రేరాజుగారు ‘బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్' అనే టపాకి సంబంధించిన చర్చల్లో నేను "బహుశా అది మన post vedic Hindu సంస్కృతి నుంచీ వారసత్వంగా వచ్చిన లక్షణం. దేవుడ్నీ, మతాన్నీ, సామాజిక నిర్మాణాన్నీ ఎవడూ ప్రశ్నించకుండా అన్నిటినీ “డెఫినిటివ్” చేసిపడేసారు. ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది." అని వివరిస్తే కొందరు దీన్నొక బ్రాహ్మణ ‘కుల’ ద్వేషంగానో లేక మరొక డెఫినిటివ్ స్వరంగానో పరిగణించడం జరిగింది. దానికి కొనసాగింపుగా "వేదకాలంనాటి హైందవానికీ అ తరువాత కాలంలో వచ్చిన వ్యవస్థీకృత హిందూమతానికీ చాలా తేడాలున్నాయి. ఉపనిషత్తుల్లో బ్రహ్మపదార్థమని చెప్పబడినది ప్రస్తుతం ఎక్కడుందో కాస్తవెతకండి! వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి! కులవ్యవస్తా, వర్ణాశ్రమధర్మాలూ, పాపపుణ్యాలూ,స్వర్గనరకాలు ఎప్పుడు మన సంస్కృతిలోకి ప్రవేశించాయో కొంచెం తెలుసుకోండి! ఇవన్నీ ఒక వర్గం వారు తమ స్వార్థానికి తెచ్చిపెట్టిన లంపటాలు. వీటిని ప్రశ్నించకుండా “పవిత్రం” చేసిన ఘనత కూడా వీరిదే. వారెవరో కొత్తగా చెప్పాలంటారా?
వేదకాలంలో ఉన్న “నేతినేతి” సంస్కృతిని “ఇతిఇతి”గా మార్చిన ఘనత సామాజిక ఆధిపత్యాన్ని కాంక్షించిన సంస్కృతం తెలిసిన బ్రాహ్మణులదే. దీనికి చరిత్ర సాక్ష్యం.ఈ “ఇతిఇతి” నుంచీ బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ వచ్చిందని, అదొక సామాజిక ధోరణిగా మారిందని నా అంచనా. అదే నా నమ్మకం కూడాను. ఈ ఆలోచనకు ప్రత్యామ్న్యాయం లభించేవరకూ అదే నా “డెఫినిటివ్” అబిప్రాయం." అని చెబితే, ఇందులోకూడా అర్థంకాని విషయాలు చాలా కనిపించాయి.
ఆ సందర్భంలో ‘dominant paradigm’ and ‘hegemony’ అనే రెండు పదాల్ని రేరాజుగారికిచ్చి, వీటి గురించి తెలుసుకొంటే బహుశా నా ధృక్కోణం మరింతగా తెలుస్తుంది అని చెప్పటం జరిగింది. అప్పుడు రేరాజు బీయింగ్ వాట్ హియీజ్, నన్నే ఒక టపారాసి పుణ్యంగట్టుకోమన్నారు. అందుకే ఈ ప్రయత్నం.
‘dominant paradigm’: ప్రచులిత విలువల సమాహారం - ‘hegemony’ : ఆధిపత్యం
ప్రతిసమయంలోనూ ప్రతి సమాజంలో కొన్ని నిర్థారిత విలువలు ప్రచులితమై ఉంటాయి. ఆ విలువలే ఆ సమాజాన్ని నిర్వచిస్తాయి, నాగరికత స్థాయిని నిర్థారిస్తాయి. ఈ విలువలు పూర్తిసమాజంలోని అన్నిపార్శ్వాలలోనూ ఒకటిగా ఉండకపోవచ్చు. ప్రతిపార్శ్వంలోనూ వివిధ స్థాయిల్లో కొన్ని నిర్ధిష్టమైన విలువలు ఏర్పడుతూ ఉంటాయి. అవి సాధారణమైన గాలివానలకు చెదరవు. ఈ విలువల్ని కూకటివేళ్ళతోసహా పెకిలించగలిగిన "మార్పు" వస్తేనే అవి సమూలంగా మారేదిశగా పయనిస్తాయి. ఇలాంటి సమూలమైన మార్పుల్ని "paradigm shift" అంటారు. చర్చ ఈ paradigm shift ది కాదు. చర్చ reinforcing the dominant paradigm అనే ప్రక్రియది.
