"అసలు మీరు కవికాదన్నవాడిని నేను కత్తితో పొడుస్తాను" అన్న రాధిక గారికి , "మొదటి కత్తిపోటు నాకే!" అని స్వీకరిస్తూ ఈ టపా రాస్తున్నా. నా ఇదివరకటి టపా ఆలోచనలూ Vs భావాలు లో, నా కవితలూ,కథలూ రాయలేని అసహాయతను నా ఆలోచనా శైలి, నా conditioning మీదకీ నెట్టి తప్పించుకున్నాను. కానీ ఈ మధ్య బ్లాగుల్లో అనేక కవితలూ, కథలూ చదివేకొద్దీ, రాయలేకపోయినా, స్పందించగలిగే హృదయంకాస్త ఏర్పడిందనిపించింది. దాన్ని ఆసరాగా తీసుకుని మన
ప్రేమంటే...
నీ వేలితో నీ కన్నే పొడుచుకోవడం,
అని నా మిత్రుడి అనుకోలు.
కన్ను పొడుచుకునైనా...
ఆ ప్రేమ తడి అనుభవించాలని నా వేడుకోలు.
ఆ అనుభవం వెలుగులో,
జీవితం ఒక ఉదయకిరణంలా అనిపిస్తుంది.
అది కేవలం అనుభవిస్తేనే తెలుస్తుంది.
నా కళ్ళ నిరాశ
నుదుటి బొట్టై భాసిల్లుతుంటే,
నా గాజుల సవ్వడి
ఒంటరితనాన్ని పోగొట్టింది.
నా చెవి దుద్దులు
చెంప సిగ్గుల్ని ఆర్పేస్తే,
నా మెడలోని ప్రేమ గొలుసు
నన్ను ప్రేమగా అక్కున చేర్చుకుంది.
వేలికున్న ఉంగరం
బంధాన్ని తెంపుకెళ్ళిన చెలికాడి వేలిముద్రగా మిగిలితే,
నాకు ఆశనీ, దు:ఖాన్నీ నగలుగా వదిలి
ఆనందం మాత్రం చాటుగా తప్పుకుంది.
Thursday, June 26, 2008
నన్ను కవి అన్న వారిని, నేనే కత్తితో పొడుస్తా !
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
హన్నా!! ఇంత చక్కగా స్పందించేసి మళ్ళీ మొద్దుబారిన మగ కుంకలకు ఇంత భావుకత ఉండదు అని వ్యాఖ్యలు చేసేస్తే ఎలా మహేష్.
raasevi raasesthune nenu kavini kaadante ela oppukuntarandi.mimmalni kavi kaadante nijamgane podustha mari nenu
ఏమిటండీ ఈ డైలమా? ఇప్పుడు కవి అనాల వద్దా? పైన రాసినవి చదివాక కవి గారూ అని పిలవాలనుంది. అంటే కత్తి పోట్లు తినాలేమోనని భయమేస్తోంది.
అక్షరాలని కవితలాగా మార్చాలంటే స్పందిచే హృదయముంటే చాలు అని నిరూపించారు. అందుకోండి ఓ కేక.
మహేష్ కుమార్ గారు
వచనం డైరెక్టుగా భావల్ని చెపితే, కవిత్వం సూచనప్రాయంగా, బిట్వీన్ ది లైన్స్ లలో చెపుతుంది. వచనంలోనే అద్భుతమైన కవిత్వం పడించిన వాటికి గొ్ప్ప ఉదాహరణ: చలం మ్యూజింగ్స్. అతని ఓపూవు పూచింది కధ ఒక పరాకాష్ట.
త్రిపురనేని శ్రీనివాస్ అనే ఒక మంచి కవి, ఒక కవితలో ఇలా అంటాడు " అంత్య ప్రాసలేసి ప్రొజైక్ భావాన్ని కవిత్వమని డభాయించకు" అని. నేనేమైన రాయాలని పెన్నుపట్టుకున్నప్పుడల్లా, మనసులో ఓ బేనర్ కట్టినట్టుగా ఈ వాక్యం వేలాడుతుంది.
