Sunday, June 22, 2008

తప్పకుండా చూడవలసిన సినిమా - ఆమిర్ (హిందీ)


‘ది హ్యాపెనింగ్’, ‘దశావతారం’ వంటి భారీ చిత్రాల నడుమ గత వారం సైలెంట్ గా రిలీజైన హిందీ సినిమా ‘ఆమిర్’. ఒక కొత్త దర్శకుడు, అసలు పేరుకూడా సరిగ్గా తెలియని ఒక కొత్త హీరోలతో UTV వారి ‘స్పాట్ బాయ్ మోషన్ పిక్చర్’ బ్యానర్ నిర్మించిన సినిమా ఇది.



అప్పుడే విదేశం నుండీ వచ్చిన ‘అమీర్’ అనే ఒక ముస్లిం డాక్టర్, ముంబై ఎయిపోర్ట్ లో అడుగుపెట్టాగానే, తన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసారని ఒక ఫోన్ కాల్ ద్వారా తెలుస్తుంది. ఆ కిడ్నాపర్లు చెప్పినట్టు చేస్తే అందరికీ విముక్తి అని ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. అసలు ఆ అజ్ఞాత వ్యక్తి తన ద్వారా చేయించదలుచుకున్న పనేమిటి? తన తలరాత (किस्मत)ని ఫోన్ కాల్ ద్వారా శాసిస్తున్న వ్యక్తికి, అప్పటి వరకూ తన భవిష్యత్తును తనే మలుచుకున్న అమీర్ ఆఖరికి చెప్పిన సమాధానం ఏమిటి? అన్నది ఈ సినిమా ఇతి వృత్తం.



ఇలాంటి విషయాన్ని ఎన్నుకోవడం లోనే, మొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న ‘రాజ్ కుమార్ గుప్తా’ యొక్క పరిణితి, అభిరుచి కనపడుతుంది. అమీర్ పాత్రలో నటుడిగా ఒక కొత్త ముఖంగా ‘రాజీవ్ ఖండేల్వాల్’ పరిచయ్యాడు. మొదటి ఫ్రేమ్ నుండే రాజీవ్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నటనతో పాటూ, తెరమీద తన ఉనికి చాటుకునేలా ఉన్న ఇతడి స్క్రీన్ ప్రెజెంస్,వాయిస్ క్వాలిటీ రాబోయే కాలంలో అతడ్ని నిలబెడుతుందనిపిస్తుంది. దాదాపు 1 గంటా 35 నిమిషాల ఈ సినిమాలొ ఇతను తప్ప ఇంకెవ్వరూ స్క్రీన్ పైన కనిపించరు. ఆయినా ప్రేక్షకుల్ని కట్టిపడవెయ్యగలిగాడంటే, భవిష్యత్తులో చాలా సినిమాలలో ఇతను కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది.



అమీర్ విమానం లో ముంబై రావడంతో సినిమా మొదలై, అక్కడే ఇమిగ్రేషన్ అధికారి తన లగేజ్ మూడు సార్లు చెక్ చేసి "తను ఒక ముస్లిం,కాబట్టి అనుమానించాలి" అన్న భావాన్ని ఎత్తిచూపుతాడు. అయినప్పటికీ ఆ సంఘటన లో అమీర్ చూపే సహనం, మిగతా సినిమాలో తన ప్రవర్తనకి,ఆఖర్న తను తీసుకునే నిర్ణయానికీ ప్రాతిపదికగా మారుతుంది. ఇలా ఆరంభంలోనే ఒక పాత్ర స్వభావాన్ని సున్నితంగా చెప్పిన సినిమాలు ఈ మధ్యకాలంలో చూసినట్లు లేదు.

(పూర్తి సమీక్ష కోసం http://www.navatarangam.com/?p=502 ఈ లంకెను నొక్కండి)

6 comments:

రాధిక said...

అప్పుడే నాలుగు రోజులుగా ఏదో ఒక సినిమా చూడాలని వున్నా ఇది మాత్రం తప్పించి అన్నీ చూస్తున్నాను.మీరు చెప్పారు కాబట్టి ఈ రోజే చూస్తాను.ముందుగానే థాంక్స్ చెప్పేస్తున్నాను మంచి సినిమా చూపిస్తున్నందుకు :)

Purnima said...

ఈ సినిమా సమీక్షకోసం ఎదురు చూస్తున్నా!! ఇందులో హీరో.. హిందీ ఛాన్నళ్ళలో వచ్చే డైలీ సీరియల్స్ లో మంచి పేరున్నవాడు. బాగుంటాడు.. బాగా చేస్తాడు. ఇతని పేరు రాజీవ్ ఖండేల్వాల్. మంచి చిత్రం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

రాధిక said...

హీరో నటన,కధ,కధనం అద్భుతం.కానీ సినిమాని ఒక అరగంట తగ్గిస్తే బాగుండుననిపించింది.

Kathi Mahesh Kumar said...

@రాధిక,మీకు సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆ సినిమా నిడివి ఇంకో 30 నిమిషాలు తగ్గించేస్తే అసలే 1.35 ని" ఉన్న ఈ సినిమాని అంతకన్నా తక్కువైతే feature length film అనలేము. ఏ ధియేటర్ వాడూ వేసుకోడు.

ఈ సినిమాలో మీకు బోర్ కొట్టిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పగలరు. It will help me understand another perspective.

@పూర్ణిమ నెనర్లు. సినిమా చూడండి.

వేణూశ్రీకాంత్ said...

ఓ మంచి సినిమా ని పరిచయం చేసినందుకు చాలా థాంక్స్ మహేష్ గారు.

Anil Dasari said...

ఇది నచ్చిన వాళ్లకి Dreamworks వాళ్ల The Kite Runner కూడా నచ్చే అవకాశం ఉంది. చూడండి.