Friday, May 29, 2009

తెలుగు సినిమాల్లో స్త్రీల వస్త్ర ధారణ - కొన్ని ప్రశ్నలు ; జవాబులు

ఆస్ట్రేలియా శారదగారు తెలుగు సినిమాల్లో స్త్రీల వస్త్రధారణ చూసి "కంపరం, వెగటూ, రోతా" పుట్టించేసుకుని కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాలు ఇవి.

అవి చదివేముందు, పక్కనున ఫోటొల్లో ఉన్న హీరోయిన్లపై కొంత సమాచారం. నిండుగా చీరకట్టుకున్నది మా మదనపల్లె అమ్మాయి బిందు మాధవి. అవకాయ బిర్యానీ సినిమా తరువాత కష్టంగా మరో సినిమా సంపాదించుకుంది. ఆ పక్కనే ఒళ్ళువిరుచుకుని ఇలియానా. ప్రస్తుతానికి తన రెమ్యూనరేషన్ కోటి రూపాయల పైమాటే.

1. దీని ప్రభావం మనుషుల మీదా, సంఘం మీదా ఏమైనా వుంటుందా?
ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం, ఈ ధోరణికూడా ఆ ప్రభావం వల్లనే అయ్యుండొచ్చుకదా! సినిమా మన దగ్గర ఒక అసంపూర్ణస్వప్నాల్ని అందిపుచ్చుకునే ఒక (చీకటి) ఊహాలోకం. ఆ లోకంలో అణగారిన కోరికలుంటాయి, అందుబాటులో లేకపోయినా ఆశపడే అందాలుంటాయ్,సాహసాలుంటాయి,అసంబద్ధ పోకడలుంటాయి. అంటే సమాజనికి అద్ధం సినిమాలైతే, సినిమా అద్ధాన్ని చూసి ఇమిటేట్ చేసేవారికీ తక్కువలేదు.

2.ఆడవాళ్ళు ఇలాటి వస్త్రధారణని అవమానంగా humilitation భావించటం సబబేనా, లేక over reaction అవుతుందా?
సినిమా హీరోయిన్ వృత్తి (హీరోతోపాటూ)ప్రేక్షకుడ్ని titillate చేసి రంజింపజెయ్యటం. దాన్నొక ప్రొఫెషన్ గా చూస్తే, వారు వేసుకునే దుస్తుల్ని చూసి బాధపడనవసరం లేదు. కానీ, మనకున్నది “విలువల దృష్టి”. ఇలా ఉంటే “తప్పు” అనే pre-conditioned ధృక్కోణం నుంచీ చూస్తే మనకు మిగిలేది humiliation, అయ్యేది over reaction.

3. ఇలాటి సినిమాలూ, ఉండీ లేనట్టున్న ఆ బట్టలూ చూస్తే, ఎవరికైనా, బహుశా అందరు మగవాళ్ళకూ voyeuristic taste వుంటుంది కాబోలు అనిపించదా? అప్పుడది మగవాళ్ళకి అవమానంగా అనిపించదా?
చాలా మంది మగవాళ్ళు సినిమాకి వెళ్ళేదే ఈ voyeuristic pleasure “కుతి”ని అనుభవించడానికి. తమ suppressed sexuality కి ఒక చీకటి outlet కోసం. మరి ఇందులో అవమానంగా ఫీల్ అవడానికి ఏముంది? సినిమా ఒక గౌరవప్రదమైన దారాయె!

4.Is this a problem or just an annoyance? Is there anything anybody could do about this? Women’s organisations, thinkers, teachers?
మహిళా సంఘాలు ఎన్నోసార్లు ఈ “బూతు” సంస్కృతి మీద ధ్వజమెత్తి సినిమాహాళ్ళను ధ్వంసం చేశారు. అప్పటి నుండీ ఇప్పటి వరకూ ఈ ధోరణి సామాన్య ప్రజల్లో అంగీకారాత్మకం అయిపోవడంతో వీళ్ళకు చెయ్యడానికి ఏమీ మిగల్లేదు. ఇదొక విస్తృత సామాజిక ధోరణి దీనకి సమాధానం ‘ఎవరో ఒకరు’ వెతకడం కష్టం. సమిష్టిగా ఒక ప్రయత్నం జరగాలి. కానీ ఈ సమస్యను define చెయ్యడంలోనే చాలా సమస్యలున్నాయి. అందుకే బహుశా ఇంతవరకూ “ఇది చెయ్యాలి” అని చెప్పగలిగేవాళ్ళు లేరు. ఈ సందర్భంలో film studies లాంటి ఒక పరిశోధన చాలా అవసరం.
ఈ క్రింది లంకెలోని వ్యాసాన్ని ఒకసారి చూడండి
http://navatarangam.com/2008/08/telugu-sex-films/

