Tuesday, June 9, 2009

పదికోట్ల మందిలో పదివేల పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?

అమెరికా నుంచీ వెలువడే ఒక తెలుగు పత్రిక (తెలుగునాడి) మూతపడిందని కాశ్యప్ తన బ్లాగులో ‘అక్షరం తలదించుకుంది’ అని శీర్షికపెట్టి బ్రహ్మానందం గారు రాసిన ఒక హృద్యమైన వ్యాసాన్ని ప్రచురించారు. బ్రహ్మానందం గారు ఆ పత్రిక గుణగణాల్ని వివరించి, కొన్ని కన్నీళ్ళు కార్చి, ఆ చచ్చిన పత్రికని బ్రతికించడాని ఎవరైనా ఆక్సిజన్ ఇస్తే తనవంతు సిలిండర్ సహాయం చేస్తానని ఆ వ్యాసంలో ప్రతిజ్ఞ చేశారు.

ఆ వ్యాసం చదివి నాకూ బాధకలిగింది. ముఖ్యంగా "అమెరికా నుండి వెలువడే రీడర్స్ డైజస్ట్ నమూనాలో ఆంధ్రదేశంలో వచ్చే వివిధ పత్రికల్లో వచ్చిన మంచి వ్యాసాలూ, కథలూ ఏర్చి కూర్చి వేయడమూ, తెలుగు డయాస్పోరా కథలూ, వ్యాసాలూ ప్రచురించడమూ ఈ తెలుగునాడి చేస్తోంది. అన్ని వర్గాల పాఠకుల్నీ అలరిస్తూ పాత కొత్త సాహిత్యాల్ని పరిచయం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా వ్యాసాలు చక్కగా ఉంటాయి. సినిమా సమీక్షలు బావుంటాయి. బాల సాహిత్యమంటూ రెండు మూడు పేజీలుంటాయి. అన్నిటికన్నా ముఖ్యం పత్రికకి వాడే పేపరు అత్యంత నాణ్యమైనది. ఇలా ఎంతో వైవిధ్యంగా ఒక తెలుగు పత్రిక ప్రచురింపబడ్డం చూసి ప్రతీ తెలుగువాడూ గర్వ పడాలి." అంటూ వర్ణించిన ఆ పత్రిక గుణగణాల్ని చదివి మరీ బాధపడ్డాను. ఒక్క డయాస్పొరా కథల్ని మినహాయిస్తే సాక్షి దినపత్రిక ‘ఫ్యామిలీ’ సెక్షన్లో నాకు ఈ పత్రికలోని గుణగణాలన్నీ ప్రతిరోజూ కనిపించడమే నా బలవంతమైన బాధకు కారణం.

చాలా నికృష్టమైన పోలికలాగా, నా టేస్ట్ పరమ చీప్ గా కనిపిస్తే నేనేమీ చెయ్యలేను. నామట్టుకునాకు ఆ గుణగణాల వర్ణన అచ్చుగుద్దినట్లు చౌకబారు ‘స్వాతి’తో సహా అన్ని పత్రికలకూ వర్తింపజెయ్యొచ్చేమోనన్న హడలుపుట్టింది. ఏడాదికి 24 డాలర్లు వెచ్చించి ఈ పత్రిక కొనడానికి కనీసం పదివేల మంది పాఠకులు లేక పత్రిక మూతపడాల్సివచ్చిందనేది ఒక సత్యం. అంటే పదికోట్లున్న తెలుగు జనాల్లో పత్రిక చదవడానికి నెలకు వందరూపాయలు ఖర్చుపెట్టే (సాహితీ) పోషకులు ఎవరూ లేరన్నమాట. చాలా విచారించదగ్గ విషయమే. కాకపోతే, "ఉటంకించిన గుణగణాలన్నీ అత్తెసరు ఆర్రూపాయల పత్రికల్లో దొరుకుతున్నప్పుడు, వందెందుకు పెట్టాలి?" అనేది నాలాంటి తలతిక్క పాఠకుడి ప్రశ్న.

