శీర్షికలోని ప్రశ్నచూసి చొప్పదంటు ప్రశ్నో లేక పిచ్చి ప్రశ్నో అనుకునేరు. చాలా సీరియస్ ప్రశ్న. కొత్తవాదన అనుకోకండి. తెలియని వారికి ఇది కొత్తగా అనిపించినా, తులసీరామాయణం, కంబరామాయణం,కుమారవాల్మీకి రామాయణం, ఆధ్యాత్మరామాయణాలకన్నా ముందున్న బౌద్ధరామాయణం తెలిసినోళ్ళకు ఇది కొత్త ప్రతిపాదనా కాదు. కొత్తవాదన అంతకన్నా కాదు. ఈ రామాయణం ప్రకారం సీత రాముడికి సోదరి అవుతుంది. వయసులో చిన్నది కాబట్టి చెల్లెలన్నమాట.
షాకింగ్ గా ఉందా! అంత ఆశ్చర్యపోనఖ్ఖరలేదు. కథ ఎంతైనా కథే కదా.
ఈ బౌద్ధజాతక కథ ప్రకారం, దశరధుడు అయోధ్యకు కాదు, వారణాశికి రాజు. అంటే కాశీరాజన్నమాట. అతనికి రామపండితుడు, లక్ష్మణకుమారుడు, సీత అనే పిల్లలు. కొంతకాలానికి ఆ పిల్లల తల్లి చనిపోతే మరొక భార్యను పెళ్ళిచేసుకున్నాడు దశరధుడు. ఆ రెండో భార్యకు పుట్టిన కొడుకు భరతుడు.కొత్తకొడుకు ఆనందంలో పెళ్ళాన్ని వరం కోరుకోమంటే, "నా కొడుక్కి ఏడేళ్ళు నిండేసరికీ రాజ్యాభిషేకం చెయ్యి" అని వరం కోరిందట ఆ పిచ్చితల్లి. దశరధుడు మండిపడితే భరతకుమారుడితల్లి అలిగి పడుకుంది. ఆ తర్వాత పీడించడం మొదలెట్టింది.
భార్య పీడనతోపాటూ, ఆ ఉన్మాదంలో మారుపెళ్ళాం తన పిల్లల్ని ఎక్కడ చంపించేస్తుందో అన్న భయంకూడా దశరధుడ్ని పట్టుకు పీడించింది. అందుకే,తెలివిగా ఒక ఆలోచన చేశాడు.తాను మరణిస్తే పెద్ద కుమారుడ్నే రాజుగా చెయ్యాలని నియమం కాబట్టి, అంతవరకూ పిల్లల్ని చావకుండా కాపాడాలంటే వారిని అడవులకు పంపడం సరైన మార్గమని తలచాడు. జ్యోతిష్కులతో సంప్రదించి తన ఆయుర్ధాయం ఇంకా పన్నెండేళ్ళుందని తెలుసుకుని, ఆ పన్నెండేళ్ళూ అడవుల్లోనో లేక ఏ సామంత దేశంలోనూ ఉండమని చెప్పి పంపేసాడు.
పిల్లలు దూరమైన శోకంతో దశరధుడు జ్యోతుష్కులు చెప్పిన సమయంకన్నా ముందే, తిమ్మిదేళ్ళకే మరణించాడు. అదే అదనుగా భరతకుమారుడి తల్లి భరతుడికి పట్టంగట్టాలనుకుంది. కానీ పండితులు అసలు రాజు అడవిలో ఉండగా ససేమిరా అన్నారు. వేరేదారిలేక భరతుడు రాముడ్ని వెతుక్కునివెళ్ళి పట్టాభిషేకానికి ఆహ్వానించాడు. కానీ తండ్రి మాట జవదాటని రాముడు, సీతా లక్ష్మణుల్ని తీసుకెళ్ళమని చెప్పి తన వనవాసం పూర్తయ్యాకనే వస్తానని చెబుతాడు. రాజ్యపరిపాలన ఎరుగని భరతుడి తాను ఎలా రాజ్యమేలతానని ప్రశ్నిస్తే, రాముడు తన పాదుకల్ని ఇస్తాడు. ఆ పాదుకల మహత్యం ఏమిటంటే, రాజ్యపాలనలో అన్యాయం జరిగితే ఒకదానితో ఒకటి జగడమాడటం మొదలెడతాయి. న్యాయం జరిగితేగానీ శాంతించవు. ఈ విధంగా భరతుడు రాజ్యపాలన చేశాడు.
