Monday, June 8, 2009

వ్యభిచారం : చట్టవ్యతిరేకం Vs అనైతికం

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారం మన దేశంలో 2.8 మిలియన్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 36% ఈ వృత్తిలోకి పద్దెనిమిది సంవత్సరాలు నిండకముందే ప్రవేశించారు (బహుశా బలవంతంగా ప్రవేశపెట్టబడ్డారు). కొన్ని స్వచ్చంధ సంస్థల లెక్కల ప్రకారం సెక్స్ వర్కర్ల సంఖ్య 15 మిలియన్లు. ఒక ముంబై నగరంలోనే లక్షమంది వరకూ సెక్స్ వర్కర్లు ఉన్నారని ఒక అంచనా.

1956 ఏర్పడిన The Immoral Traffic (Suppression) Act (SITA) చట్టం వ్యభిచారాన్ని చట్ట విరుద్ధం చేయకపోయినా, పబ్లిక్ స్థలాల్లో విటుల్ని ఆకర్షించకూడదనే క్లాజ్ ఆధారంగా పోలీసులు సెక్స్ వర్కర్లను వేధించడానికి ఉపయోగించుకుంటూ పరిస్థితుల్ని అత్యంత దయనీయమైన స్థితికి తీసుకువచ్చారు. చిత్రంగా ఈ చట్టంయొక్క ఉపనామం "సీత". పోలీసులు పబ్లిక్ ఇండీసెన్సీ, పబ్లిక్ న్యూసెన్స్ లాంటి అర్థంకాని, చట్టప్రకారం నిర్వచింపలేని పదాల్ని ఉపయోగించి సెక్స్ వర్కర్లపై కేసులు బనాయించిన ఘటనలు కోకొల్లలు. ఈ నేపధ్యంలో చట్టాన్ని రక్షించేవారి చేతులనుంచీ రక్షణకల్పించమని సెక్స్ వర్కర్లు ఉద్యమాలు చేశారు. ఇక భారతదేశంలో పిల్లల్ని పడుపు వృత్తిలోకి దించే సమస్య అత్యంత విస్తృతం,అమానుషం. మన దేశంలోని 378 జిల్లాలలో మానవ ట్రాఫికింగ్, ముఖ్యంగా పిల్లల ట్రాఫికింగ్ ఏదో ఒక స్థాయిలో జరుగుతోందనే నిజం ఈ సమస్య విస్తృతత్వానికి నిదర్శనం.

ఈ పరిస్థితుల్లో HIV/AIDS వ్యాప్తి ప్రపంచం మొత్తాన్ని వణికించినట్లే భారతదేశాన్నీ పట్టిపీడిస్తోంది. ఈ వ్యాధి వ్యాప్తిలో సెక్స్ వర్కర్ల పాత్రను గుర్తించి Targeted Interventions (TIs) పేరుతో చాలా కార్యక్రమాల రూపకల్పన చెయ్యడం జరిగింది. వ్యాధి వ్యాప్తిలో వీరి పాత్రను వ్యాధి నిరోధక దిశగా మళ్ళించకపోతే అత్యంత ప్రమాదకారిగా మారుతుందన్న నిజాన్ని గ్రహించిన ప్రభుత్వం, సెక్స్ వర్కర్ల సమూహాలను సంఘటిత పరిచి లైంగిక విద్యద్వారా HIV/AIDS వ్యాప్తిని నిరోధించే కార్యక్రమాలను చేపట్టింది.

