Friday, June 5, 2009

మీరు దేవుడ్ని నమ్ముతారా?


ఇప్పుడే ‘డావిన్సీ కోడ్’ రచయిత డాన్ బ్రౌన్ రాసిన మరో నవల ‘ఏంజిల్స్ అన్డ్ డెమొన్స్’ సినిమా రూపకం చూసొస్తున్నాను. గొప్ప సినిమా కాదుగానీ నిర్మాణ విలువలు, నటన, లొకేషన్ల పరంగా విజువల్ ట్రీట్ అనుకోవచ్చు. కథాంశం ఎలాగూ ధిల్లర్ కాబట్టి వేగం, మలుపులతో ఆసక్తికరంగా సాగే ఒక కమర్షియల్ సినిమాగా బాగానే ఉంది. ఖచ్చితంగా ఒకసారి చూసెయ్యొచ్చు. మతానికి సంబంధించిన కుట్రలూ, క్రైస్తవ మతం సాగించిన హత్యలూ, సైన్సు తో క్రైస్తవం యొక్క చారిత్రాత్మక విభేధాలూ వంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమాలో ఆద్యంతం మనల్ని ఆకట్టుకుంటాయి. వాటికన్ సిటీ అందాలు. బృహత్తరమైన, మహత్తరమైన కట్టడాలు వాటి చరిత్రా చూపించిన విధానం దృశ్యపరంగానూ డావిన్సీ కోడ్ సినిమా కంటే మెరుగ్గా అనిపిస్తాయి.

ఈ టపా ఈ సినిమాను సమీక్షించడానికి కాదు. కాకపోతే నేను చెప్పబోయే విషయానికి భూమికగా పై సోది చెప్పాల్సి వచ్చింది. ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి డాక్టర్ ప్రొఫెసర్ రాబర్ట్ లాంగ్డన్ సింబాలజిస్ట్, ఒక హేతువాది. అప్పటికే చర్చ్ కి వ్యతిరేకంగా పుస్తకాలు రాసిన వ్యక్తి. అటువంటి రాబర్ట్ ను ఒక పాత్ర "నువ్వు దేవుడ్ని నమ్ముతావా?" అని ప్రశ్నిస్తుంది. సహజంగా అయితే "నమ్మను" అనే సాధారణమైన సమాధానం సరిపోతుంది. కానీ అక్కడ జరిగే సంవాదం మతం పట్ల ఒక ఆసక్తికరమైన చర్చగా మారుతుంది. ఆ సంబాషణల్ని తెలుగు అనువాదంతో సహా ఇక్కడ పెడుతున్నాను.

Do you believe in God Mr. Langdon?
మీరు దేవుడ్ని నమ్ముతారా మిస్టర్ లాంగ్డన్?
I want to believe.
నమ్మాలని అనుకుంటాను.
Mr. Langdon, I did not ask if you believe what man says about God. I asked if you believed in God.
మిస్టర్ లాంగ్డన్ నేనడిగింది మీరు దేవుడి గురించి మనుషులు చెబుతున్నవి నమ్ముతారా అని కాదు. దేవుడ్ని నమ్ముతారా అని.
My mind tells me I will never understand God. And my heart tells me I am not meant to."
నా మెదడు చెబుతోంది నేను దేవుడ్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేనని. నా మనసు నేను దేవుడ్ని అర్థం చేసుకోవడానికి ఉద్దేశింపబడలేదంటోంది.

ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ సినిమాలో ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. వాటి గురించి మరోసారి.

****

16 comments:

Padmarpita said...

డైలాగ్స్ తెలుగులో అన్వయించి మరీ చెప్పరుగా....
తప్పక చూడవలసిందే సినిమాని.... చూస్తాను!!

గీతాచార్య said...

this novel, said to be a prequel to the DVC, is far more better in its play, and suspence element.

Some of the lines in that novel are worth recorded for further references. But it was not a success initially. After the stupendous success of DVC, it came into print like After Gajni, all of Surya's trash is spilled ovr the Telugu movie viewers.

Also as we discussed, Digi Fortress is also an excellent thrillar to make a movie, my bet for the hero is Leonardo Di caprio. :-D

Despinte some inaccuracies, it gives some important insights in to the western religious thought Vs scientific thought.

గీతాచార్య said...

Continuation from... (Telugu movie viewers.) But it's not a trash like those movies. :-)

As the novel is better, no wonder the movie is better than it's predecessor.

Have to see hw Mr. Gumpp performed after amaemic action in the first movie.

మేధ said...

ఈ నవల చదివాను.. డావిన్సీ కోడ్ కంటే కూడా బావుందనిపించింది.. సినిమా చూద్దామనుకున్నా, డావిన్సీ కోడ్ జ్ఞాపకం వచ్చి అనవసరంగా, నా ఊహల్లో ఉన్న సినిమా పాడయిపోతుందేమోనని వెళ్ళలేదు.. :)

సుజాత వేల్పూరి said...