ప్రచులితమైన విలువలవలన లాభం పొందుతున్న వర్గాలు ఎప్పుడూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే చూస్తారు. అది సహజం. ఈ ఆధిపత్య ధోరణిని hegemony అంటారు. వీటిల్లో ముఖ్యంగా cultural and social hegemony అనేవి బ్రాహ్మణభావజాలం (కులం కాదు) ద్వారా మన భారతీయ సమాజంలో, కొన్ని వర్గాల ఆధిపత్యానికి కొమ్ముకాసేవిధంగా అమలు జరపబడుతున్నాయి. ఈ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి cultural and social imperialism అనే ప్రక్రియ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆదిమకాలం నాటి యుద్ధాలంతా ఘోరంగా ఉండవు. చాలా సున్నితంగా,సౌకుమార్యంగా,సాధికారంగా ఇతర సంస్కృతుల హననంగావించి, తమ ఆధిపత్యాన్ని చాటుతూ ఉంటారు. ఒక స్థాయికొచ్చేసరికీ ‘సంస్కృతి’ అంటే ఇదే! అనే స్థితికి ఈ hegemonic భావజాలం సమాజాన్ని తీసుకొస్తుంది.
ఈ ఆధిపత్యధోరణి ఒక కాలంలో కొన్ని వర్గాలవల్ల భారతదేశంలో అమలైతే, ఇప్పుడు మన స్థాయి పెరిగి అమెరికా వంటి దేశాల బారిన పడుతున్నాం. అంతేతేడా.
ఉదాహరణకు సంస్కృతి అనగానే మనకు గుర్తొచ్చే ప్రక్రియలేమిటి. నృత్యం, సంగీతం, ఆహార్యం. వీటిల్లో నాగరికమైనవి (అని అంటున్నవి) ఏవో ఒక సారి పరిశీలించండి. ఇవన్నీ ఎవరివి? పూర్తి జాతికి సంబంధించినవా? కేవలం కొన్నివర్గాలవారు "ఇదే సంస్కృతి" అని (మనకోసం) తీర్మానించడంవలన సంస్కృతిగా చలామణి అవుతున్నాయా?
ఇప్పుడు హెజిమొనీని సుస్థిరంచేసుకోవడంలో ఉపయోగికారి అయ్యే 'reinforcing the dominant paradigm' ప్రక్రియ గురించి ఆలోచిద్ధాం. ప్రస్తుతం అమలులోవున్న విలువలపై ఎవరైనా అభ్యంతరకరమైన ప్రశ్నలు లేవనెత్తితే లేదా బలీయమైన మార్పు రావాలి కోరుకుంటే, పురాతన కాలంలాగా వారిని వెలివెయ్యడం కుదరదుగనక, వారికి అదే విలువలలోని మరో పార్శ్వాన్ని కన్వీనియంట్ గా కరెక్టివ్ రూపంలో చూపి, "చూడు! విలువల్లో తప్పులేదు. అదిఅర్థం చేసుకుని అమలుచేసే మనుషుల్లోనే సమస్యంతా" అని మభ్యపెట్టి మూలాల్లో మార్పురాకుండా కాపాడుకుంటారు. అంటే అదొక చిన్న alteration అవుతుందేతప్ప "మార్పు" కాదన్నమాట.
ఉదాహరణకు కె.విశ్వనాధ్ సినిమాలన్నీ ఆ dominant paradigm ని reinforce చేసే సినిమాలే. నాకు బాగానచ్చిన సప్తపది తీసుకుంటే, ఆ కథాంశంలోని విలనూ హీరో రెండూ వేదాలే. ఇన్నివైరుధ్యమైన సంభవాలకు చోటునిచ్చిన "మార్మికమైన" వేదాల్ని త్యజించి "కొత్త విలువలు" సృష్టించాలని ఆ సినిమా వాదించదు. ఇప్పటి దాకా మనుషుల వలన తప్పుజరిగింది. "జ్ఞానం" వలన కాదు. ఇప్పుడు కొత్తగా ఆ జ్ఞానానికి భాష్యం చెబుతున్నాను కాబట్టి ఇంతవరకూ జరిగింది "తూచ్!" అని యాజులు చెప్పేస్తే, మనమంతా "ఆహా ఎంత గొప్పఆభ్యుదయ చిత్రం" అనుకుంటూ తలలూపుకొని అదే శాస్త్రాల్నీవేదాల్నీ నెత్తినెత్తుకుని ఊరేగుతాము. ఏమిటయ్యా అంటే, `ఏదో కొందరి స్వార్థంతో అజ్ఞానంతో "తప్పు" జరిగింది. అంతమాత్రానా మొత్తాన్నీ కాదనుకుంటామా? ఎంత ఉదాత్తమైన విలువలూ!' అనుకుంటూ సంబరపడిపోతాము.