వనవాసం పూర్తయిన మీదట, రాముడు రాజ్యానికి వచ్చాడు. భరతకుమారుడు మంత్రులతోసహా వెళ్ళి, రాముడ్ని రాజుగానూ, సీతను రాణినిగా చేసి రాజ్యాన్ని అప్పగించాడు.
ఈ రామాయణంలో రావణుడులేడు. హనుమంతుడు లేడు.యుద్ధం లేదు. రామాయణం ప్రబోధించే "విలువలు" లేవు. ఇక అన్నాచెళ్ళెల్ల వివాహం అంటారా, అప్పటి రాచరికంలో incestuous పెళ్ళిళ్ళు ఉండే అవకాశం పెద్ద ఆశ్చర్యకరం ఏమాత్రం కాదు. అమలి రాచరికపు రక్తం పేరుతో ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలోని చాలా రాచరికాల్లో ఉండటం మనకు తెలిసిందే.
ఈ కథను కొందరు రామాయణాన్ని కించపరచడానికి బౌద్ధులు పన్నిన కుట్రగా అభివర్ణిస్తారు. కానీ ఈ కథకు కొనసాగింపుగా సాగే వ్యాఖ్యానంలో బుద్ధుడు శుద్ధోధన రాజే దశరధుడని, లక్ష్మణకుమారుడు సారిపుత్రుడని, భరతకుమారుడు ఆనందుడనీ, సీతాదేవి యశోధర అని, తానే రామపండితుడ్ననీ చెబుతాడు. అలాంటప్పుడు ఇది రామాయణాన్ని అపహాస్యం చేసే ప్రయత్నమని ఎలా అనుకోవాలన్నది సందేహాస్పదం.
ఏదిఏమైనా ఇదొక ఆసక్తికరమైన కథ. ఇలాంటి కథే మరొకటి ఈ లంకెద్వారా చదవండి.
Thursday, May 7, 2009
సీత రాముడికి ఏమవుతుంది?
*****
Subscribe to:
Post Comments (Atom)
32 comments:
Hmm..does this mean that Ramayana was not a story, but a fact that happened in history!!??
అంటే బుద్ధుడు తన చెల్లెలిని వివాహం చేసుకొన్నాడన్న మాట. కొత్త విషయం.
నాగరికత తెలియని రోజుల్లో వావివరసలు లేని వివాహాలు పెద్ద ఆశ్చర్యం లేకుండా జరిగేవి. ఇప్పుడు ప్రపంచంలో ఏవో కొన్ని ఆటవిక జాతులలో మాత్రమే అలాంటి వివాహాలు కనిపిస్తాయి. ఉత్తర భారత దేశంలో బావ-మరదలు పెళ్ళి చేసుకోవడం కూడా నిషిద్ధమే. వాళ్ళు మేనమామ కూతుర్లని కూడా అక్క-చెల్లెళ్ళతో సమానంగా చూస్తారు.
స౦చలనాలను నమ్మే/సృష్టి౦చే వారికి ఇది పరమాన్నమే!! ఇ౦తకీ బుద్దుడు రాముడి సమకాలీకుడ్౦టారు. బాగు౦ది.
- పెదరాయ్డు
@పెదరాయ్డు: ఇది జాతకకథ అని చెబుతుంటే మళ్ళీ రాముడ్ని చరిత్ర పురుషుడ్ని చేసే వాదన చేస్తున్నారే! ఇదేమీ కొత్త సంచలనం కాదు. ఇది చాలా మందికి తెలిసిన బౌద్ధరామాయణమే.
@పిచ్చోడు: జాతక కథలు,బోధిసత్వుడి కథలూ బౌద్ధజ్ఞానాన్ని పంచేందుకు వాడిన పద్ధతులు.అవీ కల్పనలే. మన రామాయణం లాగా అవీ కల్పనలే.
