Thursday, July 31, 2008

గోడలు


నీ చుట్టూ ఆరడుగుల అభిప్రాయాల గోడ.
అయినా, తలుపు తెరిచి ఆహ్వానించావు.
రావాలో వద్దో నాకు తెలీదు.
ఒకవేళ వస్తే...మళ్ళీ బయటపడగలనా?
అదీ తెలీదు!
నా కోటకన్నా ఎత్తైన భావాలతో కదలి వచ్చినా...
నీ అభిప్రాయాల గోడజాడనైనా మిగులుస్తానా!?
లేక...మన ఇద్దరి రాపిడి కలయికకు గోడలు బీటలువారి
నిజాలు గోచరిస్తాయని ఆశపడనా!
లేదూ... ఇద్దరి అభిప్రాయాలూ,భావాలూ మన కలయిక తీవ్రతకి
పగిలి శిధిలమై, కేవలం అనుభూతులే మిగులుతాయని కోరుకోనా!!
అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను.
మనం కలవాలి.
కలిసి తెలుసుకోవాలి.
తెలిసి అనుభవించాలి.
బంధింపబడటమో!
జాడైనా మిగలకపోవడమో!!
నిజాలు గ్రహించడమో!!!
లేక శిధిలమై...భావాభిప్రాయ రహితులై
కేవలం అనుభూతుల్నే మిగుల్చుకోవడమో జరగాలి.
మనం తప్పక కలవాలి.
ఈ గోడల్నిదాటి ఆ కలయిక జరగాలి.



*****

19 comments:

మీనాక్షి said...

బా రాసారు మహేశ్ గారు..

Jagadeesh Reddy said...

ఏమి చెప్పాలో తెలియడం లేదు.... simply superb

Purnima said...

బ్లాగుల్లో ఇవ్వన్ని విషయమేమో ఇది.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.

ఇది గురించి ఆలోచించి నేను ఉద్ధరించేది ఏదీ లేదనుకున్నాను. ఊ..హూ.. ఆలోచించిస్తున్నా.. నాకు ప్రస్తుతం ఒకటే అనిపిస్తుంది.. టి.వి లో ఏదో సిమెంట్ ఆడ్ వస్తుంది. అందులో అన్నదమ్ముల కుటుంబం విడిపోయి మధ్యన గోడ కట్టేస్తారు. ఆ తర్వాత చాన్నాళ్ళకు మళ్ళీ కలిసిపోదామని ఆ గోడను కూల్చడానికి ప్రయత్నిస్తారు..కానీ అది వీలు పడదు.. ఎంత శ్రమించినా (ఈ సిమెంట్ వాడడం.. వల్ల అని వాడి పాయింట్) ఆడ్ ఆఖరున.. ఇరు కుటుంబాలు ఆ గోడ మీదే చదరంగం ఆడుతున్నట్టు.. వంటకాలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు చూపిస్తారు. మనుషులు కలవాలి అనుకుంటే.. పడగొట్టలేని గోడల్ని కూడా మనసుతో గెలవచ్చేమో!! ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా!!

సుజాత వేల్పూరి said...

ఈ విషయం నేను బెర్లిన్ గోడ అప్పటినుంచీ ఆలోచిస్తున్నా!

చివరి రెండు లైనులూ చాలా బాగున్నాయి! ఈ కవితకు ప్రేరణ ఏదైనా ఉందా?

Bolloju Baba said...

కవిత చాలా బాగుంది.
గోడలు కట్టటం చాలా సులువే పడగొట్టుకోవటమే దుర్లభం. బెర్లిను వాల్ పడగొట్టటం అప్పట్లో గొప్ప చారిత్రక విజయంగా చెప్పుకొన్నారు.
మంచి భావాలు పలికించారు కవితలో. అభినందనలు.

చిన్న సన్నాయి నొక్కు
good walls make good neighbours అంటారూ?

బొల్లోజు బాబా

Sujata M said...

Yes. Godalu absolutely necessary. When did u come from Delhi then ?

కొత్త పాళీ said...

బహు బాగు.

నిషిగంధ said...

చాలా బావుందండీ!!

ఏకాంతపు దిలీప్ said...

చాలా బాగుంది..

బాబా గారు మీరు చెప్పిన విషయం కూడా..