నా ఉద్దేశంలో బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్ కూడా ఈ పరిణామక్రమంలో ఒక hegemonic ఉపకరణగా, dominant paradigm ని reinforce చేసేది మాత్రమే. Paradigm shift కోసం ఎవరు ప్రయత్నించినా ఈ శక్తులు తమ యుక్తులతో చేతనంగా, ఉపచేతనంగా క్రియాశీలకంగా అడ్డుతగుల్తూనే ఉంటాయి.
రేరాజు అడిగిన ఈ క్రింది మూడు ప్రశ్నలకూ సమాధానం పైన చెప్పబడిన "వ్యవస్థే"కారణం.
1.తెలుగు మీద జరుగుతున్న ఇంగ్లీషు “అణచివేత” గురించి – వేర్ డు వి స్టాండ్!?
2.తెలుగు సినిమా మీద జరుగుతున్న “అణచివేత” గురించి – వేర్ డు వి స్టాండ్!?
౩.భారత దేశం మీద జరుగుతున్న “అణచివేత” మీద – వేర్ డు వి స్టాండ్!?
ఈ వివరణ కొంత oversimplification అయినా, మూలభావనలకు విఘాతం కలిగించేవి కావు.
*****
9 comments:
మహేష్ గారు,
dominant paradigm, hegemonyల గురించి చక్కగా వివరించారు. వీటికి సంబంధించి నాకున్న కొన్ని సందేహాలు:
1. స్పష్టంగా చెప్పకపోయినా, ఈ సిద్ధాంతాలలో "మార్పు ఎప్పుడూ మంచిదే" అనేది అంతర్గతంగా ఒక నమ్మకంగా కనిపిస్తోంది. అవునా కాదా? అవునంటే అది ఎంతవరకూ సహేతుకం?
2. ప్రస్తుతమున్న లేదా వస్తున్న విలువల్లో మంచి ఉన్నప్పుడు, అది అంగీకరించి దాన్ని గ్రహించడంలో ఇబ్బంది ఏముంది? ఉదాహరణకి అగ్రదేశాల సామ్రాజ్యవాదాన్ని నిరసించినా, వారి శాస్త్రీయ దృక్పథాన్ని అంగీకరించి అనుసరించడంలో తప్పేమైనా ఉన్నదా? (ఇది కేవలం ఉదాహరణకి ఇచ్చినది. అగ్రదేశాల శాస్త్రీయదృక్పథం మంచిదా కాదా అన్న కొత్త చర్చ ఇక్కడ అనవసరం)
3. ఏ సాంఘిక వ్యవస్థలోనైనా hegemony లేకుండా ఉండడం సాధ్యమా? ప్రస్తుతమున్న సంస్కృతి/విలువలను వ్యతిరేకించి కొత్త సంస్కృతి/విలువలను తెచ్చినప్పుడు అది కూడా hegemony అవ్వకుండా పోతుందా? దీన్నిబట్టి చూస్తే, ఇది భావజాలాల మధ్య యుద్ధమే తప్ప ఒకటి మంచి మరొకటి చెడు అని భావించడం సరికాదని అనిపిస్తుంది. మీరేమంటారు?
సూపర్బ్! ఎక్సలెంట్! కొన్ని పోస్టుల్లో చెప్పాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని - ఒక్క ’టపా’లో చెప్పేశారు;
మహేష్ గారు! నేను ఎన్నుకున్న వ్యక్తి సరియైన వారేనని నాకు ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పాలేను.(అవి బోళ్డు బోళ్డు రాతలౌతాయి)
నిజం! మనం ఓ డామినంట్ పారడైమ్ లో ఉండేవాళ్ళం ; ఇవ్వాళ్ళ అమెరికా నడుపుతున్న డామినంట్ పారడైమ్ లో ఉన్నాం; అది సక్సస్ ఫుల్ అని డైబ్బైయ్యవ
దశకంలోనే తీర్మానించేసుకున్నారుట! ఐతే అంతే తేడా అని వదిలేస్తే ఎలా! కధ అక్కడితో ఆగిపోదు...ది స్టోర్ గోస్ ఆన్.............
అందులో భాగంగానే తెలుగు చచ్చిపోతోంది; ఐదో క్లాసు తరువాత తెలుగును పీకేస్తే, ఇంకేటి అది బతికేది!?
ఇప్పుడు ఆ అమెరికన్ డామినంట్ పారడైమ్ లో, ఆ హెజిమొనీ లో, ఏ ఏ సంస్కృతులు అణచివేయబడుతున్నాయో, అవ్వన్ని తమ తమ అస్తిత్వానికై
పోరాడుతున్నాయి. అందులోనే పలురకాల ఫండమెంటలెస్టిక్ ఉద్యమాలు బయలు దేరుతున్నాయి.
