Monday, June 15, 2009

వేసవి రుచి

కాంపౌండ్ గోడ మీది వేడిగాలి ఎండమావిని తలపిస్తోంది. ఎండాకాలం మొదలైపోయింది.

ఈ వేసవి మధ్యాహ్నపు ఇబ్బందికరమైన నిశ్శబ్ధం. నిశ్శబ్దాన్నిభంగం చేస్తూ వేలితో కిటీకీ ఊచమీద నోటి వెంటొచ్చిన సన్నటి పాటకు అనుగుణంగా లయబద్దంగా ఒక చిన్న దరువు వేసాను. "తుమ్ ఆగయేహో నూర్ ఆగయాహై"అనే కిశోర్ కుమార్ పాత హిందీ పాట. నీకూ నాకూ అమితంగా నచ్చిన పాట.

కొన్నేళ్ళ క్రితం నీ కోసం ఈ పాట పాడినప్పుడు, ఇప్పుడున్న ఇనుపచువ్వల స్థానంలో నీ కాలి మువ్వలున్నాయి. ఆ మద్యాహ్నంలో కూడా ఇలాంటి నిశ్శబ్దమే. ముదురాకుపచ్చ చీర, మ్యాచింగ్ బ్లౌజుతో నువ్వు. చేతిని ఆసరా అడిగిన చుబుకం, మధురమైన నిద్రకొరిగినట్లుగా తల కొద్దిగా పక్కనపెట్టి, కళ్ళు మూసుకుని నా ఒడిలో నువ్వు. నీకు గుర్తుందా? ఆ మధ్యాహ్నం, నా గదిలో మనం. సీలింగ్ ఫ్యాన్ గాలికి నీ కురులు బుగ్గల్ని తడుముతుంటే, ఏదో నల్లమబ్బుల మాటునున్న నిజాన్ని తట్టిలేపుతున్న అనుభూతి. ఇంకా ఏదేదో!

పాటకు పరవశిస్తున్న నువ్వు, నా చెయ్యి నీ బ్లౌజు మీదున్న చెమట తడిని ముట్టుకున్నా కళ్ళు తెరవలేదు. నీ మెడనుంచీ చెమట మెల్లగా కుడి వక్షం వొంపు క్రిందకు నిదానంగా జారుతుంటే నేనందుకున్నాను. నువ్వుమాత్రం కళ్ళు మూసుకుని మెత్తగా నవ్వుకున్నావు. ఆ నీ చెమట బిందువు నా వేలికొసపై చిన్నగా, వెలుతురు సరిగా లేని గదిలో వెచ్చగా మెరిసింది. ఆ తడి వేలిని నా పెదాలు తాకాయి. ఆ క్షణంలో ఈ వేసవి రుచి నాకు అవగతమయ్యింది.

ఆ తరువాత...నా నుదుర్ని నీ ఒడి కాల్చినప్పుడుగానీ నేను కళ్ళు మూయలేదు. నా చేతులు నీ పాదాలు తాకిన తరువాత గానీ నువ్వు కళ్ళు తెరవలేదు.

ఆ కలయికే ఒక జీవితకాలం. ఆ అనుభవమే నా శాశ్వత ధ్యానం.

ఇప్పుడు నువ్వు లేవు. నేనున్నా నేను లేను. జ్ఞాపకం మాత్రం మిగిలే ఉంది. చీకటి గదిలో ఆ చెమటచుక్క ఇంకా మెరుస్తూనే ఉంది. వేసవి మధ్యాహ్నపు రుచి గుర్తొస్తూనే ఉంది.

*****

23 comments:

ప్రియ said...

very nice expression. ఎక్కడో తగిలినట్టుంది. చాలా బాగా రాశారు.

గీతాచార్య said...

కళ్ళ ముందు ఏదో కదలాడుతున్న ఫీలింగ్. మనస్సు ఎటో వెళ్ళి పోయినట్టు.

"ఇప్పుడు నువ్వు లేవు. నేనున్నా నేను లేను. జ్ఞాపకం మాత్రం మిగిలే ఉంది. చీకటి గదిలో ఆ చెమటచుక్క ఇంకా మెరుస్తూనే ఉంది. వేసవి మధ్యాహ్నపు రుచి గుర్తొస్తూనే ఉంది." Excellent expression. I won't forget it. It's stamped on my brain.

సుజాత వేల్పూరి said...

