Monday, June 29, 2009

పురాణ ప్రలాపం - చరిత్ర ప్రలోభం

ఓటమి కారణాలు వెతుకుతూ బీజేపీ పార్టీ అంతర్మధనం గావిస్తోంది. ‘హిందుత్వకు దూరమెళ్ళిపోయాం కాబట్టి మన ఓటర్లు మనల్ని దూరం చేశారు’ అని కొందరు. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని,ప్రజానాయకుల్ని విస్మరించి బోర్డురూం పొలిటికల్ లీడర్లు పార్టీని మట్టిగరిపించారు’ అని మరికొందరు ఇప్పటికే పబ్లిక్ లో దులిపేసారు. వరుణ్ గాంధీ ముస్లిం వ్యతిరేకత, నరేంద్రమోడీ ని నెక్స్ట్ పి.ఎమ్ అనడం పార్టీని మరింతగా దిగజార్చాయని కొందరు విశ్లేషకులంటుంటే, మరికొందరు అసలు ఒక తమదంటూ ఒక కోర్ అజెండానే లేకుండా బీజేపీ ఎలెక్షన్ల బరిలోకి దిగి దిమ్మదిరిగిపడిపోయిందని నిర్ణయించేశారు. మొత్తానికి "రైట్"...రాంగ్ అయ్యింది.

మరోవైపు మిని రష్యా చైనాల్ని భారతదేశపు రెండు చిన్నచిన్న మూలల్లో స్థాపించిన వామపక్షపార్టీలు చారిత్రాత్మక విజయం నుంచీ చరిత్రైపోయే పరాజయం వరకూ UPA తోకపట్టుకుని ఈ ఎన్నికల్లో ప్రయాణించేశారు. 2004 ఎన్నికల్లో వచ్చిన వాపుని బలుపనుకుని భ్రమపడిపోయిన ఈ పార్టీలు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కులాగే పనితప్ప, ఎన్నికల్లో తమకొచ్చిన ప్రజామద్ధత్తుని సక్రియంగా ఉపయోగించిన దాఖలాలు బూతద్ధం పట్టుకుని వెతకాల్సిందే. విదేశీపెట్టుబడులను తగ్గించడం, PSU లను లిక్వీడేట్ చెయ్యకుండా కాపాడటం తమ ఘనత అని వీరు అనుకున్నా, ప్రజలు మాత్రం అదేదో పెద్ద ఘనకార్యంగా భావించలేదు. ఇక ప్రజాసామాన్యానికి ఏమాత్రం అర్థం కాని న్యూక్లియర్ ఒప్పందంపై మొండిపట్టుపట్టి, కనీసం ప్రజల్లోకి కూడా వెళ్ళకుండా ఢిల్లీలోనే కూర్చుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో వీరి క్రెడిబిలిటీ కాస్తా లయబిలిటీగా మారింది. ఇప్పుడూ వీరూ తమకు అలవాటైన అండర్ గ్రౌండ్ లో దూరి అంతర్మధనాలు గావించుకుంటున్నారు. మొత్తానికి లెఫ్టూ....రాంగ్ అయ్యింది.

వాజ్పేయి తరువాత బీజేపీ ఒక అనాధపార్టీ అయినమాట తేటతెల్లం. అద్వానీని బలమైన ప్రధాని అని ప్రొజెక్ట్ చేసినా, పార్టీలోని స్థబ్ధతని కనీసం బద్ధలుకొట్టలేని బలహీన నాయకుడిగానే మిగిలిపోయాడు. ఇక అస్మదీయులూ తస్మదీయులూ గ్రూపులుగా విడిపోయి తన తలప్రాణం తోకలోకి తీసుకొచ్చిన సంగతి ఇప్పుడిప్పుడే పబ్లిక్ డొమెయిన్లోకి వస్తోంది. ఇవన్నీ రాజకీయకోణాలైతే అతిముఖ్యమైన సైద్ధాంతిక కోణం బీజేపీని నట్టేట్లో ముంచిందనుకోవాలి. అదే పురాణ (mythological) ధృక్కోణం నుంచీ వర్తమానాన్ని అర్థం చేసుకున భవిష్యత్తుని దర్శించే వైఖరి. ప్రసన్నరాజన్ చెప్పినట్లు బీజేపీ తమ బలాన్ని,నమ్మకాన్నీ "monochromatic mythos" నుంచీ పొందుతున్నంత వరకూ వర్తమానంలోని "నిజాన్ని" గుర్తించలేరు.

