Tuesday, June 23, 2009

Mad Cow Sacred Cow


అబ్బే...ఆ పవిత్రమైన పిచ్చి పశువుల గురించి కాదులెండి! ఈ శనివారం నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చూసిన ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ గురించి.


అనగనగా ఒక కెనడాలో పట్టిన భారతీయ సంతతి వ్యక్తి. పేరు ఆనంద్ రామయ్య. కెనడియన్ భార్య. అప్పుడే మరో బిడ్డకు తండ్రయ్యాడు. సంతోషంగా సాగే జీవితం. హఠాత్తుగా కెనడాలో ‘మ్యాడ్ కౌ’ రోగం కమ్ముకుంది. రోజూతినే బర్గర్లోని బీఫ్ ద్వారా రోగాలు అంటుకునే ప్రమాదం ఏర్పడింది. ఆహారం విషయంలో అబద్రత ఏర్పడింది. తినేతిండి ఎంత సురక్షితమో ప్రశ్నార్థకం అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు మూల కారణం వెతకాలని తన వీడియో కెమెరాతో బయల్దేరాడు.

ఆనంద్ రామయ్య భార్య కుటుంబీకులు ఒకప్పుడు పశువుల పెంపకం వృత్తిగా కలిగినవారు. వారందరినీ కలిసి మాట్లాడాడు. తెలిసిందేమిటంటే పశువుల పెంపకం కుటుంబ వృత్తిగా ఉన్నంతవరకూ బాగానే ఉండేదని, కొన్ని కార్పొరేషన్లు/కంపెనీలు మాంసం ఉత్పత్తిని ఏకీకృతంచేసి గుత్తాధిపత్యం చెలాయించే స్థితికి వచ్చేసరికీ రైతుకు తీవ్రమైన నష్టాలువచ్చి, పశువుల పెంపకంకూడా కార్పొరేట్ల ఆధీనంలోకి వెళ్ళిపోయిందని తెలిసింది. మ్యాడ్ కౌ వ్యాధి మూలాలు ఇక్కడ్నించే మొదలయ్యాయనే నిజం ఆనంద్ కు తెలిసొచ్చింది.

కంజ్యూమర్/కస్టమర్ కు అతితక్కువ ధరకు బీఫ్ (పశుమాంసం) అందించి అధిక లాభాల్ని సంపాదించే వ్యూహంలో భాగంగా కారొరేషన్లు పశువుల దాణాలో వ్యర్థంగా మైగిలిపోయిన పశుమాంసాన్నే పౌడర్ రూపంలో కలిపే విధానానికి శ్రీకారం చుట్టారు. పశువుల ఆరోగ్యంతో సంబంధం లేకుండా శాఖాహారులైన పశువులకు పశువుల్నే తినిపించే ఘోరమైన పద్ధతిని అవలంభించారు. ‘మ్యాడ్ కౌ’ రోగం ఈ హేయమైన వ్యాపారపద్ధతికి మూలమయ్యింది.

ఒకవైపు రైతులు మరొక వైపు ప్రజారోగ్యం కారొరేషన్ల ధనదాహానికి బలైపోయాయి. తినేతిండి విషతుల్యమైపోయింది. అనే విషయం తెలుసుకున్న ఆనంద్ కు చాలా బాధకలిగింది. అదే సమయంలో తన పూర్వజులు భారతదేశంలో పశువులకున్న ప్రాధాన్యత గురించి, పవిత్రత గురించీ చెప్పిన విషయాలు మనసులో మెదులుతున్న ఆనంద్ ‘మ్యాడ్ కౌ’ (పిచ్చి పశువు) కు వ్యతిరేకమైన ‘సేక్రెడ్ కౌ’ (పవిత్ర పశువు)ను వెతుక్కుంటూ కేమెరా భుజాన వేసుకుని భారతదేశం వచ్చాడు.

పూర్తి వ్యాసం నవతరంగంలో చదవండి.


****

14 comments:

Sujata M said...