ఆ పోరాటంలో, తిరిగి వెనకటి డామినంట్ పారడైమ్ కి వెళ్ళటం కల్ల; అది జరగని పని; అలా పాతదాన్ని కాపాడండో అని గోల పెట్టిన వాళ్ళు ఛాందసవాదులు; మనిషి
ముందుకే వెళ్తాడు. మార్పునే కోరతాడు. అందుకనే ఇప్పుడు...ఇప్పుడు...మనదైన ఓ సంస్కృతిని ఏర్పరచుకుందాం...అందులో ముందరిగా కనీసం "తెలుగు భాష" ను
మన అస్తిత్వంగా అనుకుందామా అనేది ప్రశ్న. కానీ ఇందులోనూ చాలా డైవర్సిటి ఉంది.........ఆ డైవర్సిటీని చంపడం దీని లక్ష్యం అస్సలు కాకూడదు అనేది నా
ప్రతిపాదన.
మహేష్ గారు : మీ వాక్యాలు :
"ఉదాహరణకు సంస్కృతి అనగానే మనకు గుర్తొచ్చే ప్రక్రియలేమిటి. నృత్యం, సంగీతం, ఆహార్యం. వీటిల్లో నాగరికమైనవి (అని అంటున్నవి) ఏవో ఒక సారి పరిశీలించండి.
ఇవన్నీ ఎవరివి? పూర్తి జాతికి సంబంధించినవా? కేవలం కొన్నివర్గాలవారు "ఇదే సంస్కృతి" అని (మనకోసం) తీర్మానించడంవలన సంస్కృతిగా చలామణి
అవుతున్నాయా? "
- ఇవే కాదు; ఇంకా చాల ఉన్నాయి; తెలుగు ప్రశ్న పై నా సమాధానంలో ఏది తెలుగు సంస్కృతి అని మీరు తీర్మానిస్తారు? అని ప్రశ్నిస్తున్నప్పుడు - మీకు నా భావం
అర్ధం కాలేదా!? "ఇది" - "మన సంస్కృతి" అని నిర్ధారించని మరుక్షణం, అది ఛాందస వాదం అయిపోతుంది; అందుకని, ఎప్పటికప్పుడూ "కొత్తగా" మనం
"సృష్టించుకునేది" - "మనది" ఔతుంది అని చెబ్తున్నప్పుడు మీరెందుకు నా భావం పట్టుకోలేదు.......నాకు మీలాగా రాయటం రాలేదా :)
బై ద వే - మీకు "కొత్త విలువలు" అని ఆగిపోయారు; సినిమా గురించి కదా అని సరిపెట్టుకుంటున్నాను; కొత్తవి చాలా చాలా కనుక్కోవాలి; నేను ఓ సినిమా షాట్ ఇలా
తీద్దాం అనుకున్నప్పుడు - ఎలా తీయాలి అని మనం కనుక్కోవాలి; అంతే గానీ, వాడెదో భలే తీశాడు, అది మళ్ళి తీద్దాం అనుకోకూడదు; - ఈ వాక్యం ఇలా వదిలేయండి;
నేనింకా పోస్టులేస్తాను. ; అలా ఓ కొత్త అస్తిత్వాన్ని, మనదైనది సృష్టించుకోవాలి; దానికి ప్రైమరీగా "తెలుగు భాష" ను మనది అని అనుకుంటూ, అది అంగీకారాత్మక
దృక్పదం ఐతే, దాన్ని ప్రభుత్వాలు కాదు రక్షించాల్సింది; మనం - "ప్రజలం" ; ఇంకా స్పెసిఫిక్ గా మేథావులు - అని నా అభిమతం; ఎలా - అనేది నేను రాస్తున్న
ఆలోచన. ఆ ఆలోచనలో చెప్పిన ఓ మార్గమే - ఈ బ్లాగుల్లో "ఆలోచించడం" ; ఇది సోషల్ యాక్టివిటీ; కేవలం వ్యక్తి అభివ్యక్తి మాత్రమే కాదు.
థాంక్యూ వన్స్ అగైన్! యూ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్; ఐ యామ్ కాన్ఫిడంట్ యూ విల్ సీ, వాట్ ఐ యామ్ సీయింగ్. యువర్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఎ మస్ట్ - బికాజ్
ఐ సపోర్ట్ - "యూనిటీ ఇన్ డైవర్సిటీ";
ముందుగా ఈ చర్చకి బీజం వేసిన రేరాజ్ గారికీ, చకగా వివరించిన మీకూ అభినందనలు.
పైన కామేశ్వర్రావుగారడిగిన ప్రశ్నలే నావి కూడానూ.
