Saturday, June 7, 2008

కర్ణాటక లో ఒక బౌద్ధ విహారం
ఈ మధ్య వేసవి శెలవుల్లో కర్ణాటకలోని కూర్గ్ లేక కొడగూ అనే జిల్లాలోని ‘మడికేరి’ హిల్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. అక్కడి నుండీ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో, ‘కుషాల్ నగర్’ మరియూ ‘బైలెకుప్పే’ ఊర్ల మధ్యనున్నఒక అందమైన బౌధ విహారం ఫోటోలు మీకోసం. ఈ విహారాన్ని "గోల్డెన్ టెంపుల్" గాకూడా వ్యవహరిస్తారు.
మడికేరి, మైసూరుకు 120 కి.మీ. దూరం. ఈ బౌద్ధవిహారం 30 కి.మీ ముందే వస్తుందిగనక దాదాపు 90 కి.మీ అనుకోవచ్చు. మైసూరు నుండీ ‘కుషాల్ నగర’ చేరాలంటే మంగుళూరు,మడికేరి కి వెళ్ళే ఏ బస్సునెక్కినా చేరుస్తాయి. 60-90 రూపాయలతో ఇక్కడికి చేరచ్చు. రోడ్డు బాగానే ఉంది గనక దాదాపు 2 గంటల ప్రయాణం మాత్రమె. కుషాల్ నగర్ నుండీ కేవలం 5-6 కి.మీ దూరమే ఈ గోల్డెన్ టెంపుల్. కాబట్టి అక్కడనుండీ ఆటోలు విరివిగా దొరుకుతాయి.అదీ కేవలం 40-60 రూపాయలు ఖర్చు చేస్తే చాలు.
-----------------------------------------------

7 comments:

కొత్త said...

బావుంది.
ఈ ప్రదేశానికి వెళ్ళడానీ తగిన మార్గాలేవిటో చెబితే ఉపయోగంగా ఉంటుంది.

Kathi Mahesh Kumar said...

మడికేరి, మైసూరుకు 120 కి.మీ. దూరం. ఈ బౌద్ధవిహారం 30 కి.మీ ముందే వస్తుందిగనక దాదాపు 90 కి.మీ అనుకోవచ్చు. మైసూరు నుండీ ‘కుషాల్ నగర’చేరాలంటే మెంగుళూరు,మడికేరి కి వెళ్ళే ఏ బస్సునెక్కినా చేరుస్తాయి.60-90 రూపాయలతో ఇక్కడికి చేరచ్చు.రోడ్డు బాగానే ఉంది గనక దాదాపు 2 గంటల ప్రయాణం మాత్రమె. కుషాల్ నగర్ నుండీ కేవలం 5-6 కి.మీ దూరమే ఈ గోల్డెన్ టెంపుల్. కాబట్టి అక్కడనుండీ ఆటోలు విరివిగా దొరుకుతాయి.అదీ కేవలం 40-60 రూపాయలు ఖర్చు చేస్తే చాలు.

అబ్రకదబ్ర said...

నాలుగో ఫొటోలో బుద్ధుడికి రెండుపక్కలా ఉందెవరు?

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర,‘మహా(యోగ)మాయ’ మరియూ ‘పద్మ సంభవుడూ’ అనుకుంటా. అక్కడ పేర్లు చదివానుగానీ ఇప్పుడు గుర్తులేవు.వాటి అందాన్ని చూసి అబ్బురపడటానికే సమయం సరిపోయింది.నా ఫోటో వాటికి న్యాయం చేకూర్చలేదనుకుంటా. నిజంగా చూస్తే,మహాదానందం గా అనిపిస్తుంది.(సుజాతా శ్రీనివాస్ గారు కూడా ఎక్కడో ఈ బుద్దుడి విగ్రహం గురించి చెప్పినట్లు గుర్తు. ఎక్కడ చప్మా!)

కొల్లూరి సోమ శంకర్ said...

మేము మా హనీమూన్‌కి కూర్గ్ వెళ్ళాము. తిరుగు ప్రయాణంలో ఈ బౌద్ధ విహారాలని చూసైనట్లు గుర్తు. కూర్గ్, తలకావేరి, అబ్బే ఫాల్స్ ఇవన్నీ చక్కటి ప్రదేశాలు. కూర్గ్‌లో ఓంకారేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది. మా ఆవిడ మళ్ళీ ఇంకో సారి కూర్గ్ వెడదామని ఎప్పటినుంచో అడుగుతోంది. కాని కుదరడంలా! మళ్ళీ ఎప్పుడు వెళ్ళగలమో?

సుజాత said...

మహేష్ గారు,
బాగుందండీ! నేను కూర్గ్ వెళ్ళినపుడు కుషాల్ నగరు వెళ్ళాను. వారి అనుమతితో అక్కడ వీడియో కూడా తీసాను. ఇంతకు ముందు మీరు ఈ బైల్ కుప్పె గురించి రాసినపుడు ఈ విగ్రహం గుర్తు చేసుకున్నాను. నేనే ఆ ఫొటోలు, లేదా వీడియో నా బ్లాగులో పెడదామనుకుంటుండగా, ఆ పని ఎంచక్కా మీరే చేసేశారు.ఆ విగ్రహాలు, చిన్న చిన్న బౌద్ధ సన్యాసులు, నాకు బాగా నచ్చింది బైలు కుప్పె.

ప్రవీణ్ గార్లపాటి said...

ఓ ఆరేళ్ళ క్రితం అనుకుంట ఇంజినీరింగు ఆఖరి సెమిస్టరులో క్లాసు ట్రిప్పుకి కూర్గ్ వెళ్ళాము. అప్పుడు చూసాను ఈ మానెస్ట్రీ...
బాగుంటుంది. బుద్ధుడి ప్రతిమలు ఎంతో అందంగా ఉంటాయి.
పిల్ల బౌద్ధ మాంకులు అక్కడ క్రికెట్టు, ఫుట్‌బాలు గట్రా ఆడుతుంటారు.