Thursday, June 26, 2008

కవితండోయ్ ! కవిత !!


అసంపూర్ణ సత్యం (अर्थ सत्य)



అంతులేని గగనాన్ని
ఆశల్లో ఇమిడ్చి
అదుపులో ఉన్న భువనాన్ని
ప్రశ్నిస్తూ ఉంటాను
ఎల్లలెరుగని విశ్వాన్ని
నమ్మకంలా ఉంచి
హద్దులెరిగిన పాలపుంతని
పరీక్షిస్తూ ఉంటాను
ఆశా,నమ్మకాలకన్నా
ప్రశ్నలూ,పరీక్షణలూ మిన్నా?
ఏమో...!
అదే జీవితంలో అసంపూర్ణ సత్యమేమో!
దాన్ని శోధించడమే ఈ జీవన లక్ష్యమేమో!!


14 comments:

మేధ said...

అంతులేని గగనాన్ని
ఆశల్లో ఇమిడ్చి
అదుపులో ఉన్న భువనాన్ని
ప్రశ్నిస్తూ ఉంటాను

mine:ఎంతో పెద్దదైన కోడ్ ని, చిన్నదైన సిస్టమ్ లో ఉంచి, టెస్ట్ చేయమని అడుగుతూ ఉంటాను...

ఎల్లలెరుగని విశ్వాన్ని
నమ్మకంలా ఉంచి
హద్దులెరిగిన పాలపుంతని
పరీక్షిస్తూ ఉంటాను

mine:కోడ్ వర్క్ అవదని తెలిసినా టెస్ట్ చేస్తూ ఉంటాను..

ఆశా,నమ్మకాలకన్నా
ప్రశ్నలూ,పరీక్షణలూ మిన్నా?
ఏమో...!
mine: రిలీజ్ లే ముఖ్యమా...?! ఏమో...!!

అదే జీవితంలో అసంపూర్ణ సత్యమేమో!
దాన్ని శోధించడమే ఈ జీవన లక్ష్యమేమో!!
mine: అదే ఈ సాఫ్టవేర్ ఇంజనీర్ జీవితసోపానం!!!

జ్యోతి said...

నువ్వు చెప్పింది అక్షరాలా నిజం మహేష్.బాగు బాగు..

సుజాత వేల్పూరి said...

medha, nice application

Purnima said...

medhaa.. kavita koo kotta ardhaanicchi nannilaa tarinchitivaa??

mahesh: keep asking.. you better try than to settle with ignorance!!

తెలుగు'వాడి'ని said...

@మేధ: This is one of the best spontaneous comment I read in the recent past. Fantastic.

Aditya said...
This comment has been removed by the author.
Aditya said...

నిజం చెప్పారు మహేష్ గారూ! థాంక్స్!!

రాధిక said...

great mahesh garu.
"ప్రశ్నలూ,పరీక్షణలూ మిన్నా?" yes

Bolloju Baba said...

బ్యూటిఫుల్


బొల్లోజు బాబా

Anonymous said...

@Mahesh : Chala bagundi andi mee kavitha ..

@మేధ : You filled good sense of humour to mahesh poetry... nice comment..

వేణూశ్రీకాంత్ said...

Good One Mahesh... దీంతో మీరు కవి అనే అభిప్రాయానికి మీరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోవచ్చు. మాకు కత్తి పోట్లు తప్పించవచ్చు...

మేధ గారు మీ ఆక్రోశాన్ని హాస్యం తో మేళవించి చక్క గా వెలిబుచ్చారండీ...వాహ్ క్యా పేరడీ హై...

మేధ said...

@సుజాత గారు, @mmksworld గారు: నెనర్లు..

@పూర్ణిమా గారు: నేను ఎంతో తన్మయత్వంతో వ్రాసింది కదా, కాబట్టి మీరూ తరించారు!!

@తెలుగువాడి గారు: నెనర్లు.. :)

@వేణూ శ్రీకాంత్ గారు: కరెక్ట్ గా అర్ధం చేసుకున్నారండీ... I was in a frustration when i wrote this!

Kathi Mahesh Kumar said...

హమ్మో....కవిత నేను రాస్తే, క్రెడిట్ అంతా మేధ కొట్టేసిందికదా! హన్నా...హత విధీ. ఈ విపత్తు నుండీ నేను ఎటుల బయట పడవలె?

@మేధ, నీ అనుభవంతో నా కవితని అన్వయించి కొత్త అందాన్ని తెచ్చిపెట్టవ్. నెనర్లు.

ఇక మేధని అభినందించినవారికి నాకవిత కూడా నచ్చిందని నేను డిసైడ్ అయిపోయి వారికీ నెనర్లు తెలిపేస్తున్నానహో!

ఇక నన్ను నన్నుగా, నా కవితని బేష్ అన్న వారికి కొంచెం ఎక్కువ నెనర్లు.

మేధ said...

హ్హహ్హహ్హ.. అదే మీరు ఇంకా ఏమీ కామెంట్ వ్రాయలేదేంటా అని చూస్తున్నాను!!! మీ కవిత బావుండబట్టే కదా, నేను అలా వ్రాయగలిగింది!!!!