాదాత్మ్యం చెందందే రససిద్ధి జరగదు అంటారు కదా! అది లిమిట్ లో ఉంటే దొరుకుతుందా అని! :) ఆలోచించండి.

Anonymous said...

మాష్టారు మందుపురాణం మాకు చెప్పేసి మాయమయిపోయారు. మీ కామెంట్లు లేక మా టపాలు వెలవెలబోతున్నాయి. ఎక్కడున్నారు స్వామీ!

శ్రీధర్ said...

తాగినవాడు పెళ్ళాన్ని పెళ్ళాం అనక జలకంత్రి అంటాడా ? నీ విస్కీ లొ నా సొడా..... బాబు ఇంకొ ఫుల్ పట్రా..

Kathi Mahesh Kumar said...

@చివుకుల గారూ, బ్లాగులు నా ఇష్టమొచ్చిన రీతిలో నా ఆలోచనలూ, అనుభవాలూ చెప్పడానికని నా నమ్మకం. భాధ్యతాయుతమైన రచనలు చెయ్యాలనుకునేవారు హాయిగా పత్రికలకురాసి దేసాన్ని ఉద్దరించొచ్చు. అయినా నా మందు అనుభవంరాస్తే,భాధ్యతారహితుడ్నయిపోతానా??

@మురళీధర్ గారూ, ప్రస్తుతం నేను పోనిమీద హైదరాబాద్ నగరంలో ఉన్నాను.పేరుకి హైటెక్ సిటీనేగానీ, ఇక్కడ చాలా నెట్ కేఫుల్లో తెలుగు చదవడం కుదరదు, అలాగే రాయడం అసాధ్యం. సోమవారానికి నేను ఇల్లుచేరుకుని అందరి బ్లాగులూ చది కామెంటెయ్యాలి!

Chivukula Krishnamohan said...

అయ్యో మహేష్ గారూ, బాధ్యతా రాహిత్యం అన్నది నేను మొదట వాడలేదు. మీరే అరుణగారికిచ్చిన సమాధానంలో వాడారు. చూడండి - అది బాధ్యత - భాధ్యత కాదు. మీరెంత గ్యాసు బర్నర్ అయినా ఎప్పుడు మండిపోదామా అని అలా వెయిట్ చేస్తూ ఉంటే ఎలా సార్? మీ బ్లాగు మీ ఇష్టం - నచ్చిన అనుభవాలూ, నచ్చిన ఆలోచనలూ మీకు నచ్చినట్టు చెప్పుకోండి సార్. మీకు బాధ్యత ఉంది అని ఎవరన్నారు? (ఒక నిర్దిష్టమైన విషయాలు మాత్రమే చెప్పాలన్న). చివర శుభాకాంక్షలు కూడా అందించా కదా! దేశాన్ని తెలియదు గానీ బ్లాగ్లోకాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నది మీరు - భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ఘోరమైన క్ర్రూరమైన మూఢాచారాలని మీకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఎత్తిచూపి బ్లాగ్లోకంలో సంచలన రచయిత అయిన మిమ్మల్ని ఎత్తి చూపేవాడినా? తగ్గకండి - మీ అన్ని అనుభవాలలోనూ జీవిత సత్యాలు ఉండే ఉంటాయి. 'అన్నిటినీ' పచ్చి పచ్చిగా, పిచ్చ పిచ్చగా పంచేయండి.

Anonymous said...

ఏమాటకామాటే ఈ టాపిక్కే వేరు. కత్తి లెండీ... వీటి గురించి రరౌండ్ లలోనే మాట్లాడాలి :-)

Kathi Mahesh Kumar said...

@చివుకుల గారూ:నా ఆవేశంకూడా అరుణగారివైపుకే లెండి. మీ మీదకు కాదు.అవునూ, మీకు నవలా రచయిత "చివుకుల పురుషోత్తం" గారు ఏమైనా బంధువులా? He is one of my favorite novelist.

బ్లాగుల్ని కూడా ఏడిటోరియల్ ఉన్న పత్రికల్లాగా భావించి బాధ్యతాయుతమైన రచనల్ని గురించి సలహా ఇచ్చేసరికీ కాస్త "మండాల్సొంచింది" అంతే.