అదలా ఉండగా .. నాకు ఇంకో ఆలోచన తడుతోంది. మనం కాలమానంలో వెనక్కి తిరిగి చూసుకుని గతాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడల్లా అదేదో క్రీపూ ఐదో శతాబ్దంలో గడ్డకట్టేసిన బ్రహ్మ పదార్ధమల్లే మాట్లాడుతుంటాము. మన దేశా చరిత్రలో గత వందేళ్ళల్లో జరిగిన రాజకీయ, సామాజిక, ఆర్ధిక మార్పుల్ని ఒకసారి గుర్తుతెచ్చుకోండి. వేదకాలం నించీ (పాశ్చాత్యుల లెక్కల్నే నమ్మినా) ఇప్పటిదాకా సుమారు ఏడు వేల సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగి ఉండాలి?
ఒక చిన్న ఉదహరణ చెబుతా. భరతనాట్యం చాలా పురాతనం. సాక్షాత్తూ వేదాల్లోనించే ఇది పుట్టింది అని ఊదర గొడతారు, ఈ రోజుల్లో ఏ ప్రదర్శనకి వెళ్ళినా. ప్రస్తుతం భరతనాట్యం పేరిట ప్రదర్శించబడుతున్న కళ (దాని మూలాలు ఏవైనా), ఇరవయ్యో శతాబ్దంలోనే రూపు దిద్దుకున్నది. కళ కానీ, సంస్కృతికానీ, సామాజిక పరిస్థితికానీ ఎప్పుడూ మారుతూనే ఉంది.
http://www.cjc-online.ca/index.php/journal/article/viewFile/278/184
మీరు తెచ్చిన ఈ పదాల వల్ల,నా కై నేనుగూగుల్ చేస్తే వచ్చిన మొదటి లింకు : "తేరగా తెలుసుకుందామనే అని అడిగింది" :) ; పైనిచ్చిన రెండో లింకు ఓ పిడిఫ్ ఫైలిచ్చింది; సబ్జెక్ట్ "కమ్మ్యునికేషన్ మీదే వరికే ఐనా, నా పోస్టుల్లో చెప్పిన కంక్లూజన్స్ ఉన్నాయి; మీరూ చదివి, ఏకీభవించకున్నా - అనువదించి పెట్టండి; మీకు పుణ్యం ఉంటుంది - అది మన సంస్కృతులిలో ముందస్తు ధన్యవాదం ;); పుణ్య పాపాలు లేవని మన సంస్కృతికి తెలుసని నా అభిప్రాయం; ఆ అమోరిలిస్టిక్, ఇమ్మోరలిస్టిక్ సొసైటీ యొక్క ప్రశ్నలు వేరే పోస్టుల్లో ఆలోచిద్దాం;
ప్రతి ఇంగ్లీషు పదమూ తెలుగులో అనువదించాల్సిన అవసరం లేదు;నాకు అర్ధం చేసుకోవడం ఇంకొంచెం కష్టం ఔతుంది.
ఇప్పుడు వేసిన పోస్టులా ఉంటే చాలు.
@కామేశ్వరరావు గారు, నా బ్లాగులో నేనిచ్చిన సమాధానం మీకు మొదటి పేరాలో తెగిందని నా కప్పుడే అనిపించింది; మీ బ్లాగులో "తెలుగు" అనే పదం ఉండటం వల్ల మీ బ్లాగుకు రాలేక పోయను.
1.మార్పు మంచిదేనో కాదో వేరే విషయం; అది అనివార్యం; అది డిటర్మినిస్టిక్ చెప్పుకుందాం; రాళ్ళు కూడా మారతాయండి! ;). సో ఫర్ నవ్ : మార్పు అనివార్యం; మంచైన చెడైన మార్పు మీరు వద్దన్నా వచ్చేది; కాని, ఓ మార్పును కోరుకుని ప్రయత్నిస్తే అది మనది; అలా కాకపోతే అది "ఇంపోస్డ్"...మనమే చేసుకున్న మార్పు - మన ఘునత; మన తప్పిదం; దిస్ మోర్ ఎబౌట్ ఇండివిట్యుయాలిటీ.
