Thursday, August 7, 2008

ఉద్యోగం మారిందంతే!

మాంచి ఆఫరొస్తే, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి బైబై చెప్పి...కొత్త ఉద్యోగాన్ని దర్జాగా గుండెలకదుముకోమూ? ‘శూద్రులే’ అయినా, ఆ చతుర్వర్ణాన్నొదిలి కమ్మలూ,కాపులూ, రెడ్లూ కూసింత సామాజిక గౌరవం పెంచుకోవడం కోసం ఎంచక్కా ఒకమెట్టెక్కి ‘క్షత్రియులని’ చెప్పుకోలేదూ! "బీ.సీ. లైతేమాత్రం మాకేం ఒరిగింది", జనాభాప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచమని అధికారమున్న కులాలుకూడా హాయిగా డింమాండ్ చెయ్యట్లేదూ? "బ్రాహ్మణులైతే మా తాతలకొరిగిందేతప్ప, మేము మాత్రం పేదరికంలో మగ్గుతున్నాం" అని ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ లాభాలలో వాటాలివ్వండి అని ద్విజులడగటం లేదూ? ఇదంతా మనకు ఓకే...కానీ క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి చేస్తే మాత్రం పొడుచుకొస్తుంది. ఎందుకో?ఇప్పుడే ‘దేవర అనంతం’ అనే బ్లాగులో ‘మనదేశానికి పట్టిన క్యాన్సర్ - క్రైస్తవ మిషనరీలు’ అనే వ్యాసం చదివొస్తున్నాను. దేవరగారి బాధంతా, ఆర్థిక లాభాలుచూపి హిందువుల్ని క్రైస్తవులు మతమార్పిడి చేస్తున్నారని. అంత బాధ నిజంగా ఎందుకో నాకైతే అర్థం కాని విషయం. డాలర్లొస్తే మాతృదేశాన్ని వదిలేసి అమెరికా చెక్కేస్తే అది "ప్రొగ్రెస్". కనీస గౌరవం , బతకడానికి కావలసిన ఆర్థిక అవసరాలకోసం only by mistake గాపుట్టేసిన మతాన్నొదిలేస్తే అది దారుణమా ? వారెంచుకున్న ఉదాహరణలుకూడా పాపం పేదబడుగు వర్గానికో లేక కాయకష్టం చేసుకునికూడా ఐదువేళ్ళూ నోట్లోపెట్టుకోలేని బెస్తవాళ్ళ సంగతి. వారికి మతం కన్నా జీవనం ముఖ్యం కాదంటారా? మనం మాత్రం డబ్బుకోసం దేశాలూ,ఉద్యోగాలూ మారొచ్చు, వారు మతం మారితే అన్యాయమైపోయిందా? ఎందుకీ double standards?ఇంకో ఆరోపణ క్రైస్తవులు మొదట ‘సేవ’ అని తరువాత ‘మతం’ అని మెల్లగా సామ్రాజ్యవాదం వైపుకి తీసుకెళ్తాట. ఛట్! నిజమా! నా కళ్ళిప్పుడే తెరుచుకున్నాయి. మనదేశం సామ్రాజ్యవాద మార్కెట్ గా మారి దాదాపు 20 సంవత్సరాలు సగర్వంగా అవ్వొస్తుంటే ఇప్పుడు కొత్తగా క్రైస్తవులు మనల్ని మార్చడమేమిటి? దీని కేమైనా అర్థముందా, అపోహకాకుంటేనూ! సామ్రాజ్యవాద మార్కెట్ వలన తక్కువ ధరకే వచ్చే వాల్ మౌంటెడ్ DTH TV కావాలిగానీ, అదే వాదాన్ని బూచిగా చూపి మతమార్పిడిని నిరసిస్తే ఎట్లా? అయినా, విధ్య వైద్య రంగాలలో ఇప్పటికీ దాదాపు 30% సంస్థలు క్రైస్తవులు నడపటం లేదా. మనలో ఎంతమంది మొంటెసరీనో, కాన్వెంటో, సెయింట్ జాన్సనో, సెయింటానులోనొ జబ్బలు చరుచుకుంటూ చదివి, "ఇంగ్లీషు మాకు బహుబాగా వచ్చు" అని గర్వంతో గగనాలకెగసిన మనమేనా వారి సేవను తప్పుపట్టేది? అంతెందుకు, పరుపుకూడా దిగలేని పేషెంట్ మలాన్నీ, వాంతినీ కడిగే వీరి సేవలోని సిన్సియారిటీనా ప్రశ్నించేది. బస్తీమే సవాల్...! ఎంత మంది తలెత్తుకుని హిందువులమని చెప్పుకునేవారిలో ఉంది ఈ దయ, జాలి, కరుణ, సేవాతత్పరత? పుట్టపర్తి సత్యసాయిబాబా హాస్పెటల్లో ఎంతమంది క్రైస్తవ నర్సులున్నారో తెలుసా? ఎందుకీ పనికిమాలిన మత గర్వం?ఇంకో ఆరోపణ, మతం మార్పిడిద్వారా వీరు ప్రజల్ని వారి సంస్కృతికి వ్యతిరేకంగా చేసి, చివరికి దేశానికి వ్యతిరేకుల్ని చేస్తారట. ఏ సంస్కృతీ? ఎవరి సంస్కృతి? నాకైతే తెలీదు. ఈ వ్యాసం రాసిన దేవరవారికి కూడా తెలుసని నేననుకోను. గుడికెళితే టెంకాయకొట్టడానికి టికెట్టడిగే ‘నా’ హిందూమతంకన్నా, దేవుడికి క్యాండిల్ వెలిగించాలనే కోరిక తెలిపితేచాలు, క్యాండిల్ కూడా వారే సమకూర్చే సంస్కృతి కలిగిన క్రైస్తవ మతమా సంస్కృతికి వ్యతిరేకం? పూజకో రేటు, దర్శనానికో స్థాయీ కల్పించే సంస్కృతికన్నా, ఒకే గుంపులో ప్రార్థించే ఈ మతమా మన సంస్కృతికి వ్యతిరేకంగా మనవాళ్ళని ప్రేరేపించేది? వ్యతిరేకించాలంటే, వేలకారణాలు రెడీగా ఉన్న మన తూట్ల సంస్కృతిని, వీళ్ళా తుత్తునీయాలు చేసేది? మతమౌఢ్యంతో మత్తెక్కిన మన మతవాదులే చాలరూ, ఈ ఘనకార్యానికి! ఇంకొకళ్ళెందుకు?మతమార్పిడంటే నావరకూ, just a job change అంతే! ప్రస్తుతం పనిచేసే చోట మన శ్రమకూ, అస్తిత్వానికీ విలువలేకపోతే, వేరే చోట మంచి బతుకు వెతుక్కోవడమే మతమార్పిడి. దానికి వ్యతిరేకంగా ఎవరూ గుండెలు బాదుకోనవసరం లేదు. అమెరికా వెళ్ళి డాలర్లకోసం పాటుబడే మిత్రుడికి ఎంతగౌరవమిస్తామో, మతం మారిన హిందువుకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. రెంటిలోనూ పెద్ద తేడా లేదు. ఎందుకంటే, డాలర్ నోటు మీదకూడా "IN GOD WE TRUST" అని ఉంటుంది.

****

45 comments:

Purnima said...

మతానికి ఉద్యోగానికి పోలిక బాగుంది. జస్ట్ ఎ జాబ్ చేంజ్!! ఈ మత మార్పిడల గురించి నేను చాలా చూశాను. కానీ నాకెందుకో కొన్ని సార్లు మిషినరీస్ తమదే గొప్పంటూ అందరూ తమనే ఫాలో అవ్వాలి అన్నది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళు చేసేవి మంచి పనులు కావచ్చు, కానీ వారి విధానాలే గొప్ప, మిగితా వారివి కావు అన్న ధోరణి నేనెక్కువ చూశాను!!

ఏది ఏమైనా, it's a personal choice!! మన జీవితానికి మనం ఏం కావాలనుకుంటామో అది మనం సమకూర్చుకునే హక్కు ప్రతీ ఒక్కరిది. ఎవరో చెప్పారని కొందరు మారుతారు. కొంతమంది, ప్రాణాపాయ స్థితిలో ఏ దేవుడు రక్షిస్తే ఆ మతం తీసుకున్నాము అంటారు. ఎవరి నమ్మకం వారిది. నేను దేవుణ్ణి ఎంత నమ్ముతానో తెలీదు కాని, మనిషి నమ్మకం మీద మాత్రం పూర్తి నమ్మకం.

Budugu said...

మహేష్ గారు, simply superb.
చాలా ఏళ్ళ కింద ఒక మితృడితో ఇదే మాట అన్నాను, 'కట్టుకోను బట్ట, తిండానికి తిండి ఇవ్వలేని మతం ఎందుకు? పీఠాధిపతి కాళ్ళకు మొక్కడానికి వెయ్యిన్నూటపదహార్లు చెల్లించాలనే మతంకంటే తిండి గుడ్డ ఇచ్చే మతమే మంచిది ' అని.

Hats Off

bujji said...

tindi, gudda ivvatam manchide kavachu.. matam maralane condition pettadam endukanta.. adi personal choice ani meere kada annaru.. sarigga educate chesi meekedi kavalo meere decide cheskondi anochu kada.. ala christians ga marina vallu chala varaku hinduvulaku anavasaranga dooram cheskovatam nenu choosanu.. inkoka matam meeda, tht too valla original matam meeda dvesham noori poyyatam tappe kada.. vallu chesedi manchenemo.. kani goppadi kadu, niswarthanga chestunnadi asalu kadu.. long term lo idi janala madhya dweshalanu penchutundi ani na feeling...

బొల్లోజు బాబా said...

యాదృచ్చికమో కాదో తెలీదు కానీ నేనూ నామిత్రుడు ఈ రోజు సాయింత్రమే దాదాపు ఇవే భావాలు డిస్కస్ చేసుకొన్నాం.
ఒక్కొక్క సారి అనిపిస్తుంది. మతపరమైన శిక్షణ మనలో కంటే క్రిష్టియానిటీలోను, ఇస్లాం లోను ఎక్కువగా కనిపిస్తాది ఎందుకా అని తర్కించుకొన్నాం.
ఆ యా మతాల వ్యక్తులలో అధికశాతం వారంలో ఒక రోజు ఖచ్చితంగా చర్చికో, మసీదుకో వెళతారు. ప్రతీరోజు వారి వారి మతగ్రంధాన్ని తప్పని సరిగా చదువుతారు. ఆయా గ్రంధాలలోని విషయాలను వాళ్లు పాటిస్తున్నారా లేదా అనేది వేరేవిషయం. కనీసం స్మరించుకొంటున్నారు.

మరి హిందువులందరికీ ఒక ప్రామాణికమైన మతగ్రంధమేదైనా ఉందా? ఒక భగవద్గీత ను చెప్పుకోవచ్చా? అందులో నాకు బైబిల్ లో కనిపించినంత జీవితం కనిపించలేదు (నాలోపం అని మీరంటే నావద్ద సమాధానం లేదు). అసలు హిందుమతమనేదే లేదని అది ఒక విధానమనీ మరో వాదన. అలాంటప్పుడు మరి మతమార్పుడులని ఈ గోల లేమిటొ అర్ధం కాదు. అదొక విధానమైనప్పుడు, పాములోను, చెట్టులోను దేముడిని చూసేటంతటి విశాలత్వం తరతరాలుగా సంతరించుకొన్నప్పుడు, మరొక మతానికి చెందిన దేవుని- దేవునిగా స్వీకరిస్తే తప్పెందుకవుతాదో నాకెప్పటినుంచో ఉన్న సందేహం.
నా చాలా అనుమానాలకు మీ పోష్టు మాంచి సమాధానాలనిచ్చింది.
1. మతమార్పిడులను ఉధ్యోగమార్పుగా ఊహించుకోవచ్చు.
2. మతమార్పిడుల ను సామ్రాజ్యవాదం టెక్నిక్ గా అనుకోవక్కరలేదు.
3. గుళ్లలోకి రానివ్వకపోవటం (ఒకప్పుడు కులాన్ని బట్టి ఆంక్షలు ఇప్పుడు ఆర్ధిక/ఇతర కారణాలు) వలన ఈ మతపరమైన మార్పిడులను ప్రేరేపిస్తుందని భావించవచ్చు.
4. మతాన్ని మార్చుకొనే స్వేచ్చ ప్రతివక్కరి హక్కు.
5. ఈ మతమార్పిడులన్నీ హిందూ మతం నించే జరగడమనేది, హిందూ మతం యొక్క ఔన్నత్యం, విశాలత్వం అది ఇచ్చిన స్వేచ్చ. (చెట్టునుంచి రాయివరకూ ఎవరినైనా దేముడిగా కొలుచుకోవచ్చనే వ్యక్తి స్వేచ్చ). ఇతరమతాలనుంచి హిందుయిజం లోకి రాకపోవటానికి కారణం, ఆయా మతాల నిర్ధిష్ట, నియమాలు, వాటి నిరంతర పారాయణం కావొచ్చు.

నా అభిప్రాయాలను సరిదిద్దినట్లయితే మార్చుకోగలవాడను.

thanks alot mahesh for venting myself out.

బొల్లోజు బాబా

Sankar said...

