Tuesday, June 16, 2009

కవిత్వమొక శుద్ధ దండగ !

కవిత్వమొక శుద్ధ దండగన్నారో పెద్దమనిషి. కవిత్వం సాహిత్యాన్ని చంపేస్తోందన్నారు మరో సాహితీప్రేమికుడు. నిజమే కాబోలు. కవిత్వం వల్ల, మరీ ముఖ్యంగా భావకవిత్వం వల్ల నిర్ధిష్టమైన "సామాజిక ప్రయోజనం" లేకపోవడం చేత, చాలా మంది ఛెస్టు మీది స్టీము వదిలించుకోవడానికి భావకవిత్వమనే దగ్గర దారిని ఎంచుకోవడం మూలంగా పుంఖాలు పుంఖాలుగా కవిత్వం వెల్లివిరిసిపోతోంది. అంతేకాక భావకవిత్వంలోని విస్తృతిని విస్మరించి దాన్నొక ప్రేమకవిత్వంలోకి కుదించేసి "రైఠో!" అనేస్తున్నారు. బుక్ షాపుల్లో, వెబ్ పేజిల్లో, బ్లాగుల్లో, పత్రికల్లో కవితలే కవితలు. అంతులేని కవితలు. అంతమవని కవితలు. అడ్డూఅదుపూ లేని కవితలు. అదరగొట్టే కవితలు. బెదరగొట్టే కవితలు. అరగదీసే కవితలు. ఇరగదీసే కవితలు. అప్పుడప్పుడూ అరుదైన కవితలు.

ప్రేయసి జ్ఞాపపికలు, విరహాగ్ని కీలకలూ, ప్రేమైక గీతికలూ అలవోకగా ప్రతొక్కరూ పదాల తోరణాలు కట్టి కవిత్వం పేరుతో అక్షరాల్లోకి కుదించెయ్యగలరు. ఇందులో చర్చించడానికీ, విభేధించడానికీ,మేధోమధనం చెయ్యడానికీ ఏమీ ఉండదు. చదివి బాగుందనుకోవడానికో లేక నాకూ ఇలాంటిదొక అనుభవం ఉందనుకోవడానికో లేక నేనూ ఒకటి రాసెయ్యగలను అని ధీమా తెచ్చుకోవడానికోతప్ప కవిత్వంలో ప్రయోజనం, ప్రయోజకత్వం అంతగా కనిపించదు. కాకపోతే ఈ "ధీమా" మాత్రం ప్రతొక్కరినీ కవిని చేసెయ్యగలదు. అదే ఒక గొప్ప ప్రయోజనమంటే మాత్రం చచ్చినట్లు అంగీకరించాల్సిందే. ఎంతైనా భాషా యొక్క వ్యాప్తికి ఈ కవితా ధోరణి దోహదం చేసినట్లే కదా!

"కవిత్వాన్ని నిర్వచించరా!" ఒక ఇంగ్లీషొడ్ని అడిగితే...."The poem is a physical artifact consisting of marks on paper, or the grooves on a Babylonian tablet.
The poem is the sequence of sounds uttered by a speaker, reading aloud.
The poem is the experience of the reader.
The poem is an expression of the experience of the author.
The poem is a stratified complex of values, which cannot be reduced to any of the previous four theories. అన్నాడట. "చచ్చింది గొర్రె" అన్నట్లు. ఇదే సమస్య మనకూ ఉంది. కవిత ఒక వాక్యంలో ఉండాలా, హైకుల్లా మరుగుజ్జైపోవాలా, లేక చాంతాడంత కావ్యాలైపోవాలా అనేది ఎవరూ నిర్ణయించి చచ్చే విషయం కాదు. కాబట్టి రాసిందే కవిత. అందుకే మనకీ ఖర్మతప్పదు.

దండగన్న పెద్ద మనిషి బాధ ‘కవితల్లో ఊహావర్ణనలేతప్ప నిజానికి స్థానం ఉండటం లేదని’. నిజమే! నిజానికి స్థానం ఇవ్వాలంటే నేలవిడిచి సాము చెయ్యడం మానాలి. కానీ కవితాలోకంలో విహరించడం తప్ప జీవించడం ఉండదే! అప్పుడేలా? భావకవిత్వాన్ని పక్కనబెట్టి విషయకవిత్వమూ, అభిప్రాయ కవిత్వమూ, యిజాలకవిత్వమూ మొదలెట్టేస్తే ఆ నిజాలకు స్థానం దక్కి ప్రయోజనం సిద్ధించేస్తుందా అనేది జవాబులేని ప్రశ్న.