2. ఒట్టి విలువలు కాదండి; వాటినేమనాలో నాకు తెలీదు; అందుకని ఎన్ కంపాసింగ్ "సంస్కృతి" అందాం - ఇది అమెరికన్ హెజిమనీ లో వస్తోంది; దాన్నే నిరసించాలి గానీ, శాస్త్రీయ దృక్పదాన్ని కాదు; కాకపోతే ఇక్కడో చిన్న తేడా - ఈ దృక్పదాలు - ఏ రంగానివైనా - మనం ఆలోచించుకొని తెచ్చుకోవాలి; కొందరి వాదన ఏంటంటే - ప్రాచీన కాలంలో ఇలాంటి ద్రుక్పదాలను మనమే ఆలోచించుకున్నాం ; అందుకని మన ఘనులం; అంతవరకు కొంత నిజమన్నా ఉంది; కానీ ఈ హెజిమనీ ప్రభావం వల్ల, ఆ "ఆలోచన" ఆగిపోయింది; ఐతే, ఛాందస వాదులేమంటారంటే - ప్రాచీన కాలంలో వాళ్ళు -పైనలిటీని, సర్టెనిటీని పొందారు అంటారు; కానీ, అది నిజం కాకపోవచ్చు; ఆ ఆలోచన ఆగిన ఓ మజిలీ కావచ్చు అంటాను; ఐతే ఈ దృక్పదాలు "తేరగా" దొరకవు; కాబట్టి, ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయి అని వాదించ కుండా, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఆలోచించి ఏర్పరుచుకోవాలి అనేది నా వాదం. అవి "తేరగా" దొరకవు కాబట్టి, ఆ సమస్యలకి కూడా, మనదైన "ఆలోచనలు" చేయాలి; ఇదంతా మేధావులు పనండి; ప్రస్తుతానికి ఇంగ్లీషులోనే వీళ్ళు ఆలోచిస్తారు; మనం అనువదించుకుంటాం. సంస్కృతంలో ఉంటే ఉన్నాయి; ఇప్పుడు తెలుగులో "ఆలోచించుకుందాం".
౩.ఖచ్చితంగా కొత్తగా వచ్చిన విలువ కూడా, హెజిమనీ నే అయి కూర్చుంటుంది.....అందుకనే, దేనికి పట్టు బడకుండా, కట్టుబడకుండా, ఎప్పటికి అప్పుడు "ఆలోచించు" కోవాలి; అదే "స్వా" తంత్ర్యం - ఆలోచన అని నా ఉద్దేశ్యం; అలా ఆలోచించుకునే ఇష్టాలు స్వ ఇచ్చ - స్వేచ్చ; ఇది వ్యక్తికా , వ్యవస్థకా..... అన్నిటికి అని; ఐతే కంట్రోల్....సారీ...అలా చాలా పొడుగవుతుంది.............
ఇది డిటర్మినిస్టిక్ గా చెప్పడమే.....కానీ అండటిర్మినిస్టిక్ ఆలోచించిగానే మళ్ళీ రాయలేను.
నిన్న వరళ్డ్ మూవీస్ లో స్పీల్ బర్గ్ తదితరులు - ది హిస్టరీ ఆఫ్ వ్యూచర్" అన్న డాంక్యుమెంటరీ లో ప్యూచిరిస్టిక్ సినిమాల ఇంటకెక్ట్యుయల్ బాక్ గ్రౌండ్ చెప్తూ :
" అమెరికన్ కల్చర్ - వేరే ఎదుగుతున్న కల్చర్స్ ని ఒక థ్రెట్ కింద చూస్తుంది; జపాన్, రష్యా, చైనాలని మనం అలాగే చూశాం... అందుకని వాటిని మనం...." ఓ రకంగా చంపటానికి చూస్తుంటాం అని చెప్పారు;
ఇదే "ఆలోచన" ని, గ్రహాంతరవాసులు మనదగ్గరకి వస్తే ఏం చేస్తారు అని పొడిగించి - వాళ్లు ఎక్కువ శాతం సినిమాలలో "గ్రహాంతరవాసులు" మన మీద యుద్దానికో, ఆధిపత్యానికో వచ్చినట్టు సినిమాలు తీసుకున్నారని ప్రతిపాదించాడు.
దిస్ ఈజ్ ది క్రక్స్....ఇందుకే మనం నిరసించాలి.
ఎందుకంటే..నా ఆలోచనలో "ప్రాచ్య" - ప్లీజ్ నోట్ - ఆక్సిడెంటల్ - ఈస్ట్ - తాత్విక చింతన -ఇంటలెక్ట్యుయాలిటీ - ధింకింగ్ లో, మనం ఇంత "భయం" తో చూడము;
అందుకని ఆగిపోయిన మన "ఆలోచన"ని కొనసాగించి, ఓ కొత్త పరిష్కారం కనుగొనాలి అన్నది నా ప్రతిపాదన ; "తెలుగువాళ్ళు కనుక్కోలేరు" అని చెప్పకండి; దట్స్ ఫ్రమ్ "బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" - ఇది పాశ్చాత్యులకీ ఉంది;
కాకపోతే, డిటర్మినిస్టిక్ గా ఉన్నంత మాత్రన మనం ముందుకు పోలేం అని చెప్పలేం; మార్పు అనివార్యం కాబట్టి, అదే ఆలోచనని తెప్పిస్తుంది ; రియల్ టైమ్ లోనే మనం "డిటర్మినిస్టిక్" గా ఉంటాం...కాని ముందుకు పోతాం...అలాగే పాశ్చాత్య శాస్త్రదృక్పదాలన్నీ ముందుకు వెళ్ళాయి..ఎంత డిటర్మినిస్టిక్ గా ఉన్నా కూడా!... అందుకని మనం కూడా ముందుకు వెళ్తాం అని నా నమ్మకం.