బాగా చెప్పారు. ఇలా మతమార్పిడిని వ్యతిరేకించేవారంతా వడ్డున కూర్చుని నీతులు చెప్పేవారే. కానీ వరదలో కొట్టుకుపోయేవాడు ఏది ఊతంగా కనిపిస్తే దాన్ని ఆసరాగా చేసుకొని బతకాలనుకుంటాడే కానీ మూర్ఖంగా అక్కరకురాని ఆదర్శాలను పాటించలేడు. అసలు ఇన్నికబుర్లు చెప్పేవాళ్ళంతా ఆ కులాల్లో పుట్టి అలాంటి దయనీయ పరిస్ధితిలో ఉండి ఉంటే అందరికంటే ముందే మతం మారిపోతారు. అన్నీ సక్రమంగా జరిగినంతకాలం అంతా పచ్చగానే కనిపిస్తుంది పాపం. అసలు ప్రతిమనిషీ సమాజంలోని మిగతావాళ్ళకు ఇబ్బంది కలిగించకుండా ఉంటూ తనకి నచ్చినట్టుగా బతికితే చాలు..ఇలా అంతా మనలానే (మన మతంలోనే) ఉండాలని అనుకోవడం కూడా ఒకరకమైన సామ్రాజ్యవాదమే(ఇది వ్యక్తి స్వేచ్చకు వ్యతిరేకం).. ఇండియాలో ఉండగా క్రిష్టియానిటీని తక్కువగా చూసేవాళ్ళు కొందరూ వెస్ట్రన్ కన్ట్రీస్‍కి వెళ్ళగానే అదో గొప్ప మతంగా భావిస్తారు. దీనినే రాజకీయ భాషలో పచ్చి అవకాశవాదం అనొచ్చు... వేర్పాటువాదానికి మతమార్పిడులు ఎంతమాత్రం కారణం కాదు అని నా అభిప్రాయం. ఇది కేవలం రాజకీయక్రీడలో ఒక పావు మాత్రమే. మతం కాకపోతే భాష,అందులో మాండలీకాలు,కులం, ప్రాంతం, సంస్కృతి ఏదో ఒకటి బేస్ చేసుకొని ఈ వేర్పాటువాద రాజకీయాలు మనుగడ సాగుస్తూనే ఉంటాయి. ఇక్కడ కేవలం ’మన’ అన్న ఫీలింగ్ తీసుకురావడం ముఖ్యం అంతే.
బాబాగారూ, మీ లిస్ట్ చాలా అర్ధవంటంగా ఉంది.

venugeeta said...

mata marpidini oka job change to polchaaru
mari job change avvadam lo company enduku some rules pettindi ?? ( anta svecha unnappudu )

repu inkokaru ochchi ruchikaramaina vantakam tinnattu laantide mata marpidi ani article rastaru .. saripotundi

Anonymous said...

మతం మార్చుకోవటం personal అని ఒప్పుకుంటాను. ఎవరికి కావలసిన మతాన్ని వారు అవలంబించే అవకాశం మనకు ఉంది. కాని ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళడం, మత మార్పిడి ఒకే గాటన కట్టడం నాకు నచ్చలేదు. ఉద్యోగం విషయంలో ఒక మనిషి తన కష్టాన్ని డబ్బుగా మార్చుకుంటాడు కాని తన మతాన్ని, విశ్వాసాలను డబ్బుగా మార్చుకోడు. మన దేశంలో జరిగే అధిక మత మార్పిడులలో డబ్బుదే ప్రధాన పాత్ర. ప్రతి ఫలాపేక్ష లేకుండా కేవలం సేవా దృష్టితో పని చేసే సంస్థలు ఏ మతానికి చెందినవైనా వాటికి మద్దతు పలకటం అవసరం. కానీ మీరన్న విద్యాసంస్థలు కూడా ఎలాంటి నియమాలు పెడతాయో మీకు తెలియదా? మా ఊరిలో ఒక క్రైస్తవ పాఠశాలలో ఆడపిల్లలు బొట్టు, గాజులు, పూలు ధరించరాదనే నియమం ఉండేది. ఎందుకలా? మీరు చెప్పే సేవ చేయటానికి ఇవన్నీ అడ్డువస్తాయా?
ఇక చిన్న చిన్న ఊళ్ళలో వీరి మత ప్రచార సరళి ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను. ఒకసారి ఒకావిడ వచ్చి తన మత ప్రచారం మా వీధిలో ప్రారంభించింది. తన మతం గొప్పతనమేదో చెప్పుకోక ’మీ దేవుళ్ళు’ అంటూ దాడి ప్రారంభించింది. ఓ పెద్దాయన వచ్చి గద్దించేవరకు కొనసాగించింది. ఇది వైషమ్యాలను పెంచటం కాదా? ఇలా వైషమ్యాలు పెరిగి జనాలు బుర్రలు బద్ద్ధలు కొట్టుకుంటే వీరు కట్టుకట్టి సేవ చేస్తారన్నమాట. మనసులో దురుద్దేశాన్ని పెట్టుకుని చేసేది సేవేనా?
మరొక్కమాట, డాలరు నోటు మీద "IN GOD WE TRUST" అని ఉందేగానీ "IN JESUS WE TRUST" అనికాదు. నాకు సంబంధించినంతవరకూ అది డాలరైనా, రూపాయైనా, దినారైనా నా కష్టానికి ప్రతిఫలం. అంతే.

నాగన్న said...

ఉద్యోగం అన్నది ఒక్క రోజు లేకపోతే తల్లడిల్లవచ్చు, మతం అన్నది జీవితం నుండి పోతే నష్టం ఏమీ ఉండదు.

మతం మార్చడానికి, సామ్రాజ్యవాదానికి సంబంధం కానీ, సామ్రాజ్యవాదంలో లోపం కానీ నాకు కనపడడం లేదు. ఆచరణలో సామ్రాజ్యవాదం కన్నా సమాజవాదం (కమ్యూనిజం) నికృష్టం అని తేలింది.

ఉద్యోగం మారడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి లేకపోతే పాత కంపెనీకి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, మనం మంచిగా పనిచేసి ఉంటే మారుమాట్లాడక తీసుకుంటారు. మతం వల్ల పెద్దగా సాధించేది ఎమీ ఉండదు. కొంత కాలం తరువాత మతం మత్తు దిగిపోయి మళ్ళీ ఎక్కడ ఉన్నారో అక్కడికే వచ్చి పడతారు. ఈ కార్యక్రమం అంతా ముగిసేసరికి బాగా శక్తి ఖర్చవుతుంది, విలువైన జీవితం చెప్పుకోదగ్గంత ఆవిరై ఉంటుంది.

ప్రపంచంలో ఆధ్యాత్మిక హీరోలు ఎవ్వరూ తన మతాన్ని ఉన్నదున్నట్లు పాటించినట్లు గానీ వేరే మతానికి మారినట్లు గానీ దాఖలాలు లేవు. మచ్చుకు: బుద్ధుడు, మహావీరుడు, నానక్, ఆదిశంకరుడు, ఏసు, మహమ్మదు, సాయిబాబా ......

Anonymous said...

ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన వాళ్ళని, అవసరం లో ఉంది ఓ క్షణంలో వచ్చే డబ్బు కోసం మతం మారే వాళ్ళని పోల్చడంలో తప్పు లేదు. ఈ రెండు రకాల మనుషుల్లోనూ తప్పు లేదు, కాని వీళ్ళ బలహీనతలని మతం పేరుతొ exploit చెయ్యడం తప్పే. క్రిస్టియన్ మిషనరీల మీద కోపం వచ్చేది అందుకే. మతం మార్పిడి కూడా ఉద్యోగం మార్పిడి లాగ వ్యాపారం పేరుతొ చేస్తే ఆ పనిలో కొంచెం నిజాయితీ ఉంటుంది. కాని ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. కాబట్టి బాధ/కోపం రావడంలో తప్పేముంది?

నాకు తోచినంతలో ఈ రెండో సమస్య కి పరిష్కారం మొదటి సమస్య పరిష్కారం లాంటిదే. సమస్య ఉన్నది మొర్రో అని మొత్తుకుంటున్నా వాళ్ళమీద విరుచుకుపడితే ఎలా చెప్పండి?

మీరు గుళ్ళలో పూజలకి అయ్యే 'టికెట్ల' గురించి రాసారు, ఆ పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చిందో రాయలేదు. స్టేట్-స్పాన్సర్డ్ రెలిజియన్ స్టేటస్ హిందూ మతానికి పోయి కొన్ని వందల ఏళ్ళయ్యింది, క్రిస్తియనిటి కి అలాంటి కష్టాలు లేవు. మిషనరీస్ తో పోల్చితే మన మత సంస్థలు భికారులకింద లెక్క, ఎమోషనల్/కల్చరల్ కారణాలే ప్రస్తుతానికి వీళ్ళు ఇవ్వగలిగేది. మీ ఇంటెంట్ 'ఏడవడం మానేసి పరిస్తితి బాగు పడడానికి ఎమన్నా చెయ్యండి' అనా? మన చుట్టూ ఉన్నా దేశాల్ని చూస్తే ఇది అంత మంచి పని కాదనిపిస్తోంది.

Anonymous said...

ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన వాళ్ళని, అవసరం లో ఉంది ఓ క్షణంలో వచ్చే డబ్బు కోసం మతం మారే వాళ్ళని పోల్చడంలో తప్పు లేదు. ఈ రెండు రకాల మనుషుల్లోనూ తప్పు లేదు, కాని వీళ్ళ బలహీనతలని మతం పేరుతొ exploit చెయ్యడం తప్పే. క్రిస్టియన్ మిషనరీల మీద కోపం వచ్చేది అందుకే. మతం మార్పిడి కూడా ఉద్యోగం మార్పిడి లాగ వ్యాపారం పేరుతొ చేస్తే ఆ పనిలో కొంచెం నిజాయితీ ఉంటుంది. కాని ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. కాబట్టి బాధ/కోపం రావడంలో తప్పేముంది?

నాకు తోచినంతలో ఈ రెండో సమస్య కి పరిష్కారం మొదటి సమస్య పరిష్కారం లాంటిదే. సమస్య ఉన్నది మొర్రో అని మొత్తుకుంటున్నా వాళ్ళమీద విరుచుకుపడితే ఎలా చెప్పండి?

మీరు గుళ్ళలో పూజలకి అయ్యే 'టికెట్ల' గురించి రాసారు, ఆ పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చిందో రాయలేదు. స్టేట్-స్పాన్సర్డ్ రెలిజియన్ స్టేటస్ హిందూ మతానికి పోయి కొన్ని వందల ఏళ్ళయ్యింది, క్రిస్తియనిటి కి అలాంటి కష్టాలు లేవు. మిషనరీస్ తో పోల్చితే మన మత సంస్థలు భికారులకింద లెక్క, ఎమోషనల్/కల్చరల్ కారణాలే ప్రస్తుతానికి వీళ్ళు ఇవ్వగలిగేది. మీ ఇంటెంట్ 'ఏడవడం మానేసి పరిస్తితి బాగు పడడానికి ఎమన్నా చెయ్యండి' అనా? మన చుట్టూ ఉన్నా దేశాల్ని చూస్తే ఇది అంత మంచి పని కాదనిపిస్తోంది.

Sreelatha said...

Dear Mahesh Kumar,
Recently, RSS called for nationalization of the Christian Church in India which not only indulges in forcible conversion of Hindus, but also promotes anti-nationalism in the country. The leaders of the Christian community vehemently protested against the RSS' suggestion without providing any logical reason for doing so.

It is clear that the Christian Church in India does not want to sever ties with its foreign masters. In order to survive and consistently prey upon the heathen pagans the church establishment in the country must continue to receive a steady flow of cash and bigoted missionaries into India. And their foreign masters have no shortage in this regard.

The Christian missionaries in India know very well that they cannot persuade the Hindus and other pagans to convert by using logic alone. Therefore, they have set up an outfit in the country which cons the unsuspecting "heathens" and then robs them of their religion and way of life. In order to reap the "harvest of faith", these con artists practice forcible conversion and finance separatists movement in the country. It is no secret that the Church establishment in India is hand-in-glove with the naxalites and the communists who are anti-nationalists to the core. The Christian Church establishment in India is no less than a criminal outfit similar to Pakistan's ISI (Inter services Intelligence) or India's SIMI(Student Islamic Movement of India). Its members are trained for the sole purpose of converting the heathen pagans, i.e., Hindus, Buddhists, etc. via any means possible.

These Christian missionaries have perfected their con game over centuries. They came to India and setup hospitals, schools and universities in order to try to fool the people into believing that they are there for social welfare. After setting up their traps and firmly entrenching themselves these followers of the "true faith" act upon their real motives. They attempt to convert the uncivilized pagans in many ways: promise of jobs and money in return for conversion to the 'true faith', financing of the separatist movements in the country which will further divide the Hindus and make them more vulnerable, threatening and harming school children to force them to believe in Christ, calling public gatherings where Hindu Gods are demeaned and Christ is praised, promoting myths and superstitions in order to scare people into believing in Christ, and so on.

In Kothapara, Kerala, in the Idukki wildlife sanctuary, the forest department recently discovered a series of 14 crosses put up by the Christhuraj Church. The wildlife sanctuary was being used as a pilgrimage center by the Church. When the church trustees were confronted and told that they were breaking the law by trespassing and creating an imbalance in the eco-system they told the authorities that the Church has been using the forest as a pilgrimage center for over 50 years. This was a complete lie as the forest department authorities had proof that the crosses had only started to come up last year. In fact, in 1996 the forest department built walls around the sanctuary and there were no crosses present at that time. Furthermore, the Church never objected to the construction of the boundary walls. If the forest land was the Church's property then the trustees from the Church should have complained to the proper authorities about the construction. Father Mathew Pandyamakkal, a former parish priest of Christhuraj Church justifies the putting up of the crosses by saying that stretch were the crosses had been setup was rocky and therefore people visiting this area can in no way harm the forest and the wild life!

It is clear that the Church setup this pilgrimage center in a remote location, so that they may quietly conduct ceremonies to rob the heathen pagans of their religion and way of life. Preservation of the wildlife sanctuary is the least of their concerns.

A similar situation occurred in Nilackal when a Church attempted to construct a shrine after unearthing a stone cross from the forests close to the Sabarimala Hindu pilgrimage center. The Church claimed that the cross was installed by Apostle St. Thomas, but when the Kerala government wanted to send it for archaeological study the cross mysteriously vanished. It was later revealed that the cross had been planted to perpetuate the myth of the greatness of St. Thomas, so that the Hindus in the area could be converted with ease.

Other incidents which occurred earlier this year expose the disgustingly cruel behavior of the Christian missionaries towards Hindu and Buddhist children in India. In Assam, at the English medium Ashapalli High School it is mandatory for all students to attend church every day before classes begin. Even after following the bigoted ways of this missionary school, the Hindu and Buddhist children are ill-treated and physically abused by the Christian staff of the school.

