Monday, June 22, 2009

ముసుగుదొంగ రూపాలు...మూడోసారి!


‘నువ్వు బ్రాహ్మణుల్ని (as a collective community !) నిందించావు కాబట్టి నిన్ను నిందించడం సరైనదే’ అనేది కొందరి వాదన. ఆ వాదన ఎంత పేలవంగా ఉందో అలా వాదించేవాళ్ళకు అస్సలు అర్థం కాదు. ఎందుకంటే సైద్ధాంతిక విభేధానికీ వ్యక్తిగత నిందకూ తేడా తెలీని లోకంలో వీరు విహరిస్తున్నారు. ఉదహరించిన నా వ్యాఖ్య "ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది" అనేది. ఇందులో చారిత్రక సత్యమేతప్ప నిందెక్కడుంది?

అయినా బ్రాహ్మణుల్నందర్నీ పేరుపేరునా నిందిండానికి అసలు వీలయ్యే పనేనా! అలా చెయ్యాల్సిన అవసరం నాకేమైనా ఉందా? ఏదో ఒక సైద్ధాంతిక చర్చలో కొంత చరిత్రను ఉటంకించి కులవ్యవస్థను కాపాడటంలో/వ్యవస్థీకృతం చెయ్యడంలో బ్రాహ్మణుల పాత్ర గురించి చెప్పాను. అది మొత్తంగా ప్రస్తుతం జీవిస్తున్న బ్రాహ్మణులందరినీ అవమానించినట్లు అనుకోవడం వ్యక్తుల మూర్ఖత్వంగానీ దానికేమన్నా ప్రాతిపదికుందా? అసలు దానివలన నాకొచ్చే లాభమేమైనా ఉందా? బ్రాహ్మణ బ్యాషింగ్ కనీసం పొలిటికల్ స్లోగన్ గా కూడా చచ్చిపోయి నాలుగు సంవత్సరాలౌతోంది. అలాంటిది దానివల్ల నేను పొందే మైలేజ్ ఏమిటి! ఇవన్నీ ఎవరికీ తోచవు. ఎందుకంటే కొందరిలో తర్కం చచ్చి కేవలం ద్వేషంతో కళ్ళను బైర్లుగమ్మింది.

కుల వ్యవస్థ గురించి సమగ్రమైన శాస్త్రీయ పరిశోధనలు బ్రిటిష్ సమయంలోనే జరిగాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది Louis Dumon’s Hierarchicus. దాని ప్రకారం భగవద్గీతలో చెప్పబడిన చాతుర్వర్ణం మనుస్మృతిలో నిబద్ధీకరింపబడింది. దాన్నే వర్ణాశ్రమధర్మం లేక మనుధర్మంగా చెప్పుకుంటాం. కాలక్రమంలో అవర్ణం లేక పంచమవర్ణం అని ఒక కొత్త వర్ణం పుట్టుకొచ్చింది. ఇలా hereditary specialization, hierarchy and repulsion అనే మూడు మూలాల్లోంచీ మొత్తం వర్ణవ్యవస్థ స్థిరీకరించబడింది. ఈ పరిశోధనకు ఆధారం, అప్పుడు లభ్యతలో ఉన్న సంస్కృత పుస్తకాలు/ సాహిత్యం. ఆ సమయంలో సంస్కృతం బ్రాహ్మణ క్షత్రియులకు తప్ప అన్యులకు అందుబాటులో ఉండేది కాదు. ముఖ్యంగా మతానికి సంబంధించిన అన్ని రచనలూ బ్రాహ్మణులే చేపట్టారు. కులాన్ని వ్యవస్థీకరించి ఆంక్షలు పెట్టడంలో, ముఖ్యంగా పంచముల్ని అత్యంత అధమస్థాయిలోకి నెట్టడంలో బ్రాహ్మణ రాతల పాత్ర ఎవ్వరూ కాదనలేనిది. ఈ విషయంలో భారతదేశంలోని అందరు సామాజిక శాస్త్రవేత్తలకు అంగీకారం ఉంది. కొందరు దీన్ని అంగీకరించనంత మాత్రానా చరిత్ర- శాస్త్రీయతలకొచ్చిన నష్టం ఏమాత్రం లేదు. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది state అంగీకరించిన "నిజం". ఈ నిజాన్ని ఎక్కడ చెప్పినా "నేరం" కాదు.

