"మీ అభిప్రాయాలకు సామాజిక ప్రయోజనం ఉండాలని అనుకుంటున్నారా లేదా?" అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నాకు ఈ ప్రశ్నపట్ల ఉన్న సందేహాలు తీర్చుకోవడం అవసరం అనిపించింది. నా అభిప్రాయాలకు విలువివ్వాల్సిన అవసరమే ఎవరికీ లేదని నేను నమ్మినప్పుడు దాని ద్వారా సామాజిక ప్రయోజనం ఆశించడం సుదూరస్వప్నం. మరి ఈ ప్రశ్నకు సమాధానం!!! అందుకే ఈ ఆత్మాశ్రయం.
ఎక్కడో నేను చెప్పినట్లు..."మనుషులు తాము నేర్చుకున్న అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ, జ్ఞానాన్నీ, తమకున్న అభిప్రాయాల్నీ అక్షరబద్ధం చేస్తారు. దాని ఆశయం గుర్తుంచుకోవడం కావచ్చు, లేదా ఇతరులకు తెలియజెప్పడం కావచ్చు లేక కేవలం మనసు,మెదడులోని భావాల్నీ ఆలోచనల్నీ రాయడం ద్వారా వ్యక్తపరచి, కొంత మానసిక ఒత్తిడి నుంచీ ముక్తి పొందడమూ కావచ్చు. బహుశా మనం బ్లాగులు కూడా ఇందుకోసమే రాస్తామేమో కదా!
మనం మనస్ఫూర్తిగా నమ్మిందో లేక వ్యతిరేకించేదో లేకపోతే రాయడం వృధా, What is the point in writing, if we have nothing to believe in or nothing to rebel against? అని నా నమ్మకం. బహుశా అదే "నా ప్రయోజనం" కూడా. అందుకే నా టపాలలో చాలావరకూ, నేను బలంగా నమ్మినవీ లేక తీవ్రంగా వ్యతిరేకించే విషయాల్ని రాస్తాను. కాకపోతే ఆ భావనలు నా జీవితంలో వచ్చిన నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కొంత తార్కికంగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. దీన్ని చదివిన కొందరు ఎందుకు అంత వ్యతిరేకం? ఎవరిమీద నీ కోపం? అంటే, "నామీద నాకే" అని చెప్పగలనేకానీ, వీరిమీద అని ఖచ్చితంగా సూచించలేను. ఎందుకంటే I rebel against issue, ideas, concepts, norms, individual hypocrisies. వాటిని స్థూలరూపంలో చూడాలంటేనే కష్టమే, ఇక నిర్థిష్టంగా వివరించాలంటే... అసాధ్యం. అందుకే I write because I want to. I write because I think I have some thing to say. I shall say it in the space I created for my own self. Take it or leave it."
సామాజిక ప్రయోజనానికి 'ఆత్మాశ్రయం' గొడ్డలి పెట్టులాంటిదని కొందరి నమ్మకం. కానీ 'వైయక్తికత' అనేది (నాదైన) సామాజిక వాస్తవితను ప్రతిఫలిస్తుందనే విషయాన్ని నేను నమ్ముతాను. అందుకే ‘నా’ విషయాలు నేను రాస్తాను. వాటికి సామాజిక "ప్రయోజనం" ఉందా లేదా అనేది నిర్ణయించాల్సింది నేను కాదు. అలా ప్రయోజనం సిద్ధించానే ఉద్దేశంతో రాసేది వైయక్తికం కాదు. నా బ్లాగు వ్యక్తిగతం. అచ్చంగా నా గోల. కాబట్టి వాటికి సామాజిక ప్రయోజనం సిద్ధించేంత వరకూ వాటి యొక్క సామాజిక ఉపయుక్తత తెలీదు. నా గమ్యం మాత్రం అదికాదు. By default అది జరిగితే నాకొక బోనస్సే తప్ప అది నా ఆశమూ కాదు. గమ్యం అసలే కాదు.
