మళ్ళీ ఇంతకాలానికి దుమ్ముదులిపి, బుచ్చిబాబు కథలు చదవడం మొదలెట్టాను. మొట్టమొదటి సారి ‘చివరకు మిగిలేది’ చదివిన తరువాత, కూసింత మూర్చబోయి, హఠాత్తుగా ఎదిగిపోయి, నవీన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని, జీవితాన్ని మరింతగా ప్రేమించడం మొదలెట్టాను. ఆ పఠనం మొదలు, చిట్టిబాబుని నా అభిమాన రచయితగా నిర్ణయించేసుకుని ‘బుచ్చిబాబు కథలు’ అదే అవేశంలో సాధించేశాను. మాఊర్లో పుస్తకాలు అద్దెకిచ్చే షాపువాడి దగ్గర ఆఖర్న చూసిన ఈ పుస్తకం, ఈ మధ్య మళ్ళీ విజయవాడ లెనిన్ సెంటర్లో పాతపుస్తకాల దుకాణంలో చూసేసరికీ పాతమిత్రుడ్ని కలుసుకున్నంత ఆనందం. ఆ తరువాత ఇన్నాళ్ళకు మళ్ళీ..మళ్ళీ మొదటి కథ "ఎల్లోరాలో ఏకాంత సేవ" చదివాను.
రాసిందెప్పుడో, ముద్రణ ఎక్కడో,ప్రచురణ ఎప్పుడో తెలియని కథ. అయినా, నిన్నమొన్న రాసినట్లే ఉంది. బుచ్చిబాబు పక్కన కూర్చుని చదివి వినిపించినట్లే ఉంది. సినిమా ప్రొజక్టర్లో ఈ కథను నా కళ్ళముందు నిలిపినట్లే ఉంది. వైధవ్యంలో చెల్లెలి భర్త ఆకర్షణను త్రుంచుకుని, అణగారిన తన యవ్వనాన్ని బేరీజుచేసుకుంటూ బ్రతుకువెళ్ళదీసే జ్ఞానసుందరి నాకు తెలుసు. భర్త అనే వస్తువు మీద సర్వహక్కులూ కలిగి, అనుభూతుల్ని కాకుండా కేవలం బాధ్యతల్ని పంచుకునే నాగరాజ్యలక్ష్మిని నేనెరుగుదును. భాధ్యతలూ- భావుకతలూ, ఆకర్షణలూ-అడ్డుగోడల మధ్య ఊగిసలాడుతూ ఏదో ఒక ఏకాంతానికి (ఏల్లోరాలో ఏకాంతానికి) పారిపోవాలనుకునే మధుసూదనం నాలో కొంత ఉన్నాడు.బహుశా ప్రతి మగాడిలోనూ కొంత ఉంటాడు. అందుకే ఈ కథ నన్ను ఇంతగా ఆకట్టుకుందో తెలీదుగానీ, ఖచ్చితంగా తన ముద్రను మాత్రం నాలో చిత్రించింది.
ఆ కథలోని కొన్ని ముత్యాల్లాంటి వాక్యాల్ని మీకోసం ఇక్కడ పొందు పరుస్తున్నాను.
"స్త్రీని ఆటవస్తువుగా,ఆస్తిలో ఒకభాగంగా, బానిసగా వాడుకుంటున్నారు ఈ మొగాళ్ళంతా అంటారుగానీ, వీళ్ళెవరికీ అసలువిషయం తెలీదు. స్త్రీయే పురషుణ్ణి పెద్దహాల్లో మధ్య బల్ల మీద పూలతొట్టి లాగా చూసుకుంటుందని ఎవరూ పైకనరేం? ఆ తొట్టిలో రోజూ కొత్తకొత్త పూలుపెట్టి వాసన చూసుకుంటూ,--- హాల్లో చోటులేక బల్ల జరినిపినప్పుడు, ఆపూలతొట్టిని దూరంగా దొడ్లొ పడెయ్యటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కోపమొస్తే దాన్ని నేలకేసి కొట్టడం- అది ముక్కలడం. డబ్బున్న స్త్రీ కొత్త తొట్టిని కొనుక్కుంటుంది."
ఎంత విచిత్రమైన కోణం! మొగుడూ-పెళ్ళాల మధ్య కేవలం అనుభవించి ఎప్పుడూ ఎవరూ చెప్పుకోని కోణం. ఇప్పుడొక ప్రకృతి వర్ణన చూడండి.
"చెట్ల వెనుకనుంచి సంధ్య వెలుగులో అతశయోక్తిగా పరిభ్రమిస్తూవున్న పొడుగాటి నీడలు, పల్చబడి, రాళ్ళరంగుల్ని వెలిగించి, ఆకృతుల్ని మార్చి దిగజారుతున్నాయి. ఆకులమధ్య కిరణాలు వనదేవత కుట్టుపనిలో సూదులలా వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. గాలి తగ్గింతరువాత అగ్నిదేవుడు వేసిన గాలిపటం కిందపడిపోతున్నట్లు, నీడలు వెనక్కి వెనక్కి వెడుతున్నాయి."
ఎంత అందమైన పదచిత్రణ. కుంచెపట్టుకుని మన ఎదురురుగానే ఒక మాస్టర్ ఆర్టిస్ట్ గీసినట్లు లేదూ! ఆ తరువాత బుచ్చిబాబు తన పాత్ర ప్రకృతి సాగించే వైరం చెబుతాడు వినండి.
"ఇక్కడెవరూ లేరు. తనొక్కత్తే- ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి కదలదు. తనగుండెలు బాధతో కొట్టుకుంటూవుంటే, ప్రకృతి చెవులు నిక్కబొడిచి చోద్యంగా వింటుంది."
"శరీరం చూసిందాన్ని మనస్సు చెబుతున్నట్లుగా వర్ణించడం నాకు రాదు."
"ఈ అందం మళ్ళా మనకి దొరకదు. పూలపరిమళం క్షణికం, బాల్యం క్షణికం, కీర్తి క్షణికం - అన్నీ క్షణికాలే - అంతమాత్రం చేత వాటిని మనం వొదులుకోలేము. క్షణికం గనకనే, వాటిని కాంక్షిస్తాముకూడా."
"మాట్లాడకండి. చూడండి. భూమిలోంచీ వింత ధ్వనులు మీ వెన్నుగుండా శరీరంలోకి తరంగాలుగా ప్రవేశిస్తాయి, వినండి. - అదే విశ్వగానం అంటే - అదిగో ఆ రాతి మీ చెవి అన్చండి.యుగయుగాల క్రితం తిరుగాడి చనిపోయిన జీవుల అంతిమ బాధ, మృత్యుఘోష, పగిలిన హృదయాల చప్పుడు - అదొక నాదం."
"తనలో ఔదార్యం,కారుణ్యం - ఏవేవో ఉన్నాయి. వాటిని ఉపయోగించే అవకాశాలు లేక, ఇంద్రియాలు ఎండి, ఎత్తు నుండీ పారుతూ వొంపుదగ్గరదాకా ప్రహించి నిలిచిపోయిన పెద్ద జలప్రవాహంలా తనలో అల్లాఉండిపోయాయి."
"ఏదో జరగబోతోంది - తాను సిద్ధంగా ఉందా? నరాలు, రక్తం వొక్కసారి చెలరేగినట్లు, శరీరం తృష్ణతో బిగిసి, విడి, బిగిసి, సర్ధుకుని,సిద్ధమని, స్థిమితపడి, ఉదయించని సూర్యుని వైపు చేతులు జోడించిన ఋషి ప్రశాంతత తనలో కమ్ముకుంది."
"అమ్మో- శరీరానికి ఎంతశక్తి. ఎంత వొత్తిడి, ఎంత బలం - యుగయుగాలుగా భూగర్భంలో అణగారినశక్తులు వొక్కసారిగా భూకంపంద్వారా ప్రేలి బైటపడ్డంత శక్తి, సముద్రగర్భాన్ని కలచివేసి నెట్టి, బైట వొడ్డున ముద్ధకింద ఎండించి పడేసినంత వొత్తిడి, మహత్తర శిఖరాన్ని కూల్చి అధోలోకంలో లాకుపోయినంతటి బలం..."
"శరీరం పట్ల మనకు గౌరవం పోయింది. శివలింగ పూజలోని ప్రాధాన్యతని పూర్వులు పొగిడినా, ఈనాడు శరీశక్తి పట్ల ఆదరణ లేదు. ప్రతిభాశాలులైన ఒకరిద్ధరు శిల్పులు రాయిద్వారా యీ సూత్రం చాటుతున్నారు.ఆధునిక శిల్పానికి మొహం ఉండదు - స్ఫుటమైన ఆకారంలో ముఖ్యమైన కోణాలుంటాయి. అట్లా ప్రదర్శిస్తే, కళ్ళు తెరచి శరీరం చూస్తారని. కాని చూడ్డంలేదు. ఎగ్జిబిషన్లో పెడుతున్నారు. శిధిలాలకింద జమగట్టి, పురావస్తుశాఖవారికి వప్పగించేస్తారు. మరొకి శరీరం చూడలేనివారు, తమ శరీరాలు చూసుకోలేరు."
"మామూలువాళ్ళకి నీతీ మంచీ వుండాలి - కాని ఏఒకరిద్ధరో అసాధారణ వ్యక్తులుంటారు. ప్రతి సంఘంలోనూ వారికి స్వేచ్చ ఉండాలి. ఉంటేనే ఏదోఒక ఘనకార్యం చెయ్యగలుగుతారు. సంస్కృతీ, నాగరికతా వారివల్లనే వృధ్ధిచెందుతాయి."
ఈ కథ ఒక అద్భుతం. చదకపోతే జీవితంలో కొంత కోల్పోయినట్లే!
ఈ సంకలనంలో మరో ఆరు కథలున్నాయి. చదవాలి. మళ్ళీమళ్ళీ చదవాలి. జీర్ణించుకోవాలి. అప్పుడు చెబుతాను వాటి గురించి.
Friday, May 8, 2009
ఎల్లోరాలో ఏకాంత సేవ
*****
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
ventane pustakam koneyyalani undi ...
where can we get this book in Hyderabad?
@కౌముది:బుచ్చిబాబు కథలు ప్రస్తుతం ముద్రణలో లేవనుకుంటాను. హైదరాబాద్ లో ఎక్కడా నేను చూడలేదు. నాదగ్గరున్న పుస్తకం విజయవాడలో కొన్నదే. కావాలంటే చదవడానికో లేక కాపీ చేసుకోవడానికో ఇవ్వగలను.
Mahesh gaaru..
Thank you very much for sharing.
I need 1 copy of this..
కతి మహెశ్,
భాగా ఉంది.
ఎన్ద్కు Scan chesi PDF గా ఉంచ రాదు?
నాన్నగారి ద్వారా బుచ్చిబాబు గారి రచనల పరిచయం. కానీ పెద్దగా చదవలేకపోయాను. మీరు త్వరగా చదివి త్వర త్వరగా జీర్ణించుకుని మాకూ కాస్త ఆ అనుభూతి పంచండి.
>> ఈ కథ ఒక అద్భుతం. చదకపోతే జీవితంలో కొంత కోల్పోయినట్లే!
మీ టపాలోని ఉదాహరణాలతోనే ఇది నిజమనిపించారు.
మహేష్,
మీకు మరియు ప్రవీణ్ అలియస్ మార్తండా గల హిందూ/బ్రహ్మణ ద్వేషం తెల్సిందే. మార్తండ బ్లొగ్స్ చదివితె మీరు చెప్పినట్లు గా తీరు తెన్ను లేకుండా ఉంటాయి. అతను ఇచ్చె సమాధనం కూడా అతని అమాయకత్వం, knowledge ని తెలియజేస్తుంది. అతని సమాధానాలు చదివితె నాకు ఎడవాలో నవ్వాలో కూడా అర్థం కాలేదు. కాని మీరు లాల్లు ప్రసాద్ లాజిక్ తో మాట్లాడు తారు.బ్లొగ్స్ లో బ్రహ్మణ అన్న పదం వినిపిస్తె చాలు మీరు గంగ వెర్రులేత్తి భారతదేశ చరిత్రని మీరు క్రైస్తవ మిషనరి దృకోణం నుంచి నెమరు వేస్తారు.
*ఉపనిషత్తుల్లో బ్రహ్మపదార్థమని చెప్పబడినది ప్రస్తుతం ఎక్కడుందో కాస్తవెతకండి! వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి! కులవ్యవస్తా, వర్ణాశ్రమధర్మాలూ, పాపపుణ్యాలూ,స్వర్గనరకాలు ఎప్పుడు మన సంస్కృతిలోకి ప్రవేశించాయో కొంచెం తెలుసుకోండి*
మీరెదో ఇదంతా రాజ్యాధికారం కొరకు రీసర్చ్ చేసారు అందువలన రాశారు. మేము మీలాంటి మావవత వాదులం కాము. మమల్ని వదిలేయండి కావలంటె నాస్తిక వాదం, పుస్తకాల మీద సమీక్షలు రాసుకొండి. ఇటువంటి చరిత్ర పుస్తకాలు చదవటానికి పని పాటా లేని వారు ( హాస్టెల్స్ లో కుచ్చొని రాజ్యాధికరం లోకి రావాలంటె ఏ వర్గాల వారు ఎవరి తొ కలవాలి అని నిర్ణయించుకొని,దానికి అనుగుణం గా పుస్తకాలు రాసుకొవటం మొదలుపేట్టరు), రీటైర్డ్ అయి ఎదో సంఘ సేవ చెస్తున్నామను కునే బిల్లి బాబాయి ఆయన మిత్రుల లాంటి వారు, తేలికగ రాజ్యాధికారం , పదవులు,డబ్బు ఎలా సంపాదించాలి అనుకునే వారు ఇటువంటి వాటి మీద మొగ్గు చూపుతారు.
మీకు చేతనైతే వారి (బ్రహ్మణులవి )గురించి మాట్లాడటం మానేయండి. ఇంకా మీకు చెతనైతే మీ చేతి లొనే ఉన్నది ఇది మీరు నవతరంగం లో రాసిన కె. విశ్వనాథ్, బాపు,శ్యాం బెనగల్,గురు దత్, అనురాగ్ కశ్యప్, పీయుష్ మిశ్ర, ద్వీప సినెమ రాసిన వ్యాసాలను తొలగించండి లేక పొతె మీకు నిబద్దత లేదు అని అందరికి అర్థమౌతుంది. అలాగే చలం గురించి ఇంకా ఎవరైనా బ్రహ్మణులవి ఉంటె కూడా తొలగించండి. మీరు ఎన్ని సార్లు హిందువులను /బ్రహ్మణులను విమర్శిస్తారు. హిందు/బ్రహ్మణఅనే పదం వింటె ఊగి పొయే మీరు ఈ బ్రహ్మణ రచయితలు, దర్శకుల సినేమాల మీద మీ వ్యాసాలను మేము ఏ దృకోణం నుండి చూడాలి?
నీ బోటి పెద్ద మార్తాండల తో మాట్లాడాలంటె విసు గొస్తున్నాది. రాముడు ని, కృష్ణుడిని విమర్శించటం అయింది మళ్ళి ఇప్పుడు ఇలా "చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి!" రాస్తున్నావు.
నీకు తెలుసో లెదో దలితులు నిద్ర లేచిన మొదలుకొని సహాయం కొరకు ఆధారపడే ది బ్రహ్మణుల మీదనే. మిరూ న్యాయం కోసం కోర్ట్ గుమ్మం తొక్కలి అంటె మీ కెసులను బ్రహ్మణ న్యాయవాదులు తప్పితే మిగతవారు పట్టించొకొరు. మంద కృష్ణ మాదిగ సి.యం.తో మాట్లాడ టనికి పి. శివశంకర్ ,కంచా అయ్యలయ్యని ఎందుకు తీసుకొని వేళ్ళలేదు కన్నాభిరాన్ ని ఎందుకు తీసుకెళ్ళారు? పి. శివశంకర్ అంత ప్రముఖ లాయర్ కాదా ఎప్పుడు దలిత సమస్యలను గురించిన కేసులు వాదించింట్లు పేపర్ లో ఎందుకు రాదు? కంచా అయ్యలయ్య పుస్తకం లో ని భావాలను వీలు చిక్కినపుడల్లా బ్రహ్మణ విమర్శించటానికి రాసే మీరు ఆయానే పెద్దరికం వహించి మాదిగ రిసెర్వషన్స్ సమస్యను పరిష్కరించు కోవచ్చు కదా? మరి దలితులు కలసి బ్రహ్మణులను పెద్దరికం వహించటం లెదూ అని అడగటమెమిటి? మేధావులు పరిష్కార మార్గం చూపాలి — హర గోపాల్, బాలగోపాల్ కి జూపుడి అభ్యర్దన
( http://www.eenadu.net/archives/archive-8-5-2009/district/districtshow1.asp?dis=nellore#10)
@జయహో: నా సైద్ధాంతిక నిబద్ధతను ప్రశ్నించే ముందు మీరు ఈ సిద్ధాంతాలపట్ల కనీస జ్ఞానాన్ని సంపాదించుకోండి. కనీసం ఏ వ్యాఖ్య ఎక్కడరాయాలోకూడా తెలుసుకోండి. మీ వాదనలో జల్లెడకున్నన్ని చిల్లులున్నాయి. వాటిని లెక్కెంచి చెప్పే తీరికా, ఓపికా,అవసరం ప్రస్తుతానికి లేవు. జైగో!!!
@ GS Rao: బాబు అలా ఎవరివో స్కాన్ చేసి, పి.డి.ఎఫ్ ఫైల్సు ఉంచరాదు. వాటికి కొన్ని నీయమ నిబంధనలు ఉన్నాయని తెలియండి
@ కత్తి మహేష్ కుమార్: మహేష్ బాబు మీరన్నదే, " "చెప్పే తీరికా, ఓపికా,అవసరం ప్రస్తుతానికి లేవు.." చాల మంది బాధ. కొన్ని సార్లు ఆ టపాలు, ఆ వ్యాఖ్యానాలు చదవలేక వదిలివేయడం జరుగుతుంది. మీకు కూడా అది అర్ధం అవుతున్నందుకు సంతోషం. అందుకనే కొన్ని బ్లాగులకి, బ్లాగర్లకి దూరంగా ఉండడం శ్రేయస్కరం!
శ్రీ కత్తి మహెష్ కుమార్ గారూ ,మీరు వ్రాసిన బుచ్చి బాబు గారి పై విశ్లెషణ చాల బాగుంది.చివరకు మిగిలెది లొ ఇంకా హ్రుదయానికి హత్తుకొనె రచయిత వ్యకీకరణలు వున్నాయి.బుచ్చి బాబు గారిని గుర్తు చెసుకొనె అవకాశం యిచ్చినందుకు అభినందిస్తూ .....నూతక్కి
మహెష్ గారు మీకు అభినందనలు 200 పైన టపాలు ఇంత తక్కువ సమయంలొ ఎలా వ్రాయగలిగరు? మరియు కూడలిలొ ప్రతి మంచి టపా పైన కమెంటు తప్పకుండా వ్రాస్తారు. టైము ఎలా manage చెస్తారు? చెప్పి పుణ్యం కట్టుకొండి సార్
chadavaali! mallii malli chadavaali!
miiru cheppindi nijam! mummaatikii nijam!
Post a Comment