Sunday, June 21, 2009

ముసుగుదొంగ రూపాలు...రెండోసారి!




ఈ విషయంపై నేను రాసిన మొదటి టపాలో ఈ మర్యాదస్తుడు దొంగపేరుతో "నీ dalit christian agenda తో Arabian sea లో కలువు" అని శెలవిచ్చారు. ఇందులో వీరి తోడుదొంగలకు కుల,మత వివక్షలు కనిపించకపోయినా కనీసం వీరి విద్వేషం, ఆభిజాత్యం, ఝాఢ్యం కనిపిస్తాయనుకున్నాను. కానీ ఏం చేద్దాం! దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ భావజాలాన్ని నెత్తికెక్కించుకుని ఊరేగుతున్న జనాలకు "అర్థం" అవుతుందనుకోవడం నా అమాయకత్వం.

"నేను ఎవ్వనితో గొడవకు దిగను, నన్ను కించపరిస్తే తప్ప. అలా కొన్ని సార్లు జరిగింది కూడా. నేను పెద్ద లెక్క చెయ్యను దేన్నైనా. ఇలాంటిది ఇక్కడ జరిగే కాళ్ళు లాగుడు గట్రా ఐ కేర్ ఏ హూట్." అని ఉదాత్తంగా శెలవిచ్చిన ఈ మహాజ్ఞాని ఎన్ని మారుపేర్లతో తన బ్లాగురాయడమనే "ఫన్"ని సాధించాడో చెప్పక తప్పదు. ఒక్కో వ్యాఖ్యా చదువుతుంటే మీలో చాలా మందికొ కొన్ని హేట్ బ్లాగులు గుర్తుకొస్తే అది నాతప్పు కాదు. ఎందుకంటే వాటన్నింటినీ బహుశా ఈ మహానుభావుడే ఫన్ కోసం రాసుండొచ్చు. లేదా ఈయన చెంచాలు సగర్వంగా contrinute చేసుండొచ్చు.

"కత్తిని ఎక్కడాన్నా నేను తిట్టినట్టు చూపండి." అని నా బ్లాగులో ఛాలెంజ్ చేసి, ‘పుస్తకం’లో గోపాలరాజు ఈ ఉన్నతుడే అని నేను చెప్పేసరికీ రొమ్ము విరుచుకుని "ఐతే ఏమిటి" అన్న ఈ ఉదాత్తచరితుడికి మంగళహారతి పట్టాల్సిందే. కొందరు ఆల్రెడీ పడుతున్నారు లెండి. నా హారతి కొంచెం ఘాటెక్కువ అందుకని కొంచెం దూరంగానే పట్టాలి. పడతాను. ఎంతైనా భారతీయ సంస్కృతీ, చరిత్ర, సాంప్రదాయాలూ ముఖ్యంగా బ్రాహ్మణ గౌరవాన్ని ఒంటిచేత్తో, పదిపన్నెండు పేర్లతో, ఒక సైన్యాన్ని తయారుచేసి, విద్వేషాన్ని నింపి, గండ్రగొడ్డళ్ళు నింపే గంధర్వలోకాలకు సాగనంపి, కనీసం ద్వేషాన్ని రగిలించి నిలపాలని పరితపించే వ్యక్తికదా!

ఏమైనా అంటే "కుచ్ తో లోగ్ కహేంగే" అని పాటలు పాడతాడుగానీ, తన కుతిని తీర్చుకోవడానికి ఎన్నెన్ని తప్పుడు దారులు తొక్కాడో ఒక్కొక్కటీ తెలుస్తుంటే నాకూ విపరీమైన గౌరవం వచ్చేస్తోంది. అర్జంటుగా గుంటూరు పిలిపించి మర్యాదలు చేశెయ్యాలనే భావావేశం ఉప్పొంగిపోతోంది.

ఈ టపాలో ఈ మహాజ్ఞాని , సిద్ధయోగికున్న మరో నామధేయం అలాగే తనకంటూ పది బ్లాగులున్నా నా బ్లాగు మీద గౌరవంతో దాని URL ఇచ్చే ఔదార్యం గురించి తెలుసుకుందాం. ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. ఒకసారి ఆల్రెడీ తెలిసిన IP అడ్రస్సుతో పోల్చుకుంటే తన ఫేవరెట్ పేరు గోపాలరాజు కాకుండా ప్రసాద్ అనే పేరుతో "Crime is a crime who ever committed it. It cannot be washed out. And it cannot be justified in any grounds." అని శెలవిచ్చారు. ఎంత విశాలమైన ప్రతిపాదనకదా!

ఇక్కడ కిటుకేమిటంటే, ఈయన విశాలత్వం అంతా దళితులకూ, క్రిస్టియన్లకూ మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళు మాత్రమే చట్టం దృష్టిలో సమానంగా ఉండాలి. అలా ఉండకపోతే ఈయన గారి ఔదార్యానికి ఖర్చయిపోయేదెట్లా? ఎంత ఉన్నతమైన ఆలోచనకదా! అదే ఈయన గొప్పతనం. అభినందించాల్సిందే. పూజించాల్సిందే. ఈ వ్యాఖ్యలో మీకు "samuel reddy is very dangerous to this country" అనే వాక్యం వింటుంటే కొన్ని ప్రత్యేకమైన బ్లాగుల్లోని రాతలు గుర్తు రాలేదుకదా! వస్తే నాది మాత్రం పూచీ కాదండోయ్!!

