Saturday, May 2, 2009

శివతాండవం


స్వరజతులే లేని చోట
అడుగులు వెతుకుతు
అసంభవ నృత్యం
ఒక ప్రళయ తాండవం

రేఖల రూపులు కోల్పోకుండా
సామరస్యం శ్రుతికొచ్చేనా?
ఆద్యంతాల
స్మృతి ఉంటే
శివతత్వం తెలిసొచ్చేనా?

ఆ ప్రళయ రుద్ర నృత్యంలో
నన్ను నేను కోల్పోవాలి
ప్రయత్నించక
అడ్డుచెప్పక
ఆలోచించక
అసహాయుడైన బాలుడిలా
మాతృస్తన్యపు
ప్రవాహంమధ్యన
మునిగి
నిర్భయుడిగా మిగలాలి

అప్పుడే...
నిశ్శబ్ధంగా
చల్లగా
ఊపిరి
శివుడి ఊపిరి
అల్లుకుంటుంది
అల్లుకుని
భావమాలిన్యాన్ని హరిస్తుంది
ఆతరువాత నిశ్శబ్ధం
ఆ నృత్యాన్ని మించిన నాట్యం లేదు
అయినా స్థబ్ధత
కేవలం
అప్పుడే పుట్టిన పాపడు
అబ్బురపడి వేసే చిరుకేక
మాత్రం వినిపిస్తుంది

ఆ తరువాత...
ఈ అనంత విశ్వపు
నిట్టూర్పులో
ఆఖరి శ్వాసని
త్యజించడం
ఆ శ్వాస
నా నుంచీ విడిపడ్డాక
తాండవంతో ప్రమేయం లేకుండా
శ్వాసతో సంబంధం లేకుండా
అనుభూతితో అవసరం లేకుండా
జ్ఞానంతో నిమిత్తం లేకుండా
నేను లేనట్టే
నా శరీరమూ లేదు


Dance with Shiva

the impossible dance
of chaos
finding the steps
to follow a pattern
where there is none
seeking harmony
without letting go
of linearity ?
being with shiva
with out
sensing timelessness?
allowing myself
to be
swept into
the chaos
of the dance
not resisting
not thinking
not trying
like a helpless child
in the wave of
a raging storm
of it's mother's milk
drowning
but not afraid
ad then the breathing
the breath of Shiva
silent
like a cool balm
washing away all the senses
and then silence
beyond the dancing
there is not dance
but stillness
just a gentle cry
from the baby's last
sense of wonder
then ...
the letting go
of the last breath
that mingles
with an everlasting
universal sigh
as the breath leaves me
and my body ceases to exist
as do i
lost beyond the dance
beyond the breath
beyond perception
beyond wisdom
for no reason


(శేఖర్ కపూర్ ఆంగ్ల కవితకు ఇది స్వేఛ్చానువాదం)

*****

20 comments:

Anonymous said...

Hello, after a long time!!! I think I liked your telugu version better. May be you too need a W.B. Yeats to translate your poetry into english.
Good luck.

Anonymous said...

Mahesh, I was actually googling my own blog and happened to accidentally venture into your world. Got to admit, you have a way with words. Add to that, a very introspective and a very honest and original perspective... makes for a not put downable reading material. Honestly, whenever I was exhausted, I'd look up Baradwaj Rangan's blog. Although he is a Bollywood and Tamil film critic, his take on the movies / characters are so thought provoking and sometimes so hilarious, [ read his take on Jodha Akbar and then you'll understand what I am saying ]that it'd help me unwind like none other. Guess, I have found myself another interesting place on the web to surf. In retrospect, I'll wear your earlier complements as a badge of honor, something to tout and pout about.
Madhu.

rākeśvara said...