ఈ నేపధ్యంలో "మానవహక్కుల" ఆధారంగా ఉద్భవించిన డిమాండ్, ‘సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణ’. ఈ ప్రతిపాదనను చాలా మంది వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించడంగా అర్థం చేసుకోవడం అవగాహనాలేమి తప్ప మరొటి కాదు. భారతదేశంలో పడుపువృత్తి చట్టవ్యతిరేకం ఎప్పుడూ కాదు. Law actually "does not criminalise prostitution or prostitutes per se, but mostly punishes acts by third parties facilitating prostitution like brothel keeping, living off earnings and procuring, even where sex work is not coerced". అంటే, ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఉన్న చట్టాన్ని మరింత మానవీయం చెయ్యడానికి జరిగే యత్నమే తప్ప మరొటి కాదు. "Denial of equality of the rights and opportunities and of dignity and of the rights of equal protection against any discrimination of fallen women is violation of Universal Declaration under Article 7 and as well as Article 14 of Indian constitution" ఆధారంగా జరగనున్న ఒక corrective measure మాత్రమే. ఈ చట్టంలో ఉండబోయే మార్పల్లా "The emphasis IS NOT on the sex worker but the clients/pimps/brothel owners etc". అంత మాత్రానికే ఇన్ని వాదప్రతివాదనలు తయారవడం చూస్తుంటే కొంత అశ్చర్యం మరికొంత బాధా కలుగుతోంది.

ఈ కొత్తచట్టం వలన వ్యభిచారం మరింత మెరుగ్గా రెగ్యులరైజ్ చెయ్యబడుతుంది. తద్వారా వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టబడుతున్న వారి సంఖ్యతగ్గి హ్యూమన్ ట్రాఫికింగ్ వలయాలు చేధింపబడతాయి. ముఖ్యంగా పిల్లలు వ్యభిచార వృత్తిలోకి రాకుండా కాపాడగలుగుతాము. సెక్స్ వర్కర్ల అమానుష జీవితాలు ఉద్ధరింపబడతాయి. ప్రత్యామ్న్యాయ జోవనోపాధుల సృష్టిద్వారా గౌరవప్రదమైన జీవితాల్ని జీవించడానికి బయటికొచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. HIV/AIDS వ్యాప్తిని నిరోధించే అవకాశాలు మెరుగుపడి ప్రజారోగ్యంపై అనుకూల ప్రభావం పడుతుంది.

వ్యభిచారాన్ని హఠాత్తుగా (సమూలంగా) రూపుమాపాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆచరణయోగ్యంకాని ఆదర్శం. ప్రపంచంలో ఏ దేశమూ వ్యభిచారాన్ని సమూలంగా రూపుమాపిన దాఖలాలు అసలు లేవు. అయినా సరే, ఈ మహత్తర ఆదర్శాన్ని పూరించాలంటే మొదటగా ప్రస్తుతం ఉన్న సమస్యలకు సమాధానాలు వెతకాలి. ఆ దిశగా ప్రతిపాదిత చట్టం ఒక ముందడుగు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా, చట్టపరమైన, మానవహక్కుల పరమైన కోణాల్ని విస్మరించి కేవలం "నైతికత" కోణంలోంచీ ఈ సమస్యను చూడటం అర్థరహితం. పైగా ఈ "చట్టబద్ధత" కుటుంబ విలువలకు గొడ్డలిపెట్టుగా వర్ణించబూనటం అసమంజసం.

ఈ మొత్తం వ్యాసంలోకూడా మేల్ ప్రాస్టిట్యూషన్ - మగ పడుపువృత్తిని గురించి ప్రస్తావించకపోవడం మన భారతీయ పురుషాహంకార సెక్సిస్ట్ నేచర్ కి ఉదాహరణేమో!

*****

13 comments:

భావన said...

"ఈ "చట్టబద్ధత" కుటుంబ విలువలకు గొడ్డలిపెట్టుగా వర్ణించబూనటం అసమంజసం." సరే అలా వ్యవస్త ను విలువలను కాపాడే వాళ్ళు అలా బుజాన వేసుకుని భాదపడతారనుకోండి.. అది పక్కన పెడితే ఇలా వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే దానిని అదును గా తీసుకుని రాజకీయం దాన్ని కూడా సొమ్ము చేసుకుంటుందేమో అని నా అభిప్రాయం. అదీ కాక అందులో వున్న వాళ్ళు బయటకు రావటానికి (అంటే ఇష్టమైతే) ఇంకా కష్టమవుతుందేమో, అలాగే బలవంతం గా ఆ పని లోకి తోసి వెయ్యబడే వాళ్ళు (అంటే చిన్న పిల్లలను ఎత్తుకు పోవటం వంటివి) ఎక్కువ అవుతారేమొ కదా... ఆ కోణం నుంచి కూడ ఆలోచించాలేమో ఈ బిల్ ప్రవేశ పెట్టేప్పుడూ..