నేను ఈ పత్రిక జీవితంలో ఒకసారికూడా చూడలేదు. చదవలేదు. కాబట్టి దాని గొప్పతనం నాకు తెలీదు. కానీ వింటుంటే మాత్రం ఏమీ గొప్పగా అనిపించడం లేదు. ఒక ముఖ్యమైన ప్రశ్నమాత్రం ఉదయిస్తోంది.....

పదికోట్ల మంది తెలుగోళ్ళలో పదివేల మంది పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?


****

22 comments:

rākeśvara said...

నేను అమెరికాలో వున్నప్పుడు, ఈ పత్రిక చదవడమైనది. బాగుంటుంది పత్రిక.


... ఎవరి తప్పు ...
అందులో బుల్లి నిక్కరు వేసుకుని వున్న ఇలియానా బొమ్మ ఎప్పటికప్పుడు అచ్చు వేయని సంపాదకులదే ముమ్మాటికీ..
ఇప్పటికైనా సెక్సీ తెలుగు నారి అనే పత్రిక మొదలు పెట్టండి.

Anonymous said...

నెనింత వరకు చదవలెదా పత్రిక..( నెనేమి పెద్ద ఎక్స్ పర్ట్ కాదు తెలుగు పత్రికలు చదవడం లొ)... నాకు తెల్సి బాగ ప్రాచుర్యం పొందకపొవడమె కారణం అయి ఉంటుంది..

Vinay Chakravarthi.Gogineni said...

asalu chadava kunda critisize cheyadam em baaledu............

Kathi Mahesh Kumar said...

@వినయ్ చక్రవర్తి: నేను క్రిటిసైజ్ చేసినట్లు అనిపించిందా! చాలా సిన్సియర్ గా బాధపడుతున్నానండీ బాబూ.

@రాకేశ్: ఆలోచించాల్సిన విషయమే సుమీ!

@నెలబాలుడు:ప్రాచుర్యం ఎలా లభిస్తుంది? ఎలా లాభిస్తుంది?

cbrao said...

నేను ఈ పత్రికకు చందాదారుడిని. తెలుగునాడి ఎంతో వైవిధ్యమున్న తెలుగు పత్రిక. అమెరికాలోని పాఠకులకు, తెలుగు పత్రికల ఎంపిక చేసిన ఉత్తమ రచనలను అందించే ఏకైక తెలుగు పత్రిక. దాన్ని కోల్పోవటం దురదృష్టకరం.

Anonymous said...

@ వినయ్..
హ్మ్... నేనేమి చ్రితిసై చెయట్లేదు.. ప్రాచుర్యం పొందకపొవడం ఒక కారణం అని నా అభిప్రాయం..
@ మహేష్ గారు..
చదవాలి.. చదవాలి... చదవాలి... అనేది లభించాడనికి / లాభించాడనికి .. అనేది నా ఫీలింగ్..

జ్యోతి said...

నిజంగా ఆ పత్రిక చాలా బావుంటుంది. విషయ పరంగాను, పత్రిక నాణ్యత పరంగానూ. చెత్త పుస్తకాలు ఎంత ధరైనా పెట్టి కొంటారు :(
తెలుగునాడి మూతపడడం విషాదకరం. ఎవరైనా టేకప్ చేస్తే బావుంటుంది. ఇప్పుడే ఏవరూ కొనలేదు.తర్వాత ఎవరు కొంటారంటారా???

జీడిపప్పు said...

మహేష్ గారూ, ఆ పత్రిక అమెరికాలో వెలువడేది కాబట్టి మీ వ్యాసం టైటిల్ "రెండు/కొన్ని లక్షల మందిలో పదివేల పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?" అని పెట్టిఉంటే బాగుండేది. ఇక అసలు విషయానికొస్తే - కర్ణుడి చావుకు కోటికారణాలన్నట్టే ఇదీను. మిలిగినవారి గురించి ఏమో కానీ నా గురించి తీసుకుందాము: ఇన్నేళ్ళుగా అమెరికాలో ఉన్నా దాదాపు ఎన్నడూ ఈ పత్రిక గురించి వినలేదు. తెలిసిన తర్వాత ఆ పత్రిక వెబ్‌సైట్ చూసాను. వెబ్‌సైటు పరమ చీప్‌గా అనిపించింది. No offense. take a look! ఇక content చూస్తే "ఓస్ ఇంతేనా, ఇలాంటివి నెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అంతమాత్రానికి ఈ పత్రికెందుకు చదవాలి" అనిపించింది, అనుదినం తప్పక తెలుగు చదివే నాకే!! ఈ పత్రిక కూడా "కౌముది" లాంటిదయితే తప్పక కొనేవాడిని.