కవిత్వం వలన సాహిత్యానికి హాని జరుగుతోందన్న సాహితీప్రేమికుడు వ్యధ చాలా అర్థవంతంగా ఉంది. బండ్లకొద్దీ వస్తున్న కవిత్వం రీములకొద్దీ పేపర్ ను ఖర్చుపెట్టించి అలవికాని ప్రదేశాన్నంతా ఆక్రమించేసి మిగతా సాహిత్యానికి ‘నిలువనీడ’ లేకుండా చెస్తోంది అనేది ఈ వాదన. తప్పదు అంగీకరించాల్సిందే. మరీ ముఖ్యంగా "ఇదే సాహిత్యం" అనుకొని ఒకసారి కవిత్వాన్ని ముట్టుకుని భయపడిపోయిన కుర్రకుంకల్ని చాలా మందిని నేనెరుగుదును. "ఐతే పద్యాలంటారు. లేకపొతే కవిత్వాలంటారు. ఎందుకు మాకీ తంటా" అని ప్రశ్నించిన మా బంధువులబ్బాయి నాకళ్ళముందింకా మెదులుతూనే ఉన్నాడు. "ఈ సాహిత్యానికొక దండం స్వామీ! ఇంతకన్నా యండమూరి నవలలు, పర్సనాలిటీ డెవలెప్మెంట్ పుస్తకాలు బెస్టు" అన్న విద్యార్ధుల్నీ ఎరుగుదును. "యండమూరిదీ సాహిత్యమేరా భడవా" అంటే "అలా అంటే మీరొప్పుకోరుగా" అని చురక అంటించాడు మరొకడు.

కనీసం కథాసాహిత్యం, నవలా సాహిత్యం ప్రొఫెషనల్ రచయితల పుణ్యమా అని జనాల్లో మిగిలుంటే దానిక్కూడా గండిగొట్టేపని కవితాసాహిత్యం చేస్తోంది అనేది మరొక వాదన. క్లాసుల్లో పద్యాల హోరుతో భయపడి పుస్తకప్రపంచంలో కవితల్తో హడలెక్కి తెలుగు పుస్తకం ముట్టుకుంటే ఝడిసిపోయే ఘటాల్ని మనం తయారుచేస్తున్నామేమో ఈ కవితా ప్రవాహం వల్ల అనేది ఒక అనుమానం.

వ్యక్తిగతంగా నేను బ్లాగుల్లోకొచ్చేంతవరకూ కవితల్ని చదివిన పాపాన పోలేదు. ఏదో శ్రీశ్రీ ఆవేశాలూ, కృష్ణశాస్త్రి భావాలూ గాల్లో ఎగురుతూ అప్పుడప్పుడూ తాకినవేగాని ప్రత్యేకించి అందులో నేను చేసిన సాధన అస్సలు లేదు. చదవంగా చదవంగా కొంత ఆనందాన్ని మరింత ఆశ్చర్యాన్నీ కొన్ని కవితలు ఖచ్చితంగా ఇచ్చాయని చెప్పొచ్చు. "మరి ఆనందానికీ, ఆశ్చర్యానికీ సామాజిక ప్రయోజనం ఉందా?" అంటే మాత్రం నేను నోరుమూసుకోక తప్పదు. అలౌకిక అనుభూతుల గురించి నాకు తెలీదుగానీ మనుషుల్లోని కాంప్లెక్సిటీని అప్పుడప్పుడూ భాష అభివ్యక్తీకరించలేకపోతే వాటిని కవితల రూపంలో ప్రయత్నించొచ్చేమో అనే ఆశమాత్రం కలుగుతుంది నాకు.

స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ పరవశించి నృత్యం చేసిన తరువాత కళ్ళలో నీళ్ళు నింపుకుని ‘కళలో ఇంత ఆనందం ఉంటుందని ఇప్పటి వరకూ నాకు తెలీదు" అంటుంది. అప్పటిదాకా భౌతిక ‘ఆశ’ల కోసం కళను చిన్నచూపు చూసిన ఆ పాత్ర "రసస్పందన" పొందడంలో పారలౌకిక ఆనందాన్ని అనుభవిస్తుంది. అది పేట్రనైజింగ్ గా అనిపించినా అప్పుడప్పుడూ సాహిత్యానికున్న పరమావధి కూడా అదేకదా అనిపించక మానదు. తిండీగుడ్డా సమస్యలుగా ఉన్న మనుషులకు సాహిత్యంతోగానీ మరే ఇతర కళలతోగానీ ముఖ్యంగా కవిత్వంతో అస్సలు అవసరం లేదు. బౌతికావసరాలు మీరి మానసిక అవసరాలలోకూడా ఒక స్థాయిని దాటిన మనుషులకు మాత్రమే ఇవి కావాలి.

కాబట్టి ప్రయోజనమే కొంత మందికున్న సాహిత్యాన్ని గురించి కవిత్వాన్ని గురించీ పేజీలు పేజీలి బాధపడటమే అనవసరం అనిపిస్తోంది. ఏమిటో ఈ పిచ్చి.


