Monday, May 18, 2009

హిందువులకు ‘జైహో’

భయ్ హో! అంటూ ముందుకొచ్చిన అతివాద,మతవాద,హిందుత్వవాదాల్ని ఈ ఎన్నికల్లో హిందువులు మట్టికరిపించారు. ఎమ్.జె.అక్బర్ తన ఎడిటోరియల్ లో చెప్పినట్లు "India is not a secular nation because Indian Muslims want it to be secular. India is a secular nation because Indian Hindus want it to be secular." అనేది జాతీయరాజకీయాల్లో మరోసారి ఋజువయ్యింది.

భయం ప్రాతిపదిక మీద. ద్వేషం ఆధారంగా. అసహనాన్ని నూరిపోసే బీజేపీ రాజకీయాల్ని నిర్ధ్వందంగా హిందూ ప్రజలు తిరస్కరించారు. వైషమ్య రాజకీయాలకన్నా, కుహానాలౌకికవాదంగా హిందుత్వవాదులచే పిలువబడే కాంగ్రెస్ ఉదారవాద రాజకీయానికి పట్టంగట్టారు. సామాన్యప్రజల రోజువారీ సమస్యలతో సంబంధం లేని, రిచ్యువలిజం తప్ప రిలిజియమ్ జీవితాల్లో లేని ఇన్సెక్యూర్ మధ్యతరగతి హిందుత్వవాద ధోరణి ఒక మైనారిటీ వాదం అనే నిజం తేటతెల్లం అయ్యింది.

ముస్లింల జనాభా ఎన్ని రెట్లు వృద్ధి చెందినా, క్రైస్తవంలోకి ఎంత మంది వెళ్ళినా హిందువుల మెజారిటీకి ఈ దేశంలో వచ్చే ఢోకా ఏమీ లేదు అనే నిజం జనాలకి తెలిసొచ్చింది. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లు తీవ్రవాద స్థావరాలైతే మనకొచ్చే ముప్పుకన్నా బీజేపీ మైనారిటీల్లో రేపే భయంవల్ల, హింసాకాండవల్ల ఏర్పడే తీవ్రవాదుల వల్లే మనదేశానికి ముప్పనే నిజం ఎరుకలోకి వచ్చింది. కాంగ్రెస్ మైనారిటీ,దళిత, గిరిజన విధానాలవల్ల హిందువులకు అన్యాయం జరిగిపోతోందనే బీజేపీ శుష్కవాదానికి తెరపడింది.

బీజేపీ పార్టీ రాజకీయ అస్తిత్వాన్నీ, నాయకత్వం యొక్క క్రెడిబిలిటీని, మూలతత్వమైన హిందుత్వాన్నీ ఈ ఎన్నికల ద్వారా ప్రశ్నార్థకం చేసి ఈ దేశ హిందువులు తమ భావవైశాల్యాన్ని నిరూపించారు. ప్రతి చిన్నాచితకా విషయానికీ మనోభావాలు దెబ్బతీసుకుని తమ నమ్మకాలు ఎద్దేవా చెయ్యబడుతున్నాయనే కుహానా మధ్యతరగతి హిందువులు ఒక అల్పబుద్దికలిగిన మైనారిటీగా నిరూపించబడింది. అందుకే చైతన్యవంతులైన మెజారిటీ హిందువులకు ఈ ఎన్నికల్లో జైహో!

****

15 comments:

Anonymous said...

పరిశీలనా శక్తి పూర్తిగా లోపించి (నషించి) రాసిన టపా..!!!

చదువరి said...

బీజేపీకి వోటేసిన వాళ్ళంతా కుహనా మధ్యతరగతి హిందువులా? వెయ్యని వాళ్ళు చైతన్యవంతులైన హిందువులా? భలే చెబుతున్నారండీ. మరైతే కాంగ్రెసుకు వోటేసిన 25 శాతం జనమంతా వారసత్వ పాలనను పోషించే, గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులను పూజించే, వెన్నెముక లేని బాపతు సరుకేనా? -ఔను మరి, కుటుంబ పాలన తప్ప కాంగ్రెసుకు మరో మూలతత్వమేదీ లేదుగదా!

