Wednesday, May 27, 2009

దళిత లిబరలిజం

లోక్ సభ ఎన్నికల్లో మాయావతి ఉత్తరప్రదేశ్ లో ఓటమి చవిచూసింది. ఓటు శాతం తగ్గకపోయినా సీట్లు మాత్రం పోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దళిత-బ్రాహ్మణ కాంబినేషన్ కు నాంది పలికి ఒక కొత్త సమీకరణాన్ని సాధించినా ఆ మార్గం ఈ సారి ఫలితాల్ని ఇవ్వలేదు.

నిరసనవాద అస్తిత్వవాద దళిత గుర్తింపుతో భారత రాజకీయాల్లో ఒక దుమారం రేపింది మాయావతి. దళితులకు ఆధిపత్యం వహిస్తూనే ఉత్తరప్రదేశ్ లో భౌగోళికంగా, సామాజికంగా దళితులతో మమేకమైన ముస్లింల ఓట్లను సమాజ్ వాదీ పార్టీ నుంచీ లాక్కోవడంలో సఫలమయ్యింది. క్రితం ఎన్నికల్లో యాదవుల,ఠాకూర్ల రాజ్యంలో రాజకీయ గుర్తింపు కోసం ప్రాకులాడుతున్న బ్రాహ్మణులతో జట్టుకట్టి దళిత అస్తిత్వాన్ని మించిన రాజకీయపుటెత్తుగడ వేసి అధికారం కైవశం చేసుకుంది. దళిత బహుజన రాజ్యం ఒక్క దళితులవల్ల రాదనే పాఠాన్ని వంటబట్టించుకుందన్న తరుణంలో ఈ ఓటమి ఒక పునరాలోచనకు పిలుపు.

ప్రముఖ దళిత సిద్ధాంతకర్త చంద్రభాన్ ప్రసాద్ "మాయావతి తన ఇమేజ్ ని పునర్నిర్వచించుకోవాలి" అంటాడు. ముఖ్యంగా దళితులు తమ అస్తిత్వాన్ని కొల్పోకుండా ఇతర కులాల్ని కలుపుకుని సమానత్వం దిశగా, రాజ్యాధికారం దిశగా ప్రయాణించే "దళిత లిబరలిజం" మాయావతి లక్ష్యం కావాలని గుర్తుచేస్తున్నాడు. మాయావతికి "నేను దళిత స్త్రీని" అని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. తన పోరాటం "దళిత అణచివేతకు వ్యతిరేకంగా" అని ఎలుగెత్తిచాటాల్సిన అవసరం అసలు లేదు. తరాలుగా దళితకులాల్ని వంచించిన అగ్రకులాలపై నిప్పులు చెరగాల్సిన rhetoric అప్రస్తుతం. ఇవన్నీ తెలిసిన విషయాలే. కాబట్టి ఈ తరహా రాజనీతికి విలువ లేదు. అందుకే, మాయావతి ఉద్దేశం అన్ని కులాల,వర్గాల ప్రజలకూ నేతృత్వం వహించే ఒక దళిత మహిళగా ఎదగడమే కావాలి. దళిత లిబరలిజం సిద్ధాంతమే పునాదిగా ఈ ప్రయాణం జరగాలి.

****

13 comments:

Anonymous said...

ఏంటో ఇంకా కామెంట్స్ లేవు!

సరే మరి "అణచివేత- ధిక్కారం-పోరాటం- మార్పు -అణచివేత" ఈ వృత్తం కంప్లీట్ ఐయిపోయిందా! ఇప్పుడే "ధిక్కారం" మొదలైందన్నారు!?

My idea is not trying to say you are not sticking to the circle and you should stick to it till you finish the circle......

I want to know why is this change of thought midway!?

Anil Dasari said...

