పెళ్ళెందుకు అని చుట్టుపక్కలున్న పదిమందిని అడిగితే పది సమాధానాలొస్తాయి. తాపీధర్మారావు గారు ‘పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు’ లో చెప్పినట్లు "చేతులారా మెడకు ఒక బండ కట్టుకోవడమే పెళ్ళి అంటాడు ఒకడు. కామభోగాలకు - ఇతరులకు ఎలాంటి హక్కులూ లేకుండా గుత్త తీసుకోవడమే అంటుంది ఒకర్తె. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇల్లు గడుపుకోవడం అంటుంది ఒకర్తె. పగలంతా పరమ చాకిరీ,రాత్రంతా రాద్ధాంతం రణరణలు పెళ్ళి అంటాడు ఒకడు. ఇంటిపేరు నిలబెట్టుకోవడానికి ఇదొక సాధనం అంటాడొకడు. స్వర్గారోహణకు పెళ్ళి ఒక నిచ్చెన అంటాడొకడు. సాంప్రదాయం అంటుందొకర్తె. అదొక సందడి అంటుందొకర్తి..."
తాపీవారు వందసంవత్సరాల ముందు ఇలా చెప్పినా, ఇప్పుడు మరొకరు ఎవరైనా చెప్పినా, పెళ్ళి గురించ వేనోళ్ళ వేయి ఆభిప్రాయాలూ, పెళ్ళి చేసుకోవడానికి భిన్నమైన ఆశయాలూ, పెళ్ళంటే విపరీతమైన ఆలోచనలు.
యండమూరి ఏదో నవల్లో చెప్పినట్లు "మగాడు సెక్స్ కోసం పెళ్ళిని అంగీకరిస్తే ఆడది సేఫ్టీ కోసం పెళ్ళిని ఒప్పుకొంటుంది" అనేది మరో ఆధునిక భాష్యం. మొత్తాని పెళ్ళి ఇలా అవసరాలు, అభిప్రాయాలూ, కోరికలూ, ఆశల మధ్య నిర్వచనాల్ని వెతుక్కుంటూ కాలం గడిపేస్తోంది. లోకభిన్న రుచి: అన్నట్టు ప్రతివాడికీ, ప్రతొకత్తెకీ పెళ్ళికి కావలసిన కారణాలు విభిన్నం. కానీ పెళిమాత్రం ఒక అత్యవసరం. తధ్యం. ఎంతైనా రంగీలా సినిమాలో అమీర్ ఖాన్ అన్నట్లు "లైఫ్ లో సెటిలవ్వాలికదా! "
ఇక్కడ విషయం పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరం అయితే పెద్దాయన తాపీధర్మారావు గారు ఆంత్రాపొలాజికల్ సాక్షాలతో సహా ఎప్పుడో తేల్చేశారు కాబట్టి నేను కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. పెళ్ళి గురించి నా అభిప్రాయం రాయాలంటే అదొక మహాభారతం అవుతుంది. అంటే మొత్తం కథ తరువాత యుద్ధం మాత్రం గ్యారంటీ అన్నమాట. అందుకే ఆ విషయాల ప్రస్తావన దాటేద్ధాం.
మొత్తానికి ఈ పెళ్ళి గోలంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే, ఈ మధ్య స్టార్ మూవీస్ లో ఒక ఇంగ్లీషు సినిమా చూస్తుంటే అనుకోకుండా ఒక జ్ఞానగుళిక పుటుక్కున తెరచించుకుని నా కళ్ళు తెరిపించింది. ప్రత్యేకంగా చెప్పఖ్ఖర లేదనుకుంటాను. ఆ జ్ఞాన గుళిక పెళ్ళనే మహత్తర కార్యం గురించే. ‘పెళ్ళెందుకు’ అని ఇప్పుడున్న పెళ్ళికాని యువతని అడిగితే తోడుకోసం, భాగస్వామి కోసం, ఆత్మబంధువు కోసం, ప్రేమ కోసం, అనుబంధం కోసం, ఆత్మీయత కోసం, ఆధారంకోసం అని ఎన్ని కథలైనా చెబుతారు. అవి నిజం కూడా కావచ్చుగాక, కానీ ఈ సినిమాలో చెప్పే కారణం వింటే కూసింత మతిపోయి "అబ్బా. నిజమే!" అనిపించే జ్ఞానోదయం ఖచ్చితంగా అవుతుంది.