రైట్ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే లెఫ్ట్ పార్టీలు తమ చరిత్ర (History)లో తామే చిక్కుకుపోయారు. They are in their own historical time lock. భారతదేశంలో సమసమాజ నిర్మాణానికి కార్మిక రాజ్యం కాదు కర్షక రాజ్యం కీలకం అని వీరు భూమి పంపకాల ఉద్యమాలలో గ్రహించినా, అతిత్వరలో యూనియన్ గూండాయిజాల్లో తమ కమ్యూనిజాన్ని భద్రంగా దాచిపెట్టుకున్నారు. ఈ విధానాల కొనసాగింపులో చివరికి వీరికి మిగిలింద్ బెంగాల్ లో సమ్మెలు, కేరళలో పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా మిగిలిన యువత. రష్యావిప్లవంలోని చారిత్రక సిద్ధాంతానికి, నిజంగా వర్ధిల్లుతున్న కమ్యూనిస్టు చైనా -క్యాపిటలిజానికీ లంకె ఎలా వెయ్యాలో అర్థంకాని కూడలిలో తమదంటూ ఒక వర్తమానాన్ని సృష్టించుకోలేక వీరు తమ అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నారు. ఇంత కంన్ఫ్యూజన్లో ఉన్న భారతీయ కమ్యూనిజం ద్వారా మనకొరిగేది ఏమీ లేదని ప్రజలు నిర్ధారణకొచ్చినట్లునారు.

ఒకవైపు పురాణ ప్రలాపాలూ మరోవైపు చరిత్ర ప్రలోభాలూ రెండూ కలిపి లెప్ట్ రైట్ పార్టీలను ఈ ఎన్నికల్లో లెప్ట్ రైట్ అని నడిపించక "పీఛే ముడ్" ని చేశాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి మేలేగానీ, మేలైన ప్రతిపక్షాలు లేకపోతే ప్రజాస్వామ్యానికి మాత్రం కీడే. Hope they will recover from their ailments.

****

10 comments:

Anonymous said...

>>ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి మేలేగానీ, మేలైన ప్రతిపక్షాలు లేకపోతే ప్రజాస్వామ్యానికి మాత్రం కీడే. Hope they will recover from their ailments.

బాగా చెప్పారు.
(ఉత్తినే..నాకందికి చిరంజీవీ చాలా మయోపిక్‌గా రాజకీయాల్లోకి దిగాడని బాధ...ఏకంగా మొత్తం సౌత్ లోంచి దిగాల్సింది...:( )

Bala said...

I don't know that you will write politics as well.As long as people live with their passive aggressive shit they never florish.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Nice Article. I like the ending. Yes, the opposition should recover from debacle and should play responsible role. Otherwise, the politics will become monopolized.

Sujata M said...

నేను గమనించినంత వరకూ - ఒరిస్సా, బెంగాల్ లలో, వీధి నాయకులు గా తయారవాలంటే, మార్పును మొండిగా వ్యతిరేకించితే చాలు. ఇక్కడ ఎవరన్నా ముచ్చట పడి పెట్టుబడులు పెడదామన్నా, వీధి రౌడీలు, కూటములుగా తయారయ్యి, సామాన్య ప్రజలకు ఏవో భూతాల్ని చూపించి, వాళ్ళని ఆశాంతం అడ్డుకుంటారు. అందుకే రతన్ టాటా సింగూరు నుంచీ విసిగి వెళ్ళిపోయాడు. వైజాగ్ స్టీలు ప్లాంటు చూడండి, ఎంతమందికి ఉపాధి కల్పించిందో ! ఇక్కడ నిర్వాశితులూ, కేసులూ ఇంకా ఉండి ఉండొచ్చు. కానీ ముందే మోకాలు అడ్డం పెట్టేస్తే, వైజాగ్ కు మేలు జరిగేదా ? ఒరిస్సాలో బోల్డాన్ని ఖనిజ వనరులూ, నిధులూ, నిక్షేపాలూ. కానీ మైనింగ్ కి ఎవరన్నా ముందుకు రాగలరా ? ఇపుడైతే ఏవో పర్యావరణ పోరాటాలు జరుగుతున్నాయి కానీ- ముందు నుండీ, మార్పును వ్యతిరేకించడం - తమ ప్రజలను కనీస రవాణా, ఆరోగ్య, విద్యా సౌకర్యాలను కూడా కలిగించకుండా - ఇవన్నీ బూర్జువా భావాలనీ, మనిషి అడవిలోనే పుట్టి, అడవి మనిషిగానే బ్రతికి, అడవిలోనే చనిపోవాలనీ నూరిపోస్తూ, తామున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారు. అలా అనీ మరీ మన హైడ్రాబాడ్ లా ఎడా పెడా అభివృద్ధి చెందేయకూడదు కూడా ! ఒక ప్లాను, ఒక సిస్టమూ అనేది ఫాలో అయితే, అభివృద్ధి కన్నా కావలసిన మార్పు ఏముంది ?