మిగతా అందర్లాగానే మాయావతివీ వోట్‌బ్యాంక్ రాజకీయాలు. ఆవిడ ఎవర్నో ఉద్ధరిస్తుందన్నది భ్రమ. సగటు రాజకీయా నాయకులందరిమల్లే, తనని తాను ఉద్ధరించుకోటమే ఆవిడ లక్ష్యమూ. ఈ ఇమేజ్‌ని పునర్‌నిర్వచించుకోవటాలూ గట్రా మాటలు కాలక్షేపానికే. జనాలు కూడా తెలివిమీరిపోయారు. ఎప్పుడెందుకెవరికోటేస్తారో అంతు పట్టదు. ఎవరి వ్యూహాలూ నిజమౌతాయని ముందుగానే చెప్పలేని పరిస్థితి. ఎవరైనా చెయ్యగలిగింది - ఎన్నికల ఫలితాలొచ్చాక ఏ వ్యూహం ఎందుకు ఫలించిందో, ఏదెందుకు బెడిసి కొట్టిందో విశ్లేషించుకుంటూ కూర్చోటమే.

Dhanaraj Manmadha said...

True indeed

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: మాయావతి దళిత మానసికతకు చేకూర్చిన నైతిక బలాన్ని మీరు సరిగ్గా అంచనా వెయ్యటం లేదు. She represents an ideology and a collective that was and is suppressed from ages. ఈ పరిణామక్రమంలో మాయావతి ఎదుగుదలకు గలను కేవలం రాజకీయ పరిణామంగా చూడకూడదు. మాయావతి ఒక సామాజిక విప్లవానికి సంకేతం. అందుకే she as a symbolic value అత్యంత మహత్తరమైనదీ, ప్రాముఖ్యత కలిగినది.

@రేరాజు: వృత్తం ఇంకా పూర్తి కాలేదు. ఇంకా రెండో దశలోనే ఉంది. నా ఆలోచనల్లో హఠాత్తుగా వచ్చిన మార్పేమీ లేదే!

గీతాచార్య said...

బాగా చెప్పారు అబ్రకదబ్రగారూ.

"ఎన్నికల ఫలితాలొచ్చాక ఏ వ్యూహం ఎందుకు ఫలించిందో, ఏదెందుకు బెడిసి కొట్టిందో విశ్లేషించుకుంటూ కూర్చోటమే."

హిహిహి.

నాయకులొస్తే బాగుంటుంది కానీ మరి వచ్చేవారేరీ?
మార్పు సహజం అనే వారే కానీ మార్పుని అంతే సహజంగా తీసుకునే వారేరీ? మాయావతే కాదు. ఏ ఇతర నాయకుడూ మన దేశాన్ని ఉద్ధరించేవారు కాదు.

Advani కాస్తా Ad vani గా మిగిలాడే కానీ తన హిందూత్వ లో ఒక rational basis ని కానీ progressive nature ని కానీ చూపెటలేక పోయాడు.

రాహుల్ తప్ప దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు లేరని స్వయంగా ప్రధానే అన్నాడంటేనే మన వాళ్ళ progressive mentality అర్థం అవుతుంది. ఇక్కడ రాష్ట్రం లోనూ, ఉన్న నాయకులు తమకు ఎదురు లేకుండా చూసుకునే పనే తప్ప యువ, సమర్ధ నాయకులని తయారు చేయలేక పోయారు. ఇక్కడా వారసత్వమే. ఇతర దేశాలని చూసి వాతలేసుకుంటమే.

మన దేశం లో నాయకులకి కరువొచ్చింది. సినిమాల్లో తప్ప సామాన్యుల్లోంచీ నాయకులు పుట్టే కాలం గతించింది. కుల, మత, ప్రాంతీయ భేదాలు తప్ప, వాటి ప్రాతిపదిక మీద తప్ప వేరే రకంగా జనాలకి పనికొచ్చే రాజకీయాలూ, నాయకులూ లేరు.

అలాంటాప్పుడు ఏ నాయకులైనా ఒకటే, ఏ ’మాయా’జాలమైనా ఒకటే. దళిత లిబరలిజమూ, స్టెఫీ గ్రాఫు ఫోర్ హాండూ, అన్నీ చూసి, విని, చెప్పుకుని ఆనందించేటందుకే కానీ, ఏ కోశానా సామాన్యులకి పనికొచ్చేవి కావు. సామాన్యులకి కావాల్సినది ఆ ఓత్లేసే ముందు ఇచ్చే డబ్బు, మమ్దు పాకెట్. ఒక జరిగిన సంఘటనే చూపుతాను. దాన్ని బట్టీ ఆలోచించ వచ్చు పరిస్థితులు ఎలా ఉన్నాయో.

http://thinkquisistor.blogspot.com/2009/04/1.html

ఇంకా చాలా ఉన్నాయి. నేను చూసినవి. కాస్త అవగతం కావాల్సిన విషయాలున్నాయి. అప్పుడు చాలారాయాలి. No chance of a rational political front in these times.

