Tuesday, May 26, 2009

నేను


ఉఛ్చ్వాస నిశ్వాసాల నడుమ ఏ క్షణం నిలుస్తుందో

ఏ స్వరం లేమితో సంగీతం సుస్వరమవుతుందో

ఏ పదం లేకుండా కవి కల్పన కవిత్వమవుతుందో

ఆలోచన లేక ముందే ఏ భావన ఉదయించిందో

ఆద్యంతాలు కలిసే శూన్యం ఎక్కడ జనించిందో

ఆ క్షణాన్ని నేను

స్వరాన్ని నేను

పదాన్ని నేను

భావాన్ని నేను

ఆ శూన్యాన్ని నేను

*****

22 comments:

మాలతి said...

ఆ శూన్యాన్ని నేను - చాలా గంభీరమయిన భావం. బాగుందండీ కవిత.

Voyager said...

It reminds me of one of Osho's talks of discovering self. Nice expression. -- A

హరే కృష్ణ said...

baga vivarincharu..bhavam chala bavundi

శ్రీనివాస్ పప్పు said...

"ఉచ్వాసనిశ్వాసాల నడుమ క్షణాన్ని నేను,
ఆద్యంతాలు కలీసే చోట జనించే శూన్యాన్ని నేను".
అధ్బుతమయిన భావన మహేష్ కీప్ ఇట్ అప్ .

ప్రియ said...

Very good. Happy to come back to your blog again. Simply unbeatable expression.

Anonymous said...

బావుంది. కానీ శూన్యం అంటే...ఏమో!

సరే! కొన్ని ప్రశ్నలు మనం వదిలేస్తూ వస్తున్నాం. ఐనాగానీ రెండు మూడు విషయాలు ఖచ్చితంగా తెలుసుకుందాం అని అనుకుంటున్నాను.

1.అసలు మీకు తెలుగు ఉండాలని ఉందా? ఎందుకు మీకు అది బతకాలని ఉంది.

2.ఆ రామాయణం పోస్టులో - అమోరలిస్టిక్ సొసైటీ మీద ఏంటి ఇంటరెస్టు అని మూడు ప్రశ్నలు వేసేను. మీరు సమాధానం ఇవ్వలేదు.దానికి కూడా సమాధానం ఇవ్వండి.

౩.ఇక, మీరు కొణతం దిలీప్ తో ఏదో ప్రాజెక్టు అన్నారు.ఇంటరెస్టడా అన్నారు. ఖచ్చితంగా ఇంటరెస్టెడే! కానీ,నేను సైకిల్ తొక్కుతున్న వాళ్ళని చూసి ఆనందించే టైపు, అంతేగానీ నేనే తొక్కేసే టైపు కాదు అని ఇదివరకే చెప్పాను.సో అసలు ’ఇంటరెస్టెడ్’ అంటే - మీ భావం తెలుసుకుందామని ఉంది.

నేనింతవరకు ఎవరినీ మైయిల్లో కాంటాక్ట్ చేయలేదు.అది నేను పెట్టుకున్న ఓ రకమైన నియమం/ఓ ఇబ్బంది. కానీ, ఈ మూడో విషయంలొ మీరు ఇలా మాట్లాడలేకపోతే, ప్లీజ్ కైండ్లీ ఈ మైల్ మి.లెట్ మి సీ, ఇఫ్ ఐ కెన్ బి ఆఫ్ హెల్ప్ ఆర్ నాట్. లెట్ మీ నో సమ్ థింగ్ సో దట్ , ఐ కెన్ లుక్ ఇన్టు ఇట్.

ఇంతకీ ఇవ్వాళ నా బ్లాగులో "చివరికి అక్కడికే" అని నవ్వారు...అక్కడికే అంటే ఎక్కడికని!?

Bolloju Baba said...

adbutamaina bhaavam, kavitvaM. excellent.

pl check this word. i am not sure of it too. sorry

స్వరం లేమి or స్వర లేమి

పరిమళం said...

కవిత చాలా బావుందండీ ..

Ali said...

చాలా బాగుంది

Ali

Mali said...

I am not a big fan of poetry, but sometimes I do find myself enjoying a few poems. As for your poem, I cannot see the meaning of it. It just looks like playing with words. Sorry if that's rude. Can you elaborate what you wanted to convey through your poem/"Kavita"?

Kathi Mahesh Kumar said...

