నాకూ ఆమెకూ మధ్య జరిగే
ఈ అంతిమ ప్రయాణానికి ముందు
ఎన్ని రూపులు వశించిందో
ఎన్ని చేతులు సృజించాయో
ఎందరు పురుషులు స్పృశించారో
అగమ్యమైన గమనంతో
తను నన్ను చేరినప్పుడు
నిశ్చలంగా పరికించాను
ఈ అనంతంలోని
ఘటనను పూరించడానికి
నన్ను తనలో కలుపుకున్నప్పుడు
అబ్బురపడి పులకించాను
ఆద్యంతాల్ని సృష్టించిన
ఆ ఆదివిస్ఫోటం మొదలు
నేనూ...ఆమె...ఆమె...నేను
ఈ ఉదంతం కోసమే కదా ఎదురుచూసింది!
****
11 comments:
baaah !
nice simple ha chala baga cgeppaaru
బాగుంది కానీ పంటి కింద రాయిలా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్.
చాలా లోతు గా వుందండి.. కవిత్వం లో విస్ఫోటనం
anu visphotanam jarigimdi mee kavita chadavagaane. hrudaya sangamam yokka teevratanu feel ayyanu. thanks.
మీ కవిత విస్ఫోటనం తొ ఒక్కసారిగ ఉలిక్కిపడేలా చేసారు..! బాగుంది మాస్టారు...!
ఏమిటిది? ఏవిటిది? ఏదో తెలియనిది. ఎప్పుడూ తలవనిది ఏమిటిది?
ఆ సంగమాలు ఎన్ని సాగించినా చిరకాలం తను, నేను వున్నా లేకున్నా ఇద్దరి మనసుల్లో మిగిలేది మాత్రం తలపే... అందుకే..
******************
నా దేహం మనసా వాఛా ఎన్నడో అయింది నీలో మమేకం.
ఆ సంభవానికి గుర్తు మన సాంగత్యమో, సంగమమో కాదు,
కలలో మెలకువలో తన ఉలికిపాటుకు మూలమైన నీ తలపే. - (ఇంకా వెలుగు చూడనిది.)
**************
నేను నీతో కలిసి సప్తసాగరాలు ఈదేసాను, సఫలీకృతురాలనయ్యాను.
సప్తస్వరాలు అలాపించేసాను, సుస్వర గానాలు చేసాను, సప్తపదింకేలనన్నాను.
సప్తర్షిమండలాలు తిరిగి వచ్చాను, సంతృప్తి సంహితనయ్యాను.
సప్తవర్ణ స్వప్నాలు కన్నాను, గాఢమైన సుషుప్తి చెందాను. (నా మదే గువ్వగా నీ అరచేత వాలింది http://maruvam.blogspot.com/2009/04/blog-post_05.html)
హహ్హహ్హ.
@గీతాచార్య: ఈ మధ్య నా కవితలకు మీ మోనోసిలబల్ స్పందనలు పరిపాటి అయిపోయాయి. వాటి అర్థమేమిటో కూడా కొంత వొశదపరిస్తే ఉపయోగకరంగా ఉంటుందేమో!
@ఉష:మీ కవిత చాలా బాగుంది.
@కొత్తపాళి:"baaah !" అనునది ఏమి స్పందనా శబ్దం చెప్మా!
అగమ్యమైన గమనంతో
తను నన్ను చేరినప్పుడు
నిశ్చలంగా పరికించాను
అగమ్యమైన గమ్యం అనే భావన చాలా అందం గా వుంది..
Post a Comment