ఈ విషయంలో నాతో విభేధించే హక్కు అందరికీ ఉంది. వాదించే అధికారం అందరికీ ఉంది. నేను చెప్పేది శుద్ధ అబద్ధం అని, కొత్తగా ఎమైనా ప్రతిపాదనలు చేసే అవకాశం అందరికీ ఉంది. తమతమ బ్లాగుల్లో నేనొక బ్రాహ్మణద్వేషిగా, హిందూద్వేషిగా అభివర్ణించుకునే సౌలభ్యం అందరికీ ఉంది. కానీ....కానీ.... గోపాలరాజు అలియాస్ ప్రసాద్ అలియాస్ కురియన్ అలియాస్ భాస్కరరామరాజు కు నన్ను "హయ్దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో రిజర్వేషన్ తో పీజీ చేయంగనే ఓ కొమ్ములేం రావు. ఊర్కే రెచ్చిపోమాక" అనే అధికారంమాత్రం అస్సలు లేదు. పైగా దాన్ని నేరంగా పరిగణించడానికి నాకు హక్కుంది.

కొందరి వింతైన వాదన ఏమిటంటే, "ఆ వాక్యాల్లో కులప్రస్తావన లేదుకదా మరి కేసెలా అవుతుంది" అని. OK కులప్రస్తావన కాకుండా కుల అవహేళన కాకుండా ఈ వాక్యంలో మరే ఇతర అర్థం ఉండే అవకాశం ఉందో మొదటగా చూద్ధాం.

Option 1: వికలాంగులకిచ్చే రిజర్వేషన్తో చదివావు కాబట్టి నువ్వు గొప్ప కాదు.
Option 2: కేవలం సెంట్రల్ యూనివర్సిటీలో చదివినంత మాత్రానా కొమ్ములు రావు. కాబట్టి ఎగిరెగిరి పడకు.
Option 3: కేవలం కులం ప్రాతిపదికన లభించిన రిజర్వుడు సీట్లో పీజీ చెయ్యగానే నువ్వు గొప్పోడివి కావు. ఎందుకంటే నీకది అయాచితంగా,అర్హత లేకుండా దొరికింది. కాబట్టి ఊరికే ఎగిరెగిరిపడక సైలెంటుగా కూర్చో.
Option 4: ఏదీ కాదు.


నాకైతే మూడో ఆప్షన్లోనే బలముందనిపిస్తోంది. "ద్వేషం + ఆభిజాత్యం = వివక్ష" కోణంలోనే నాకు కనిపించింది.

ఇక ఈ విషయంలో చట్టం గురించి. THE SCHEDULED CASTES AND THE SCHEDULED TRIBES (PREVENTION OF ATROCITIES) ACT, 1989 "3.(x) intentionally insults or intimidates with intent to humiliate a member of a Scheduled Caste or a Scheduled Tribe in any place within public view;" అనేది చట్టం.

భారతీయ రాజ్యంగంచే నాకు కల్పించ బడిన హక్కుని హేళన చేసి. రిజర్వేషన్ లభించే కులంలో పుట్టానుగక నన్నొక అనర్హుణ్ణిగా ఎంచి అవమానించడానికి కాక, ఎత్తుకుని ముద్దెట్టడానికి వీరు వ్యాఖ్య రాశారని నేను నమ్మలేను. ఆ వ్యాఖ్యలో అటువంటి అవాజ్యమైన ప్రేమ నాకు కొరవడినట్లు కనడుతోంది. దొంగపేరుతో రాయడం ఖచ్చితంగా ఉద్దేశపూర్వకం. ఇప్పుడు కూడా ‘నేనే రాశాను ఏంచేస్తావో చేసుకో’ అన్నట్లుగా ఎలుగెత్తి చాటుతున్నారు. కనుక చట్టప్రకారం అతనిపై నేరారోపణ చేసే హక్కు నాకుందని నమ్మాను. నమ్ముతున్నాను. ఇక వెబ్ పత్రిక అనేది ఒక "పబ్లిక్ వ్యూ" అనేదాన్ని ఎవరూ విభేధించలేరు.

--------------------------------------------------------------------------------------------------------

ఇక అసలు విషయానికి వద్ధాం. ఈ ముసుగుదొంగ గారికి మరో పేరుందండోయ్ ఆపేరు కొంచెం వెలుగుతూ ఉంటుంది. "సూర్యకిరణ్". మిషనరీలూ,ముల్లాలూ అంటే వీరికి పరమ అలెర్జీ. బ్రాహ్మణుల్ని ఎవరైనా ఏమైనా అంటే పరమ చిరాకు. ఉండాల్సిందే! హిందువుల భూముల్ని క్రైస్తవ ముఖ్యమంత్రి లాగేసుకుంటున్నాడని తెగ బాధపడిపోతారు. రైటే!