@మాలి: నేను చెప్పాలనుకున్నది "వివరంగా" చెప్పలనుకునుంటే వ్యాసం రాసేవాడిని. కవిత కాదు. కవిత నాకే అర్థంకాని నా భావాల్ని చెప్పుకోవడానికి.

ఈ భావ కవిత ద్వారా నేను ఇతరులకు చెప్పలనుకునేవి ఏవీ లేవు. విషయకవితలకూ,భావజాలాల కవితల ఉద్దేశాలుంటాయిగానీ భావకవితలకు కాదు. ఇదొక పిచ్చి. ఇదొక సొంత పిచ్చి. దీనివల్ల సాస్వతానికొచ్చే "లాభం" ఏమీ లేదు. ఏదో కొంత నా మదిలోని స్టీమ్ ను దించుకోవడం తప్ప.

Anonymous said...

తెలుగు గురించి జనాల అభిప్రాయాలని సర్వే చేసే ఉద్దేశ్యంలో ఓ ప్రైమరీ ట్రైల్ వేస్తున్నాం.

విజయ్ మాధవ్ అనే ఔత్సాహిక యువకుడు ఇందుకు సహాయంగా, ఇమ్మిడియట్ గా తన బ్లాగ్ లో ఈ సర్వే పెట్టారు. పర్ణాశాల పాఠకులందరికి, త్వరగా ఇక్కడ ఓ చిన్న ఆఫ్షన్ సెలెక్ట్ చేసి, పుణ్యం కట్టుకోమని మనవి.

http://vijayamadhava.blogspot.com/2009/05/rayray.html

Kathi Mahesh Kumar said...

@బొల్లోజు బాబా గారు:"స్వరలేమి" అని ఉపయోగిస్తే ఆ‘ఒక స్వరాన్ని’నేను అనేది చప్పలేకపోతున్నానేమో అనే ఒక సందేహం. వ్యాకరణం ప్రకారం ఏది సరైనదో నాకు తెలీదిగానీ, నాకైతే "స్వరం లేమి" నా భావాలకి సరిపోయిందనిపించింది.

@రేరాజు: ఈ కవితతో సంబంధం లేకున్నా మీ మూడు ప్రశ్నలకూ ఇక్కడ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
1. రామాయణం సంగతికాదుగానీ: ఇన్సెస్టు మీద ఇంత ఇంట్రెస్టు ఎందుకుటా!?
ఇన్సెస్టు మీద మనుషులకుండే ఇంట్రెస్టు నిషిద్ధమైన ప్రతి విషయం మీదా ఉండే ఆసక్తికి చిహ్నం.ప్రస్తుతం ఉన్న విలువల ఆధారంగా భూతకాలాన్ని బేరీజుచేసి జడ్జిచెయ్యాలనుకునే వారికి కొన్ని షాకులివ్వడానికి ఇన్సెస్టు ప్రస్తావన తేవడం జరుగుతుంది. ఉదాహరణకు "ఆడమ్-ఈవ్ సృష్టికి మూలమయితే వారి పిల్లలు ఎవర్ని పెళ్ళి చేసుకున్నారు?" లాంటి ప్రశ్నలు కొంత ఎఫెక్ట్ కోసం, మరికొంత విలువల వైరుధ్యాల మీద value judgment అవసరం లేదు అనే నిజాన్ని చెప్పడానికీ ఉపయోగిస్తాం. అదొక వాదనా పద్ధతి. దీనిలో ప్రత్యేకంగా నాకున్న ఇంట్రెస్టు అయితే ఏమీ లేదు.

2.పోనీ ఓ అమోరలిస్టిక్ లేదా ఇమ్మోరలిస్టిక్ సొసైటీ ఇప్పుడు ఎందుకు కావాలిట!?
Dominant paradigm కు వ్యతిరేకంగా ఏ విలువల్ని నిలిపినా దాన్ని ఇమ్మోరలిస్టిక్ సొసైటీ అనేస్తాం. కాకపోతే ఆ deviations నుంచే "కొత్త మార్పులు" ఉద్భవిస్తాయన్న స్పృహ ఉండాలంటే కొంత అమోరలిస్టిక్ స్పేస్ కావాలి. ఈ స్పేస్ కోసం ఎప్పుడూ కొంత మంది పోరాడుతూనే ఉంటారు. వాళ్ళనే change agents అంటాము. వీళ్ళు లేకపోతే "ప్రగతి" లేదు. పురోగమనం రాదు.