ముందు తెలుఁగులో చదివాను. చాలా బాగుంది.
ఇక ఆంగ్లంలో దాన్ని మీరే అనువదించారనుకుని చదవకూడదనుకున్నాను కానీ, అదే అసలు అని తెలిసి చదివాను. కానీ నాకు తెలుఁగులోనే నచ్చింది.
చాలా చాలా బాగుంది కవిత, మీరు ఇలాంటివి కూడా వ్రాయగలరా అనుకున్నాను నేను. ఐతే మీది కాదనమట అయ్యో...
కానీ అనువాదం చాలా బాగా చేశారు!

Bolloju Baba said...

మాతృకే అలాగ ఉంది.

Anil Dasari said...

పదాల అల్లిక బ్రహ్మాండంగా ఉంది.

హిందూ దేవుళ్లలో నాకు నచ్చేవాడు - గుణగణాల పరంగా - భోళాశంకరుడే. యుగయుగాలుగా 'కాపిటలిస్ట్ దేవుడి' లాబీ మార్కెటింగ్ మాయకి బలైపోతున్నాడు కానీ, అసలు దేవుడంటే శివుడే కాడూ?

(మీ తర్వాతి టపాకి ఐడియా ఇచ్చేశానా ;-) )

durgeswara said...

layakaarakaa mahesaa namonamaha

భాస్కర రామిరెడ్డి said...

కవిత బాగుంది మహేష్, అనువాదం అయినా చాలా స్వేచ్ఛగా సాగింది.

సుజాత వేల్పూరి said...

చాలా బావుందండీ! ఇంత మంచి తెలుగు, ఇంత క్లిష్టమైన భావాలు మీకెలా తోస్తాయో మరి!

Kathi Mahesh Kumar said...

@సుజాత: నేను స్వతహాగా కవిని కానుకాబట్టి ఒక మంచి పాఠకుడిగా ఉండటానికి ప్రయత్నిస్తాను.అర్థాల్ని కవి హృదయంలోంచీ కాకుండా, అక్షరాల అంతరాల్లోంచీ స్వేచ్చగా నాలో ప్రవహించేలా కృషిచేస్తాను.అప్పుడుగానీ కవితలు విచ్చుకుని ఆవిష్కృతం కావేమో!

ఈ సాధన బ్లాగుల పుణ్యమా అనే సాధ్యపడింది. ఇదివరకూ పదాల తాత్పర్యాలేతప్ప భావాల క్లిష్టతల్లోకి వెళ్ళే సాహసం చేసి ఎరుగను.బొల్లోజు బాబా, రాధిక, నిషిగంధ ల కవితలు చదివి చదివి, మళ్ళీ చదివి కొంత ఆస్వాదించడంతో పాటూ అనుభవించి స్పందించడమూ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను శివారెడ్డిని కూడా చదువుతున్నానండోయ్! త్వరలో మరిన్ని కవితలు నా బ్లాగులో కనబడినా ఆశ్చర్యం లేదు.

@మధు: Thank you.I did find your blog the same way. Its a wonderful coincident that your blog and my blog IDs are same with a simple variation of a syllable.I follow your blog as regularly as I can.

I am actually planning to translate some of your posts.After seeking you approval only of course.

@అబ్రకదబ్ర: ఈ ఆలోచన ముందునుంచే ఉందండోయ్! ఆల్రెడీ తమిళ్ లో చాలా మంది ఈ "ద్రవిడ దేవుడి" తత్వాన్ని సాధించేశారు.నేనూ ఒక చెయ్యేస్తాను.

@రాకేశ్వర్రావు:ధన్యవాదాలు. స్వీయ కవితలు కొన్ని రాసినా,కవితలు చదవడం ఈ మధ్యే అలవాటయ్యింది. దాంతో హిందీ, ఇంగ్లీషు, తెలుగు కవితల్ని తెగ చదివేస్తున్నాను. వాటిల్లో నచ్చినవి, అనువదించాలని అనిపించినవీ ఇలా అనువదించేసి కొంత సాధన చేస్తున్నాను.