కాకపోతే దొంగ పేర్లతో, తప్పుడు ఈ మెయిల్స్ తో ఇవన్నీ రాస్తుంటారు. ఎవర్నైనా తిట్టాలన్నా, అవమానించాలన్నా ఇలా దొంగదారులు పట్టేస్తుంటారు. లేకపోతే తన బ్లాగులో ఈయన ఉదాత్తంగా వేసుకునే ఒక యోగి ముసుగుకి దెబ్బకదా. వేదాలు వల్లిస్తారు (అచ్చు ఆ సామెతలాగే). గాయత్రిని జపిస్తారు. పద్యాల్ని రచిస్తారు. ఇతరులు కవితలు రాస్తే వాటిని గర్హిస్తారు. ముఖ్యంగా దళితులెవరైనా రాస్తే "పోనీ ఏమైనా కవితా?" అని ప్రశ్నిస్తారు. చాలా ఉద్దాత్తరూపుడు. ఉదారస్వభావుడూ. యోగి. ఋషి. పల్నాటి వీరుడు. వేదసంహితుడు. ఇంకా ఎన్నెన్నో.
--------------------------------------------------------------------------------------------------------

"చెప్పాల్సింది చాలా ఉంది. చూడాల్సిందింకా మిగిలే ఉంది."

******

11 comments:

Anonymous said...

@నాకైతే మూడో ఆప్షన్లోనే బలముందనిపిస్తోంది. "ద్వేషం + ఆభిజాత్యం = వివక్ష" కోణంలోనే నాకు కనిపించింది.

బ్లాగులలో వాదనలకు, చర్చలకు నేను దూరం మరియు నేను ఫాలో కాను కాబట్టి వాటి తీవ్రత నాకు తెలియదు. కానీ మీ బ్లాగును రోజు ఫాలో అవుతాను. మీ అన్నీ అభిప్రాయాలతో అంగీకరించలేను కానీ మీ రైటింగ్ శైలికి దాసుడిని. మీ బ్లాగు ఫాలోయర్ గా నా రిక్వెస్ట్.

వాదనలలో, చర్చలలో నోరు జారడం సహజం. వాటిని అంతటితో వదిలేస్తేనే మంచిది. చిన్నప్పడు ఆటలకు బయటకు పంపించేటప్పుడు ముందే చెప్పేవారు "ఆటలలో తగిలే దెబ్బలు అక్కడే మర్చిపోవాలి, ఇంకొకరి మీద కంప్లైట్ చెయ్యకూడదని". ఇది కూడా అంతే.

ముసుగు వేసుకొచ్చి వ్యక్తిగత దూషణలు మత/కుల కోణంలో చెయ్యడం క్షమించదగినది కాకపోయినా, ఇంతటితో వదిలెయ్యాలి అని నా మనవి. మీకు దేవుడు చాలా చాలా ఓపిక ఇచ్చాడు అనుకుంటూ వుంటా. అదే కంటిన్యూ చెయ్యండి. మీ ఆలోచనలు, వ్రాతలే ఆయుధాలుగా మంచి టపాలతో మీపై వున్న దురాభిప్రాయలను , ద్వేషాలను వేటాడండి.

Kathi Mahesh Kumar said...

@Malakpet Rowdy & కొండముది సాయికిరణ్ కుమార్: మీ చరిత్ర విశ్లేషణ జ్ఞానం చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీ మితజ్ఞానాన్ని ఒక ఉదాహరణద్వారా వివరించుకుందాం ! Get ready for a social history research methodology lesson.