గీతాచార్య said...

@కత్తి గారు,

దళిత మానసికతకు చేకూర్చిన నైతిక బలం!!!. ఇదేదో బానే ఉంది కానీ మాయావతిని చాలా మంది ఎక్కువ అంచనా వేస్తున్నారు.

" She represents an ideology and a collective that was and is suppressed from ages". At present I won't agree with this statement. She has a long way to go and prove. She's a potential candidate for such things. Potential only. Not definite.

"మాయావతి ఒక సామాజిక విప్లవానికి సంకేతం". Shall I say one thing? This is a cool joke. If She can not repeat that feat in the forth coming elections, that past victory is to be treated as a mere fluke. నాలుగోదో, యాభై రెండోదో ఒక ఫ్రంటు వస్తే చక్రం తిప్పలనుకుంటం తప్ప, స్వయంగా ఏమీ చేయలేని వ్యక్తి తను. కాకుంటే ఒకటి అద్వానీ కంటే కాస్త మెరుగు.

Note: నేను నాయకులు అంది జనరల్ సెన్స్ లో. ఆ మాట నాయకురాళ్ళని కూడా రిప్రజెంట్ చేస్తుంది కనుక మహిళా సంఘాల వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను అపార్థం చేసుకోవద్దని మనవి.

గీతాచార్య said...

అన్ని జరిగీ మాయావతి పీయం ఐనా తొలి దళిత మహిళా పీయం అంటారే తప్ప, మాయావతి, ఇండియన్ పీయం అనరు.

నాలుగు పార్టీలున్న చోట, తన రాజకీయచాణక్యాన్ని ఉపయోగించి అధికారంలొకి వచ్చిన రాజకీయ చతురురాలుగా గుర్తించరు. అంతేనండీ. జనం attitude లో మార్పు రావాల్సిందే తప్ప నాయకులు చేయగలిగిందేమీ లేదు.

Kathi Mahesh Kumar said...

@గీతాచార్య: అంతర్లీనంగా మీ వ్యాఖ్యలో మాయవతిని ఒక వ్యక్తిగా లేక ఒక రాజకీయ నాయకురాలిగా మాత్రమే చూస్తున్న ధృక్కోణం కనిపిస్తోంది.

భారతీయ సామాజిక చరిత్ర నేపధ్యంలో మాయావతికున్న ప్రాముఖ్యతను, దళిత ఉద్యమ కోణంలోంచీ చూసే నా దృష్టి అందుకే బహుశా మీకు overstatement లాగా అనిపించుండొచ్చు.

Anil Dasari said...

@మహేష్:

>> "అంతర్లీనంగా మీ వ్యాఖ్యలో మాయవతిని ఒక వ్యక్తిగా లేక ఒక రాజకీయ నాయకురాలిగా మాత్రమే చూస్తున్న ధృక్కోణం కనిపిస్తోంది"

ఇంతకు ముందు ఆమె ఏమైనా అయ్యుండొచ్చు. ఇప్పుడు మాత్రం మాయావతి ఓ రాజకీయ నాయకురాలే. రాజకీయాలు ప్రజలందరినీ ప్రభావితం చేసే విషయాలు - ఏ ఒక్క వర్గాన్నో మాత్రమే కాదు. మాయావతి మన మంద కృష్ణలా ఓ కమ్యూనిటీ లీడర్ మాత్రమేనైతే ఆవిడ దళిత అజెండాని సమర్ధించొచ్చు. ప్రధాన మంత్రి కావాలని కలలు కనే వ్యక్తి ఓ వర్గ నాయకురాలిగా మిగిలిపోకుండా విశాల భావాలు అలవరచుకోవాలి.