3.పోనీ రాముడి తోనో, మరో పాత్రతోనో ఇప్పుడు విలువలు చెబితే ఏమిటి నష్టంట? ఏమిటి కష్టంట?
నష్టం కష్టం రెండూ లేవు. కానీ చెబుతున్నవి కొత్త విలువలా లేక రాతియుగంనాటి పాచి విలువలా అనేవి వ్యక్తుల discretion కి వదిలెయ్యాలి.అలా వదలకుండా, "ఇదే absolute. ఈ పవిత్రమైన వాక్కుకి ఎదురు చెప్పకు" అంటే ఎదురు చెప్పడమేకాదు పీకిపాతరెయ్యడానికి సిద్ధంగా కొందరు తయారవుతారు.

తెలుగు గురించి. తెలుగు భాషేదో పెద్ద ప్రమాదంలో ఉందని నేను అనుకోను. సహజంగా దాని టైం ఐపోయి ఇలా తయారయ్యింది. దానికి తగినన్ని సాంస్కృతిక,రాజకీయ,సామాజిక,ఆర్థిక కారణాలు తవ్వకాల్లో త్వరలో లభించొచ్చు. అది ఈ రూపంలో బ్రతక్కపోయినా ఏదో ఒక రూపంలో తన అస్తిత్వాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి దాని బతుకుదెరువు సంగతి నాకు ప్రత్యేకంగా అవసరం లేదు.

మీరు సైకిల్ తొక్కేవాళ్ళు కాకపోతే నా ప్రతిపాదనకు అనర్హులు. కాబట్టి ఇంతటితో ఆ భాగస్వామ్యం చర్చ సమాప్తం.

"చివరికి అక్కడికే" అన్నది మీ తెలుగు భాష ప్రకరణ గురించి. ఎక్కడికెళ్ళినా మీరు తిరిగితిరిగి అక్కడికే రావడం గురించి.

Anonymous said...

On 1,2,3 - Fair enough;
ఓకే. ఇంకా ఏమన్నా ఉందేమో అని కూసింత భయపడ్డాను. ఇక ఇప్పుడు భయం లేదు; ఎందుకంటే, "మార్పు" సంబంధించిన ఆలోచనలపై మీ ఆలోచనల్లోనూ "మార్పు" లొస్తాయ్.
- కాలం చెల్లిపోయిన భాష మీద మీకు పెద్దగా భయం లేనట్టు, ఈ విలువల గురించి కూడా భయం పడక్కర్లేదు.
- అసలు అబ్సల్యూట్ అనేది ఉందా, ఉండాలా, ఉంటే ఏది లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు - ఇవన్నీ ఉఫ్ మని ఎగిరిపోతాయి. ఇలాటి వాటి రెలటివ్ స్థానం,

యాబ్సల్యూట్ లో వాటి పాత్ర అదే అవగతమైపోవచ్చు.

తెలుగు గురించి:
"ఈ రూపంలో బ్రతక్కపోయినా ఏదో ఒక రూపంలో తన అస్తిత్వాన్ని కొనసాగిస్తుంది." వరకు రైటే...కానీ, దాని "బతుకుదెరువు" - మన బతుకుల్ని శాసిస్తుంది.
అబ్జర్వర్ కి ఇది ప్రాబ్లెం ఉండదు; పార్టిసిపెంట్ కి మాత్రం చాలా బాధగా ఉంటుంది. అంటే:
"లిజార్డ్" కవితలో -
తొండని, పురుగును చూసే "కవి" - ఓ అందాన్ని చూసేస్తాడు.ఇది "లోకం తీరు" అని రాసుకుంటాడు. కానీ, ఈ సన్నివేశంలోని పాత్రల్లో - "పురుగు" పరిస్థితి వేరు. అది

ఇదే ఎందుకు "తీరు" అని ప్రశ్నిస్తుంది?

కాస్త కధ పొడిగిస్తే: ఆ పురుగు, ఆ తొండనోటి నుంచి తప్పించుకొని, "కవి" దగ్గరకొచ్చి, "ఈ తొండ నుండి నన్ను కాపాడు" అని జేబులో దాక్కుంటే!? ఆ తొండ "నా ఆహారం

నా కిచ్చేయ్" అని "కవి"తో అంటే!? అప్పుడు "కవి" ఏం చేస్తాడు? ఏం చేసినా సరే - ఇక్కడ్నించి "కవి" కూడా పార్టిసిపింట్ అయ్యాడు అన్నది నా ఎసెన్షియిల్ పాయింట్.