మీరు 'ఎ పేసేజ్ టు ఇండియా' చూసారా ? నవతరంగం లో దీన్ని గురించి ఏమయినా వ్యాసాలు ఉన్నయ్య ? ఇంకోటి నేను చాలా కాలంగా ఇస్మాయిల్ మర్చంట్ తీసిన ఒక సినిమా వెతుకుతున్నాను. దీని పేరు గుర్తు రావడం లేదు. ఒక ఆంగ్లో ఇండియన్ పనిమనిషి గురించి. ఇంటి యజమాని - బ్రిటిష్ ! వారి పసి పిల్లవాడిని నీనా గుప్తా నర్స్ చేస్తుంది. ... మీకు గుర్తు వస్తే - ప్లీస్ చెప్పండి. ఈ సినిమా గురించి 2003 లొ చదివాను. ఇపుడు నా బ్రెయిన్ మరీ షార్ప్ అయిపోయి, పేరే మర్చిపోయాను.

Kathi Mahesh Kumar said...

@Sujata:'ఎ పేసేజ్ టు ఇండియా' చదివాను చూశాను. నవతరంగంలో ఇప్పటివరకూ ఆ సినిమా గురించి ఎవరూ రాయలేదు.

ఇక మీరు చెప్పిన మర్చంట్ ఐవరీ సినిమా ‘కాటన్ మేరీ’ ఆ పాత్ర పోషించింది నీనా గుప్తాకాదు మధుర్ జాఫ్రీ.

Kathi Mahesh Kumar said...

నీనాగుప్త ఆ సినిమాలో ఉంది.

సుజాత వేల్పూరి said...

సుజాతా,
A passage to India గురించి మీరు రాయకూడదూ? అందులో విక్టర్ బెనర్జీ భలే ఉంటాడు.జూడీ డేవిస్ కూడా!
ఎదురు చూడొచ్చా మీ వ్యాసం కోసం?

Kathi Mahesh Kumar said...

@సుజాత: ప్రయత్నిస్తాను. కానీ ఆపుస్తకం మొదటిసారి చదివినప్పుడు. సినిమా మొదటిసారి (డిగ్రీ చదివే రోజుల్లో)చూసినప్పుడున్న "రొమాన్స్" ఇప్పుడుందో లేదో తెలీదు.

ఎందుకంటే మా ఫ్రొఫెసర్ ఆ నవలలో డాక్టర్ అజీజ్(విక్టర్ బెనర్జీ) పాత్రలోని పాశ్చాత్యులకు అర్థంకాని instinctive Indian గురించి చెబితే "అబ్బ ఎంత నిజం" అనుకున్నాం. గుహలో జరిగిన ఘటనలోని సైకో అనాలిసిస్ కలిపిన మిస్టిసిజం గురించి చెబితే దాన్నొక గొప్ప అనుభూతిలాగా ఫీలయ్యాం. మిసెస్ మూర్ లోని "భారతీయత" గురించి వివరిస్తే ఉప్పొంగపోయాము. కానీ ఇప్పుడు వెనక్కు తిరిగిచూస్తే...ఎందుకో చాలా ఫూలిష్ అనిపిస్తుంది.

బహుశా అందుకే రాయాలేమో! ప్రయత్నిస్తాను.

Shashank said...

చాలా రోజుల నుండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. ఆర్యులు అనేవారు ఎక్కడనుండో వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నారని మీరు నమ్ముతారా? do you believe in the Aryan Invasion Theory?.

Kathi Mahesh Kumar said...

@సుజాత: నా ముందు వ్యాఖ్యలో మొదటి వాక్యం "నేనుకూడా ప్రయత్నిస్తాను" ఉందాల్సింది. నేను కూడా ఎగిరిపోయింది.

sujata గారు ఆ సినిమా గురించి రాస్తే, నేను అప్పుడెందుకు నచ్చింది ఇప్పుడెందుకు ఆ impact ఇవ్వటం లేదు అనేదాని గురించి రాసెయ్యాలి. We can compare notes. It sounds like a good idea.

ఈ సినిమాలో సినెమాటోగ్రఫీ ఇంకా నాకళ్ళలో మెదుల్తూనే ఉంది.ముఖ్యంగా డాక్టర్ అజీజ్ ను మిసెస్ మూర్ మొదటిసారిగా మసీదులో కలుసుకునే సాయంత్రం ఎంత అందంగా ఉంటుందో!

