Tuesday, August 19, 2008

అర్బన్ సొఫిస్టికేషన్ (Urban Sophistication) అంటే ఏమిటి?

ఈ మధ్య ఒక మిత్రుడు హఠాత్తుగా ఐమాక్స్ ధియేటర్ కెళ్తుండగా, "అర్బన్ సొఫిస్టికేషన్ (Urban Sophistication) అంటే ఏమిటి?" అని ఒక విలువైన ప్రశ్నడిగాడు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గ్లోబలైజేషన్ నేపధ్యంలో ఈ పదం యొక్క ప్రయోగం చాలా చోట్ల, చాలా ఘటనల్లో వినడం జరిగింది. కానీ, ఇప్పటివరకూ అదొక జీవినవిధానమా, aatitudఆ, ప్రవర్తనా, బట్టలేసుకునేతీరా, వెళ్ళే ప్రదేశాలా (హోటళ్ళూ, మల్టీప్లెక్సులూ) అనేది నిర్ధిష్టంగా తెలిసిరాలేదు. కాకపోతే, అది ఈ ఆధునిక నగర జీవనంలో మనిషిని judge చెయ్యడానికి ఉపయోగించే ముఖ్యమైన కొలమానం ఇది అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. కొందరు పెద్దలు మాత్రం అలాంటిదొకటి అసలు లేదేమో అనే అనుమానం వెలిబుచ్చుతారు.
నేను యూనివర్సిటీలో చదువు ముగించాక (year 2000) ఉద్యోగ ప్రయత్నాలకోసం బొంబాయి వెళ్ళాను. అప్పటికే సినీదర్శకుడు రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ హౌస్ లో ‘శ్రీ రాఘవేంద్రస్వామి’ సీరియల్ కు పనిచెయ్యడం వలన అక్కడే పనిచేస్తున్న మాసీనియర్ ఒకతను నాకు సినిమాల మీదున్న interest ని గుర్తించి, హైదరాబాద్ కన్నా బొంబాయిలొ భవిష్యత్తు బాగుంటుందని అప్పట్లో చిరంజీవి ‘చూడాలనివుంది’ సినిమాని అనిల్ కపూర్ తో హిందీలో తీస్తున్న ప్రముఖ హిందీ దర్శకుడు సుధీర్ మిశ్రా (ఇస్ రాత్ కీ సుబహ్ నహీ, హజారో క్వాయిషే ఐసీ) reference ఇచ్చి బొంబే పంపాడు.
సినిమా మీద ఎన్నో ఆశలతో నేను బొంబాయి వచ్చి సుధీర్ మిశ్రాని కలవగానే నాకు తెలిసిన విషయం, అనిల్ కపూర్ ‘నాయక్’ అనే సినిమా కోసం bulk dates దర్శకుడు శంకర్ కు ఇచ్చెయ్యడం వలన, ‘కలకత్తా మైయిల్’ (చూడాలనివుంది సినిమా హిందీ వర్షన్) సినిమా postpone అయ్యిందని. అప్పటికే సుధీర్ మిశ్రా ‘నింబస్’ production house కోసం కొన్ని TV సీరియళ్ళు తీస్తున్నారు. ఆ సీరియళ్ళలో పనిచెయ్యమని అతను చెప్పినా, నా హిందీ మీద కొంచెం డౌటున్న నేను సాహసించలేకపోయాను. అయితే అప్పుడే SAB TV వాళ్ళు తెలుగు ఛానల్ లాంచ్ చేసే ప్రయత్నాలలో ఉన్న విషయం తెలిసి సుధీర్ మిశ్రా నన్ను అక్కడి senior producer ఒకరి పేరుచెప్పి కలవమన్నారు. ఇక్కడ మొదలాయ్యాయి నా సినిమా కష్టాలు.
దాదాపు 16 రోజులు పట్టింది SAB TV లో రిసెప్షనిస్టుని దాటి ఆ ప్రొడ్యూసర్ ని కలవడానికి. అప్పటికే బొంబాయిలో ట్రెయిన్ ప్రయాణాలతో ఒకవైపు విసిగున్న నాకు, ఈ రిసెప్షనిస్టు పెట్టిన కష్టాలు తోడై చిర్రెత్తుకొచ్చి పెట్టాబేడా సర్ధుకుని, అప్పటివరకూ ఆశ్రయమిచ్చిన మా అన్నయ్య స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పి హైదరాబాదొచ్చిపడ్డాను. ఈ రిసెప్షనిష్టు అనుభవం ఒక మిత్రుడికి చెబితే, "may be your ‘urban sophistication’ didn't match the expectations of that receptionist" అన్నాడు. అది నేను జీవితంలో రెండోసారి ఈ పదం వినడం. మొదట విన్నది, హిందీ నటుడు దేవానంద్ గురించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ‘ఆశిష్ నంది’, "he represented a care-free urban sophisticated man" అని తన వ్యాసంలో చెప్పినప్పుడు.
