Friday, June 20, 2008

ఇంగితజ్ఞానానికి ఒక కన్నీటి వీడ్కోలు


మనతో చాలా కాలం గడిపి, ఈ మధ్యనే దివంగతుడైన ‘ఇంగితజ్ఞానం’(common sense) అనే ఒక పాత మిత్రుడిని గుర్తుచేసుకోవడానికి ఇక్కడ మనం చేరాం. తన పుట్టుకకి సంబంధించిన వివరాలు సర్కారీ యంత్రాంగంలోని రెడ్-టేపిజం కారణంగా పొగొట్టుకున్నప్పటినుండీ, కనీసం అతని వయసు కూడా తెలీకుండా బ్రతికారు. అయినప్పటికీ చాలా విలువైన పాఠాలను తను మనకి తెలియజెప్పాడు. వాటిల్లో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను. "ఎదుటివాడి పనిలో తలదూర్చకు", "పక్కవాడి అభిప్రాయాలకు గౌరవమివ్వు", "అంతా నాకే తెలుసు అని విర్రవీగకు", "తప్పైతే తప్పని ఒప్పుకో" లాంటివి మచ్చుకకి కొన్ని.


ఇంగితజ్ఞానం గారు చాలా సాధారణమైన ఆర్థిక విధానాల్ని అనుసరించేవారు. ‘సంపాదన ఉన్నంతనే ఖర్చుపెట్టు’, ‘ప్రపంచ బ్యాంకైనా సరే ఉత్తినే ఇస్తే అప్పుతీసుకోకు’ వంటి మౌళిక సూత్రాలని పాటించారు. కానీ, అర్జంటుగా ఎదిగిపోవాలని అప్పులూ, ఇంకా తలకు మించిన ఖర్చులూ తన చుట్టుపక్కల అందరూ చెయ్యడం మొదలయ్యేసరికీ వీరి ఆరోగ్యం కాస్త క్షీణించింది.


అసలే అనారొగ్యంతో ఉన్న వీరు, అర్థం పర్థం లేని తెలుగు సినిమాలు, ఎప్పటికీ లాజిక్ లేకుండా సాగుతున్న TV సీరియళ్ళూ, వాటిని అదేపనిగా వీక్షిస్తూ అతుక్కుపోతున్న ప్రజలనీ చూసి కాస్త చిత్త చాంచల్యం పాలుపడ్డారు. ఈ స్థితిలోనూ కాస్త కొనఊపిరితో ఉన్న వీరి పరిస్థితి, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలనూ,నాయకుల వెర్రివేషాలనూ చూసి విషమించింది.


చివరికి మొన్న జరిగిన మంద్యం లైసెంసుల అమ్మకాల ధరలు విని, వీరు గుండాగి మరణించారు. చనిపోయిన వీరికి ‘ఆలోచన’ అనే సహధర్మచారిణి తోపాటు, ‘బాధ్యత’ అనే కూతురు, ‘తర్కం’ అనే కొడుకూ ఉన్నారు. తన నలుగురు సవతి తమ్ముళ్ళైన ‘నా హక్కు నాకు తెలుసు’ , ‘నేనే కరెక్టు’, ‘నా ఇష్టమొచ్చినట్టే చేస్తా’, ఇంకా ‘తప్పు నాది కాదు, వేరే వాళ్ళది’ ఈ అంత్యక్రియలకి హాజరు కాలేకపోయారు.


ఇంగితజ్ఞానం గారి అంత్యక్రియలకి వీరితోపాటూ చాలామంది హాజరు కాలేదు. బహుశా తను పోయారని ఇప్పటికీ చాలా మందికి ఇంకా తెలిసుండకపోవచ్చు. ఒక వేళ మీకు ఈ విషయం తెలిస్తే, అందరిలాగే మీరు కూడా, ఏమీ చెయ్యకుండా ఉండవలసినదిగా ప్రార్థన. తన ఆత్మకు శాంతి....మనకు తగిన శాస్తీ కలుగుగాక!


--------------------------------

(ఒక స్నేహితుడితో బ్లాగుల్లోని కామెంట్ల గురించి చర్చిస్తూ నేను, "Why don't they understand such simple things of life? they are just a matter of common sense" అన్నాను. దానికి ఆ మిత్రుడు నన్ను ఆప్యాయంగా చూసి "Common sense is not very common to find these days, its either a priced commodity or dead long ago" అన్నాడు. ఆ చర్చకు ఫలితమే ఈ టపా)

19 comments:

సుజాత వేల్పూరి said...

మీ ఇంటిపేరు!

తన ఆత్మకు శాంతి, మనకు తగిన శాస్తీ...టాప్!

Kolluri Soma Sankar said...

జనాల్లో ఇంగిత జ్ఞానం లోపిస్తోందన్న వాస్తవాన్ని హాస్యాత్మకంగా చెప్పిన తీరు బావుంది. అభినందనలు
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com

మేధ said...

నా తరపునుండి, ఒక వంద క్యాండిల్స్ ప్రార్ధన!

జ్యోతి said...

ఎవరైనా ఇలాంటి మనుష్యుల బుద్ధిని కనీసం నీటితో కడిగితె బాగుండు. నేను కూడ మనస్పూర్తిగా ప్రార్దిస్తున్నాను..ఆమెన్..