@శశాంక్: ఈ విషయంపైన మలక్పేట రౌడీ బ్లాగులో ఒక పే...ద్ధ చర్చ జరిగింది. కొంచెం వెతుక్కోండి. సమాధానాలు దొరికేస్తాయి.

మరువం ఉష said...

ఇదే కాదు, GM foods కూడా త్వరలో వాటి వంతు దుష్ఫలితాలని ఇవ్వనున్నాయి. నేను నా శాయశక్తులా ఆర్గానిక్ ఫుడ్స్ వాడతాను. సమీప బావిలో నా ఆప్తమిత్రురాలు ప్రియతో కలిసి Organic Farming http://green-bujji.blogspot.com/ దిశగా మా వంతు కృషి సలుపుతాము. నేను శాఖాహారిని కనుక ఇప్పటికి ఈ క్రొత్త శత్రు రోగాల పాలబడను. మల్లాది నవల "క్రొత్త శత్రువు" గుర్తుకి వచ్చింది.

Shashank said...

vetike ooopika leedu. time anta kante leedu. anduke adiga. yes or no cheppandi.

vinod said...

passage to india సినిమాలో ఆ caveసీన్ లో ఏనుగు కొండ ఎక్కుతుండడం long shot,mid shot,close-up inter cutలో చూపించారు.చాలా బాగుంటుంది.స్వర్ణ కమలం సినిమాలో
భానుప్రియ,వాళ్ళ నాన్న,అక్క కలసి భరతనాట్య ప్రదర్శనకని ఎడ్లబండిలో వెళుతుంటారు.ఆ జోడెడ్లని కూడా ఇలాగే చూపించారు.బహుశా inspiration అంటే ఇదేనేమో.ఇప్పుడు మనవాళ్ళు పోస్టర్ డిజైన్ తో సహా జిరాక్స్ కాపీ లాగుతారు గానీ ఒక shotనో editing techniqueనో తీసుకుని మన సొంత కధలో నేటివిటీకి తగ్గట్టు apply చెయ్యరే?

అలాగే జంధ్యాల సినిమాల్లో అందరూ మాటలే గుర్తు పెట్టుకుంటారు కానీ నాకు ఆయన shot division కూడా నచ్చుతుంది.ఒక సినిమాలో ఒక పాత్ర చేసే తిక్క వేషాలకి వేరొక పాత్రకి తగిలే షాక్(రియాక్షన్)ని ఫన్నీగా చూపెట్టడానికి వీడి మొహం వాడి మొహం ఫాస్ట్ గా నాలుగైదుసార్లు వెంటవెంటనే చూపిస్తారు.ఐతే ఈ టెక్నిక్ ని మొదటి సారి వాడింది 1969 లో వచ్చిన EasyRider అనే సినిమాలో.ఈ సినిమాలో ఒక పాటలో back cutting అని ఇంకొక ఎడిటింగ్ ప్రయోగం చేసారు.ఈ సినిమా గురించి చెప్పుకోవలసింది చాలావుంది. హలీవుడ్ చరిత్రలో ఇది మొట్టమొదటి ఇండిపిండెంట్ ఫిల్మ్(wow,,ఫిల్మ్ అని టైప్ చేయడం ఎంత ఈజీనో లేఖినిలో ).
ప్రొడ్యూసర్,డైరెక్టర్,D.O.P,నటీనటులు అందరూ
ఒక టీం గా పర్సనల్ ఇంటెరెస్ట్ తో చేసిందే తప్ప ఒక స్టూడియో సపోర్ట్ లేదు.సినిమా అంతా ఔట్‌డోర్ లో తీసిందే.1960 ల నాటి అమెరికా సమాజాన్ని ఇది ఎంతగా ప్రతిబింబిస్తుందంటే అమెరికన్ హిస్టరీ స్టూడెంట్స్ కి ఇది పాఠ్యాంశం.
సరే ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే ఈ ఇంటర్నెట్ లాంటివేవీ అందుబాటులో లేకున్నా అప్పటి దర్శకులు కె.విశ్వనాథ్, జంధ్యాల మంచి సినిమాల నుంచి స్పూర్తి పొందారు.ఇప్పటి తరం మాత్రం ఫారిన్ డి.వి.డి.లు అని కొన్ని చెరుకులు తిని పిప్పి మన మీద ఊస్తున్నారు.

vinod said...