ఒకటి మాత్రం నిజం.. బీజేపీయే గనక లేకపోతే, కాంగ్రెసు లాంటి దొంగ లౌకికవాదులూ, కమ్యూనిస్టుల్లాంటి హిందూ వ్యతిరేకులూ హిందువుల పీచమణచేసి ఉండేవాళ్ళెప్పుడో! బీజేపీ ఎక్కడికీ పోదు, అది స్థిరంగా అలాగే ఉంటుంది, హిందువుల గుండెల్లో అలాగే ఉంటుంది. హైందవానికి అపకారం చేసే దుష్టుల పాలిట అదే చెలియలికట్ట! అసలీ దేశంలో హిందువులకు ప్రత్యేకంగా ఒక పార్టీ ఉండాలనే అవసరాన్ని కల్పించిందే ఈ దొంగ లౌకికవాదం. అది బతికున్నంత కాలం పక్కలో బల్లెంలా, దొంగ లౌకికవాదులకు భయం కలిగిస్తూ బీజేపీ ఉంటూనే ఉంటుంది.

హిందూమతం, జయహో!

చిలమకూరు విజయమోహన్ said...

"ఈ దేశ హిందువులు తమ భావవైశాల్యాన్ని నిరూపించారు"
మిగిలిన మతాలకు ఎలాగూ ఆ భావవైశాల్యం లేదు.హిందువులకున్న ఆ భావవైశాల్యబలహీనతల్నే ఆసరాగా చేసుకునే ఈ కుహనా లౌకిక వాద కాంగ్రెస్ ఆడింది ఆట పాడింది పాటగా మనుగడ సాగిస్తోంది.దానికి వంతగా మీడియా,మేధావులనబడే కుసంస్కారులు తోడు.

కత్తి మహేష్ కుమార్ said...

@చిలమకూరు విజయమోహన్: భావవైశాల్యం ఎన్నటికీ బలహీనత కాదు. magnanimity కుంచించికుపోయి బీజేపీ కుత్సితమైన మతవిద్వేషాల రాజకీయం హిందూమతం పేరిట మొదలెట్టిన క్షణం, హిందూమత గౌరవానికి గొడ్డలిపెట్టుగా మారింది. కాంగ్రెస్ లౌకికవాదం "కుహానా" అయితే, నిస్సందేహంగా బీజేపీ మతతత్వం కుహానా హిందూమతవాదం. అందుకే దన్ని హిందుత్వవాదం అన్నారుగానీ హిందూమత వాదం అనలేదు. కారణం ఈ ధోరణిని సమర్థించేది కొందరు తిన్నది అరక్క మతం పేరుతో మారణహోమం చెయ్యలనుకునే మధ్యతరగతి మతపిచ్చిగాళ్ళు మాత్రమే.

@చదువరి: వారసత్వానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? కాంగ్రెస్ లో కుటుంబ పాలన ఉంటే బీజేపీలో సంఘపరివార్ (ఇదీ కుటుంబమే) పాలన ఉంది.కాంగ్రెస్ నేతలు ఒక కుటుంబంనుంచీ వచ్చినా వాళ్ళని ఎన్నుకున్నది ఓటువేసి ప్రజలు.అది ప్రజాస్వామ్యమా లేక రాజ్యాంగేతర శక్తుల్లాగా RSS,VHPలు అధికారం చలాయించే బీజేపీ అధికారం ప్రజాస్వామ్యమా?

బీజేపీ ఎన్నటికీ హిందువులందరి పక్షం కాలేదు.మెజారిటీ హిందువులు బీజేపీకి వ్యతిరేకం కాబట్టే అదింతవరకూ స్వయంగా అధికారం లోకి రాలేకపోయింది. ఇకపై బహుశా రాదుకూడా. కాబట్టి భయం హుష్ కాకి.

హిందూమతం జైహో! హిందుత్వవాదం ముర్ధాబాద్!! బీజేపీ డౌన్ డౌన్!!

@ఆకాశరామన్న: ఈ సారి బీజేపీ ఎన్నికల నినాదం ఏమిటో తెలుసా? ఒకసారి తెలుసుకుని ఆ తరువాత నా పరిశీలన గురించి మాట్లాడండి.

Krishna said...