ఇక ఈ బ్రహ్మపదార్థం అనే ప్రయోజనానికి "విలువ" ఆపాదించడం నాకు చేతకాదు. ఏది మంచి ఏది చెడు అని నేను నిర్ధిష్టంగా ఎప్పుడూ చెప్పలేను. I am never certain of many things in life. కేవలం నా అనుభవాలకి అప్పటికప్పుడు ఆపాదించుకున్న విశ్లేషణలతో అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాను లేకపోతే ఉన్న జ్ఞానానికి నా ఆలోచననూ అనుభవాన్నీ బేరీజుచేసి "ప్రస్తుతానికి ఇది ఇంతే కాబోలు" అనే నిర్ణయానికొస్తాను. కాకపోతే at any given pint of time I "believe" in few set of things. I also ensure a possibility of CHANGE in them. ఆమాత్రం స్వీయనిర్వచనాలు లేకపోతే జీవితంలో మాజా ఏముంటుంది? ఎంత ఖరాఖండిగా చెప్పలేకపోయినా, మనకంటూ కొన్ని విలువలే లేకుంటే అర్థమేముంది? కాని వాటిని మంచి చెడు అని నిర్ణయించేది మాత్రం ఆ విలువల ఆధారంగా నేను చేసే "చర్య"లు మాత్రమే. ఆ చర్యల ఫలితాలు నా prospective happiness ని హరించనంతవరకూ అవి నాకు మంచి. ఒకవేళ అలా జరిగితే అది చెడు. అంటే నావరకూ మంచిచెడులు కూడా చాలాచాలా subject. ఇక సామాజికంగా ఏది మంచి అనేది ఎవరు నిర్ణయిస్తారో అది నా చర్యల్ని influence చేసేవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. దాని విస్తృతత్వం నా circle లోనే ఉంటుంది. Apart from things like global economy, natural disaster etc. etc.
నా బ్లాగు ఉద్దేశం సమాజోద్ధరణ కాదు. వ్యక్తుల్ని మార్చి తద్వారా సామాజిక ప్రయోజనాన్ని సాధించండం అంతకన్నా కాదు. నా ఆలోచనల్తో ఇతరుల్ని ప్రభావితం చెయ్యడానికో లేక వారి అభిప్రాయాల్ని మార్చడానికో వీలౌతుందని నేను విశ్వసించను. వాదనలతో మనుషులు తమ అభిప్రాయాలు మార్చుకుంటారనే అహంకారం నాకు ఏమాత్రం లేదు. అనుభవాలు మనుషుల అభిప్రాయాల్ని ఏర్పరుస్తాయి. వాదనలు అనుభవాలను మించిన ప్రభావశాలిగా ఏనాడూ అవలేవు. ఇతరుల నమ్మకాల్ని మార్చాలనే ఆశ అసలు లేదు. ఎందుకంటే నమ్మకాలు కుటుంబ విలువలు(పెంపక), సామాజిక విలువలు (కండిషనింగ్) మీద ఆధారపడుంటాయి. అవి ఇతరుల అభిప్రాయాలూ, ఆలోచనలవల్ల మారేవి కావు. ప్రత్యామ్న్యాయమైన విలువలు జీవితంలో ప్రవేశించి ఒక కుదుపుకుదిపితేగానీ నమ్మకాలు మారవు. అది నా బ్లాగుల్లోని రాతలవల్ల జరుగుతుందంటే నాకైతే "నమ్మకం" లేదు.
మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే...నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ‘నా’ బ్లాగు టపాల్ని ‘నాలాగా’ రాయటం.
Thursday, June 25, 2009
సామాజిక ప్రయోజనం అంటే!
*****
Posted by Kathi Mahesh Kumar at 1:05 PM
Labels: వ్యక్తిగతం
Subscribe to:
Post Comments (Atom)
17 comments:
Hi Mahesh,
I am following your blog for last 2 months. I really liked. because you are expressing many things which are part of this society. Especially about attitude of brahmins. I am frankly speaking i am also born in Hindu. But at the same time i will against "Brahamana vaadham" because they have done so many mistakes...today in our society we are facing problems. i can understand that today's brahmins(they are using that word...but they don't know what is meant by "Brahmin"...they only knews that if anybody born in Sharma or Shasthry family they are brahmins) are not that much cruel...
One more thing i am requesting you in once article you mentioned the word "Cristian C M"...i don't agree with that word. because Y.S.Rajasekhara Reddy is not a cristan...because if a person convert from one religion to another religion...they should follow the truth of that Religion.
for the sake of Cristian votes ...he is using Christianity..but he is giving importence to his own community....then where he is living as Christan.
My dear Mahesh...plz don't think negative about me.
If we are fighting for the poor or any poverty in our society. We should not support even if a person belongs to our community or Religion.