Malakpet Rowdy said...

Very interesting analysis. Should agree with most or all of the stuff

గీతాచార్య said...

ఒకవైపు పురాణ ప్రలాపాలూ మరోవైపు చరిత్ర ప్రలోభాలూ రెండూ కలిపి లెప్ట్ రైట్ పార్టీలను ఈ ఎన్నికల్లో లెప్ట్ రైట్ అని నడిపించక "పీఛే ముడ్" ని చేశాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి మేలేగానీ, మేలైన ప్రతిపక్షాలు లేకపోతే ప్రజాస్వామ్యానికి మాత్రం కీడే. Hope they will recover from their ailments.
*** *** ***

RighttO

గీతాచార్య said...

Communists???

vaalla gurinchi entha thakkuva maatlaadithe antha manchidi

Telugu font problem. That's why in TengLiSh

Anonymous said...

గెలిచినప్పుడు అతిగా స్పందించడంగానీ, ఓడినప్పుడు అతిగా నిరాశ పడడంగానీ మంచివి కాదంటారు, బి.జె.పీ ఈ రెండిటినీ తుంగలో తొక్కింది. ఇప్పుడు వారు చేసుకుంటున దానిలో ఆత్మవిమర్శ కన్నా, ఆత్మనిందే ఎక్కువగావుంది. A.C రూముల్లో కూర్చుని ఎవడో బాంబులు పేల్చాడు కాబట్టి మాకు ఓటేయండి మేము దాన్ని ఆపుతాం అనో, లేక అరచేతిలో వైకుంఠం లాంటి రామమందిరాన్నో చూపించి ఓట్లుపొందుదాం అనుకుంటే ఫలితం ఇలానే వుంటుంది.

ఇక మన కామ్రేడ్స్ కామేడీ గురించి చెప్పుకోవడం కన్నా నవ్వుకోవడమే మంచిది. these parties know what a common man need.

Anonymous said...

I mean to say, these parties need to know what a common man need.

Anil Dasari said...

>> "విదేశీపెట్టుబడులను తగ్గించడం, PSU లను లిక్వీడేట్ చెయ్యకుండా కాపాడటం తమ ఘనత అని వీరు అనుకున్నా, ప్రజలు మాత్రం అదేదో పెద్ద ఘనకార్యంగా భావించలేదు"

ఒకటి మాత్రం నిజం. పుర్ర చేతి పార్టీల 'మూర్ఖపు' ఒత్తిడితో గతిలేక పక్కన పెట్టిన ఆ పై పనులే కాంగ్రెస్‌కి వరంలా మారాయి. ఫ్రీ మార్కెట్ పాట పాడుకుంటూ తలుపులు బార్లా తెరిస్తే నేటి ప్రపంచవ్యాప్త ఆర్ధిక మాంద్యం సెగ మనదేశానికీ దిమ్మదిరిగేలా తగిలేది, కేంద్రంలో కాంగ్రెస్ సోదిలోకి లేకుండా పోయుండేది. చావు దెబ్బ తప్పించుకున్నందుకు సోనియా, మన్మోహన్ లెఫ్ట్ పార్టీలకే దండం పెట్టుకోవాలి.