నా మిత్రుడు చెప్పిన perception సరైనదే అని నాకనిపించింది. అప్పటి బొంబాయి సినీ మరియూ టీవీ పరిశ్రమలో ఉన్న వ్యక్తుల జీన్స్ ప్యాట్ టీ షర్టులూ, పిలకలలూ, మేక గడ్డాలకూ నా వేషభాషలకూ చాలా తేడా ఉండేది. ఇంగ్లీషు బాగానేవచ్చినా, దాంట్లో కొంత దక్షిణ భారతీయ యాస తోడైతే, అక్కడ చాలామంది అప్పుడే అమెరికానుంచో, బ్రిటన్ నుంచో దిగివచ్చినట్లు యాక్సెంట్ తో మాట్లాడేవారు. నిజంగా అలా దిగుమతైన బాపతులుకూడా ఉండేవాళ్ళు. అంటే, what you are capable of కన్నా, how you carry yourself with... "urban sophisticaion" అన్నది నాకు entry barrier అయ్యిందన్నమాట.
ఈ మధ్యకాలంలో ఇది మారినట్టు అనిపిస్తోంది. కేవలం వేషభాషలే కాక, వ్యవహరించే తీరూ, స్పందించే విధానం ఈ పరిధిలోకి వస్తున్నట్టుగా నా అనుభవం. నోరెళ్ళబెట్టకుండా ఐమాక్స్ లో ఎస్కలేటర్ ఎక్కడం, నిస్సంకోచంగా మాల్ లోని దుకాణాల్లోకి అడుగుపెట్టడం, కాస్ట్లీ రెస్టారెంటుల్లోకి గుబులు లేకుండా ప్రవేశించి అధికారికంగా ఆర్డరివ్వడం వంటివి physical manifestations of urban sophistication గా మారినట్లున్నాయి. కాకపోతే ఇక్కడకూడా ఆంగ్లభాషో లేక ఆంగ్లం కలిపిన తెలుగో తప్పటం లేదు. బహుశా అది నగరజీవనానికి, మన ప్రజల నాగరికతకూ ఒక కొలమానంగా ఎప్పుడో మారినట్లుంది. మన తెలుగు TV లోకూడా తెలుగు రాని తెలుగు యాంకర్లు మోడ్రన్ డ్రస్సుల్లో "హాయ్" అంటూ urban sphistication ఒలికిస్తూ ప్రత్యక్షమవుతుంటారు.
ఈ విధానాన్ని మరొకమెట్టుకి తీసుకెళ్తే, intellectual urban sphistication ఒకటి తయారయ్యింది. కాటన్ చీరలూ, పెద్ద బొట్టూ, సగం రవికా ధరించి, మహిళల్ని ఉద్దరించడానికి ఫెమినిజం పదాలు జాలువారుస్తూ కొందరు. మాసిన జీన్సులూ, ఖద్దరు జుబ్బాలూ, హ్యాండ్ మేడ్ బ్యాగులూ ధరించి పర్యావరణ హక్కుల గురించి ఇంగ్లీషులో పోరాడేవాళ్ళు ఇలాంటి కేటగరీలో వస్తారనుకుంటాను. వీళ్ళకొక credibility, appeal అనేవి సహజంగా వచ్చేస్తాయి. మధ్యతరగతి నగరవాసులంతా మనకోసమే వీళ్ళ వేదనా, ఆవేదనా అనే విపరీతమైన నమ్మకాన్ని వీరిపట్ల ఏర్పరుచుకుంటారు. దాదాపు ఇలాంటి urban sophistication కాలేజుల్లో, యూనివర్సిటీలలో అమ్మాయిల పరిచయాన్ని కలిగిస్తాయి.
ఇలా ఎక్కడ చూసినా ఈ సర్వాంతర్యామి కనిపిస్తున్నా, దీని అసలు అర్థమేమిటో ఇప్పటికీ నాకు తెలియరాలేదు. మీకు తెలిస్తే చెప్పండి. నేను చెప్పినవాటిల్లోఉన్నది నిజంగా నేను అనుకున్న urban sphistication నో లేక నా అపోహో తెలియజెప్పి జ్ఞానోదయం కలిగించండి.


