పగిలిన హృదయంలో
ప్రేమ చెలమ మిగిలింది
ఎండిన గుండెల్లో
నీ గుర్తుచెమ్మ మిగిలింది
రగిలి ఎండినా
ఎండి పగిలినా
ప్రేమ నీటిఊట మాత్రం
పదిలంగా మిగిలింది
(ఫోటో బాగుంది. బ్లాగులో పెట్టాలనిపించింది. ఈ కవిత ఒక సాకు.)
****
I am a fish separate from CROWD. Still trapped in my own. But,Its just BIGGER and BETTER. That's all.
10 comments:
కొన్ని రోజుల క్రితం ఒక వారపత్రికలో ఒక ఫోటో ఇచ్చి దానికి కథ రాయమని అడిగేవారు. అలా ఉంది!
ఫొటో చూస్తూనే "ఎంత బాగుందో , ఈయనకు ఎక్కడ దొరుకుతాయో" అనుకుంటూ కవిత చదివితే కింద మీ వ్యాఖ్య! కానీ సాకు కవితైనా చాలా బాగుంది. కవిత కోసమే ఫొటో దొరికినట్లు!
ఫొటో, కవిత రెండూ బాగున్నాయి
సుజాత గారి కామెంటే నాది కూడా.. బావుంది కవిత కోసమే ఫొటో వున్నట్లు వుంది...
ఈ బొమ్మ చూస్తే, మా చిన్నతనంలో చేసిన పనులు గుర్తుకు వస్తున్నాయి. వేసవి సెలవల్లో అవనిగడ్డ వెళ్ళేవాళ్ళము. అప్పుడప్పుడూ కొంచెము అన్నము తీసుకొని బర్రెలను మేపటానికి క్రిష్ణ ఒడ్డుకీ లొపల లంకలికీ వెళ్తూ ఉండేవాళ్ళము. ఆప్పటికి కొన్ని పాయలు ఎండిపొయి ఒండ్రుమట్టి పగిలిపొయి ఈ బొమ్మలొ ఉన్నట్లు ఉండేది. మధ్యలొ ఒక చెక్క తీసేసి కొంచెము ఇసుక కూడా తీస్తే కాసేపటకి తియ్యని నీళ్ళు వచ్చేవి. అప్పుడు అన్నం తినేవాళ్ళం.
ఆనకట్టలు ఎక్కువైన తరువాత ఉప్పు నీళ్ళు పడటం మొదలయ్యింది.
పుడమి గుండె పగులువారినా,
ఎదలోతుల ప్రేమ చెలమ పదిలమవదా!
గరికకాడ వెన్ను విరుచుకు నింగికెగిసినట్లు,
నాలోని నీకై నా నిరంతరాన్వేషణ సగదా!
నీవున్న తావుల జాడకై మరిన్ని బీటలై విచ్చనా,
ఆ నడుమ పాయలై నిను చేరగ నాప్రేమసాగరాన్ని చీల్చనా!
మీ బొమ్మకి తగిన కవితా కాదు, మీ కవితకు తగ్గ ప్రతిస్పందనా కాదు, కానీ ఉదయాన్నే ఏదో నిర్వేదంలో లేచి ఇలా స్పందనయ్యాను, నన్ను నేను బుజ్జగించుకున్నాను.
ఫోటో సూపర్బ్......... చాలా బాగుంది...
కవిత కుడా బాగుంది... 'చలమ' అంటే ఏంటి? 'చమ్మ' అనా?
@చైతన్య: చెలమ అంటే ఏట్లో ఊరే నీటిబుగ్గ.
@ఉష: కవిత అద్భుతం.
@గద్దేస్వరూప్: మీ అనుభవమూ నా జీవితంలో ఒక భాగమే.
@సుజాత,శ్రీ,భావన: ధన్యవాదాలు.
చాలా బాగు్న్నాయి కవిత మరియు ఫొటో
బాగుందంతా. పైన కొందరు చెప్పేశారు నేను అనుకున్నది. కానీ...
నీ గుర్తుచెమ్మ మిగిలింది -----> నీ ఙ్ఞాపకాల తడి... ఎలా ఉంటుంది? (నాకెందుకో ఏదో మిస్సయిన ఫీలింగ్)
కవిత చాలా బాగుంది
Post a Comment