ప్రేమిస్తేగానీ...
అవసరం అనుభూతి అవదు
అనుభవం సమర్పణ అవదు
కలయిక పవిత్ర్రం అవదు
చర్యలో లేనిది
భావనలో ఏముందో ?
భావుకత్వం
నిజానికి "విలువ"నిస్తే
మరి నిజానికి నిజమైన విలువెక్కడ?
అవసరంలోనే అనుభూతి ఉంటే
అనుభవం సమర్పణ కాదెందుకు?
పవిత్రతే ఒక అవసరమైతే
ఆ భావన విలువెంత?
ప్రశ్నలేగానీ జవాబులు లేవు
తెలిసిచెప్పకపోయినా
తలలు వేయి వ్రక్కలవవు
రహస్యంగా అనుభవించే
ఆలోచనలేగానీ
ఇవేమీ బేతాళ ప్రశ్నలు కావుగా!
అందుకే
నాకోసం
అందరికోసం
మరికొందరికోసం
ప్రేమిస్తేగానీ...
*****
8 comments:
ప్రేమిస్తేగానీ.....
మీ ప్రేమ కవిత్వం .. ప్రేమించేసాం... :-) :-)
I will have to both agree and disagree :)
mahesh గారు,
బాగుంది సార్
ప్రేమా గురించి రాస్తున్నారు..ఎవరినైన ప్రేమించారా?hmmm
చాల బాగుందండి.....
అవసరంలోనే అనుభూతి ఉంటే
అనుభవం సమర్పణ కాదెందుకు? ...
సమర్పణ కావాలంటే అనుభూతి ని అర్థం చేసుకోగలగాలి కదా .. చలం గారి మాటలు గుర్తున్నాయా మీకు.. మన జ్ఞానాన్ని ఇతరులకి పంచగలం కాని మన అనుభవాల్ని, అనుభూతుల్ని పంచలేమట. అనుభవం , అనూభూతి పంచగలిగినప్పుడు , పంచిన రీతిలో అర్థం చేసుకోగలిగినప్పుడు అది సమర్పణే కదా.
మీరేంటి చరిత్ర, పురాణాలు, రాముడు, సీత వదిలేసి ప్రేమ కవిత్వాల వైపు దారి మళ్ళించారు? పెళ్ళిరోజు, పుట్టినరోజు లాగా మీ ప్రేమ రోజమన్నా దగ్గర్లో ఉందా? లేక వచ్చెళ్ళిపోయిందా? :)
asalem artham kaledu. konchem vachanam? lo vivaristaara ?
అవును ప్రేమిస్తే కాని ఒక మనసుకి అందని విషయాలివి. అందినా అలా ఎందుకవుతుందన్నది మాత్రం అంతుబట్టని విషయమే. అదే ప్రేమేమో. అందుకే "ప్రేమిస్తే కానీ" తో పాటు "ప్రేమించినా కానీ" అని కలుపుకోవాలి.
కనీసం రెండు రకాల అవసరాలున్నట్టుగా తోస్తోంది. ఒకటి తీరంగానే దాన్ని గురించి మరిచి పోయే అవసరం .. ఉదాహరణకి ఆకలి. రెండోది, అవసరం తీరిన కొద్దీ ఇంకా ఇంకా కావాలి అనిపించే అవసరం. ఈ రెండూ అవసరం అనుభూతి అయినప్పుడు సమర్పణకి తోవతీస్తుంది.
Post a Comment