****

12 comments:

Purnima said...

మాటల్లో చెప్పలేను కానీ.. "Sophistication inkee surname hai" అన్న స్థాయిలో వేషాలు వేసే వారిని మాత్రం చూశాను. ఇక మీ టపాకి వచ్చే వ్యాఖ్యలను చూడాలి!! :-)

Cinevalley said...

you defined it well in your first paragraph and followed it up with ample examples. Now people will come to this page to get the meaning of urban sophistication ;)

--Cine Valley
http://cinevennela.blogspot.com/

ప్రసాద్ said...

ఛ! నేనెంత urban sophisticated కాదో ఈ పదాన్ని మొదటిసారి ఇక్కడే చూస్తున్న విషయమే చెబుతోంది.

మొన్న ఇండియానుంచీ తిరిగి వస్తున్నప్పుడు నా పక్కసీట్లో బిజినెస్ వీసా మీద మొదటిసారి అమెరికా వస్తున్న అమ్మాయి వుంది. పరిచయాల మద్య "మీరు అసలు పదేళ్ల నుండి అమెరికాలో వుంటున్న వారుగా అసలు కనపడటం లేదు" అంది.

ఇప్పుడనిపిస్తున్నది ఆ అమ్మాయి అలా ఎందుకందో!

--ప్రసాద్
http://blog.charasala.com

సుజాత said...

మీ టపాలో కిందనుంచి రెండో పేరాలో మీరు చెప్పిన తాలూకూ intellectual urban sofistication నేను కూడా చాలా చోట్ల గమనించాను. ఇకపోతే I-max లో నోరెళ్లబెట్టకుండా ఎస్కలేటర్ ఎక్కడానికి నాలుగు సార్లు ఎస్కలేటరు ఎక్కిన అనుభవం చాలదా? కంపల్సరీగా sofisticated అయ్యుండాలంటారా?

పెరిగిన వాతావరణాన్ని బట్టి "నిఝ్ఝంగా" uraban sofisicated అయితే సరే! కానీ తెచ్చిపెట్టుకున్నవే ఎక్కువ చూసాను నేను!( టపాలో కిందనుంచి రెండో పేరా మళ్ళీ చూడవలెను)

నాకైతే genuinity ముఖ్యం!మనం మనంగా ఉండాలంతే!ఎక్కడి పరిస్తితులకు అక్కడ అనుగుణంగా ప్రవర్తించాలి, కాదన్ను, కానీ అంతర్లీనంగా మనం మనంగా ఉండాలి! ముసుగులనవసరం! ఈ లెక్కన ఈ అర్బన్ సోఫిస్టికేషన్ ఒక పెద్ద మేలి ముసుగులా కనపడుతోంది.

cbrao said...

Urban Sophistication అంటే ఏమిటి?

మన కట్టు , బొట్టు, మాట్లాడే తీరు (భాష, మాండలీకం), చదివే పుస్తకాలు, చూసే సినిమాలు, ఆహారం తినే విధానం ఇవన్నీ అవతలి వారిలో మనపై ఒక అభిప్రాయాన్ని కలిగించే అంశాలు. Urban Sophistication లో నవ్వే తీరు, కూర్చునే విధానం కూడా ఒక ముఖ్యమైన భాగం. గ్రామాల నుంచి పట్టణం కొత్తగా వచ్చిన యువతీ, యువకులకు పట్టణం లో పుట్టి పెరిగిన వారికీ పైన పేర్కొన్న వాటిలో తేడాలను సులభంగా గుర్తించవచ్చు. ఒక పట్టణం అమ్మాయి ఆహారం తినే తీరు (style) చూసి ప్రేమలో పడ్డ అబ్బాయి కథ విన్నాను. పల్లెటూరి వారు ఆహరం తీసుకునేటప్పుడు చేసే శబ్దాలను పట్టణంలోని నాగరికులు హర్షించరు. ఒక పల్లె యువతి కొప్పుకూ, పట్టణ యువతి hair-style కూ ఉన్న తేడా గమనిస్తే Urban Sophistication దృశ్య రూపంలో కూడా చూడవచ్చు. "అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా" - ఇది పట్టణ యువతుల సింగారపు పలకరింపు.

Urban Sophistication అంటే style, ఆధునిక, అభ్యుదయ నాగరికత ల కలగలుపు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

హ్హహ్హ మహేష్ గారూ మొత్తానికి మీ ఫ్రెండ్సో,మీరు ప్రవేశపెట్టే పాత్రలో గానీ కడుచమత్కారమైన ప్రశ్నలడుగుతారు మిమ్మల్ని!ఇక్కడ మీరడిగిన,లేవనెత్తిన ప్రశ్నకు,ఇవ్వాళ్టి సగటు భారతీయసమాజములో we have arrived అనుకునే అర్బన్ సోఫిస్టికేషన్ కు నాపరిశీలనలో కొంత hypocrisy,కొంత duplicity,కొంత artificiality,కొంత stupidityనీ కలుపుకోవాలి.దీనికి తోడు నాలుక చివర సొల్లులా కారె కాస్త ఇంగ్లీషు ముక్కలుండాలి,వాటిని లొడలొడా ఎక్కడపడితే అక్కడ బక్కెట్లకొద్దీ వంపగల శారీరకసామర్ధ్యం ఉండాలి,ఇక్కడ తెలివితేటలకు అసలు చోటివ్వ్వఖ్ఖర్లేదు.
చాలా రాయొచ్చు ఇలా!చివరాఖరికి ఇంకొక గుణం చెప్పి ఆపుతా అది సదరు అర్బన్ సోఫిస్టికేషన్ ఇవ్వాళ ఆ so called young things కి అందిస్తున్న మరో అలంకారం constipation.చూడుడు తాజా ఆరోగ్యనివేదికలు.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మరొక్క విషయం urban dictionary వారు చాలా మందికి ఝల్లుమనిపించే నిర్వచనం ఇచ్చారు చూసి తరింతురు గాక---
urban sophistication
1 thumb uplove ithate it