ఇక నా బాధ్యతంటారా,అది నాకు తోచింది రాయడం వరకే...

@అశ్విన్: ధన్యవాదాలు.

Purnima said...

చివుకుల గారు:

ఆలోచించమన్నారని నాకు తెలీదు. ఇప్పుడే చూస్తున్నా. మీరన్నవి ఆలోచించే ముందు, నా ఆలోచనలు చెప్తున్నా.

ఇప్పుడు, బ్లాగు రాస్తున్నానా? అప్పుడప్పుడు ఒక "బాగుంది", కొన్ని సార్లు "ఇదో.. ఇలా రాస్తే బాగుంటుంది, ప్రయత్నించండి" అని అటు ఉన్నదానికి అభినందనలూ, లేనిదాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రోత్సాహమూ దొరుకుతుంటే, బ్లాగులంటే ఇష్టం కలుగుతుంది. ఇంకా చదవాలనీ, చాలా చాలా రాసేయాలనీ అనిపిస్తుంది. సహజం! నాకు తెలిసి, తెలుగు గురించి నాలాంటి నేపధ్యం ఉన్నవారికి ఇక్కడ జరిగేంత మేలు ఇంకెక్కడా జరుగదు. అందుకని నేను ఇరవై నాలుగు గంటలూ బ్లాగులకి అత్తుక్కుపోవచ్చు. మెరుగుపడుతున్నాను కావున తప్పు లేదందులో.

"అమ్మా..నేను బ్లాగులు రాసుకోవాలి. నేనేం పనిలో సాయం చెయ్యను" అని అంటే? "అబ్బా మూడు గంటల సినిమా చూసే బదులు నేనో టపా రాసేస్తా, మీతో రాను" అని స్నేహితులతో అంటే? కృష్ణశాస్త్రీ, శ్రీశ్రీ అంటూ నేను నా టెక్నికల్ డొమేన్ ని విస్మరిస్తే?

ఏదైనా "లిమిటెడ్" గా ఉండటం అంటే నా ఉద్దేశ్యం ఇదే! మనం పెట్టుకున్న వ్యాపకం గానీ, అలవాటు గానీ మనకి గాని, మన వారికి గానీ ఏ విధంగా కష్టపెట్టకూడదూ అని, నష్టపోకూడదూ అని.

మీరన్న దానిలోనూ పాయింట్ ఉంది. లిమిటెడ్ గా ప్రయత్నిస్తే ఫలితాలూ లిమిటెడ్ గానే ఉంటాయి. కానీ అప్పుడు ముందుగా నిర్ణయించుకోవాల్సింది మనం ఏం సాధించుకోవాలి అన్నది. మీరన్నట్టు పరిమితులను అధిగమిస్తే గానీ ఫలితం ఆశించిన స్థాయికి రాదు. అంటే ఒక మంచి నవల రాయలేము. కానీ ఒక బ్లాగుకి కావాల్సింది ఎంత? ఇవ్వాల్సిందెంత? అన్నది మాత్రమే మనం ఆలోచించుకోవాలి.

మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏమిటో, దేన్ని అంటారో తెలీదు! బహుశా, జీవితంలో నేను ఇప్పటి దాకా తీసుకున్న నిర్ణయాలు మిడిల్ క్లాస్ కావున తీసుకున్నవి కాననందునేమో!

దీని మీద నా అభిప్రాయాల్ని వ్యాఖ్యగా కుదించడం నచ్చటం లేదు. కానీ టపా రాస్తానో లేదో తెలీదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాననే అనుకుంటున్నా. అర్ధం కాకపోతే నా బ్లాగులోనే ఎత్తుకోవాల్సి వస్తుంది.

ఇంకా ఆలోచించాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి ;-)

(బ్లాగు-రచన ఉదాహరణ తీసుకున్నది, ఈ టపాలో ఉన్న అంశంతో నేనంత comfortable కాదు కనుక. మనకి మంచి చేసేవి మాత్రం వంట పట్టించుకుని, మిగితావి వదిలేయాలి, అవునా? ఆలోచించండి. :-))