Wednesday, June 4, 2008

నా కాలేజీ జీవితం - Part 7.2


‘నవవసంతం’ లో నిర్వేదం


ఇలా నా ప్రేమ జీవితం సాగుతుండగా, ఫిబ్రవరి నాటికి మా కాలేజీకి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా, ‘మాల్దీవ్స్’ దేశం నుండీ ఇరవైమంది విద్యార్థులు వచ్చారు. వీరిలొ 17 మంది అబ్బాయిలూ, 3 అమ్మాయిలూ ఉన్నారు. అమ్మాయిలకు (అమ్మాయిల) ‘గంగా హాస్టల్’ విడిదైతే, అబ్బాయిలకు మాత్రం సాధారణంగా కాలేజికి వచ్చే గెస్టులకు నిర్దేశించబడిన‘నర్మదా హాస్టల్’ బస అయ్యింది. రావడం రావడం మా కాలేజిలో వీరొక పెద్ద కలకలం రేపారనే చెప్పొచ్చు. దాదాపు 90% మధ్యతరగతి చెందిన మా కాలేజి అబ్బాయిల నెలసరి పాకెట్ మనీ వెయ్యిరూపాయలకు మించదు. అలాంటిది ఈ కొత్త వాళ్ళ ఆర్ధికస్థితీ(వారి ఒక ‘దీనార్’ మన మూడూ రూపాయలతో సమానమట.ఈ విధంగా లెక్కేసినా వెయ్యికీ, మూడువేలకీ చాలా దూరముంది మరి) , వారి విచ్చలవిడి ఖర్చుతో కూడిన జీవనశైలీ కొంత కంటగింపు కలిగించింది. వీళ్ళందరూ మిడిల్ ఈస్ట్ కు చెందిన ముస్లిం సంతతివారు కావడంతో, కొంత మన భారతీయ రంగుకన్నా తేటగా, తెల్లగా ఉంటారు. ఇదికూడా ఈ ఇన్సెక్యూరిటీకి కారణం అయ్యింది. అంతేకాక "కొత్తొక వింత" సామెత మనకి ఉండనే ఉందిగనక, కాలేజిలో ఉన్న కొంతమంది ‘డిసైరబుల్’ అమ్మాయిలు, వీరితో స్నేహం చెయ్యడానికి ఆసక్తి చూపేసరికీ, వీరు మా కాలేజి అబ్బాయిల గుండెల్లో టెంట్ వేసిమరీ నిద్రపోసాగారు.అప్పటీదాకా గేమ్సేవీ ఆడని రంజని కూడా మార్చి నెల నాటికి షెటిల్ బ్యాట్మింటన్ ఆడే నెపంతో, ‘తాహా వాహబ్’ (ఈ మాల్దీవ్స్ వాళ్ళపేర్లు ఇలాగే ఎడ్చాయిమరి) అనే వాడితో స్నేహం చేసేసింది. అంటే సాయంత్రం మేము గడిపే రెండు గంటలలో (5.30-7.30) ఇప్పుడు మన భాగం ఒక గంటకో, నలభైఐదు నిమిషాలకో కుదింఛబడి కోతకు గురైందన్నమాట. ఈ సమయం కోతతో పాటూ, వారిద్దరూ గేమ్ మధ్య రెస్టుతీసుకోవడానికి పక్కన కూర్చుని చెప్పుకునే ఊసులతో అప్పుడప్పుడూ నా గుండె కూడా కోతకు గురయ్యేది. ఒక రోజు ధైర్యం చేసి "ఇదేమిటని" రంజని ని నిలదీశా. "నామీద నమ్మకం లేదా" అంది. "నువ్వూ వచ్చి మాతో గేమ్ ఆడచ్చుగా" అంది. "స్నేహాన్ని కూడా అర్థంచేసుకోలేవా" అంది. "మరీ ఇంత చిన్నగా ఆలోఛిస్తావెందుకూ? మరీ పల్లెటూరి బాపతులా బిహేవ్ చేస్తున్నావ్" అని నెపం కూడావేసింది. నిజంగా పల్లెబాపతు కాకపోయినా నా ‘చిన్నూరు’ బాపతు ఆలోచనలు, మెట్రో కల్చర్ పిల్ల రంజని కి పల్లెవాటం గా అనిపించడంలో తప్పులేదని భావించి, సిన్సియరుగా నన్నునేను సంస్కరించుకొని ‘పెద్దగా ఆలోచించడానికి’ ప్రయత్నించాను. కానీ మనసు మాట వినదే! ఇలా దినదినాభివృద్ది చెందిన వారి స్నేహనికి షటిల్ ఆడటం చేతగాని నేను మూగసాక్షిగా మిగిలాను. సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి, వేసవి శలవులు మొదలయ్యాయి. రంజనిని రైలెక్కించడానికి ప్రేమగా స్టేషన్ వెళితే అక్కడా ‘తాహా’ ఎదురుపడ్డాడు. బహుశా శెలవుల విరహం పరిస్తితుల్ని చక్కదిద్దుతుందనిపించి నేనూ ఇంటికి బయల్దేరాను.డిసెంబర్ శెలవులలో వారానికొకటి చొప్పున నాలుగు లెటర్లు రాసిన రంజని (తన ఇంట్లోతెలిస్తె సమస్యలొస్తాయని నేను తనకు లెటర్ రాయడాన్ని నిషేధించింది) ఈ రెండునెలల్లో కేవలం ఒక్క లెటరే రాసింది. అదీ శెలవుల ఆఖరులో, తను కాలేజికి ఒక వారం రోజులు లేటుగా వస్తున్నట్టు సమాచారం ఇస్తూ. ఎక్కడో మదిలో తీగతెగిన శబ్ధం వినిపించినా, నా ప్రేమికుడి మనసు ఆ శబ్ధాన్ని అంతగా పట్టించుకోలేదు. "ప్రేమంటే నమ్మకం" అన్న గొప్ప ఫిలాసఫీని విని,నమ్మి,జీర్ణించికున్న మనసుగా మనదీ! తను చెప్పినట్టుగానే నేనుకూడా వారం రోజులు ఆలస్యంగా ఓ సాయంత్రం వేళ కాలేజిలో అడుగుపెట్టా. కీడుని శంకించే మనసుకు, ప్రపంచమంతా తనకు వ్యతిరేకంగా గూడుపుఠాణీ నడుపుతున్నట్టనిపిస్తుందట. అలాగే నేను కాలేజి కి చేరిన మరిక్షణం నుంచీ, నా కెదురుపడిన ప్రతి ఒక్కరి కళ్ళూ నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. రూముకి చేరి లగేజి సర్ధుతుండగానే, మా హరీశూ, రమేషూ, మా రూమ్మేట్ నరసింహా ఇబ్బందిగా ముఖంపెట్టి నా ముందు నిల్చున్నారు. "ఏమైంది" అన్నా, "రంజని, తాహా తో విచ్చలవిడిగా పదిరోజులుగా తిరుగుతోంది" అని చెప్పారు. ఆ మాటవిన్న ఆ క్షణంలో నా మనసు వికలమైనా, మన ప్రేమ గట్టిదని నమ్మి, "నేను చూసుకొంటాను,పొండి" అని చెప్పి హుటాహుటిన గంగా హాస్టల్ బయలుదేరా. అప్పటీకే సాయంత్రం 7.30 కావస్తోంది, హాస్టల్ మూసే సమయం దగ్గర పడుతోంది. రంజని కోసం కబురంపితే, "బయటకు వెళ్ళింది"అని సమాచారం వచ్చింది. అప్పుడే తను హాస్టల్ వైపు ‘తాహా’ తో కలిసివస్తూ కనిపించింది. కోపం, ఉక్రోషం తన్నుకొచ్చాయి. కానీ ఇప్పుడువాటికి సమయం కాదని తలచి, "రేపు పొద్దున హాస్టాల్ గేట్ తెరవగానే కలుద్దాం" అన్నా. మరీ అంత అర్లీగా కుదరదు 8 గంటలకి కలుద్దామంది. మరుసటి ఉదయంకోసం నిద్రలేకుండా ఆరాత్రి గడిపా. బహుశా పొద్దున ఏ 4 గంటలకో నిద్రపట్టిందనుకుంటా, మా రూమీ నరసింహా నన్ను తట్టిలేపుతుండగా మెలకువొచ్చింది. మామూలుగా మార్నింగ్ వాక్ కు వెళ్ళి ఏడున్నరకొచ్చే మా నరసింహ ఇంతత్వరగా వచ్చి నన్నెందుకు లేపుతున్నాడా అనుకున్నా. "ఏంటి ప్రాబ్లమ్" అనగానే, తను పరుగెట్టివచ్చిన అలుపుని దిగమింగుకుని "రంజని, తాహా ఉన్న నర్మదా హాస్టల్ కు పోవడం ఇప్పుడే చూశా" అన్నాడు. ఒక్క క్షణం నా మెదడు పనిచెయ్యలేదు. "ఎంతసేపైంది" అని అడిగా 10 నిమిషాలపైనైందని చెప్పాడు. హడావిడిగాలేచి తయారయ్యి మరో 10 నిమిషాలలో నర్మదా హాస్టల్ ముందు నిలిచా.
దాదాపు అరగంటగా లొపల ఏమిజరుగుతోందో గ్రహించలేని మూర్ఖత్వ కాదు నాది, కానీ లోపలికి వెళ్ళి నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక హాస్టలు బయటే ఉండిపోయా. కడుపులో ఏదో తెలీని భాధ, గుండెల్లో కాల్చిన ఇనుపకడ్డీ మెత్తగా దిగుతున్న ఫీలింగ్. మరో పావు గంటకి రంజని బయటకు వచ్చింది. ఎదురుగా నేను. అంతే, ఒక్క సారి గిరిక్కున తన హాస్టల్ వైపు తిరిగి పరుగులాంటి నడకతో వెళ్ళిపోసాగింది. తన వెనుక నేను, హాస్టాల్ గేట్ దగ్గర తన చెయ్యి బలంగా పట్టుకుని ఆపాను. "Leave me Mahesh, you are hurting me" అంది. "Why did you hurt me first? why are you doing this to me?" అని మాత్రం అనగలిగాను. ఒక్కసారి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది. కాటు వేయబోయే ముందు కోడె నాగు చూపల్లే తన చూపు. తరువాత మెల్లగా అంది..."He makes me feel like a complete woman" అని. అప్రయత్నంగా నా చెయ్యిలేచింది. తన చెంప ఛెళ్ళు మంది. నా దెబ్బకు ఉక్రోషం నిండిన స్వరంతో మళ్ళీ మాట్లాడింది. "How long did you expect me to be contented with your necking and petting Mahesh? I always wanted more and you were never up to it" అంది. ఈ సారి కావాలనే కొట్టాను తన మరోచెంపమీద, మరింత బలంగా. తను తన చెంపని ఒక చేత్తో పట్టుకుని నన్ను చూసిన చూపు, ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటుంది. "నా కోరికల్ని ‘పవిత్ర ప్రేమ’ పేరుతో అణగదొక్కిన నిన్ను, మనిషిగా ఎంతగా దిగజార్చానో చూడు!" అన్నట్టుగా రంజని చూపు. విచలితుడ్నయ్యాను, చేష్టలుడిగి నిల్చున్నాను, భావరహితుడిగా, ఎంత శాతం చచ్చానో తెలియని మనిషిగా హాస్టల్ చేరాను.