కవితా?కథా? స్కెచ్చా?

జ్ఞాపకపు తడా? పరిమళపు సడా?
ఏమిటిది?

ఇప్పుడున్న ఇనుపచువ్వల స్థానంలో నీ కాలి మువ్వలున్నాయి.ఇప్పుడు నువ్వు లేవు. నేనున్నా నేను లేను. జ్ఞాపకం మాత్రం మిగిలే ఉంది. చీకటి గదిలో ఆ చెమటచుక్క ఇంకా మెరుస్తూనే ఉంది. వేసవి మధ్యాహ్నపు రుచి గుర్తొస్తూనే ఉంది.

ఎప్పటెప్పటి జ్ఞాపకాలనూ తవ్వి తీసేలా ఉంది.
వేసవి ఉదయపు చల్లని పిల్ల తెమ్మెర ఒకటి తాకి వెళ్ళిన ఫీలింగ్!

లక్ష్మి said...

అద్భుతం!!!

దుప్పల రవికుమార్ said...

మీరిట్టా ఏది పడితే దానిమీద ఇంత అందంగా ఎలా రాసేస్తారు సార్?

Padmarpita said...

స్వేద బిందువు నుండి స్వాతి చినుకు రాలిన భావన!!!!

సృజన said...

ఆహా!!! ఎంత మధురమైన భావనండి.

Srujana Ramanujan said...

How beautiful ur sketch is!

Vinay Chakravarthi.Gogineni said...

annagaaru manaspoortiga okati chebutaanu emee anukokandi.........inta manchi bhavaalu pettukoni endukandi contoversary vaipu choostaaru eppudu.....meeru ilantivi raaste memu andaram happy ga chaduvutaam........

Ramani Rao said...

"ఇప్పుడు నువ్వు లేవు. నేనున్నా నేను లేను. జ్ఞాపకం మాత్రం మిగిలే ఉంది. చీకటి గదిలో ఆ చెమటచుక్క ఇంకా మెరుస్తూనే ఉంది. వేసవి మధ్యాహ్నపు రుచి గుర్తొస్తూనే ఉంది."

గ్రేట్.. ప్రేమ గురించి చాలా బాగా వ్యక్త పరుస్తున్నారు. మంచి భావుకత మీది.

భావన said...

వేసవి వడగాలి లోని సాంద్రతను గుర్తు చేసేరు...

మరువం ఉష said...

మీరు వ్యక్తీకరించిన అనుభూతికి అతి దగ్గరగావున్న నా అనుభవాల్లో నేను వ్రాసుకున్నవివి.


నేనొక వస్తువుని, పదార్దాన్ని అన్నావు. వస్తువుకి రూపు, రంగు మాత్రమే వుంటాయి. రుచి వుండదు, మరి నిన్న రేయి వరకు నన్ను వెంటాడిన ఆ రుచేంటబ్బా? అదీ తనువంతా అలముకొని మరీ... పోనీ పదార్ధం అందామంటే తమరేమో జడపదార్ధమాయే. నువ్వు పంచుతున్న ఈ అనుభూతులకి అది సరిపడదు. మరి ఎలా,ఏమని పిలవను నిన్ను?

ఈనాడు నా ఉల్లం ఝల్లుమంది, ఒడలు వొణికింది, తనువు తీపిగాట్లతో తెల్లారేవరకు తబ్బిబ్బైంది. చెమరింపుల్లో తృళ్ళిపడింది, అలవోక నవ్వుల్లో మునకలేసింది. నునుసిగ్గు వరదలో మునిగిపోయింది. విల్లో, వీణో ఆ రెండూ కాని మరేదో నా వంటి రూపిపుడు.

నిషిగంధ said...

చాలా బావుంది.. ఇంతకంటే వేరేగా చెప్పలేను :-)

Malakpet Rowdy said...

Enti saaru? Sarat ki competetionaa?

భావకుడన్ said...

భావుకత అదిరింది మాష్టారు.

Anil Dasari said...

మహేశా,

పరవళ్లు తొక్కే ప్రగతిశీలవాదం నుండి భావుకత ముసుగేసిన పలాయనవాదానికెప్పుడు మొదలయింది నీ ప్రయాణం?

