Wednesday, May 6, 2009

కొత్త సంవత్సరం


ఉగాదిపోయి రెండు మాసాలవుతుంటే కొత్తగా ‘కొత్త సంవత్సరం’ అంటున్నాడేమిటా అనుకుంటున్నారా! ఇది ఆ కొత్త సంవత్సరం కాదు లెండి. నా బ్లాగుకి కొత్త సంవత్సరం. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బ్లాగడం మొదలెట్టాను. అంటే ఈ మే నెలకి కొత్త సంవత్సరం వచ్చినట్లే కదా!

నిర్ధిష్టంగా ఏంసాధించానో తెలీదుగానీ, రాయటాన్ని ఒక దినచర్యలో భాగంగా మాత్రం చేసుకున్నాను. కనీసం ఒక లైనైనా రాయకుండా గడచిన రోజులు ఈ సంవత్సరంలో వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అందుకేనేమో ఈ సంవత్సరం లో 200 టపాలు కట్టేసాను. బ్లాగులో పెట్టేసాను. అన్ని టపాల మీదా ఒకటో రెండో వ్యాఖ్యలు పాఠకులు దయదలిచి రాసినవి ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని టపాలపైన బారెడంత చర్చలూ, ఘాటైన విమర్శలూ, నిరసనలూ, తిట్లూదీవెనలూ అన్నీ జరిగిపోయాయి. సరిగ్గా లెక్క తెలీదుగానీ, అక్కడక్కడా నా సమాధానాలతో సహా దాదాపు 50 వ్యాఖ్యలున్నవి కనిపించినా కనిపిస్తాయి. అందుకేనేమో నా వ్యాఖ్యల మీటరు ఏప్రిల్ నెల దాటే సరికీ 3,000 సంఖ్య దాటినట్లు చూపించింది.

మధ్యలో నా హిట్ కౌంటరు తిక్కతిక్కగా ప్రవర్తించి తలతిక్క అంకెలు చూపించంది. కాబట్టి దాన్ని ఎంతవరకూ నమ్మాలో తెలీదుగానీ 40,000 మంది దాకా నా బ్లాగుని చూశారన్న ఫీలింగ్ మాత్రం, అబ్బో! చెప్పలేను. అంతేకాకుండా నా బ్లాగుని క్రమం తప్పకుండా చూసే 33 మందిని సంపాదించుకున్నాను. ఇక బ్లాగుల ద్వారా ఏర్పడిన మిత్రులు, శ్రేయోభిలాషుల సంగతి అద్భుతం ఆంతే!

ఈ సంఖ్యలు, అంకెలవల్ల నేను సాధించింది ఏమిటో నాకు అర్థం కాలేదుగానీ, నాదంటూ ఏదో ఒకటి చేశానన్న తృప్తి మాత్రం ఏంతో సాధించిన భావనను కలిగిస్తోంది.

ఈ సందర్భంగా నా బ్లాగు దర్శించిన అందరికీ, వ్యాఖ్యానించిన అందరికీ, వ్యాఖ్యానించని అందరికీ, తిట్టినవాళ్ళకీ, అభిమానంగా ప్రోత్సహించినవారికీ అందరికీ నా అభినందనలు.

****

22 comments:

గీతాచార్య said...

కంగ్రాచులేషన్స్ కత్తి గారూ. ఇదా సంగతి ఇవాళ నాకు కాస్త తీరిక దొరికిందేంటా మీ బ్లాగు మీద దాడి చేద్దాం అనుకున్నాను. మొత్తానికీ...

అన్నట్టు పదివేల హిట్లప్పుడు కూడా నేనే మొదట వ్యాఖ్యీకరించింది. ;-)

Anonymous said...

Happy Birthday to your blog.

asha said...

శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు...
మీ టపాల వల్ల, వాటిపై చర్చల వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.

Kranthi M said...

Happy new year mahesh garu.

శ్రీనివాస్ పప్పు said...

ధన్యవాదాలు మహేష్,ఈ బ్లాగింగ్ వల్ల ఏమి సాధిస్తున్నామో తెలియదు కానీ కొంత ఆత్మ సంతృప్తి మాత్రం ఉందని తెలుస్తోంది మీ రాతల వల్ల.ఏదయితేనేమి మీ బ్లాగుకి మీరే మహారాజు,చక్రవర్తి,అన్నీ కూడా.
అభినందనలు సాధించిన దానికి సాధించవల్సినదానికి కూడా...

Anonymous said...

మహేష్ గారు..

కంగ్రాట్స్ అండీ....

నేను బ్లాగడం జనవరి లొ మొదలెట్టా.. ఫిబ్రవరి లొ మీ బ్లాగు ని నెట్ లొ ఎలాగొలగా పరిచయం చేసుకున్నాను.. అప్పటి నుండి ఇప్పటివరకు... పేపరు చదువుతానొ లేదొ గాని మీ బ్లాగ్ ని మాత్రం రెగ్యులర్ గా దర్శిస్తాను. ఎక్కడా ఏ బ్లాగ్ చదివినా మీ కామెంట్స్ తప్పక ఉంటాయి... సమకాలీన అంశాలు, కవితలు.. సినిమా రివ్యూలు... ఇలా ఎన్నెన్నొ రాస్తూ.... బ్లాగడం దిన చర్యలొ బాగం అయిన మీకు ఆపై మీకున్న కమిట్ మెంట్ కి.... ఈ బ్లాగు పూర్వక శుభాబి నందనలు.. :-) :-) :-)
ఇంకా మీ నుండి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలని ఎదురుచూస్తూ....!