ఎవరో గంగా హాస్టల్ వార్డన్ కు ఈ విషయం కంప్లైంట్ చేశారట. మరుసటి రోజుకి ఒక వార్డన్ల కమిటీ ఈ కేస్ ను పరీక్షించి నన్ను శిక్షించడానికి సిద్దమై నాకు పిలుపు అందింది. ఐతే హాస్టల్ నుండీ రెస్టిగేట్ చేస్తారనీ, వీలైతే కాలేజి నుండీ కొనాళ్ళు సస్పెండ్ చేస్తారనీ రూల్స్ తెలిసిన కొందరు చెప్పుకున్నారు. "రంజని కి మారే హక్కు ఉంది గానీ, నాకు తనని కొట్టే అధికారం లేదని" అప్పటికే నమ్మిన నేను, ఏ శిక్షకైనా తయారుగా ఉన్నాను. నిజమే కదా! నా విలువల ప్రకారం చూసినా "తను చేసింది పాపమైతే, నేను చేసింది నేరం. పాపానికి క్షమ,ప్రాయశ్చిత్తం అనే అవకాశాలు ఉనాయి. కానీ నేరానికి శిక్ష తప్పదు." నా బలహీనతకూ, రాక్షసత్వానికీ సిగ్గుపడుతూ వార్డెన్ల కమిటీ రూం కి హాజరయ్యాను. అప్పటీకే మా హాస్టల్ వార్డన్ ‘గోపాల్’ మరియూ గంగా హాస్టల్ వార్డన్ ‘గీతా నాయర్’ ఉన్నారక్కడ. ఇంకా వైస్ ప్రింసిపాల్ ‘దొరై స్వామి’ కోసం వారు వెదురు చూస్తుండగానే, మా ప్రొఫెసర్ రఘునాథ్ రయ్యిమంటూ గదిలో దూరాడు. వచ్చీరాంగానే "how can you proceed aginst my student without even informing me" అని ఒంటికాలుపై ఇద్దరు వార్డన్లపైనా రెచ్చిపోయాడు. ఇది హాస్టల్ మ్యాటర్ అనీ, అందుకే తనను పిలవలేదనీ వాళ్ళు నచ్చజప్పడానికి ప్రయత్నిస్తే, "don't try to fool me. Then why is vice-principal coming to attend this proceedings" అని లాజిక్కుతో అదరగొట్టేశాడు. ఇక చేసేదిలేక తనకూ ఒక చైర్ ఇచ్చి కూచోమన్నారు. ఇంతలో దొరైస్వామి రావడం లేటౌతుందనే వార్త వచ్చింది. ఐతే మనం ప్రొసీడవ్వచ్చని గీతా నాయర్ అంటే, ఇంతలొ మా రఘునాథ్ తన మాటల్ని కట్ చేస్తూ "you have an accused. Where is the victim?" అన్నాడు. "No she is not here. Infact She has not complained. some one else at the hostel has see it and cmplained the matter to me" అని గీతా నాయర్ అంది. దానికి మా జేమ్స్ బాండ్ విజయ గర్వంతో "So, you mean to say you actually don't have a case aginst my student !?!" అని ఒకరేంజి సర్కాస్టిక్ రిమార్కొకటి పడేశాడు. దీనితో ఖంగుతిన్న వార్డన్లు రంజని కోసం కబురంపారు. తను రాగానే, నన్ను బయట ఉండమని చెప్పి తనతో మొదట మాట్లాడటం మొదలెట్టారు. బయటికి రాగానే గౌరి, హరీశ్ లు గుమ్మం దగ్గర కనిపించారు.అప్పుడర్థమైంది నాకు, మా గురుడు సమయానికి ఎలా ప్రత్యక్షమయ్యాడో. దాదాపు 10 నిమిషాల తరువాత రంజని తలదించుకుని బయటికి వచ్చింది. మా రఘునాథ్ "నా పనైపోయింది" అన్నట్టుగా బయటకు వచ్చి నాతో "Now you can go back to your hostel Mahesh" ఆన్నాడు. తరువాత నా భుజంమీద చెయ్యి వేసి, "If you have informed me this earlier, things wouldn't have come this far" అంటూ, " Dont feel bad. You have done a mistake and that girl is guilty of a blunder. Just forget everything and get back to your life" అటూ కదిలి వెళ్ళిపోయాడు. తను చెప్పింది సగమే అర్థమైనా, లోపలేంజరిగిందో ఇప్పటికీ నాకు తెలీయని విషయంగానే మిగిలిపోయింది. కాకపోతే ప్రేమలొ ఓడిపొయాననే భాధకన్నా,తనని చెంపదెబ్బ కొట్టి మనిషిగా విరిగిపోయాననే దుగ్ధ నన్ను నిర్వికారుడిగా మిగిల్చిందనిపించింది. మరుసటిరోజు ఆదివారం కాబట్టి లంచ్ కు తన ఇంటికి రావలసిందిగా గౌరి, నన్నూ హరీశ్ నూ ఆహ్వానింఛి బయల్దేరింది. హరీశ్ " सब भूल्जा बॆ!" అంటూ నన్ను హాస్టల్ కు పట్టుకెళ్ళాడు.
మరుసటిరోజు మధ్యాహ్నం గౌరి వాళ్ళింటికి వెళ్ళాం. అంతవరకూ ఈ విషయం గురించి ఏమీ మాట్లాడని గౌరి, "ఇప్పుడిలా ఎన్నాళ్ళుండాలనుకుంటున్నావ్?" అంది నా సర్వం పోగుట్టుకున్న వాలకం చూస్తూ. "నాకేం బాగానే ఉన్నా"నని బుకాయించడానికి నేను ప్రయత్నించేలోపే నా కళ్ళలో నీళ్ళు. ఎప్పుడూవచ్చాయో, ఎలా వచ్చాయో, అలా ఎంతసేపు ఏడ్చానో తెలీదు. బహుశా గత రెండురోజుల భావరహిత జీవితానికి గడ్డకట్టుకుని గుండెల్లో దాగుండిపోయాయేమో. గౌరి ఇలా అభిమానంగా అడిగేసరికీ ఒక్కసారిగా కరిగి ప్రవహించేసాయి. "మహేశ్ గె ఊటా కుడి" అని నాకు భోజనం పెట్టమని గౌరి వాళ్ళమ్మ కన్నడం లో పురమాయించడం లీలగా వినిపించి అప్పటివరకూ సోఫాలో పడిఉన్న నేను లేచాను. నా పక్కన హరీశ్ ఇంకా కూచునే ఉన్నాడు. "పాప ఇన్నూ నిద్రే మాడ్తా ఇదానే, ఆమేలె కుడోనా" ("పాపం నిద్రపోనీ, తరువాత తింటాడ్లే") అని గౌరి అనటం వినిపించింది. టైం చూస్తే దాదాపు నాలుగు కావస్తోంది. అంటే దాదాపు రెండు గంటలు ఏడ్చి నిద్రపోయానన్నమాట. ఇప్పుడు కొంత మనసు తేలికగా అనిపించింది. గౌరి వాళ్లమ్మ వడ్డింఛిన వన్నీ మారుమాట్లాడకుండా తినేశాను. బహుశా రెండురోజులుగా ఏమితిన్నానో, అసలు తిన్నానో లేదో జ్ఞాపకం అస్సలులేదు. అందుకే మంచి ఆకలిగా కూడా అనిపింఛింది. ఇక అక్కడి నుండీ బయల్దేరుతుంటే గౌరి తన పుస్తకాల కలెక్షన్ లోంచీ Betrand Rassels "Marriage and Morals" ఇచ్చి చదవమంది.
సాధారణంగా ఇటువంటి ప్రేమ వైఫల్యాల తరువాత మగాడికి కొన్నే దార్లు కనపడతాయి. మొదటిది మోసం చేసిన అమ్మాయి మీద కక్షగట్టి ఏదోఒకటి చెయ్యడం. రెండు, సెల్ఫ్ పిటీ తో దేవదాసు దారి పట్టి "కుడి ఎడమైతే పొరపాటు లేదనుకోవడం". ఇక మూడవది, "అమ్మాయిలంతా ఇంతే" అని ఇక ప్రేమకే అర్హతలేకుండా తయారవ్వడం. కానీ ఇవేవీ కాని దారిని ఆ పుస్తకం ఇవ్వడం ద్వారా గౌరి నాకు చూఫింది. అదే, పుస్తకాలలో, సాహిత్యం లో, వేదాంతంలో తరచి చూసి, నేనిప్పుడున్న స్థితికి కారణం కనుక్కుని ఈ పరిస్థితినుండీ బయటపడటం. తనిచ్చిన పుస్తకంలో రస్సెల్స్ ఒక చోట అంటాడు "Sex is a matter between two grown-up individuals and of no interest to society till a child is involved" అని. ఈ ఒక్క మాటతో, రంజని విషయంలో నేనుచేసిన తప్పు తెలిసొచ్చింది. నా సమాజం- కుటుంబం ద్వారా,సినిమాల ద్వారా నా కందించిన ‘సెకండ్ హ్యాండ్ ఎంగిలి విలువల్ని’, ‘నా విలువలు’గా భ్రమించి, రంజని అవసరాలతో,ఆకాంక్షలతొ నిమ్మిత్తం లేకుండా, ఏక పక్షంగా మా ప్రేమను పవిత్రంగా ఉంచడం, నా మూర్ఖత్వం కాక మరేమిటి? చలం ‘మైదానం’ లోని అనిర్వచనీయమైన, అవధులులేని, అన్ కండిషల్ ప్రేమ ఉనికిని తెలుసుకుని కూడా ఆచరించే దమ్ముచాలని నాబోటి పిరికివాడికిది తగిన శాస్తికాదా? "యవ్వనం ఒక ప్రాచీనశక్తి, ఈ శరీరం దానికి ఊడిగం చెయ్యక తప్పదు" అని బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ లో తెలియజెప్పినా, యవ్వనానికి దాస్యం చెయ్యక ఎంగిలి విలువల్ని ఆదర్శాలుగా భ్రమించి, నా యవ్వనానికీ ద్రోహం చేసిన ద్రోహినికానా? ఇక "Values are not absolute, they are just relative. Some times they are mutually exclusive , some times praportionatley opposite to each other and mostly highly individualistic." అని చెప్పిన జిడ్డు కృష్ణమూర్తి తత్వాన్ని గుర్తెరిగినా, నాకీ అను(పరా)భవం తప్పేదేమో, నా ప్రేమ నాకు దక్కేదేమో! గర్భనిరోధకాలున్న(కాన్ట్రాసెప్టివ్స్) ఈ నవీన కాలంలో, నేను కాపాడిన విలువలకి అర్థముందా? ఇలాంటి దశలో రంజని ఎంఛుకున్న విలువలు తప్పవుతాయా?ఇలా నా నవవసంతం నిర్వేదంగా మారి నైరాశ్యాన్ని మిగిల్చినా, వైరాగ్యాన్ని కలిగించినా. సాహిత్యం, వేదాంతం దారి చూపి నా స్నేహితురాలు, సగం చచ్చిన నన్ను నా తప్పులు తెలిపి, నా విలువల బేరీజు చేసుకుని ఒక కొత్త రూపం దాల్చే అవకాశమిచ్చింది. హరీశ్ లాంటి మిత్రులూ గౌరి లాంటి ఆత్మబంధువు సహాయంతో, ఈ జీవితానుభవంలోని సారాన్ని మాత్రం గ్రహించి, ఈ అనుభవం యొక్క చేదుని మాత్రం మనసుకంటనివ్వలేదు. తరువాత కొన్నాళ్ళకు తాహా వెళ్లిపోయాడు. నేను అక్కడ ఉన్న రెండు సంవత్సరాలలొ రంజని తో ఎప్పుడూ మాట్లాడలేదు. ఫేర్వెల్ రోజున తను నా దగ్గరకొచ్చి చిన్నగా "సారీ" అనగలిగింది. నేను మాత్రం "ధ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్" అని ఊరుకున్నా.