I am expecting one post from you about Why SC,ST people are still suffering ....even though we have reservations for last 60 years.
Can you post why so many upper cast people contesting in SC,ST reserved places in politics by converting them into SC or ST(by getting cast certificats..
ex:- Geetha Reddy from Nalgonda..
Satrucharla Vijaya Rama Raju contesting from xyz assembly
..
Andhra Pradesh High court declared that Minister Satrucharla Vijayarama Raju is not scheduled tribe and he belongs to Kshatriya community. In past he contested in elections from Naguru (ST reserved) assembly constituency and won it 2 times as MLA and also won 3 times as Member of Parliament of Parvatiputam(ST reserved) parliament constiuency. Presently he is MLA of Parvatiputam(General) assembly constituency.
..
So Mahesh Garu...
i request you again..please fight these kind of issues...because everyone should realize..
Thanks,
Venkata Ramarao
ramnv4u@gmail.com
మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే...నాకు తెలీదు
_________________________________
Not completely because of the content, but because of the choice of words you use. Try the same content using a different language - I am sure the outcome would be totally different.
1.I trust you when you say - "నా బ్లాగు ఉద్దేశం సమాజోద్ధరణ కాదు".
I trust you when you say - "I write because I want to. I write because I think I have some thing to say. I shall say it in the space I
created for my own self. Take it or leave it "
మిగితాదంతా ......may be its just hypocracy or perhaps confusion or may be i have not understood anything...........don't you know what
is social responsibility !?
2. మీ వరకు మంచి చెడు కూడా చాలా సబ్జెక్టివ్. మీ ఆనందాన్ని హరించనంత వరకు, మీ చర్యలు మీకు మంచివి. ok. అది కూడా బావుంది. నచ్చింది.
కానీ ఇది అర్ధం కాలేదు :
>> ఇక సామాజికంగా ఏది మంచి అనేది ఎవరు నిర్ణయిస్తారో అది నా చర్యల్ని influence చేసేవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది.దాని విస్తృతత్వం నా circle లోనే
ఉంటుంది.
3. ఈ క్రింది వాటిలో మీరు వేటితో ఏకీభవిస్తారో, వేటిని వ్యతిరేకిస్తారో చెప్పగలరా......ఏమో నా కన్ఫ్యూజన్స్ ఏమన్నా తీరిపోతాయేమో!! :)
తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి.
రోడ్డు మీద ఎడమ పక్కన ప్రయాణించాలి.
అన్నింటిపై, అందరిపై సమభావం కలిగుండాలి.
తల్లిదండ్రులే తమ పిల్లలను పెంచాలి.
భార్యభర్తలు అన్యోన్యమైన దాంపత్యం కలిగి, ప్రేమానురాగాలతో కాపురం చేయాలి.
తల్లిదండ్రులే పిల్లలని పెంచి పెద్ద చేయాలి.
దేశమును ప్రేమించాలి.
పని యిచ్చిన కంపెనీకి ద్రోహం చేయకూడదు
ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్‌డీడ్.
నలుగురికి మంచి చేయాలి. ఎవ్వరికీ చెడు చేయకూడదు.
దేవుడిని తిడితే కళ్ళు పోతాయ్.
ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడు.
దేవుడంటూ వేరే ఏమీ లేదు, ఈ విశ్వమే దేవుడు.
ఈ విశ్వమే లేదు. జగమే మాయా.
మానవుడే మాధవుడు.
మంచి చెడూ అనేవి లేనే లేవు.
ఉచ్చనీచాలు అనేవి లేనే లేవు.
అయినా సామాజిక బాధ్యత, సామాజిక ప్రయోజనం అని రెండు పదాలున్నాయి కదా....మీరు రెస్పాన్సిబిలిటీని బాధ్యతగా కాకుండా, ప్రయోజనం అని ఎందుకు
అనువదించారు!?
When your are writing your diary, it is YOUR PERSONAL & IT IS FOR YOU.
When you are writing something on a public wall(INTERNET), your writings should be with social responsibility.
You cannot get away from this.
Even though this post was labeled "vyakthigatham", I still commented because it talked and questioned SOCIAL RESPONSIBILTY.
