Sunday, June 29, 2008

తప్పకుండా చూడవలసిన సినిమా - `ద్వీప' (కన్నడ 2002)

ఇళ్ళకూ, పొలాలకూ ఇతర ఆస్తులకూ వెలకట్టొచ్చు. గౌరవానికీ, నమ్మకానికీ, జ్ఞాపకాలకీ వెలకట్టగలమా? చాలా అమూల్యమైన ప్రశ్న ఇది. ‘డ్యామ్’ పునరావాసంలోని మానవీయ కోణాన్ని సూటిగా సంవేదనాత్మకంగా తెరకెక్కించిన ‘గిరీశ్ కాసరవెళ్ళి’ చిత్రం ‘ద్వీప’ (తెలుగులో ‘ద్వీపం’ అనొచ్చు). దివంగత ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల కథానాయిక సౌందర్యం నిర్మించి నటించిన చిత్రం ఇది. ద్వీప ఉత్తమ చిత్రంగా భారత ప్రభుత్వ స్వర్ణకమలం పురస్కారాన్ని కూడా అందుకుంది.



కొన్ని సినిమాలను చూసి, ఆనందిస్తాం. కొన్నింటిని తిలకించి విశ్లేషిస్తాం. మరికొన్నింటిని ఆరాధిస్తాం. కానీ ‘ద్వీప’, అనుభవించాల్సిన చిత్రాలకోవలోకి వస్తుంది.



ఒకవైపు డ్యాం పునరావాసం పై సామాజిక చర్చతోపాటూ, మరో వైపు మానవసంబంధాల సున్నితత్వాన్ని కూడా స్పృశించిన చిత్రమిది. ముంపుకు గురవ్వబోయే ద్వీపాన్ని విడిచి వెళ్ళని నమ్మకం, ప్రేమ ఒకవైపు కనిపిస్తే, తన సామ్రాజ్యమైన ఇంటిని కాపాడుకోవడానికి ఒక మహిళ పడే తపన, ప్రయత్నం కనిపిస్తాయి. ఇంత క్లిష్టమైన విషయాన్ని తెరపైకి అనువదించడం చాలా కొద్దిమంది దర్శకులకే సాధ్యం. వారిలో ఒకరు, ‘గిరీశ్ కాసరవళ్ళి’ అన్నది నిజం. సినిమా నిడివి కొంత ఎక్కువనిపించినా, చెప్పాలనుకున్న విషయం కూడా అంతే ముఖ్యమైంది కాబట్టి కొంత ఓపిక ప్రేక్షకులకి తప్పదు.



`గణపయ్య' (అవినాష్) మరియూ `నాగక్క' (సౌందర్య) అనే భార్యాభర్తలు వారి పెద్దదిక్కు గణపయ్య తండ్రి 'దుగ్గజ్జ' (వాసుదేవ రావ్) తో కలిసి ఒక ద్వీపంలో ఉంటారు. అక్కడి చిన్న గుడిలో పౌరోహిత్యం చేస్తూ, "నేమ" అనబడే ఒక సాంప్రదాయ పూజను జరుపుతూ, పొట్టపోసుకొంటూ ఉంటారు. అది ఒక డ్యామ్ సైట్ కావడం వల్ల త్వరలో ముంపుకు గురయ్యే ద్వీపాలలో ఒకటిగా గుర్తించి ప్రభుత్వం అందరినీ ఖాళీ చెయ్యమంటుంది. తండ్రి ఆ స్థలాన్ని వదిలి రావడానికి ఇష్టపడకపోతే కొడుకూ, కోడలు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. వారికి సహాయంగా ఉండటానికి ఒక నవయువకుడు ‘కృష్ణ’ కూడా అక్కడికి వస్తాడు. చివరికి ఆ ద్వీపం మునిగిపోతుందా? నాగక్కకీ, కృష్ణకీ మధ్య ఉన్న స్నేహం ఏవిధంగా సమస్యల్ని తెచ్చిపెడుతుంది? చివరికి ఈ ప్రకృతి మరియూ వ్యక్తిగత కష్టం నుండీ ఈ కుటుంబం ఎలా గట్టెక్కింది? అన్నదే ఈ చిత్ర కథ.



ఈ సినిమా పూర్తి సమీక్షని ఇక్కడ చదవగలరు.



------------------------------------------------

7 comments:

వేణూశ్రీకాంత్ said...

థాంక్స్ మహేష్ ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు ఈ సినిమా గురించి విన్నాను కాని సమీక్ష చదవలేదు. నా సెర్చ్ లిస్ట్ లో ఈ సినిమా ని కూడా కలిపాను.

pruthviraj said...

కత్తి మహేష్ కుమారు గారు, సూపర్బ్. నా మనసులోని బావాలను మీ కవితల్లో వ్యక్తపరుస్తున్నారు ఐ లైక్ దెమ్ వేరి ముచ్. మీకు హృదయపూర్వక అభినందనములు..మీ ప్రతిస్పందనకు నా జోహార్లు. మీ కవితను ఇలా పొందుపరుచుకుంటున్నను నా కళాస్పూర్తి హృదయంలో...:) http://pruthviart.blogspot.com/2008/06/blog-post_3032.html
క్షమించాలి మీకు తెలియజేయటానికి ప్లేసు తెలియక ఇక్కడ కామెంట్ చేస్తున్నాను.

Kottapali said...

very interesting.
will keep it on my search list.

BTW, తెలుగులో చంద్రలత అనే యువరచయిత్రి ఇదే విషయమ్మీద దృశ్యాదృశ్యం అనే నవల రాశారు. 2-3 ఏళ్ళ క్రితం వెలువడింది. నవల్లో ఫలానా అని చెప్పకపోయినా, ఇఅతర వివరాలని బట్టి ఆ కథ శ్రీశైలం ఆనకట్ట గురించి అనిపిస్తుంది. చదవ దగిన పుస్తకం.

Purnima said...

ee chitram gurichi nenu chaala vinnanu. saundarya poye naaTike deeni gurinchi telusunu.

ivvala mee tapaa chadivaaka.. ee cinema tappani sarigaa choodali anipistundi.

inta manchi cinema nu introduce chesinanduku nenarlu.

శ్రీ said...

తప్పక చూస్తాం మహేష్ గారు.

చిలమకూరు విజయమోహన్ said...

మంచి చిత్రాన్ని చక్కటి విశ్లేషణతో సమీక్షించారు ధన్యవాదములు.

రవి said...

ఈ సినిమా నేను చూసాను, ఉదయ టీవీలో. బావుంది. మామూలుగా (ఇప్పటి) కన్నడ సినిమాలంత బాగోవు. అయితే గత 10 యేళ్ళలో నాకు తెలిసిన 2 మంచి చిత్రాలు, 1. ద్వీప 2. అమెరికా అమెరికా..

ఇందులో సౌందర్య మామ గా నటించినతని నటన (అభిలాష, రుద్రనేత్ర, స్తూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి వాటిల్లో ఉన్నడతను) సూపర్. అతను చనిపోయే సీను మనసుని ద్రవింపజేస్తుంది.

ఓ రెండు విమర్శా ముక్కలు కూడా :-)

1. సౌందర్య భర్తగా వేసినాయన అంత బావోలేడు.
2. కాస్త స్లో గా 'సాగు 'తున్నట్లనిపిస్తుంది కొన్ని దృశ్యాలలో.

ఐతే తప్పక చూడవలసిన సినిమా.