*****

22 comments:

శ్రీనివాస్ పప్పు said...

"రసస్పందన".
నిజమే ఇది లేకపోతే కవిత్వమూ,సాహిత్యమే కాదు జీవితం కూడా నిర్వీర్యంగానే ఉంటుంది.నిరర్ధకమయిపోతుంది.
రసహృదయంలేనివాడికి నా కవిత్వాన్ని వినిపించేంత దౌర్భాగ్యానికి నోచుకోలేదని కాళిదాసన్నట్టు..

ఇకపోతే తిండి గుడ్డా లేని వాడి సంగతి ఒక్క క్షణం పక్కనపెడితే,కడుపునిండిన వాడికి ఆ తర్వాత కావాల్సిన వాటిలో ప్రధమంగా కాకపోయినా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రూపంలో ఇలాంటి(సాహిత్యం,కవిత్వం,సంగీతం,)వాటి అవసరం ఉంటూనే ఉంటుంది కాబట్టి వీటి ప్రాముఖ్యత ప్రశ్నించాల్సిన అగత్యమే లేదు..

అబ్రకదబ్ర said...

గత టపాలో నేనడిగిన ప్రశ్నకి ఇది కొనసాగింపు సమాధానం అని అర్ధమవుతుంది. అది కాకపోయినా, కనీసం నా ప్రశ్న దీనికి ప్రేరణ అయ్యుండాలి.

నా ప్రశ్నకీ కవిత్వం గురించిన మీ ఈ వివరణకీ లంకె లేకపోతే సరే. ఉంటే మాత్రం, నా ప్రశ్న మీరు అర్ధం చేసుకోలేదని చెప్పాలి.

నేనడిగింది మీ పరస్పర భిన్నమైన వ్యక్తీకరణల గురించి. 'There's no such thing as love. That's why God created poetry' అనేది భావుకతతో నిండిన ప్రణయ కవిత్వానికి వర్తించే నానుడి. ప్రపంచం ఎలా ఉంటే బావుంటుందో దానికోసం పలవరించటం భావుకత. నిజం గురించి మర్చిపోయి ఊహల్లో మునగటం భావుకత. సమస్యలకి పరిష్కారం కాదిది. అందుకే అది ఆశావాదం కాదు, కేవలం పలాయన వాదం.

అంతమాత్రాన భావుకతకి, భావుకులకి నేను వ్యతిరేకిని కాను. కవులపై, కవిత్వంపై నాకు చిన్నచూపూ లేదు. రకరకాల సమస్యలపై ఆవేశంగా స్పందించే మీ కలం అప్పుడప్పుడూ ఇలా పూర్తి వ్యతిరేక పంధాలో సాగటం నాకాశ్చర్యకరం! అదే నేనా ప్రశ్నడిగిన కారణం. మీరు దానికి 'I am a man of contradictions' అన్నారు. నాకు మాత్రం Man of confusions లా అనిపించింది. అదీ సంగతి :-)

gaddeswarup said...

If one expects social change through poetry probably as Auden said "Poetry makes nothing happen, it survives". But it moves us and sometines shows us our place since not all of us have the gift. Here is a story:
ఆరుద్రగారిని గురించి ఈమధ్యే ఒక కథ విన్నాను.
ఒకరొజు ఆయన విజయవాడలో రిక్షాలో వెళ్ళుతున్నారట.
ఇంతలో ఆయనరాసిన సినిమా పాట ఒకటి బయట రేడియో లొనుంచి వినపడినందట. కాసేపయినతర్వాత రిక్షా అబ్బాయి తొడగొట్టుకుంటూ 'ల..కొడుకు' ఏమిరాశాడయ్యా అన్నాడట. అంతకంటే తనకు జన్మలో గొప్ప compliment ఏమీ రాలేదని ఆరుద్రగారు చెప్పారట.

సుజాత said...

అబ్రకదబ్ర గారు గత టపాలో అడిగిన ప్రశ్నతో సంబంధం లేకుండా చదివితే మీ టపాలో చాలా నిజాలు కనపడ్డాయి నాకు!

ఒక ఐరనీ కనిపిస్తోంది ఈ వ్యాసంలో!

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర: క్రితం టపాలోని మీ వ్యాఖ్యకూ ఈ టపాకూ సంబంధం లేదు. ఈ చర్చ నేను గత కొద్దిరోజులుగా కొందరు మిత్రుల సమక్షంలో చేస్తున్నదే.

@సుజాత: వ్యాసంలో ఐరనీ ఖచ్చితంగా ఉంది.నా మిత్రులు చెప్పినవాటిల్లోనూ నిజముంది. నేను అనువించినవాటిల్లోనూ నిజముంది. కాబట్టి ఎటూ నిర్ణయించని ఐరనీ ఈ వ్యాసంలో మిగిలింది.

ఉష said...