Praveen's talks said...

ఇప్పుడు పట్టణాలు, హైవే పక్క గ్రామాలలో మాత్రమే వ్యభిచారం కనిపిస్తోంది. మారుమూల పల్లెటూర్లలో ఉండేవాళ్ళకి వ్యభిచారం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యాలంటూ పేపర్లలో గొంతెత్తి చాటేవారి ప్రకటనలు చదివితే మారుమూల పల్లెటూరివాడికి కూడా వ్యభిచారం గురించి తెలిసిపోతుంది. వ్యభిచారం చట్టబద్దం చేస్తే ప్రతి గ్రామంలో వ్యభిచార గృహాలు వెలుస్తాయి. ఇప్పుడు పట్టణాలలో క్షీణించిన కుటుంబ విలువలు రేపు పల్లెలలో కూడా క్షీణిస్తాయి.

కత్తి మహేష్ కుమార్ said...

@ప్రవీణ్: మీ ప్రతిపాదన చాలా juvenile గా ఉంది.

వ్యభిచారాన్ని ప్రభుత్వం ఎప్పుడో చట్టబద్ధం చేసింది. ఆ చట్టంలో కొన్ని మానవీయమైన మార్పులు తీసుకురావడం మాత్రమే ఇప్పుడు జరుగుతోంది. "అందరూ వ్యభిచరించండి" అని ఎవరూ ప్రకటనలు ఇవ్వడం లేదు. ఉన్న వ్యభిచారాన్ని వ్యవస్థీకరణ చెయ్యటం ద్వారా జరుగుతున్న డ్యామేజిని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతోంది.

కుటుంబాల విలువల క్షీణతకు వ్యభిచారానికీ పట్టణాల్లోనూ పల్లెల్లోనూ సంబంధం లేదు. మీ అపోహలతో భయాల్ని కొనితెచ్చుకోక సరైన సమాచారాన్ని పొందే ప్రయత్నం చెయ్యండి.

@భావన:ఒక comprehensive solution కావాలనటంలో సందేహం ఏమాత్రం లేదు. ఇది ఒక అడుగు మాత్రమే. మరిన్ని ప్రయత్నాలు త్వరలో ఈ దిశగా ఉంటాయని ఆశిద్ధాం.

అబ్రకదబ్ర said...

హోమోలు, వ్యభిచారుల హక్కుల గురించిన పోరాటాలు కడుపు నిండిన దేశాల ప్రజలకి చెల్లే విషయాలు - మనక్కాదు. దేశంలో ఇంతకన్నా తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి రాయటానికి మీ శక్తియుక్తులు వాడితే బాగుంటుంది.

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర: వ్యభిచారం భారతదేశంలో కూడా "కడుపు"కు సంబంధించిన విషయమే.ఇక్కడ అది ఆకలికి సంబంధించినది లెండి.

ఈ వ్యాసం వ్యభిచారుల హక్కులకు సంబంధించింది మాత్రమే కాదు.హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్,సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్, ఎయిడ్స్ కంట్రోల్, హ్యూమన్స్ రైట్స్ వంటి ఎన్నో విషయాలకు సంబంధించింది. మీకివన్నీ తీవ్ర సమస్యలుగా కనబడకపోవడం విచారకరం.

Praveen's talks said...

వేశ్యలకి ఆల్టర్నేటివ్ ఉపాధి చూపించడం చేతకాని వాళ్ళే వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యాలని డిమాండ్ చేస్తారు.

Anonymous said...

అస్సలు కిక్కెక్కలా. ఇట్టాంటియి రాచ్చే యెవురు జదువుతారు సోమీ నీ స్టయిల్లో పురాణాల్లో ప్రాస్టిట్యూట్సులు - ఒక సైద్ధాంతిక చారిత్రిక యిశ్లేషన అని ఒకటి యిడుసు భలే రంజు గా ఊంటాండ్లా

Anonymous said...

Very well said, i appreciate your analysis

అబ్రకదబ్ర said...

హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్య గురించి ప్రస్తావించారు, బాగానే ఉంది. మీ టపా ముఖ్యోద్దేశం పడుపువృత్తిని చట్టబద్ధం చెయ్యమనే కదా. సమస్యకి పరిష్కారం అది కాదు. అప్పుడు ట్రాఫికింగ్ తగ్గొచ్చేమో కానీ మరో వంద కొత్తసమస్యలు పుట్టుకురావా? అది చట్టబద్ధమైతే - చీర్‌లీడింగ్ పేరుతో బట్టలిప్పుకుని గంతులేయటాన్ని ఓ కళగా, ఉపాధి అవకాశంగా ఊదరగొడుతున్న మహానుభావుల్లాంటోళ్లు మరో వెయ్యిమంది బయల్దేరి - అందమైన అమ్మాయిలకి వ్యభిచారమే అద్భుతమైన ఉద్యోగం అని ప్రచారం చెయ్యటం మొదలు పెట్టరా? వాళ్ల కోసం ప్రత్యేకమైన రిక్రూటింగ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్, టీవీల్లో ప్రకటనలు, వగైరా, వగైరా మొదలవవా? పోలీసుల దోపిడీ అరికట్టే మార్గం అనైతికతని చట్టబద్ధం చెయ్యటం కాదు - పోలీసు శాఖలో సంస్కరణలు తేవటం, వేశ్యల కాలే కడుపులు చల్లార్చే ఇతర మార్గాలు చూపటం. సమస్య ఒకటైతే పరిష్కారం మరోటి చూపుతున్నారు మీరు.

Praveen's talks said...

టి.వి.లోని "ఆట" కార్యక్రమంలో మాటలు సరిగా రాని పసిపాప చేత డబల్ మీనింగ్ పాటకి నాట్యం చెయ్యించడం చూసాను. తల్లితండ్రుల అనుమతి లేకుండా పిల్లల చేత నాట్యం చెయ్యించడం సాధ్యం కాదు కనుక తల్లి తండ్రుల ప్రమేయం లేకుండా ఆ అశ్లీల నాట్యం జరిగిందనుకోలేం. పాప డాన్సర్ గా రాణిస్తే ఆమెకి సినిమాలలో అవకాశం వస్తుందని తల్లితండ్రుల ఆశ. అందుకే వాళ్ళు నైతిక విలువలు పట్టించుకోలేదు. అశ్లీల నాట్యాలకి శిక్షణ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసిన తరువాత విటులని ఎలా ఆకర్షించాలో వేశ్యలకి శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా తెర మీదకి వస్తారు.

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర: ఇక్కడ ప్రతిపాదన నాది కాదు. వ్యభిచార సమస్యపై విస్తృతమైన చర్చల తరువాత, భారత ప్రభుత్వం The Immoral Traffic (Prevention) Amendment Bill, 2006 లోప్రతిపాదించిన విషయాల గురించి మాత్రమే నేను వివరిస్తున్నాను. కొందరి అపోహలకు సమాధానం మాత్రమే ఈ టపా.వీలైతే ఆ బిల్ గురించి కొంత తెలుసుకోండి. ఇంటర్నెట్ లో చాలా సమాచారం లభించగలదు.

మీరు చాలా విషయాల్ని కలగలిపి నైతికతతో ముడిపెట్టి భాధపడిపోతున్నారేమో ఒకసారి గమనించండి. మీ వ్యాఖ్యనొకసారి మళ్ళీ చదువుకోండి.

@ప్రవీణ్: ఈ విషయంపై కొంత కనీస జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆ తరువాత మీతో చర్చించడానికి నేను సిద్ధం. ఇప్పుడు మీరు చేస్తున్న వాదన మాత్రం అత్యంత హాస్యాస్పదం మరియూ పిల్లచేష్టలు అని మాత్రం చెప్పగలను.

మధుర వాణి said...

interesting and informative article.!

Vinay Chakravarthi.Gogineni said...

no use ...chattala valana emee kaadu.........endukante avi kondarike chuttalu kaabatti........
emo alochinchali meeru cheppinadaanni...........adi aakaliki sambandhinchindi kaabatti first akkada choodali....
ika hitech prostitution ki vaste enni vachhina adi aagadu........adi ante........