@కుమార్:రామాయణం ఎప్పుడు రాయబడిందీ అని ఖచ్చితంగా చెప్పడానికే సరైన చారిత్రక ఆధారాలు లేవు. ఇక రాముడి వరకూ ఎందుకులెండి.
ఇంతకు ముందు ఈ కథ నేనూ విన్నాను కానీ, ఏమిటో మన రామాయణం(ఇందులో ట్విస్టులెక్కువ కదా) అలవాటై పోయి, ఈ కథ నచ్చలేదు.
నాస్తికులు వ్రాసేవి మత భక్తులకి నచ్చవు కదా. ద్విజేంద్ర నారాయణ్ ఝా అనే నాస్తికుడు పూర్వం బ్రాహ్మణులు ఆవు మాంసం ఎలా తినేవాళ్ళో వేదాలు సాక్షిగా బయట పెడుతూ ఒక పుస్తకం వ్రాసారు. ఆ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ కోర్టులో కేసు వెయ్యడంతో పాటు రచయితని చంపుతాం అని బెదిరించడం కూడా జరిగింది. మతం మనిషికి నేర్పించే అసహనం ఇలాంటిదే.
ఔనూ! బ్రాహ్మణులు నిజంగానే మాంసం తినేవారు; అదేదో " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అన్న స్టోరీ తరువాత, ఆ ముని ఎవరో "బ్రాహ్మణులకు మాంసం నిషిధ్దం" అని రూలెట్టినట్టు నాకో స్టోరీ గుర్తు; ఇవ్వాళ్టికీ కొందరు తింటున్నారు! దాని గురించి ఎందుకు గొడవై ఉంటుందబ్బా!?కాదు ఇంకా ఏదో అయ్యే ఉంటుంది.ఇట్స్ హాఫ్ స్టోరీ.
ఐనా అసహనం మతం నేర్పేడమేమిటి? అది మనిషికే ఉంటుంది గానీ!
1. రామాయణం సంగతికాదుగానీ: ఇన్సెస్టు మీద ఇంత ఇంట్రెస్టు ఎందుకుటా!?
2.పోనీ ఓ అమోరలిస్టిక్ లేదా ఇమ్మోరలిస్టిక్ సొసైటీ ఇప్పుడు ఎందుకు కావాలిట!?
3.పోనీ రాముడి తోనో, మరో పాత్రతోనో ఇప్పుడు విలువలు చెబితే ఏమిటి నష్టంట? ఏమిటి కష్టంట?
( ప్రశ్నలని కూడా అన్ డిటర్మినిస్టిక్ గా వేసే భాషని, సంస్కృతిని మనమే చంపేసామన్న స్పృహ మీకొస్తే, నా ప్రశ్నల్లో సగం లక్ష్యం సాధించనట్టు నేను :) )
బుద్ధుడికి ముందే రాముడి కధ జరిగినట్టుగా కధ రాసుకోవడం వల్లనే , "ది కాంసెప్ట్ ఆఫ్ రామా" బుద్ధుడికి ముందే యుండి యుండవచ్చన్న అనుమానం వచ్చింది. అలాగే స్టోరీలతో నీతులు చెప్పే ఆచారం అంతకుముందే యుండి యుండినదేమో నన్న అనుమానమూ వస్తుంది. "దశావతారం" సినిమాలో - విష్ణువూ, శివుడూ కొట్టుకున్న ఆ రోజుల్లో - అన్నట్టు - బుద్ధుడికీనూ, బుద్ధుడికి ముందున్న ఆలోచనలకీనూ మాంచి హోరాహోరీ ఇంటలెక్ట్యుయల్ యుద్ధమే జరిగి ఉంటుంది; అప్పుడూ కూడా, ఒకళ్ళ స్టోరీలను మరొకరు టాంపర్ చేసుకుంటూ బానే హాస్యాలాడుకునేవారన్నమాటా :)) మన బ్లాగుల్లోలాగా!
