ఆ క్షణం లో జనించింది
మరో క్షణంలో నశించింది
చివరికి...
అప్పుడే మొదలయ్యింది
అదొక
విచ్చిన్నమౌతున్న
సూపర్ నోవా చిత్తరువు
ఈ సృష్టిలోని
అన్నిటిలాగే
కూలడానికే ఎగుస్తుంది
కూలితేనే తిరిగి ఎగుస్తుంది
జ్ఞానం బూడిద నుంచీ
సృజనాత్మకత జ్వలిస్తుంది
అదీ క్షణికమే...
అటుపైన మరణిస్తుంది
Passion
in the instant it beganit was over,
but then
in the end
it had just begun.
The picture is of a collapsing super nova,
which, like everything
(or no-thing)
in our universe,
rises
only to collapse
and then to rise again
only on the ashes of knowledge
can true creativity bloom,
but remains creative
only for a moment
and then dies
(శేఖర్ కపూర్ కవితకు స్వేచ్చానువాదం)
*****
4 comments:
1. ఎక్కడ సంపాదించారు? చాలా బాగుంది. (ఆంగ్ల మూలం)
2. సూపర్ నోవా తెలుగు సమానార్థకం తోచలేదా మీకు?
3. అనువాదం మరింత మెరుగులు దిద్దొచ్చు.
>>> remains creative only for a moment and then dies
*** *** ***
Passion dies? Funny.
అద్బుతంగా వస్తున్నాయి.
గొ అహెడ్.
@గీతాచార్య: ఈ కవితల ఆంగ్ల మూలం శేఖర్ కపూర్ బ్లాగు. ఈ క్రింది లంకెద్వారా మీరు వారి కవితలన్నీ చదవొచ్చు.
http://www.shekharkapur.com/blog/archives/poems/
అనువాదం అసంపూర్ణమే. మీ వంతు ఒక చెయ్యి వెయ్యండి.
@బాబాగారు: ధన్యవాదాలు.
మీ స్పెల్లింగులు ఈ మధ్య కొంచెం కుంటుతున్నాయి, రాతల్లో పేషన్ మరీ ఎక్కువైందేమో? :)
ప్రగాఢ
విఛ్ఛిన్న
Post a Comment