ఒక సమాజంలో... ఉదాహరణకు తెలుగు సమాజంలో పెళ్ళి సాంప్రదాయాల అవిర్భావాన్ని గురించి పరిశోధించాలనుకున్న ఇద్దరు పరిశోధకులున్నారు. ఒకటి మీరు. మరొకటి నేను. పరిశోధన మొదలెట్టగానే "పెళ్ళి" ప్రస్తావన/వర్ణన ఏఏ పురాతన తెలుగు గ్రంధాల్లో ఉందో మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ‘మొల్ల’రామాయణంలో రాముడూసీతల పెళ్ళి వివరణ దొరుకుతుందనుకోండి. అందులో సీతారాముళ్ళని పట్టుపీతాంబరాలు కట్టి, నుదుటిన తిలకందిద్ది,కళ్ళకు కాటుకపెట్టి,ముంజేతికి కంకణాలు తొడిగి తయారుచేసి. సీత సిగ్గులమొగ్గవుతుంటే మంగళవాయిద్యాలూ వేదపండితుల మంత్రఘోష మధ్య రాముడు మాగళ్యధారణ గావించాడు అని కనబడింది.

అప్పుడు మీరు "యురేకా! రాముడికీ సీతకూ నిజంగానే పెళ్ళయిందహో!!" అని సంతోషంతో గెంతులేస్తారు. జగమంతా "అది నిజమే నిజమే" అని చాటి చెబుతారు.

కానీ నేను ఆపని చెయ్యను."ఓహో మొల్లకాలంలో తెలుగు దేశంలో ఇలా పెళ్ళిళ్ళు జరిగేవన్నమాట" అనే నిర్ధారణకు వస్తాను. ఎందుకంటే,రాముడు ఉన్నాడు అన్న కాలంలో పట్టుపీతాంబరాలు ఉండే అవకాశం ఉందా? తిలకాలుకాటుకలూ దిద్దేవారా? కంకణాలు తొడిగేవారా? మంగళవాయిద్యాలు కె.వి.మహదేవన్ తరహాలో వాయించేవారా? అసలు ఉంటే ఉత్తరభారతీయుడైన రాముడు మాంగళ్యధారణ సాంప్రదాయాన్ని పాటించేవాడే? అనే సమాధానం లేని ప్రశ్నలు ఇక్కడ అవసరం గనుక. మొల్ల తన కాలమాన పరిస్థితుల్నీ, సాంప్రదాయాల్ని బట్టి తనదైన వర్ణన చేసుంటుందనే నిర్ధారణకు వస్తాను.

ఆ వర్ణనతో పాటూ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగే విధానం ఎప్పటి నుండీ ప్రారంభమయ్యింది. వారు పాటించే సాంప్రదాయాలకు మూలం ఎక్కడ.ఉత్తరభారతదేశంలో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా వంటి ప్రామాణికాలు వెదకి మూలాలను గ్రహించి, పరిశోధన ఫలితాల్ని ప్రతిపాదిస్తాను.

అది మీకూ నాకూ తేడా! ఇందులో మీ తరఫున్నుంచీ నేనే తప్పుంటాను. ఎందుకంటే మీరు ఘనులు. నేను కాదు.

అలాగే, ఒక చరిత్రకారుడు కులం చరిత్రను తిరగదోడుతూ మొదటిగా కుల ప్రస్తావన భగవద్గీత అనే పుస్తకంలో ఉంటే మీరు "యురేకా! అయితే కృష్ణుడున్నాడు" అని నిర్ధారించేస్తారు. కానీ పాపం ఆ చరిత్రకారుడు భగవద్గీత అనే text లో ఈ ప్రస్తావన ఉంది అని ముగిస్తాడు. మనుస్మృతి రాసేనాటికి ఆ కులవ్యవస్థ వ్యవస్థీకృతమయిన ఆధారాలున్నాయి అంటాడు. "నాకు కృష్ణుడు గీత చెప్పినట్లు ఆధారాలు దొరకలేదు కాబట్టి, ఆ విషయంలో నేనేమీ రూఢిగా చెప్పలేను. ప్రస్తుతానికి ఒక పుస్తకం మాత్రం ఆధారంగా నాదగ్గరుంది" అని ఆ చరిత్రకారుడు బేలగా మీముందు వాపోతాడు.