Kalindi Rani Chakma was a class VIII Buddhist student of the school, therefore she was abused mentally and physically on a daily basis by her Christian teachers. One such revolting incident has put her future academic career in jeopardy.

One evening Kalindi Rani was called to the Principal, H. Lamare's residence due to alleged non-compliance of her daily routines. Once there Kalindi Rani was incessantly caned by Lamare. She begged for him to stop, but he continued to beat her because of his blind hatred for all Hindus and Buddhists. While he beat her he asked her, "Why don't you believe in Christ? What is the use of worshipping Buddha and Kali?"

As a result Kalidi Rani went into shock and suffered several painful bruises throughout her whole body. She did not attend school until the day after the incident. When she went back to school, once again, Lamare abused her-both verbally and physically. She is now terrified of attending school.

Lamare did not punish Kalindi Rani because she did not complete her daily tasks. He beat her like a mad man because she was a heathen pagan who did not worship Christ. He has been given the divine sanction to do so by the Church establishment in India. Like all Christians, he too was brainwashed to believe that followers of Christ are superior to the heathen pagans!

In another display of Christian barbarism, a nun belonging to the Missionaries of Charity in Calcutta, scalded four little Hindu girls with a hot knife.

Sister Francesca is the nun in charge of Missionaries of Charity's Mahatma Gandhi Welfare Center. A young girl named Kavery was playing inside the center with three other girls when the nun approached them and accused them of stealing money. The nun then heated a knife on an electric heater and pressed in on the hands of the four children.

When Kavery's father Kabiram heard about the incident he went to the Bowbazar police station to file a complaint, but the police refused to register a case until the local residents forced them to do so. The head of Missionaries of Charity, Sister Nirmala, said that as a disciplinary action she has asked the guilty nun to discontinue her duties and take rest for the time being! Is this a punishment or a reward for following the directions of their foreign masters?

India's much neglected north-eastern region is the hotbed of atrocities committed by Christians against the heathen pagans. Early this year the Indian Church of Christ in Assam was caught red-handed for forcibly converting at least 14 Hindus. Over a period of six months the missionaries belonging to this Church offered money, jobs and other economic benefits to these extremely poor Hindus if they adopted Christianity. These Hindus were threatened with dire consequences if they revealed to anyone the circumstances under which they had been converted. However, two brave individuals who had been forcibly converted came to the police and told them the details of how Christian priests had lured them to their residence with the promise of jobs and money. In return for this favor, the priests then asked these individuals to convert to Christianity.

The police have identified Father Jojy Vomen as the mastermind behind these forcible conversions. He had come to Assam from Bangalore in 1995.

The Christian Church establishment in India is also involved in anti-nationalist activities as it supports various separatist movements throughout the country. Over the past few years the news has trickled out that from Kerala to Tripura the Christian Church financially supports the naxals and other like-minded terrorist outfits in the country. Especially, in Tripura, the Church authorities threaten innocent Hindus with reprisals from the naxalites if they do not convert to Christianity.

Similar atrocities are repeated by these Christian missionaries on a daily basis throughout the country, hence the RSS hit the bulls eye when it proclaimed that the Christian Church should be nationalized and freed from the strongholds of its foreign masters. In its blind fit to proselytize the Church establishment in India has essentially become a criminal organization which enjoys financial support from sympathetic Christian nations around the globe. This establishment poses a great threat to the unity of India and it must be steered in the right direction or crushed if necessary before it gains too much power. Hindus have already let out of hand the monster of Islamic fundamentalism. They must not repeat the same mistake with the demon of Christian fundamentalism.

Ghanta Siva Rajesh said...

మీరెందుకొ సమస్యని పూర్తిగా చర్చించలెదు అనిపిస్తుంది. ఈకడ క్రిస్తవ మతం గఒపతనాని , హిందూ మతం చెడతనని మత్రమె వివరించరు.ఈ విదమైన మతమార్పులను ఒక ముస్లిం మెజారిటి దెశం లొ గాని,క్రిస్తవులు మజారిటి దెశం లొ గాని ఉహించ గలరా? ఆది హిందు మతం గొపతనం.
ఆప్గనిస్తన్ లొ ప్రజలు ఇంతకనా దరిద్రం లొ ఉన్నారు.అక్కడ యందుకు చుపించరు ఈ కరుణని. మీరు చెపారు జీతం యకువస్తె ఉదొగం మారతారు అని మరి ఒక సారి పెళి చెసుకున తరవత అంతకంతె మంచి అమ్మయి దొరికింది అని లెదా కట్నం యకువ తెస్తుంది అని వెరె పెళి చెసుకొవలా మీరు చెపె బీదవరు చెపండి

Anonymous said...

నేను Minneapolisలో ఉన్నప్పుడు అక్కడి పెద్ద చర్చిలో ఒక రోజంతా ఉన్నాను, అదీ నా పుట్టిన రోజు. ఆ రోజంతా నాకు వింతలమయమే. మనం భజన చేసినట్టుగానే వాళ్ళు కూడా ఏవో పాటలు పాడారు. నేను హిందువునని తెలుసుకొని అక్కడి ఫాదరనుకుంటా నా దగ్గరకు వచ్చి 'నువ్వు జీసస్‌ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నవు' అని ఒక క్లాసు పీకి, రొట్టె ముక్క, ద్రవ పదార్థం ఇచ్చాడు. ఆ ద్రవం వైన్‌ ఏమో అన్న అనుమానంతో ముట్టలేదు. తరువాత అక్కడికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎవాంజిలిస్ట్ వచ్చాడు. తను చేసి ఘనకార్యాలను ఏకరువుపెట్టాడు. పోయిన సంవత్సరం నైజీరియాలో పది లక్షల మందిని క్రైస్తవులుగా మార్చాడంట. ఒక్క ఇండియలో మాత్రం కష్టంగా ఉందని... కానీ వచ్చే సంవత్సరాలలో మొత్తం ఇండియానే జీసస్ రక్తంతో కడిగి శుద్ది చేసి అందర్నీ క్రైస్తవులుగా మార్చాలని ప్రతిజ్న చేసి అందర్నీ చేయించాడు. ఇంతకూ ఈయన బాధ ఏమిరా అంటే, జడ్జిమెంట్ డే (వినాశనం రోజు) తరువాత జీసన్‌ను అంగీకరించిన వారికి మాత్రమే స్వర్గంలో ప్రవేశమని, మిగతా వారికి నరకంలోనే ప్రస్థానమని చెప్పాడు. నరకంలో ఉంటే సైతాన్‌కు మంచి కాలక్షేపం కదా!! అలా కాక అందర్నీ స్వర్గానికి పంపించే ఏర్పాట్లు చేస్తే సైతాను ఒంటరి ఔతాడు కదా. ఇదీ వీళ్ళ బాధ. ఈ క్రమంలో ఇతర మత విశ్వాసాలను గౌరవించడం/గుర్తించడం మరచిపోయారు. తమది సదాశయమన్న భ్రమలో ఉన్నారు. సేవకు మతానికి ముడిపెట్టడమెందుకు? ఇదెట్లుందంటే...ఇంతకు ముందు ఒకరు చెప్పినట్లు వరదలో కొట్టుకుపొయ్యే వానికి... ఫలానా మతం అంగీకరిస్తేనే తాడు విసురుతా అన్నట్లు ఉంటుంది. వాడు అంగీకరించక చస్తాడా? గురుగోబింద్ సింగ్ అతని 600మంది అనుచరులు ప్రాణాలు తీసినా మతం మారలేదంట... అది అప్పుడు. మరి ఇప్పుడో... జ్నానం విజ్జ్నానం పెరిగింది మరి. ఎవరెంత వాదించినా...religion is biggest failure in history. మానవాళికి శాంతిని, సుఖాన్ని, ప్రేమను, ఆనందంను పంచలేని మతమెందుకు? అందుకే మహానుభావులు ఇలాంటి చట్రల్లో ఇరుక్కోకుండా, తపస్సు చేసి నిజమైన జ్నానంను సంపాదించారు. అవతార మూర్తులుగా కీర్తించబడ్డారు. మనమేమో వాళ్ళ పెర్లు చెప్పుకొని కొట్టుకొని ఛస్తున్నాం.

RSG said...

@ naveen
"ఇంతకూ ఈయన బాధ ఏమిరా అంటే, జడ్జిమెంట్ డే (వినాశనం రోజు) తరువాత జీసన్‌ను అంగీకరించిన వారికి మాత్రమే స్వర్గంలో ప్రవేశమని, మిగతా వారికి నరకంలోనే ప్రస్థానమని చెప్పాడు. నరకంలో ఉంటే సైతాన్‌కు మంచి కాలక్షేపం కదా"

I would love to meet Satan :)

కత్తి మహేష్ కుమార్ said...

@పూర్ణిమ;ధన్యవాదాలు.హిందూ మతంలో ఛాంధసులున్నట్లే,క్రైస్తవంలోనూ మూఢులుంటారు. కాబట్టి అలాంటివారు ఎదురుపడినప్పుడు మీకు వాళ్ళు అతిచేసినట్లు అనిపిస్తుంది. ఇక "వాళ్ళే ఎక్కువ" అనే భావనుంది చూశావూ,అది ప్రతి మతంలో ఉండేదే. ఇప్పుడు మతమార్పిడిమీద ఒంటికాలిమీద లేస్తున్న హిందువులలోని భావన ఇదేకదా?

@బడుగు గారూ; దన్యవాదాలు.నా ఉద్దేశంకూడా అదే గౌరవంగా బ్రతకడం ముఖ్యం దానికి తోడ్పడే ఏ నమ్మకమైనా నాకు ఆమోదయోగ్యమే.

@బుజ్జిగారూ: మీరు చెప్పేదెలాఉందంటే, జాబ్ ట్రైనింగ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళిచ్చి "వెళ్ళుబాబూ నీకు నచ్చినచోట ఉద్యోగం చేసుకో, అది యాపిల్ కంపెనీలో అయినా ఫరవాలేదు" అన్నట్లుంది. క్రైస్తవమత ప్రచారంలో సేవ ఒక భాగం. అది చేస్తూవారిని నమ్మినవార్ని తమలో కలుపుకుంటారు.

ఇక ద్వేషం సంగతంటారా,ఏమీ చెయ్యని పాతమతాన్ని చిన్నచూపుచూసే హక్కు ప్రతి ఒక్కరిదీ. మతం మానవ ప్రగతికేగానీ వైషమ్యానికో,వివక్షకోకాదు కదా? పాత మతం అదే చేసిందని మనస్ఫూర్తిగా నమ్మి నిందించేవాళ్ళు కొందరైతే, మరి కొందరు "కొత్తొక వింత, పాతొక రోత" అనుకుని హిందూమతాన్ని నిందిస్తారు. అది కూడా వ్యక్తిగత హక్కండోయ్! మనది సెక్యులర్ డెమోక్రసీ కదా.

@బొల్లోజు బాబాగారూ: ఇలా మన భావాలూ,ఆలోచనలూ కోఇన్సైడ్ కావడం ఆశ్చర్యంకన్నా, ఆనందాన్నిచ్చింది.ఇక మీ అన్నిపాయింట్లతోనూ నేను అంగీకరిస్తాను, వాటితో విభేధించి తార్కికంగా తెలియజెప్పగలిగితే నేనూ నా అభిప్రాయాల్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.

@శంకర్ గారూ: మీతో నేను ఏకీభవిస్తున్నాను.అవసరానికి అఖ్ఖరకురాని మతం,కులం,సమాజం అవసరమా? అందుకే ఈ మార్పులు.అదే చైతన్యం.

@వేణు గీత: ఉద్యోగమిచ్చే సంస్థకూ మతం రెండూ ఒకటే.రెంటికీ కొన్ని నమ్మకాలూ,అభిప్రాయాలూ,విధివిధానాలూ, వర్క్ కల్చర్ ఉంటాయి.కాకపోతే సంస్థలో మనం ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తాముకాబట్టి, కొన్ని రూల్స్ కి నిబద్ధులై ఉండాలి. ఇక్కడ అలాకాదు కదా! అంతెందుకు, మతం మనిషికి జీవమివ్వకపోగా వ్యక్తినుంచీ డబ్బూ,సేవలూ ఆశిస్తున్నప్పుడు ఆ సంస్థ/మతాన్ని వదులుకుంటేమాత్రం తప్పేంటి?

@రాజ్ ‘కెనడా’ గారూ; మీ బాధను అర్థం చేసుకోగలను.విదేశాలకువెళ్ళినవారు కెవలం కష్టాన్ని డబ్బుగా మార్చుకోవటం లేదు. కొంత తమ నమ్మకాల్నీ,జీవనశైలినీ,అభిప్రాయాల్నీ,విలువలనీ అన్నింటినీ ఫణంగా పెట్టే డబ్బుగడిస్తున్నారు. కాస్త ఆత్మపరిశీలన చేస్తే తెలిసే విషయాలే. కాకపోతే అంగీకరించడమే కష్టం.
ఇక క్రైస్తవ మిషనరీ స్కూళ్ళ రూల్సంటారా..మీరు పనిచేసే కంపెనీలో "మా సంస్కృతి ఇదే" అని పంచె,లాల్చీ వేసుకొనివెళ్ళగలరా? ఇదీ అంతే when you are in Rome,be like a Roman". దీనికి ఇంత ఆక్రోశం వసరమా? అయినా మీరు ఎప్పుడైనా వేద పాఠశాలకెళ్ళారా! అక్కడ నామాలు పెట్టుకుని,పిలకని సవరించుకుంటూ చిన్నచిన్న పిల్లలు కనబడతారు. నిజ జీవితంలో హిందువులైనా అట్లా ఉంటారా? మరి అక్కడ రాని బాధ క్రైస్తవులు బొట్టూ,పూలూ పెట్టుకుని రాకంటే వస్తుందా? అయినా ఇలాంటివాటిని అరికట్టడానికి చట్టం ఉంది.దాని ఆసరా తీసుకుందాం. అంతే తప్ప మతమార్పిడిని తప్పు అని వ్యక్తి స్వేచ్చని అరికట్టడం ఎంతవరకూ సమంజసం?