5.Where does creative expression end and pornography begin?
Both are projected to be interrelated. Though they are actually not. Its saleability that is determining soft-pornographic aspects in mainstream Indian cinema, Telugu cinema in particular.


****

21 comments:

rākeśvara said...

http://sbmurali2007.wordpress.com/2008/11/12/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80/#comment-61

నాగప్రసాద్ said...

ఎక్స్ పోజింగ్ విషయంలో, ఇంకా శృంగారం వంటి సన్నివేశాల విషయంలో బాలీవుడ్ తోనో, ఇంకా ఇతర ఉడ్డులతోనో పోలిస్తే తెలుగు సినిమాలు చాలా చాలా నయం. అలాగే హింస విషయంలో హాలీవుడ్ తో పోలిస్తే తెలుగు సినిమాలు ఎన్నో రెట్లు బెటరేమో అనిపిస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ లో కత్తి పట్టడం, నరకడం అంతగా లేకపోయినా, ఏదైనా మనిషి చనిపోయే సీన్ లో ఎంతో జుగుప్సాకరంగా, మనకు వాంతి వచ్చేవిధంగా చూపిస్తారు. అందుకే నేను హాలీవుడ్ సినిమాలు చూడటం మానేశా.

తెలుగు సినిమా కథల్లో అంతగా దమ్ములేకపోయినా, కొద్దిమంది దర్శకులైనా మన నేటివిటికి ప్రాధాన్యమిచ్చేవారుండడం వల్ల నాకు తెలుగు సినిమాలంటే ఎంతో కొంత గౌరవం.

ఇంకా శృంగారం, హింస వున్నా కూడా మనవాళ్ళు హాస్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అందుకే తెలుగు సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం.

Anil Dasari said...

>> "చాలా మంది మగవాళ్ళు సినిమాకి వెళ్ళేదే ఈ voyeuristic pleasure “కుతి”ని అనుభవించడానికి. తమ suppressed sexuality కి ఒక చీకటి outlet కోసం. మరి ఇందులో అవమానంగా ఫీల్ అవడానికి ఏముంది? సినిమా ఒక గౌరవప్రదమైన దారాయె!"

ఇది చాలా దారుణమైన జెనరలైజేషన్. ఇదే నిజమైతే, మీరు పై బొమ్మలో పేర్కొన్న ఇలియానా నటించినటువంటి సినిమాలన్నీ సూపర్ హిట్లు కావాలి కదా. ఆ అమ్మాయి అత్యంత పొదుపైన వస్త్రధారణ చేసిన 'ఖతర్నాక్' ఘోర పరాజయం ఎందుకు పొందింది?

హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేసిన సినిమాలన్నీ హిట్టవుతున్నాయా? చక్కగా వంటి నిండా బట్టలు కప్పుకున్న సినిమాలన్నీ ఫ్లాపవుతున్నాయా? 'బొమ్మరిల్లు', 'రెడీ', 'గోదావరి', 'ఆనంద్', 'హ్యాపీ డేస్', 'ఆ నలుగురు', 'అనుకోకుండా ఒక రోజు', 'మంత్ర', 'గమ్యం', 'శ్రీ రామదాసు', 'అతడు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' .. ఈ మధ్య కాలంలో హిట్టయిన సినిమాల్లో అత్యధికం హీరోయిన్ల అంగ ప్రదర్శన లేనివే కావటం గమనార్హం.