మీనాక్షి said...

hi mahesh gaaru!!!!!
mee post chaala baundi.
naluguru savati tammullynana hakku,naaku telusu...na ishtam vachinattu chestaa,nene correct..
soooooooooooooooooper.
tarugutunna ingita gnyanam guurchi baga rasaaru

Bolloju Baba said...

ఓ తెలుగు బ్లాగు లో మీ కామెంట్లు, దానికి వచ్చిన పెడసరపు ప్రతికామెంట్లు చూసాకా, మొత్తం వ్యవహారం మీరుచెప్పిన సవితితమ్ముళ్ల వీరంగంలా అనిపించింది.

ఫీలింగ్స్ ని అక్షరబద్దం చేయటంలో మీరు ఎక్స్పెర్ట్ అని మరో సారి నిరూపించారు.

బొల్లోజు బాబా

Unknown said...

ఇంగిత జ్ఞానమంటే మా తాత గారి వయస్సు ఉంటుంది.కాస్త చాదస్తం ఎక్కువే మరి.అన్ని కాలంతొ పాటు మట్టిలొ కలవవలసిందే అలాగే మన తాత గారు కూడా కలిసిపోయారు. ఆయన పోయి చాల రొజులైందని మీకు తెలియక పొవచ్చు.

ముఖానికి రంగు పులుముకొని కళామతల్లికి బ్రతికుండగనే సమాధి కట్టించిన పెద్దమనుష్యులకు ముఖ్యమంత్రి పట్టం కట్టే నాటికే ఆ మహానుభావుడు కాలం చేసి 6 వత్సరాలయ్యింది.

ఎప్పుడైనా అయన్ని తల్చుకోవడంలొ తప్పు లెదు.

కత్తి| వేమనను తలపిస్తున్నావు కదా!

realiasation afte enjoyment.

మంజుల said...

ఓహో అదా సంగతి! నా బుర్ర లో కూడా అప్పుడప్పుడు ఏదో చచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. :)

Purnima said...

Awesome post!! Common sense is not so common .. and we have to live with that fact. I liked the subtleness with which u presented a vey strong message.

Kudo's..

Purnima

వేణూశ్రీకాంత్ said...

Good satire Mahesh. ఆయుర్వేదం లో లా చేదు మాత్రని తేనెలో ముంచి అందించారు.

Anil Dasari said...

మహేశా,
వేరే బ్లాగులో ఇప్పుడే నవీనాచారి గారి మీద మీ వ్యాఖ్య చూశాను. వారి తిట్లతో తలంటించుకోటానికి సిద్ధంగా ఉండండి :-)

Kathi Mahesh Kumar said...

@సుజాత, నెనర్లు.

@సోమశంకర్, సీరియస్ గా చెబితే చదివేవాళ్ళు తక్కువా,అదీ మనమేదో లెక్చరు దంచినట్టు ఉంటుందని ఇలా హాస్యాన్ని ఆశ్రయించాను. నచ్చినందుకు నెనర్లు.

@మేధ, మీ క్యాండిల్లుకూడా కాస్త ఎక్స్ట్రా మంటలు రేపుతున్నాయేగానీ ఇంగితజ్ఞానం గారి ఆత్మ శాంతించడం లేదండీ!

@జ్యోతి,ఎంతైనా సవతి తమ్ముళ్ళు సవతి తమ్ముళ్ళే. ఇంగితజ్ఞానానికీ వీళ్ళకూ చుక్కెదురు. వాళ్ళని నీళ్ళతో కాదు,యాసిడ్ తో కడిగినా పెద్ద తేడా రాదు.

@మీనాక్షీ, నెనర్లు

@బాబా గారూ,ఏదో...భావాల్నిలా రాసెయ్యడానికి ప్రయత్నిస్తున్నా. మీలాంటి సహృదయుల సపోర్ట్ ఉంటే ఇలాగే కొనసాగిస్తాను. నెనర్లు.

@సుబ్బు, నా వ్యాసం మీ వ్యక్తిగత అనుభవాన్ని గుర్తుచెయ్యడం నా టపాకు గౌరవం, మీ స్పందించే హృదయానికి తార్కాణం. నెనర్లు.

@కల్హర,అందరికీ మీలాగా ‘చచ్చిన’ స్పృహొస్తే మళ్ళీ ఇంగితజ్ఞానం గారు పునర్జీవితులయ్యే అవకాశం ఉంది.

@పూర్ణిమ & వేణు గారూ నెనర్లు.

@అబ్రకదబ్ర,మనం ఎదురు దాడికైతే సిధ్దమేకానీ...నవీనాచారి తిట్లనేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈ టపా గురించి కామెంటండి.

Rajendra Devarapalli said...

common sense is dead

long live common sense!

Sujata M said...

mee inti peru!

Kranthi M said...

మీ టపా చూసినా ఎక్కడైనా బతుకుతుందేమొలెండి.దానికి పునర్జన్మనివ్వాలని ప్రార్దిస్థూ...

Kranthi M said...

మీ టపా చూసినా ఎక్కడైనా బతుకుతుందేమొలెండి.దానికి పునర్జన్మనివ్వాలని ప్రార్దిస్థూ...

Anil Dasari said...

నేను కామెంటక పోతే మీరు చెప్పినదానితో ఏకీభవిస్తున్నట్లు :-)

krishna said...

chaalaa chakkagaa cheppaaru.

krishna said...

chaalaa chakkagaa cheppaaru.