Thursday, May 14, 2009

చరిత్రా, పురాణమా!

"ఒక జాతి ముందుకు పోవటానికి తోడ్పడేది చరిత్రా,పురాణమా? ఈ ప్రశ్నకు పురాణమే అని సమాధానమిచ్చే స్థితిలో ఉన్నవాడు బహుశా భారతీయుడే అయి ఉంటాడు. వాస్తవ చరిత్ర లిఖిత రూపాలలో నిక్షేపించడం ఇతర ప్రాచ్య దేశాలవారికి తెలిసినట్టు భారతీయులకు తెలీదు. అందుచేత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మన తొలి సంస్కృతిని పాశ్చాత్యులు మన వైదిక సంస్కృతిలో చూస్తే, మన సంస్కృతిని మధ్య ఆసియావాసులు గణితంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ, వైద్యశాస్త్రంలోనూ చూస్తే, మనం మటుకు దాన్ని రామాయణంలో చూస్తున్నాము. ప్రపంచానికి చూపించటానికి గర్వపడుతున్నాం.

మనజీవితానికి ఉపకరించే సత్యాలన్నీ రామాయణంలో ఉన్నట్టు ఆధునిక పౌరాణికులు ప్రచారం చేస్తున్నారు. చరిత్రనుంచీ ఫలాని విషయాలు నేర్చుకోవాలని గట్టిగా ప్రచారం చేసేవాళ్ళు లేరు. మన భవిష్యత్తంతా రామాయణం మీద ఆధారపడి ఉండగా మళ్ళీ చరిత్ర దేనికి?

ఇంతకన్నా చిత్రం ఏమిటంటే మనం ఆపురాణాలను ఉన్నవి ఉన్నట్టుగా ఉండనీయటం లేదు.మన సంస్కృతికి పరాకాష్ట అయిన రామాయణం కథా, శంబూక వధా అన్నీ రామాయణ ప్రక్షిప్తాలలో ఉన్నవే.ప్రక్షిప్తాలుకాని రామాయణ భాగాలనుకూడా మన పౌరాణికులు, ఔత్సాహికులూ మార్చారు. ఈ విధంగా రాముడికి మిత్రుడిగా చెప్పబడ్డ గుహుడు రాముడికి భక్తుడయ్యాడు. శబరి ఇంకో భక్తురాలయ్యింది. అక్కడక్కడా సామాన్యమానవుడి దౌర్బల్యాలు బాహాటంగా ప్రదర్శించే రాముడు ఉన్నట్లుండి దేవుడయి పోతాడు!

పురాణ సంస్కృతి మన సంస్కృతికి పునాది అయినా రాజకీయ కారణాలవల్ల మనకు కొంతవరకూ చరిత్రను గురించి కూడా తోడవటం అవసరనవుతుంది. కాని అందువల్ల కలిగే ఇబ్బందిని దాటడానికి మన పురాణాలకు చేసిన మర్యాదే చరిత్రకు కూడా చేస్తుంటాం. దాన్ని మన పురాణసంస్కృతికి అనుకూలంగా కూర్చుతూ ఉంటాం. అప్పుడు పురాణాలకూ, చరిత్రకూ గల అట్టే తేడా ఉండనవసరం లేదు."

- కొడవటిగంటి కుటుంబరావు
యువ మాసపత్రిక, ఆగష్టు -1980

కళలు -శాస్త్రీయ విజ్ఞానం, విరసం ప్రచురణ, సెప్టెంబరు, 1980


పుస్తకం:
కొడవటిగంటి కుటుంబరావు - చరిత్రవ్యాసాలు
ప్రచురణ: విప్లవరచయితల సంఘం
ప్రతులకు: ననోదయ బుక్ హౌస్
వెల: రూ 100 /-****

19 comments:

సూర్యుడు said...

నేర్చుకునే అలవాటుంటే దేన్నుంచైనా నేర్చుకోవచ్చు ;)

రామాయణం ఒక ఫ్రేం‌వర్క్. చరిత్ర అనుభవాలు. ఫ్రేం‌వర్క్ ని ఫాలో అవ్వాలి, అనుభవాలనుంచి నేర్చుకోవాలి :-)

~సూర్యుడు :-)

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

సమయమూ, బుర్ర పాడు చేసుకోవడానికి తప్పితే ఎందుకీ చెత్త...
కొందరికి మతం పిచ్చ, కొందరికి నాస్తిక పిచ్చ. ఏ పిచ్చి అయితే ఏమిటి తల బద్దలు కొట్టుకునేదానికి

Anonymous said...

