భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
దెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన ‘తేటగీతి’ ఇది. 1907 రాజమండ్రి లో బిపిన్ చంద్రపాల్ గారి వందేమాతర ఉద్యమ ప్రచార సభలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ పద్యం చెప్పగా విశేషస్పందన వచ్చింది. ఆయన మనసులో ఊహించుకుని చెప్పినట్లు చెప్పడం వల్ల ఇది అశువుగా చెప్పిన పద్యమనుకుని ఇప్పటివరకూ చాలా మంది సాహితీవేత్తలు, విమర్శకులు, పరిశోధన కర్తలు అది చిలకమర్తిగారి పద్యమనే అనుకుంటున్నారు. ఈ పద్యం తొలిదేశభక్తి కవితగా కూడా ప్రసిద్ధి చెందింది. తద్వారా చిలమర్తివారు తొలిజాతీయోద్యమ కవి అయ్యారు.
1968 లో చిలకమర్తివారి శతజయంతి జరిగినప్పటి నుండీ ఈ పద్యం విషయంలో కొన్ని సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు దాదాపు వందసంవత్సరాల తరువాత ఈ పద్యం 1905 లో చెన్నాప్రగడ భానుమూర్తి గారు రాసిన ‘భారత ధర్మదర్శనం’ అనే ఖండకావ్యంలోనిదిగా అది 1905-07 ప్రాంతంలో అచ్చయినదిగా కరణం సుబ్బారావు తగినన్నిఆధారాలతో ఒక పుస్తకంగా ప్రచురించారు. చిలకమర్తివారు వారి,స్వీయచరిత్రలోకూడా "ఊహించుకుని (గుర్తు చేసుకుని) చదివితిని" అనడం. 1907 నుంచీ 1920 ప్రాంతంలోని ఏ పత్రికా ఈ పద్యం చిలకమర్తివారి రచనగా పేర్కొనకపోవడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
వందసంవత్సరాల తరువాత ఈ పద్యం ఎవరురాశారు అనేది తిరగదోడడం అవసరమా? అని ప్రశ్నించేవారికి "ఒక కవికి అన్యాయం జరగకూడదు" అనే ఈ పుస్తక రచయిత ఆశయం సమాధానం చెబుతుంది. ఈ పద్యం రాయకపోయినంత మాత్రానా చిలకమర్తి వారి స్థాయి తెలుగు సాహిత్యంలో తగ్గేదీకాకపోయినా, ఈ కొత్త నిజం ఒక మరచిపోయిన, సరైన గుర్తింపు లభించని కవికి గుర్తింపునిస్తే అంతేచాలు.
ఈ వివాదానికి తోడు ఈ పద్యంలో మతప్రస్తావనా, కులప్రస్తావనా ఉండటంవల్ల మరోవివాదం రగలకుండా ఉంటే అంతే చాలు.
సమాధానకర్త: కరణం సుబ్బారావు
ముద్రణ: మార్చి,2009
ప్రచురణకర్త: అనూస్ పబ్లికేషన్స్
వెల: రూ.50 /-
Wednesday, May 13, 2009
సాహిత్యంలో మరో వివాదం - భరతఖండంబు చక్కని పాడియావు
*****
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
Well. A good thing is told by u. Sometimes such things are ascribed to those with bigger names.
Some Shakespearen Dramas also told to be like that.
More to tell. Later I will write.
Mahesh gaaru..
its nice...
anantlu పాడియావు - ante ardam cheppara plz...
పాడి ఆవు అంటే పాడి కి పనికి వచ్చే ఆవు అని. అంటే చక్కగా సమృద్ధిగా పాలు ఇచ్చి అన్ని రకాలుగా పనికి వచ్చేది.
@ గీతాచార్య ..
Thank you ..
అవును దీని గురించి ఈ మధ్య పేపర్లలో వాదోపవాదాలు చదివాను.
చెన్నాప్రగడవారి వైపు వాదనే బలంగా వినిపిస్తుంది.
నేను కూడా చిలకమర్తి వారి రచనే అనుకున్నాను. ఇంత కథ వుందని తెలీదు. మీరన్నట్టు, మొదటిరచయితని గుర్తించడం బాగుంటుంది కనీసం వీలయినప్పుడు.మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు.
ఆసక్తికరం! తెలుగులో ఇలాంటి పరిశోధనలు అరుదు అనుకుంటా.
పద్యంలో మూడు, నాలుగు పంక్తులు inter
change అయినట్టున్నాయి
పద్యం ఇలా ఉండి ఉండాల్సింది
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
తెల్లవారను గడుసరి గొల్లవారు
ఈ వివాదం గురించి మొదటిసారి వింటున్నాను. ఇలాంటి వివాదాలు ఆసక్తికరంగా ఉంటాయి. కన్యాశుల్క కర్తృత్వానికి సంబంధించి కూడా ఒక పెద్ద వివాదం ఉంది - గురజాడ దాన్ని ఇంగ్లీషులో రాసాడనీ, ఆయన స్నేహితుడొకరు అనువదించాడనీ.. ఇలాగ. కన్యాశుల్క సమీక్షల మీద వచ్చిన ఓ పెద్ద పుస్తకంలో ఈ అంశం ఓ ప్రధాన భాగం.
కొత్త సంగతిని చెప్పినందుకు నెనరులు.
Post a Comment