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: భావుకత పలాయనమైతే "రసస్పందన" ఏవాదం? అయినా ఇది ఫక్తు వ్యక్తివాదం.అనుభవ సాహిత్యం.భావుకత కేవలం ఒక పనిముట్టుమాత్రమే. ప్రగతిశీలతకు భావుకత వ్యతిరేకం లేక ప్రతికూలం అని నేను అనుకోను. మైండ్ అన్డ్ హార్ట్ సమపాళ్ళలో ఉన్నవాడేగా మనిషి! అసలే I am a bundle of contradictions.

@గోగినేని వినయ్ చక్రవర్తి: నేనెప్పుడూ కాంట్రవర్సీవైపు చూడలేదు. నేను రాసింది కాంట్రవర్సీ అనుకునేవాళ్ళ వ్యాఖ్యలతో బహుశా మీకు ఆ భావన కలిగుండొచ్చు.నేను రాసినవీ రాస్తున్నవీ కొత్త ఆలోచనలూ కావు కొత్త ప్రతిపాదనలూ భావాలూ కావు. కాకపోతే అన్నింటిలోనూ నా సొంత అనుభూతుల్ని కలిపి రాస్తాను అంతే.

నేను అన్ని భావావేశాలూ కలగలిపిన మనిషిని. కాబట్టి అన్నిరకాల స్పందనలూ నాలో ఉంటాయి. అవే బ్లాగులో ప్రతిఫలిస్తాయి.

@మలక్పేట రౌడి: నేను శరత్‘కాలం’ కు ఎప్పుడూ పోటీ కానేరను. ఎందుకంటే తన దృష్టి నా దృష్టి వేరువేరు. వారు చర్యకు ప్రాధాన్యతనిస్తే నేను దానిలోని అనుభూతికి ప్రాముఖ్యతనిస్తాను. అందుకే నా కథల్లో చర్యలకు కేవలం ఒకటో రెండో వాక్యాలు మాత్రం కేటాయించబడతాయి.

సుజాత వేల్పూరి said...

మహేష్ కుమార్ గారు,

కనీసం మీ బ్లాగులోనైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అబ్రకదబ్ర గారి బ్లాగులో

Let me come up with a outrageous proposition.. ఇజాలూ, అభిప్రాయాలూ,ఆదర్శాలతో సంబంధం లేకుండా కేవలం “రసస్పందన” కలిగించే సాహిత్యం కేవలం బూతుసాహిత్యమే!


అని ఒక సంచలనాత్మక వ్యాఖ్య చేశారు. రస స్పందన అంటే మీరెలా నిర్వచిస్తారు? ఇజాలూ, ఆదర్శాలూ లేకపోయినా ఏ సాహిత్యంలో అయినా కనీసం అభిప్రాయ ప్రకటన ఉండకపోదు కదా!

రసస్పందనను మీరెలా అర్థం చేసుకుంటారో కొంచెం శ్రమనుకోకుండా వివరించి, నా confusion కొంచెం తగ్గించండి.

Kathi Mahesh Kumar said...

@సుజాత:అబ్రకదబ్రగారు బ్లాగులో ఇజాలూ,అభిప్రాయాలూ,ఆలోచనలూ చెప్పటానికి/తెలుసుకోవడానికీ కాకుండా రసస్పందన కోసం కథలు రాయడం/చదవడం చెయ్యలి అన్నట్టు చెబుతుంటే, ఒక చురక అంటించడానికి ఆ మాట అన్నాను.

మీరు నన్ను ప్రశ్నిస్తూ మార్కుల ప్రసక్తి తెచ్చేసరికీ నా ఉద్దేశం అర్థమయ్యి హాస్యమాడుతున్నారని సమాధానం చెప్పలేదు.

ఏ రచయితైనా తను చెబుతున్నది "ముఖ్యం" అనుకుంటేనే రాస్తాడు. అది చదివి ప్రేక్షకులు intended gratification పొందితే దాన్నే రసస్పందన అనొచ్చు. కాకపోతే అబ్రకదబ్రగారి వ్యాఖ్యానం ప్రకారం art should be for art sake. without any ideology, intention,opinion and writers believes.

అలా ఉండనఖ్ఖరలేదని. రచయిత ఉద్దేశాన్ని అందరు పాఠకులూ కాకపోయినా సమానమైన wavelength ఉన్న పాఠకులు intended gratification పొందొచ్చనేది నా ప్రతిపాదన. రచన ఉద్దేశం పాఠకుడి దగ్గర సఫలమైతే అదే రసస్పందన.

