( విషయం గురించి ఒక వ్యాసం రాయాలని పదిరోజులకు ముందు మొదలెట్టాను. కానీ మొదలెట్టింది మొదలెట్టినట్టుగానే ఉంటే, చిరాకొచ్చి ఇలా ప్రయత్నించా.)
తెలుగు సినిమా కథకోసం వెతుకుతోంది
హీరో గారి కండల్లో
హీరోయిన్ కొండకోనల్లో
కొరియోగ్రఫర్ నడుమూపుల్లో
సినెమాటోగ్రఫర్ కసి చూపుల్లో
ఎడిటర్ కత్తిరించని ఫిల్ములో
డైరెక్టర్ తియ్యని షాటులో
తెలుగు సినిమా కథ కోసం వెతుకుతోంది
ఫ్రెంచ్ న్యూవేవ్ వేదాంతంలో
రష్యన్ సినిమా ఉద్దేశంలో
చైనీస్ కుంఫూ గెంతుల్లో
ధాయ్ యాక్షన్ మలుపుల్లో
హాలీవుడ్ డీవీడీల్లో
తెలుగు సినిమా కథ కోసం వెతుకుతోంది
****
8 comments:
caalaa baavuMdi
Very true.
Keep on searching :)
:)
మీ కవిత్వం చదివే సరికి నాకు కూడా ఈ రకంగా తవిక్వం వచ్చేసింది.:)
సహనం పరీక్షించుటలో
కాపీ పేస్ట్ చేయటం లో
అదే మూస ధోరణిలో
హీరో గారి చెత్త ఇమేజ్ లో
హీరోయిన్ ఒంపుసొంపు లో
కంపు కొంటే కామెడీ లో
ఒంటెద్దు పోకడల లో
అరిగిన ఫార్ములా లో
తెలుగు సినిమా కథ కోసం వెతుకుతోంది
మనల్ని జాగ్రత్త పడమని హెచ్చరిస్తుంది :)
baaga cheppaaru.. inkaa inkaaa cvhaala vaatillo vetukutondi...
good for telugucinema.
మరి మీ కథెప్పుడు bro?
Nice one. బాగా రాశారు.
"హీరో గారి కండల్లో
హీరోయిన్ కొండకోనల్లో
కొరియోగ్రఫర్ నడుమూపుల్లో
సినెమాటోగ్రఫర్ కసి చూపుల్లో"
Funny lines with lots of meaningful insights.
తమిళ మలయాళ వీదుల్లొ
కథానాయకుల కంటి చూపుల్లో
19వ శతాబ్దపు రంగుల చిత్రాల్లో
హా హా ....
ఈ కవిత నేటి తెలుగు సినిమా యొక్క నిజమైన రూపాన్ని వ్యక్తపరుస్తున్నది. ఈ విషయాన్ని తెలుపుటకొరకు మీరు వాడిన పదజాలం చాలా తమాషాగాను, రక్తికట్టించేటాట్లు ఉన్నది. ఈ పద్యాన్ని నేను చాలా బాగా ఆశ్వాదించాను.
Post a Comment