ఇక్కడ్నించి ఆలోచన భలేగా ఉంటుంది నాకు......:)

మీ కవితలో :
"ఆ శూన్యాన్ని నేను " - అది శూన్యమో కాదో కూడా!!!???? ఒకవేళ అది శూన్యమే ఐనా - మరి ఆ మిగితాది అంతా ఎవరు!!!????ఈ మిగితావాడు లేకుండా : ఈ "నేను"

ఎవరో!?

Mali said...

ఇంకొక చిన్న ప్రశ్న! ఇలాంటి భావకవితలలో పేరెన్నికదగ్గ కవులెవరో చెప్పగలరా? తెలుగులోనైనా, ఆంగ్లంలోనైనా!

నిషిగంధ said...

మహేష్, అంతా నేనేనని చెప్తున్నట్లే కనిపిస్తూ నేనేమీ కానని అంటోందీ కవిత! నేను శూన్యాన్నని చెప్పుకోడానికి (అది క్షణకాలమైనా) చాలా అంతఃశోధన చేసి ఉండాలి.. బావుందండీ కవిత!

ఇప్పుడే మీ కవితలన్నీ చదివాను.. 'తిరస్కృతి ' చాలా నచ్చింది! అలానే మీ అనువాదాలు కూడా.. మీరీ వ్యాసలవీ మానేసి ఫుల్ టైం కవిగా బాధ్యతలు స్వీకరించకూడదూ.. :-)

Kathi Mahesh Kumar said...

@మాలి: ఏదో ఒక దశలో కవులందరూ భావకవితలు రాసినవాళ్ళే. తిలక్,కృష్ణశాస్త్రులను మించిన భావకవులు తెలుగులో మరొకళ్ళున్నారనుకోను. ఇస్మాయిల్ గారు మరొకరు. ఆంగ్లంతో నాకు పెద్ద పరిచయం లేదు.

@నిషిగంధ: అస్తిత్వానికీ శూన్యానికీ మధ్య ఉండేదే జీవితం. అందుకే మనం ఎంతున్నామో అంతే లేమేమో!
కవిత్వం అప్పుడప్పుడే వస్తుంది. అదేమిటో! కాబట్టి ఫుల్ టైం కవిత్వం కుదరదు లెండి.

Anonymous said...

అంతా నేనే నని ఈ కవిత లో చెప్పని "పదమై" , ఈ కవిత "అంతా నేనే" నని చెప్పిందా!!!వావ్!!!!! ఐ థింక్ దెన్ ఐ డిడ్ నాట్ గెట్ ది పోయెమ్ ఎట్ ఆల్!!! వావ్....బ్రిలియంట్!
--------------------
శూన్యమై "ఉన్నది" - శూన్యమెలా ఔతుంది అని - "ఏమో!"అనుకున్నాను నేను.
______________
అందుకని నేను శూన్యం కాదు, శూన్యంలోనూ ఉన్నది "నేను" - సో అసలు శూన్యమూ లేదు.....

Kathi Mahesh Kumar said...

@రేరాజు: భావాల్ని సాధారణమైన narrative లో కుదించలేకపోతేనే నేను కవిత రాస్తాను.కాబట్టి "అర్థాన్ని" మళ్ళీ "చెప్పాలంటే" కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో అర్థంకన్నా అనుభవం ముఖ్యం.అది చదువరికి అందితే నా కవిత ధన్యం. లేకపోతే అది నా సొదగా మిగిలిపోతుందంతే.

ఇంగ్లీషులో చెప్పాలంటే life is actually what is between existence and void. It happens between moments of meaning and meaninglessness.అలాంటప్పుడు శూన్యానికీ,లేని స్వరానికీ/పదానికీ, frozen క్షణానికీ విలువ లేదంటే ఎట్టా? అదే జీవితమైనప్పుడు!!!

మరువం ఉష said...

శూన్యంలో మౌనాన్ని నేను
మౌనంలో రాగాన్ని నేను
రాగంలో భాష్యాన్ని నేను
భాష్యంలో భావాన్ని నేను
భావంలో జీవాన్ని నేను
జీవంలో పూర్ణాన్ని నేను
నేనన్న అహాన్ని వీడిన బ్రహ్మని నేను...

సూర్యుడు said...

@ఉష gaaru:

Wow

~sUryuDu :-)

మరువం ఉష said...

సూర్యుడు గారు, మీ ప్రతిస్పందనకి, అభినందనకీ కృతజ్ఞతలు.