@బాబా గారూ: నేను ఏ కవిత రాసినా అందులో కొంత క్రెడిట్ మీకు వస్తుంది. ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

మిమ్మల్ని కవి కాదన్న వాళ్లని.......!

మరువం ఉష said...

అనువాదం, అసలు మూలం రెండూ మీరిలా పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. శేఖర్ కాపూర్లోని ఈ లోపలి మనిషి హృదయం ఎంత లోతో, అంత ప్రగాఢం. ఈ కళలన్నీ పూర్వ జన్మ సుకృతాలే.

రాధిక said...

ఈ కవితలో పదాలే కాదు,భావం కూడా క్లిష్టం గా వుంది.అంటే మీరు పెద్ద కవి అయిపోయారన్న మాట.మీ కవితలు కోసం వెబ్ పత్రికల్లో ఎదురు చూస్తూ వుంటాము.
సుజాత గారు మహేష్ గారి ప్రతిభని తొలినాళ్ళలోనే గుర్తించి ఆ మాట ని[మీరు కవి కాదన్న వాడిని..]ఎప్పుడో చెప్పాను.ఆ హక్కు నాదే ...నాదే...ముమ్మాటికీ నాదే.

సుజాత వేల్పూరి said...

రాధిక,
మీరూ మీరూ ఒకేజాతి వాళ్ళు కాబట్టి కవులు కవుల్ని గుర్తించడంలో ఆశ్చర్యం లేదండీ! మా బోటి వారు గుర్తించడమే గొప్ప మరి! ఎనీ వే, మొదట గుర్తించిన హక్కు, మహేష్ ని కవి కాదన్న వాళ్లని కత్తితో కసి తీరా పొడిచేసే హక్కు మీకే ఇస్తున్నాను.:)).

Anonymous said...

గజిబిజిగా చిందరవందరగా
అసంభవం నృత్యం
అది తాండవం
పద్దతి లేని పరుగులో
అడుగుజాడల అన్వేషణం

సూటితనం వదలకనే
సామరస్యత సాధించటమా?
కాలాతీతం కనుగొనకనే
కాలరుద్రునితో కాపురమా?

ప్రళయ తాండవ నృత్యంలో
కొట్టుకుపోతా నొదిలేసి
ఆలోచించక అడ్డుచెప్పక
అప్రయత్నంగా
అమ్మ గుండెల కనుమలలో
ఉవ్వెత్తున ఉబికే పాల ప్రవాహంలో
నిర్భయంగా మునిగే పసిబాలుడిలా

అప్పుడు ఒక శ్వాస....
శివుని శ్వాస...
నిశ్శబ్దంగా...
చల్లని లేపనంలా
అణిచేస్తే అనుభూతుల్ని
//కడిగేస్తే కను పాపాన్ని//

అప్పుడు అంతా నిశ్చలం
కదలికలన్నీ మించిన చోట
కనబడదు ఏ కదిలే నృత్యం
అంతా ఉన్నది నిశ్శబ్దం
కేవలం ఓ కేరింత
ఆఖరుగా అనుభవించిన
పసిబిడ్డలోని ఆనందాశ్చర్యం


అప్పుడు ఆ ఆఖరి నిట్టూర్పు
లయకారుని శ్వాసలో లయిస్తుంటే
విడిచే గాలిలో శరీరం కలుస్తుంటే
//శరీరాన్ని గాలి విడిచిపోతుంటే
గాలిలో శరీరం కలసిపోతుంటే //
లయించి పోయా
తాండవంతో ప్రమేయం లేకుండా
శ్వాసతో సంబంధం లేకుండా
జ్ఞానంతో నిమిత్తం లేకుండా
వివేకంకై తర్కం లేకుండా
ఏ కారణం లేకుండకయే
నన్ను నేను కోల్పాయా