అప్పుడు మీరు "ఛీ! నువ్వొక మ్యాక్స్ ముల్లర్వి, నువ్వొక వామపక్ష చరిత్రకారుడివి,నువ్వు రామచంద్రగుహవి,నువ్వొక హిందూద్వేషివి" అని బిరుదులిచ్చి సత్కరిస్తారు. మీకు తెలీని విషయం ఏమిటంటే మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ చరిత్రకారుడు మిషనరీల దయతో ఈ దేశానికొచ్చి బిటిష్ వాళ్ల తొత్తుగా ఉద్యోగం చెయ్యకుండా ఉంటే అప్పుడప్పుడూ మీరు గొప్పగొప్ప వేదాల పేర్లు చెబుతుంటారే..అవి కాకులెత్తుకెళ్ళుండేవి. ఏ పురాతన మందిరంలోనో జీర్ణమయ్యుండేవి. మీకు చెప్పుకోవడానికి (ఎలాగూ చదివుండరు) కనీసం పేర్లుకూడా దక్కుండేవి కావు.అందుకే ఆయన పేరుమీద డిల్లీలో ఒక పేద్ద భవనం ఉంది. మీ పేర్లు బ్లాగుల్లొకూడా మీబోట్లుతప్ప మరెవ్వరూ ఎత్తరు.

కాబట్టి, చరిత్ర జ్ఞానానికీ చరిత్రకారుల నిబద్ధతనూ వెక్కిరించే ముందు కనీసం చరిత్ర ఎలా రాస్తారో తెలుసుకోండి. కనీసం ఉన్న చరిత్రను చదువుకోండి. మ్యాక్స్ ముల్లర్ చదవటం ముల్లైతే డి.డి.కోశాంబిని చదవండి. కనీసం చదువుకోండి. అప్పుడు చర్చిద్దాం!

Suresh Kumar Digumarthi said...

ముసుగు దొంగలు, అసలు దొంగలు బ్లాగులు చదివాను. చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. మీరు చెబుతున్న భావాలు కానీ, భావజాలం కానీ కొత్తదేమీ కాదు. వాటిని మనకన్నా ముందు వచ్చిన మేధావులు, చరిత్రకారులు, సాహిత్యకారులు వారి వారి సామర్ధ్యాల మేరకు విడమరచి చెప్పారు. దానినే మీరు మీ అవగాహనా స్థాయి నుండి రాస్తున్నారు. చరిత్ర చదివిన మీకు ఆ మాత్రం స్పందన కలగడం తప్పుగా నేను భావించడం లేదు. అయితే మీ స్పందన మాత్రం సమాజంలో చాలా మందికి తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాల అత్తర్లు పూసి, పైకి ఏమీ లేనట్టుగా చూపిస్తూ వారు తరతరాలుగా వస్తున్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో మళ్ళీ మీరు చరిత్రను వర్తమానంతో పోల్చినపుడు వాళ్ళకి కష్టంగానే ఉంటుంది.
ఈ ’రచ్చ’ ద్వారా వాళ్ళు చాలా విజయాన్ని సాధించారు. మీ బ్లాగుకు మంచి ఫాలోయింగ్ వున్నది ఒక బ్లాగరు చెప్పారు. అలాంటపుడు మీ గత జీవితాన్ని బ్లాగులోకి తీసుకురావలసిన అవసరం ఏమిటని ఆలోచిస్తే సమాధానం చాలా చిన్నది. ఎవరైనా బాగా రాసినా, తెలివిగా రాసినా, వారి కులం ఏమిటన్నది బ్లాగర్లు (కొంతమంది)వెతుకుతున్నారన్నమాట. మీ రచనల వలన మీ గురించి తెలుసుకున్నప్పుడు, మీ కులం ఆ ముసుగుదొంగకు, ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించింది. ’నేను మాదిగను’ అని మీరు ఇప్పుడు చెప్పారు. కానీ అది మీ చేత ఎప్పుడో చెప్పించాలని, ఆయన ఆశ పడ్డాడు. అందుకే యూనివర్సిటీ విషయం ఆయన ప్రస్తావించ వలసి వచ్చింది. అయితే మీరు ఆ కోణంలో ఆలోచించకపోవడం వలన అది మీ దృష్టికి రాలేదు. అంతా ఒక కుట్ర ప్రకారం మిమ్మల్ని వాళ్ళ ప్రతిస్పందన ద్వారా దళితుడు అని చెబుతూ వచ్చారు. దానికీ మీరు ఏ రోజు స్పందించలేదు. ఇక మీ IP address వాడడం వాళ్లకి తప్పలేదు. ఇన్నాళ్ళకి వాళ్ల కల ఫలించింది. అందుకే అంత మంది పండగ చేసుకుంటున్నారు. ఈ రాతలు so called upper caste ఎవరైనా రాస్తే ఇంత రాద్దాంతం ఖచ్చితంగా జరుగదు పైగా అది గొప్పతనం అవుతుంది.
చాలా మంది మీకు సంయమనం పాటించమంటున్నారు. దానర్ధం వాళ్లకి నచ్చినవి రాస్తే సరిపోతుంది అని.
ఇంకో వెయ్యి సంవత్సరాలైనా ఈ కుల సమాజం మారదు. కేవలం రూపం మారుతుంది అంతే.
దయచేసి మీ పోరాటాన్ని ఆపవద్దు. మీకు మా మద్దత్తు సంపూర్ణంగా ఉంటుంది.