బైదివే - స్పీల్ బర్గ్ చెప్పాడు - "వార్ ఆఫ్ వరళ్డ్స్" సినిమా ఆలోచిస్తున్నప్పుడు, మూలానికి బిన్నంగా , వేరే ఆలోచనని మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి హెచ్ జి వెల్స్ నించే తెచ్చుకున్నాను అని చెప్పాడు. దాని ప్రకారం - గ్రహాంతరం వాసులు వచ్చేముందు, భూమిని వారికి అనువైన స్థలం గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అలా మారిపొతున్న వాతావరణానికి వ్యతిరేకంగానే హీరో పోరాడతాడు :)
సో cultural and social imperialism అనేది - పాశ్చాత్య తత్వచింతన -ఫిలాసఫీ - ఇంటెలెక్ట్యుయాలిటీ; ప్రాచ్య దేశాలలో, వలసపాలనకు ముందు అలాగే ఈ డామినంట్ పారడైమ్ ఉన్నదని, ఇది ఇలాగే జరిగిందని నిర్ధారించడం తప్పు కావాచ్చని ఆలోచించండి; కొత్త ఆలోచనలు రావచ్చు; ప్రాచీన ప్రాచ్య తత్త్వాలు ఆలోచించే విధానంలో ఏమన్నా తేడా ఉన్నదా? ఉంటే ఏమిటి? అప్పుడు సంస్కృతి ఎలా విస్తరించి ఉండవచ్చు? ఇలా మీరు చరిత్ర వంక చూడొచ్చు.
నా అండిటర్మినిస్టిక్ థియరీ ప్రకారం అది నిర్ధారణగా చెప్పలేని విషయం అవ్వచ్చు. కానీ, ఆ అన్వేషణలో కొత్త ఆలోచన పుట్టవచ్చు.
ఇంకో విషయం చెప్పనా - అసలు ఎప్పుడూ ఇక్కడ డైవర్సిటీ ఉంది; అలాంటి హెజిమనీ సాధించబడలేదు కాబట్టే, ఇక్కడా డైవర్స్టిటీ ఉండింది. అంతమాత్రాన పాశ్చాత్య చరిత్రలాగా - మనం ట్రైబల్స్ కాకపోవచ్చు; మనకి డైవర్సిటీలో యూనిటీ ఉండి ఉండొచ్చు; ఎందుకంటే - దాన్ని నేను దర్శించగలను...పాశ్చాత్యలు కూడా ప్రపంచ డైవరిస్టిలో నాకు భాగంగానే కనబడతారు; థ్రెట్ గా కనబడరు :) - అందుకని, నేను ఇలాంటి ఆలోచన ఆ రోజుల్లో వచ్చి ఉండవచ్చునని, అందుకనే మనం అలాంటి హెజిమనీని స్థాపించలేదని అనుకుంటాను; మరైతే మన అంతర్గత సమాజంలో "అణిచివేత" లేదా - ఖచ్చితంగా ఉన్నది; అప్పుడు పోరాడు కున్నారు; ఇప్పుడూ పోరాడుకుంటాము; స్వేచ్చ నిరంతర పోరాటము;
కానీ ఆ పోరాటం - ఓ శివతాండవం - సారీ, అది - కాస్మిక్ డాన్స్ - :) అది వేరే విషయం; ఇప్పుడొద్దు.
@భైరవభట్ల కామేశ్వర రావు: మీ ప్రశ్నలు చాలా విలువైనవి. కొంత రేరాజు సమాధానం చెప్పినా నావంతు కొంత ప్రయత్నిస్తాను.
1.నిజమే! మార్పు మంచిది అనే అంతర్లీన భావన కనిపించినా, "మార్పంతా మంచిదే" అనే ఛాంధసానికి మాత్రం ఈ సిద్ధాంతాలు దూరం.కాబట్టి కొంత objectivity and usefulnessగా ఉండే అవకాశం హెచ్చు.స్థిరత్వంలో "పురోగతి"ఉండదు అనేది ఒక నిత్యసత్యం. అదే నిత్యసత్యాన్ని ఈ సిద్ధాంతాలూ పుష్టీకరిస్తాయి.