ఇది నా ప్రయత్నం; మీరు మిస్ అయ్యినదేదో పూరించే ప్రయత్నంలో నేను చేసిన తప్పిదం!
ఉదా: "chaos" కి మనకి సమాన పదం లేదేమో అనిపిస్తోంది! "ప్రళయం" అనేది దానికి సమాన భావం కాదు; ప్రళయం చివరకి వచ్చేది; "chaos" ఎప్పుడూ ఉండుంది; లేకపోతే సృష్టికి ముందే ఉందో! అలాగే "సామరస్యత" పదం నాకు ఇంకా తృప్తిగా లేదు : హార్మనీ తెలుగు పదం తెలీటం లేదు :( - its beautiful word which can
be used for music, dance and people - does సామరస్యత mean the same;i don't think so.
అలాగే "శృతిలయలే - జననీజనకులు కాదా" ....అందుకని "సామరస్యత లయకొచ్చేనా" అంటే బావుంటుదేమో! పైగా ఇది డాన్స్ కదా!అందుకని శృతికంటే లయనే చూడాలి కదా!
ఇంకోటి: మీరిచ్చిన ఒరిజినల్ లో స్టిల్ నెస్, సైలెన్స్ దగ్గర కూడా, నాకు వాడే రెండు అలా కలిపేసాడా, లేకపోతే మీరేమెన్న మధ్యలో మిస్ అయ్యారా అని అనుమానంగా
ఉంది; నిశ్చలం - స్టిల్ నెస్ - అలాగే అది నిశ్శబ్దం కూడా; అందుకని వాడలా రాసుకోగలిగాడు; మనకి అలా రెండు సజెస్టె చేసే పదం ఉండే ఉంటుంది అని నా ఉద్దేశ్యం;
వెదకాలి ; నిజానికి చాలా రాయాలని ఉంది;కానీ ఇక రాయట్లేదు.

నేను ప్రయత్నిస్తున్నప్పుడు మీరిలాగా ఆలోచించారా అనుకున్నాను; కానీ "అర్థాల్ని కవి హృదయంలోంచీ కాకుండా, అక్షరాల అంతరాల్లోంచీ స్వేచ్చగా నాలో
ప్రవహించేలా కృషిచేస్తాను.అప్పుడుగానీ కవితలు విచ్చుకుని ఆవిష్కృతం కావేమో!" అనేది కొంచెం అర్ధం కాలేదు; ఇవ్వాళ్టికి ఇక వదిలేస్తున్నా!

ఈ రోజు లంచి నుంచి బాగా గడిచిందిలెండి! బాబాగారన్నట్టు - ది ఒరిజినల్ ఇట్సెల్ఫ్ ఈజ్ సూపర్బ్! అండ్ సో యుర్ అనువాదం ఈజ్ గుడ్; నా కెందుకో శేఖర్ కపూరే ఎక్కడ్నించన్నా అనువదిస్తున్నాడా? అని అనుమానం కూడా కలుగుతోంది!

Kathi Mahesh Kumar said...

@రేరాజు: మీ అనువాదం చాలా బాగుంది. నాదీ ఒక ప్రయత్నమే. నేను కవిత చదువుతూ అనుభవించిన అర్థాన్ని తెనుగీకరించాను. అందుకే స్వేఛ్ఛానువాదం అన్నాను.

కవితలోని వివిధ పొరల్ని అనువదించడం కుదరదు.భాష మారేకొద్దీ కొన్ని పొరలు తొలగిపోవచ్చు లేదా మరికొన్ని పరుచుకోవచ్చు.అందుకే ఈ అనువాద కవితలకు ఎన్నైనా రూపాలుండొచ్చు. ఏదీ ఫైనల్ కాదు.

Srujana Ramanujan said...

Highly appreciable your translation Mahesh garu. Really an excellent effort.

I too translated an excellent English Lyrical prose into telugu.

http://aatanemaatakardham.blogspot.com/2009/03/celebration-of-life.html

is the link. The First three english lines are given, and the last stanza is given in the form of a comment.

Would you comment on its merits and demerits? I'll take any words either appreciative or negative remarks.

కొత్త పాళీ said...

మంచి ప్రయత్నం.
నాకొకటి చాలా ఆశ్చర్యంగా ఉంది. మూలంలో లేని భరతనాట్యానికి సంబంధించిన పదాలని (స్వరజతులు), భారతీయ తాత్విక చింతనకి సంబంధించిన పదాలని (శ్రుతి, స్మృతి) మీ అనువాదంలో వాడారు. వాటిని వాడ్డం వల్ల అనువాద పద్యం విలువ ఒక మెట్టు పైకెక్కిందని నాకనిపిస్తోంది. మీరే తరవాత వివరణల్లో అన్నట్టుగా, ఇది యథాతథానువాదం కాదు. నాకు ఆశ్చర్యం ఎందుకూ అంటే భారతీయ ఆస్తిక చింతన గురించి ఆసక్తి లేని మీరు ఈ పదాలని అనువాదంలో ఎలా ఉపయోగించారూ అని. ఉపయోగించకూడదని రూలేం లేదు. ఒక ఆస్తికునికి ఇటువంటి పదాలు స్ఫురించడంలో ఆశ్చర్యంలేదు.
ఇంకో మాట .. మూలంలో చదివితే కలగని ఒక ఆస్తిక అనుభూతి మీ అనువాదం చదివితే నాకు కలిగింది. ఇది పూర్తిగా సబ్జెక్టివ్ ఒపినియనే అయ్యుండొచ్చు. మూలంలో కవి యొక్క అనుభవమే ముఖ్యాంశం. మీ అనువాదంలో శివుడు ముఖ్యాంశం.
ఈ విషయమ్మీద ఇతర పాఠకులు కూడా ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది.

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళీ: ఆంగ్లమూలంలో కవియొక్క స్వీయానుభూతి ప్రధానమైనా, నేను చదివేప్పుడు ఆ అనుభూతిని define చేసిన శివతత్వం కీలకం అనిపించింది. అందుకే బహుశా నాకు శివుడు ముఖ్యాంశం అయ్యాడు.

నేను పుట్టుకతో నాస్తికుడిని(?)కాను. నాస్తికుడిగా "మారాను".ఈ పరిణామక్రమంలో కొంత భౌతిక-ఆధ్యాత్మిక వాదాల్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను.అవి నాకిచ్చిన సమాధానాలకన్నా, మానవవాదం నాకు కల్పించిన జవాబులు మిన్నగా తోచాయి.దేవుడికన్నా మనిషి ప్రధానమని నమ్మినక్షణాన "దేవుడ్ని" త్యజించాను.

దేవుళ్ళ తత్వాల్నీ,రూపాల్నీ,లక్షణాల్నీ భౌతికజగత్తులో సమాజ నిర్మాణానికి,వ్యక్తిత్వ వికాసానికీ కావలసిన సామాగ్రులుగా చూసినన్నాళ్ళూ నాకు ఆమోదయోగ్యమే. ఎప్పుడైతే అవి "మిధ్య"స్థాయికి చేరుకుంటాయో అప్పుడు వాటిని ఖండిస్తాను.అవి సామాజిక-రాజకీయ-మానవజీవనానికి హాని చేస్తాయో అప్పుడు దాన్ని వ్యతిరేకించి పోరాడుతాను.

my "religion" is very clear to me.

కెక్యూబ్ వర్మ said...

మీనుండి ఇది చదవడం కొత్త అనుభూతినిచ్చింది. నిర్వాణక్రమాన్ని ఆవిష్కరించిన కవితా పాదాల లయ బాగుంది. నాకిందులో ఆస్తికత్వం కంటే మనిషి తనను తాను మలచుకునే క్రమం కనబడింది. మీ శైలికి ధన్యవాదాలు..

Anonymous said...

http://nachaki.wordpress.com/2010/12/28/dancingwithshiva/ - naa prayatnam. I don't intend to see a comparison but a comparative study of some sort might be helpful for some other enthusiasts.