Anonymous said...

More power to you! You have a lot of silent supporters.

Srinivas said...

వివాదాస్పదమయిన ఏ చర్చ అయినా ఉద్వేగాలకతీతంగా సాగుతుందని ఆశించడం అత్యాశ. ఆ భావాలను ఎదుర్కొనలేని అశక్తతా, విషయజ్ఞాన హీనతా వ్యక్తిగత నిందకు దారితీయక తప్పకపోవడం పరిపాటి. ఎవరి మాటలు వారి సంస్కారాన్ని వెల్లడిస్తాయి.

యుద్ధానికి దిగాక అందరూ ఆదిమ మానవులే. You always have the option to take high road.

Bolloju Baba said...

suresh mithramaa
good analysis

bollojubaba

Srujana Ramanujan said...

@Suresh garu,

Nice comment, and u r right

కొణతం దిలీప్ said...

సురేశ్ గారూ,

రెండు మూడు రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఈ చర్చకు మీలాంటి సెన్సిబుల్ బ్లాగర్ ఎవరినా ప్రతిస్పందిస్తారేమోనని.

మహేశ్ రచనాశైలి నచ్చి ఆయన బ్లాగును రెగులర్ చదివేవారిలో నేనొకన్ని. నిజమే! మీరన్నట్టు మహేశ్ ఏనాడూ తన ఐడెంటిటీని వాడుకోవాలని చూడలేదు. అంతెందుకు నాకు ఆయన SC/ST atrocity కేసు వేస్తానని మొదటిసారి చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈయన ఆ కేసు ఎలావేస్తాడు అని. ఆ క్షణందాకా నాకు మహేశ్ సామాజిక నేపధ్యం తెలియదు.

ఆయన రాతలు సహజంగానే Status Quo కోరుకునేవారికి ఆగ్రహం తెప్పించాయి. ఆయన సంధిస్తున్న ప్రశ్నలు పాతవే అయినా, కొత్తతరం ఇంటర్ నెట్ చాందసులకు అవి మింగుడుపడట్లేదు. అందుకే ఆయనను నేరుగా ఎదుర్కోలేకే ఆయన సామాజిక నేపధ్యంపై పడ్డారు.

ఇతర బ్లాగర్ల పేరుతో దొంగ వ్యాఖ్యలు రాస్తున్న ఒక సంస్కృతీ పరిరక్షకుని బాగోతాన్ని మహేశ్ బట్టబయలుచేశాక, తమతమ బ్లాగుల్లో మహేశ్ పై దాడులు మొదలుపెట్టినవారెవరో, వారందరూ ఏ సామాజిక నేపధ్యానికి చెందినవారో, ఏ కారణంచేత ఆయనపై విషం చిమ్ముతున్నారో ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది.

అనామక వ్యాఖ్యలు, దొంగ పేర్లతో బ్లాగులు...ఇవీ మన "భారతీయ సంస్కృతిని" ఉద్ధరించడానికి మన చౌకబారు కమెడియన్లు వాడే పనిముట్లు.

Vinay Chakravarthi.Gogineni said...

mmmm andaru alavuntaaru anukolemu.....nenu general but chaala saarlu katti gaaru baaga raaste baagundi ani cheppanu baalenappudu baaledani cheppanu.......idi cast ki sambandhinchinadi kaadu pakka........

littlebit jelous...and koncham pogaru ante....meeru gooda konchm konni odd ga raastaru..... mari enduku anta ga valla comments pattinchukuntunnaru.......

asalu case entandi baabu ekkadiko poyaaru anipistondi.......

asalu naaku meeku cheppenta scene ledu but edo........cheppalani vuntundi kada anduke......sorry if am wrong

పెదరాయ్డు said...

కామె౦టుగానే రాద్దామనుకున్నాకానీ...నిడివి ఎక్కువై...ఇక్కడ చూడ౦డి.

http://panchayiti.blogspot.com/2009/06/blog-post.html

మిస్టర్ యక్ష said...

ha ha ha