@రేరాజు: నేను సామాజిక బాధ్యతను సామాజిక ప్రయోజనంగా "అనువదించలేదు". కేవలం ఆ బొమ్మకూ దానిపైనున్న caption కూ ఉన్న సంబంధమే నా బ్లాగుకీ సామాజిక ప్రయోజనానికీ ఉందనే ఉద్దేశాన్ని వెలిబుచ్చాను.
Pictures I place needn't be complimenting my post title. It can bring out more meaning than what I am intending to say in words.
సముద్రపు ఇసుకలో బొమ్మేసుకునే పిల్లాడికి ఏ సామాజిక బాధ్యత ఉంది? నా కోసం నేను రాసుకునే బ్లాగుకి సామాజిక ప్రయోజనం ఎందుకుండాలి? కొన్ని మనకోసం మనం చేసుకునే పనులుంటాయి.వాటన్నిటికీ ఒక ప్రయోజనం కావాలంటే అవి వ్యక్తిప్రయోజనాలే తప్ప సామాజికం కాదు.
ఇక మీరు ఉదహరించిన లిస్టు (లోని చాలా విషయాలు) నా circle of influence బయట ఉందని ఎందుకనిపించింది? మీరు చెప్పినవాటిల్లో అన్నీ universal truths కావు. వాటిల్లోనూ బోలెడంత relativity ఉంది. ఒకసారి చూసుకోండి. దాని గురించి చర్చించాలంటే మరో దీర్ఘచర్చ అవుతుంది.
@మలక్పేట రౌడీ: Choice of the words also make what I am. అవి లేకపోతే "నా’ బ్లాగు టపాలు ‘నాలాగా’" ఎలా ఉంటాయి?
When they have an alternative to disagree,dismiss or just ignore! Why should I take responsibility of people who get offended by choice?
I expect nothing from them. Then why do they want to REFORM me? I am not out here to convince them. Then why do they want to CONVERT me?
నిజమే సుమీ! చిత్రం సరిగా అర్ధం చేసుకోలేదు.
ఆ వాక్యాల్లో రెలటివిటీ ఉందని తెలిసే అడిగాను మహేష్. ఐనా క్లుప్తంగా చెప్పాల్సి వస్తే, ఏమని చెప్తాం!?
ఇలాంటివే మరో రెండు వాక్యాలు:
"మనిషికి సామాజిక బాధ్యత, సామాజిక ప్రయోజనం రెండూ ఉంటాయి."
"నా కోసమే నేను జీవిస్తాను - ఇట్స్ మై లైఫ్"
ఈ వాక్యాలన్నీ సమాజం యొక్క ప్రభావంలో వచ్చే ఆలోచనలే. అవి "సమాజం" అన్న ఆలోచనను ఉంచడానికే వచ్చిన ఆలోచనలు కూడా.
ఈ వాక్యం అర్ధం కాలేదు " ఇక సామాజికంగా ఏది మంచి అనేది ఎవరు నిర్ణయిస్తారో అది నా చర్యల్ని influence చేసేవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. దాని విస్తృతత్వం నా circle లోనే ఉంటుంది. "
అయినా ఏదో లే మహేష్..even I got bored with all this.Thanks for responding though.
Lastly,your posts do have a value in this blogging world.You have the status - like it or not.And its upto you to use it for good or bad, for yourself or for society.
You have carved a sphere of influence through the self created space.Think abt it.Surely the choice is always yours!
And there is no way to escape from getting influenced either!
Writing is a way of expression. This expression could convey anything and that reflects true freedom. Society is what you make of it. Pushing every action and trying to make it socially relevant is quite foolish. Individual freedom comes before social pressures!
మనకు నచ్చని వాడు కూడా మనలానే వుండాలి, మనలానే ఆలోచించాలి అని అనుకుంటూ వారికి వ్యతిరేకంగా విమర్శలు, వెటకారాలు ద్వారా ఆనందం పొందేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది.
మిమ్మల్ని విమర్శించే అధికారం వారికి ఎలా వచ్చిందో ఆలోచించి, అది కట్టడి చెయ్యండి.
>> "మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే...నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ‘నా’ బ్లాగు టపాల్ని ‘నాలాగా’ రాయటం"
అన్ని విమర్శలకీ ఓపిగ్గా బదులిస్తూ కూర్చోటం వల్ల కూడా కావచ్చు. ఇప్పుడిది రాసిందీ ఆ ప్రయత్నంలోనేనేమో.