ఈ సర్వాంతర్యామి గురించి కేవలం రెండు టపాల్లో చేప్పేస్తే ఎలా....ఐ టీవీ స్టైల్లో... "చెప్పాల్సింది చాలా ఉంది. చూడాల్సిందింకా మిగిలే ఉంది."

PS: కొందరు బ్లాగు మిత్రులకు ఒక చిన్న మనవి. టెర్రరిజానికిచ్చే కొన్ని నిర్వచనాల్లో ఒకటి "The use of violence for the achievement of political ends is common to state and non-state groups. " ఇక్కడ హింస భావజాలంలో, వాడేపదాల్లో ఉంది. ఈ టెర్రరిస్టు మూక మమ్మల్నెక్కడ అటాక్ చేస్తుందో అని భయంభయంగా మీమీ బ్లాగుల్లో దాక్కుంటే అదే వారి విజయం. వారి విజయాన్ని కాంక్షించి ఊరకుంటారో, నాతో గొంతుకలిపి వెళ్ళగొడతారో అది మీ ఛాయ్స్. మీ హక్కు. కానీ నా పోరాటం మాత్రం ఆగదు. సైలెంటుగా నాకు మద్ధత్తు తెలుపుతున్న అందరికీ నా కృతజ్ఞతలు.

****

12 comments:

సుజాత వేల్పూరి said...

Mahesh,
All the best!

Sravya V said...

ఏమిటి మహేష్ మీరు ఈ టపాతో ఏమి చెప్పదలుచుకున్న్రారు ? ఒక మనిషి ఒక ఈమైల్ అకౌంట్ మాత్రమే వాడాలా? మీ కేసుకు ఈ టపాలో మీరు ఉదహరించిన సంబంధం ఏమిటి?
ఎంతైనా భారతీయ సంస్కృతీ, చరిత్ర, సాంప్రదాయాలూ ముఖ్యంగా బ్రాహ్మణ గౌరవాన్ని ఒంటిచేత్తో, పదిపన్నెండు పేర్లతో, ఒక సైన్యాన్ని తయారుచేసి, విద్వేషాన్ని నింపి, గండ్రగొడ్డళ్ళు నింపే గంధర్వలోకాలకు సాగనంపి, కనీసం ద్వేషాన్ని రగిలించి >> దీని ఉద్దేశ్యం ఏమిటి? వరండా లో స్విచ్చు వేస్తే వంటింట్లొ బల్బ్ వెలుగుతుంది లాజిక్ కాదు కదా? కులం మాట ఎత్తితే రగిలిపోయే మీరు మాత్రం ఈ కులాన్ని తలుచుకోకుండా టపా రాయలేరే. BTW ఇలా అన్నకదా అని నన్ను ఆ కులం కింద జమ వేయకండి పప్పు లో కాలు వేస్తారు. గుంపు, తోడుదొంగలు అని రాస్తున్నారు అంటే మిమ్మలిని సమర్దించేవారు మాత్రం holy cows మిగిలిన వాళ్ళు గుంపు తోడుదొంగలా?
మిమ్మలిని విమర్శిస్తే మీకు మాత్రం ఇంత రగులుతుంది మరి కొట్లాది మంది పూజించే దేవుడిని వాళ్ళ నమ్మకాలను మాత్రం మీ ఇస్టమొచ్చినట్లు మీరు విమర్సించవచ్చు కదా?

Kathi Mahesh Kumar said...

@శ్రావ్య: వ్యాఖ్య రాసి కొన్ని సందేహాలకు సమధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చాలా కొద్ది బ్లాగుల్లోనే చూసినట్లు గుర్తు. అభినందనలు.

Sravya V said...

Yes Mahesh U r right I swa only in few blogs those bolgs are who opposes u only. Do what ever you want.

హరి said...

మీరు ప్రస్తావించిన ST/SC Act మొదట అనవసరంగా తోచినా కొన్ని బ్లాగుల్లో వస్తూన్న వెకిలి టపాలు, వ్యాఖ్యలు చూసి చాలా బాధ కలిగింది. తమ చేష్టల ద్వారా మీరు చేస్తున్న ఆరోపణలకు వారే బలం చేకూరుస్తున్నారు. మీకు నైతికంగా నా మద్దతు తెలుపుతున్నాను.

మరువం ఉష said...