కధానాయికల వళ్లు చూపించి సొమ్ములు చేసుకోవాలనేది దర్శక, నిర్మాతల భావ దారిద్ర్యం మాత్రమే - ఆ తప్పు ప్రేక్షకులది కాదు. సినిమా బాగా తీసే సత్తా లేకనే ఈ వేషాలు. వాళ్లెన్ని వేషాలేసినా, సినిమా బాగుంటేనే చూసేంత తెలివి ప్రేక్షకులకుంది. మసాలాల కోసం చేతి చమురు వదిలించుకునేవాళ్లు మీరనుకున్నంత మంది లేరు.

Praveen Mandangi said...

1970లలో జయమాలినీ, జ్యోతిలక్ష్మిల సినిమాలు ఆడుతున్న రోజులలో కూడా బూతు లేని శంకరాభరణం సినిమా హిట్ అయ్యింది. బూతు సినిమాలు మాత్రమే హిట్ అవుతాయనుకుంటే అది భ్రమే.

asha said...

నిజమే! vouyerstic pleasureని gratify చేసుకోటానికి కొంతమంది జనాలు వెళుతుండవచ్చు. youtubeలో తారసపడిన కొన్ని వీడియోలను చూశాక నాకు ఆ విషయం అర్ధమయ్యింది. అందరికీ అవే ఆలోచనలు ఉంటాయని generalize చెయ్యలేము. ఇది తప్ప ఇంకేమీ మనలను 'రంజింపచేయదని' వాళ్ళనుకోటమే నాకు బాధ కలిగించే విషయం. మనవాళ్ళకున్న ఒకేఒక్క వినోదం సినిమా అయిపోవటంతో ఇంక వేరే దారిలేక చూస్తున్నారు. విలువలు అనే అద్దంలో చూడటం ఎంత తప్పని మీరనుకుంటున్నరో వాళ్ళు ఈ విధంగా సినిమా అంటే ఇంతే అని మనని 'condition' చెయ్యటం కూడా అంతే తప్పని నా ఉద్దేశ్యం. ఇంకో భాషలో సినిమాలు చూసేవారికైతే పరవాలేదు. తెలుగే చూసేవాళ్ళ పరిస్థితి ఏంటి?
హీరోయిన్స్ humiliationకి గురవుతున్నారనే నాకనిపిస్తుంది. అలా అంగాంగ ప్రదర్శన చేయటం ఇక్కడ పైకి రాటానికి తప్పనిసరి అయిపోయింది కాబట్టి. వాళ్ళకు ఏమాత్రం చాయిస్ ఉండి చచ్చింది? అసలు వాళ్ళ పాత్రలే చాలా అద్వాన్నంగా ఉంటాయి.

"కధానాయికల వళ్లు చూపించి సొమ్ములు చేసుకోవాలనేది దర్శక, నిర్మాతల భావ దారిద్ర్యం మాత్రమే "
i second this opinion.
It's only because of their(a few rich people) impaired imagination telugu cinema has been
degraded to the present state.

Anonymous said...

me madanapalli ammayi,,bayata cinema functions ki elanti dresslu vesukostundo okasaari gamaninchandi..avakasam raavaalegaani iliyana la cheyataniki em abyantaram ledani statement kuda ichindi.!!!!

Srujana Ramanujan said...

మూడో పాయింట్ మీరు మరీ ఏక పక్షం గా, ఆలోచనా రహితంగా రాసినట్టున్నారు. దాని కోసం ఐతే వేరే మార్గాలు చాలా ఉన్నాయి.

అబ్రకదబ్ర గారు చాలా valid points లేవనెత్తారు.

గీతాచార్య said...

ఒకవేళ జనం బూతు సినిమాలు మాత్రమే చూసే రకమైతే శంకరాభరణం లాంటి సినిమాలు ఎలా హిట్ అయ్యాయి? అది కూడా జయమాలిని, జ్యోతిలక్ష్మిల సినిమాలు ఆడే రోజుల్లో?

వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Marthanda | మే 29, 2009
*** *** ***

Hw's it?

Well said naa? :-D

Padmarpita said...

నేను అబ్రకదబ్రగారితో ఏకీభవిస్తున్నాను....

శారద said...

"కంపరం, వెగటూ, రోతా" పుట్టించేసుకుని కొన్ని ప్రశ్నలు సంధించారు.I found this rather amusing usage, పుట్టించేసుకుని. ఆ ఫీలింగ్సు నేను పనిగట్టుకుని పుట్టించుకోలేదు. ఎందుకో మరి నాలో పుట్టాయి. నాలా ఇంకెవరైనా పుట్టించేసుకుని, పట్టించుకుంటున్నారా, లేక మీలా పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటున్నారా అన్న విషయం తెలుసుకోవటానికే ఈ చర్చ లేవనెత్తాను.