నేను గత కొన్ని రోజులుగా మీ టపాలు చదువుతున్నాను. మీ ఆలోచనలు విచిత్రంగా ఉన్నాయి. అన్ని టపాలు చాల debatable. నేను చదివిన కొన్ని మీ టపాలు అలా ఉన్నాయి అన్నిటి సంగతి నాకు తెలీదు.
అయితే ఒక్కటి తెలుసు. బ్లాగు అన్నది మీ వ్యక్తిగతం కానే కాదు. ఎవరో ముందే చెప్పారు its not your diary అని. డైరి కి బ్లాగు కి తేడా గమనించండి కత్తి గారు. మీరు టపా రాసారంటే అది నచ్చని వాళ్ళు దాన్ని చీల్చి చెండాడుతారు ఆ హక్కు ఉంది వాళ్ళకి అని నా అభిప్రాయం. వాళ్ళ ఇష్టం వచ్చిన రీతి లో రియాక్ట్ అవుతారు దానికి మీరు సంసిద్ధంగా ఉండాలి తప్పదు.
కులం గురించి ఆలోచించడం అనేది ఒక skin infection (తెలుగు లో పదం ఏంటో తెలుసు గా!) లాంటిది. అది ఉన్న వాళ్ళకి ఎప్పుడు మనసు దాని మీదే ఉంటుంది. దురదే లక్ష్యం గోకడమే మార్గం అన్నట్టు గా. మనం గోక్కున్నా ఆనందమే ఎదుటి వాడు గోకినా ఆనందమే. ఆ ఇన్ఫెక్షన్ గోకినా కొద్దీ పెరుగుతుంది ఒళ్ళంతా పాకుతుంది తర్వాత మనల్నే నాశనం చేస్తుంది. అది ఉన్నంత వరకు వేరే సవాలక్ష విషయాల మీద మనసు మల్లదు, మళ్ళినా అది మల్లి గోకుడుకి దారి తీస్తుంది. అందుకే కుల చర్చని కుల --- తో పోల్చారు.
దాని గురించి ఆలోచించడం మానేయండి, అదే తగ్గిపోతుంది. అప్పుడు ప్రపంచం లో ఇంకా ఎన్నో రంగులున్నాయి అవన్నీ మీ బ్లాగులో రాసుకొని చూసుకొని మురిసిపోవచ్చు, నలుగురిని మురిపించోచ్చు. ఎన్నెన్నో సమస్యలున్నాయి వాటి గురించి అలోచించి అలోచిన్పజేయోచ్చు . సర్వే జనా సుఖినో భవంతు!
Prasanth.M garu,
society is not what we make of -- we are part of society and we are contributing to society every moment.
Nobody can compel others thoughts. When thoughts become actions (the action may be writing, speech or whatever that can be felt by senses), those actions definitely make others to think about those thoughts and question the owner of thoughts for their relevancy to society.
ఏదో సినిమాలో మహేష్ బాబు, నా రూములో నాకు నచ్చినట్లు చాలా ఫ్రీ గా ఉంటాను అంటూ గుడ్డలూడదీయబోతాడు.
ఎవరి రూములో వాళ్ళు గుడ్డలూడదీసుకోవడం ఎవరికీ అభ్యంతరం లేదు. నడి రోడ్డు మీద ఎవరూ ఆ పనిచేయవద్దనే అందరూ ఆశిస్తారు.
ఎన్ని ప్రపంచాలున్నాయిరా? ఒకడు ఇంకొకడిని ప్రశ్నించాడు. ఎవడి ప్రపంచం వాడిదే (వ్యక్తిగతం). ఉన్నది ఒకే ప్రపంచం (వ్యావహారికం).
వ్యక్తిగతంగా ఉన్నప్పటి శ్వేశ్చ, వ్యవహారికంలో కొంత పోతుంది.
అమెరికాలో రోడ్డు దాటాలంటే జీబ్రా క్రాసు దగ్గరే దాటాలి. రోడ్డంతా కాళీగా ఉన్నా దాటకూడదు. రోడ్డు మధ్యలో దాటడాన్ని జేవాకింగ్ అంటారు. కానీ రోజూ కొన్ని వందలమంది దాటుతుంటారు. పోలీసులు (పీస్ ఆఫీసర్స్) పట్టుకుంటే మాత్రం మాట్లాడకుండా ఫైను కట్టేస్తారు. అక్కడ అందరికి తెలుసు జేవాకింగ్ అంటె. చాలా చట్టాలను గురించి చిన్నప్పటి నుండే పాఠశాలలో వివరిస్తారు.