కవిత్వానికి నేను నమ్మే మరొక లక్షణం " పదచిత్రం" పదాలతో ఒక చిత్రం గీసినట్లుండాలి. ఆపదాలను చదువుతూ ఉంటే మనో కేన్వాసుపై ఒక చిత్రం రూపుదిద్దుకోవాలి.
ఇక మీ కవితలో నేను కవిత్వంలో ఆశించే పై లక్షణాలు లక్షణంగా ఉన్నాయి. మీరెందుకో నేను వ్రాయలేను, అంటూ ఇచ్చిన స్టేట్ మెంటు ను తక్షణం విత్ డ్రా చేసుకోవాలి. మీరింకా వ్రాయాలి. మంచి అనుభూతుల్ని మాకు కలిగించాలి.
మీ ఒకటవ కవిత నేను చెప్పిన శ్రీనివాస్ వాఖ్య కు దగ్గరగా ఉందని బహుసా మీరుకూడా గమనించే ఉంటారు. అయినప్పటికీ అది మంచి భావప్రకటన.
ఇక రెండవ కవిత వద్దకు వస్తే, దీనిలో నాకొక అభిసారిక, విరహోత్కంఠిత, మరో కోణంలో అయితే ఒక పరాజిత కనిపిస్తుంది.
కాటుకకనులనీరు ..... పద్యంలో చనుకట్టు అన్నమాట ఎందుకు రావాలి, అని ప్రశ్నిస్తే మా మాష్టారు, వలవలా ఏడ్చినప్పుడు, స్త్రీకి చనుకట్టుపైన కాక ఇంకెక్కడ ఆకన్నీరు పడుతుందని చెప్పారు. అంతే రీజనింగు మీరన్న నామెడలోని ప్రేమగొలుసు నన్ను ప్రేమగా అక్కున చేర్చుకుంది అన్న మాటల్లో వ్యక్తమయ్యింది. అంతే హృదయానికి దగ్గరగా ఉండే గొలుసు ప్రేమగా అక్కున చేర్చుకోవటం అనే అర్ధం కూడా ఉందిగా.
వేలికున్న ఉంగరం,--- పెళ్లి, ప్రియుడు వేసిన వేలిముద్ర గా చెప్పటం -- జరిగిన మోసం లేదా విరహాన్ని గుర్తుచేసుకోవటం చాలా బాగుంది.
ప్రియుని ఆబ్సెన్స్ లో ఆశ, (వస్తాడన్న లేదా బతకాలన్న), దుఖం వంటినిండా ధరించి ఉన్నాను. ఆనందం మాత్రం లేదు అని చెప్పటం చాలా స్పష్టంగ, అందంగా ఉన్నది.
చిత్రానికి వ్రాసే కవితలు, కొన్ని పరిధులకి లోబడే ఉంటాయి. కానీ ఈ కవిత చిత్రం పక్కన లేకపోయిన అర్ధం అయ్యేదిగా లేదు. అలా సార్వజనీనం చేయటం ఖచ్చితంగా మీ ప్రతిభగానె పరిగణించాలి.
చివరగా నేచెప్పదలచుకున్నది ఇది : ఎవరు అవునన్నా కాదన్నా, మీలో మంచి భావకుడు , కవి ఉన్నారు, వాడిని దాచేయద్దు.
కవిత్వంలో రీజనింగ్ బేస్డ్ కవితలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. మీరు కృషి చేసినట్లయితే ఆ లాక్యునే ను మీరు సమర్ధవంతం గా పూరించగలరు. ఎందుకంటే మీ రీజనింగ్ చాలా చాలా బాగుంటుంది.
లంచ్ టైము అయిపోయింది. మరో కామెంటులో కలుద్దాం. తప్పులేమైనా ఉంటే మళ్లా మాట్లాడుకుందాం.