నా అభిప్రాయం ఇక్కడ చూడండి
2009 ఎలక్షన్ల ఫలితాలు - ఆంధ్రప్రదేశ్

durgeswara said...

venna poosina kattulanu anmmi natteta munagatam himduvulaku alavaatele svaami.charitra chebutunna satyamidi. mee lakhsyam neravere prayatanam lo meeku komta samthosham kalagatam sahajame. ippati kilaa kaanivvamdi.

చదువరి said...

:) మీ ఉత్సాహం చూస్తూంటే ముచ్చటేస్తోంది.

ధర్మగ్లాని జరిగినపుడు బీజేపీ అవతరిస్తుంది. లౌకికవాద ముష్కరులను సంహరిస్తుంది. హిందూమతాన్ని రక్షిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి దాన్ని ఇలా చెప్పుకోవాలి: బీజేపీని ప్రజలే అవతరింపజేసి, కుహనా లౌకికవాదాన్ని సంహరింపజేసి, తమను తాము తరింపజేసుకుంటారు. ఇది తథ్యం. కుహనా లౌకికవాదమూ ఖబడ్దార్! :)

సరే.. ఇక కాంగ్రెసు వారసత్వాల గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిందేమీ లేదు. రాహులుగాంధీని తొందరగా పెళ్ళి చేసుకోమని కుర్ర కాంగీయులు వేడుకుంటున్నారట. అతడికి పెళ్ళై, పిల్లో పిల్లాడో పుట్టి పెద్దై ప్రధానమంత్రి అయ్యే వయసు వచ్చేసరికి మరీ ఆలస్యమైపోద్దేమోనని భయమంట. :) (ఇది సరదాకీ రాసిందేగానీ, నిజం కాదని చెప్పలేం) అధిష్ఠాన కుటుంబ సభ్యులను కీర్తించడం తప్ప మరో సిద్ధాంతం లేదు -అదొక పార్టీయా? దానికో సిద్ధాంతమా?

బీజేపీ హిందువుల పార్టీ కాదు. కానీ హిందూ మతాన్ని దొంగ లౌకికవాదుల నుండి రక్షించే పార్టీ. అసలందుక్కాదూ బీజేపీని ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచాలని ఈ దొంగలనుకునేది!

ఓ పేరడీ పద్యం చెప్పుకుందాం మాస్టారూ..

భరతఖండమొక చక్కని పంటభూమి
హిందువులు బేలతనమున ఏడ్చుచుండ
లౌకికులనెడి గడుసరి లౌక్యజనులు
పంటకోసుకుపొమ్మనె తుంటరులను

Anonymous said...

have a look at this.

http://akasaramanna.wordpress.com/2009/05/18/%E0%B0%AE%E0%B0%A4%E0%B0%A4%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%95%E0%B1%81%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B2%E0%B1%8C%E0%B0%95%E0%B0%BF%E0%B0%95%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6/

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

hold your tonuge.....

కొత్త పాళీ said...

This is the most twisted logic I heard from you.
Let me ask you something. Do you have any contact with any BJP politician or active supporter? Do you have personal knowledge of how the party or a particular local chapter of the party functions? I am not talking about generalized filtered stuff that appears in the media. I am talking about first hand knowledge. It is clear that you don't.

Phani said...

katti murdaabaad. loukikavaadam ante minorities maatrame kaadu, majority people gurinchi kooda alochinchaali,
once again katti murdaabaad.

కత్తి మహేష్ కుమార్ said...

@కొత్తాపాళీ: TRS ను ఓడించారు కాబట్టి తెలంగాణా వాదానికి విలువలేదు. ప్రజల ఓటు సమైక్యాంధ్రకు. కాశ్మీర్ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేశారు కాబట్టి కాశ్మీర్ సమస్య లేదు. అనేవి ట్విస్టెడ్ లాజిక్ కానప్పుడు. నాదిమాత్రం ట్విస్టెడ్ లాజిక్ అని ఎలా అనగలరు? నాకు బీజేపీ internal functioning గురించి fist hand information లేదని అనుకోకండి. Your conclusion about that is not right for sure. మీరు తెలుసుకోదలుచుకున్నదేదో ఒకసారి మెయిల్ కొట్టండి. వివరాలిస్తాను.