ఎమ్మార్పీస్, మాల మహానాడు, ఆర్య వైశ్య సంఘం, కమ్మ సంఘం - ఇత్యాదివి ప్రత్యేకించి ఓ కమ్యూనిటీ అభివృద్ధి కోసం పనిచేసేవి. వాటి పరిధి అంతవరకే. రాజకీయ పార్టీలకి అంతకు మించిన పరిధి ఉండాలి. మన దురదృష్టమేమిటంటే - కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ - మనకున్న ప్రధాన పార్టీలన్నీ - బీజేపీ, ఎమ్మైఎమ్, కాంగ్రెస్, తెదేపా, బిఎస్పీ, అకాలీదళ్, నేషనల్ కాన్ఫరెన్స్, etc, etc - అన్నీ ఏదో ఓ స్థాయిలో కుల, మత సంకుచితభావాలకి లోబడి పనిచేసేవే కానీ తాము ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాలన్న తెలివి కొరవడింది వాటిలో. దీనిక్కారణం? ఈ పార్టీలన్నీ కొందరు వ్యక్తుల/కుటుంబాల కనుసన్నల్లో మెలగటం, ఆ వ్యక్తుల ఇష్టాఇష్టాలు ఆయా పార్టీలపై రుద్దబడటం. అందుకే మన పార్టీ వ్యవస్థ మారాలి.

అప్రస్తుతమైనా, ఒబామాతో మాయావతికీ పోలిక తీసుకురాక తప్పటం లేదు. ఒబామాని మాయావతి గుడ్డిగా అనుకరించాలని మాత్రం నా ఉద్దేశం కాదు. 'నల్లనయ్య' అంటూ ఆయన గురించి మీడియా చేసిన హడావిడే కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కానీ ఎప్పుడూ తన జాతిని ప్రస్తావించలేదు, ప్రత్యేకించి వారికే మేలు చేసే పనులు చేస్తానని చెప్పలేదు, చెయ్యటం లేదు. అందుకే కేవలం నల్లవాళ్లే కాక అమెరికా మొత్తం ఆయనలో మార్పు తేగలిగే నాయకుడిని చూసింది. మాయావతైనా, మరే ఇతర రాజకీయ నాయకుడైనా తెలుసుకోవలసింది ఈ చిన్న విషయమే: వాళ్లు ప్రజలందరికీ ప్రతినిధులు.

చైతి said...

Oh! chala baga cepparu

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర:"ప్రధాన మంత్రి కావాలని కలలు కనే వ్యక్తి ఓ వర్గ నాయకురాలిగా మిగిలిపోకుండా విశాల భావాలు అలవరచుకోవాలి. " నేను టపాలో చెప్పింది కూడా అదేనండి. కాకపోతే దళిత అస్తిత్వాన్ని త్యజించకుండానే ఆ "విశాల భావాలు" అలవర్చుకోవచ్చు అని చెబుతున్నాను. దాన్నే దళిత్ లిబరలిజం అన్నాను.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: మరొక మాట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి కేవలం ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ కేవలం దళితులకోసం పనిచేస్తుందనుకుంటున్నారా? కాదు. ఒకసారి ఉత్తరప్రదేశ్ వెళ్ళిరండి. లేదా ఉత్తరప్రదేశ్ లో ఉండే ఎవరితోనైనా మాట్లాడండి. లా అన్డ్ ఆర్డర్ పరంగా యూపీ ఎంత ప్రశాంతంగా ఉందో అభివృద్ధి పనులు ఎలా చకచకా జరుగుతున్నాయో, పరిపాలన (ముందున్న పాలనతో పోల్చుకుంటే)ఎంత క్రమంగా జరుగుతున్నాయో చెబుతారు. ఇవన్నీ కేవలం దళితుల కోసం చేసినవంటారా?

మాయావతి ఒక able administrator గా యూపీ ప్రజలకు పరిచయం. మీడియాకు మాయవతి విగ్రహాల పిచ్చి, బర్తడే ఆడంబరాలు పట్టినంతగా తన పరిపాలనా పటిమ పట్టదు. ఇక మధ్యతరగతి అర్బన్ ఎడ్యుకేటెడ్ జనతాకు మాయావతి ఒక క్యారికేచర్ మాత్రమే.

గీతాచార్య said...

అదేనండీ నేనూ అంది. పైన చెప్పినవాటితో పాటూ, దళిత పీయం, బర్త్డే పార్టీలూ పట్టినట్టుగా తాను చేసిన మంచి పనులు పట్టవు. అలా చేయగలిగే సామర్ధ్తం వచ్చేదాకా మాయావతి మీరు చెప్పిన స్థాయికి రానట్టే.