అలాగే అమెరికాలోని అదేదో రాష్ట్రంలొ ఆడవారి, మగవారి లోదుస్తులు ప్రక్క ప్రక్కనే ఉంచి ఆరుబయట ఆరవేయడం నేరం. (ఈనాడు ఆదివారం అనుబంధం లో వ్రాశారు). ఇలాంటి వింత చట్టాలను కూడా అమలులో ఉన్నంతకాలము, వాటిని సమాజ పరంగా గౌరవిస్తారు. చట్టం నచ్చకపోతే మార్పుకు చట్టబద్దంగా నినదిస్తారు, ప్రయత్నిస్తారు, మార్పు వచ్చేవరకూ ఉద్యమిస్తారు. కానీ చట్టం ఉన్నంతవరకూ దాన్ని గౌరవిస్తారు. చట్టాన్ని గౌరవించడమంటే సమాజాన్ని గౌరవించడమే.
కేవలం చట్టాలేకాదు, అలాంటివే మరికొన్ని సమాజంలో ఉన్నాయి.
డి ఫ్యాకో స్టాండర్డ్. అంటే చట్టం చేయకపోయినా సమాజంలో పాటిస్తున్న కొన్ని నియమాలు, కట్టుబాట్లు. ఇవి కూడా సమాజంలో వ్యవహారానికి చట్టంలాగే ఉపయోగించుకుంటారు.
De facto.. means "of the fact" or "in practice" but not ordained by law.
De jure.. By right; In accordance with the law.
నియమాలు, కట్టుబాట్లు చట్టంలో లేనంతమాత్రాన అవి పాటించాల్సిన అవసరం లేదంటామా.
చట్టాలకు మూలం నియమాలే. నియమాలను ప్రమాణీకరిస్తే చట్టాలౌతాయి.
చట్టాలన్నీ అందరికీ ఎలా ఆమోదం కాదో, అలాగే నియమాలుకాడా. కానీ క్రొత్త చట్టం వచ్చేవరకూ పాత చట్టాన్ని పాటించవలసినదే. క్రొత్త నియమం వచ్చేవరకూ పాతనియమం గౌరవించవలసినదే.
వ్యక్తి జ్ఞాన పిపాసి, స్వేశ్చాభిలాషి. ఇవి రెండూ ఎంతున్నా సరిపోవు, ఇంకా కావాలనిపిస్తుంటాయి. అందుకే క్రొత్త ఆలోచనలు, స్వేశ్చ వ్యక్తీకరణకు క్రొత్త మార్గాలు.
గే, లెస్బియన్ వివాహాలను సమర్ధించే వారు కూడా స్వేశ్చా వాదాన్నే ఆదారంగా చూపుతున్నారు.
అంతరంగంలో ఇవి అపరిమితం, కాని బాహ్యంగా ఇవి పరిమితం. బహ్యాంతర పరిధిని గుర్తించడమే విచక్షణ.
a2zdreams said...
manaku naccani vADu kUDA manalAnE vumDAli, manalAnE alOcimcAli ani anukumTU vAriki vyatirEkamgA vimarSalu, veTakArAlu dvArA Anamdam podEvALLa samkhya perugutummdi.
mimmalni vimarSimcE adhikAram vAriki elA vaccimdO AlOcimci, adi kattaDi cEyyamdi.
అవతలి వాడూ మనలాగే ఉంటే మనలాగే ఆలోచిస్తే ఇక సమస్యేమిటి. అంతా ఒకలాగే ఉంటే, మహెష్ గారు చెప్పినట్లు default గా ఉంటుంది. అపుడు మానవ ప్రగతే లేదు.
వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ భిన్నం, సమాజంలో అందరూ సమైఖ్యం, అదే ప్రగతికి ఆధారం.
విమర్శించే అధికారం మహేష్ గారే ఇచ్చారు (వ్యక్తిగత దూషణలు కాకుండా).
మహేష్ కుమార్ గారు,
I expect nothing from them. Then why do they want to REFORM me? I am not out here to convince them. Then why do they want to CONVERT them.. అన్నారు.
మిమ్మల్నెవరు మారమంటున్నారు, మిమ్మల్నెవరు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు?