- $hankar

కొత్త పాళీ said...

You certainly have a unique voice among Telugu bloggers. Congratulations.

రాధిక said...

నా అభినందనలు కూడా అందుకోండి.
ఈ బ్లాగు క్రమం తప్పక చదివే జాబితాలో నా పేరుండకపోయినా మీ టపా వచ్చిందని తెలియగానే పరిగెట్టుకొచ్చే వాళ్ళలో నేను ఒకదానిని.
నాకు తెలిసినంత వరకు మీతో గొడవకి దిగిన మొదటి వ్యక్తిని నేనే అనుకుంటా :) మీతో అభిప్రాయాలు కలవకపోయినా మీరన్నా,మీ రాతలన్నా గౌరవం నాకు.

Praveen Mandangi said...

బ్లాగుల్లో బూతు వ్రాతల్ని నగంగా సమర్థించే మహేష్ గారు ఒక హానరేబుల్ బ్లాగరా?
http://telugu-blog.pkmct.net/2009/04/blog-post_13.html

నాగప్రసాద్ said...

Congratulations. మీ బ్లాగుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Hima bindu said...

congratulations ..n many happy rtns of the day .

durgeswara said...

ఎచర్యకైనా ప్రతి చర్య వుంటుంది ,ఆ దృష్టితో చూసినప్పుడు మనచర్య [అది వ్రాత కావచ్చు]ద్వారా ఎంతో కొంత ఇతరజీవరాసికి మేలు కలిగితే చాలు. మీవంటి మేధావుల రచనలు లోకానికి మేలుచేసేలా పదికాలాలు కొనసాగాలని కోరుకుంటున్నాను.శుభాభినందనలు.

పరిమళం said...

మహేష్ గారూ ! ‘కొత్త సంవత్సరం’ టైటిల్ చూసి ఇప్పుడేంటా అనుకున్నా ! అభినందనలండీ !

Anil Dasari said...

Happy birthday :-)

జీడిపప్పు said...

ఎన్ని బ్లాగులున్నా మీ బ్లాగుకున్న ప్రత్యేకతే వేరు. మీ 'ఆ టైపు" తప్ప మిగిలిన పోస్టులకు ఇప్పటికీ అభిమానినే! ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.

అన్నట్టు రేపటికల్లా మీ బ్లాగు హిట్ కౌంటర్‌ను 50,000 దాటించమంటారా?? :)

చైతన్య.ఎస్ said...

అభినందనలు

anveshi said...

congrats mahesh garu .keep writing..:)

గీతాచార్య said...

@Praveen's talks,

Good joke. :D

But the timing is not that good.

సుజాత వేల్పూరి said...

మీ బ్లాగు కి నేను రెగ్యులర్ రీడర్ని అన్న సంగతి మీకు చెప్పకర్లేదు. మీతో కొన్ని సార్లు గొడవలు(?) పెట్టుకున్నా, ఎక్కువభాగం మీ భావాలతో ఏకీభవించే టపాలే ఉన్నాయి. ముఖ్యంగా మీ భాష మీద నాకు భలే అసూయ! మరెన్నో మంచి టపాలు మీ నుంచి ఎప్పుడూ వస్తూనే ఉండాలి.

అదిసరే, మీరు కూడా" నా బ్లాగు పుట్టినరోజు" అని చెప్పుకోక తప్పదన్నమాట.(అభినందనలకోసం

Kathi Mahesh Kumar said...

@సుజాత: ఇదొక పునరావలోకనం. ఇప్పటివరకూ ఏంచేశామో చూసుకునే ఒక review. తప్పదు.మూణ్ణెల్లకో,ఆర్నెల్లకో, సంవత్సరానికో ఏదో ఒక సందర్భంలో చెయ్యక తప్పదు.

అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

@ప్రవీణ్/మార్తాండ: మీ ఒంటెద్దుపోకడ మీదే కదా!

సుజాత వేల్పూరి said...

నా వ్యాఖ్యలో బ్రాకెట్లో "అభినందనలకోసం కాకపోయినా" అని రాశాను. సగమే వచ్చిందే? నా ఉద్దేశం, మీరు జనం నుంచి అభినందనలు ఆశిస్తున్నారని కాదు.

మేధ said...

Congrats మహేష్ గారు...
ఇప్పుడే చూసా ఈ టపా... ఇదేంటా, క్రొత్త సంవత్సరం అన్నారు - నేను దాదాపు మీ బ్లాగు చూస్తూనే ఉంటా, ఇదెప్పుడు మిస్స్ అయ్యానా అనుకున్నా, కంటెంట్ చూసిన తరువాత అర్ధమయ్యింది :)

>>ఈ సంఖ్యలు, అంకెలవల్ల నేను సాధించింది ఏమిటో నాకు అర్థం కాలేదుగానీ, నాదంటూ ఏదో ఒకటి చేశానన్న తృప్తి మాత్రం ఏంతో సాధించిన భావనను కలిగిస్తోంది
That's true...