ఇక మీరు అమాయకంగా అన్నారో లేక నాకు తెలియదని చెప్పారోగానీ, In Gad we trust, అంటారేగానీ ‘In Jesus we trust' అని డాలర్ మీద ఉండదని మహబాగా శెలవిచ్చారు. మీకు తెలియనిది కాదు God with capital 'G' is always Jesus అని మీకు తెలీదా. సరే ఒక్క క్షణం మీరే సరి అనుకుందాం. మనమూ మన దేవుడ్ని సరదాగా "అల్లా" అని పిలుద్దామా? అల్లా అంటే దేవుడనే అర్థం. లేదూ,'Lord Vishnu' బదులు 'God Vishnu'అని ప్రేమగా పిలుచుకుందామా?

ఒక్క విషయం చెప్పనా, ఈ అధినిక యుగంలో "పైసా మే హై పరమాత్మా" అంతే. అందుకే డబ్బుకోసం ఉద్యొగం మారినట్లే డబ్బుకోసం మతం మారడం తప్పుకాదంటున్నాను.

@నాగన్నగారూ: నా టపాకన్నా మించిన సైద్దాంతిక,ఆధ్యాతిమ కోణాన్ని మీరు తెలిపారు. నా ధన్యవాదాలు.

@కౌశిక్ &ఆలోచన: మీ బాధ క్రైస్తవుల "exploitation" అయితే నిజానికి మీకోపం హిందూమతం మీద ఉండాలి. ఎందుకంటే, ప్రతిసేవకూ డబ్బులుగుంజే మన మతంలోని exploitation కంటే ఎక్కువుందా క్రైస్తవంలో. అంతెందుకు మతమార్పిడికి వ్యతిరేకంగా ఉద్యమించే అందరూ ఆర్థికంగా లాభం చుపి మతమార్పిడి చేస్తున్నారంటున్నారే...! అంటే దానికీ లాభం తప్ప exploitation (శోషణ) ఎక్కడినుంచీ వచ్చింది?

మీరు చెప్పిన "స్టేట్-స్పాన్సర్డ్ రెలిజియన్ స్టేటస్ హిందూ మతానికి పోయి కొన్ని వందల ఏళ్ళయ్యింది" సరే కానీ స్టేట్ కంట్రోల్ ఇంకా ఉందికదా! మన ప్రభుత్వంలో ‘దేవాదాయ శాఖ’ ఇప్పటికీ ఉంది. ప్రతి దేవస్థానానికీ ఒక అధికారిక బోర్డు,అదీ ప్రభుత్వ ఆమోదితమైన బోర్డు ఉంది. మరి స్టేట్- మతం నుంచీ ఎక్కడ విడిపడిందో చెప్పగలరా? అంటే,అటు స్టేట్ ఇటు మతం జంటగా భక్తుల్ని శోషితుడిగా చేస్తోందన్నమాట. మరి హిందూమతం శోషితమతమా క్రైస్తవమా?

@శ్రీలత: మీరు "RSS" అనగానే మీరు చెప్పిన విషయాల క్రెడిబిలిటీ నాకు సందేహాస్పదం అయ్యింది. అదొక మతమఢ సంస్థ అని నా అభిప్రాయం.

నా అభిప్రాయాల్ని పక్కనపెట్టినా, మధ్యప్రదేశ్ (ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను), ఝార్ఖండ్,ఒరిస్సాలోని ఆదివాసీలను "బలవంతంగా" హిందూ మతంవైపు మరలిస్తూ,తాము మతానికీ,భరతజాతికీ,హిందూ భవితకూ చాలా గొప్పదైన సంఘసంస్కరణా,సేవా చేస్తున్నామని చెప్పుకునే వీరికి, మతమార్పిడి గురించి క్రైస్తవులమీద దాడిచేసే అధికారంగానీ,హక్కుగానీ ఉందని నేననుకోను.

"చెప్పేవి శ్రీరంగనీతులూ, దూరేవి దొమ్మరి గుడిసెలు" అన్నట్లుంటుంది వీరి ప్రవర్తన. నా ఉద్దేశంలో ముస్లింల SIMI = RSS. వీరు క్త్రైస్తవాన్ని ఆ గాటనకట్టడం వారి insecurity ని తెలుపుతుందేతప్ప మరోటి కాదు.

RSS మతం పేరుతో చేసిన దురంతాలు భారతదేశం మొత్తం తెలుసు. కాబట్టి, వాటిని ఏకరు పెట్టడం ఇక్కడ అనవసరం అని నేను భావిస్తాను. చంపడం, నిప్పెట్టడం,మానభంగం చెయ్యడం ఇవన్నీ వీరి ప్రతిఘటనలో భాగమై,చట్టానికి అతీతంగా తయారయ్యిన RSS,VHP ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే హిందువులకు అంత గౌరవం అనుకుంటాను.

@శివరాజ్ గారూ: నేను చర్చించింది ఒక్క విషయమే,మతమార్పిడిని గోరంతలు కొండంతలు చేసి వైషమ్యాలు రెచ్చగొట్టడం అనవసరం. అది మంచి భవిష్యత్తుకోసం ఉద్యోగం మారడంతో సమానం. అని మాత్రమే.నేను క్రైస్తవాన్ని గొప్పనో హిందూ మతాన్ని చెడ్డదనో చెప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొందరు క్రైస్తవం వైపు మొగ్గుచూపితే అందులో తప్పులేదంటున్నాను. అంతేకాక దీనితో హిందు మతానికేదో పెద్ద అన్యాయం జరిగిపోతున్నట్లు, పోలేరమ్మ జాతర చెయ్యడం అనవసరమంటున్నాను. అంతే. ఈ కారణంగా క్రైస్తవంపట్ల ద్వేషం అనవసరం అని నా నమ్మకం.

@నవీన్: మీ అనుభవం నిజమే, నా జీవితంలోనూ ఇలాంటి అనుభవాల్ని ఎరుగుదును. వారు చేసే మతప్రచారం అలాంటిదే,అంత మాత్రానా నేను వారిపట్ల ద్వేషం పెంచుకోవాలా. నాకు వారి మతాన్ని "కాదు" అనే అధికారం ఎప్పుడూ ఉంది.కాబట్టి,కావాలని మతం మారినవారినో,లేక మతం మార్చినవారిగురించో అవాకులూచవాకులూ పేలి, మన మతమేదో పెద్ద ఊడబొడిచిందని ఢంభాలు పలకడం అనవసరం అని మాత్రమే నా ఉద్దేశం.

@RSG : నేను in general మతం గురించి అనుకునేవాటి దృష్ట్యా నేను కూడా నరకానికి-Hell కే పోతాను. కాబట్టి నాకూ సైతానుకీ దోస్తీ కావాలి....I would love to meet him as well.

పెదరాయ్డు said...

మీరు మళ్ళీ మొదటికొచ్చారు...ఉద్యోగానికి, మత మార్పిడికి ఎలా లంకె పెడతారు. డబ్బు సంపాదించటానికి ఎన్నో మార్గాలున్నాయి. దొంగలు కూడా డబ్బు కోసమే ఆ పని చేస్తారు...మరి వారినెందుకు సమాజం గౌరవించటం లేదు. అమెరికాకు వెళితే డబ్బులేమీ ఊరకే వచ్చేయవు. మనం తగినంత శ్రమ పడాలి. కాని మత మార్పిడుల విషయంలో అలా జరుగదు అది అవసరాన్ని వాడుకునే అయాచిత దానం. ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు. వారి పుణ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. సేవ చేయటం, సేవించమని చెప్పటం ఆ మతం ఇతర మతాలవలే చెప్పినా దానికి వెలకట్టి(వెల ఇచ్చి) తమవైపుకు తిప్పుకోవటం ఎంతవరకూ న్యాయం.

?? ఆర్థిక లాభాలుచూపి హిందువుల్ని క్రైస్తవులు మతమార్పిడి చేస్తున్నారని. అంత బాధ నిజంగా ఎందుకో నాకైతే అర్థం కాని విషయం.

>> ఎందుకు అర్థం కాదు? మతం అనేది ఒక జీవన విధానం. అది గొప్పదైతే ప్రజలే వాటిని అనుసరిస్తారు. అవసరంలో వున్న ప్రజలకు ఆర్థిక సహాయం చేసి ఆ మతం లో చేరమనటం దిగజారుడుతనం కాదా? ఇక్కడ మతం మారుతున్నవారిని తప్పు పట్టలేం. ప్రలోభాలను చూపించి చేరదీసిన మతం ఎన్నటికీ గొప్ప కాజాలదు. అభాగ్యులు ప్రతి మతంలోను ప్రతి దేశంలోను వుంటారు...వారిని ప్రలోభపెట్టి తిప్పుకోవటం (అది ఎవరైనా) ఎంతవరకూ సమంజసం.

?? అంతెందుకు, పరుపుకూడా దిగలేని పేషెంట్ మలాన్నీ, వాంతినీ కడిగే వీరి సేవలోని సిన్సియారిటీనా ప్రశ్నించేది. బస్తీమే సవాల్...! ఎంత మంది తలెత్తుకుని హిందువులమని చెప్పుకునేవారిలో ఉంది ఈ దయ, జాలి, కరుణ, సేవాతత్పరత?

>> మీకెవరు చెప్పారు మనమీపనులు చేయటం లేదని. మనకున్న ఆర్థిక పరిస్తితులలో ఎన్నో సంస్థలు ఇంతకంటే బాగానే సేవ చేస్తున్నాయి. కాకపోతే వీళ్ళు ప్రచారం చేయరు.

?? గుడికెళితే టెంకాయకొట్టడానికి టికెట్టడిగే ‘నా’ హిందూమతంకన్నా, దేవుడికి క్యాండిల్ వెలిగించాలనే కోరిక తెలిపితేచాలు, క్యాండిల్ కూడా వారే సమకూర్చే సంస్కృతి కలిగిన క్రైస్తవ మతమా సంస్కృతికి వ్యతిరేకం?

>> ఇది కేవలం ఆర్థిక పరిస్తితుల తేడా మాత్రమే. అందుకని దీన్ని నేను పూర్థిగా సమర్థించను. కొన్ని గుడులలలో నిర్భంద వసూళ్ళున్నాయి. అందుకని మొత్తం సంస్కృతిని తెగనాడవలసిన అవసరం లేదు. అంతేకాదు మన రాజకీయ నాయకుల దురాశ కూడా. చాలా గుళ్ళలో పూజారుల ఆర్థిక పరిస్తితి గమనించండి. వారికి అక్కడ వచ్చే కానుకలే జీవనాధారం. ఆర్థికంగా మనం బలపడిన రోజు ఇవి తెరమరుగవుతాయి. ఎన్నొ గుడులలో ఇప్పటికీ హుండీలుండవు. ప్రతి గుడిలోనూ ఉచితంగా దర్శనం లభిస్తుంది. ఉచిత అన్నదానాలున్నాయి. పేదలకు అనేకవిధాలుగా సహాయం చేస్తున్నారు.

??మతమార్పిడంటే నావరకూ, just a job change అంతే!

>> ఈ సంస్కృతి పట్ల ఇంత ఏహ్య భావంతో వున్న మీరు, just change మతమెందుకు మారలేదు?

?? అమెరికా వెళ్ళి డాలర్లకోసం పాటుబడే మిత్రుడికి ఎంతగౌరవమిస్తామో, మతం మారిన హిందువుకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి.

>> నాకు తెలిసి ఇద్దరికీ ఆర్థికంగా గౌరవముంటుంది. ఇతరత్రా వారి ప్రవర్తన బట్టి నిర్ణయించబడుతుంది.

కత్తి మహేష్ కుమార్ said...

@పెదరాయ్డు; నేను మళ్ళీమొదటికిరాలేదు. నేనెక్కడున్నానో అక్కడే ఉన్నాను.నేను చెప్పిన ఉదాహరణ ‘ఉద్యోగం మారడం’ గురించి, ఉద్యోగం చెయ్యడం గురించి కాదు. అయినా,"న్యాయాన్యాయాలు మతంమార్చినవాళ్ళనూ,మారినవాళ్ళనూ అడిగే అధికారం మనకెక్కడిది?" అనేదే నా పాయింటు. వాళ్ళుచేసేదివాళ్ళిష్టం, సత్తా ఉంటే, శంకరాచార్యుడిలాగా మన మతాన్ని సంస్కరించుకుని వెళ్ళినవాళ్ళని వెనక్కు రప్పించుకోవాలిగానీ అక్కసు వెళ్ళగక్కి వైషమ్యాల్ని రెచ్చగొట్టితే ఎలాగా?

అమెరికా వెళ్ళి ఎందుకు కష్టపడటం? ఎందుకంటే, అక్కడైతే కొన్ని ఎక్కువడబ్బులొస్తాయి కాబట్టి. ఆ పోలికే ఇక్కడానూ.కాకపోతే ఈ పోలిక ఇక్కడితో ఆగిపోతుందంతే. ప్రస్తుతం ఉన్న మతంవలన తమజీవితాలో ఏ "లాభం" లేదుగనక, వేరే మతంలో చేరుతున్నారు. అంతే.దాన్నేదో అన్యాయమన్నట్లు వాపోతేనే సమస్య అంటున్నాను.

అయినా ఆ మతంలోని గొప్ప చూసి చాలా మంది చేరట్లేదు.కేవలం జీవితాలు బాగుపడతాయని చేరుతున్నారు. మన మతం వలన వారి జీవితాలు బాగుపడలేదని చేరుతున్నారు. కాబట్టి ఇక్కడ మతం యొక్క గొప్పతనం ఎవరి సమస్యా కాదు.

"కొన్ని గుడులా !" అసలు టికెట్టులేని గుడెక్కడైనా ఉందా మన భారద్దేశంలో?

ఉచిత దర్శనం సంగతి సరే..మరి స్పెషన్ దర్శనం సంగతో?

గుళ్ళుకొన్ని కోట్లు సంపాదిస్తున్నా ఇంకా అర్థికంగా బలపడటమేమిటో కాస్త చెబుతారా?

