Wednesday, May 6, 2009

ఒంటరి బందిఖానా


కొలతల్లో కొలవడానికి
సందర్భాల్లో ఇమడ్చడానికి
అర్థాల్లో కుదించడానికి
మనసు నిర్ధిష్టతను కోరింది

నిజమే...
నిర్ధిష్టమైన నిర్వచనాలుంటే కానీ
అహానికి తృప్తి రాదు
తనని తాను బంధించి
ఈ విశ్వసృష్టిలోని
ఒక మరుగుజ్జు భాగంలో కుదించి
అదే తన అస్థిత్వమని
మురిసిపోతుంది
ఆ నిర్ధిష్ట నిర్వచనాల
ఇరుకు గదుల మధ్య
గుర్తింపు కోసం
వ్యక్తిత్వం కోసం
అభిమానం కోసం
ప్రేమ కోసం
కల్పన కోసం
పరితపిస్తుంది

కానీ...
ఏ లోకం నుంచీ
ఈ ఆశలు సాకారమవ్వాలో
ఆదే ప్రపంచం
ఈ గోడల మధ్య
స్వీయ కల్పనల
అనంతకోటి బంధిఖానాల
నడుమ మిగిలింది

ఒక్క ఊహ...
విశ్వం మొత్తాన్నీ
అక్కునచేర్చుకునే
విశ్వజనీయమైన ప్రేమ సొంతమైతే!
అహం బందిఖానాని
కూల్చుకుని
నిర్భంధపు సంకెళ్ళు తెంచుకుంటే!


Solitary Confinement

The mind looks to confine
to measure
to contextualize
to give meaning
to itself

for the ego
can exist only
in finite possibilities
needing to enclose itself
in a part of the universe
walled off
from the rest of creation
and from within that prison
to show itself off
yearning to be recognized,
to be individualized
to be admired
and from within that prison
to be loved !
imagining
that everything around itself
has confined itself too
imprisoned itself too
sensing the universe
surrounded by
imagined bits of similar prisons


Imagine

a love you could embrace
the whole universe with

if only you came out of
the solitary confinement
your ego has imprisoned you in


(శేఖర్ కపూర్ కవితకు స్వేఛ్ఛానువాదం)

****

5 comments:

గీతాచార్య said...

తెంచుకుంటే...

ఇక మిగిలేది స్వేచ్ఛా ప్రపంచం...
ఎల్లలెరుగని ఆనందం

The photo's really cool.

కొత్త పాళీ said...

మూలంలోని ముఖ్యభావాన్ని మీరు పూర్తిగా మిస్సయ్యారని చెప్పడానికి విచారిస్తున్నాను.

గీతాచార్య said...

కొత్త పాళీ గారు,

మూలంతో పోల్చలేము కానీ ఆ ప్రయత్నం అభినందించదగ్గది. నాకెందుకో (కారణం తెలుసు కానీ ఇక్కడ వ్యక్తీకరించేంత తెలియదు. పూర్తిగా అర్థం కాగానే చెప్పగలను) ఒక వేల ఇదే మూలం అయితే ఇది కూడా ఒక ఎన్న దగ్గ కవిత అవుతున్దనిపిస్తున్నది.

Srujana Ramanujan said...

విశ్వం మొత్తాన్నీ
అక్కునచేర్చుకునే
విశ్వజనీయమైన ప్రేమ సొంతమైతే

Will this become a possibility?

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళీ: ఎక్కడ మిస్సయ్యానంటారూ!
@గీతాచార్య: ధన్యవాదాలు.
@సృజన: అలా ఉంటే బాగుంటుందికదా!