Why people get married.
"We need a witness to our lives. There's a billion people on the planet ... I mean, what does any one life really mean? But in a marriage, you're promising to care about everything. The good things, the bad things, the terrible things, the mundane things ... all of it, all of the time, every day. You're saying 'Your life will not go unnoticed because I will notice it. Your life will not go un-witnessed because I will be your witness'."
- Beverly Clark (Played by Susan Sarandon)
క్లార్క్ పాత్ర అంటుంది... "మనుషులు పెళ్ళి చేసుకోవడానికి కారణం జీవితాలకు ఒక సాక్ష్యం కావాలనుకోవడం. కొన్ని వేలకొట్ల మందుండే ఈ లోకంలో నిజంగా ఒక చిరుజీవితానికి అర్థం ఉందా? కానీ పెళ్ళిలో ఉంటుంది. ప్రతొక్క విషయానికీ ఒక గుర్తింపు ఉంటుంది. మంచైనా,చెడైనా, ఛడాలమైనదైనా, రోజువారీ బోరుకొట్టే విషయమైనా... ప్రతి క్షణం, ప్రతిరోజూ మన జీవితాన్ని తరచిచూడటానికి ఒక సాక్షి ఉంటుంది/ఉంటాడు. ప్రతి విషయం గుర్తింపబడుతుంది. జీవితం ఎవరూ గమనించకుండా ముగిసిపోదు. పెళ్ళిద్వారా మన జీవితానికి ఒక సాక్ష్యమివ్వడానికి సాక్షి లభిస్తుంది."
పెళ్ళిద్వారా మన జీవితాన్ని గుర్తించే సాక్షం లభిస్తుంది అనేది ఎందుకో ఒక మహత్తరమైన కారణం అనిపించింది. ఏమో అందరికీ ఆ కారణం కావాలేమో ! అందుకే పెళ్ళికి ఇంత మహత్వం ఉందేమో!*****
15 comments:
Interesting.
but why do celebrities get married then?they have enough witnesses in us all.
@వినోద్: సెలెబ్రటీల్ మేకప్ పార్స్వాన్ని మాత్రమే మనం చూసేది.మిగతా విషయాలకు సాక్షిగా నిలవడానికి ఎవరో ఒకరు కావాలిగా!
మీరు ఎంచుకున్న విషయం చాలా విశిష్టత కలిగిన అంశము. కేవలం సాక్ష్యం కోసం పెళ్ళి చేసుకొనేటట్లెతే మన పెళ్ళి వ్యవస్థ ఎప్పుడో కుప్పకూలి ఉండేడి. మీరు ఈ విషయం మీద చాలా అవగాహన పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని నాకు అనిపింస్తున్నది. అయినా, మీరు ఒక మంచి విషయం గురుంచి పరిశోధించించుట నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. ఉంటాను మరి.
Really cool,that may be the real internal craving which no one realize
Here is a shot in the dark. Though much overblown, I think that there is much in the selfish gene hypothesis; the strong latent tendency to preserve one's genes, hence progeny. Marraiage may be one relatively stable institution which has evolved to serve this purpose.
నేనూ చూశాను స్టార్ మూవీస్ లోనే. సినిమా పేరు shall we dance? అనుకుంటా!హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి జీవిత సత్యాలు భలే చెప్తూ ఉంటారు అప్పుడప్పుడూ!ఆలోచించాల్సిన విషయమే చెప్పింది క్లార్క్! కానీ (ఎవరూ కోపాలు తెచ్చుకోకపోతే...)అమెరికన్స్ కి ఒక సాక్షి చాలరు. చాలా మందికి ఎప్పటికప్పుడు కొత్త సాక్షులు కావాల్సి వస్తూ ఉంటారు.
తీరిగ్గా ఆలోచిస్తే ఈ జ్ఞానగుళిక పనికొచ్చేట్టే ఉంది. అయినా మీ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా వదిలేస్తే ఎలాగ? ఈ మధ్య ప్రతిదీ మీతో ఏకీభవించడం అయిపోతోంది! కొంచెం కూడా యుద్ధ వాతావరణం లేకుండా!
excellent.......awesome........