మీరు శశాంక్ కు ఇచ్చిన సమాధానం చూసి ఆయన నిన్నటి వరకు జరిగిన గొడవలో మిమ్మల్ని ఖండించాడని అలా అన్నారేమో అనుకున్నా.కానీ మీరు చెప్పిన ఆ పే...ద్ధ చర్చ కొంచెం చదవగానే అర్థమయింది ఆ ప్రశ్నకి,ఈ రోజు మీరు ఏదో బ్లాగ్ లో ఆ మ్యాక్స్ ముల్లరే లేకపోతే మీ వేదాలు ఎప్పుడో పోయుండేవి అనడానికి సంబంధముందని.
I don't know if I can discuss it in this place or not.hope you'll reply.

mahesh>>
1947 కు మునుపు భారతదేశం అనేది ఒక దేశంకూడా కాదు. It was a "great idea" and it still is. రాజకీయంగా,భౌగోళికంగా ఒకటైనంత మాత్రానా, ‘అందరూ ఒకటే’ అనే సిద్ధాంతం కూడా చెల్లదు.కాబట్టి ఆర్య-ద్రవిడులే కాదు, నానా జాతుల సమాహారం భారతదేశం. అదే భిన్నత్వంలో ఏకత్వం.
anonymus>>
కత్తి గారు, ఇక్కడ పాయింట్, ఇప్పటికీ తోటి భారతీయుల కంటే శ్రీలంక వాళ్లు మాకు దగ్గర చుట్టాలని అంటున్నారు అందరూ ఒకటే జాతి వాళ్లా కాదా అనికాదు . కొందరు బయట వాళ్లు కొందరు లోపల వాళ్లు అని.
వెధవ సిద్దాంతాన్ని పట్టుకొని తమిళ మహానుబహావులు . వాళ్లకు హిందీ అంటే అసహ్యం, సంసృతం చదివితే స్టేట్ first ఇవ్వరు. కాని ఇంగ్లీష్ అంటే ఇష్టం. కొందరు తెలుగు వాళ్లకు కూడా ఈ పిచ్చి ఎక్కుతున్నది ఈ మద్య. ముఖ్యం గా మూలల్లో గోదావరి లంకల్లో ఉంటూ కడుపు నిండి ఏమి చెయ్యాలో తెలియని వాళ్లకు, తమిళ తంబులతో వ్యాపారాలు, పెళ్లి సంబంధాలు ఉన్న కొన్ని కులాలకు ఈ మెంటల్ మొదలయ్యింది.
mahesh>>"బయట" "లోపల" అనేవి చారిత్రాత్మకంగా సమస్యాత్మకమైన నిర్వచనాలు.ఆప్ఘనిస్తాన్ అవతలినుంచీ బర్మాలోని చిట్టగాంగ్ వరకూ, వీలైతే ధాయిలాండ్ వరకూ, హిమాలయాలనుంచీ శ్రీలంకవరకూ "అఖంఢ భారతం"గా కొన్ని సిద్ధాంతాల ఆధారంగా వాదించొచ్చు, కొంత వరకూ నిరూపించొచ్చుకూడా.మనకంటూ హిస్టరీ ఉన్నట్టా లేనట్టా అనే బాధ అసంబద్ధం."మనదంటూ" ఒకప్పుడు ఏమీలేదు. ఎందుకంటే ఒక definitive దేశంగా మనం మారిందే 1947 లో, అంతవరకూ ఒదొక notionally unified culture అంతే!

