ఈ శీర్షిక చదివి "వీడికి పిచ్చిగాని పట్టలేదు కదా?" అనుకుంటున్నారా! అదే ఇక్కడ విచిత్రం. సినిమా ధియేటర్ అంత ప్రజాస్వామికమైన స్థలం ఏదైనా ఉందా అసలు! అందులో అడుగు పెట్టాలంటే కావలసింది, వెళ్ళవలసిన క్లాసుకు, తీసుకునే టికెట్టు తేడానే తప్ప, ఓకే చూరు కింద నేల టికెట్టోళ్ళూ, క్లాసు జనాలూ ఒకే సినిమాని, ఒకే తెరపై చూడటం కన్నా ప్రజాస్వామ్యం ఇంకోటుందా?
ఈ విషయంలో ప్రజాస్వామ్యం పేరుతో మనకున్న రాజకీయ అధికారాలకన్నా సినిమా చాలా మేలు కదా! ఇందులో మనం ఓటు వెయ్యక...అదేనండీ టికెట్టు తియ్యకపోతే సినిమా ఫ్లాపై కూర్చుంటుంది. అంటే, మనకి call back option కూడా ఉన్నట్లే లెఖ్ఖ. రాజకీయ నాయకులకి ఒకసారి ఓటేస్తే..వాడెంత ఓటివాడైనా ఐదు సంవత్సరాలు భరించాల్సిందే. ఇక సినిమా అయితే ఒకటి కాకపోతే ఇంకొకటి ఎన్నుకునే అధికారం మనకుంది. రాజకీయాలలో మనకా ఛాయిస్ ఎక్కడా?
ఇంకా సౌలభ్యమైన విషయం సినిమాలలో ఇంకొకటుంది. అది ప్రేక్షకుల్ని బట్టి హీరోలు సినిమా తియ్యడం. అంత కన్నా అధికారం రాజకీయాలలొ మనకెక్కడుందీ! మనం కోరుకున్నట్లు ఈ నేతలు రాష్ట్రాన్ని నడుపుతున్నారా? కానీ మన హీరోలు, వారి అభిమానులు కోరుకున్నట్లుగా సినిమాలు మాత్రం తీస్తున్నారు. చిరంజీవి ఎప్పుడొస్తాడో తెలిసినట్టుగా, ప్రేక్షకులు ఈలలేసి గోలచేస్తేగానీ మన మెగాస్టార్ తెరపై ప్రత్యక్షమవ్వడం ఎవరికైనా గుర్తుందా? పాండురంగడులో బాలకృష్ణ నటనని, "అదరహో, తండ్రిని మరిపించాడు" అన్న అభిమాని కేక మీకు వినపడలేదా? ఈ ఈలలూ,కేకలూ మీరు వినికూడా ఇది ప్రజాస్వామ్యం కాదన్నారంటే, మీరు ఖచ్చితంగా అధికారంలో లేని అప్పోజిషనన్న మాట.
ఇలా నాలాంటి వాళ్ళ సరసన మీరు అప్పోజిషన్లో మైనారిటీగా ఉండి, కేకలేసినంత మాత్రానా అధికార పార్టీ, అభిమానుల ప్రకారం మన సినిమాల్ని పరిపాలించకుండా ఆపుకుంటారా? అంటే మన ఆపోజిషనోళ్ళు మెజారిటీ అయ్యేదాకా మనం కోరుకున్న మంచి ప్రభుత్వాలు(సినిమాలు) రావన్న మాట. అందుకే మన సినిమాల ప్రజాస్వామ్యం జిందాబాద్!!!.
Tuesday, June 24, 2008
సినిమాలలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఇంకెక్కడైనా ఉందా?
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
nice one mahesh garu.
Good one!
kaani cinemaalu maatram manandarini maayalo pettendukey unnaayi.
rajakeeya nayakulaki koodaa adi labhame. prajalu enta varaku cinemalu, tv channellu...aata paata lo mugdhulauthey anta ekkuva gaa vallani mabhyapetti dabbu dochukuney prayatnaalu phalistaayi.
This is a fact....entertainment is like drugs, once you get addicted people can make you do anything for getting a little bit of it. Be it clapping for useless dances, scenes....or be it for forgetting the endless corruption, lethargy in the government. Why do you think the so-called democratic leaders encourage films and entertainment???