పూజార్ల ఆర్థిక స్థితికి, గుడి యాజమాన్యం, ప్రభుత్వ విధానం కారణం. వీటన్నింటినీ సంస్కరించడానికి మనం పూనుకోముగానీ...క్రైస్తవ మతమార్పిడిని మాత్రం ఆపడానికి మన నోరెందుకు లేస్తుంది? ఎందుకంటే, వారు ప్రతి హింస సాధారణంగా చెయ్యరు గనక.

మన గుడి ధర్మకర్తత్వం గురించి మాట్లాడితే, ప్రభుత్వం బొక్కలో తోసి అణగదొక్కుతుంది గనక. అందుకే మనది double standards అంటున్నాను.

నాకింతవరకూ క్రైస్తవం నుంచీ మంచి lucrative offer రాలేదు. అందుకే మతం మాతలేదు.అంతే తప్ప, హిందూ మతం వలన నాకొచ్చిన లాభమైతే ఇప్పటివరకూ ఏమీలేదు. నాకు ఒక రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇప్పించి సౌత్ ఇండియన్ చర్చ్ లో శక్తివంతమైన పోస్టులో కూర్చోబెడతామంటే, ఇప్పుడే నేను రెడీ!నాకలాంటి భేజషాలు లేవు. మతం మార్పిడిపైన ఆంక్షలూ లేవు. ఇక మూల సమస్యేంటంటే నాకు ఏ దేవుడి మీదా నమ్మకం లేదు. దాన్ని భరిస్తారంటే, నేను క్రైస్తవంలోకి ఇప్పుడే జంపడానికి తయార్.

మరి ప్రవర్తనపై ఆధారపడి గౌరవించే మీరు మతం మారినంత మాత్రానా ఒకర్ని అవమానించాలని లేదు కదా! అదే నేనూ చెప్పింది.

మీనాక్షి said...

చాలా మంది క్రైస్తవులుగా మారడం చూసాను.ఎందుకు మారారు అంటే దాని వెనుక గల కారణాలు చాలా ఉన్నాయి.కొంత మంది ఏసు ప్రభువు తమ ఆరోగ్యాన్ని బాగు చేసాడు అని చెప్పగా విన్నాను.కొంతమంది ఆ మతం నచ్చి తీసుకున్నారు.క్రిస్టియన్ మైనారిటి కాలేజ్ లో సీట్ కోసం మత మార్పిడి చేసుకున్నావాళ్ళని చూసాను.చాలా క్రిస్టియన్ కాలేజ్ లలో మానేజ్మెంట్ సీట్స్ ఇచ్చేప్పుడు ముందుగా క్రిస్టియన్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
క్రైస్తవ మిషనరీలు సేవ చేస్తున్నాయి.నేను ఒప్పుకుంటాను.కాని తమ మతాన్ని స్వీకరించిన వారికి డబ్బు కూడా ఇస్తున్నాయిఇది నేను మా ఫ్రెండ్ చెప్తె విన్నాను.ఇది నిజం కూడా.అలా డబ్బుని చూపి తమ మతాన్ని స్వీకరించేలా చేయడం ఎందుకని నా ప్రష్న.నవీన్ గారు అన్నట్టు
జీసస్ను అంగీకరించిన వారికే స్వర్గ ప్రాప్తి,లేకపోతే నరకమే గతి అని చెప్పడం ఎందుకు..?అది తమ మత ప్రాచారం కాదంటారా..?
ఇక మత మార్పిడి అంటారా అది ఎవరి ఇష్టం వారిది.అలా మత ప్రచారం తప్పు అని నేను అనను.ఎందుకంటె వాళ్ల మతాన్ని స్వీకరించడం ,లేకపోవడం పూర్తిగా మనిష్టం.

పెదరాయ్డు said...

మహేష్ గారూ, మతం మారటం తప్పని నేనూ అనటం లేదు. అది వాళ్ళిష్టం.
కానీ ప్రలోభాలు చూపించి ఆ పని ఎవరు చేసినా తప్పే. వైఎస్ లాగా బాబు తిన్నాడు కాబట్టి నేను తింటే తప్పొచిందా అన్నట్లుంది మీ వాదన. అంతేకాదు మీరు మీ వాదాన్ని సమర్థించే ప్రయత్నంలో ఒక మత విధానాలను అవసరానికి మించి చులకన చేసారు.

అసలు టికెట్టులేని గుడెక్కడైనా ఉందా మన భారద్దేశంలో? అని మీరంటుంటే నాకు ఆశ్చర్యంగా వుంది. చాలా వున్నయి. మీరు కావాలంటే చూపించగలను. విరాళాలు స్వీకరించని మతమేదైనా వుందా ప్రపంచంలో? టికెట్టు దానికి ఒక పద్దతి మాత్రమే. మీకు లానే వాళ్ళకు కూడా జీవనానికి డబ్బు కావాలి. కొన్ని గుళ్ళు మాత్రమే కోట్లు అందుకోగలుగుతున్నాయి(సంపాదించటం లేదు).

ఒక వ్యాఖ్యాత "చాలా మంది క్రైస్తవులుగా మారడం చూసాను.ఎందుకు మారారు అంటే దాని వెనుక గల కారణాలు చాలా ఉన్నాయి.కొంత మంది ఏసు ప్రభువు తమ ఆరోగ్యాన్ని బాగు చేసాడు అని చెప్పగా విన్నాను.కొంతమంది ఆ మతం నచ్చి తీసుకున్నారు" అన్నారు. ఇవి సహేతుకమే.

కానీ డబ్బే ప్రధానంగా మత మార్పిడులు జరగడం వారికి కూడా మంచిది కాదు.

నాకు ఒక రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇప్పించి సౌత్ ఇండియన్ చర్చ్ లో శక్తివంతమైన పోస్టులో కూర్చోబెడతామంటే, ఇప్పుడే నేను రెడీ! - ఆ పోస్టులో వున్నపుడు మీరు దేవుడిని నమ్మకపోయినా, ఇతరులను నమ్మించవలసి వస్తుంది, అది ఆ పోస్టు యొక్క కర్థవ్యం.

వాదన కోసం మీరీవిధంగా చెప్పినా మీరాపని చేయలేరు. మీ టపాలు చదివిన వ్యక్తిగా నాకామాత్రం నమ్మకముంది. కావాలంటే ప్రయత్నించండి. అంతెందుకు "ఇక మూల సమస్యేంటంటే నాకు ఏ దేవుడి మీదా నమ్మకం లేదు. దాన్ని భరిస్తారంటే, నేను క్రైస్తవంలోకి ఇప్పుడే జంపడానికి తయార్" అని మీరే ఒక మెలిక పెట్టారు...నిజంగా మీరు డబ్బు కోసం మారగలిగితే వారు డబ్బులిచ్చి మీకు దేవుడిమీద నమ్మకం కలిగించగలరు.

వేణూ శ్రీకాంత్ said...

మహేష్ పైన చాలా మంది చెప్పినట్లు డబ్బు కోసం మెరుగైన జీవితం కోసం మతం మారుతున్నందుకు బడుగు వర్గాల వారిని తప్పు పట్ట లేము కానీ కేవలం డబ్బాశ చూపించి మా మతం లోకి మారండి అని చెప్పే మిషనరీలని మాత్రం సమర్ధించలేం.

veera swamy said...

hi Mahech, i can not accept a single line of discussion.
1)you are saying christians are serving patients, can you please let me know are they are not hindus before converting to christianity,or all the nurses are foreign christians.
2)you are saying there is not a single temple with out accepting the donations. have you ever visited a temple which is not under governments control.please note that for any relegion society to make service funds are needed. in some relegions they will come as voluntery donations. is there any temple fprcible asked you for the donation. charges for pujas and special darsans allow the temple to become self sustained and not to depend on other donations like christian machinaries. Just rememeber some body will threw his own money as donation only when he feel it is worthless or he got it free.

3)do you really know any thing about RSS idealogy. RSS never says another relegion is bad, but it just says hindu relegion is great with great way of living.

బొల్లోజు బాబా said...

ఉద్యోగాన్ని ఒక ప్రభువు వద్ద కొలువు అనుకొంటే మతం మార్చుకోవటం కూడా ఉద్యోగం మార్చుకొన్నట్లేగా?
బొల్లోజు బాబా

Uday said...

Mahesh gaaru,

Meru cheppedi poorthigaa materialistic ( materialism tappa oppa annadi nenu charchincha dalachu koledu) . Udyogam, dabbu, tindi, batta ive kaakunda inka mukyamainavi chalane vunnai. adi choosevaari drusti ni batti vuntundi. Ippudu samajam lo choostunnade hindu matam anukunte ela . Every religion will have its own cycles. meeru cheptunna, ento seva tatparata kaligina churches ento maarana homam shruntinchleda? prati matam lonu tappoppulu vuntai. migata mataallo loga strict rules and regulations lekunda, vyakti swechchaku, ekuvaga importnace ivvatam valana, Hindu mataniki various iterpretations and faces vachchayani naa nammakam. Migata mata grandhala gurinchi naaku teleedu kaani, Bhagvatgita is rich of life. It all depends your capability to understand and interpret. Mana annadanlto emaina tappulu vunte, daanni sarididdukuni munduku povaali kaani, daanni dump chesi munduku povatanni Emantaaru? Chala mandi drustilo. Oka desaniki manam entha loyality choopistamo ade loyality mataniki kooda choopistam ( I am not going in to the matter what if there is any conflict between the two) . So, mana matam pai vere matam nundi daadulu garutunnapudu ( mata marpidi annadi daadi kaaka mari inkemiti ? ), mana mattanni rakshinchukovatam evaridaina kaneesa bhadyata. annai matalakante mamatame goppa ane bhavam entha varaku samnjasam? Hindu mataniki vunna paramata sahanam anna manchi lakshnam valane Christianism India loki adugupettindi anna vishayam convenient gaa marchi potunnatlunnare?

చైతన్య క్రిష్ణ పాటూరు said...

మహేష్ గారు,

తమ బ్రతుకు బాగు పడుతుందని మతం మారుతున్న వారిని మనం తప్పుపట్టక్కర్లేదన్నారు. అవును. ఎంత మాత్రం లేదు. వారికి మీరన్నట్టు మతం కంటే జీవనమే ముఖ్యం. మీ వ్యాసం మొదటి పేరాలు చదువుతున్నప్పుడు మతం మారేవారిని సమర్ధిస్తున్నారనుకున్నా. కానీ క్రిందకెల్తే మతం మార్చేవారిని కూడా సమర్ధిస్తున్నట్లుంది.

రోగులకు సేవ చెయ్యటంలో క్రైస్తవ నర్సులకు ఎవరు సాటిరారని తేల్చారు. ఈ విషయంలో హిందూ నర్సులు ఏవిధంగా తక్కువో చెప్పగలరా. వాళ్ళు మాత్రం మలమూత్రాదులు ఎత్తటం లేదా. అదేదో క్రైస్తవ నర్సులకొక్కరికే వున్న లక్షణమన్నట్టు, అది వారికి వారి మతం వలనే వచ్చినట్టు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కేరళ నుంచి ట్రైనింగ్ అయ్యి మన రాష్ట్రాలలో పని చేసే నర్సులలో ఎంతో మంది హిందువులూ వున్నారు. వాళ్ళందరూ సరైన సేవ చెయ్యట్లేదా. సాయిబాబా హస్పటల్ లోనేకాదు, కాస్త సొఫెస్టికేటెడ్ హస్పటల్స్ అన్నింటిలోనూ, దాదాపు కేరళ నర్సులు, అందునా క్రైస్తవ నర్సులే వుంటారు. అందుకు కారణం వారి మతం జాలీ, దయ తెగ బోధించేసింది కాబట్టి, వారికి సేవాగుణం ఎక్కువుంటుందని కాదు. వారు అత్యాధునిక నర్సింగ్ పద్ధతులలో ట్రైయిన్ అయ్యి వుంటారు కాబట్టి, ఈ దేశంలో ఆధునికమైన మెడికల్ సౌకర్యాలు మిషనరీస్ చేతుల్లో వున్నాయి కాబట్టి, వారి నర్సింగ్ స్కూల్స్ నుంచి వచ్చిన వారు లేటెస్ట్ పద్ధతులు తెలుసుకునుంటారు కాబట్టి. రోగులకు సేవ విషయంలో వారు ఎక్కువ కనపడటానికి వారికున్న టెక్నికల్ అడ్వాటేజే కాని, వారి సేవాతత్పరతకు ఇంకెవ్వరూ సాటి రారని కాదు. నేను వారి సేవా భావాన్ని తక్కువ చెయ్యట్లేదు, కాని మిగతా మతాలనుంచి వచ్చి అదే పని చేస్తున్న వారి కన్నా వారు ఏ విధంగా వేరు అని నా అనుమానం.

ఎంతమంది హిందువులకు ఈ రకమైన సేవాతత్పరత వున్నాయన్నారు. ఎంతమంది క్రైస్తవులమని చెప్పుకునే వారికి మాత్రం వున్నాయి ఇవి. వారి మతం నర్సులు చేసే సేవ వారి మత ప్రచారానికి సమర్థింపు అవుతుందా. హిందువుల్లో ఎంతమంది సేవాకేంద్రాలు నడపటం లేదు. కానీ వారు తమది హిందూ సంస్థ అని చెప్పుకోరు. ఎందుకంటే వారికి చేసిన సహాయాన్ని తమ మత ప్రచారానికి వాడుకోవాలన్న ఆలోచన లేదు కాబట్టి. వారి సేవా వ్యవస్థ క్రైస్తవ మిషనరీల కంటే చిన్నవే కావచ్చు. చేతులో డబ్బులుంటే మిషనరీల కంటే తీసిపోకుండా సేవ చేయగలరు.

ఎవరిది మతగర్వం? పక్క మతాల దేవుళ్ళని తమ దేవుళ్ళతో సమానంగా పూజించే హిందువులదా? తమ దేవుడు, తమ మార్గం తప్ప మిగతా అంతా తప్పని, పదే పదే పక్క మతం పై అవాకులు చవాకులు పేలే వారిదా?