మాగంటి వంశీ మోహన్ said...

తప్పు ఎవరిదన్న ప్రశ్న భ్రమణాన్ని అడిగితే చెబుతుంది...

ఏ భ్రమణం ? "మతా" , "కాలమా" ? అంటే..ఇంతే సంగతులు చిత్త....

తప్పు ముమ్మాటికీ "తప్పు"దే...పాఠకులు ఉన్నారు, ఉంటారు...ఉన్నారు - మరి ఎందుకు మూతపడింది ? ఆ పత్రిక బావిలో కొన్నే కప్పలు ఉండటం మూలానా, ఆ కొన్ని కప్పలు ఆ పత్రికే ప్రపంచం అనుకోటం మూలానా, సంపాదకులు తెలివి లేక "వ్యభిచారం" మీద, "బ్రాహ్మణ ద్వేషం" మీద, "దళిత భజన" మీద, "కులం" మీద, "మతం" మీద హఠం వేసుకుని కూర్చున్న ఆర్టికల్స్ ప్రచురించకపోవటం మూలానా, ఆ పైన "అంగలుంగీ ప్రదర్శన" లేకపోవటం మూలానా, ఆ పత్రికలో పని చేసే వారు కారణ జన్ములు కాకపోవటం మూలానా, ఉన్న కప్పలకి ఒళ్ళు కొవ్వెక్కి ఈ పత్రిక గురించి ఇతరులకి చెప్పకుండానూ, ఇతరులని బావిలోకి అనుమతించకపోవటం మూలానా, ఒక వేళ బావురు కప్ప చెప్పినా, ఆ బావురు గాడు ఎప్పుడూ ఇంతేలే, ఆ పత్రిక కొనేదేమిటి అనుకున్న జమాలకిడి థగిడీలూ ఉండటం మూలానా ......ఇత్యాది ఇత్యాది ఇత్యాది.......

ఏదేమయినా జంపాల గారి సంపాదకత్వంలో వచ్చే ఆ మంచి పత్రిక ఇక చరిత్రే అన్న మాట తలుచుకుంటే కొద్దిగా బాధగా ఉన్నా, ఈ పాఠం మన తర్వాతి తరాలకి మరో గుణపాఠం కాకుండా ఉంటే అదే పదివేలు....

అసలు ఏమిటి చెప్పదలచుకున్నావో అర్ధం కాలా?

తెలియనివాడికి చెప్పినా తెలియదు అని పింగళివారు అనలా?

మేధ said...

నేను ఆ పత్రిక చదవలేదు.. అప్పుడప్పుడూ, అక్కడక్కడా బావుంటుంది అని వినడం తప్ప..
ఇక తప్పెవరిదంటారా.. ఇంగ్లీషు పుస్తకాలకి మూడు వందలైనా పెట్టి కొనేవాళ్ళు తెలుగు పుస్తకానికి వందంటే హమ్మో, అంతేముందిందులో! అంటారు.. పేపర్ తీసుకునే విషయంలోనే, రూపాయి పెట్టి ఇంగ్లీష్ పేపర్ కొని, దాన్ని కేజీ ఆరేడు రూపాయలకి అమ్మేంత గొప్పవాళ్ళు మనవాళ్ళు!!!

అశోక్ చౌదరి said...

నాకు తెలిసి మార్కెటింగ్ సరిగా లేకపోవటం కారణం అయి వుంటుంది.. నేను ఒక సారి ఈ పుస్తకం చదివాను.. బాగానే వుంటుంది..