ఇంతకు ముందొకసారి మీరు "ఇందులో తప్పు వుందా లేదా అనేది మనం తొడుక్కునే విలువలని బట్టి వుంటుంది" అన్న అర్ధం తో రాసారు. I am not quoting verbatim. Just for clarification నేను తప్పొప్పుల మాట పట్టించుకోవటంలేదు. Those are very subjective. ఆ ఆడవాళ్ళు ఎందుకు బట్టలిప్పుకుంటున్నారు? ఆ సినిమా మేకర్స్ ఎందుకు అలా తయారు చేస్తున్నారు లాటి ఫిలసాఫికల్ ప్రశ్నలజోలికీ నేను పోలేదు. ఎందుకంటే వాటికి జవాబులు అందరికీ తెలుసు కాబట్టి.

నా ఆలోచనల్లా రెండే విషయాల గురించి-
1) ఎటూ కాని వయసులో వున్న టీనేజర్స్ మీద ఇలాటి అంగాంగ ప్రదర్శన ఎలాటి పరిణామాలనిస్తుంది? వాళ్ళకి ఆడవాళ్ళ మీదా, శారీరక సంబంధాల మీదా ఎలాటి అభిప్రాయాలేర్పడతాయి? ఏవైనా నెగెటివ్ ఎఫెక్టులుంటే వాటిని మనం ఎలా ఎదుర్కొంటాం?
(రాకేశ్వర రావుగారి కామెంటు చాలా ప్రాక్టికల్గా వుంది.)
2) ఆడ వాళ్ళని కేవలం lumps of fleshలా స్టీరియోటైపు చేస్తుంటే చాలా అసహనంగా అవమానంగా అనిపిస్తుంది. మగవాళ్ళని You are just an imbecile who buys anything if sold by a near naked woman అని పదే పదే స్టీరియోటైప్ చేస్తే మగవాళ్ళకి చిరాగ్గా వుండదా? మీ వ్యాసానికొచ్చిన వ్యాఖ్యలు చూస్తుంటే నా ఆలోచన నిజమేననిపిస్తుంది. (భవాని, అబ్రకదబ్ర, సృజన గారి వ్యాఖ్యలు.)

"నువు స్వతంత్ర జీవివి. పుచ్చుపట్టిన భావాలకూ సంప్రదాయాలకూ భయపడాల్సిన పని లేదు. నీ ఒంటి గురించి సిగ్గు పడాల్సిందేమీ లేదు. నలుగురికీ చూపించు. చూపించి గర్వపడు. భగవంతుని సృష్టిలోకెల్లా అద్భుతమైనది స్త్రీ. ఆ స్త్రీ సౌందర్యాన్ని చూడటానికి అందరికీ హక్కు వుంది. తన అందాలు చూపించుకోవటంలో ఆడదానికి సంఘం పెట్టిన ఆంక్షలని ఎదిరించి పోరాడు." ఇవి రాంగోపల్ వర్మ టైపు మేధావులు చెప్పే ప్లాటిట్యూడ్స్. వినటానికి ఇవి స్త్రీవాదం లా వినిపించినా నాకెందుకో అవకాశవాదం, పురుష వాదం లా అనిపిస్తాయి.

Before you cry foul again, ఇక్కడ చర్చ సంప్రదాయాల గురించీ, సంఘం కట్టుబాట్ల గురించీ కాదు. మనుషుల self respect గురించీ, దాన్ని మీడియా పదే పదే దెబ్బ తీస్తున్న విధానం గురించీ.