ఆరుద్ర(అనుకుంటా, సరిగ్గా గుర్తు లేదు) గారు వ్రాసిన "రామునికి సీత ఏమవుతుంది" అనే పుస్తకంలో, ఇలాంటి కధలు చాలా ఉన్నాయి...
mahesh gaaru,
ఏమో ప్రజలని బౌద్ధమతం వైపు ఆకర్షించడానికి జరిగినది ఎందుకయ్యుండకూడదు. ,
అంటే గౌతమ 'బుధ్ధుడు' అమలి(న)రాచరిక వ్యవస్త ప్రకారం తన చెల్లెలి వరసయ్యే యశోధరను పెండ్లాడి ఆ విషయాన్ని కవర్ చేసుకోడానికి ఈ రామయణ కధ అల్లాడంటారు! బుధ్ధుడు నన్ను క్షమించుగాక! అన్నట్టూ బుధ్ధుడు చరిత్ర పురుషుడా?? లేక పురాణ పురుషుడా ?? మరి జీసస్, మహమ్మద్ వున్నట్టు కూడా చరిత్రలో ప్రూఫ్స్ లేవే? మన కంటికి కనపడినవే నిజాలంటారా?? ఏంటో నాకంతా అయోమయం గా వుంది మాస్టారు!
సరే, కథ ప్రకారం మహేష్ బాబు కీర్తి రెడ్డి కవల పిల్లలు అయ్యారు అంటే చూస్తారు కానీ, ఎంత కథ ఐనా నాగార్జున అమల అన్నా చెల్లెళ్ళు అంటే ఫాన్స్ ఒప్పుకోరు గురూ. అప్రస్తుతమేలే .. కానీ వితండవాదాలకు తింగరి తర్కాలే బెటర్ ఏమో??
ఐనా ఇలాంటి 'కత 'లన్ని భలే పడతావ్ బాసు.
ఈ పుస్తకం నేను మాధురీ పబ్లికేషన్స్, విజయవాడ వారి దగ్గర కొన్నాను.
When perversion crosses boundaries, people go mad.
రేరాజ్ గారు, స్కాంద పురాణంలో విశ్వామిత్రుడు, వామదేవుడు కరువు సమయంలో శునక మాంసం తింటున్నట్టు కూడా కథలున్నాయి.
http://rishiparampara.com/aboutviswa.html
అజ్ఞాత గారు, ముహమ్మద్ పుట్టినట్టు పెర్షియన్ మరియు అరబ్ చరిత్రకారులు వ్రాసిన ఆధారాలు ఉన్నాయి. అవే హదీస్ సంకలనాలు. కానీ ముహమ్మద్ భోధించిన ప్రవచనాలు మాత్రం వివాదాస్పదం అయ్యాయి.
కత్తి గాడు మల్లి మొదలెట్టాడు... నువ్వు చదువుకోకుండా వుంటే బాగా వుండేదేమో..దీని వాళ్ళ నువ్వు ఏమి సదిస్తున్నవో అర్ధం కావటం లేదు.. అవును ఎప్పుడు హిందూ దేవుల్లలేనే టార్గెట్ చేసుకుంటావు.. క్రీస్తు, అల్లాలని మర్చిపోయావా లేక క్రీస్తు మీ దేవుడని వదిలేస్తున్నావా? మరి అల్లా ఏమి పుణ్యం చేసాడు.. గాడు అన్నదేంట అని ఫీల్ కాకు.. మొదట్లో గారు అనే వాడిని.. చూసి చూసి చిరాకు దొబ్బి ఇలా మొదలెట్టాను.. అయిన నీకు చెప్పటం దున్నపోతు మీద వాన పడ్డట్లేనని తెలుసనుకో.. ఏదో మానవ ప్రయత్నం.. :-)
>>ఇది జాతకకథ అని చెబుతుంటే మళ్ళీ రాముడ్ని చరిత్ర పురుషుడ్ని చేసే వాదన చేస్తున్నారే!
అనగా?
రాముడు చరిత్ర పురుషుడు కాదా? ఎలా కాదు? చరిత్ర పురుషుడు అంటే మీ నిర్వచనం ఏంటి? ఎవరి రాసిన చరిత్ర ప్రకారం రాముడు చరిత్ర పురుషుడు కాదూ?