------------------------------------------------43 comments:

విహారి(KBL) said...

really excellent narration.chala baga rastunnaru.idanta oka novelgano,movie gano teeste chala bavuntundi.try cheyyandi.

mmksworld said...
This comment has been removed by the author.
prasadm said...

అత్యద్భుతమైన కథనం. మీ జీవితంలో నిజంగా ఈ సంఘటన జరిగిందో లేదో నాకు తెలీదు కానీ, ఇటువంటి సంఘటనలే మా కాలేజీలోనూ మూడు నాలుగు జరిగాయి. జరిగిన ప్రతీ సంఘటనలోనూ అమ్మాయిలే విలన్లు.

ప్రసాదం

sujata said...

చాలా బావుందీ పార్ట్. మీరు ఏడవటం గురించి చదివి.. నా ఫెయిల్ అయిన తొలి ప్రేమ గుర్తొచ్చింది. ఇప్పటికీ పదేళ్ళ క్రితం లాంటి బాధే అనుభవం లోకి వచ్చింది. మా కాలేజీ లో అందరూ.. ఒక్కొక్కరూ కళ్ళ ముందు రీళ్ళ లాగా.. కదులుతున్నారు. ఇట్స్ రీల్లీ లవ్లీ మగేష్ !

Bobby said...

Really Superb....
Heart touching...
Okkasari naa paata gnapakaalu nanau tadimaayi

logiclavangam said...

Wat can i say mahesh garu, really excellent stuff!
You won't believe if i say that now a days i search for updates of your blog rather than my e-mails in the morning!

Keep writing!

కొత్త పాళీ said...

చాలా సెన్సిటివ్ విషయం. అందులోనూ ఆత్మ కథ అని చెప్పుకొస్తున్న కథనం. మన గుండెనీ, మనసునీ, అసంకల్పంగా చేసే చేతల్నీ బయటికి చెప్పడానికీ, మనకి మనం ఫేస్ చెయ్యడానికీ చాలా ధైర్యం కావాలి. నిజాయితీగా సూటిగా చిత్రించారు. అభినందనలు.

ఇక పోతే ఈ వాయిదాలోని కథ సరుకు గురించి ఇంకొంచెం ఆలోచించాలి. మళ్ళి వస్తాను.

రానారె said...

ఔను ఈ తరహా విషయాలు నిజాయితీగా రాయాలంటే ధైర్యం కావాలి. మీ బ్లాగులోని పదవటపా చదివినప్పుడు నేనూ మీ అభిమానుల జాబితాలో ఆటోమాటిగ్గా చేరిపోయాను. మీరు రాస్తున్న పద్ధతి సూపరో సూపర్. ఇందులోని నిజాలను ఈ కథలోని ఇతర పాత్రలు అవి ప్రస్తుతమున్న పరిసరాల్లో ఇప్పుడెలా ఎదుర్కొంటాయోననిపిస్తూవుంది.

వికటకవి said...

రానారె తో ఏకీభవిస్తున్నాను.

రాధిక said...

చాలా బాధ కలిగింది చదివాకా.ఈ టపాల్లో కొన్ని పాత్రలు కల్పితాలన్నారు.కానీ గౌరి పాత్ర కల్పితం కాకూడదని కోరుకుంటున్నాను.అలాంటి గొప్ప స్నేహితులు జీవితాల్ని నిలబెడుతూ ఉంటారు.

Kathi Mahesh Kumar said...

@విహారి, నెనర్లు. నవలగా రాశే ఆలోచన సుజాతగారు ఇదివరకే సూచించారు.ఆ దిశగా ఒకసారి ఈ కథ మొత్తం ఇలా రాసేసిన తరువాత ప్రయత్నిస్తాను. ఇక సినిమా అంటారా, ఆపైన మన ప్రాప్తం అంతే!