ఇజాలూ, అభిప్రాయాలూ,ఆదర్శాలతో సంబంధం లేకుండా అది జరగాలంటే కుదరదు. అలా కుదిరేది కేవలం బూతుసాహిత్యంలోనే. ఎందుకంటే దాని ఉద్దేశం titillation కాబట్టి ఆ ఆశయం చాలావరకు తీరే ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఉదహరణ ఒక ఎత్తిపొడుపుగా మాత్రమే ఉపయోగించాను. అందుకే outrageous proposition అని మొదలెట్టాను.

మరువం ఉష said...

అనుభూతికి అందని అసలు అందం,
అనుభవం ప్రోదిచేసుకున్న హృదయంది కాదా?

మీ మాటలు "నా సొంత అనుభూతుల్ని కలిపి రాస్తాను అంతే. నేను అన్ని భావావేశాలూ కలగలిపిన మనిషిని" సమర్ధిస్తూ [నేనూ మీ కోవలోకి చెందిన మనిషినే కనుక] పైన వ్రాసినవి నా స్వంత మాటలు. సున్నితమైన/ఆర్ధ్రతనిండిన భావ ప్రకటనకి, రస స్పందనకీ రెండిటికీ అటువంటి హృదయం కావాలి. తెలుగు తూలిక మాలతి గారు ఒకసారి చెప్పినట్లు "“మనం ఇచ్చే సామ్యాలు మనఅనుభవాల పరిధిలో వుంటాయని. వినేవారికి కూడా ఆ అనుభవం వుంటేనే అది అర్థం అవుతుంది.” http://tethulika.wordpress.com/2009/06/05/%E0%B0%8A%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8B%E0%B0%95-%E0%B0%B2%E0%B1%87%E0%B0%AE%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE%E0%B0%BE/

మాలా కుమార్ said...

.
ఎప్పుదు మీ బ్లొగ్ లో భారీ పొస్ట్ లు చూసాక ఇది చాలా కొత్తగా వుంది.
చాలా బాగుందండి.

Anil Dasari said...

>> "అబ్రకదబ్రగారు బ్లాగులో ఇజాలూ,అభిప్రాయాలూ,ఆలోచనలూ చెప్పటానికి/తెలుసుకోవడానికీ కాకుండా రసస్పందన కోసం కథలు రాయడం/చదవడం చెయ్యలి అన్నట్టు చెబుతుంటే"

నేనెప్పుడు చెప్పానలా? నా టపా మరోసారి చదవండి. నేనన్నది 'పైవాటి కోసం మాత్రమే కధలు రాస్తే ఎలా?' అని. కధా పరిధి పెరగాలని దాని భావం. ఆదర్శాలు వల్లించొద్దు, అభిప్రాయాలు వెల్లడించొద్దు అని నేననలేదు. 'మాత్రమే' అన్నది వదిలేసి మీరు నా మాటలకి పూర్తి వ్యతిరేకార్ధం తీస్తున్నారు.

>> "కాకపోతే అబ్రకదబ్రగారి వ్యాఖ్యానం ప్రకారం art should be for art sake. without any ideology, intention,opinion and writers believes"

This is a good example of taking things out of context and twisting them around. But I'm not amused by it, 'coz you are making an outrageous allegation!

'టెల్గూ స్టోరీ'లో నేను మొత్తుకుంది తెలుగు కధల్లో కరువైపోతున్న వస్తు వైవిధ్యం గురించి. అంత స్పష్టంగా రాస్తే, మీకది art for art sake అని నేనన్నట్లుగా అనిపించిందంటే నవ్వాలో ఏడవాలో అర్ధమవటం లేదు!!

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: మళ్ళీ మీ టపా చదివాను. నేను అపార్థమే చేసుకున్నాను.క్షమించండి.

మీరు చివర్లో suggest చేసిన మూల బిందువుకన్నా అదే సమయంలో జరిగిన "అయిదోగోడ" చర్చలు నా బుర్రని కమ్మేసి కలగాపులగం అయిపోయాయి.పరిధి పెంచుకోమని మీరు చెప్పినా ఉన్నపరిధిని కేవలం గర్హించి రసస్పందన లేదన్నారన్న ఆలోచనే ఉండిపోయింది.

మీ టపాకు నా వ్యాఖ్యను ఆపాదించకుండా ఇప్పుడు నేను చేసిన వ్యాఖ్యలో అర్థముందేమో చూడండి.