సంప్రదాయం ఆడదాన్ని తన శారీరం గురించి సిగ్గుపడమంటే, మీడియా మేధావులు ఆ శరీరాన్ని చూసి గర్వ పడమంటారు. నాకిద్దరూ నచ్చరు. శరీరమే కాకుండా, ఆడదానికి మేధస్సూ, ఆత్మ గౌరవమూ, ఆలోచనా, వృత్తీ, ప్రవృత్తీ లాటివి వున్నాయి. వీటిని కించపరిచి, అవమానించేదే ప్రక్రియైనా సంఘానికి మంచిది కాదు, అని నా అభిప్రాయం. ఇదే అభిప్రాయంతో ఇంకెవరైనా వున్నారా లేదా అన్న విషయం తెలుసుకోవటానికి నేనీ విషయాన్ని చర్చకు పెట్టాను. ఈ చర్చల వల్ల క్రియా రూపంలో ఏదైనా మంచి జరిగితే that is always welcome.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: నా టపాకూ మీ వ్యాఖ్యకూ context వేరువేరు.

చర్చ ‘ఎక్స్పోజింగ్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయా?’ కాదు.‘ఇలాటి సినిమాలూ, ఉండీ లేనట్టున్న ఆ బట్టలూ చూస్తే, ఎవరికైనా, బహుశా అందరు మగవాళ్ళకూ voyeuristic taste వుంటుంది కాబోలు అనిపించదా? అప్పుడది మగవాళ్ళకి అవమానంగా అనిపించదా?’ అనేది. ఆ ప్రశ్నకు తగ్గట్టే నా జవాబుంది.

వయొరిస్టిక్ ప్లెజర్ పొందడం ఒక సామూహిక సంస్కృతిగా ఎదిగిందనడానికి ఉదాహరణే గౌరవప్రదంగా సినిమాల్లో హీరోయిన్ అందాల్ని జుర్రుకోవడం.అది ‘మర్యాదస్తులు చెయ్యరా! కొందరే చేస్తారా!’అనేవి పరిశోధనా విషయాలు. కానీ వయొరిస్టిక్ ప్లెజర్ పొందుతారనేది మాత్రం నిజం.

నా టపాలో తప్పొప్పుల ప్రసక్తి లేదు. తెలుగు సినిమా రంగంలోని దరిద్రాల్ని ఫస్ట్ హ్యాండ్ గా అనుభవించినవాడ్ని. దాంట్లో ఎన్ని కన్నాలున్నాయో నాకు తెలుసు. ఇక్కడ ప్రశ్న తప్పు దర్శక నిర్మాతలదా లేక ప్రేక్షకులదా అనేది అసలు కాదు. ఎందుకంటే...అది తెగే/తేలే విషయం అస్సలు కాదు.

@నాగప్రసాద్: ‘మన సినిమాల్లో ప్రాధాన్యత దేనికి?’ అనేది కూడా చర్చా విషయం కాదు. శృగారం పాలు పెరిగిందా లేదా? హీరోయిన్ దుస్తులు కురచ అయ్యాయా కాదా? అది చూస్తూ మనం ఆనందిస్తున్నామా లేదా? మనం ఆనందించకపోతే అంగీకరించేవాళ్ళం కాదు. అంగీకరించకపోతే ఆమోదించేవాళ్ళం కాదు. ఆమోదించకపోతే ఒక active decent కనబడాలి. అది లేదు. కాబట్టి మనం పరోక్షంగా ఈ సంస్కృతిని అంగీకరించినట్టే. అంగీకరించామంటే అందులోంచీ ఎంతోకొంత gratification పొందుతున్నట్టే.

@ప్రవీణ్/మార్తాండ: మీ నుంచీ ఎప్పటిలాగా ఈ juvenile response వచ్చింది.శంకరాభరణంతో పాటూ జ్యోతిలక్ష్మి,జయమాలినీ నృత్యాలు ప్రజలు చూడలేదా? లేదా శంకరాభరణం లాంటి సినిమాలే కావాలీ..."ఆకుచాటు పిందెలు" ఒద్దన్నారా?

@భవాని: ఇదొక conditioning అనే విషయంలో మీతో ఖచ్చితంగా ఏకీభవిస్తాను. Popular culture లో మహిళను "comodified చెయ్యడం" అనే ప్రక్రియలో భాగంగా ఈ పోకడలున్నాయనేది ఎవరూ విభేధించలేని నిజం.