వాస్తవం అన్న దేనిలోనైనా ఐరనీ వుండే తీరుతుంది. కవిత్వం వ్రాయటం, ఆస్వాదించటంలోని అలౌకికానందాన్ని చవి చూసాను కనుక అందులోని విలువని తెలియజెప్పాలనే ప్రయత్నిస్తాను. ప్రతిదానికీ ప్ర యోజనమే వుండాలా అని ప్రశ్నిస్తాను. అసలింత చర్చ అవసరమా అనే నిలదీస్తాను.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

కవిత్వం దండగ కాదు, అది పండగ... ఇలా ప్రతీ దాన్ని అటకెక్కిస్తే చివరకు ఏమీ మిగలదు. వెనకటికి వాడెవడో జిడ్డుగా ఉందని బండి చక్రాలకు ఆయిల్ పోయలేదట. దెబ్బకు ముందుకు కదలనని మొరాయించింది.
ఊహాలోక విహారం చెయ్యలేని ఎవడైనా వాడి బుర్రను వాడటం లేదని ఖచ్చితంగా చెప్పగలను. ఊహాలోక విహారం చేసేప్పుడు ఆ ఆలోచనలు బయటకు ఒక్కో రకంగా వస్తాయి. అది కవిత కావచ్చు, వేదనలో వచ్చిన పాట కావచ్చు, లేదా ఆనంద (బాధ) తాండవం కావచ్చు.

" బౌతికావసరాలు మీరి మానసిక అవసరాలలోకూడా ఒక స్థాయిని దాటిన మనుషులకు మాత్రమే ఇవి కావాలి." - ఇది ఎవరిని ఉద్దేశించి ఏర్పరుచుకున్న అభిప్రాయమో తెలియదు, కానీ కాదు పేదరికంలో ఉంది కూడా గొప్ప రచనలు చేసిన కవులు లేరా ? చెరసాలలో మగ్గి కూడా కీర్తనలు రాసిన మహానుభావులు లేరా ?

రావణ కాష్ఠంలా ఏదో ఒకటి రాగలచకుండా ఉండలేరా ?

కత్తి మహేష్ కుమార్ said...

@మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్: మీ వ్యాఖ్యలోని ఆఖరి వాక్యం చూసి కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఈ టపాలో నేను "రగిలించింది" ఏమిటో. రావణకాష్టంలా నేను ఎప్పుడూ రగిలించేది ఏమిటో కొంత వివరిస్తారా!

నా బ్లాగులో నేను రాసుకుంటూ వెళ్తాను రగిలించడానికి మీలాంటోళ్ళు వస్తారు. దానికి బాధ్యత మీదా నాదా? నేను గమనించిన విషయం ఏమిటంటే, మీరు నా బ్లాగులో కేవలం రగిలిపోవడానికో లేక రగిలించడానికో ఇప్పుడు కొత్తగా నేను రగిలిస్తున్నానని ఎత్తిపొడవడానికే తప్ప మరెందుకూ రాలేదు.

మతానికీ, కులానికీ సంబంధం లేకుండా కవితలూ,కథలూ,సాహిత్యం,సినిమాలు వంటి చర్చలు ఎన్నో ఈ బ్లాగులో జరిగాయి. కానీ మీరు మాత్రం ఏదైనా కొంత వివాదం (మీరు దర్జాగా విభేధించగలిగే)ఉండే అవకాశం ఉన్న టపా దగ్గరికి మాత్రం వచ్చివాలి, కొన్ని అమూల్యమైన ముత్యాలు "రగిల్చి" వెళ్ళిపోతారు. ఇందులో మీ ఉద్దేశమేమిటో కాస్త చెబుతారా? రావణకాష్టాన్ని ఆశిస్తున్నవారెవరో తెలుపుతారా?

మానవావసరాలలో భౌతిక,మానసిక అవసరాలు తీరిన తరువాత పారలౌకిక,ఆధ్యాత్మిక అవసరాలొస్తాయి. సాహిత్యం అటువంటి అవసరాలలో ఒకటి. కాబట్టి basic needs పూర్తయిన తరువాత మాత్రమే మనుషులు సాహిత్యం వైపు మొగ్గుచూపుతారు. ఇందులో నేను నిర్దేశించిన అభిప్రాయం ఏమీ లేదు. Prejudice అంతకన్నా లేదు.మీరు ఉదహరించిన్వాళ్ళు exceptions. Exceptions don't make rules.

Anonymous said...

>>'I am a man of contradictions' అన్నారు. నాకు మాత్రం Man of confusions లా అనిపించింది.<<

అబ్రకదబ్ర , you are the best. ఎందుకంటే మీరు ఆలోచింపజేసే పాయింట్స్ రైజ్ చేస్తారు. మన అభిప్రాయం ఒకటి .. వేరే వాళ్ళ అభిప్రాయం వేరొకటి అయినపుడు contradiction అనవచ్చేమో .. contradiction అయినపుడు confusion లో పడటం సహజం అని నా అభిప్రాయం

no one is wrong or now is right ..అంతా భ్రమ !