@mmksworld:అప్పుడు పడిన బాధ మళ్ళీ ఇది రాస్తున్నప్పుడు కాస్త పడాల్సి వచ్చింది.ఈ విషయం జరిగి దాదాపు పది సంవత్సరాలైంది కాబట్టి, కావల్సిన ‘డిటాచ్ మెంట్’వచ్చేసిందని రాయడం మొదలుపెట్టా. కానీ రాసేంతసేపూ still that part of me is missing అనిపించింది.

ఇక రంజని విషయం కాలేజి ఆతరువాత నేను పెద్దగా కూపీతియ్యలేదు. కాకపోతే తను ఊటీ లోని ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్ గా కొన్నాళ్ళు పనిచేసిందని విన్నాను. ఇప్పుడెక్కడుందో (మా ఉద్దరికీ పరిచయమున్న)ఎవరికీ్ తెలియదు.

@ప్రసాదం గారు, నా జీవితంలో జరిగిన ఘటనేనండీ ఇది. మీకాలేజిలో కూడా ఇలాంటివి జరగడం, ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయనడానికి నిదర్శనం మాత్రమేనేమో!అందుకే అబ్బాయిలకు ఈ విషయంలో కొన్ని అవగాహనలు కల్పించడం అవసరమనుకుంటా.

@సుజాత గారు,నా (చేదు) అనుభవం మీకు పది సంవత్సరాల క్రితం బాధని గుర్తు చేసిందంటే, నేను రాశేటప్పుడు మళ్ళీ అనిభవించిన భాధకు సార్థకత లభించినట్టే.ఇక కన్నీళ్ళంటారా! అవి వస్తేనేగానీ మనసులో బాధ కరిగి ప్రవహించదనుకుంటా.What a releaf it is, once you cry and let go off all your sadness.

@Bobby & logic lavangam:నెనర్లు.

@కొత్తపాళీ గారు,ఆ ధైర్యం పది సంవత్సరాల తరువాత వచ్చిందనునుకున్నాను. కానీ రాస్తున్నప్పుడు కొన్నిసార్లు ముందుకు సాగడం కష్టమైంది. రంజనిని విలన్ను చేసెయ్యడం చాలా సులభం, కానీ జరిగిన తప్పులో నా భాగం‘అర్థం’చేసుకునే ప్రయత్నంలో తనమీద కోపం కంటే సానుభూతి కలిగింది నాకు. నావైపునుండీ జరిగిన తప్పు తెలుసుకోవడం మూలంగా మనిషిగా కొంత నాలో మార్పు వచ్చి, నాకు మంచేచేసింది. కాకపోతే ఆతరువాత నేను మార్చుకున్న(మార్చుకుంటూ ఉన్న) విలువల ప్రస్తావన ఇక్కడ తేలేదు.కేవలం ప్రశ్నలు గానే వదిలేసాను. వాటి గురించి బహుశా ప్ర్తత్యేకంగా చర్చించాలేమో!

@రాధిక గారూ,ఇక్కడ ఏ పాత్రా ‘పూర్తి కల్పన’ కాదు. గౌరి పాత్ర అసలుకాదు. తన మరణవార్త తెలిసి, ఒకసారి మళ్ళీ కలిసిన మా క్లాస్ మిత్రుల అందరి జీవితాల్లొ ఈ అమృతహస్తం ఎప్పుడో ఒకప్పుడు life defining మార్పు తీసుకువచ్చిన విషయం నాకు తెలిసింది. She touched all our lives in a special way.May her soul rest in pease,but her spirit be alive in all of us.

krisj said...

Chala baaga rastunaaru, Oka novel chadivinappudu kalige interest mee blog lo undi. Next Part kosam wait chestunna.

శ్రీ said...

అహా..మహేష్ గారు, మీ తొలి ప్రేమ మీద చాలా ఆశలు పెంచుకుంటే ఈ భాగం లో అవన్నీ తుంచేసారు. చదువుతున్న నాకే ఇంతగా ఉంటే మీరు ఎంతగా ఫీల్ అయిఉంటారొ తల్చుకుంటే బాధగా ఉంది. కాకపొతే మీ అదర్శ విలువలు మిమ్మల్ని మంచి మనసున్న మనిషిగా నిలబెట్టాయి. మీ ప్రేమ సంగతులు చదువుతూ ఉంటే నాకూ ఆరవ తరగతి నుండీ మొదలయిన పలు ప్రేమాయణాలు గిర్రున తిరిగాయి.

Srinivas said...

గౌరి మరణవార్తే ఆత్మీయులెవరో పోయినట్టు మనసుని కదిలిస్తే, మీ ప్రేమ వైఫల్యం మరింత బాధించింది. తట్టుకుని మీరు తేరుకున్న తీరు ప్రశంసనీయం. ఆమెను విలన్‌గా చూపించకపోవడంలో వ్యక్తిగా మీ పరిణితి కనిపిస్తుంది.

ఇది కారణంగా మీ విలువలు తప్పు అనుకోవడం మీదా, విలువలు మార్చుకోవడం మీదా నా అభిప్రాయాలు వేరు. తప్పొప్పుల ప్రసక్తి లేకుండా ఇద్దరి విలువలూ ఒకటి కాకపోవడమే ఇక్కడ గమనించదగినది. మీరన్నట్టు వేరే చోట చర్చించదగిన అంశమది.

అబ్రకదబ్ర said...

ఒక కాలేజీ కుర్రాడి మనస్తత్వంతో చదివితే బాగానే ఉంది కానీ నాకర్ధం కానివి కొన్ని ఉన్నాయి మీ కధలో (ఈ భాగంలో). రంజనిని విలన్ గా చూపకూడదనే ఆతృతలో ఏదేదో రాసేసినట్లనిపించింది నాకు.

పెళ్ళికి ముందు తొందర పడే ధైర్యం లేకపోవటం అనే పేరుతో మిమ్మల్ని మీరు విమర్శించుకున్న పద్ధతి బాగోలేదు. పైగా ఆ వాదానికి సపోర్టుగా రకరకాల రచయితల రాతల్లోంచి ఏరుకున్న సూక్తులు! ఒక పుస్తకంలో వాళ్లు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా మరో పుస్తకంలో చెప్పి రెండూ సరైనవేనని ఒప్పించగల ఘటికులు వాళ్లు. రంజనికి, మీకు ఉన్నది కాలేజి రోజుల్లో చాలామందికి ఉండేటటువంటి ఆకర్షణతో కూడిన సంబంధమే కానీ అది ప్రేమ కాదు. ఆమె కోరుకున్నదాన్ని మీరిచ్చినంత మాత్రాన ఆమె తాహాతోనో మరొకడితోనో తిరగదని నమ్మకమేమిటి? ఒకవేళ మీవద్ద తనక్కావలసింది దొరికింది కదా అని ఆమె మీతోనే ఉన్నా అది మీరన్న 'అన్ కండిషనల్ లవ్' ఎలా అవుతుంది? విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉంది మీ ఆత్మవిమర్శ.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర గారూ, "ఎవరైనా అడుగుతారా!" అనుకున్నాను. మీరిప్పుడడిగేసారు.

రంజనిని విలన్ కాకుండా చెయ్యాలనే ఆత్రం నాలో ఎందుకుండాలి, తను విలన్ కాదని నేను నమ్మినపుడూ? నా వరకూ తను తన అవసరాలకు అనుగుణంగా విలువలు సృష్టించుకుని, మారిపోయింది (అది తాహాతోనో,మరొకడీతోనో లేక ఒకేసారి పది మందితో తిరగడమైనా సరే). నేను ‘ఎవరో ఇచ్చిన విలువల్ని’ పాటిస్తూ, ఒక relationship లోని expectations ని త్రోసిపుచ్చుతూకూడా, ఆ బంధం కొనసాగాలని కాంక్షించాను. ఇక్కడ తప్పెవరిదంటారూ?

నా విమర్శ ‘విచ్చలవిడితనాన్ని ప్రోత్రసిస్తున్నట్టుగా’ మీకు అనిపించిందన్నారు. నా ఉద్దేశం మాత్రం, "ఒక వేళ ఇద్దరు పెద్దలైన ఆడమగా తమ సంబంధంలో విచ్చలవిడితనం కోరుకుంటే,అది అనుభవించమని" మాత్రమే.ఎందుకంటే, ప్రతి సంబంధం తన రూల్స్ తనే నిర్ణయించి బతికితేనే అది ఒక స్వతంత్రమైన relationship అవుతుంది. మారిన నా విలువలలో ఒకటి ‘ప్రతి సంబంధానికి సహాఅంగీకారమైన (Mutually agreed) ఒక నిర్ధిష్టమైన ప్రాతిపదిక (basis) కావాలి’ అని.ఆ సంబంధం సమాజయోగ్యం కావటం కూడా ఆ ప్రాతిపదికలో భాగమే. ఒకవేళ అవసరం లేదు, అనుకుంటే దాన్ని కూడా పక్కకు పెట్టి సంబంధాల్ని నెరపవచ్చు.