మిమ్మల్ని మార్చడమంటే మీ అభిప్రాయాలను మర్చడమనేగా మీ ఉద్ధేశ్యం. ఏవరూ, ఏవరి అభిప్రాయాలు మార్చలేరు.
మన అభిప్రాయాలు మనమే తయారు చేసుకుంటాము. అవి పంచేంద్రియాల ద్యారా గ్రహించిన సమాచారము ద్వారా తయారవుతాయి.
కేవలం అలా సంపాదించిన జ్ఞానముతోనే మనసు ఆగిఫోదు. దానికి ఊహశక్తీ ఉంటుంది. ఆలాకాకుండా కేవలం పంచేద్రియ జ్ఞానం తోనే వ్యక్తిత్వం, అభిప్రాయాలు తయారవుతాయి అనుకుంటే, అపుడు అంతా రాయలసీమ ప్యాక్షనిష్టుల గొడవలకు కారణం లాగా తయారవుతుంది. (నేను ఇలా ప్రవర్తించడానికి, సమాజం కారణం, సమాజంలోని వ్యక్తులు అలా ప్రవర్తించడానికి మరలా సమాజం కారణం. ఇలా ఒకదానికొకటి కార్యకారణ సంబంధమౌతుంది)
మనలో జరిగే సమాచార సేకరణతో పాటు, ఊహాజనిత విశ్లేషణ కూడా తోడై మనసు తన ఆలోచనలను తనే విశ్లేషించుకుంతుంది.
కాలగతిలో సమాచారమూ మారుతుంది, విష్లేషణా శక్తిలోనూ తేడా వస్తుంది, తద్వారా ఆలోచనలూ మారతాయి, వ్యక్తిత్యమూ మారుతుంది. పుట్టినప్పటి నుండి ఇప్పటివరకూ మనలో మార్పు జరుగుతూనేఉంది. మార్పు లేని, రాని వారు ఎవరూ ఉండరు.
ఇప్పుడు మనమద్య జరిగేదంతా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమే.
hey Mahesh, chala kathale jarugutunnayi.
Keep writing what you believe is right, we have to trust our experience there is no other way.
ఏ మార్పు ఒక్క రోజులోనో ఒక్క రాత్రిలోనే రాలేదు. అది ఒక నిరంతర ప్రక్రియ. సమాజం ఏ రోజూ అందరికీ నచ్చినట్టుగా లేదు. ఎవరైతే influence చేయగలరో వారికి అనుగుణంగానే నడిచింది. ప్రక్క వాడిని మంచి మనసుతో చూడవలసిన అవసరం వాడి కోసం కాదు మనకోసం. ఇక బ్లాగులన్నీ చదవడం, రాయడం నా దృష్టిలో భావాలు పంచుకోవడం, మనమెవరో తెలియకున్నా, ఎదురుగా లేకున్నా నా భావాలతో చర్చించుకొనే చక్కటి అవకాశం. దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే అది blogger & respondent ల మధ్య చర్చ మీద ఆధారపడి ఉంటుంది. నాకు బ్లాగు గురించి తెలిసినపుడు, నేను చాలా కాలంగా నాకు నచ్చినట్టుగా రాసుకొని, ఎవరికైనా చూపిస్తే quality లేదంటారని దాచేసుకున్నవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు, అప్పుడు అవి నచ్చిన వారే నాకు friends అవుతారు అనుకున్నాను. కానీ మహేష్ గారిని చూసాక శత్రువులు కూడా అవుతారని తెలిసింది. దీనిమీద ఎంత చర్చ జరిగినా, ఎవరి ప్రతిభను వారు చూపించుకోవడం తప్ప, పెద్దగా inspire అవ్వరు.
"You can Win" అనే పుస్తకంలో Shiv Khera ఇలా అంటారు "ఒక సామాన్య దొంగ ఒక భోగీని తప్పించాలనుకుంటే, ఒక చదువుకున్న దొంగ మొత్తం రైలునే తప్పించాలనుకుంటాడు".
Let us enjoy through the blogs, share and if possible learn. If you have a problem, just discuss on the topic without emotions let us not blame each other personally.
"అసమర్ధుని ఆఖరి ఉపాయం హింస" అంటారు గాంధీజీ. Let us not loose ourselves till we become violent.
@అబ్రకదబ్ర: ఈ టపా నా ఆలోచనల్ని సమీకరించుకునే ప్రయత్నమే తప్ప explanation కాదు.
Post a Comment