నిజమేనండోయ్!
దాదాపంతే, దాదాపంతే........
బొల్లోజు బాబా
adhyakasha nenu meeto poortiga angikaristunnanu.its true.
అప్పోజిషను అధికార పార్టీ అభిమాన పార్టీ అంటూ అదరగొట్టేసారండి. కాకపోతే నాకేంటో ఈ రాజకీయ పదజాలం వింటేనే కాసింత confusion పుడుతుంది. అన్నట్లు మీ కాలేజీ కబుర్లు ఈ రొజే చదివానండీ, బావున్నాయి 8వ భాగం ఎప్పుడు రాస్తున్నారు.
మహేష్,
భలే టాపిక్కులు పడతావు రోజూ. సినిమాలకీ రాజకీయాలకీ పోలిక బాగుంది. అయితే, సినిమాల్లోనూ నియంతృత్వ పోకడలున్నాయి. చిరంజీవి/బాలకృష్ణ అభిమానుల ఈలలకోసం వాళ్లు తెరపై చేసే విచిత్ర విన్యాసాలు నచ్చినా లేకపోయినా మిగిలినోళ్లుకూడా చచ్చినట్లు చూడాల్సిందే .... ప్రభుత్వాన్నేలే దొరలు తమ పార్టీ కార్యకర్తలకోసం పెట్టుకున్న స్కీములు మిగిలిన జనాలు కిక్కురుమనకుండా భరిస్తున్నట్లు.
మన 'ప్రజాస్వామ్య' రాజకీయాలతో సినిమాలకున్న మరో పోలిక 'వారసత్వం'. అలాగే, వోటరు దేవుళ్లలో కులాభిమానంతో ఓట్లేసేవాళ్లున్నట్లుగానే ప్రేక్షక దేవుళ్లలో అదే పిచ్చితో ఫలానా హీరో సినిమాలు చూసేవాళ్లూ ఉన్నారు.
బాగా వ్రాశారు.అభినందనలతో
సినిమా యూనివర్సిటీలో మీకు వంద డాక్టరేట్లు ఇవ్వాలి సుమా.
@నాని, నెనర్లు
@సౌమ్య, నెనర్లు
@ప్రశాంత్, సినిమాలు/TV ప్రజల్ని మాయలో పెట్టట్లేదు. ప్రజలే మనల్ని మనం మాయలో పెట్టుకొంటున్నాం.అయినా ఇప్పట్లో రాజకీయనాయకులు సినిమాల్ని ప్రోత్సహిక్కర లేదు.ప్రజలెప్పుడో సినిమాని నెత్తికెక్కిచ్చుకున్నారు. రాజకీయనాయకులకే ఈ సినిమావాళ్ళ గ్లామర్ చాలా అవసరం, తమ రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి.
@క్రాంతి, నిజమే కదా!
@బాబా గారూ, పూర్తిగా అంతే..పూర్తిగా అంతే!
@మీనాక్షి, అంగీకరించి సభాబహిష్కారం నుండీ తప్పించుకున్నావ్.
@రాజకీయం మన జీవితాల్లో విడదియ్యలేని భాగం బాబాయ్! వాటిగురించి మాట్లాడక తప్పదు. నా కాలేజి జీవితం 8 వ భాగం ఈ వారాంతరంలో వస్తుంది.
@అబ్రకదబ్ర, నిజమే. అందుకే ప్రస్తుతం ఉన్న రాజకీయాలకూ సినిమాలకూ పోలిక. కాకపోతే సినిమాలు కాస్త బెటర్ అంతే.
@విజయ మోహన్, నెనర్లు
@మురళి, ఇలా సిద్దాంతాలు ప్రకటిస్తూ పోతే ఎప్పుడో ఒకప్పుడు నాకు సినిమావాళ్ళే డాక్టరేట్ ప్రకటిస్తారేమో!
సినిమాల విషయంలో మైనారిటీ అయినా సరే, నేను అప్పోజిషన్లోనే ఉంటానబ్బా!(అసలు సినిమాలేంట్లే, చాలా విషయాల్లో అప్పోజిషనే )
భలే రాసారు. ఎలా తీసినా మనం భరించేస్తాము. ఇంకో మంచి సినిమా రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తాము
Post a Comment