"క్యాండిల్ కూడా వారే సమకూర్చే సంస్కృతి కలిగిన.." సంస్కృతికి స్తోమతకి తేడా మీకు తెలీదనుకోవాలా. ఉచితంగా ఎవరో దానం చేసిన డబ్బు, స్టేట్ స్పాంన్సర్ చేసిన డబ్బు చేతిలో వుంటే క్యాండిల్ ఏం ఖర్మ, ఉచితంగా హస్పటల్స్ నడపగలరు, చదువు చెప్పగలరు, మీరు వద్దన్నా తమ మత గ్రంధాలు పంచగలరు. అంత డబ్బు హిందూ మత ప్రచారానికి దొరుకుతుందేమో చూడండి అప్పుడు వాళ్ళే కొబ్బరికాయ కొని కొట్టిస్తారు మీ చేత. తిరుమల లాంటి ప్రసిద్దమైన గుడులకు తప్ప వేటికి వస్తున్నాయి కోట్లు. వచ్చినా దిక్కులేకుండా పడి వున్న చిన్న గుడులన్నిటిని ఈ తిరుమల లాంటివే పోషించాలి.

మతమార్పిడిని జాబ్ మారటంతో పోల్చారు. ఉన్న ఉద్యోగం కంటే మెరుగైనది వస్తే మారటంలో ఏ తప్పూ లేదు. మతం మారే వారి విషయమూ అంతే. వారిని ఎవరూ తప్పుపట్టట్లేదు. తప్పుపడుతోంది ఆ మారుస్తున్న వారిని, వారి విధానాలను. మీరు చేరబోయే కొత్త కంపెనీ మీ పాత కంపెనీ పై ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నిందలేసే రకమైతే, అది తప్ప మిగతావన్ని వేస్ట్ అనే పిడివాద రకమైతే, దాన్నీ దాని విధానాలను సమర్ధిస్తారా.

Uday said...

చైతన్య గారు,

చాల బాగా చెప్పారు. నెనర్లు

కత్తి మహేష్ కుమార్ said...

@ఉదయ్: నేను ఈ వ్యాసం రాయడానికి మూలమైన దేవరగారి వ్యాసం చదివితే, నేను ఎవర్ని ఉద్దేశించి అలా రాసానో అర్థమవుతుంది. నేను చేసింది "ప్రతిదాడి" మాత్రమే. అందుకే ఈ వ్యాసం ఒకే కోణంలో ఉంటుంది.ఉద్దేశం వేరుగనకనే, నేను హిందూ మతంలో ఉన్న లోపాలనూ, క్రైస్తవమతంలో ఉన్న లాభాలనూ ఎత్తిచూపాను.

ఇక మెటీరియలిజం గురించి మీరు చెప్పిమళ్ళీ బ్రాకెట్లో దాని ప్రాముఖ్యతని మీరే గ్రహించారు. పెదవారికి మతప్రచారంకోసం సహాయం చేసి,వారిని మతంలో చేర్చుకుంటే మాత్రం తప్పేంటి అనే నేను ప్రశ్నిస్తున్నాను.అన్ని మతాలలోనూ మతమూఢులు ఉంటారు, అతివాదలూ ఉంటారు. కాకపోతే, పరమత సహనం మెండుగా ఉందని చెప్పుకొని తిరిగే హిందువులు భయంతో,అజ్ఞానంతో,హిసాత్మకంగా అణచివేతకుపూనుకోవడం ఎంతవరకూ సమంజసం అన్నదే నా మూల బిందువు. నా కొత్త టపా కూడా చదవగలరు.

@చైతన్య కృష్ణ పాటూరు: మారేటందుకు తయారుగా ఉంటే మార్చడంలో తప్పేముంది? అది వారి బాధ్యత,ఇది వీరి అవసరం. అందుకే ఇద్దరిదీ తప్పులేదు. తప్పల్లా అనవసరంగా వాపోతున్న హిందూ అతివాదులదే అని నా నమ్మకం.

హిందూ మతం మీద అంత ప్రేముంటే కులాల్ని నిర్మూలించమనండి, గుళ్ళను ప్రభుత్వ ఆధీనం నుండీ తొలగించి, సార్వజనిక ఆస్థిగా మార్చమనండి.వివక్షను మానమనండి. హిందూ మతాన్ని మరోసారి ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రక్షాళన చేసి సామాన్యులకు అందించమనండి. ఇవన్నీ చెయ్యరుగానీ, బ్రతుకుదెరువుకోసం మతం మార్చుకునేవాడీనీ,మత ప్రచారమే ఆదర్శంగా పెట్టుకున్న మతాన్నీ ఆడిపోసుకుంటూ, హిందూ మతమే గొప్ప అని ప్రగల్భాలు పలికేవాళ్ళని ఉద్దేశించినదే ఈ వ్యాసమని గ్రహించగలరు.

Ghanta Siva Rajesh said...

బాబా గారు
బార్య కూడా భర్త దగర కొలువు చెస్తునా అనుకుంటె ఇంకా మంచి కొలువు దొరికితె వెళి పొవచా?


మహెష్ గారు ఋస్స్ మెద మెకు మంచి అబిప్రాయం లెదని అర్దమవుతుంది. కాని నాకు తెలిసినంత వరకు అది హిందువులమీద ఇతరుల దాడిని నిరొదించడనికి యర్పడినది కాని ఇతరుల మీద దాడీ చెయతనికి యర్పడినది కాదు అదె దఅని లక్షం అయెతె దాని కర్య కలపఅలు అని ఇతర దెశాలలొ యుందలి కదా. మహమదియులు మన ఆలయాలని కుల్చి సంపద దొచుకుంటూటె చుస్తు ఉంటె మనకి సెకులర్ బావాలు ఉనటు లెక తిరగ బదితె లెనటు కదు కదా. ఇకడ అసలు సమస్య యంటంటె ఒకవెళ బౌధమతం వాళు వచ్చి ప్రచరం చెస్తె యవరు కాదు అనరు అందుకంతె వాళకి కుడా పరమత సహనం ఉంది మన దెశం లొ కుడా యవరినా ఎ మతం గురించి అయినా ప్రచారం చెశుకొవచు. అది పుర్తి గా హిందువుల గొపతనం అని చెపుకొవాలి యందు కంటె ఇతరులు ఈ విషయం లొ అంతగా ఒపుకొరు కాబటి.ఇకపొతె ఇతర మతాలు ఎయయినా మన దెశం లొ వాప్తి చెదలంటె వాటికి పరమత సహనం ఉంది తీరాలి లెకపొతె వాతిని మన దెశం లొ ఆల్లొ చెయనియకుడదు యందుకంటె ఇపటికె మనం మతం పెరు చెపి రొజు చపుకుంతునాం కనుక .
క్రిస్తవ మతం తొ వచిన చికు యంతంటె ఇది పూర్తి గా వ్యపారత్మకం
డబు ఇస్తం మతం మరండి అనటం యంతవరకు సమంజసం మనం కూడా మరి పెద దెశాలకి వెళి దబులిచి వలని హిందువులుగా మార్చుదామా
మీరు కస్తవ మతం చరిత్ర చుడండి వాళ చరిత్ర మొతం కుదిరినతసెపు రక పాతం ద్వరా వాప్తి చెసారు. ఇపుదు అణు బాబులు వచాక దెశాలని అర్దికం గా యదగకుందా చెసి పెదవలాని చెసి మలి మతం మర్చటానిలి చుస్తునారు.
అయినా విళ మత ప్రచరం మీరు చుశారా, మీరు చెపిన సెవలు, చదువులు ఒక వెపు మాత్రమె, ఇంకొ విపు మీరు కూటనికి రండి మీకు జభు నయమవుతుంది అని చెపి వలని విద్యం నుంచి దూరం చెయటం నెనుకళరా చుసాను. మీకు రుజువు కావాలంటె ఎదినా పెద కూటం జరుకుతునపుడు వెళి చుడండి. వాళు యమిచెపుతారంతె ఒక నరసిమ్హులునొ కనకదుర్ద్గ నొ పిలిచి వీళు నాలుగు సంవత్స్తరాలనుంచి కూటనికి వస్తు నారు
ఇంతకుమునుపు విరికి కాన్సర్ ఉందెది ఇఉడు తగిపొయింది, ఈయన మూగ వాడు ఇపుదు మాట్లాడ గలుగు తునాడు అంటారు యసు బగు చెసాడు అంటారు
ఆ మత్రం దానికి డాక్ట్ రులు ఏందుకు అందరం క్రిస్తవులుగా మరిపొతె సరిపొదిగా
మీరంటునారె కూటికి లెనివరికి మతం యందుకు అని, స్వాతంత్రం రక మునుపు మనకు బ్రిటిష్ వారు రయిళు వెసరు, ఫొన్లు పెటారు, మనలొ కొంతమందికి ఉద్యొగం ఇచారు. మనదరం పెదలం అపుదు. ఇవి యవి లెని మనకు స్వాతంత్రం అవసరమ చెపండి?

వాళు యని చెసిన అది దురుదెసం తొ కూదినది కాని మనల్ని బాగు చెసెది కాదు
వీళు చెసెది కూదా దురుదెసం తొ కుదినదె

వెళు నిజం గా నిస్వారం గా చెసెవలయితె మనకంటె వెనుక భదిన దెసలలొ యందుకు చెయరు

పాకిస్తాన్ లొ యందుకు చెయరు, ఆప్ఘనిస్తాన్ లొ యందుకు చెయరు

Ghanta Siva Rajesh said...

చిన పొరపాటు నెను RSS అని రాస్తె అది ఋస్స్ అని వచింది.

Uday said...

మహేష్ గారు,

హిందువులు ఇప్పటికి పరమత సహనం లొ ఆదర్శ ప్రాయులె. హిందువులు ఇప్పుడు ఎప్పుడు పరమతాల వాల్లను వారి మతం ఆచరించకుండా అడ్డుకోలేదు, వాల్లను ఇబ్బంది పెట్టి హింసకు గురి చెయ్యలేదు. వేరే మతం వాల్లు మన మతం మీద దాడి చెస్తుంటె అడ్డుకొవటానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారంతే. దీనికి హింసను మర్గంగా ఎంచుకుంటే నేనూ సమర్ధించను కాని, అక్కడక్కడ ఇలా జరుగుతుందంటే దానికి కారణం, క్రిస్టియన్స్ కు వున్నని రీసోర్సెస్ మనకు లేవు. ఎమి చెయ్యలెని స్తితి లొ చూస్తూ వూరుకొ లెక ఇల జరుగుతుంది . మా వూర్లొ కూడా ఈ మత మార్పిదులు జరుగుతున్నపుదు, యెమి చెయ్యలెక బాధ పడ్డామె కానె, అంతకు మించి ఎవరికీ హాని తలపెట్టలెదే? బహుశా ఆంధ్రప్రదెశ్ లొ చాల గ్రమాల్లో ఇదె పరిస్తితి కావచ్చు. కాని పరిస్తితుల్లొ మార్పులు వస్తున్నయి, తి.తి.దే ముందుకు వచ్చి కొన్ని మార్పులకు స్రీకరం చుట్టింది. నెమ్మదిగా పరిస్తితులు మారి హిందు మత విమర్శకుల నోర్లు మూయించె రోజులు దగ్గర్లోనె వున్నయి.

కత్తి మహేష్ కుమార్ said...

@శివరాజ్ గారూ: మీ తెలుగు చదవడం కొంచెం కష్టమైంది. అయినా తెలుగులో రాయడానికి ప్రయత్నించిన మీకు నా అభినందనలు.

RSS హిందువులపై ఇతరుల దాడిని ఆపడానికి ఏర్పడిందని మీరు చాలా అమాయకంగా నమ్ముతున్నట్లున్నారు.హిందూ బాహుళ్యం కలిగిన భారతదేశంలో నిజంగా మనకు ముప్పుందంటారా? ఒకవేళ ఉన్నా చట్టం,న్యాయాలకు అతీతంగా RSS కు మనల్ని ఇతర మతాలనుంచీ రక్షించే అవసరం, అధికారం ఎవరిచ్చారు? దయచేసి గాంధీని తమ అతివాద సిద్దాంతాలకోసం చంపడానికి పూనుకున్న వీరి చరిత్రని చదివి తెలుసుకోండి. They are religious fanatics to the core అంతే.

ఇతర మతాల్ని ప్రచారం చెయ్యనివ్వడం హిందూమతం గొప్పతనంకాదు. అది భారతీయ ప్రజాస్వామ్యం గొప్పతనం. ఆ ప్రజాస్వామ్య సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా కొందరు అతివాద హిందువులు ఆవేశానికి ఎదురుదాడిగా మాత్రమే ఈ వ్యాసాన్ని రాసాను.పరమత సహనమని మనం చంకలు గుద్దుకునే మన సంస్కృతిని RSS లాంటి అతివాద సంస్థలు హిందూఇజమేదో పెద్ద ప్రమాదంలో ఉందని భయపెట్టి,హింసను ప్రేరేపిస్తున్నారు. If Hinduism has the assimilative power we talk about,నిజంగా మన ఆదర్శాలని కాకులెత్తుకుపొయ్యేలా ప్రవర్తిస్తామా?

ఇక క్రైస్తవ సువార్త సభలకు నేనూ వెళ్ళాను. వాటికీ మన స్వామీజీల పూనకాలకీ పెద్ద తేడా లేదు.కాబట్టి వారికీ మనకూ మతం విషయంలో పెద్ద తేడాలేదు. తేడాఅల్లా in its manifestation.వాళ్ళ విధానం మనకన్నా ఉపయోగకరం. అందుకే మనోళ్ళు ఆ మతంలో చేరుతున్నారని నా నమ్మకం.

ఎవరైనా మారడానికి సిద్దంగా ఉన్న ప్రదేశాలలోనే తమ ప్రచారాన్ని నిర్వహిస్తారు.ఎడారిలో బ్లాంకెట్లమ్మడానికి క్రైస్తవులు మూర్ఖులు కాదుకదా? మన హిందూ మతం చాలా మందిని alienate చేసి, అర్థరహితంగా తయారవబట్టే,this is a fertile land for harvest of hearts అని క్రైస్తవులు నమ్ముతారు. ఇక్కడ తప్పెవరిది? మనదా? వాళ్ళదా?