describes a ghetto person who creates a word in order to sound more worldly or educated.
"the crocodile hunter was friendly as well as informational"-Katt Williams

the word "informational" in this phrase is an example of urban sophistication


http://www.urbandictionary.com/define.php?term=urban%20sophistication

రాకేశ్వర రావు said...

నిన్న ఇక్కడ బెంగుళూరుకల్లా కూలెస్ట్ మాల్ అయిన ఫారం కి వెళ్ళాను.
అక్కడ నేను ఒక రాజస్థానీ self service restaurant లో తెలిసీ తెలియని తిండ్లకు జంకుతా ఆర్డర్ ఇస్తూంటే, ప్రక్కనే ఒక కన్నడ ఆంటీగారు వచ్చి, ఫటాఫట్ మని తనకూ మరియు తన మిత్రురాలికి ఎవోవో ఆర్డర్లు ఇచ్చి పారేశారు.
అలాంటి వారి మాటల్లో వారి భర్తలు సంపాదించి పెట్టిన డబ్బులు ఆపాదించిన ఆత్మవిశ్వాసం ఒకటి ఉంటుంది. అలాంటి వాళ్ళు సినిమాల్లో పాత్రలుగా చాలా బాగా పనికొస్తారు. :)
మీరు వ్రాసింది కూడా ఆ విషయమ్మీదే. దీన్ని మాటల్లో బంధించాలాంటే చాలా కష్టం. అలాంటి వారిని చూసినప్పుడు మాత్రం నా లాంటి పల్లెటూరు బైతులకు కలుగుతుంది ఒక నిర్దిష్టమైన భావన.

saisahithi said...

ఏంటి ఆమాత్రం తెలీదా! ఆ మాటకొస్తే మాటల్లో ఇదీ అని నేనూ చెప్పలేను. వీలైతే మా వైజాగ్ రండి. ఇక్కడి బీచ్ లలోమీక్కావల్సినంత urban sofistication తారాస్థాయి లో చూడగలరు. I thinkఈ poshness prevails mainly in the middle and uppermiddle classes. It is very alarming..అన్నట్టు urban sofistication అంటే poshness అనచ్చేమో...

రాధిక said...

ఆపదానికి ఖశ్చితంగా ఇదీ అర్ధం అని తెలియదు గానీ మనం సంపాదించిన డబ్బు,మన చదువు[ఉన్నా లేకపోయినా],మన ఆత్మవిశ్వాశం,నేను హై క్లాసు అని చెప్పడానికి మనం చేయగలిగే అన్ని పనులూ ఆ పదానికి అర్ధం పడతాయి.
అదేమిటో నేను ఇక్కడి పే...ద్ద పేద్ద మాల్స్ లో చాలా కాజువల్ గా షాపింగ్ చేయగలను గానీ ఇండియాలో మాల్స్ లోకెళ్ళి చెయ్యాలంటే జంకుగా వుంటుంది.[ఇక్కడ చాలా మంది కూడా ఇదే మాట చెపుతారు] అంటే సోఫిస్టికేషన్ అనేది ప్రదేశాన్ని బట్టి కూడా వుంటుందన్న మాట.ప్రసాదు గారు చెప్పినట్టు ఇండియాలోని ఇప్పటి యువత తో పోల్చుకుంటే అమెరికాలో 10 ఏళ్ళు వున్నవాళ్ళు కూడా సోఫిస్టికేటెడ్ కాదు.

Aditya said...

ఒక రకమైన కాంప్లెక్స్ ని కవర్ చేసుకొవడం కొసం,లైఫ్ లొ మాకు ప్రతీది తెలుసు,మేము చాల ఆదునికం అనుకొంటూ ఇతరులకి అలా ప్రొజెక్ట్ చెసుకొంటారేమో అనిపిస్తుంది మరి.

కత్తి మహేష్ కుమార్ said...

ఈ విషయం మీద నా ఆలోచనా పరిధిని పెంచి, అమూల్యమైన అభిప్రాయాల్ని తెలిపిన అందరికీ ధన్యవాదాలు.