కొందరి నమ్మకాలపై ఓ వ్యాఖ్య పడేసి, బ్లాగు పుట్టినరోజు జరుపుకున్నారు కానీ, మీ వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీస్తున్నాయి అని తెల్సి కూడా ఇలా చేసి, మీకు కావాలసిన్ "హిట్స్" "వ్యాఖ్య"లు తెచ్చుకుని పొందే ఆనందం ఏంటో మీవిజ్ఞతకే వదిలేస్తున్నా?
@రేరాజ్ -
అయ్యా, బేపణోళ్ళు మామంసం తిన్నారు తినలేదు, తమకేంటి, మీరు తిన్నారా? తింటే అది ఒప్పా? తినలేదా? అది ఒప్పుకాదా? దానిగురించి రాసుకోండి. అత్భుతంగా ఉంటుంది.
@అనామకుడు: ప్రస్తుతానికి రాముడు ఏ చరిత్రలోనూ లేడు.రామాయణం అనే పుస్తకంలో అతనొక పాత్ర.మహా అయితే పురాణపురుషుడవుతాడు. చరిత్ర పురుషుడు కాదు. కొత్తగా రాముడ్ని చరిత్రపురుషుడుగా నిరూపించే ఆధారాలు దొరికితే అంగీకరించడానికి నేను రెడీ.
నేను కొత్తగా ప్రజల మనోభావాలు దెబ్బతియ్యఖ్ఖరలేదు. ఈ బౌద్ధరామాయణం గురించి అచ్చ తెలుగులో బొచ్చెడు సాహిత్యం ఇదివరకూ అరుద్ర, కొడవటిగంటి కుటుంబరావు వంటి మహానుభావులు రాసేసారు. కాబట్టి మీరు భావవైశాల్యం కొత్తగా తెచ్చుకోకపోయినా,కనీసం కాస్త తెలుగు సాహిత్యాన్ని చదువుకోండి.
@అశోక్: మీ అసహనమైన అసహ్య వ్యాఖ్య చూసి మీ బ్లాగు కెళ్ళాను. చాలా భావుకత్వం ఒలికించే కవిత్వం రాస్తున్నారు. కానీ ఏంచేద్ధాం మీ స్థాయి ఇంతే అనుకుంటాను. ఇన్ని వైరుధ్యాలలో బ్రతికే మీమీద జాలితప్ప మరే భావమూ లేదు నాకు.
నేను క్రైస్తవుడ్నైతేమాత్రం నాకొచ్చే అవమానం ఏముంది? మాటిమాటికీ క్రీస్తును "మీదేవుడు" అనడం వలన మీరు చెయ్యదలచిన అవమానం ఏమిటి? అయినా నేను క్రైస్తవంలోను మూఢాన్ని ఖండించకుండా ఉన్నానన్నది మీ అపోహతప్ప మరేమీ కాదు. I pity you.
మీరు రాసే కవితల్లో భావుకత్వం కాదు. కనీసం మనిషిలా మనడం తెలుసుకోండి.
@అనామకుడు: బుద్దుడు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధం 6 century BC లో పుట్టి వ్యాప్తి చెందినట్టుగా నిరూపించబడ్డాయి. కాబట్టి అందులో పెద్ద తర్కమీమాంశలు ప్రస్తుతానికి లేవు. జీసస్, మహ్మద్ విషయంలో కూడా పెద్దగా వివాదాలున్నట్లు నేనెరుగను.
@మనోహర్ చెనికల: ఖచ్చితంగా అయ్యుండచ్చు. ప్రస్తుతం అమలులోఉన్న వివిధ బుద్ధశాఖల్లో బుద్ధుడి మూల ప్రభోధనలతో సంబంధం లేకుండా ఉన్నవి కూడా ఉన్నాయి. కాబట్టి, దానిలోకూడా చాలా కల్పనలు, కథలూ కాలక్రమంలో కలిసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ కథ కూడా అలాంటి కథొకటి కావచ్చు. ఈ అవకాశం చాలా ఉంది.
