Sunday, May 10, 2009

ప్రార్థన


యంశైవా సముపాసతే
శివైతి బ్రహ్మేతి వేదాంతిన:
బుద్ధాహ బుద్ధైతి
ప్రమణాపతావ:
కర్తేతి నయ్యాయికా:
అర్హనిత్యాత జైన శాసనవతా:
కర్మేతి మీమాంశకా:
క్రైస్తాహ క్రిస్తయితి
క్రియాపవర్తాహ
అల్లేతి మోహమ్మదా:
సోయాంభో విధాధతు
వాన్ఛిత ఫలం
త్రైలోక్యనాథో హరి:

(ఇది మా కాలేజి ప్రార్థన. ఈ రోజు వింటుంటే, "ఎంత గొప్ప ఆలోచన" అనిపించింది)

7 comments:

Ali said...

మహెష్ గారు అన్యాయం దీని అర్థం చెప్పలెదు?

అబ్రకదబ్ర said...

ముక్కలు చెక్కలుగా అర్ధమైంది. మొత్తమ్మీద ఏమంటున్నారో బోధపడింది. ఐతే, కాలేజీల్లోనూ స్కూళ్లలోలా ప్రార్ధనలుంటాయా??

బొల్లోజు బాబా said...

అవును అన్యాయమే. :-)

గీతాచార్య said...

Cool. :-)

Well. How came this comment with my name?

I never write like that.

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర: మీకు ముక్కలుచెక్కలుగా అర్థమయ్యిందే మూలం లెండి. ఈ ప్రార్థన అన్ని మతాల దేవుళ్ళనూ ఫలసిద్ధికలగాలని విధ్యార్ధులు invoke చేసే ప్రార్థన.

నేను అర్థం రాయకపోవడానికి కారణం ఇది అందరికీ చూచాయగా అర్థం అయిపోతుందనే నమ్మకం. పైగా ఎవరైనా విజ్ఞులు ఈ ప్రార్థనకు అర్థం చెబుతారేమో అన్న ఆశకూడా ఏదో మూల ఉన్నింది.

మరొక చిలిపి ఆలోచన ఏమిటంటే,నేను హింద్యూమతం గురించి ఏమిరాసినా,బ్రాహ్మణద్వేషి/హిందూద్వేషి/క్రైస్తవుడు అంటూ రొమ్ముచాచుకుని విరుచుకుపడే మహానుభావులకు ఈ ప్రార్థన అర్థమవుతుందో లేదో! వారి స్పందన ఎలా ఉంటుందో చూద్ధామన్న కోరిక.

రెండూ తీరలేదు. కాబట్టి, నేనేదో sensationalism కోసం blasphemous టపాలు రాస్తాననే అపవాదు అంటకనే పోయింది. ఎందుకంటే, నిజానికి controversy లలో ఈ వ్యాఖ్యాతలకే చాలా రుచి. అందుకే చర్చనీయమైన అంశాలు, విషయగాఢత,లోతు కలిగిన వాటిల్లో వీళ్ళు అసలు వచ్చి వేలుపెట్టరు.ఎక్కడైనా ఉబుసుపోక "హిందూయిజం" అంటే మాత్రం పోలోమని తయారు.

మా కాలేజి Regional Institute of Education, Mysore. ఈ కాలేజ్ NCERT-National Council for Educational Research and Training వారి ఆధ్వర్యంలో డైరెక్టుగా Govt. of India HRD మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడపబడుతుంది.ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం national integration. ఈ ఆలోచనలో భాగంగానే ఈ ప్రార్థన. ప్రతి official function ఈ ప్రార్థనతోనే మొదలౌతుంది.

ఈ ఆదివారం మా alumni meet సందర్భంగా చాలా రోజుల తరువాత ఈ ప్రార్థన వినగానే, ఇక్కడ పెట్టాను.

Anonymous said...

నమ్మితే నమ్మండి; లేకపోతే లేదు. నేను వేసిన ఓ కామెంట్ సబ్మిట్ పైల్ ఐతే వదిలేశాను.

అది ఇది:
1. అలీ తో గొంతు కలుపుతున్నాను; ఇది అన్యాయం; అర్ధం చెప్పండి.
2.ఏ కాలేజ్?
౩.ఇది "గొప్ప ఆలోచన" అనిపించడం బావుంది; అది ఏదైనా -అది ఓ "ఆలోచన" అయ్యి ఉండొచ్చు. అర్ధం చెబితే ఆలోచిద్దాం అని

Anonymous said...

అన్ని మతాల దేవుళ్ళనూ ఫలసిద్ధికలగాలని - ఈ వాక్యం తప్పేమో! కాదు; అర్ధం అది కాదు; లెట్స్ కాల్ ఎ నాన్ బ్రామ్నికల్ - అండిటర్మినిస్టిక్ సంస్కృత పండితుడు. ఎవరన్నా తెలుసా? ఎవ్వ్వరూ దొరక్కపోతే ఓ పట్టు నేనే పట్టి చెప్తా;