Recorded history కన్నా ముందు, ఎవరు ఎక్కడికి ఖండాంతరాల వలస వచ్చారు అన్నదానికి ఒకదానుకొకటి పొంతనలేకుండా వంద సిద్ధాంతాలు ప్రతిపాదించొచ్చు. కాని దానివల్ల మన వర్తమానానికొచ్చే నష్టంగానీ, విరగ్గాసే లాభంగానీ లేదనే నా ఉద్దేశం.
dr.sreenu>>ఆర్యులు, ద్రావిడుల సిద్దంతం గురించి MSR Murthy గారు "ఏది చరిత్ర" అనే పుస్తకంలో విపుళంగా చర్చించారు (అజో, విభో, కందలం ఫౌండషన్ వారి ప్రచురణ). ఇందులో "మాయదారి మాక్స్‌ముల్లర్" అనే చాప్టర్లో ముల్లర్ మహాశయుడు మన చరిత్రను ఎలా త్రప్పుద్రోవ పట్టించాడో ఆధారలతో సహా వివరించాడు. వీలయితే చదవండి.
>>indianminerva>>
Dr Sreenu:గారు బాగా గుర్తుచేశారు. ఇందులోనే Hitler తీరు వల్ల Max Muller తన స్వయం ప్రవచిత "సిద్ధాంతాన్ని" ఖండించవలసిన వచ్చిన తీరు కూడా వివరించారు.
-------------------
ఇప్పుడు నావి కొన్ని doubts
-------------------
1)మీరు ఈ చర్చలో భారత దేశం అనే పదాన్ని పక్కన పెట్టి ఉపఖండం మొత్తాన్ని consider చెయ్యండి.వేరు వేరు జాతులు ఉన్నాకూడా వారెవరూ ఆర్యులు కాదుగదా.

కోశాంబి చెప్పిన దాని ప్రకారం ఆర్యులు హరప్ప మొహింజొదారొ ల మీద దాడి చేసిన నాటికి ఆర్యులది హరప్ప మొహింజొదారొల కంటే అభివృద్ది చెందిన నాగరికత కాదు.ఆర్యులు అప్పటికింకా సంచార జాతే .హరప్పన్ లు అప్పటికే పట్టణాలు/గ్రామాలు నిర్మించుకుని వున్నారు.ఆర్యులు పశుపోషకులైతే హరప్పన్ లు వ్యవసాయం చేయడం నేర్చుకుని వున్నారు.ఐతే ఆర్యులు హరప్పన్లని వోడించగలడానికి కారణం ఆర్యుల దాగ్గిర ఇనుప ఆయుధాలు వుండడం ,హరప్పన్లకి ఇనుము వాడకం తెలియక పోవడం.
అయితే ఆర్యులు సంచార జాతి కావడం,పట్టణాలు ఏర్పరుచుకునే నాగరికత లేకపొవడం వల్లనే హరప్ప మొహింజొదారో లని తగులబెట్టేసారు.హరప్పన్లు అప్పటికే సింధు నది నుండి చిన్న చిన్న ఆనకట్టల వంటి నిర్మాణాలతో నీటిని మళ్ళించి వ్యవసాయం చేయగలవారిగా కోశాంబి చెబుతాడు.ఆర్యులు ఈ ఆనకట్టలను ధ్వంసం చేశారంటాడు.దీనికి సాక్ష్యంగా ఇంద్రుడు ఇలాంటి నిర్మాణాలని కూలగొట్టినట్ట్టు వేదాలనుండి కొన్ని శ్లోకాలు ఉదహరిస్తాడు.
p.s:అంత నాగరికత ఉన్నా హరప్పన్ లు మట్టి పాత్రలకే ఎందుకు పరిమితమైపోయారో,ఆర్యులు మాత్రం ఇనుము వాడకం ఎలా నేర్చారో నాకు అప్పుడు డౌట్ రాలేదు గానీ ఇప్పుడు వస్తుంది.
సరే.ఇంతకీ విషయమేమిటంటే కోశాంబి చెప్పినదాని ప్రకారం ఆర్యులు హరప్పన్ లు(ద్రవిడులు)కంటే గొప్పవారేమీ కాదని.

vinod said...