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

ఇంత కన్నా గొప్ప సమాధానం నేనూ ఆశించలేదు. నేను అడిగిన వాటికి తప్పితే ఆఖరి వాక్యానికే పెద్ద సమాధానమోస్తుందని ఊహించినదే

ఇక "Exceptions don't make rules" --- "A rule should be able to answer Exception. Otherwise there is no meaning of a rule"

కత్తి మహేష్ కుమార్ said...

@మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్:ఏమిటి నేను మీకు చెప్పకుండా దాటవేసిన సమాధానం?

మీ మొదటి పేరాలో నేను కవితలకు భావుకతకూ వ్యతిరేకమనే ప్రెజుడిస్ తప్ప మరొకటి లేదు. అంటే మీరు మొత్తం వ్యాసాన్నికూడా చదవలేదనేది అర్థమవుతోంది.ఇక నా బ్లాగులో ఇతర టపాలు అస్సలు చదవలేదనేది బహుస్పష్టం.

రెండో పేరాలో భౌతికావసరాలగురించి నేను చేసిన వ్యాఖ్యానానికి మీ అభ్యంతరం. దానికి నేను సమాధానం ఇచ్చాను. మీరిప్పుడు కొత్తగా ప్రతి rule లోనూ exception కు సమాధానం కావాలని ప్రతిపాదించారు. నేనన్న context లోనుంచీ ఆ expressionని తొలగించి ఉక్రోషంతో mislead చేసే ప్రయత్నంగా అది కనిపిస్తోందే తప్ప మీకు నిజంగా చర్చించే ఉద్దేశమున్నట్లు ఇక్కడా కనబడదు.

ఒక పోతన, ఒక రామదాసూ పేదరికంలోనూ జైల్లోనూ మగ్గుతూ సాహిత్యాన్ని సృష్టించినంతమాత్రానా ఆకలి కడుపులతో ఉన్న కోట్లమందికి సాహిత్యంతో పనిలేదన్న నా స్టేట్మెంట్ తప్పయిపోతుందా! What exactly are you trying to prove? Except that you want to ascertain the prejudice you have against me.

కవితలు శుద్దదండగ అని నేను అనుకుంటే ఇంత చర్చ ఉండేది కాదు. కవితాత్మకతా, భావుకతా నాకు చుక్కెదురైతే వాటి మాటకూడా నాకు పట్టేది కాదు. ఇక్కడ నేను చర్చకు పెట్టిన విషయం సాహితీప్రపంచంలో చర్చల్లో ఉన్న విషయమే. ఈ విషయం మీకు బహుశా తెలీదు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఖచ్చితంగా లేదు.మీలా సాహిత్యానికి lip service చేసే వారికన్నా నా నిబద్ధత రావణకాష్టమైనా నాకు అంగీకారమే!

భావకుడన్ said...

మహేష్,
కొన్ని అవసరాలు తీరిన తరవాతే సాహిత్యం అవసరం అని మీరంటే......రైతు కూలీల పాటలు, మగ్గమేసుకుంటూ నేసుకుంటూ పాడే పాటలు ఇలా ఎన్నో పనులు చేసుకుంటూ పేద ప్రజలు పాడుకునే పాటలు, వారి జానపదం అంతా సాహిత్యం కాదనా మీ అభిప్రాయం?

మీరు చెప్పాలనుకున్నది....ఆ అవసరాలు నిండే దాకా "సాహిత్య అధ్యయనం అవసరం లేదు" అనేమో....ఎందుకంటే ప్రతి ప్రజల జీవితంలో ప్రతి ముఖ్య ఘట్టంలో సాహిత్యం ఏదో ఒక రూపంలో ఉండే ఉంది....వారు ఏ స్థాయి వారయినా ...కాదంటారా?....కాని వారు దాన్ని సాహిత్యం అని గుర్తించటం, దాన్ని గురించి తెలుసుకోవాలనుకోవటం చేయరు...దాన్నే "అధ్యయనం" అన్నాన్నేను.

ఇకపొతే.....ప్రతి పనికీ సమాజుపయుక్తమైన కోణం కనపడాలంటే/ఉండాలంటే కష్టమే :-) నాకు భావ కవిత్వం హాబీనే తప్పితే సమాజ సేవోపకరణం కాదు....నేను చేయాల్సింది వేరే నేను చేస్తూనే ఉంటాను...అలా అని అన్నిటిలోనూ ఆ కోణం అంటే ఐపోతానండీ బాబూ...అలాగే ఇతరులకూ .....మామూలు మనుషులం ...మమ్మల్నోగ్గేయండి.

Suresh Kumar Digumarthi said...