ఆ పత్రిక ఆగి పోవటానికి ముఖ్య కారణం మార్కెటింగ్ సరిగా లేకపోవటం అనుకుంటున్నా.. 2 సంవసరాల నుంచి నేను చికాగో దగ్గరలో వుంటున్న.. మొనీమధ్య అరోరా టెంపుల్ కి వేల్లెంతవరకు ఈ పుస్తకం ఒకటి వుందని తెలియదు.. అరోరా టెంపుల్ లో తెలుగు నాడి పాత సంచికలు ఫ్రీ గ ఇస్తున్నారు..
హీరోయిన్స్ అర్ధ నగ్నంగా వున్నపుస్తకాలే నిలదోక్కుకుంటాయి అనుకోవటం మూర్ఖత్వం.. అల అయితే ప్రతి ఒక్క బూతు పత్రిక too much పాపులర్ అయి వుండేది..

కర్ణుడి చావూ కి వంద కారణాలు... ప్రతి ఒక్క విషయానికి పాఠకుల దే తప్పు అనకండి...

శరత్ కాలమ్ said...

గత ఏడాది చికాగో జరిగిన ఒక సాహిత్య సమావేశంలో జంపాల గారు పరిచయం అయ్యారు. అప్పుడు చంద్రలతగారు చెప్పారు తెలుగునాడి పత్రిక వారిదేనని. ఒక పుష్కర కాలం నుండి యు ఎస్, కెనడాలలో వుంటున్నాను కానీ ఆ పత్రిక గురించి ఎప్పుడూ వినలేదు!

Anil Dasari said...

దశాబ్దంలో ఈ పత్రిక పేరెప్పుడూ వినలేదు. తప్పు పాఠకుల మీదకి నెట్టటం తేలికే. దాంతో సమస్య పరిష్కారమవదు కదా. 'మహమ్మదు దగ్గరికి కొండ .... ' గుర్తు చేసుకుని, ఏం చేస్తే పాఠకుల దృష్టిలో పడతామో పత్రిక నిర్వాహకులే ఆలోచించాలి. అమ్మటం అమ్మేవాడి బాధ్యత - కొనేవాడిది కాదు. అలాగని అర్ధనగ్న చిత్రాలుంటేనే కొంటారనే అపోహ ఉండకూడదు.

Sujata M said...

It is unfortunate that a publication closes down. Be it any publication. It may be due to recession / as other bloggers said - due to lack of publicity.

I wish this publication come back into the market like Chandamama and it will definitely win back its market if properly marketed.

Kathi Mahesh Kumar said...

@మాగంటి వంశి: మీ ఎత్తిపొడుపు అర్థమవుతోంది. కాకపోతే మీరు గర్హించిన చాలా విషయాలూ సామాజిక వాస్తవాలు. వాటికి స్థానం లేని పత్రిక కేవలం కొందరు "పవిత్ర పాపులకే" పరిమితం అవక తప్పదు. ఈ కారణజన్ములు కూడా ఇల్లెక్కి తెలుగు కావాలని అరుస్తారుగానీ తెలుగు కోసం పైసా విదల్చరు. బోరుబావుల కాలంలో ఇంకా బావిలోనే ఉంటామంటే ఎండిచావక తప్పదు.

@జీడిపప్పు: పత్రిక బాగుంటే అమెరికా నుంచీ తెప్పించుకుని మరీ చదవరూ! LIFE మ్యాగజైన్ భారతదేశంలో ప్రచురించక పూర్వం ప్రపంచంలోని సర్క్యులేషన్లో సగం మనదేనండోయ్.

@జ్యోతి: నిజంగా బాగుంటుందన్న మాట! మరి మూతెందుకుపడిందంటారూ?

@మేధ: తెలుగు పుస్తకాల ధరలు Vs విలువ గురించి నేణూ రాసిన వ్యాసం చూడండి. ఈ విషయం గురించి ఈ వైరుధ్యం గురించి కొంత చర్చ జరిగింది.
http://parnashaala.blogspot.com/2009/05/vs.html

@అశోక్:ఆలోచించాల్సిన విషయమే.

@శరత్ &అబ్రకదబ్ర: మీకూ తెలియ లేదంటే మొత్తానికి మార్కెటింగ్ వైఫల్యమేమో అనిపిస్తోంది.

@sujata:We can only hope for that. కానీ పైన మాగంటి గారి వ్యాఖ్య చూశాక ఈ పత్రికకు అంత సీన్ లేదేమో అనిపిచింది నాకు.

cbrao said...