తెలుగు సినిమాలు ఇలా ఎందుకు తయారయ్యాయి అనడానికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. హీరోయిన్ కు తప్పట్లేదు అనేది ఒక వ్యావహారికనిజం. తమిళ్ లో తన నటనకు నేషనల్ అవార్డు సాధించిన ప్రియమణి తెలుగులో "చూపిస్తున్న" నటన అందుకొక ఉదాహరణ. ఈ సంస్కృతికి దర్శక, నిర్మాతల భావ దారిద్ర్యం కారణం అని ప్రేక్షకులు తప్పించుకోవడం కూడా అంత సమర్ధనీయం కాదనే అనుకుంటాను. ఎందుకంటే we as audience are surely partners in crime.

@అనామకుడు: నిజమే బిందుమాధవి రెండో సినిమా పూరీ జగన్నాథ్ తో. ఇక చూస్కోండి. పూరీ స్టాండర్డ్ కి అందాలంటే ఆమాత్రం "అందాలు" ఆరబోయాల్సిందే.

@సృజన: నా మూడో జవాబు ఏకపక్షమే అయినా సందర్భోచితం . ఒకసారి ప్రశ్నతో పాటూ నా జవాబు చదవండి. వయొరిస్టిక్ ప్లెజర్ కోసం వేరే వెన్యూస్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఇంగ గౌరవప్రదమైన, సామూహిక వయొరిజం అందులో లేవు.

అనుష్క, ఇలియానా సినిమాలకు లగెత్తుకెళ్ళే యువతతో ఎప్పుడైనా మీరు heart to heart discussion చేశారా? ఒకసారి ప్రయత్నించండి. నా "ఆలోచనా రహితం" అప్పుడు అర్థవంతంగా కనిపించొచ్చు.

‘చిత్రం’సినిమా గురించి నేను ఒక యువకుడితో జరిపిన చర్చ ఈ క్రింది లంకెలో చూడండి.
http://parnashaala.blogspot.com/2008/05/blog-post_03.html

Kathi Mahesh Kumar said...

@శారద: "పుట్టించుకుని" అనే పదప్రయోగం అసంకల్పితంగా చేసినా ఇప్పుడు అర్థవంతంగానే అనిపిస్తోంది.

Pavlovian classical conditioning theory ప్రకారం మన response యొక్క నెపం stimulus మీదపెడితే సరిపోదు. మనదైన conditioning చేసుకుని ఆ రెస్పాన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే మీ కంపరం, వెగటూ, రోతలకు కారణం మీరేతప్ప మీరు చెప్పిన కారణాలు కాదు.

ఇక టీనేజర్స్ మీద పరిణామాల గురించి చర్చించడానికి కొంచెం social conditioning కొద్దాం. "విలువలు" అనేవి సామాజికం.అత్యంత పురానం. అలాంటి వాటిని సినిమాలాంటి ఒక పాప్యులర్ కల్చర్ ‘సమూలంగా’ మార్చగలుగుతోందంటే సమస్య అనుకున్నంత సులువైనది కాదు అని చెప్పుకోవాలి.

కానీ ఆసమస్యకుతగ్గ శోధన,పరిశోధన జరగటం లేదనేది సుస్పష్టం. అందుకే సమస్యని define చెయ్యడంలో చాలా సమస్యలున్నాయని నేనన్నాను. మనం కంటి ముందుకనిపించే నిజాల్ని objective గా చూడకుండా విలువల prism లోంచీచూడ్డంకూడా ఈ సమస్య మరింత తీవ్రమవ్వడానికి కారణభూతాలవుతున్నాయి.

స్టీరియోటైపింగ్ అనేది ఒక recognizable identity సృష్టించడంలో జరిగే ప్రయత్నం. మగాళ్ళందరూ వీటిని అంగీకరించనఖ్ఖరలేదు. ఆడావాళ్ళందరూ ఈ ఆలోచనకు confine అవనక్కరాలేదు. కానీ ఇలాంటి స్టీరియోటైపింగ్ ఉంది. అనే నిజాన్ని అంగీకరిస్తే చాలు.సమస్యకు సమాధానం దిశగా రెండడుగులు వేసినట్లే. కానీ కొందరు "మర్యాదస్తుల" కారణంగా అదికూడా జరగడం లేదు అనేది నా అభియోగం.