@బాబా గారూ, ఈ మధ్య బ్లాగుల్లో మీరు,నిషిగంధ ,రాధిక,దిలీప్,పూర్ణిమ,కల్హర రాసిన కవితలు,కథలూ చదవడం ద్వారా కొంత కవితావేశం కలిగినా, ఇన్నాళ్ళ నా (చేతకాదు అన్న)నమ్మకానికి విడాకులివ్వలేక ఈ టపా రాశా. కవిత రాయగలిగానుకాబట్టి కవినైపోయాను అనే అపోహ ఎక్కడ నాలో కలుగుతుందో అన్న భయంకూడా ఒక కారణం. కవికి కావలసిన emotional depth వ్యక్తిగా నాలో లేవు అని ఎప్పుడూ నా మెదడులో ఒక మూల నిరసన వినపడుతూనే ఉంటుంది. అదెందుకో తెలీదు.
మీరు ఇచ్చిన ప్రోత్సాహం చూశాక సీతారామశాస్త్రి గారి "ట్రైలేద్దాం..కొండకొనకి..పోయేదేముంది మనకూ!పోతే"...కొన్ని టపాలు మనస్టేకూ, అనిపించి ఇంకాస్త సాధన చేద్దామన్న తెగింపు వచ్చేసింది.ధన్యవాదాలు.
@వేణూ,ఆడాళ్ళతొ పోల్చుకుంటే నిజంగా మగాళ్ళలో భావుకత పాళ్ళు తక్కువుంటుందనుకుంటా! ఈ జీవితం మరలో పడి, సున్నితత్వాలు అరగదియ్యబడి ఇలా తయారైన మనలోని మనసులు స్పందించాలంటే కూడా అదొక కసరత్తే.
@నాని, నెనర్లు. ఇప్పుడు ‘కవితలు రాయి’ అని పొడవడం అందరి వంతులాగుంది.
@సుజాత, ఇప్పుడిప్పుడే బాబాగారు "లాజికల్ కవిత" అనే శ్రేణి గురించి పరిచయం చేసారు. ఇక డైలమాలు లేకుండా ఆ ప్రక్రియలో రాగాలు తీస్తా! కాకపొతే ‘కవి’ అనే మాటంటే మాత్రం కత్తితో పొడవాల్సిందే.
@ప్రతాప్,నిజమే స్పందించే హృదయముంటే సహజంగా రాకపోయినా ప్రయతం మాత్రం భేషుగ్గా చెయ్యొచ్చని ఇప్పుడే తెలుస్తొంది. నెనర్లు.
మహేశ్ గారు...హాయ్...
మీరు రాసిన...నా కళ్ళ నిరాశలో......
నా గాజుల సవ్వడి ఒంటరితనాన్ని పోగొట్టింది....వేలికున్న ఉంగరం.బంధాన్ని తెంపుకెళ్ళిన చెలికాడి వేలి ముద్రగా మిగిలితే...............
ఈ పదాల కూర్పు ఎంత బాగుందో..........
ఆ గాజుల సవ్వడి అనే వాక్యమ్ దగ్గర నా మనసు ఇరుక్కుపోయింది.................
అంత బా రాసారు మీరు.....
ఇక పోతే....వర్మ గారు గీసిన అమ్మాయి చిత్రానికి .తగ్గట్టుగా రాసారు మీరు.....ఎందుకంటే ఆ అమ్మాయి మనసులో ఏదో బాధ ఉంది..ఆ బాధ ..ఆమె మొహం లో కనిపిస్తుంది..మీరు ఆ బాధని మీ మాటల్లో చాలా బా రాసారు.....
ఇక పోతే రాధికా గారు రాసిన స్నేహం అనే కవితలో...మీరు రాసిన ఆ లైన్స్ ఎంత.. బాగున్నాయో......
ఇంత బాగా రాసాక ..కూడా..మీరు అలా ఎందుకన్నారో నాకు అర్ధం కావట్లేదు.....
ఇక పోతే మీరు నన్ను కత్తితో పొడిచినా సరే నేను మిమ్మల్ని....కత్తి కవి గారూ అనే అంటాను..........ఈ అమ్మికి ఇంత ధైర్యమా అనుకుంటున్నారా?..హి..హి..హి...మీరు నన్ను పొడవరు అని తెలిసే అలా అన్నాను...