Anonymous said...

చాలా బాగుంది

Unknown said...

ఓపినింగ్ చాలా బావుంది. ఈ కవితకు ప్రేరణ ఏదైనా ఉందా? అదే నేను కూడా అఆడుగుదామనుకున్నా

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది మహేష్ గారు, నేనైతే ఖచ్చితం గా ఎదో బలమైన ప్రేరణ ఉండి ఉంటుంది అనుకుంటున్నాను :-)

Kranthi M said...

simply superb అని మాత్రమే చెప్పగలను ప్రస్తుతానికి. ఇ౦కా చెప్పాల౦టే మళ్ళీ నేను కవిత రాయాలి.

pruthviraj said...

హాయ్. మహేశ్ గారు.. నాకు నచ్చిన అబిప్రాయాన్ని కవితలో చెప్పారు..నిజంగా నాకు అలాంటి బావాలే వున్నాయి. నేను మీ కవితను ఇష్టపడుతున్నాను. ఒక బొమ్మను గీయాలని పిస్తున్నది. వేసి పోస్ట్ చేస్తాను అతి త్వరలో...
చాలా బావుంది హృదయగోడలు.

Kathi Mahesh Kumar said...

ఈ కవిత ప్రేరణ గురించి ఒక్క మాట.
నా మిత్రుడొకడు బలమైన వ్యక్తిత్వంగల అమ్మాయిని ప్రేమించాడు.ఇప్పుడు ఆ అమ్మాయి తరఫు నుండీ పాజిటివ్ సంకేతం లభించింది.కానీ, పెళ్ళిదాకా వెళ్ళవలసిన ఈ ప్రేమలో "ఆ అమ్మాయి బలమైన వ్యక్తిత్వం,ఇతడి జీవన ఆదర్శం మధ్య ఘర్షణ తలెత్తుతుందేమో!" అనేది అతడి సందేహం.They agree on lot of things,but have dramatically opposite ideas and plans for life.

ఈ ఘర్షణకు రూపమే ఈ కవిత. కాకపోతే, యాదృశ్చికంగా ఈ కవిత రాసేముందు ‘రమణి’ గారి బ్లాగులో పూర్ణిమ మరియూ దిలీప్ ల భేధాభిప్రాయాల పరంపర చదివాను. ఈ కవిత ఇలా రూపుదిద్దుకోవడానికి ఆ చర్చకూడా కారణమనుకుంటాను.కాబట్టి నాకు ప్రేరణ నందించిన నా మిత్రుడికి,పూర్ణిమకు దిలీప్ కూ నా కృతజ్ఞతలు.

@సుజాత; నేను పెట్టిన ఫోటో ‘బెర్లిన్ వాల్’దేనండోయ్!

@బాబాగారు: నిజమే good walls make good neighbours అంటారు కానీ గోడలు నిర్మించేటప్పుడు ప్రముఖ ఆంగ్లకవి Robert Frost చెప్పినట్లు "Before I built a wall I'd ask to know
What I was walling in or walling out,
And to whom I was like to give offence. " అనేది తెలియాలి.అంతేకాక కొన్ని సంబంధాలు గోడల్ని కూలిస్తేగానీ ఏర్పడవుకదా!

@సుజాత:ఇప్పుడే ఢిల్లీనుండీ వచ్చానండీ.వస్తూవస్తూ నా స్నేహితుడి లాప్ టాప్ లో కవితరాసి, పోస్ట్ చేసిమరీ విమానమెక్కా!

@మీనాక్షి,జగదీష్,కొత్తపాళీ,నిషిగంధ,మురళీధర్,దిలీప్,అశ్విన్,వేణు,క్రాంతి,పృధ్వీ: అందరికీ నెనర్లు

Bolloju Baba said...

agreed

రాధిక said...

wow....ippude cusanamdi.cala baga rasaru.loatayina,padunayina bhaavaalu.great sir

Bala said...

it is something like my love life...

మరువం ఉష said...

అవును పగలాలి ఈ విబేధాల గోడలు, మనసు బీడులో మమతలు మొలకలెత్తాలి. తనువుల్ని కలిపేది మనువులు కాదు, పెనవేసిన అనుభూతులు. ఆ కలయికలే మనిషి మనుగడకి పెట్టని గోడలు.