@ఉదయ్: 70 కోట్ల జనాభాఉన్న హిందు మతానికి రిసోర్సెస్ లేవా? ఇక తి.తి.దే వారు అర్థమనసుతో చేసిన ప్రయత్నాలు (దళిత గోవిందం) ఎంత సంక్షోభాన్ని రగిలించిందో మీకు తెలిసినట్లు లేదు. దళితవాడలు తిరిగిన గోవిందుడి విగ్రహాలు, పాకశాల పాలైన విషయం మీకు తెలియదనుకుంటా! ఇలా కొన్ని కోట్ల మంది హిందువుల్ని హిందూ మతానికి దూరం చేసేకొద్దీ మతవలసలు తప్పవు, హిందూ మతానికి ఈ తిప్పలు తప్పవు.

Uday said...

mahesh gaaru,

anni desposable resources vundi vunte mana desam lo inka intha pedarikam, venukabadina tanam enduku vundo naakaite artham kaavatam ledu. manchi vaipu jarugutunna chinna chinna maarpullo koodaa tappulu vedukutoo vunte evaru maatram emi cheyyagalaru. tappulu vedakatam anedi jarigina tappulu sarididdela vundaale kaani, maarpu nu vekkirinchelaa vundakoodadu. Tirumala lo vunde paakasaala kooda hinduvulaku entha pavitramainado meeku telisinatlu ledu. entati pedda maarpu aina chinnagaane modalu avutandani gamaninchagalaru.

కత్తి మహేష్ కుమార్ said...

@ఉదయ్: సామాజిక మార్పు రంగం (Social Change and Development sector)లో దాదాపు 10 సంవత్సరాలనుంచీ పనిచేస్తున్నాను.మార్పు ఎలాంటి పరిణామమో నాకు తెలుసు.నిజమైన మార్పుకుమూలం, ఉన్నతమైన ఆశయం. ఆ ఆశయాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరించడం. అది మన హిందూమతంలో కొరవడింది అన్నదే నా పాయింట్.

ముందు హిందూ మతంలో ఉన్న సంస్థాగత,వ్యవస్థాగత లోపాల్ని సరిచేసుకోకుంటే,బౌద్ధం,జైన మతం ఉధ్బవించి హిందూ మతం నడ్డి విరిచినట్లు, ఇప్పుడు క్రైస్తవం చేస్తుంది. అందులో సందేహం ఏమాత్రం లేదు. అప్పుడు ఆదిశంకరాచార్యుడి పుణ్యమా అని హిందూమతం బతికిబట్టకట్టింది. కానీ ఇప్పుడు సైద్ధాంతిక బలంతోపాటూ, ఆర్థిక బలిమి కలిగిన క్రైస్తవం ముందు మనం ఓడిపోకుండా ఉండటానికి కావలసింది, ఆత్మచింతన హిందూ మతసంస్కరణ.

అది చెయ్యటానికి ఆదిశంకరాచార్యుడు ఇప్పుడు లేడు. ఉన్నదల్లా కుహానా మతతత్వవాదులు మాత్రమే. వారివల్లనే హిందూమతానికి తీరని ద్రోహం జరుగుతోంది. ఎంతసేపూ వీళ్ళమీదబడీ వాళ్ళమీదబడీ ఏడవడం తప్పించి నిజంగా వీళ్ళు మతోద్దరణ చేస్తున్నదెంత? అటు ఇస్లాం బూతాన్నో, క్రైస్తవ సైతాన్నో చూపించి హిందువుల అజ్ఞానంతో ఆడుకుంటున్నారేతప్ప నిజంగా శాంతీ,సౌభాగ్యాలకోసం పాటుపడుతున్నారా? హిందువుల ఉన్నతికి ప్రయత్నాలు చేస్తున్నారా?

ఇవి జరగనంతకాలం. మతమార్పిడులు ఆగవు. హింసించినా, నరికినా, చంపినా హిందూ మతాన్ని నిరసించడం ఆపరు.

చైతన్య క్రిష్ణ పాటూరు said...

అవసరం కొద్దీ మారటం వారి తప్పూ కాదు. మత మార్పిడే మా ఎజండా అని ప్రకటించుకున్న వారికి మార్చటమూ తప్పు కాదు. అందుకు మనం నోరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన వారకి మనం సహాయం చెయ్యలేకపోవటం మన దుస్థితి. మన వారిని ఆశపెట్టగలిగే స్తోమత వారి అడ్వాంటేజ్. ఈ టపా దాని వరికే అయితే నేను కామెంటే వాడినే కాదు. సమస్యల్లా కేవలం చేతిలో డబ్బున్న కారణాన వారు చెయ్యగలుగుతున్న కార్యక్రమాలను చూపిస్తూ, అవి హిందూ మతం చెస్తోందా అనే ప్రశ్నే. వారిలా డబ్బుంటే మనమూ చెయ్యగలం, అది స్తోమత సమస్యే కానీ, సంస్కృతి సమస్య కాదని నా అభిప్రాయం.

అంత సులువుగా మార్చేసి రాత్రికి రాత్రి మతపెద్దతో స్టేట్మెంట్ ఇప్పించెయ్యటానికి ఇదేమైనా మతపెద్దలు నడిపే మతమా. ప్రతి వ్యక్తి తన స్వంత పద్దతిలో పాటించే హిందూ మతం. దాని సమస్యలు దానికున్నాయి. ఏ మతానికి మాత్రం లేవు.

తమ మతంలోని సమస్యల వల్ల హిందువులు పక్క మతాలకు వెళ్తే వారిని ఆపటానికి మనమెవ్వరం. చేతనైతే సంస్కరించాలి, లేదంటే ఊరుకోవాలి. మార్చేవారితో కూడా గొడవ లేదు. అధికారం, ధనం వున్న ప్రతివారు, తమ మతాల్ని, తమ అలవాట్లని, తమ అభిప్రాయాల్ని ఇంకొకరి మీదకు రుద్దుతుంటారు. అందులో కొత్తేమి లేదు. తమ మతం గొప్పతనమేమైనా వుంటే చెప్పుకుని మార్చుకోవచ్చు. లేకపోతే తమ మతంలోకి వస్తే వచ్చే అడ్వాంటేజస్ చెప్పుకుని మార్చుకుంటే కూడా మనం అభ్యంతర పెట్టక్కరలేదు. వారికి డబ్బులున్నాయి, మనకి లేవని నిట్టూర్చచ్చు. కానీ వారి మతం గొప్పగా చూపించటానికి హిందూ మతం పై లేనిపోని అభాండాలు వెయ్యటం, వారి విధానాలకు అసహ్యమైన interpretations తీయటం, ఏ విధంగా సమర్ధనీయం. అలాంటి కారుకూతల్ని ప్రతిఘటించకుండా ఊరుకోవాలా. కొందరు హిందూ అతివాదుల్ని, వారి చర్యల్ని చూపించి, ఇప్పుడు అర్జంటుగా మిగతా మతాలవారికి సానుభూతి కావాలని చెప్పి వారేం చేస్తే దానికి తలలూపాలా?

కత్తి మహేష్ కుమార్ said...

@చైతన్య కృష్ణ పాటూరు: అస్సలు తలూపనఖ్ఖరలేదు మీ నిరసనా, ప్రతిఘటనా నిరాటంకంగా తెలపడానికే నా బ్లాగులో కామెంట్ మోడరేషన్ లేదు.నేను చెప్పింది మతంమారిన వారినో లేక క్రైస్తవమతాన్నో "సానుభూతి"తో చూడమని కాదు. మన నిరసనా, సానుభూతీ రెండూ వాళ్ళకి అవసరం లేదని మాత్రమే.

ఇక నేను హిందూ మతంపైన వేసినవి అభాండాలు కావు.పచ్చి నిజాలు. అక్కడక్కడా over simplifications ఉండొచ్చేమోగానీ చాలా శాతం వ్యవహారంలో ఉన్న నిజాలే!

Ghanta Siva Rajesh said...

హమయ

మీరు చెపెది ఇపటికి అర్దం అయింది
నిజమె హిందు మతం లొ కొని లొపాలు ఉనయి. అని ఇతర మతల లగానె,
కకపొతె హిందుమతాని ఉదరిస్తునటు చెపుకుంటున పెదలెవరు తగినత క్రుషి చెయతం లెదు.
మన ఇంటికి కనాలు ఉంటెనె కదా యలుకవు వచెది
ముందు ఈ కనాలని పుద్చలి , లెకుంతె ఈ రొజు క్రిస్తవం నిన బౌదం యదొ ఒకటి
మన మెద దడి చెస్తునె ఉంటయి.

గీతాచార్య said...

మీరు భలే విషయాన్ని లేవనెత్తారు. మీ బ్లాగోలో అభిప్రాయాన్ని వ్రాసేకన్నా నేనొక బ్లాగునే వ్రాస్తాను. అదే మంచిది. ‘మనదేశానికి పట్టిన క్యాన్సర్ - క్రైస్తవ మిషనరీలు’ అన్నా మా ఎంత తప్పో మీరు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు అంత తప్పు. తప్పొప్పుల్ని మీ బ్లాగులో కేవలం కామెంట్ రూపం లో ఇస్తే సరిపోదని నా అభిప్రాయం. అందుకే నా దగ్గర డబ్బులున్నప్పుడు బ్లాగు వ్రాస్తాను.

నేను వ్రాసేది రేషనల్ గానే ఉంటుందని హామీ.

---------------------------------------------

ఇక మరో విషయానికి వద్దాం. మీ బ్లాగు వల్ల చాలా మందఅభిప్రాయాలూ, వారి అనుభవాలూ, బయటకి వసున్నాయి. అందుకు అభినందనలు. "కత్తి" లాంటి టాపిక్ ఇది. మనం చెపేది తప్పయినా ఒప్పయినా ఎన్నో ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి. నేను ముందే అన్నట్లు చర్చ కావాలి విషయ పరిజ్ఞానానికి.

Thank You.

చదువరి said...

"వారు ప్రతి హింస సాధారణంగా చెయ్యరు గనక" - ఔన్నిజమే! కన్నాలేసేవోడు ఎదరకొచ్చి దాడి చెయ్యడు -గుట్టుచప్పుడు కాకుండా, చాపకింద నీరులాగా పని చేసుకుపోతాడు. దోపిడి దొంగే హింస చేస్తాడు. ఈ రెండో రకానికి చెందిన వారు వేరే ఉన్నార్లెండి.

పోతే..
"దాన్ని భరిస్తారంటే, నేను క్రైస్తవంలోకి ఇప్పుడే జంపడానికి తయార్." ఒద్దండి, దాన్ని భరించగలిగే ఏకైక మతంలో మీరున్నారు. ఇక్కడే ఉండండి, మరోదానిలోకి జంపకండి. :)

Anonymous said...

@ మహేష్ గారికి,
నా IDలో కెనడా అని ఉన్నదెందుకంటే ’ఇండియా’ను వేరెవరో తీసేసుకున్నందువల్ల. website ఇచ్చే అంకెల ID గుర్తుపెట్టుకోవటం కష్టమని ఇలా తీసుకున్నాను.
మీరనుకున్నట్లు నేను మతమార్పిడిని వ్యతిరేకించటం లేదు. అది వ్వక్తిగత విషయం. సదరు మతసంస్థలు కేవలం ఆర్థిక పరిస్థితులను ఆసరగా తీసుకుని మతమార్పిడిని ప్రచోదించటాన్ని వ్యతిరేకిస్తున్నాను.
ఇక మీరు చెప్పిన మిగిలిన విషయాలతో నేను ఏకీభవించకపోయినా, వాదన కొనసాగించే ఓపిక, తీరిక మాత్రం లేదు. మన్నించగలరు.
ఇక చివరి విషయం, God with capital 'G' is always Jesus అన్నది నాకు మీరు చెప్పేదాక తెలియదు. Oxford dictionary సైట్లో నాకు అర్థం ఇలా వచ్చింది.

God

• noun 1 (in Christianity and other monotheistic religions) the creator and supreme ruler of the universe.

2 (god) a superhuman being or spirit worshipped as having power over nature and human fortunes.

3 (god) a greatly admired or influential person.

4 (the gods) informal the gallery in a theatre.

ఇక నేను సెలవు తీసుకుంటున్నాను.

saisahithi said...

మహేష్ గారు,
ఆర్థికావసరాల ప్రాతిపదికగా ఉద్యోగమైనా,మతమైనా మారటం సమంజసమే అని మీ అభిప్రాయం ఒ.కె . ఉద్యోగం మార్పు స్వలాభం కాని చాలావరకు మతం మార్పు ప్రలోభం .ఇది జీర్ణించుకోలేనిది.
కేవలం ఓ మతం లోని కొన్ని బలహీనతలను ,సమాజం లోని ఆర్థిక అసమానతలను ఆసరాగాతీసుకుని ప్రజలని ప్రలోభపెట్టి బలవంతపు మతమార్పిడి లు చేసే ఏ మతమయినా
సమర్థనీయం కాదు.
ఇక్కడ చర్చ కేవలం సమస్య విస్తృతి,ఎత్తిపొడుపులు గురించి సాగిందే తప్ప సమస్య మూలాల్ని ఎవరూ ప్రస్తావించలేదని పిస్తూంది.మత మార్పిడి సహించ లేని వారు..వారి వారి మతాల్ని పరిపృష్టం చేసుకోవడమ్లో హింసని విడనాడల్సిందే. ఉన్నత ఆశ యాలతోప్రారంభించిన కొన్ని సంస్థలు ఈనాడు అతివాద సంస్థలు గాముద్ర వేయించుకోవడానికి కారణాలు వెదికి సంస్కరణలు చేపట్టే దిశలో మన చర్చలు సాగితే బాగుంటుందని నాఅభిప్రాయం. ఇంతవరకూ సాగిన చర్చలో ..దీనికిది పరిష్కారం అన్నవారెవరూ లేకపోవడం విచారకరం. కొందరై తే ఇదసలు సమస్యే కాదనడం దురదృష్టకరం.
మరొక విషయమేమంటే...
మార్టిన్ లూధర్ కింగ్ వర్గ వివక్షతపై శాంతియుత పోరాటం సలిపే రోజుల్లో...నీగ్రోలకి ఆశ్రయమిచ్చారనే నెపంతో ఎన్నోచర్చి లని బాంబులతో పేల్చి వేసారట. ఇది చేసింది క్రిష్టియన్లే. అంటే ఏమతమ్లోనయినా ఇటువంటివి సహజం. ఇది కొంత శాతం మాత్రమే. దీనికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి దీన్ని పరోక్షంగా ప్రచారం చేసినట్లు కాదా?