నా వాదానికి అనుగుణంగా నేనెంచుకున్న రచయితల సూక్తుల్ని ప్రస్తావించారు."Interpretaion is a projection of what reader wants to gain out of a given text" అన్న psychoanalysis మీకు తెలుసనుకుంటాను.నేను దీనికి మినహాయింపు కాను.ఆ పరిస్తితుల్లో ఆ రచయితలు వేరే మాటలు చెప్పున్నా, నాకు మాత్రం నేను కావాలనుకున్నవే కనపడేవేమో!

కాకపోతే, ఇక్కడ గౌరి ఆ పుస్తకం నాకు ఇవ్వడం లో ఉద్దేశం స్వాంతన కలిగించడం.ఆ పుస్తకం అప్పటి నా భాధలకు అద్దంపట్టి,విశ్లేషణకు మరియూ ఆత్మవిమర్శకూ దారి చూపి నన్ను మళ్ళీ ‘మామూలుగా’ మారుస్తుందనే ఆశ. అవి నెరవేరాయిగా!!

ఇక నా ఆత్మవిమర్శ ఆ అనుభవం,ఆతరువాతి పఠనం నుండీ కలిగినవి. వాటిని మళ్ళీ absolute values గా ప్రాచుర్యం కలిగించే ఉద్దేశ్యం నాకు అస్సలులేదు.ఎందుకంటే, ఏవీ స్థిరమైన విలువలు లేవని నేనిప్పుడు ఘాడంగా నమ్ముతాను కాబట్టి.ప్రస్తుతం నేను ఘాడంగా నమ్మిన విలువల్నికూడా వేరొక అనుభవం ఎదురైతే త్యజించడానికి కూడా ఎప్పుడూ సిద్ధమే.ఇది ఒక నిరంతర ప్రక్రియ,జీవన విధానం.

Kathi Mahesh Kumar said...

@శ్రీ గారు నెనర్లు,నేను అప్పట్లో నమ్మిన విలువలు మీకు ‘ఆదర్శం’ అనిపిస్తే,అది మీ ధృక్కోణం మాత్రమే.ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు బాధ సహజం.దాన్నే నేను అనుభవించాను. కాకపోతే,ఇలాంటివి జరిగినప్పుడే జీవితం విలువ తెలుస్తుందేమో!"accept the pain" అనడంలో బుద్ధుడి ఉద్దేశ్యం ఇదేకావచ్చు.


@శ్రీనివాస్ గారూ, నా విలువల మార్పుమీద మీకు ‘వేరే అభిప్రాయం/నమ్మకం’ ఉండటం చాలా సహజం,అభిలషణీయం కూడా. ఎందుకంటే! మనం పుట్టిన కుటుంబాలూ,సమాజాలూ,అనుభవాలూ,అవకాశాలూ వేరు కాబట్టి. అంతెందుకు సింపుల్గా చెప్పాలంటే మీరు వేరు,నేను వేరు వ్యక్తులం కాబట్టి. నేను రంజని విషయంలో చెప్పదలచుకున్నది కూడా ఇదే.We were two individuals,representing two different and opposite value systems and both are right from each ones point of view.

sree said...

Hi Mahesh Anna,

I am sreedhar your junior in Navodaya vidyalaya lepakshi,
how are u? how is life?Where are u now?your college life and experiences are interesting. Narration is good. waiting for next part.
one more thing i met N.V. Ramana Reddy and Rama murthy recently.
they are doing good

Regards,
Sreedhar reddy.

ఆదిత్య said...

థాంక్స్! మీరు కూడా తరచూ రాస్తూ ఉండండి.

Usha said...

Helo Kumar gde.[:)]

just ippude mee post coment naa blog lo chusaa reply iddam ani mee Blog open chesaaa latest post chadivite mundu emi ardham kaaledu ventane just before post chusaa so koddiga ardham kaavadam modalayyindi vishayam
so mundu meeku Thanks
coz naa Kavitha ki meerichchina coment ki nijangaa anthati arhatha naa kavithaki undoo ledoo but naaku maatram chaalaa happy nichhcindi nenu ilaanti coment andukogaliginanduku.

ika mee Blog daggaraki malli vostunnaa
Blog lo mahamahu lantha raasina coments chaduvutunte asalu nenu post coment mottam post anthaa chadavakunda raayadam ante kantimundu kanipistunnadi entoo ruchi kudaa chudakundaa edo answer chesinattu avutundemo ane feeling kaligindi so anduke mottam post anni parts chadivi mallaa rayali anipinchutundi so anduke aa "POST" meeda coment kaakunda just meeku reply ivvalani mundu ee coment rastunna
tappu aite kshantavyuraalanu.
Thanks
Usha

Shankar Reddy said...

గు౦డెను పి౦డావు అన్న ....

ప్రేమి౦చిన అమ్మాయి మన కళ్ల ము౦దె వేరె వాళ్లతొ తిరుగుతు౦టె ..కలిగె బాధ వర్ణానాతీత౦....

అబ్రకదబ్ర said...

రంజనిని విలన్ ని చేయకుండా ఉండటానికి నాకర్ధమయిన కారణం, ఆత్మనింద-పరస్తుతి ద్వారా మీ పాత్రకి ఎక్కువ సానుభూతి చేకూర్చటం. చాలా తెలివిగల రచయిత మీరు. డైరెక్ట్ గా తిట్టకుండానే కావలసినంత డామేజీ చేసేశారామెకి.

మీ అభిప్రాయాలు కొన్నిచోట్ల గందరగోళంగా ఉన్నాయి. 'ఎవరో ఇచ్చిన విలువల్ని పాటిస్తూ' అన్నారు. మీరు నమ్మినంత కాలం అవి గొప్ప విలువలు, నమ్మనప్పుడు ఎవరో ఇచ్చినవా? లోపాన్ని సమాజం మీదకు నెట్టేయటమేమిటి? మనం పాటించే విలువలు కాలగమనంలో మారొచ్చు. కానీ వాటికి


సమాజం, దాని కట్టుబాట్లు కోతుల్లాంటి మనుషుల మనసుల్ని అదుపులో ఉంచటానికి ఉద్దేశించినవి. సమాజాన్ని పక్కనబెట్టన్నా ఇష్టమొచ్చినట్లు సంబంధాలు నెరపొచ్చు అనేవాళ్లు అడవుల్లోకెళ్లి జంతువుల్లా బతకొచ్చు కదా. ఇద్దరు పెద్దల మధ్య సంబంధం వాళ్లకిష్టమొచ్చినట్లు ఉండొచ్చన్నారు. నాదో సూటి ప్రశ్న. అమ్మా నాన్నా నానా తిప్పలు పడి చదివిస్తుంటే కాలేజిల్లో చేరి ఈ ప్రేమాయణాలేమిటి? చదువన్నా పూర్తికాకుండానే, జీవితం ఇంకా మొదలవకుండానే సంబంధాల గురించి నిర్ణయించుకోగలిగేంత పెద్దోళ్లయిపోయారా కుర్రకారు? ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడ్డాక నా జీవితం, నా ఇష్టం అనమనండి - అప్పుడు అభ్యంతరం లేదు.

ఎవరి ప్రేమానుభూతులనీ తేలిక చేయాలని కాదు నా ఈ ఘాటు వ్యాఖ్యలు. ప్రేమలకు నేను వ్యతిరేకినీ కాదు. బాధ్యత లేని వయసులో కలిగేది వయసు ఉద్రేకమే కానీ ప్రేమ కాదు అని నా అభిప్రాయం. ఆ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిదనేది నా నమ్మకం.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర గారూ, ఒక సినిమా ఫక్కీ పెద్దమనిషి మాటల్లా మీ ఆవేశపూరిత కామెంటు అనిపిస్తోంది.క్షమింఛగలరు.
అప్పటివరకూ నమ్మిన విలువలతో కాన్ఫ్లిక్ట్ వచ్చినపుడే, మనం కొంచం భూమ్మీదకొచ్చి బేరీజుచేసుకుంటాం. ఆతరువాత మార్చుకుంటాం. అది తప్పెలాగో నాకైతే అర్థం కావటం లెదు. అసలు విలువల్ని ఘాడంగా నమ్మకపోతే సమస్యే లేదు!

ఇక నామీద సానుభూతి కల్పించి, రంజనిని విలన్ను చెయ్యాల్సిన అవసరం ప్రస్తుతానికైతే నాకులేదు.She has introduced me to a different values of life. అందుకనే నేను "ధ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్" అని ముగించాను.

కాకపోతే ఈ మిషతో నన్ను తెలివైన రాచయిత అన్నారు. అందుకు మాత్రం కృతజ్ఞ్నున్ని.

ఇక ప్రేమ విషయంలో కుర్రకారు వేషాల గురించి మీరు చూపిన అసహనమే, అందరు పెద్దలూ చూపి సమస్యని మరింత జటిలంచేస్తున్నారని నా నమ్మకం. టీనేజి ప్రేమలు మీరన్నట్టు ఆకర్షణలే అయినా, వాటికి కూడా కోంత గౌరవం ఇవ్వాలి అని నా ఉద్దేశం.ఎందుకంటే అవి ఆవయసులో మానవ సహజమైన భావాలు.