@ఫణి: కాంగ్రెస్ మెజారిటీ ప్రజల్ని(హిందువుల్ని) పట్టించుకోకుండా ఉంటే ఈ పాటికి ఆ పార్టీకి పుట్టగతులుండేవి కావు. కేవలం మైనారిటీలను పట్టించుకొనుంటే ఈ నాటికీ మైనారిటీలు ఇంత దీనస్థితిలో ఉండేవి కావు.కాబట్టి కొంత బయటికొచ్చి ప్రపంచాన్ని చూడండి.

@మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్: You please mind your business before asking me to hold my tongue.

@శ్రీకాంత్: ఆకాశరామన్న టపా నేను చదివాను. చాలా విషయాలతో నేను అంగీకరిస్తాను.

@చదువరి: మీ ఉత్సాహం చూసీ నాకు ముచ్చటేస్తోంది. చాలా రోజుల తరువాత మళ్ళీ మీరు ఇలా రావడం బాగుంది.

Anonymous said...

మెంటలెక్కిపోయిన దళిత వేషంలోని బ్రాహ్మణుడు మహేష్ గారి గురించి ఈ టపా తెరిచాడు.
http://okadesam.blogspot.com/2009/05/blog-post_7762.html

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

Ritualism అదీ అనడం బాలేదు. Ritualism లేని మతమే ప్రపంచంలో లేదు. నాస్తికులక్కూడా వాళ్ళ rituals వాళ్ళకున్నాయి. కాంగ్రెస్ గెలుపుని మీరు రాజకీయ కోణంలోంచి కాకుండా మతకోణంలోచి చూడ్డం ఆశ్చర్యం కలిగించింది. మీరు కోరేవి లౌకిక విలువలే అయితే మీరీ (మైనారిటీ) మతతత్త్వభాష వాడకూడదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అంతమాత్రాన బి.జె.పి. పనైపోయిందనీ, కాంగ్రెస్ కి భారతదేశం ౯౯ ఏళ్ళ కౌలుకివ్వబడిందనీ తలంచడం సరికాదు. ప్రజల దృష్టిలో మతం కాకుండా ఇంకా చాలా చాలా విషయాలుంటాయి. అదీగాక ఇక్కడున్న HYPOLEC (Higher-polled than each contestant) democracy సూత్రాల ప్రకారం తక్కువ వోట్లొచ్చినవారే అధికారం చేపడతారు. దాన్ని మెజారిటీ ప్రజాతీర్పుగా తలంచడం కూడా సరికాదు.

(నేను కాంగ్రెస్ వ్యతిరేకినైనంత మాత్రాన బి.జె.పి సమర్థకుణ్ణి కూడా కానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను

కత్తి మహేష్ కుమార్ said...

@తాడేపల్లిగారు: నా ఉద్దేశం "కేవలం రిచ్యువలిజం"అని. ఆచారాలు లేని మతం లేదు. కానీ అర్థం తెలీని అచారాల్ని మాత్రం పాటిస్తూ, వాటి అర్థాల్ని విస్మరించి కూడా హిందువులమనుకునే మధ్యతరగతి తప్ప బీజేపీ హిందుత్వ ధోరణిని సమర్ధించే హిందువులు తక్కువని నా నమ్మకం.

ఇక ఈ ఎన్నికలకు నా మతపరమైన విశ్లేషణ ఒక విధమైన అక్కసునుంచీ వచ్చింది. బీజేపీ తన ఎన్నికల ప్రచారమంతా మతతత్వం మీదా, తీవ్రవాదం మీదా (ఇక్కడా మతానికి ముడిపెట్టారు సుమా!), మన్మోహన్ మీదానే ఉంది. అలాంటప్పుడు అది ఘోరంగా ఓటమిపాలైతే దానికి మతపరమైన విశ్లేషణకాక రాజకీయ విశ్లేషణ చెయ్యాలా అన్న కసితో రాసాను. ఇందులో తర్కం,హేతువు తన్నుండొచ్చుగాక. కానీ బీజేపీ ప్రచారం మాత్రం తర్కంతో కూడుకున్నదా ఏమిటి?

సామరస్యం,శాంతి కోరుకునే ఎవరూ బీజేపీని సమర్థించలేరు. ఇక సమర్థించేవాళ్ళకి నిజంగానే దేవుడే దిక్కవుతాడు.