@రేరాజు: వేదాల్నీ,పురాణాల్నీ ఇతర గ్రంధాల్ని వాటి కాలమాన సమాజం దృష్ట్యా కాకుండా ప్రస్తుత విలువల దృష్ట్యా చూడటం మూలంగానే వాటిని చరిత్ర రచనకు "పనికిరానివిగా" చేశారని నాకు అనిపిస్తుంది. మన obsession గురించి వేరే టపాలో మాట్లాడుకుందాం.
మీకు అర్థం కాకపోతే మా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని తెలుగువాళ్ళు మాట్లాడే యాసలో చెపుతాను.
బేపి మాంసం తిన్న బాపనోళ్ళ కత స్కాంద పురాణంలో చదవలేదేటి? తెలిసి కూడా మళ్ళీ అడుగుతున్నారు, ఏం ఇకటాలాడుతున్నారా?
మహేష్ గారు, వాళ్ళు మీ ప్రాంతం వాళ్ళు అనిపిస్తే మీ చిత్తూరు యాసలో చెప్పండి. అప్పుడైనా వాళ్ళకి అర్థమవుతుందేమో. నేను జస్ట్ టెస్టింగ్ కోసం మా ఒరిస్సా సరిహద్దు యాస ప్రయోగించాను.
ఈ జాతక కథ సంగత్తెలీదు కానీ రాముడికి సీత సోదరి వరస ఇంకేదో రకంగా కూడా అవుతుందని చిన్నప్పుడెక్కడో చదివాను. అలాగే రావణుడికి కూతురో మనవరాలో అవుతుందని కూడా. అప్పట్లో అది కాస్త వింతగా అనిపించింది. ఐతే ఇప్పట్లోనూ బంధువుల్లోనే పిల్లల్ని ఇచ్చి పుచ్చుకునే చాలా కుటుంబాల్లో ఒకే జంటకి రెండు మూడు వరసలు కలవటం సాధారణమే అన్న విషయం అవగతమయ్యాక రాముడు-సీత వరసలూ అలాంటివే అయ్యుంటాయని అర్ధమయింది.
వాల్మీకి రామాయణం ఒక కథ. బౌద్ధరామాయణమూ ఒక కథ. వీటిల్లో నిజాలు వెతికి, నమ్మకాల్ని కలిపి, చరిత్రను బేరీజుచెయ్యడం అసమంజసం.ఒకస్థాయిలో మూర్ఖత్వం.
టపా కనీసం పూర్తిగా చదివి వ్యాఖ్యానించవలసిందిగా మనవి.
అబ్రకదబ్ర గారు. బంధువుల మధ్య పెళ్ళిళ్ళు జరిపే ఆచారం ఎక్కువగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ, కర్నాటక, తమిళ నాడు, కేరళ ప్రాంతాలలో కనిపిస్తుంది. దక్షిణ ఒరిస్సాలోని గిరిజన జాతుల్లో కూడా ఆ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తర ఒరిస్సా & తూర్పు ఒరిస్సాలో మాత్రం బంధుత్వ వివాహాలు నిషిద్ధమే. బావ-మరదలు వరసైన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా నిషిద్ధమే. దండకారణ్యంలోని కొన్ని గిరిజన జాతుల్లో కూడా బంధుత్వ వివాహాలు నిషిద్ధమే. దక్షిణ ఒరిస్సాలో ఎక్కువగా కనిపించే సవర (సౌర), కోంద్ (కంధ) గిరిజన తెగలు ద్రవిడ మూలాలు కలిగిన జాతులు. ఈ జాతుల వాళ్ళు మాట్లాడే బాషల్లో ద్రవిడ బాష అయిన తెలుగు పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్ళ ఆచారాల పైన కూడా తెలుగు వాళ్ళ ప్రభావం కనిపిస్తుంది. ఉత్తర ఒరిస్సాలోని గిరిజనుల బాషలు, ఆచారాల పైన