మనం చేసే ఏపనీ ప్రతీసారీ మంచిదో, ఉపయోగకరమైనదో కాదు. అందుకే మనం కావాలనుకున్న దేనిలోనైనా బెస్ట్ వెతికి తీసుకుంటాం.
...తినగ తినగా వేప తియ్యగా అనిపిస్తుంది కదా!

కత్తి మహేష్ కుమార్ said...

@భావుకుడన్: మీరు చెప్పినవాటిని మౌఖికసంస్కృతులు (oral traditions)గానే ఇప్పటివరకూ చాలా మంది గుర్తుస్తుండటంతోనే వచ్చింది సమస్య. జనసాహిత్యాన్ని "అక్షరసాహిత్యపు"(literature) విలువలతో బేరీజుచెయ్యడంతో అధ్యయనం సంగతి దేముడెరుగు మ్యూజియంలో పెట్టడానికి లేకుండా దొరక్కుండా దూరమైపోతున్నాయి.

పనీ-పాటల సాహిత్యాన్ని మూలసాహిత్యంగా గుర్తించే ఇప్పుడు యూనివర్సిటీల్లో folk-cultural studies లాంటి డిపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. అవి భాషాసాహిత్యానికి అనుబంధ సాగుతున్నాయి. వీటిల్లో comparative studies కూడా జరుగుతున్నాయి. కాకపోతే నా suggestion కేవలం "letter"ఆధారంగా వచ్చిన literature కు సంబంధించినది మాత్రమే.

అక్షరాహిత్యం విస్తరణ విధ్యాధికుల మధ్యనే. వారి శాతం తక్కువ. వారిలో నిజంగా "చదివేవాళ్ళు" మరీ తక్కువ. వారిలో రసస్పందనే ఆశయంగా చదివేవాళ్ళు మరీమరీ తక్కువ. అలాంటప్పుడు ఇలాంటి ప్రశ్నలు తప్పక తలెత్తుతాయి.

వ్యక్తిగతంగా నేనూ ఆ "elite" లో ఒకడ్నే. అందుకే ఈ అంతర్మధనం. I am torn between what I hear, what I think and what I want. అందుకే చివర్లో "ఏమిటో పిచ్చి" అని ముగించాను.

gaddeswarup said...

My impression is that the interface between 'oral tradition'and literature is quite porous. Is not Vemana preserved mostly through oral tradition? Many Telugu metres are supposed to be from preNannaya oral traditions. I think padasahityam, though looked down by scholars was preserved by common folk and adopted again by Annamacharya and others. But I am not sure. These are just vague impressions from far.

chittoor.S.Murugeshan said...

మాటలకు అర్థం నిఘంటువులో ఉంటుంది
కవితకు అర్థం జీవితంలో ఉంటుంది !
క్రింది కవితను చూడండి !
కవిత్వం కూడ కాదు గేయం !
"రావోయి నేస్తం రావోయి వినవోయి మాట వినవోయి
నీ జీవితమన్నది శాస్వతమా ఈ అవనికి ఉన్న అందం బలి పశువా
కొండ మీద ఉన్న చెట్లు నరికేవు గాలి ఎండా వానా పరుదులు మార్చేవు
కర్మాగారాలంటు నదులల్లో విషం కలిపేసి తల్లి చెల్లి అంటావు
రేపు ఆక్సిజను కొరతవస్తే కొట్టుకెళ్ళి .....
రేపు ఆక్సిజను కొరతవస్తే కొట్టుకెళ్ళి నీ ప్రాణాలు వాయిదాలో కొంటావు.
గమనిక: మా చిత్తూరు నీవా నదిని డి.కె.సారా ఫేక్టరి పొట్టన పెట్టుకుంది.
వాకింగ్ కోసం ఫారెస్ట్కి వెళ్ళేవారు (శుద్దమైన గాలికోసం) నెలకింతా కట్టాలని రూల్ పెట్టేరు.. కోర్టులో స్టే ఉంది ..లేదో..

బొల్లోజు బాబా said...

హెడ్డింగు లో ఉన్నంత ఫోర్స్ టపాలో కనిపించలేదు. :-)


మానవమేధస్సుకు కల్పన, తర్కం అనేవి రెండు పార్స్వాలు. కవిత్వంలో తర్కం కంటే కల్పనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకేకవిత్వం కొంతమందికి అసత్యంగా, ఇంప్రాక్టికల్ గా కనిపిస్తుంది. ఉదా: ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అన్న వాక్యం తర్కరహితంగానే కనిపిస్తుంది. తార్కికంగా ఆలోచిస్తే ఆ వాక్యమొక అసత్యప్రేలాపనే. కానీ అందులో అంతర్లీనంగా గుండ్రని ఆకారము, ప్రకాశవంతము అనే అర్ధాలు గోచరిస్తాయి. అపుడు ఆ కవి పరోక్షంగా చెప్పిన అంశాలతో ఆమె మోమును కల్పన లోకి తెచ్చుకొంటే ఓ దృశ్యావిష్కరణ జరుగుతుంది. అందులో ప్రకాశించే గుండ్రని మోముతో, చల్లని చూపులతో ఓ స్త్రీ కనపడుతుంది. అదే రసావిష్క్రణ.