"పెళ్ళిద్వారా మన జీవితాన్ని గుర్తించే సాక్షం లభిస్తుంది"
మంచి ఆలోచనే కాని అది ఒక్కటేనా కారణం పెళ్ళి చేసుకోవటానికి. పెళ్ళి అనేది ఒక అలవాటేమో అనుకుంటా నేనైతే... అంటే మన పెరిగిన సమాజం లేక పొతే మానవ నైజం ఒంటరి గా వుండటం అనే దాన్ని అలవాటు చెయ్యలేదు కాబట్టి పెళ్ళి అనేది ఒక అలవాటు గా అయ్యిందేమో అనుకుంటా నేను.. దాని పవిత్రత దాని విలువ అది మత పరం గా సమాజ పరం గా విలువలు ఇంక అవి అన్ని తరువాత కలిసిన రంగులేమో...
నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దేన్నో చెప్పను. ;-)
@భావన: పెళ్ళికి అదొక్కటే కారణం కాకపోవచ్చు. ప్రతి వ్యక్తికీ తనదైన కారణం ఉండొచ్చు.
పెళ్ళి అనేదొక "అలవాటు" అనే ప్రతిపాదన చాలా ఆసక్తికరంగా ఉంది.చాలా మంది ఆశయాలూ కారణాలతో నిమిత్తం లేకుండా కేవలం పెళ్ళి చేసుకోవాలి కాబట్టే పెళ్ళి చేసుకుంటారు.అదొక సోషియల్ కండిషనింగ్ లో భాగం. దాన్ని అలవాటంటే కాదనలేం.
@సుజాత: అవునండీ అదే సినిమా. అందుకే పైన పోస్టర్ పెట్టేసా.నా పెళ్ళి గురించి అభిప్రాయంలో కొంత భావన చెప్పేసారు. విశదంగా ఎప్పుడైనా నేనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ తరువాత "జగడమే!" అని పాడుకోవల్సిందే.
@సాయిప్రవీణ్: పెళ్ళి చేసుకోవడానికి కారణాలు కోకొల్లలు. ఇదొక ఆసక్తికరమైన ధృక్కోణం అందుకే పంచుకున్నాను. అంతేతప్ప ఇదే ఫైనల్ అని చెప్పేంత అవగాహనా,అవసరం నాకు లేవు.
nice... but dont tell this to SAKSHI paper/TV... they will use this for their purpose..
:-)
అయ్యో, నేను మీరు పెట్టిన పోస్టరు చూడకుండానే కామెంటాను!ఛ!
ఈ డైలాగ్స్ విన్నాక నాకు సినిమా చూడాలనిపిస్తోంది.
నాకు కూడా పెళ్లి గురించి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది.
ఆలోచిస్తే.. అవును నిజమే.. అనిపిస్తోంది.
Thanks for introducing such a nice quote.
లోతుగా ఆలోచిస్తే నిజమైన 'సాక్షి' అంతరాత్మ మాత్రమే.
ఈ శరిరేద్రియ సంఘాతం చేసేదంతా ఒకరకమైన నటనే. ప్రతి నటుడికీ ఒక ప్రేక్షకుడన్నా ఉండాలిగదా! (రోజుల నుంచి సంవత్సరాలు సాగే వైవాహిక జీవితమనే) కాస్త పెద్ద సినిమా చూడడానికి ఒకరికొకరు చేసుకునే ఒప్పందమే పెళ్లి.
ప్రేక్షకుడు కధ లో లీనమయ్యే అవకాశం కుడా ఉంది (సుఖ దుఃఖాలు పంచుకోవడానికి). సాక్షికి ఆ ఆవకాశం లేదు.
Marriage is a social institution.
Its a commitment live with a partner which is accepted by the society to establish a family.
It tries to fulfills the physical and psychological needs of human beings
a marriage can provide..
a friend to share feelings and show affection each other.
a companion to live life together ( a witness as u said )
a partner for sexual needs and reproduce kids
and there are many other religious and cultural function apart from personal needs.- from a social phylosophy book
Post a Comment