తెలుగు ప్రభావం తక్కువ. వాళ్ళ బాషలపై హిందీ, బెంగాలీ, ఒరియా ప్రభావాలు ఎక్కువ. వాళ్ళ ఆచారాలు ఉత్తర భారతీయుల ఆచారాలకి దగ్గరగా ఉంటాయి. ఆచారాలు చరిత్ర కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంటాయి. ఒకే ప్రాంతంలో నివసించే రెండు వేర్వేరు జాతుల వాళ్ళ మధ్య కూడా ఆచారాల్లో తేడాలు కనిపిస్తాయి. వాల్మీకీ రామాయణం, బౌద్ధ రామాయణం రెండూ కేవలం కథలే కానీ చరిత్రలు కావు. ఆ కథలు వ్రాసిన వాళ్ళు వేర్వేరు చరిత్ర కాలాలకి చెందిన వాళ్ళు అయ్యుండాలి లేదా వేర్వేరు జాతులకి చెందిన వాళ్ళు అయ్యుండాలి. అందుకే ఆ రెండు కథలలో ఆచార తేడాలు కనిపించాయి. బావ-మరదలు మధ్య పెళ్ళిళ్ళని కూడా నిషేధించిన సమాజాలు అనేకం ఉన్నాయి. రామాయణంలో వావివరసలు లేని పెళ్ళి జరిగిందంటే ఇప్పుడు చాలా మంది నమ్మరు. నాగరికత పెరిగిన తరువాతే వావివరసలు లేని పెళ్ళిళ్ళని నిషేధించడం జరిగిందని చరిత్ర పుస్తకాలు చదివితే తెలుస్తుంది. మనకి తెలిసినంత నాగరికత రామాయణం వ్రాసిన వాళ్ళకి తెలియదు అన్న విషయం గుర్తుంచుకోవాలి.
@వన్నెలరాజ్యం: నేను క్రైస్తవమతానికి చెందను. నాకు వ్యక్తిగతాలేతప్ప మతాలు లేవు. నా బ్లాగులోనూ జీవితంలోనూ లక్ష్మణరేఖలు నేను నిర్దేశించుకునేవి. వాటిని దాటినా, మార్చినా,తగలేసినా అది నా నిర్ణయమవుతుందితప్ప మరొకటికాదు.
మరొక విషయం, ఇక్కడ నేను చెప్పింది కథ ఇందులో విపరీతార్థాలు ఏమీ లేవు.ఈ కథ ఇదిరకూ ప్రాచుర్యంలో ఉన్నదే. తెలుగు సాహిత్యంలో దిగ్గజాలనుకునే రచయితలు ఉటంకించినదే.
బ్లాగులో హిట్లు పెంచుకుంటే నాకొమ్ములకు కొత్త పదునేమీ రాదు.అదే నా ఉద్దేశమైతే, చక్కగా బూతుకథలు రాద్ధును వెబ్ ప్రపంచంలో వాటికున్నన్ని హిట్లు మరెక్కడా రావు.
వ్యాఖ్యలతో, హిట్లతో సంబంధం లేకుండా నాకు తోచింది రాసుకుంటూ పోవడం నా పద్ధతి.పైనవచ్చిన తింగరి వ్యాఖ్యల్లాంటివి వస్తే నా తరహాలో సమాధానం చెప్పి కంటిన్యూ అయిపోవడం నా స్టైల్.
కుమ్మేయండి మహేష్
వెన్నెల రాజ్యం గారు, నాగరికత తెలియని రోజుల్లో వ్రాసిన కథలు ఇప్పుడు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో చెపితే తప్పా?
@నాకు తోచింది రాసుకుంటూ పోవడం నా పద్ధతి.పైనవచ్చిన తింగరి వ్యాఖ్యల్లాంటివి వస్తే నా తరహాలో సమాధానం చెప్పి కంటిన్యూ అయిపోవడం నా స్టైల్.
మీ ఓపికకు :)
మలేషియా రామాయణం గురించి కూడా మహేష్ గారు వ్రాసి ఉండాల్సింది. మలేషియా రామాయణంలో మండోదరి దశరథుని భార్య, రావణుడు దశరథుని భార్యని మోహిస్తాడు.