ఇక కవిత్వ ప్రయోజనమేమిటి? ప్రతీదానికీ ఒక ప్రయోజనం ఉండాలి అనే ఆధునిక పోకడల దృష్టితో ఆలోచిస్తే ఏ కళైనా అర్ధరహితంగానే కనిపిస్తుంది. అపుడు సిద్దాంత వ్యాసాలు, రాజకీయ వాఖ్యలు తప్ప మరేవీ, ఏదో ఉద్దేశ్యాలను నెరవేర్చే రాతలు కాజాలవు. తర్కమే అన్నిటికీ మూలం అనుకొనే వారికి కవిత్వం రుచించదు. కళలూ నిష్ప్రయోజనంగానే కనిపిస్తాయి. కవిత్వ ప్రయోజనం వ్యక్తిగతమే తప్ప సామాజికమో లేక ఏదో వస్తూత్పత్తో కాదు.

ఒక్కో వాక్యం ఎందుకు వెంటాడుతుంది? ఒక్కో చిత్రం ఎందుకు మనమనసులపై తన వర్ణాల వర్షాన్ని కుమ్మరిస్తుందీ? ఒక్కో రాగం ఎందుకు గాలం ముల్లై గుండెను చిక్కించుకొని ఈడ్చుకుపోతుంది? ఒక భంగిమో లేక అభినయమో ఎందుకు శిల్పీకరింపబడి హృదయకూడలిలో ప్రతిష్టింపబడుతుందీ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించవు. ఎందుకంటే ఆయా చర్యలను అనుభవించే, ఆశ్వాదించే రసజ్ఞత అందరిలో ఉండాలని రూలేమీ లేదు కదా. కానీ ఉన్నవారిలో మాత్రం నిరంతరం ఆ క్రియలు ఆనందాన్నిస్తూనే ఉంటాయి.

సాహిత్యంలో కవిత్వం యొక్క పాత్ర పెద్దదే! షేక్స్ఫియర్ ఎంత గొప్ప నాటకకర్తో అంతే గొప్ప కవిగా సొన్నెట్స్ లలో తనను తాను ఆవిష్కరించుకొన్నాడు. కాళిదాసూ అంతే. ఉత్తమకధకులైన చలం, రావిశాస్త్రి, బుచ్చిబాబు, స్మైల్, చండీదాస్, యండమూరి (వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందో బ్రహ్మా వంటి రచనలు), వంటి వారల రచనల్లో వచనం ఎంతైతే ఉంటుందో అంతకు మించి కవిత్వం ఉంటుంది. అలాంటి రచనలను కవితాత్మక వచనమని వ్యవహరిస్తున్నారీ మధ్య. ఉత్తవచనమే వ్రాసి ఆక్షణాన ఉద్రేకపరచి, ఆహ్లాదింపచేసి కనుమరుగైన ఇతర రచయితల పేర్లు చెప్పుకోవటం అనవసరమేమో. వేల వచనరచనలలో ఒక అమృతం కురిసిన రాత్రి ఎన్ని పునర్ముద్రణలను పొందలేదూ, అలాగ.

కనుక కవిత్వం, వచనాన్నో, వ్యాసంగాన్నో షాడో చేస్తుందన్న నిందలనవసరం. ఎందుకంటే కవిత్వమే చివరవరకూ నిలుస్తుందన్న విషయాన్ని చరిత్ర చెపుతున్నది.


బొల్లోజు బాబా

(పి.ఎస్. బ్లాగుల్లో వ్రాసే కవితలన్నీ కవిత్వం అని అపోహపడకండి. నావాటితో సహా్ల్

కత్తి మహేష్ కుమార్ said...

@బొల్లోజు బాబా: అబ్బ! ఎంత బాగా చెప్పారండీ "కవిత్వం ఇందుకు" అని ఒక శీర్షికపెట్టి అందరిచేతా చదివించెయ్యాలని ఉంది.

రాధిక said...

బాబాగారూ చాలా బాగా చెప్పారు.

ఉష said...

మహేష్ గారు, నా తఫున కూడా ఒక డిట్టో కొట్టండి బాబా గారి వ్యాఖ్య పట్ల అభిప్రాయంపై. ఎంత బాగా చెప్పారో. ముదావహం.

Anonymous said...