ఒక జాతి ముందుకు పోవటానికి తోడ్పడేది చరిత్రా,పురాణమా?

What a hell! The jAti just goes forward and it does not depend on caritra or purANaM. Mr. MK please do not beleive everything you read simply because it has the stamp of koku. Koku made his living by writing and that does not mean whatever he wrote was exceptionally accurate. The guys who published it like it and that was there you stop bothering. If you I die today the blogs and the jati will keep going forward. Even if the entire population dies tonite, the jati (whatever it means) goes forward ALWAYS. You know why? We can never go backwards. Some people may think we go backwards but there is no such thing, believe me (at least this one time) ;-)

జీడిపప్పు said...

మహేష్ గారు, ఇలాంటి విషయాలను తెలుగు వికీపిడియా లో పొందుపరిస్తే నలుగురికి ఉపయోగకరంగా ఉంటుంది. మీలాంటివారు వికీలో కూడా ఉంటే బాగుంటుంది!

కత్తి మహేష్ కుమార్ said...

@సూర్యుడు:రామాయణం ఒక పుస్తకమనుకున్నా, ఏంనేర్చుకోమంటారు అందులో? పడుచుభార్యకు అర్థంలేని వరాల్ని ప్రసాదించమనా! గుడ్డెద్దుచేలోబడ్డట్టు పితృవాఖ్య పరిపాలన చెయ్యమనా! పెళ్ళాన్ని ఎడైనా ఎత్తుకుపోతేవెళ్ళి చంపమనా!ప్రేమించానని ఎవరైనా వస్తే ముక్కూచెవులూ కొయ్యమనా!

ఇవేవీ నాకు ప్రస్తుతానికి పనికొచ్చే,అన్వయించుకోదగ్గ విలువలు కాదు. కాబట్టి ఈ ఫ్రేంవర్క్ అనుభవాలలో నేర్చుకోవడానికి ఏమీ లేదు.

@మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్: తర్కం,హేతువు లేని ఏ నమ్మకమైనా పిచ్చే. అది ఆస్తికమైనా, నాస్తికమైనా అంతే. ఇక్కడ చర్చ కేవలం ఉపయోగత్వం గురించి.

@అనామకుడు: చరిత్ర ఉద్దేశం తెలియని మీ వ్యాఖ్యచూస్తే మీరు చరిత్రలో కనీస ఆసక్తి లేనివారని తెలుస్తోంది. నేను చరిత్ర స్థితిని గురించి రాసిన వ్యాసం చదివే ప్రయత్నం చెయ్యండి.
http://parnashaala.blogspot.com/2009/04/blog-post_06.html

ఇక కొకు గురించి. కొకు తనవ్యాసంలో ప్రతిపాదించింది ఒక ఆలోచన. దాన్ని నేను తర్కించి,హేతువు బేరీజు చేసిగానీ నమ్మను. కాబట్టి నేను "గుడ్డిగా" నమ్ముతాననే అపోహ తొలగించుకోండి.

@జీడిపప్పు: నేను నాకోసం బ్లాగురాసుకుంటాను. వీకీపీడియా అందరికోసం రాయాలి. కాబట్టి ఇంకా అంత పరిణితి రాలేదని నా మనవి. అది వచ్చిన రోజున ప్రయత్నిస్తాను.

వికటకవి said...

చరిత్ర, పురాణం అంటూ విడదీసి చెప్పటం నాకర్ధం కాలేదు. పురాణాలు కూడా ఒకప్పటి చరిత్ర అని ఎందుకు అనుకోరు? పదికాలాల పాటు గుర్తుంచుకోదగ్గ చరిత్రలే పురాణాలుగా మారాయేమో? అక్కరలేని సుత్తిని గ్రంధస్తం/శాసనాల రూపంలో రాయకుండా వదిలిపారేసుండొచ్చుగదా?

సూర్యుడు గారి వ్యాఖ్య సమంజసంగా ఉంది. అలా అనుకున్నా తప్పులేదు.

కత్తి మహేష్ కుమార్ said...

@వికటకవి: మీ వాదనలో చారిత్రక ధృక్పధం యొక్క జ్ఞానం లోపించింది. బహుశా అది మీ పరిధి కావచ్చు.

రామాయణాన్ని primary source అనుకుంటే చరిత్రకారులు దాని వివిధ శాస్త్రీయమైన పద్దతులను ఉపయోగించి ఆధారాలు సేకరిస్తారు.ఆ ఆధారాల సాధికారతను ఇప్పటివరకూ లభ్యతలో ఉన్న అప్పటి సాంస్కృతిక,రాజకీయ,సాఘిక విషయాలతో బేరీజు చేసి ఒక narrative రాస్తారు.అప్పుడుగానీ అది చరిత్ర కాదు.