2.ప్రస్తుతం ఉన్న విలువల్లోని మంచిని గ్రహించడంలో ఎటువంటి తప్పూ లేదు. కాకపోతే, ప్రస్తుతం ఉన్న విలువలవల్ల సమస్యలు తలెత్తినా వాటిని aberrations గా పక్కనపెట్టి, అవే విలువల్ని మళ్ళీ propagate చెయ్యడం చాలావరకూ జరిగే తంతు. అదొక defense mechanism. దాన్ని మీరి "కొత్త విలువల్ని" కల్పించుకోవడం నిజమైన మార్పు.
3.ప్రతి సమాజంలోనూ hegemony ఉంటుంది. అది లేకుండా సామాజిక నిర్మాణమే లేదు. ఎవరోఒకరు నిర్ణయించి నడిపిస్తేగానీ ఈ సమాజం ఇలా మనదు. నూతన విలువలతో పాటూ నూతన ఆధిపత్యాలు ఏర్పడుతాయి.ఇదొక వృత్తం. వీటిని "మంచి చెడు" అనే విలువల దృష్ట్యా కాకుండా ఆ సమాజం ఏ పరిణామస్థితిలో ఉంది అనేదాన్నిబట్టి బేరీజు చెయ్యచ్చు. Its an evolution. Its a process. అర్థం చేసుకుని సహానుభూతి (సానుభూతి కాదు)కలిగిఉండటమే మనల్ని "ఆధునిక మానవుల్ని"చేస్తుంది.
@కొత్తపాళీ:చాలా బాగా చెప్పారు. భరతముని చెప్పిన భరతం(భరతనాట్యం) అంటాంగానీ, దానికొక గౌరవప్రదమైన స్థానం స్వాతంత్ర్యానంతరం వచ్చిందనే సత్యం చాలా మందికి తెలీదు. కూచిపూడికి ఒక సాంప్రదాయక శాస్త్రీయ నృత్యంగా గుర్తింపు వచ్చి కొన్ని దశాబ్ధాలైనా కాలేదు.
culture ఎలా appropriate చెయ్యబడుతుందో అది dominant paradigm ఎలా వృద్ధి చెందుతుందో అనేది గొప్ప పరిశోధనా విషయం. Noam Chomsky అమెరికాకు చేసినట్లుగా మన చరిత్రల్ని ఎవరు decipher చేస్తారో చూడాలి.ఆశిష్ నందీ లాంటివాళ్ళు కొందరున్నా, వారు ఆకడమిక్ సర్కిల్స్ లోనే ఉండిపోవడం మన ఖర్మ.
@రేరాజు: ఏదో కథలో పాత్ర చెప్పినట్లు "మనసు తెలుసుకున్నది శరీరంతో చెప్పడం నాకు రాదు". అందుకే ఏదిరాసినా సగంసగంగా ఉంటుంది. కాబట్టి అర్థాలకన్నా అపార్థాలెక్కువుంటాయి. నేను పూర్తిచిత్రాన్ని చూస్తూనే అసంపూర్ణ వర్ణనని చెప్పడంలో సిద్ధహస్తుడ్ని.కనీసం అప్పుడప్పుడైనా మీలాంటి వాళ్ళు ఛాలెంజ్ చేస్తేగానీ కొన్ని deeply internalized ideas బయటపడట్లేదు.
అవును చక్కగా చెప్పారు ! మార్పు మనుగకు లక్షణం అయితే వచ్హిన చిక్కల్లా కోంత మంది దీని వ్యతిరేకిస్తారు మరి కోంత మంది అనుకూలంగా మాట్లాడతారు నాకు తెలిసి ఎవరు ఎమి మాట్లాడినా వర్గ ఆదిపత్యంకోసం నిజ మైన సమాజ హితులు అప్పుడూ లేరు ఇప్పుడూ లేరు. అప్పట్లో ‘బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్' వున్నట్లు గానే హరిజనికల్ ఆటిట్యూడ్ వుండె వుంటుంది ఇప్పుడు వీటిని పునః నిర్వచించుకోవాలి
@కాశ్యప్: మీ ప్రశ్న చాలా ముఖ్యమైనది.మార్పు మార్పు అంటేనేకాదు అదెలావస్తుంది, దానికున్న సమస్యలేమిటి తెలుసుకోవడం అనేది చాలా అవసరం.
ఈ విషయం మీద సోషియల్ సైంటిస్టులు diffusion of innovation అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.మొత్తం సిద్ధాంతం గురించి నేనిక్కడ చెప్పలేకపోయినా,దాని ఆధారంగా నేను రాసిన టపా లంకె ఇస్తున్నాను చదవండి.
http://parnashaala.blogspot.com/2008/08/blog-post_21.html
Post a Comment