ఆరుద్ర -రిక్షావాడు:
అంత పాపులర్ అవ్వాలని బహుశా అందరికీ ఉంటుంది. కానీ, ఈ మధ్య ట్రెండేంటంటే, రిక్షావాడికి ఇలా నచ్చుతుంది అని "ఐశ్వర్య ల...తో సెక్స్ చేసుకుందాం రా! " అని పాట రాసి,పాపులర్ ఔదామని ప్రయత్నిస్తున్నారు. "జనాలు" - "అలా" మాట్లాడుకున్నంత మాత్రాన, అలాంటి పాట "జనపదం" అయిపోదు కదా!?లేదా అది కూడా "జనపదం" అనుకుందామా!? కానీ ఎప్పుడో, ఎవడో లం...కొ..భలేగా రాస్తాడు - వాడిది మాత్రం నేను కూడ వింటాను; చదువుతాను; విమర్శించుకుంటాను; ఆలోచించుకుంటాను; ఆనందిస్తాను etc.,

కవిత్వం:
ఇక్కడ జనాలంతా కవులే! అసలు తెలుగులో
కవిత్వం "చదవాలి" అని కోరిక ఉన్న ప్రజలు ఉండాలి కదా! తెలుగులో కవిత్వం మాత్రమే ఉందనిపిస్తే, కేవలం కవిత్వం "రాసే"వాడే - "చదివే"వాడు కూడా ఐతే, వారే ఈ తెలుగు సాహిత్యలోకంలో విహరిస్తే, అది చాలా ప్రమాదకరం. నేను కవిని కాదు కాబట్టి ఈ మాట ఘంటాపధంగా చెప్పగలను. "కవుల"కు ఇందులో "ఎమోషనల్ స్టేక్" ఎక్కువ. వాళ్ళకిది అంతగా కొరుకుడు పడదు.

మాస్లోవ్ నీడ్ హైరార్కీ:
పారలౌకిక, ఆధ్యాత్మిక అవసరాలు, బేసిక్‌నీడ్స్ తీరిన *తరువతే* వస్తాయి అనే అభిప్రాయం తప్పు. మేస్లోవ్’స్ నీడ్ హైరార్కీకి ఉన్న విమర్శలలో ఇది ఒకటి. మ్యానేజిమెంట్ విద్యార్ధులకు ఈ థియరీని నేర్పించటం వల్ల, గ్లోబలేజేశన్లో, డామినంట్ పారడైమ్లో ప్రపంచం అంతా చలామణీ అయిపోతున్న మరో తప్పుడు "థియరీ"
అన్నమాట. ఇది తప్పని నేను ఒక్కడ్నే చెప్పలేదు. నాలాంటి వాళ్ళ నోరు నొక్కేశారేమో!! బేసిక్ అవసరాలు తీరకపోయిన, సెల్ఫ్ యాక్ట్యుయలైజేషన్ నీడ్ "విపరీతం"గా ఉండే మనుష్యులు కొందరుంటారు. పైగా డామినంట్ పారడైమ్లో, పెళ్ళాం బిడ్డల్ని, తల్లిదండ్రులని వదిలేసి, "సెల్ఫ్-యాక్ట్యుయలైజేషన్" నీడ్‌తో జీవనం కొనసాగించవాళ్ళ జీవితాలని, ఈ సమాజం "మరింత" కష్టసాధ్యం చేసేసింది. అందుకని మీరు ఈ విషయంలో "ఆలోచన" మార్చుకోగలగాలి.

దండగ - ప్రయోజనం:
"దండగ" - అనే మాటెప్పుడొస్తుందీ అంటే - దాని నుంచి ఆశించిన ప్రయోజనం ఏదన్న ఉండి, ఆ ప్రయోజనం సాధించలేం అన్నప్పుడు వస్తుంది. కవిత్వం రాసేవాడు వాడి "అనుభూతిని వ్యక్త పరచడానికే" రాస్తున్నప్పుడూ , ఏది ఎవరికి దండగ! రాసేవాడికి రాయాలనిపించి రాసుకుంటున్నాడు అనుకోవాలి గదా! ఏ ప్రయోజనం ఆశించి, ఇది దండగ అని చెప్పగలం!వాళ్ళ "గుల"కొద్దీ కవిత్వం రాసుకుంటున్నారు. అచ్చేసుకొని దమ్ముందీ, అచ్చేసుకుంటున్నారు. ఏమంటారు!? మొన్న మీరూ రాసారు -
"సెక్సు చేసుకుందాం రా! భూమి పుట్టినప్పట్నించి దాని కోసమే వెయిట్ చేస్తున్నాను" అని. నేనేమన్నా అన్నానా!? :) నా అనుభవ వ్యక్తీకరణ, నా సెక్సుభావాతీవ్రతను రాస్తే, అది "అసభ్యం" అంటూ నా బ్లాగు మూయిస్తారు.తెలుసా!? :)

bala said...

If some body look thier face in our words,letters, what we need.
Poem is like music it sings everybody song.