తెలుగునాడి అమెరికాలోని పాఠకులకు మాత్రమే చందాకు లభ్యమయ్యేది. ఇతర దేశాల వారికి దీనిని పంపరు.

Anonymous said...

AFAIK nobody knows much about nadi. beyond the yahhoo newsgroup raccabanda and a few other contacts that are kept privat purposefully or otherwise, the marketing department of that magazine did nothing to publicize its existence. i subscribed for 2 years first and discontinued due to personal problems.

When they distributed it in temples people thought it was free. And most of the telugus in USA do not read telugu. I can find a dozen other causes but the main reason is that telugus do not buy magazines.

The privaate group that rubs shoulders with jampala garu on raccabanda or otherwise kepts its distance when it cames to keep the magazine alive. This is my 4 cents personal opininon.

Anonymous said...

అమెరికాలో తెలుగు పత్రిక వెలువడటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది, ఎందుకంటే నేను మనవాళ్లు మన దేశం వదలి వెళ్లాక మన భాష, మన సాహిత్యం పట్ల అంత శ్రధ్ద వహించరని భావించాను. 'తెలుగునాడి' ప్రత్రిక మనుగడ కోసం నాదొక చిన్న సలహ "అమెరికా లోని పలు తెలుగు సమాఖ్యల సభ్యులందరకి ఈ పత్రిక యొక్క విశిష్టత తెలిపి, వారందరు చందాదారులుగా చేరుటకు కృషి చేయడం."

Anonymous said...

i was a subscriber once to Telugu naadi. I enjoyed it thorughly even though some of the articles are reproductions from andhrajyothy etc.
quality, content and compilation was excellent. you don't want to miss any page.
They are very poor at marketing. From the above posts it is clearly evident, even people living in the Chicago area did not know about it.
They did not try to promote it at Telugu association get togethers or did not take the advantage of emails etc.
a simple example to their marketing skills: I renewed my subscription online for three years in April, I am sure by that time they were planning to close it, then why should they accept the subscription to a magazine being closed in one month. Now they want to return the money.
how does it sound ?
It is sad and we miss it

మరువం ఉష said...

నేను ఈ పత్రికకి గత 5 సంవత్సరాలుగా మొదటి సంచిక నుండి ఇప్పటి వరకు, ఇంకా చందా మిగిలేవున్నదారుని. చక్కని పత్రిక. నెట్లో ఎన్ని వున్నా, రాత్రిపూట అలా పక్కమీదకి వాలో, వీక్ ఎండ్ మధ్యాహ్నాలో హాయిగా వొరిగి చదువుకునేదాన్ని. కారణాలు ఇవని చెప్పలేను. తెలిసిన ఒకరిద్దరికి నేనే కట్టి వారిలో చదవాలన్న ఆసక్తి పెంచాలని చూసాను. ఎన్నో రకాల ఖర్చులు చేసేవారంతా $24 దగ్గరకొచ్చేసరికి, ఒకసారి మీ దగ్గరవి పంపండి చదివి చూస్తాము అన్నారే కాని కొనలేదు. ప్చ్...

Vinay Chakravarthi.Gogineni said...

pina evaro annaru 300 ayina petti english books kontam but manam 100 telugu books kontam........ani...

common ga manaki vishayam emundo book lo teleedu kaabatti first manam pages /rupee choostam idi telugu books lo chaala takkuva ga vuntundi..........anduke alochistam(naavaraku)

రమణ said...

ఏడాది క్రితం ఒక మిత్రుడు gift subscrition చేయగా ప్రతినెల ఈ పత్రిక నాకు వచ్చేది. ప్రింటింగ్, క్వాలిటీ వుంది కానీ కొత్త content ఎప్పుడు చూడలేదు. మిగతా పత్రికలనుంచి పునర్మద్రించినందుకు రచయితలకి మళ్ళీ రాయల్టీ యిచ్చేవారో లేక ఎడిటర్ పర్మిషన్ వుంది కనక ఆ అవసరం లేదో. 'అక్షరం తలదించడం' ఏమో కానీ కొన్ని చెట్లు బలికాకుండా మిగిలాయి.