Tom hanks కి నేను ఫాన్ అనే చెప్పాలి. caste away తర్వాత అతి పెద్ద ఫాన్ గా మారాను. ఈ సినిమా చూడాలని 2 వారాలబట్టీ అనుకుంటున్నాను. లాభం లేదు, ఈ వీకెండ్ అన్నా చూడాల్సిందే!

హరే కృష్ణ said...

అంత మంచి నావెల్ ని అంత కంటే గొప్ప అయిన టాం హాంక్స్ ని మిస్ అయ్యేది లేదు ..
డాన్ బ్రౌన్ చాలా గ్రేట్ ..
మిస్ అవ్వొద్దు

Malakpet Rowdy said...

My friends told me just one thing - "Since you read the book and are a big fan of it (Check my profile .. it's still one of my fav. books), you better NOT watch the movie, it's a big let down"

So, I'm a bit scared to watch the movie. They made a big mess of The DaVinci code and I'm sure they would have messed this one up too!
By the way Angels & Demons is the only book in my life that I read Non-stop - Started at 11:00 PM and kept on reading without a break until 12:00noon the next day :))

Malakpet Rowdy said...

Tell me one thing - Is it true that the "Cripped Man" character - (The Director of CERN Labs who calls Dr.Langdon to Geneva) is not there at all in the Pic?

నిషిగంధ said...

ఈ సినిమా గురించి నేను విన్నది, 'DVC కంటే ఈ సినిమా బావుంది.. కానీ నవల అంత బాలేదు ' అని.. రెండు పుస్తకాల్లో అయితే నాకు AD నే బాగా నచ్చింది.. ఎంతో ఉత్సాహంతో DVC మూవీ కి వెళ్ళి రెట్టింపు నిరుత్సాహంతో తిరిగివచ్చిన అనుభవం గుర్తొస్తే మళ్ళీ ధైర్యం చేయాలేకపోతున్నాను :-)

కామేశ్వరరావు said...

Am I the only person who liked DVC more than AD?! (I am talking about the novels, not the movies)

శరత్ కాలమ్ said...

నేను DVC నవల ఉత్సాహంగా చదివాను, స్క్రీన్ ప్లే కష్టపడి చదివాను, సినిమా DVD లో పావుగంట చూసి మూసేసాను. AD చూడాలంటే మిగతావారికిలాగానే బెదురుగా వుంది.

Anil Dasari said...

@ఈ సినిమా చూడాలంటే భయపడేవాళ్లు:

ధైర్యంగా చూసెయ్యొచ్చు. డావించీ కోడ్‌తో పోల్చినా, పోల్చకపోయినా ఈ సినిమా బాగుంది. పుస్తకాన్ని ఉన్నదున్నట్లు తీయటం కష్టం - కాల పరిమితి, etc, etc. కాబట్టి దానితో పోల్చుకోకుండా చూడండి.

డావించీ కోడ్ పుస్తకం లాగానే సినిమా కూడా చరిత్ర పాఠాలు చెబుతున్నట్లుగా సాగి విసుగెత్తిస్తుంది. ఏంజెల్స్ & డీమన్స్ దానికి భిన్నం. మంచి థ్రిల్లర్ మసాలా. క్లైమాక్స్ మాత్రం కొంత సిల్లీగా అనిపించొచ్చు, కొందరికి.

నాకు నచ్చిన లైన్ సినిమా చివర్లో వస్తుంది: 'When you write of us - and you will - be gentle'. రాబోయే మూడో సినిమాకి, పుస్తకానికీ హింట్ అన్నమాట ;-) అన్నట్టు, మూడో పుస్తకం Lost Symbol సెప్టెంబర్ లో విడుదలవుతుంది.

శరత్ కాలమ్ said...

నవల ఇంకా చదవలేదు. ఈ సారి ఈ సినిమా చూసాకనే నవల చదువుదామనుకుంటున్నా. అప్పుడయితే రెండూ నచ్చే అవకాశం వుంది.

గీతాచార్య said...

Have seen it today. Watchable. But Mr. Gumpp is still anaemic, but far better than in DVC.

@సుజాత గారు,

BOL.

సూర్యుడు said...

Always there is a debate between Novels and their move representations, which are better.

Somehow I feel Novels/stories are better than their movie/visual representations because in novels/stories the character is up to your imagination, you can imagine however you want but when it is picturized, the character will be limited by the ability of that actor and also the image of that actor.

~sUryuDu :-)

Anonymous said...

సినిమా చూస్తే చూసినట్టుండు అంతే గానీ ఎందుకు నీకీ వెధవ రాతలు