రాంగోపాల్ వర్మ మేధావితనానికి సరితూగే మహిళా మేధావి శోభాడే ని కూడా చదవండి. రెండువైపుల్నుంచీ ఎంత దారుణమైన వాదాలు వినిపిస్తాయో!చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

I don't cry foul, because my intention is same as yours. But, my approach is different thats' all.

సుజాత వేల్పూరి said...

"నువు స్వతంత్ర జీవివి. పుచ్చుపట్టిన భావాలకూ సంప్రదాయాలకూ భయపడాల్సిన పని లేదు. నీ ఒంటి గురించి సిగ్గు పడాల్సిందేమీ లేదు. నలుగురికీ చూపించు. చూపించి గర్వపడు. భగవంతుని సృష్టిలోకెల్లా అద్భుతమైనది స్త్రీ. ఆ స్త్రీ సౌందర్యాన్ని చూడటానికి అందరికీ హక్కు వుంది. తన అందాలు చూపించుకోవటంలో ఆడదానికి సంఘం పెట్టిన ఆంక్షలని ఎదిరించి పోరాడు." ఇవి రాంగోపల్ వర్మ టైపు మేధావులు చెప్పే ప్లాటిట్యూడ్స్. వినటానికి ఇవి స్త్రీవాదం లా వినిపించినా నాకెందుకో అవకాశవాదం, పురుష వాదం లా అనిపిస్తాయి.


చాలా valid మాటలు శారద గారివి!

శృంగారం వేరు, బూతు వేరు, కనీసం నాకు తెలిసినంత వరకు! మొదటిది ఆహ్లాదాన్నో, మైమరపునో కలిగిస్తే, రెండోది కాసేపట్లోనే వెగటుని కల్గిస్తుంది. అబ్రకదబ్ర అన్నట్లు కేవలం హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనల వల్ల డబ్బులు రాలేదీ, ప్రేక్షకులొచ్చేదీ కల్ల!

సినిమా హీరోయిన్ వృత్తి ప్రేక్షకుడిని రంజింపజెయ్యడం అయితే కావొచ్చు కానీ అది కేవలం ఒళ్ళు చూపించడం ద్వారా కానక్కర్లేదు.

మహేష్ గారు,
మీరు బిందు మాధవి ఫోటో కాకుండా సౌందర్య ఫొటో పెట్టుండాల్సింది. ఆవకాయ బిర్యానీ ప్రమోషన్ షో ఐ-మాక్స్ లో జరిగినపుడు బిందు మాధవి ఎలాంటి బట్టల్లో వచ్చిందో మీరు చూడలేదనుకుంటాను.(ఆమెను తప్పు పట్టట్లేదు. ఫొటో తప్పు అంటున్నాను)

మరువం ఉష said...

వారిదా వీరిదా తప్పు, ఏది తప్పు, ఏది వొప్పు, అని తరిచి చూసేకన్నా మూలకారణం వెదికి దాన్ని మాపాలి ఇది నా అభిప్రాయం. ధన వ్యామోహం కావచ్చు, తప్పనిసరి కావచ్చు - ఆమె వస్త్రధారణని ఇంత వివాదాస్పదంగా మార్చే ముందు వెనుకా పరిస్థితులని అవగతం చేసుకోవాలి. అవి ఒక్కరోజులో పరిష్కారం కాకపోయినా, ఇంకాస్త అధోగతి పట్టకుండా ఆపగలిగితే, ఇన్నిటా ఏది సాధ్యం, ఏది సామరస్యం? స్పృహ చాలా? చర్చలు చాలా?

హరే కృష్ణ said...

Praveen's talks gaaaritho nenu kooda..choose vidhanam lo vuntundi
nirmatha director la dowrbhagyam valla kuda ituvantivi chaala common
manchi cinemalaku peru chirakalam vuntundi

Anonymous said...

evaridi tappu ane kante bayata lopala jarigedi andariki telusu..debbalu tagalakundane cycle nerchukovadam lantidi industry lo heroine la batuku

adhogati aavakaya anta bayata matale lopala jarigedi mana andariki telusu

భావకుడన్ said...

