"గోముగా అడగడం అంటే?"
మెత్తగా గోతులు తియ్యడం.
తియ్యగా పనికానియ్యడం.
మగాడికి మచ్చుకైనారాని,
‘ఫెమినైన్ చార్మ్’ ఉపయోగించడం.
****
"వగలు కురిపించడం అంటే?"
వొంపులు తిరగడం.
నవ్వు వొలికించడం.
బేలతనాన్నినటించి,
బండినడిపెయ్యడం.
****
"ఫెమినిజం అంటే?"
నిజానికీ నిజానికీ మధ్య
అభిప్రాయాలగోడకట్టడం.
భావజాలంపేరుతో
బాధల్ని ఏకరువుపెట్టడం.
‘మగ’బూచిని మట్టుబెట్టడమే
మహా ఆదర్శమనడం.
****
"షివల్రీ అంటే?"
ఒక ఇంగ్లీషుపదం.
బలహీమైన ఆడజాతిని,
అర్జంటుగా కాపాడమని
మగాడికి మన సమాజమిచ్చిన లైసెంస్.
****
"మేల్ ఛౌవనిజం అంటే?"
మరో ఇంగ్లీష్ పదం.
తానే గొప్పోడనే మగాడి భ్రమకు
అక్షరాలా అక్షరరూపం.
అపార్ధాలకూ, అపోహలకూ,
నిలువెత్తు అద్దం.
****
"అన్నీ తప్పైతే మరి రైటో?"
ఎదీతప్పుకాదు అన్నీ రైటే!
"గోతులూ,వగలూ
ఇజాలూ,భ్రమలూ
అపార్థాలూ,అపోహలూ
అన్నీ రైటేనా?"”
‘All is fair in love and war’ అని వినలేదా?
ఇది యుద్దంలాంటి ప్రేమ
ప్రేమలాంటి యుద్దం
ఇందులో కాకుంటే మరెందులో ఇవన్నీ రైటు?!?
****
9 comments:
ఎవరి మీద వేలెత్తిచూపిస్తున్నారు ?
శృంగారం మీదా?
దాని లేమి మీదా?
అభ్యుదయం పేరున దాన్ని చావబాదినోళ్ళ మీదా?
మహేశా!!! అనవసరంగా ఇవన్నీ ఆలోచించకపోవడమే రైటు....
ఆలోచించినది రాయడానికే కదా బ్లాగులు !
అదిసరే ! మహేశ్ గారూ ! చాలా రోజులనుంచి మిమ్మల్నొకటి అడగాలనుకుంటున్నాను. blogger.com బ్లాగుల్లో టపా కింద వ్యాఖ్యల పెట్టె ఉండదు కదా ! (Post a Comment అనే లంకె మీద నొక్కి వేఱే వెబ్ పుటలోకి వెళ్ళాలి) మీ బ్లాగులో మాత్రం అది కనపడుతోంది. ఈ అద్భుతాన్ని మీరు ఏం చేసి సాధించారు ? మీ మూస (template) లో ఏ విధమైన మార్పులు చేశారు ? దయ చేసి ఆ రహస్యాన్ని మాతో పంచుకోగలరని ప్రార్థన.
అసలు ఇక్కడ రాసిన కామెంట్లు ఎక్కడికెళుతున్నాయో తెలీక నేను ఈమధ్య కామెంట్లు రాయడం లేదు.ఈ కొత్తమూసబ్లాగరు వచ్చినదగ్గర నుంచీ ఈ బాధలనుకుంటా...
@తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం gaaru
బ్లాగ్ స్పాప్ట్ లో వచ్చిన మార్పుల కారణంగా, ఇప్పుడు ఇన్-లైన్ కమ్మెంట్ ఫార్మ్ సాధ్యం. మరిన్ని వివరాలకు, ఈ కింది లంకెను చూడగలరు
http://chaduvari.blogspot.com/2008/07/blog-post.html
chauvanism గురించి తెలీదు గానీ chivalry అంటే నాకు మండుకొస్తుందండీ. ఒక పక్క ఆడా మగా సమానమే అంటారు. ఒక పక్క
special గా ట్రీట్ చెయ్యాలంటారు. ఇదెక్కడి న్యాయం??
@ సందీప్
ఆపిల్ పండ్లను, బత్తాయిలను పోల్చలేము..అలాగే ఆడామగానూ..సమానము..అసమానము..అప్రస్తుతం
ఎవరి గొప్ప వారిది..
అరెరె ఏమిటీ.. వేన వేల రిక్షాలు ఆకాశ మార్గనా వెడలుతున్నవి!
కారు మబ్బులు నీటిపై తేలియాడుతున్నవి.
ఏమి ఈ...
పూర్ణిమ గారికి నెనర్లు.
Post a Comment