ఈ కాలం యువత ప్రేమ నిర్వచనం చాలా సింపుల్, "ప్రేమంటే... ఒక వయసుకొచ్చాక మానసిక, శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ఆపోజిట్ సెక్స్ 'తోడు' కోరుకోవడం" అంతే.
ఈ నిర్వచనంలో కేవలం వ్యక్తిగత భావనలు తప్ప సాంఘిక విలువలు, సామాజిక ఆదర్శాలూ కనపడవు. సమాజం అందించిన విలువల ఆధారంగా జీవితాన్ని గడుపుతున్న చాలా మందికి ఇది అంగీకారాత్మకం కాకపోవచ్చు. ఎందుకంటే, మనం ఒక పద్దతిప్రకారం ఆల్రెడీ నిర్వచింపబడిన (Well Defined) మూసలో పెరిగి, ఆ విలువల్ని జీర్ణించుకుని, పరిపూర్ణులుగా వ్యక్తిత్వాన్ని సంతరించుకుని ఏర్పడిపోయాం. కొత్త విలువలు లేక మనవి కాని విలువల్ని మన వ్యవస్థ (system) అసంకల్పితంగా రిజెక్టన్నా చేస్తుంది లేక నెగటివ్ గా రియాక్టన్నా అవుతుంది. కానీ చాలా వేగంగా మారుతున్న ఈ విలువల్ని అర్థం చేసుకోలేని సంధియుగం లో ఉన్న మనం వాటిని అందిపుచ్చుకోకపోయినా, కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నింఛాల్సిన అవసరం చాలా ఉంది.
లేకపోతే 'ఫ్యూచర్ షాక్' కోసం సిద్దంగా ఉండాల్సిందే. మొన్న ఒక స్నేహితురాలు నాతో చర్చిస్తూ ఒక మాటంది, "కులాంతర వివాహాలను అంగీకరిస్తూ మనం 'మనసులు విశాలం' చేసుకునే లోఫు, ఏ అమెరికా పిల్లనో చూపించి ఖండాంతర వివాహానికో, లేక అసలు అమ్మాయేకాక ఒక అబ్బాయితో స్వలింగ వివాహానికో తయారౌతున్న జనరేషన్ ఇది" అని. ఇంత ప్రళయం మన గుమ్మం ముందుకు రాక మునుపే, కనీసం మారుతున్న నిర్వచనాల్ని తెలుసుకుంటే అవి 'షాక్ అబ్జార్బర్లు' గా ఉపయోగపడుతాయి.
*****
5 comments:
చాలా వేగంగా పరిణామం చెందుతున్నా ఈ కాలంలో ఎంతటి షాక్ కైనా తట్టుకునేలా ఉండాలి.
కానీ, "ఈ కాలం యువత ప్రేమ నిర్వచనం చాలా సింపుల్, "ప్రేమంటే... ఒక వయసుకొచ్చాక మానసిక, శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ఆపోజిట్ సెక్స్ 'తోడు' కోరుకోవడం" అంతే. ఇంత జనరలైజ్డ్ స్టేట్మెంట్ ని నేను అంగీకరించలేను.
ఇంకా విలువలూ, వాటి తాలూకు ఆనందాలూ మిగిలే ఉన్నాయి.
అవును. మీరన్నట్టు జనరేషన్ ఇలాగే ఉంది. అంత మాత్రాన మన విలువలని కోల్పోవాల్సిన అవసరం లేదు.
నాకొకటే అర్థం కాలేదు. మార్పు ప్రకృతి సహజం అని చెప్పే పెద్దలు, నిజమైన మార్పుని చూసి ఎందుకు తట్టుకోలేరు?
సమాధానం తెలిసీ చెప్పకపోయారో...? మీ బ్లాగు వెయ్యి హిట్లు ఒక్క సెకను లో పడి స్టక్ అయిపోతుంది. :-)D
@గీతాచార్య: ఇక్కడ "విలువలని కోల్పోవ"డం కన్నా, కొత్త విలువల్ని ఏర్పరుచుకోవడం అనాలేమో! మనం ఇన్నాళ్ళూ అనుకున్నదీ,ఆచరించిందే "ఉత్తమమైన" విలువ అనుకుంటే ఎలా? కాలానుగుణంగా ఎన్ని విలువలు మారలేదు.ఇదీ అలాంటిదే అనుకుని అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నిస్తే మంచిదేమో.ఆలోచించండి.
మార్పు ప్రకృతి సహజం అని చెప్పడం సులభంగానే ఉంటుంది. కానీ తనదాకా వస్తే ఆ మార్పుతో "డీల్" చెయ్యడం కష్టం. కాబట్టే ఈ పెద్దలంతా....అంతే!
"ప్రేమంటే... ఒక వయసుకొచ్చాక మానసిక, శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ఆపోజిట్ సెక్స్ 'తోడు' కోరుకోవడం
అన్నది అక్షరాలా నిజం ...నిజాన్ని నిర్భయంగా చెప్పిన మీకు అభినందనలు
ఏమిటో మీరింత చిన్న పోస్టేసినా మొత్తం అర్ధం చేసుకోరు!
హరే రామా! హరే కృష్ణా! అపోజిట్ సెక్స్ ఏంటి - సేమ్ సెక్స్ ఐనా,జంతువులైనా,వయోభేదాల, తరతమ భేదాలు కూడా తేడాకూడా లేవని భావం! కాకపోతే, మేం దీన్నే "సెక్స్" అనుకునేవాళ్ళం.మారిన విలువలలో దీన్ని ప్రేమ అంటారని తెలుసుకోవటం మంచిదని తెలుసుకున్నాం.బై ద వే, సైన్సుతో ఇంకో చిన్న ప్రయోగం - "యాక్టివ్" టాయ్స్ ను లో-ఎండ్ సెగ్మెంట్ కి అమ్మటం; హై ఎండ్ లో - బెస్ట్ క్లోన్డ్ - పార్ట్లీ ప్రోగ్రామ్డ్ హ్యూమన్స్ ని అమ్ముతారు. :))
ఓ బేసిక్ ఇంస్టింక్ట్ తీర్చుకోడానికి ఎంత కష్టాలు పడాలో ఫ్యూచర్లో ప్రజలు :)
In my opinion Youth is not getting confused like this; They know what is love and what is sex.
If this is happening at large in the society, do you think we people- whereever we are - still depend on the visual sex aired to our homes every minute!
I have seen n number of english movies - where the charcters look for "love", inspite of having sex with other charcters! If we are able to undertand the human emotion in such drama, I think the human mind knows what is love; Watch for my review on Dev-D soon.
You may avoid my earlier comment; although i don't think there was anything wrong in it.
Post a Comment