కాబట్టి చరిత్రకూ పురాణానికీ ఉన్న తేడా శాస్త్రీయత,ఆధారం,research.ఇవన్నీ కాదనుకుని కేవలం (మూఢ)నమ్మకాల ఆధారంగా చారిత్రకతను నిర్ణయిస్తాననడం సమంజసం కాదు.

సూర్యుడు said...

"@సూర్యుడు:రామాయణం ఒక పుస్తకమనుకున్నా, ఏంనేర్చుకోమంటారు అందులో? పడుచుభార్యకు అర్థంలేని వరాల్ని ప్రసాదించమనా! గుడ్డెద్దుచేలోబడ్డట్టు పితృవాఖ్య పరిపాలన చెయ్యమనా! పెళ్ళాన్ని ఎడైనా ఎత్తుకుపోతేవెళ్ళి చంపమనా!ప్రేమించానని ఎవరైనా వస్తే ముక్కూచెవులూ కొయ్యమనా!

ఇవేవీ నాకు ప్రస్తుతానికి పనికొచ్చే,అన్వయించుకోదగ్గ విలువలు కాదు. కాబట్టి ఈ ఫ్రేంవర్క్ అనుభవాలలో నేర్చుకోవడానికి ఏమీ లేదు."

సూపర్, అలాగే చరిత్ర నుంచి మీరేమి నేర్చుకుందామనుకుంటున్నారో కూడా కొద్దిగా వివరిస్తే బాగుండేది ;)

ఔరంగజేబు లాగ తండ్రిని జైల్లో పడేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమా? ఘజనీ, ఘోరీలలాగా పొరుగు దేశాలమీద దండయాత్రలు చేసి మారణహోమాలు సృష్టించడమా? ...

~సూర్యుడు :-)

Vinay Chakravarthi.Gogineni said...

meeku loop holes tappa verevi kanabadatam ledu ante........nenem cheyyalenu endukante meeru maarali first

okkosari chaala baaga maatladutaaru meeru okkosaari emina tikkana enti meeku...........

mari discussion enduku daanni nunchina emina nerchukuntunnara...........

Malakpet Rowdy said...

పెళ్ళాన్ని ఎడైనా ఎత్తుకుపోతేవెళ్ళి చంపమనా!
______________________________

If somebody Kidnaps your wife even today's law allows the offender to be killed in the attempt to safegaurd the woman. Even the woman herself can kill the kidnapper. IT IS DEFINITELY A POINT TO BE TAUGHT TO THE COMMON MAN!పడుచుభార్యకు అర్థంలేని వరాల్ని ప్రసాదించమనా!
_______________________________

Ramayan also tells us what NOT to do and this is the prime example. Just because you read about Aurangjeb, it does mean that you ae expected to be like him


and yes .. here is what one can learn from Ramayan (Unless one is a "Ram hater" by default)


* The dedication one has for one's wife/husband

* The determination of the prince to keep the word of the King inorder to retain the faith of the peopel in the King.

* The power that the word of a common man has - even the King and the Queen had to prove themselves clean

* Maharshi Bharadwaj's Vaimanika shastra - I read half of that book and the Aircraft designs he had mentioned were awesome. Even the Scientists at ADE (DRDO) Bangalore claimed to have used some of those design in their Light Combat Aircraft's designs

* Unconditional love among the brothers (We all badly need to learn this now)

* The importance given to the so called "Backward People" - Hanuman and Sugreeva being the examples and Hanuman is a god by default

* The way Ram has been characterized - Just a common man who attained the Godhood not by power but by being truthful and well-behaved. It tells a coomon man that one can be worshipped by people if has the great qualities.

Ram is worshiped for his qualities not his War-skills. The greatest warrior is Arjun!
*

కత్తి మహేష్ కుమార్ said...

@సూర్యుడు/మలక్: చరిత్ర పురాణాల్లోని మూల ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా interchangeable గా వాడటం వలన వచ్చిన తికమకనుంచే మీ ప్రశ్నలు ఉదయించాయి. కాబట్టి వాటిగురించి కొంత చెప్పుకుందాం.