యువతను మనుషులుగా కాక తమ ‘ప్రాపర్టీ’గా భావించి వారి భావాల్ని తల్లిదండ్రులు‘డిక్టేట్’ చెయ్యడంతోనే వస్తుంది సమస్య. ఇలాంటి సమస్యలను గౌరవప్రదంగా,సామరస్యంగా యువతతో చర్చించే దైర్యం,అవకాశం ఈ సమాజం కల్పించిందా? మరలాంటప్పుడు non-existance సమాజం ముఖ్యమా? మనసుకూ, వయసుకు తెలిసిన ప్రేమాకర్షణలు ముఖ్యమా? అందుకే ప్రేమికులు శవాలుగానో,లేక హంతకులుగానో మారుతున్నారు.

ఇక సెటిలైన తరువాత ప్రేమించమనే అద్భుతమైన సలహా ఇచ్చారు. ఇప్పుడు చాలామంది ఆపనే చేస్తున్నారు. వీటిని pre-meditated ప్రేమలనొచ్చు.ఉద్యోగాన్నీ,అందాన్నీ,బ్యాంక్ బ్యాలన్స్ నీ,కంపాటబిలిటీనీ,కుటుంబ గౌరవాల్నీ,ముఖ్యంగా కులాలనూ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెళ్ళే పరమావధిగా ప్రేమించడం. ఇదేగా మనకు కావలసినదీ!

అసలు ప్రేమ ఇప్పుడే పుట్టాలి అని చెప్పడానికి మనమెవరం అసలూ?!?

bolloju ahmad ali baba said...

మహేష్ గారు.
మీ పోష్టు నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నెనింతవరకు చదవని కొన్ని ప్రయోగాలు చదువుతుంటే చాలా అద్భుతంగా అనిపించాయి. కొన్ని ఉదాహరణలు.

కొంతమంది ‘డిసైరబుల్’ అమ్మాయిలు : డిసైర్ రగిలించే అమ్మాయిలు మరియూ అందరిచే వాంచింబబడే అమ్మాయిలు. సందర్భానికి చక్కటి ఎక్స్ ప్రెషను.

కోతకు గురవ్వటం: ఒకచోట సమయం కోతకు గురవ్వటం, ఆ కారణంగా గుండె కోతకుగురవ్వటం.

చిన్నా పెద్ద అంటూ పట్నం పల్లెల తారతమ్యం చెప్పటం. చిన్నూరు ఆలోచనలు సంస్కరించుకొని పెద్దగా ఆలోచించటం. ఇక్కడ కృష్ణశాస్త్రిగారి, పట్నం ప్రియురాలు, పల్లె తల్లివంటిది అన్న మాట గుర్తుకువచ్చింది.

అరగంటగా లోపలేం జరుగుతుందో గ్రహించిన గుండెల్లో కాల్చిన ఇనుపకడ్డీ మెత్తగా దిగుతున్న ఫీలింగ్ అనటం కన్నా ఆ సందర్భానికి మరొక మెరుగైన పోలిక ఉంటుందా అని జ్ఞాపకాల డ్రైవ్ లో ఎంత సెర్చ్ చేసిన నొ ఫైల్ ఫౌండ్ అనే వస్తుంది.

ఎంత శాతం చచ్చానో తెలియని మనిషిగా హాస్టల్ చేరాను : ఇది కవిత్వంలో ఒక పంక్తిలా లేదూ.

You have done a mistake and the girl is guilty of a blunder: beautiful expressions for the situation.

రెండురోజుల భావరహిత జీవితానికి గడ్డకట్టుకుని గుండెల్లో దాగుండిపోయాయేమో.: ఎందుకేడ్చామో చెప్పటానికి అదికూడా హుందాగా (అందునా మగవాడు కాబట్టి. ఫెమినిష్టులు క్షమించాలి)

ఒక వాక్యం తికమక పెట్టింది.
కాకపోతే ప్రేమలొ ఓడిపొయాననే భాధకన్నా,తనని చెంపదెబ్బ కొట్టి మనిషిగా విరిగిపోయాననే దుగ్ధ నన్ను నిర్వికారుడిగా మిగిల్చిందనిపించింది. ఈ వాక్యంలో ఎక్కడో కంఫ్యూస్ చేసే అంశాలున్నట్లనిపిస్తుంది. భావమైతే తెలుస్తుంది.


బహుసా అబ్రక దబ్ర గారిని కలవరపెట్టిన వాక్యాలు ఇవయి ఉంటాయని ని నా అనుమానం.

‘సెకండ్ హ్యాండ్ ఎంగిలి విలువల్ని’ నా విలువలు’గా భ్రమించి, రంజని అవసరాలతో,ఆకాంక్షలతొ నిమ్మిత్తం లేకుండా, ఏక పక్షంగా మా ప్రేమను పవిత్రంగా ఉంచడం, నా మూర్ఖత్వం కాక మరేమిటి?

పై వాటికి కి మహేష్ వివరణలనుంచి కాక, తన పోష్టునుంచే అన్యాపదేశంగా చెప్పిన కొన్ని విషయాలు.

తను ఏక పక్షంగా ప్రేమను పవిత్రంగా ఉంచటానికి కారణం:
ఒక రోజు ధైర్యం చేసి "ఇదేమిటని" రంజని ని నిలదీశా. "నామీద నమ్మకం లేదా" అంది.
"ప్రేమంటే నమ్మకం" అన్న గొప్ప ఫిలాసఫీని విని,నమ్మి,జీర్ణించికున్న మనసుగా మనదీ!

అలా అలా అనుకున్న మనసు, జ్ఞానం వల్లనో, లెక స్వాంతన వల్లనో అదీకాకపోతే ఓటమి వల్లనో కలిగిన క్లారిటీలో కాంట్రాసెప్టివ్ లున్న ఈ కాలంలో అలా ఉండటం మూర్ఖత్వం గానె అనిపించవచ్చు. ఇది ఆత్మ నింద అందామా, లేక సినిమాలు సమాజం ఇచ్చే సజెషన్లన్నీ ఎంగిలి విలువలు గా పరిగణించే స్థాయికి చేరిన ఒక యువకుని పరిణితి అందామా.

ఇంఫాక్చుయేషను దశనుండి ఒక్ యువకుడు, (ఈ పోష్టులోని కధానాయకుడు)
"Values are not absolute, they are just relative. Some times they are mutually exclusive , some times praportionatley opposite to each other and mostly highly individualistic." అనగలిగె స్థాయికి చేరుకొన్నాతరువాత అట్టి యువకుని నుండి భాద్యతారాహిత్యాన్నికానీ, ఉద్రే్క పూరితమైన ప్రేమను కాని ప్రదర్శిస్తాడనుకోవటం అన్యాయం.

ఈ పోష్టులో చివరన సారీ థాంక్స్ లు రెండిటికీ కూడా ఎంతో ఔచిత్యం ఉంది. ఒకదానికి కధనం మద్యలో ఎక్కడో she is guilty of blunder అని అనిపిస్తాడు. బహుసా తన తప్పు తెలుసుకొని సారీ చెప్పిఉండవచ్చు. ఇంతకాలంలో బహుసా వాడి ఆనందంకోసమే తాహా తనని చేరదీసాడన్న విషయం కూడా తెలిసిపోయిఊండవచ్చు, తన తనువుని కాక తనని మాత్రమె ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకొన్నానన్న భావంకూడా ఉండవచ్చు.
కొన్నాళ్ల క్రితం బ్లాగుల్లో జరిగిన చర్చాల్లోని మొమెంట్ ఆఫ్ క్లారిటీని తనకు కలిగించినందుకు కధానాయకుడు థాంక్స్ చెప్పిఉండవచ్చు.

చివరన గుండెల్ని పిండేసిన విషయం: గౌరి పాత్ర. ఆ విషయాన్ని కధనంలో ఎక్కడా చెప్పకుండా కామెంట్లలో చెప్పటం మరీ టచింగ్ గా అయిపోయింది. బహుసా కధనాన్ని ఈ అంశం ప్రభావితం చేసి, అవుట్ ఆఫ్ ట్రాక్ అయిపోతుందని భావించారేమో? సబబే.

చిన్న సవరణ: some one else at the hostel has see it అనే వాక్యంలో has seen it అని ఉండాలని అనుకుంటున్నాను. బహుసా అలా మాట్లాడించటం పాత్రోచితమేమో అనికూడా సరిపెట్టుకోగలను.


బొల్లోజు బాబా

sujata said...
This comment has been removed by the author.
sujata said...

అవును. చాలా జరిగిపోతుంది ఇక్కడ. గౌరి గురించి విని బాధ అనిపించింది. కానీ..

అబ్రకదబ్ర said...

విలువలు మార్చుకోవటం తప్పని నేననటం లేదు. అనుభవాలతో మారనివాడు మనిషే కాడు. పాత విలువలు కంపుకొట్టాయని మొత్తం సమాజమే కుళ్లిపోయిందనొద్దు. నచ్చలేదని ప్రతివారూ సమాజాన్ని వెలివేస్తూపోతే చివరికెవరూ మిగలరు.