* మహేష్, మనం భావ, వాక్ స్వాతంత్ర్యం వున్న దేశంలో వున్నాము కనుక మన నమ్మిన విషయాల ప్రకటన, సద్విమర్శలు రెండూ సహజమే. అవి అన్యమార్గంలో వెళ్ళాయి అనుకుంటే మనం తప్పక ప్రతిస్పందిస్తాము, వాదిస్తాము. మీ విషయంలోనూ అదే జరిగివుండొచ్చు. సమయాభావం వలన పరిణామాలు, పర్యవసానాలు నాకు తెలియవు. నేను మీ బ్లాగు రెగ్యులర్గా చూస్తాను. ఇకపై చూస్తాను. వ్యాఖ్యానిస్తాను. అందులో ఏ మార్పు వుండదు. ఇది మద్దతా, నా అభిప్రాయం పంచుకోవటమా అన్నది చదువరుల వితరణకి వదిలేస్తున్నాను.

Kathi Mahesh Kumar said...

@శ్రావ్య: blogs that oppose me!!! సమస్యకు మూలమేమిటో గ్రహించారా? "నన్ను" వ్యతిరేకించడంలో ఏమైనా అర్థముందా? నా ఆలోచనల్ని ఖండించొచ్చు. నా భావజాలాన్ని ఏకిపారెయ్యొచ్చు. నా అభిప్రాయాల్ని తుత్తునీయలు చెయ్యొచ్చు. నా రాతల్ని కొట్టిపారెయ్యొచ్చు. అంతేతప్ప నన్ను "మొత్తంగా వ్యతిరేకించడనికి" ఏముంది?

నేను వంద విషయాల గురించి వంద అభిప్రాయాలు చెబుతాను. అన్నిటినీ వ్యతిరేకించి అవహేళన చేస్తే దాన్ని "ద్వేషం" అంటారు. నా మత విమర్శను ప్రాతిపదికగా చేసుకుని కుల విమర్శ చెయ్యడాన్ని "ఆభిజాత్యం" అంటారు. నేను పోరాడుతున్నది దానికి వ్యతిరేకంగానే.

నేను చేసిన హిందూవిమర్శ కొత్తదీ కాదు. విన్నూత్నమైనదీ,విప్లవాత్మకమైనదీ అసలు కాదు. ఎన్నో తరాలుగా చెయ్యబడుతున్నది. చేస్తూవస్తున్నది. ఒక హిందువుగా మీకు హిందుత్వాన్ని సమర్ధించే హక్కెంతుందో నాకు విమర్శించే హక్కు అంతే ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో నేను హిందువును కాకపోయినా ఆ హక్కు నాకుండేది.

కొందరు కేవలం తమ ద్వేషం,ఆభిజాత్యం చాటుకోవడానికి హిందూమతాన్ని గుత్తకు తీసుకుని నన్ను వ్యతిరేకించాలనుకుంటే అది వారిష్టం. కానీ నా వ్యక్తిత్వాన్ని,అస్తిత్వాన్నీ హేళనచేస్తే I will have a proper answer for them. This is part of that.

గీతాచార్య said...

మనకి నచ్చని భావజాలాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఖండించుకోవచ్చు. లేదా చురకలాగా అంటించుకోవచ్చు. కుల మతాల్ని ఎత్తిచూపుతూ అవహేళన చేయటం అనేది ఎప్పటికైనా తప్పే. అది అభిజాత్యానికి నిదర్శనం.

Whatever the others think, or say, don't give them a damn. If u believe in what u r doin' goahead.

"నా ఆలోచనల్ని ఖండించొచ్చు. నా భావజాలాన్ని ఏకిపారెయ్యొచ్చు. నా అభిప్రాయాల్ని తుత్తునీయలు చెయ్యొచ్చు. నా రాతల్ని కొట్టిపారెయ్యొచ్చు. అంతేతప్ప నన్ను "మొత్తంగా వ్యతిరేకించడనికి" ఏముంది?"

RighttO!

పునర్వసు said...

యథా రాజా తథా ప్రజా! పేరుకి సెక్యులర్ దేశం, కానీ దేవాదాయ శాఖలుండే ప్రభుత్వాలు. ఆదాయాలకు హిందూమతపు గుడులు కావాల్సి వచ్చిన ప్రభుత్వాలు, మక్కా యాత్రకు సబ్సిడీలు ఇస్తుంది. (జెరూసలేం యాత్రకు కూడా సబ్సీడీ ప్రతిపాదనలేమయినా ఉన్నాయేమో). చదువులకూ, ఉద్యోగాలకూ అవసరమయ్యే రిజర్వేషనులకు మూలమయిన కులవ్యవస్థ కావాలి, దానికి ఆదారమంటూ ఘోషిస్తున్న హిందూమతము మాత్రము చెడ్డది అని వాదించే ప్రజ. హిందూమతమును విమర్శించడానికి ఎవరయినా అర్హులే అనే అభిప్రాయము, ఆ అభిప్రాయాలను ప్రశ్నించే వారిని రాజ్యాంగ హక్కులను చూపించి బెదిరించే విజ్ఞత. బాగుందండీ వాదన. దీనిని విజ్ఞులయిన బ్లాగరులే గ్రహించ గలరు.

Sravya V said...

Mahesh, then what made to give reply to my first comment in that manner. Did I write anything nonsense, what is the necessity to react like that.

జీడిపప్పు said...

check this also ముసుగువీరుడి అసలు రూపం

sunanda said...

Mahesh,
All the best.U are doing right thing.