చరిత్ర భూతకాలం ఆధారంగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే ఉద్దేశంతో నిజాల్ని తెలుసుకునేందుకు చేసే ఒక శాస్త్రీయ పరిశోధన. పురాణం కాలానుగుణంగా కొన్ని విలువల స్థాపనకై కల్పించే "సాహిత్యం". అందుకనే కాల్పనిక సాహిత్యాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం జరిగిన ప్రతిసారీ అవి ప్రశ్నించబడుతాయి. సాహిత్యంగా భావించినా వాటి interpretation లో విభేధాలుంటాయి.

వీటి ఆధారంగా నమ్మకాల్ని ప్రశ్నిస్తున్నారని బాధపడిపోవటం అర్థరహితం.పురాణం ధృక్కోణంలో చరిత్రని చూడమనటం తెలియనితనం. రామాయణకాలంనాటి విలువలతో నాకు ప్రస్తుతం అవసరం లేదనేది నేను బ్రతుకుతున్న కాలం,సమాజానికి సంబంధించిన వ్యక్తిగత నిర్ణయం. అది మతవ్యతిరేకమూ కాదు విద్వేషం అంతకన్నా కాదు.

కొన్ని కనీస సైద్ధాంతిక మూలాల్ని ఎరుకలోకి తీసుకోకుండా బేరీజు చేస్తే మన చర్చలు ఇలాగే ఉంటాయి.

gaddeswarup said...

Mahesh Kumar garu,
I looked at your previous pst mentioned above. There seems to be some progress in the study of Indus civilization. I recently saw an article by Andrew Lawlor:
http://www.sciencemag.org/cgi/content/short/320/5881/1276
"Boring No More, a Trade-Savvy Indus Emerges"
Abstract:
"Long in the shadow of its sister civilizations to the west, the Indus is emerging as the powerhouse of commerce and technology in the 3rd millennium B.C.E. But political and economic troubles dog archaeologists' efforts to understand what made this vast society tick."
Somewhat coicidentally, I started browsing through "Many Ramanayas" edited by Paula Richman and read a similar book by Arydra "Ramudiki Sita Eamoutindi" a few months ago. It seems to me there are several accounts of Ramayana. My impression is that the writers were not interested in historical accuracy but meant them as guides to living and several accounts developed depending on the place, time and the group. In one of the essays in the book, Velcheru Narayana Rao mentions of womwn's ramayanas in Andhra. It is possible that the accounts were based on historical characters ( I remember reading that Krishna, Indra were probably based on several historical persons). Possibly Koku's hope of reconciling history and Puranas in futile. His desire seems to be more about careful study of history on which there seems to be some progress. There is nice account of medeival Andhra by Cynthia Talbot, based on inscriptions from 1000-1650 or so.

Malakpet Rowdy said...

చరిత్ర పురాణాల్లోని మూల ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా interchangeable గా వాడటం వలన వచ్చిన తికమకనుంచే మీ ప్రశ్నలు ఉదయించాయి.
___________________________________

Excuse me? I NEVER ASKED YOU ANY QUESTIONS - YOU WERE THE ONE WHO ASKED THE QUESTION AND I JUST GAVE YOU THE ANSWER FOR YOUR QUESTION "WHAT CAN WE LEARN FROM RAMAYAN?" - PLEASE READ MY MESSAGE AGAIN!


చరిత్ర భూతకాలం ఆధారంగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే ఉద్దేశంతో నిజాల్ని తెలుసుకునేందుకు చేసే ఒక శాస్త్రీయ పరిశోధన.
___________________________________

WHAT IS SCIENTIFIC IN HISTORY? SCIENCE MEANS "HYPOTHESES - EXPERIMENT AND IRREFUTABLE PROOF"

I have never seen this man Kutumbarao with my own eyes - Can you prove Scientifically that he existed?

His writings - Someone else might have written

His Pictures / Videos - It could be some Ellayya or Pullayya from myh neighborhood

People who vouch that he existed - Maybe they are liars.


The same way, we cant prove Einstien's existence - but His theory of Photo Electric Effect can be proved.

That is the difference between Science and history


IF WE ASK FOR true scientific proofs, THEN much of the History will go right into the trash cans as most of it is based on the INTERPRETATIONS of various groups.వీటి ఆధారంగా నమ్మకాల్ని ప్రశ్నిస్తున్నారని బాధపడిపోవటం అర్థరహితం.
___________________________________

ONCE AGAIN - I DIDNT EXPRESS UNHAPPINESS ABOUT YOUR QUESTIONS - I HAVE JUST PROVIDED PRECISE ANSWERS TO THE QUESTIONS YOU HAVE ASKED

కత్తి మహేష్ కుమార్ said...

@గద్దె స్వరూప్: I completely endorse your point of view. That's precisely what I am trying to articulate.