ప్రేమ ఎప్పుడు పుట్టాలనేది నేను డిక్టేట్ చేయటం లేదు. ఎదిగే వయసులో ఆపోజిట్ సెక్స్ మీద కలిగే ప్రతి భావాన్నీ ప్రేమ అనుకోవద్దనటమే నేను చేస్తున్నది. ఆ వయసులో కుర్రకారు భావాలకు విలువీయవద్దనే కుంచితస్వభావుడిని కాను. సమాజంతో మాకు సంబంధం లేదు, మా ఇష్టమొచ్చినట్లు మేముంటాం అనే పద్ధతి మంచిది కాదు అని నేనంటున్నా. అసలు ప్రేమంటే ఏమిటి? ఏడాదికో వ్యక్తిని ప్రేమించే విశ్వ ప్రేమికులను చాలామందిని చూశా నేను. జీవితంలో సెటిలయ్యాక ప్రేమలో పడండి అని నేనంటే దానికి ప్రి మెడిటేటెడ్ ప్రేమనే పేరు పెట్టారు మీరు. టీనేజ్ ప్రేమలు మాత్రం ఆ కోవలోకి రావా? కురూపి అమ్మాయినో, కుంటివాడో ముష్టివాడో అయిన అబ్బాయినో ప్రేమించే కాలేజ్ పిల్లలెవరు?

ఇకపోతే, ప్రేమికులు హంతకులుగానూ, శవాలుగానూ మారటానికి రకరకాల కారణాలుంటాయి. ఆ వివరాల్లోకెళితే అదో పెద్ద గ్రంధమవుతుంది. దానికి ప్రతి సారీ తల్లిదండ్రులే కారణం కారు కదా.

ఈ గొడవ తెగేది కాదు కాబట్టి ఇంతటితో ముగిద్దాం. నా గోలంతా చూసి పాత తరానికి ప్రతినిధిననుకునేరు! నిజానికి నాకు మీ కధ బాగా నచ్చింది. టైటానిక్ చూసినప్పట్లా అదో రకం బాధ కలిగింది చదివాక కాసేపు. కానీ ఈ భాగంలో కాస్త గందరగోళం ఉన్నట్లనిపించింది. దాన్నెత్తిచూపాలనేదే నా ప్రయత్నం.

ప్రవీణ్ గార్లపాటి said...

కథ బానే నడిచింది కానీ కొంత వింతగా అనిపించిందేమిటంటే అంత వరకూ మీరు రకరకాల అమ్మాయిలతో సాగించిన రొమాన్సు ఫరవాలేదు కానీ మీరు తిరుగుతున్న అమ్మాయి వేరే ఒకరితో రొమాన్సు చేస్తే తట్టుకోలేకపోవడం కొంత వింతగా అనిపించింది.

ఈ సంఘటన వల్ల మీకు "a taste of your own medicine" వచ్చింది అని చూపించదలచుకుంటే కథలో అది అంత బాగా రాలేదని అనిపించింది.

రాధిక said...

ప్రవీణ్ గారి కి వచ్చిన సందేహమే నాకూ కలిగింది.ముద్దుల దాకా వెళ్ళి హద్దుల్లో వున్నాను అన్న మీకు ఆ అమ్మాయి చేసింది తప్పని ఎందుకు అనిపించిందో?చిన్నూరు వాళ్ళతో చూస్తే మీరు చాలా ఎత్తుకి ఎదిగిపోయినట్టే కదా హద్దుల విషయంలో.
అలా అని ఆ అమ్మాయి చేసింది సరి అని చెప్పాలని కాదు నా ఉద్దేశ్యం.కధానాయకుడు తనవైపు నుండి కధని నడుపుకోవడం వల్ల మంచి అంతా ఈ వైపుకే వచ్చేసింది.అబ్రక దబ్రా గారు అన్నట్టు చివరి మాటలతో రంజని విలన్ అయిపోయింది.[విలనే అనుకోండి.కానీ కధానాయకుడు కూడా చిన్నా చితకా రొమాన్సు చేసినవారే కదా]

కొత్త పాళీ said...

కామెంట్లన్నీ చదివాక .. నాకో డౌటు వస్తోంది.
రంజని చేసిన పని తప్పేమీ కాదు అని మనస్ఫూర్తిగా అనుకునే వాళ్ళు చేతులెత్తండి!

కథంతా చదివాక నాకు అనిపించింది .. ఆమె చేసిన తప్పేదైనా ఉంటే .. తను వేరే బాయ్ ఫ్రెండ్ మీద మోజు పడినాక మహేశ్ కి ఆ విషయం వెంటనే చెప్పక పోవడం, పైగా తప్పించుకుని తిరగడం. అలా ఎందుకు చేసిందా అనేదే నాకు అర్థం కావటల్లేదు. ఆమె వేరే బాయ్ ఫ్రెండ్ ని ఎంచుకోవటంలో తప్పేముంది?

Kathi Mahesh Kumar said...

@బాబా గారూ, లక్ష నెనర్లు.మీ కామెంటు చదివి, "నా రాతల్లో ఇంత ‘డెప్త్’ వచ్చేసిందా" అనిపించింది.అసంకల్పితంగా నా భావాలను భాషలో పెట్టే సరికీ కొంత దుమారం లేచినా, నా మానసిక పరిస్థితిని ‘నా వైపు’నుంచీ చాలామంది అర్థం చేసుకోవడం నిజంగా ఆనందాన్ని కలిగిస్తోంది.


@ప్రవీణ్ గారూ,బాణం నా మీద ఎక్కుపెట్టారా! ఏక పక్షంగా అమ్మాయి ప్రేమకై పాటుపడటానికీ,ప్రస్పరం ప్రేమించుకున్నాక (అనుకున్నాక)మళ్ళీ మరొకరితో ప్రేమకూ కాస్త తేడా ఉందిసార్!

@సుజాత గారూ, కామెంటి తర్వాత ‘డిలీట్’ చేసినట్టున్నారూ!?! ఎందుకో?

@రాధిక గారూ, మెదట్నుంచీ కథ నా పక్షంగానే నడుస్తోంది. రంజని విషయంలో తను చెప్పిన కారణాలు కాక, నేను వేరే కారణాలు వెదకలేదు.నా ఆత్మవిమర్శ కూడా ఆ పరిధిలోనే జరిగిందని గ్రహింఛగలరు. కాబట్టి,అదంతా "ఆ" విలువల గురించి అవ్వడం నా స్వయంకృతాపరాధం కాదు. అప్పటి అవసరం అంతే. అదీ కాక,ఈ సంఘటనలో చాలా విషయాలు (రంజని వార్డన్ల మీటింగులో ఏంచెప్పింది అన్న విషయంతో సహా)నాకు తెలీవు.కథకుడిగా నేను కథ చెబుతున్నప్పటికీ,ఇది దాదాపు స్వగతమే. చాలా పాత్రల స్వభావాలు నాకు పూర్తిగా తెలీవు.ఎందుకంటే చాలా నిజాలు నాకు వ్యక్తిగా అప్పట్లో తెలీవు.


@కొత్తపాళీ గారు, నేను మీతో ఏకీభవిస్తున్నాను.రంజని నాకీ విషయం సూటిగా చెప్పుంటే నేను ఎలా ప్రవర్త్తించి ఉండేవాడినో తెలీదుగానీ,అదే తను చేసిన చిన్న తప్పు అని ఇప్పుడు నాకనిపిస్తుంది. కాకపోతే మర్యాదపూర్వకంగా సంబంధాలు తెంచుకోవడం మనకింకా రాలేదనుకుంటా!అదే సమస్య తనదికూడా అయ్యుండవచ్చు.


@అబ్రకదబ్ర గారూ, నెనర్లు.మీ చర్చతో నాకు తెలీని కొన్ని పార్శ్వాలను పరిచయం చేసారు.

bolloju ahmad ali baba said...

ఈ పోష్టుని పాతవానితో కలిపి విశ్లేషించటం భావ్యం కాదేమో?
రంజని ఒక రకానికి చెందిన భావాలకు ప్రతినిధి. మరోలా చెప్పాలంటే నిహిలిష్టు అని అనుకోవచ్చు. కధానాయకుడు అసలు సిసలైన మానవతా వాది. ఏ రకమైన సిద్దాంతాలకు, ఇజాలకు కట్టుబడని, అన్ని అభిప్రాయాలకు, కోణాలకు తన మనస్సును ఓపెన్ గా ఉంచుకొని కాలానుగుణం గా మారుతూ, మార్చుకుంటూ జీవనం సాగించే బుద్దిజీవి.
మొదటి విధానం పుట్టుకతోనే వస్తుంది. అట్టి జీవనవిధానాన్ని అదుపులో పెట్టటానికై సమాజం కానీ, చట్టం కానీ అనేకానేక ఆంక్షలు అనాదిగా విధిస్తూనే ఉంది. అట్టి వారు వాంచల ఉదృతి తగ్గిన తరువాత, సమాజం గీసిన చట్రంలోకి వచ్చేస్తారు.
రెండవ వారు నిత్యం జ్వలిస్తూ, విశ్లేషించుకుంటూ, క్షణ క్షణం తన భావాల్ని పదునుపెట్టుకుంటూ, మెరుగుపరచుకుంటూ ఉత్తమమైన జీవితం జీవిస్తారు. వీరు ఒకె విషయానికి భిన్న వయసులలో భిన్న రకాలుగా స్పందిస్తున్నారేమిటబ్బా అని కొంతమందికి అనిపించవచ్చు, కానీ అది వారు నిరంతర మధనంతో సాధించిన పరిణితి గా భావించాలి. దీనికి చలం గారి జీవితం కన్నా మరొక ఉదాహరణ ఉండదేమో? శాస్త్త్రీయంగా అలోచించినట్లయితె అలా బతకటమే ఉత్తమమైన పద్దతని నా అభిప్తాయం. కత్తిమీద సాముకూడా.