బొల్లోజు బాబా said...

@ గంటా శివరాజేష్ గారికి
భర్తను ఒక దేముడుగా, భార్యను ఒక భక్తురాలి గా ఇప్పటికీ ఊహించేసుకొంటున్న మీ ఫ్యూడల్ భావాలకు జోహార్.

బొల్లోజు బాబా

ఆయుష్మాన్ భవ!! said...

పూర్తి వ్యాఖ్యలైతే నేను చదవలేదు కానీ, చదివినంతమేరకు నాకు అర్ధమైనది - నేను గత నాలుగు సంవత్సరాలుగా చర్చికి వెళుతున్నాను + కన్వర్ట్ అవుదామని ఈ మధ్యే నిర్ణయించుకున్నాను. ఇన్ని సంవత్సారాలలో నేను గమనించినదేమిటంటే... చాలా వరకూ పాస్టర్లు డబ్బు కోసమే అది ఉద్యోగంలా ఆ కోర్సు చేసి పాస్టర్లు అవుతారు. కొంతమంది నిజాయితీగా ఉండవచ్చు. అలా నిజాయితీగా ఉన్నవాళ్ళను వేళ్ళ లెక్కపెట్టవచ్చు. కానీ కొంతమంది వ్యక్తిగత జీవితాలను గమనిస్తే నాకు ఆశ్యర్యం వేస్తుంది. అవి చర్చించడం అనవసరమనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఆర్ధికపరంగా వచ్చిన లాభమేమి లేదు గమనించగలరు. ఇంటిల్లిపాది పస్తులున్న రోజులున్న కూడా ఇంట్లో ఉన్న కాస్త కూస్త అమ్ముకుతిన్నమే కానీ, చేయి చాపింది లేదు.

ఇక్కడ ఒక విషయం చర్చకు వచ్చింది. టికెట్ లేని గుడిని చూపించమని అడిగారు. కానీ, టి.విలో క్రిస్టియన్ ప్రసంగాలలో విరాళం అడగని వారు ఎవరైనా ఉన్నారా? మతంమైనా, మనిషైనా డబ్బు కావలిసిందే. నాకు తెలిసి మాత్రం విదేశాల నుంచి దేవుడి కోసం వచ్చే డబ్బు చాలా వరకూ దుర్వినియోగం అవుతుంది. వారి వారి సొంత అవసరాల కోసం వాడుకుంటుంటారు కొంతమంది. దేవుడి వాటా 30 నా వాటా 70 ఉంటుందన్నమాట. ఈ మద్య నా స్నేహితుడొకరు అన్నాడు. తనకు తెలిసిన ప్రెండ్ క్రిస్టియన్. వాళ్ళకు పారిన్ నుండి ఫండ్స్ వస్తాయంట. ఇక్కడ తను ఒక ఛారిటి పెట్టి, ఆ ఫండ్స్ కాస్త తనకు కొంత, కాస్త దేశోధ్దారణకు కొంత అని. అది తప్పు కదా!!! దేవుడి పేరు చెప్పి అలా చెయ్యటం అంటే, ఏదో వెనకేసుకుంటాడంట. అతను బాగా డబ్బున్నవాడే. కార్లలో తిరిగే రేంజ్.

ఇది వరకూ రకరకాల గుళ్ళు తిరిగి మా ఇంట్లో ఆ బాబాలు ఈ బాబాలని తిప్పి... నాకు విరక్తి వచ్చింది. క్రిస్టియన్లలో ఒక్కడే దేవుడు అది జీసస్. ఆ ఒక్క విషయం నచ్చి ఇటువైపు మళ్ళాను. కానీ, ఇక్కడ చూస్తే పూజించేది అంతా ఒకరినే కానీ, వీరిలో కూడా ఎన్నో శాఖలు ఉన్నాయి. ఒకరి పూజా విధానం మరొకరికి నచ్చదు.

ఇదివరకు పంచములని గుడిలోకి అనుమతించేవారు కాదు. ఇది కూడా మతమార్పిడికి ఒక కారణం అయి ఉండవచ్చు. కానీ, ఇవన్నీ నాకు అనవసరం. దానిలో కొన్ని విధానాలు నాకు నచ్చాయి. ఇక ఇందులోనే కొనసాగుతాను. సరే నా భావాలను ఓ క్రమపద్ధతిలో సరిగ్గా నేను చెప్పిండకపోవచ్చు. దయచేసి అర్ధం చేసుకోగలరు.

మీ.. said...

నిజమే!

--------------------------------------------------

విషయాన్ని కాస్త పైనుండి చూద్దాం. కుదిరితే చంద్రుని మీద నుండి..

అసలు ఉద్యోగం ఎందుకు చేస్తాం, ఆర్థిక స్థిరత్వం కోసం ఇంకా "ఉద్యోగం పురుష లక్షణం కనుక, ఇప్పుడు స్త్రీ లక్షణం కూడా అనుకోండి", ఇంకా వితండవాదం చేయకపోతే సంతృప్తి కోసం కూడా అవునా!

ఉద్యోగం ఎందుకు మారుతాం? ఉన్నవాటి మైరుగైన వాటి కోసం కదా!

ఇప్పుడు చెప్పండి? సంతృప్తి కోల్పోతామనుకుంటే ప్రయోజనాలెంతపెద్దవైనా ఉద్యోగం మారం నిజమే కదా.

-----------------------------------------------------


ఇప్పుడు ఇంకాస్త పైనుండి. కుదిరితే సూర్యుని దగ్గర నుండి..

ఇష్టమొచ్చినట్లు ఎగురు, ఎన్ని చంఢాలపుపనులైనా చేయి, వచ్చి "దేవుడా క్షమించు అను చాలు", మొత్తం హుష్ కాకి , స్వర్గానికి తిన్నగా వెళ్ళొచ్చు, ఇదీ విధానం క్రైస్తవంలొ....

నీవు చేసే కర్మ ఫలితం నీకే వదిలివేయబడుతుంది, నీ పాపపుణ్యాల లెక్క నీతోనే వుంటుంది, ఇదీ విధానం హింధూత్వంలో....

మొదటిదాంట్లో వ్యక్తిగత విశృఖలత్వం వుంది, అది సమాజపు కట్టుబాట్లను తెంపుతుంది, పరిస్థితి అరాచకంగా తయారవుతుంది, వ్యక్తి స్వేచ్చపై బలవంతంగా షరతులు అమలవుతాయి, ఆఖరుగా సంతృప్తి కోల్పోతాం....

రెండోదాంట్లో వ్యక్తిలోనే కట్టుబాట్లు మొదలవుతాయి, ఇది సమాజ శ్రేయస్సుకు దారి తీస్తుంది, ఆఖరుగా వ్యక్తికి సంతృప్తి వుంటుంది....

-----------------------------------------------------

ఇప్పుడు ఇంకాస్త పైనుండి. కుదిరితే పక్క పాలపుంత వరకు వెళ్ళి..

సంతృప్తి కోల్పోతామనుకుంటే ఉద్యోగం మారనట్లే,

హిందూ మతం కూడా మారకూడదు కదా!

మారేవాళ్ళకు అర్థం కాకపోవచ్చు, తెలియచెప్పాల్సిన భాద్యత మీమీద వుంది కదా?

-----------------------------------------------------

ఇప్పుడు మళ్ళా కిందకు వచ్చేయండి.

హిందూ మతంలోంచి మార్పిడులను ఖంఢించాల్సిందిపోయి, సమర్థిస్తారెందుకు??

-----------------------------------------------------

కత్తి మహేష్ కుమార్ said...

@చంద్రమౌళి గారూ: మీరు చంద్రుడి దగ్గరికీ సూర్యుడి దగ్గరికీ చివరకి పాలపుంత దగ్గరికి తీసుకెళ్ళినా, ఈ భూమిమీద ఉండే నిజాలు మారవుకదా! నేను హిందూ మతంనుండీ జరిగే మతం మార్పిడిని ఖండించలేను. ఎందుకంటే నేను వ్యక్తిగత స్వేచ్చని నమ్ముతాను గనక. ఏకారణం చేతనైనా మతం మారాలి అనుకునేవాళ్ళకి పరమతంలో ప్రస్తుతం మతంలో లేని తృప్తి దొరుకుతోందన్నమాటే కదా! మరలాంటప్పుడు మనకెందుకు అభ్యంతరాలూ, అభ్యంగన స్నానాలూనూ?

@సాయి సాహితుగారూ: మీరు మతం as a doctrineకూ మతం as a practice కూ తేడా తెలీకుండా మాట్లాడుతున్నారు.హిందూ మతం,లేక క్రైస్తవం గీత-బైలిల్లలో చాలా గొప్ప విషయాలు చెప్పుండొచ్చు, కానీ మతమార్పిడి ప్రస్తుత పరిస్థితుల,అవసరాల,అనుభవాల నేపధ్యంలో జరుగుతున్నాయి. వాటికి మీరు చెప్పిన చరిత్ర,గ్రంధాలు తెలిపిన నిబద్ధతకూ సంబంధం లేదు. కాబట్టి,నిజాల్ని దృష్టిలో పెట్టుకుని వాదనలు చెయ్యాలేతప్ప ఆదర్శాలని కాదని మనవి.

@రాజ్ ’కెనడా’ గారు: ఆంగ్ల సాహిత్యంలో ఎక్కడ "He" with capita "H" వచ్చినా లేక "God" with capital "G" వచ్చినా దానికి అర్థం "జీసస్సే" అందులో ఏమాత్రం సందేహం లేదు.

@గీతాచార్య గారూ: మీ టపా కోసం ఎదురు చూస్తాను.

@చదువరి గారూ: నేను జంపడం లేదు లెండి. సగానికి పైగా క్రైస్తవాన్ని ప్రశ్నించిన ఆంగ్ల సాహిత్యంతో పాటూ హిందూ మతాన్ని నిరసించిన అభ్యుదయ సాహిత్యాన్ని చదువుకున్న నేను ఏమతానికీ విలువివ్వను. నా అభిమతానికీ, నావాళ్ళ ప్రేమకీ తప్ప.

మీ.. said...

తరువాయి భాగం :- తృప్తి మరియు ప్రలోభాలు

-------------------------------------------


అసలు నేనూ మీ పార్టీవాడినే,

మనిషి సంతోషంగా వుండటానికి కార్లు,బస్సులు కనిపెట్టినట్లే మతాన్ని కూడా కనిపెట్టాడనుకుంటా, కాకపోతే కాస్త ముందుగా.
మా మతమే గొప్ప అనేవాళ్ళతో, అసలు దేవుడెక్కడున్నాడని, విషయాన్ని కొట్టుకునే వరకు వాదించినవాణ్ణి.

కనుక నిరభ్యంతరంగా నన్నూ మీపార్టీలో చేర్చుకోవచ్చు.


ఇక కాస్త పైకెళ్దామంటే అర్థం సిద్ధాంతాలు, రాద్ధాంతాలు పక్కనపెట్టి, విషయాన్ని కాస్త స్థూలంగా అలోచించమని అర్థం. క్షంతవ్యుణ్ణి.

-------------------------------------------


మీ ఎదురింటి పిల్లాడు బడికెళ్ళకుండ ఆడుకుంటున్నాడనుకోండి, బడికెళ్ళు బాబు అని చెఫ్తాం, అవునా కాదా?

అంత మాత్రాన అతని వ్యక్తిగత స్వేచ్చను మనం కాదన్నట్లా చెప్పండి?


-------------------------------------------ఇక ముందునుండి ఉన్నవాళ్ళ తృప్తికే దిక్కు లేకుంటే, మారేవాళ్ళకు తృప్తి ఎక్కడినుండి వస్తుందండి!!

నేను రెండో పేరాలో చెప్పిందదే.

పోనీ,
మీరన్నట్లు మనసుకి నచ్చే మారితే ఎవరికీ అభ్యతరం ఉండదండి, దరిద్రం పోతేపోయిందని హయిగా స్నానం చేసి, చక్కగా తిని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు.


"నరకానికన్నా వెళ్ళు, మా దగ్గరకన్నా రా" అని ప్రలోభ పెట్టటమే తప్పితే! అది తప్పు కదా?

దాదాపుగా ప్రతి మత మార్పిడి వెనుక ఏదో ఒక ప్రలోభం ఖచ్చితంగా వుంటుంది.

తప్పుని ప్రతి ఒక్కరు ఖంఢించాల్సిందే కదా?

-------------------------------------------


చివరగా

సిగరెట్టు తాగడం, మందు కొట్టడం, 'మతం మారడం', వ్యక్తిగత స్వేచ్చ కిందకు ఎప్పుడు వచ్చాయండి.

అవి అంతిమంగా మన సమాజంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి.

--------------------------------------------


మీ..

saisahithi said...

మహేష్ గారు,
బ్లాగుల్లో సాగిన చర్చావిధానాన్ని గురించి ప్రస్తావించానే తప్ప
నేనిక్కడ ఏమతం గురించి వాటి doctrines మరియు వాటి practices గురించి మాట్లాడలేదని గమనించండి. జరిగేవన్నీ ప్రలోభాలని అందరూ ఏకీభవించారు. కాని వీటికి పరిష్కారాల దిశలో సాగిన చర్చలు లేవని అభిప్రాయపడ్డాను. I think you couldn't go through all along the line. I regret for it.