మహేష్ గారు నిజంగా మార్కులన్నీ కొట్టేసారు. నాకు మాటలు రాకా, ఓదార్చేవారు లేక కాలక్షేపానికి గీతలతో ముచ్చటిస్తుంటే చక్కని కవితలల్లి కవులతో చర్చిస్తుంటే ఎలాగొ వుంది. మిరన్నాఇలాగే కవితలతో మాట్లాడించగలరని మనవి. మీ స్పూర్తికి అబినందనాలు. నాకు కవితరాయాలని కొరికెక్కువ కాని ఇప్పటికే దెబ్బలు చాలా తిన్నను. త్వరలో మానేసుకుంటాను. నా బొమ్మలకు ఎక్కడైనా ఎలాంటిదైనా నిరబ్యంతరంగా కామెంట్ రూపంలో ఏమైనాకావిన్వండి సమయం కేటాయించి నాకు తెలుపగలరు.మళ్లీ కలుద్దాం.
కానీ ఈ కవిత చిత్రం పక్కన లేకపోయిన అర్ధం అయ్యేదిగా లేదు. అన్న వాక్యంలో లెదు అనె మాట కు బదులుగా ఉంది అని చదువుకోవలసినదిగా ప్రార్ధన. టైము లెక ప్రూఫ్ చూడలేకపోయాను. క్షమించండి.
నన్ను కత్తితో పొడవనందుకు ధన్య్వాదములు.
సాహితీ యానం
మహేష్ గారూ, రెండో కవిత (పృధ్వీరాజు గారి చిత్రానికి రాసింది) మాత్రం చాలా బావుందండీ.. చూస్తుంటే మీరు సవ్యసాచిలా ఉన్నారు.. సినిమాలు, ప్రేమలు, మందుబాబులు, తల్లి మనసులు,.... ఇప్పుడు కవిత్వం!!
చాలా బాగా రాశారండి. మీరు కవి కానే కానే కారు!!!ఎందుకంటె 'కవి 'అంటే 'కనపడదు వినపడదు ' అన్న అర్థం కూడా ఉంది :) :)
మీ చాలా పోస్టుల్లాగే ఈ పోస్టుతో కూడా నేనూ ఏకీభవించను గాక ఏకీభవించను.అంతే.
[నేను కవిని కానన్న వాణ్ణి అనే శ్రీలక్ష్మి తవికని మీ ఇంటిపేరు ఎలాగూ కత్తి కదా అని అలా వాడేసాను.ఇలా పోస్ట్ అవుతుందని అసలు అనుకోలేదు :) ]
మీరు కవితలు మొదలు మొదలు పెడితే ఈ లాజికల్ థింకింగులు మాని కాస్త ప్రపంచంలో పడతారని కూడా కాస్త ప్రోత్సహిస్తున్నాను.[జస్ట్ కిడ్డింగ్]
కానీ మీ నగలపోలిక కవిత మాత్రం చాలా చాలా బాగుందండి.నేను పృధ్వి గారి బ్లాగులోనే మీకు అభినందనలు తెలిపాను.ఆ తరువాత నా బ్లాగులో రాసింది కూడా చాలా బాగుంది.మరిన్ని రాస్తూ వుండండి.
ఇంటి పేరులో కత్తి ఉంది కనుక మీకేం.. పొడిచేస్తారు.. మరి నేనేటి సేసేదబ్బా ?? ;-)
మీ ఇంటిపేరు "కత్తి" అయినంత మాత్రాన, దాన్ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తానంటే ఎలా మాస్టారూ! మొదటి కవితకూ, మీ రెండో కవితకూ improvement స్పష్టంగా కనిపిస్తుంటేనూ...! కత్తి మాస్టారూ... మీ కవితలు కత్తి! మీరు ఖచ్చితంగా కవే!
మహేష్ గారు, మీ లోని భావుకుడ్ని చిత్రాలలో భందించకండి. విశాల ప్రపంచం లో వదిలెయ్యండి. అప్పుడు చూడండి, కవితా జల్లులు కురుస్తాయి, వర్ణనల హరివిల్లులు విరుస్తాయి.
Post a Comment