బొల్లోజుబాబా

arvindrishi said...

Excellent !
mancho chedo...nachindo nachaledo..oppukunnamo oppukoledo..ekkadekkadinuncho inta mandi spandinchatam nijanga excellent.

Inta mandini reach avvagailge la rayatam very good.7.2 post chooska inka comment cheyakunda undagalgatam kastamindi.

konni kanneellaki konni navvulaki haddulundav ...they don't come with a question...every one will embrace that moment.

All the best !
Arvindrishi
Melbourne

Nani said...

మీ పదాల పొందిక అద్భుతమండి.మన మనసులో భావమేదైనా పదాల కూర్పే అందాన్ని ఇస్తుంది.అది మీ మాటల్లో చాలా బాగా కుదిరింది.ఇంక కథ గురించి అంటారా మామూలుగా చాలా జీవితాల్లో జరిగేదే ఇనా మీ మాటల్లో ఇంకా బాగుంది.

కొత్త said...

బాబా గారి వ్యాఖ్య చాలా బావుంది.
@ మహేశ్- "మర్యాదపూర్వకంగా సంబంధాలు తెంచుకోవడం మనకింకా రాలేదనుకుంటా"
ఇది చాలా నిజం. తిరస్కారం ఎప్పుడైనా, ఎవరికైనా, ఏ సంస్కృతిలోనైనా చాలా బాధాకరమే. పాశ్చాత్య సమాజంలోనూ వేర్పాటులు జరిగినప్పుడు వ్యక్తులు ఎంతో బాధకి గురవడం నాకు తెలుసు. కాకపోతే అరిచి గీ పెట్టుకోకుండా హుందాగా ఉండటాంలో వాళ్ళకి కొంచెం తరిఫీదు ఉంది. ప్లస్ వాళ్ళకి అటువంటి సమయాల్లో కుటుంబం, ఫ్రెండ్స్ సర్కిల్స్ నించి అవగాహన కలిగిన సపోర్ట్ ఉంటుంది చాలా చోట్ల.

kalhara said...

చాలా ఆలశ్యం గా చదివా. కానీ నేను చెప్పటానికేం మిగల్లేదు. చర్చలన్నీ అయిపోయినట్టున్నాయి. నాకు కధలు రాయటం రాదు అంటూ మొదలెట్టారు. కానీ కధనం లో చదివించే గుణం, నిజాయితీ, పరిణితీ ఇంకా ఏదో చెప్పలేని స్పార్క్ అన్నీ ఉన్నాయి. ఒక్కటి చెప్పగలను.. థాంక్స్.. మంచి రచన అందించినందుకు.

kalhara said...

చాలా ఆలశ్యం గా చదివా. కానీ నేను చెప్పటానికేం మిగల్లేదు. చర్చలన్నీ అయిపోయినట్టున్నాయి. నాకు కధలు రాయటం రాదు అంటూ మొదలెట్టారు. కానీ కధనం లో చదివించే గుణం, నిజాయితీ, పరిణితీ ఇంకా ఏదో చెప్పలేని స్పార్క్ అన్నీ ఉన్నాయి. ఒక్కటి చెప్పగలను.. థాంక్స్.. మంచి రచన అందించినందుకు.

ఫజ్లుర్ రహమాన్ నాయక్ said...

అధ్బుతంగా రాస్తున్నారు ... మహేష్ గారు ...మీ నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నాను ...

subbu said...

అనుభవాన్ని అందమైన భషలో వ్యక్త పరచడం గొప్ప విషయమే.

నాకు తెలిసిన వ్యక్తుల గురించి తెలియని వ్యక్తిత్వాలను ,
వారి భావోద్వేగాలను నా సోదర సమానుడు
మాతృ మూర్తి(స్వచ్చమైన భాషలో) ఒడిలో చెబుతుంటే ఆ అనుభూతి అనిర్వచనీయం.
నా జీవిత స్వర్ణయుగానికి ఆస్థానమైన కళాశాలలో
నేనేరుగని జీవన ప్రస్థానాల గురించిన వ్యాఖ్యానాలు
స్నేహామృతం చల్లార్చిన ఆగ్రహాలు, ఆక్రోశాలు
వింటూ ఉంటే గుండెల్లొ భాషకందని అలజడి. తెలియకుండా కన్నుల్లొ ప్రవేశించిన తడి.
అది ఉద్వేగమో, బాధో తెలియదు కాని ,ఒక అద్భుత భావన.

పూర్వపు చేదు అనుభవాలు కూడ మధురంగానే ఉంతాయి.ఇక మధుర స్మృతుల గురించి చెప్పనవసరం లేదు.
కాని ఆ అనుభవాల ప్రభావాన్ని, నేర్చుకొన్న పాఠాలను స్నేహితులతొ పంచుకొనే ధైర్యం, చాతుర్యం అభినందనీయం.

Niranjan Pulipati said...

Mahesh, Excellent Narration. Chala baga rasavu. Navala chadivinattundi. Keep rocking. :)

alamuru said...

మహేష్ గారు
మిమ్మల్ని అడపాదడపా జూరన్ సినెమాలో చూస్తున్నా మీ బ్లాగు ఎప్పుడూ చదవలేదు.
కొన్ని బ్లాగులలో చూసిన కొన్ని కామెంట్లు నాలో మీ బ్లాగు చదవాలన్న ఆలోచన రేకెత్తించాయి.
నేను మొదట చదివినది గొడ్దు మాంసం గురంచి మీరు రాసిన వ్యాసం.
దానికి నేను కామెము రాద్దమని 3-4 సార్లు ప్రయత్నించా, కాని అది ప్రచురింపబడలేదు. కారణం తెలీదు.

ఇప్పుడు ఇది చదివాను.
మీ నిజాయితీకి నా .

ఈ రెండు వ్యాసాలతోనే నను మీ అభిమానిని అయ్యానంటే నమ్మండి.
మిమ్మల్ని యూనివర్సిటిలో ఎలా మిస్ అయ్యానో నాకు అర్థం కావట్లేదు.
మిమ్మల్ని అక్కడ చూసిన ఙపకమే లేదు నాకు.

మీరు రాసిన ఈ వ్యాసం చాలా హ్రుద్యంగా ఉంది.
రంజని చేసినదాన్లో నాకు కనిపిస్తున్న తప్పు ఒక్కటే. తను ఇంకొక అబ్బయిని ఇష్టపడుతున్నప్పుడు, మీతో ధైర్యముగా ఆ విషయం చెప్పి ఉండాల్సింది. అంతే.

కానీ జరిగిన విషయములో మీ తప్పుని సరిదిద్దుకుని మీ ఆలోచనని పదునెక్కించడానికి మీరు చేసిన ప్రయత్నం అమోఘం.

""నా కోరికల్ని ‘పవిత్ర ప్రేమ’ పేరుతో అణగదొక్కిన నిన్ను, మనిషిగా ఎంతగా దిగజార్చానో చూడు!" అన్నట్టుగా రంజని చూపు."....ఈ ఒక్క వాక్యం నన్ను కట్టిపడేసింది.

మీనుండి ఇంకా గొప్ప గొప్ప వ్యాసాలు రావాలని ఆశిస్తున్నాను.
అభినందనలతో
సౌమ్య

రవి said...

""నా కోరికల్ని ‘పవిత్ర ప్రేమ’ పేరుతో అణగదొక్కిన నిన్ను, మనిషిగా ఎంతగా దిగజార్చానో చూడు!" అన్నట్టుగా రంజని చూపు.".... gud sir i am waiting for next part,,,and see

http://www.neejnapakalu.co.cc/

అరుణ్ కుమార్ ఆలూరి said...

మీ కాలేజీ జీవితం 7పార్ట్లూ వరసపెట్టి చదివాను.. ముందుగా మీ నిజాయితీకీ అభినందనలు/జోహార్లు. మరీ ఎక్కువగా నచ్చినా ఏం స్పందించలేం.. ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నాను. నా మనసుని మాత్రం హత్తుకుంది. ఏవేవో కథల్ని షార్ట్ ఫిలంగా తీస్తాను అన్నారు.. మీ 7.1 & 7.2 ని తెరకెక్కిస్తే హృద్యంగా ఉంటుంది. ఆలోచించడి.