నాకు తెలిసినంత వరకు "pavlovian conditioning" ప్రకారం "conditioning"అనేది అసంకల్పిత చర్య.......మనకు తెలీకుండానే "stimulus"(కురచ బట్టలు) కు "viluvalu " అనేది "pair/condition " అయితే అపుడు వచ్చే "uncoditioned response" మారి(simply చిన్ని బట్టలు వేసుకుంది అని అనుకునే ఆలోచన మాత్రమె) "conditioned response"గా (శృంగార/బూతు భావన కలిగి సొల్లు కార్చుకోవటమో లేదా తప్పు చేస్తున్నారు/చేస్తున్నాము అన్న భావన కలిగి వెగటు వగైరాలు కలగటం) మరుతుంది.

ఇక్కడ "మనదైన conditioning చేసుకుని ఆ రెస్పాన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి" అన్నది సమంజసంగా అనిపించలేదు....ఈ "conditioning" అనేది మనకు తెలీకుండా, మనం పెరిగే రోజుల్లో, మన సామాజిక పరిస్థితుల మీద ఆధారబడి ....అంటే క్లుప్తంగా "an accident called birth" మీద ఆధారబడి ఉంటుంది.....కాకపొతే అది మార్చుకునే అవకాసం మాత్రం తప్పక ఉంటుంది....అదే మనను మనం "decondition" చేసుకోవటం.

చైతన్య said...

** పైన జరిగిన డిస్కషన్ నేను చదవలేదు.

పోస్ట్ సంగతి ఏమో కాని... మీరు మీ మదనపల్లె పిల్లని వెనకేసుకోస్తున్నట్టుగా చూపించారు ఫోటో... కాని ఆ సినిమాలో మాత్రమే ఆ అమ్మాయి అలా కాస్త నిండుగా కనిపించింది... తర్వాత బయట జరిగిన ప్రోమోషనల్ activities లో ఆ అమ్మాయి వస్త్రధారణ దారుణంగానే ఉంది... ఉదాహరణకి 'బిందు మాధవి' అని గూగుల్ images లో సెర్చ్ చేసి చూడండి.

ఎప్పుడూ నిండుగా కనిపించే అతి కొద్దిమంది తారలు ఉన్నారు మనకి... ఉదాహరణకి... 'స్నేహ', 'కళ్యాణి', సౌందర్య(ఒకప్పుడు) లాంటివాళ్ళు..... వీళ్ళు కూడా successful హీరోయిన్స్ యే... వాళ్ళు నటించిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి...

కాకపోతే మీరు చెప్పినట్టు జనాల్లో కొద్దిమంది కేవలం ఇలాంటి డ్రెస్సింగ్ కోసమే సినిమాలకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇలియానా నిండుగా చీర కట్టుకుంటే ఎంత మంది చూస్తారు!

ప్రతి నాణానికి రెండు పక్కలు ఉన్నట్టే... ప్రతి విషయానికి రకరకాల వాదనలు ఉంటాయి కదా!

Praveen Mandangi said...

నాకు సౌందర్య గారంటే ఎంతో అభిమానం. బూతు సంస్కృతి వైపు inclince అయిన వ్యక్తి నాతో ఇలా అనగలడు "కుర్రాళ్ళు జ్యోతిలక్ష్మిని అభిమానిస్తారు కానీ నువ్వు సౌందర్యని అభిమానిస్తున్నావేమిటి?" అని. ఎవడు ఏమనుకున్నా నేను సౌందర్య గారి అభిమానినే. సౌందర్య గారి మరణం ఒక మరచిపోలేని ట్రాజెడీ. సినిమా హీరోయిన్ ని ఎవరూ గౌరవంగా గారు అనరు. వాళ్ళ వెకిలి డ్రెస్సింగ్ అగౌరవం కలిగిస్తుంది. సౌందర్య గారిని మాత్రం గారు అనకపోతే ఆమెని అవమానించినట్టే.

Malakpet Rowdy said...

Looks like you missed the vulgar dances of Soundarya - this is not to bring a dead actress into this discussion but just want to say that no heroine is immune to the Tollywood culture.

Anonymous said...

@malakpetrowdy
Looks like you missed the vulgar dances of Soundarya - this is not to bring a dead actress into this discussion but just want to say that no heroine is immune to the Tollywood culture.///

She have done romantic dances there is no vulgar and had done with in limits no heroine can be lik that at times of 90's bcoz industry was fully changed at that time

soundarya is really a rocking person

vulgarity may be in lyrics of songs not in her dressings