2)ఒక anonymous చెప్పారుగా గోదావరి లంకల్లో తమిళులతో పెళ్ళి సంబంధాలున్నయని.ఇది ఎలా మొదలయ్యిందంటారు?మరి కృష్ణ,నెల్లూరు,ప్రకాశం లో లేదే తీరం ఉన్నా గానీ?మొన్న శ్రీలంక శరణార్ధుల బోటు తర్వాత వారికి శిబిరం కూడా గోదావరి జిల్లాలోనే వచ్చింది(యాధ్రుచ్చికం కావొచ్చు).ఈ south indian languagesఅన్నీ ఒకదానికొకటి దగ్గరి చుట్టాలేని తెలుస్తూనే వుంటుంది.ఐతే నా డౌటు వీటిలో తొలుత పుట్టిన భాష ఏది?తర్వాత పరిణామం ఎలా ఉండింది?అని. కర్ణాటకలో ఊర్ల పేర్లు హల్లి,పాళ్య అని ఉంటాయి.కర్ణాటక-ఆంధ్ర బోర్డర్ వైపు వస్తుంటే పాళ్య కాస్తా పాళ్యం అవుతుంది.
విజయవాడ దాకా వచ్చేస్తే పాళ్యం పోయి పాలెం అవుతుంది.
నెల్లూరు,చిత్తూరు యాసల్లో ఎవరినైనా కొంచెం కోపంగా/దబాయింపుగా/ పిలవాలంటే 'యో'అని పిలుస్తారు.తమిళ్ సినిమాల్లో ఇది చాలా కామన్ గా వినబడే పదం.కృష్నా జిల్లాలో 'ఓయ్' అనే అంటారు.యో అసలు వినపడదు. నేను కొన్ని ఇంగ్లిష్ సినిమాల్లో కూడా యో అనే పదాన్ని సమాన అర్ధం లో విన్నా.నాకు తెలిసి కృష్ణా జిల్లా పల్లెటూళ్ళలో ఎడ్లబండి నడిపేవాడు ఎద్దులని అదిలించి నడవమనడానికి చ్చో ,చ్చో అనీ బండి ఆపడానికి ఓ ఓ/ఓహొ ఓహొ అనో అంటాడు .ఇదే whoa పదాన్ని చాలా ఇంగ్లిష్ సినిమాల్లో గుఱ్ఱబ్బండి నడిపేవాడు సమానార్ధంలో వాడుతాడు.
ఇక గోదావరి యాస చూస్తే మళయాళం గుర్తొస్తుంది.పదాల సారూప్యత తెలీదు గానీ ఎందుకో ఇద్దరూ సాగదీసి మాట్లాడతారనిపిస్తుంది.(no pun intended but seriously)గోదావరి వాళ్ళు ఆయ్ అని ఏ అర్ధంలో అంటారో స్కాట్లాండ్ వాళ్ళు కూడా అదే అర్ధంలో వాడతారు.Brave heartసినిమా చూడండి.

3)మీరన్నారు -Recorded history కన్నా ముందు, ఎవరు ఎక్కడికి ఖండాంతరాల వలస వచ్చారు అన్నదానికి ఒకదానుకొకటి పొంతనలేకుండా వంద సిద్ధాంతాలు ప్రతిపాదించొచ్చు. కాని దానివల్ల మన వర్తమానానికొచ్చే నష్టంగానీ, విరగ్గాసే లాభంగానీ లేదనే నా ఉద్దేశం.
so వర్తమానానికొచ్చే నష్టంగానీ, విరగ్గాసే లాభంగానీ లేదని మీకు తెలుసన్న మాట.మరి ఇదే ఉద్దేశం మీకు రాముడుకి సీతేమౌతుంది? లాంటి టపాలకి సంబంధించి ఎందుకు లేదు?

4)Hitler తీరు వల్ల Max Muller తన స్వయం ప్రవచిత "సిద్ధాంతాన్ని" ఖండించవలసి వచ్చిందా?

Sujata M said...

Yes. Cotton Mary. Neena Gupta nurses (breast feeds) the english infant and mary wants to take all the credit. waaow - thanks.

టింగు రంగడు said...

మహేష్ గారు,

మీ వల్ల కొత్త విషయం తెలసుకున్నాను, కృతజ్ఞుడ్ని.
అప్పటి మ్యాడ్ కౌ లాగానే ఇప్పటి స్వైన్ ఫ్లూ కూడా ఇలానే పండి మాంస పారిశ్రామికరణ, అక్కడ కనీస ప్రమాణాలు పాటించకపోవడం వలన మెక్సికో లో ఉద్బవించింది అని చదివాను.

దీనిని బటి చుస్తే ఈ మాంస పారిశ్రామికరణ, అందులోని విసృంకల ఆదాయ దుర్క్పదం వలన మానవాళి కి ఇంకా ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో.