Saturday, May 16, 2009

ప్రభాత ప్రార్థన


ప్రతిక్షణాన్నీ
ఒక ఆశ్చర్యాద్భుతంగా
మలచడానికి
జీవితాన్ని
అదే ఆశ్చర్యాద్భుతంలో
ఆ సంభ్రమలో జీవించడానికి
ఆ ఆనందంలో
వెచ్చటి భాష్పాంజలి ఘటించడానికి

ప్రతి నిమిషం
ఒక విభ్రమలో
ప్రేమలో
క్షమలో
...నీ సన్నిధిలో
ఆలింగనలో
పరిష్వంగనలో...

the morning prayer

to create
every moment
an act of absolute astonishment
to live
in astonishment
and in wonder

and to cry
with tears of joy
and warmth

every moment
in awe
and in love
and in forgiveness

and in your embrace

(శేఖర్ కపూర్ కవితకు స్వేఛ్ఛానువాదం)

*****

6 comments:

అహ్మద్ said...

hmmmmm
బాగుంది చల్లగా వేచ్చగా హాయిగా కుడా ఉంది

aswinisri said...
This comment has been removed by the author.
భావన said...

చాలా బాగా అనువదించారు మహేష్... నేను చాలా సేపు ఆలోచించాను నేనైతే ఎలా తెనిగిస్తాను అని (ఎవరడిగేరు నిన్ను ఇప్పుడు అని అనకండి కవిత కదా మనసూరుకోదు ).. అదే వరుసక్రమం లోనే రాయాలని కనుక లేక పోతే
ఇలా రాస్తానేమో ...

నీ పరిష్వంగం...
ప్రతి క్షణాన్ని
ఆశ్చర్యాధ్బుతం గా అవిష్కరిస్తుంది..
ఆ ఆశ్చర్యాధ్బుతంలో బ్రతకనిస్తుంది..
అందులోని వెచ్చదనం
భాష్పాలను ఆనంద బాష్పాలను కూడా రప్పిస్తుంది.
ప్రతి క్షణాన్ని
క్షమతో ప్రేమ తో
దయతో నింపుతోంది
నీ పరిష్వంగం...

కవిత అర్ధమే మారిపోయినట్లు వుందా? సరిగా చెప్పగలిగేనా?

Bolloju Baba said...

ఈ ఆశ్చర్యాద్బుతం అన్న మాట ఎక్కడ దొరికింది మీకు. కవితలోని అందాన్ని మింగేస్తున్నట్లనిపిస్తుంది.
కొరుకుడు పడటం లేదు
టేక్ లైట్

మరువం ఉష said...

"వెచ్చని ఆనందభాష్పాల ఘోషించటానికి" ఈ పదప్రయోగం 7-9 పంక్తులకి సరిపడేదేమో? ఇక విభ్రమ, ప్రేమ, క్షమ - అమోఘం ఈ తమో, రజో, సాత్విక ప్రతీకలైన త్రిగుణత్మకత.

Malakpet Rowdy said...

Good one!