హిందువులు ఏ మహేష్ గారి మీద మండి పడతారో ఆ మహేష్ గారి బ్లాగ్ ర్యాంక్ అలెక్సాలో 846,318 కి పెరిగింది.
http://telugu-blog.pkmct.net/2009/05/blog-post_13.html
why are you eager to find holes in other religions. Why can't you mind your business.
http://www.divyajanani.org/saibharadwaja/books/Readbook.asp?PNo=ME0000
"బుద్దుడు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధం 6 century BC లో పుట్టి వ్యాప్తి చెందినట్టుగా నిరూపించబడ్డాయి. కాబట్టి అందులో పెద్ద తర్కమీమాంశలు ప్రస్తుతానికి లేవు. జీసస్, మహ్మద్ విషయంలో కూడా పెద్దగా వివాదాలున్నట్లు నేనెరుగను"
"తెలుగు సాహిత్యంలో దిగ్గజాలనుకునే రచయితలు ఉటంకించినదే."
జీజస్ ,మహ్మద్ విషయం లో కూడా చాలా వివాదాలు ఉన్నాయండి ...యే విషయాన్నైనా బమ్మిని తిమ్మిని చెయగలం మనం ...ఇక్కడ history channel చూస్తే ఎన్నో కధనాలు కనిపిస్తాయి ....ఒక విషయాన్ని చరిత్రకారులు తమకు నచ్చిన విధంగా రాసేసుకుంటారు ...చిన్నపుడు టెలిఫోన్ గేమ్ ఆడేవాళ్ళం మేము ...ఒకరు ఒక విషయాన్ని చెవిలో చెప్తే చివరకు వచ్చెసరికి ఆ విషయం ఎలా మారిపోయేదో ...ఈ so called దిగ్గజాలు వాళ్ళు వాళ్ళ సొంత పైత్యాన్ని జోడించి రాసిందే కదా ....లేదా వాళ్ళు రాముడు ,జీసెస్ పుట్టినప్పుడు ఉన్నవాళ్ళా ...ఏ కధ అయినా నిజంగా జరిగిందా లేదా అన్న తర్కం కన్నా అది చదివినప్పుడు మనకు ఎదన్నా మంచి జరిగిందా అనే చూస్తాను ...ప్రతి మతం నమ్మకం మీద ఆధారపడిందే ....ఎన్ని ఆధారాలు ఉన్నాయన్నా ఎవరు నిరూపించలేరు ...ప్రతి విషయాన్నీ ఒక controversy చేసి తర్కం చెయ్యొచ్చు ...అదేమి పెద్ద విషయం కాదు ...ఇప్పుడైతే DNA లు వచ్చాయి కానీ మొన్నటి వరకు మన పుట్టుక అంతే కదా (DNA కూడా నిజంగా ఎంతవరకు నమ్మగలం )......ఒక తల్లి మన చూట్టుపక్కల వాళ్ళు ఇతడే నీ తండ్రి అని చెప్తే ఆ నమ్మకం మీదే మనం పెరిగి పెద్దవుతాము ....పెరిగి పెద్దయ్యాక అతను నీ తండ్రి కాదు అని ఎవరన్నా తర్కం చేస్తే దానిని నిరూపించుకోలేము ..ఇతరులు చెప్పిన ఆధారాలు నమ్మడం తప్ప .......ఇదీ అలాంటిదే :)
హిందువులలో చాలా మంది హిందూ సంప్రదాయాల గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు కాదు. హిందూ సంప్రదాయం ప్రకారం దగ్గరి బంధువుల మధ్య వివాహాలు నిషిద్ధం. బావ-మరదలు పెళ్ళి చేసుకోవడం కూడా హిందూ సంప్రదాయానికి వ్యతిరేకమే. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలలో దూరపు బంధువులని కూడా ఎవరూ పెళ్ళి చేసుకోరు. ఒకే గోత్రానికి చెందిన వాళ్ళైనా, ఒకే గ్రామానికి చెందిన వాళ్ళైనా దూరపు బంధుత్వం భావంతో పెళ్ళి సంబంధాలు కలుపుకోరు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బావ-మరదలు పెళ్ళిళ్ళు చేసే ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. కోస్తా ఆంధ్రలో మరీ విచిత్రంగా మేనమామ - మేనకోడలు పెళ్ళిళ్ళు చేసే ఆచారం కూడా కనిపిస్తోంది.
మరింత సమాచారం ఈ లింక్ లో చూడండి: http://viplavatarangam.net/2009/06/15/27
Post a Comment