Till its scientifically proved, there can be endless "possibilities". Those possibilities can't be entrusted as TRUTH.

Our Indian history is going for a toss because of these two extreme view points. On one hand we fall short of out historical temperament and on the other we ask puranas to be believed as history. Its a pity.

Malakpet Rowdy said...

And one more thing - I didnt get into the issue Whtether Ramayan is History or an Epic - I DONT CARE!

To me, its a beautiful content with lots of things to learn. It doesnt really make any difference whether Ram existed in reality or not. That character is a role model and the book has a lots of things to learn from.

Malakpet Rowdy said...

Let me make my first comment clear ...

Your first question was: "SHALL I LEARN THAT I CAN KILL A PERSON WHO KIDNAPS MY WIFE"

My Answer was: YES! THE LAW ALLOWS YOU TO DO SO AND THE COMMON MAN SHOULD LEARN THAT THE OFFENDER CAN BE KILLED WITHOUT ANY CASE IF THE OFFENDER TRIES TO ASSAULT OR KIDNAP THE WOMAN. IT WILL BE TREATED AS THE ACT OF SELF DEFENSE.

Then you asked two more questions and I typed a big list of bulleted points

Hope I am clear now

Anonymous said...

@మహేష్:
"చరిత్ర" - భూతకాలం తెలుసుకునేందుకు చేసే ఒక శాస్త్రీయ పరిశోధన."
"తీర్చిదిద్దటాలు, నిజాలు" మీ కల్పన అని అనిపిస్తోంది;
ఈ రామాయణం చరిత్ర కాదు - పురాణము; అందుకని అసలు ఈ రామాయాణంతో చరిత్రను ఎందుకు పరిశోధించాలో నాకస్సలు అర్ధం కావట్లేదు. అది ఇంకో పెద్ద డౌటు.ఔనూ! మీరు చరిత్రకారులేనా!?

ఉష said...

హేతువు, తర్కం, నమ్మకం, ఉపయోగం - అన్నిటి మీద మంచి చర్చ. రచయితలు ఇంకా మన భావజాలాల్లో మరీ అమరులౌతున్నారు.

ఏకలవ్య said...

"a big list of bulleted points..." చూసాక ఇది రాయాలని పించింది.

"The dedication one has for one's wife/husband..."

wife సంగతి సరే. మరి husband మాటేమిటి? లోకానికి ఝడిసి భార్యను అగ్ని పరీక్షకు గురి చేయడమా? గర్భవతి అని కుడా చూడక అడవుల్లోకి పంపడమా?

"The determination of the prince to keep the word of the King inorder to retain the faith of the peopel in the King..."

రాజు ఏ తుగ్లక్ పని చేసినా ప్రజలను మభ్య పెట్టడానికి దాన్ని సపోర్టు చెయ్యాలన్న మాట!

"he power that the word of a common man has - even the King and the Queen had to prove themselves clean"

ఇది మరీ విచిత్రం! తామూ విడి పోయి స్వచ్చతను నిరూపించు కున్నారా? తమపై వచ్చిన ఆరోపణని నిరూపించారా? ఒకడు చేసిన ఆరోపణకై విడిపోయారు. అంటే అంతకు ముందు కలిసి ఉండడం తప్పనేగా? కానప్పుడు ఎవడో అన్న దానికి రియాక్టు కావడం ఎందుకు?

"Light Combat Aircraft's designs..."

ఓహో! అంత గొప్ప డిజైన్లు LCA తయారీకి ఉపయోగిస్తున్నారన్న మాట! అయినా పదిహేనేళ్ళుగా ఎగర దానికి అవస్థ పడుతుంది. మరి ఇవేవీ లేకుండానే బయటి దేశాల్లో చాలా చాలా డిజైన్లు తయారు చేసి మనకే అమ్ముతున్నారే?

"Unconditional love among the brothers..."

నమ్ముకున్న భార్యని వదిలేసి అన్న వెంట అడవికి వెళ్ళడం; అన్న ఏ పని చేసినా తందానా అంటూ సమర్థించడం...

"Hanuman and Sugreeva being the examples..."

నిజమే! హనుమంతుడి బలాన్ని, సుగ్రీవుడి బలగాలను స్వప్రయోజనానికి వాడుకున్నాడు. తర్వాత సుగ్రీవుడు అడవులకు, హనుమంతుడు సేవలకు పరిమితమయ్యారు. BC లకు ఇప్పుడు జరిగేది కుడా అదే. ఆనక రామాంజనేయ యుద్ధం కుడా జరిగిందను కుంటా.