Saturday, June 20, 2009

విన్నపం : తెలుగు బ్లాగుల్లో కులవివక్ష - సైబర్ నేరాలు

పుస్తకం డాట్ నెట్ లో చలంపై జరిగిన ఒక చర్చలో నాపై కులపరమైన నింద చేస్తూ "హయ్దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో రిజర్వేషన్ తో పీజీ చేయంగనే ఓ కొమ్ములేం రావు. ఊర్కే రెచ్చిపోమాక" అనే వ్యాఖ్య గోపాలరాజు అనే వ్యక్తి చెయ్యడం జరిగింది. సదరు గోపాలరాజు తనదంటూ, నా బ్లాగు URL కూడా అక్కడ ఉంచడం జరిగింది. అంటే అతని పేరు మీద క్లిక్ చేస్తే డైరెక్టుగా నా బ్లాగుకు లంకె వెళ్ళేలా ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ఆ వ్యక్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Author : గోపాలరాజు (IP: 12.107.152.253 , s1.oag.state.ny.us)
E-mail : gopalaraju@gmail.com
URL : http://parnashaala.blogspot.com
Whois : http://ws.arin.net/cgi-bin/whois.pl?queryinput=12.107.152.253

ఈ IP ఆధారంగా నేను కొందరి మిత్రుల సహాయంతో ఈ వ్యక్తిని కనుగొనడం జరిగింది. కొన్నాళ్ళుగా ఇతను వివిధ బ్లాగుల్లో,వివిధ పేర్లతో నాగురించి రాసిన వ్యాఖ్యల్ని కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నాను. అందుకు మితృలు సహృదయంతో స్పందించగలనని ఆశిస్తున్నాను. ఎక్కడెక్కడైతే వ్యాఖ్యాత స్థానంలో నా బ్లాగు URL ఇవ్వబడి misleading, impostoring amounting to cyber-cheating చెయ్యబడిందో అలాంటి అన్ని చోట్లా ఈ వ్యక్తి "నా గుర్తింపు" ని దుర్వినియోగం చేసి చట్టప్రకారం శిక్షార్హుడు అవుతున్నాడని నేను నమ్ముతున్నానుగనక, దయచేసి ఆ వివరాల్ని నాకు ఇవ్వగలరని కోరుతున్నాను.

వర్డ్ ప్రెస్ వాడుతున్న బ్లాగర్లందరూ దయచేసి ఈ IP అడ్రసు నుంచీ నన్ను నిందిస్తూ వచ్చిన వ్యాఖ్యలతో నన్ను సంప్రదించగలని కోరుతున్నాను. బ్లాగర్ వాడుతున్న బ్లాగర్ మిత్రులు సందేహాస్పదమైన వ్యాఖ్యల్ని నాకు URLతో సహా పంపిన ఎడల గూగుల్ వారి హైదరాబాద్ ఆఫీసు ద్వారా ఈ ముసుగు వీరుడిని తన ఇతర స్నేహితులనూ సత్కరించే ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాను. నా మెయిల్ ID mahesh.kathi@gmail.com. నన్ను మెయిల్ ద్వారా సంప్రదిస్తే నా దగ్గరున్న వివరాల్ని పంచుకోగలను.

ఇంత చదువుకున్న వ్యక్తి,అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉంటున్న వ్యక్తి, ఉన్నత సాంప్రదాయక కుటుంబం నుంచీ వచ్చానని చెప్పుకొంటున్న వ్యక్తి, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాల్ని-దేశభక్తినీ రగరగాల్లో నింపుకుని కార్యోన్ముఖుడై ఉన్నాని చెప్పుకునే ఒక వ్యక్తి, తెలుగు బ్లాగుల్లో కుల వివక్షనూ, మత విద్వేషాలనూ, సైబర్ నేరాలనూ ప్రోత్సహించి నాయకత్వం వహించడం శోచనీయం. కేవలం ఖండించి పక్కకు తప్పుకునే స్థాయినుంచీ వ్యక్తిత్వహననం చేసి, అమానవీయ నిందా వ్యాఖ్యలు చేసి భారతీయ శిక్షాస్మృతిలో శిక్షార్హమైన నేరాలను తనూ చేస్తూ ఇతరులనూ ప్రోత్సహిస్తున్న స్థాయికి ఎదగడంలో మనందరి పాత్రా ఉంది. మనందరి మౌనప్రోత్సాహం లేకుంటే, మనందరం ఉపేక్షించకుండా ఉండివుంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చుండేది కాదు. కనీసం ఇప్పటికైనా బాధ్యత తీసుకుందాం. నా తరఫునుంచీ ముందడుగు వెయ్యడానికి నేను సిద్ధం. మీ సహకారం కోసమే ఈ అభ్యర్థన.

కూడలి, జల్లెడ,పుస్తకం,నవతరంగం నిర్వాహకులకు కూడా ఇదే అభ్యర్థనను చేస్తున్నాను. నాకు చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని అందించండి. తెలుగు బ్లాగుల్ని ఈ ఆభిజాత్యాలనుంచీ రక్షించండి. చట్టవ్యతిరేక చర్యలకు పాలుపడుతున్న వ్యక్తులను భారతీయ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాక్షిగా శిక్షించే ప్రయత్నంలో సహకరించండి.

****

30 comments:

Malakpet Rowdy said...

LOLZ,

12. something is a US IP address and if it has posted in the US, it should be covered under the US cyber law. I am not sure whether talking about reservations is a cyber crime even in India, let alone in the US.

Or is it a way to handle the blog fights? I mean threatening the people who oppose you?

Malakpet Rowdy said...

Even if you want to file a case, you need to find his Internet Provider - Google cant do anything and if they get overactive, they can be sued heavily in this country.

Malakpet Rowdy said...

Having said it,

I dont appreciate personal attacks - you can be ripped apart for what you write but you cant be criticized for where you born, what your name is, what your mother tongue is etc - It's like hitting below the belt!

Kathi Mahesh Kumar said...

@Malakpet Rowdy: The comment is not initiating a dialogue on reservation. Its about insulting a person by suggesting he is unworthy otherwise.Its called caste discrimination in India.And that is legally unacceptable.

I have no issues with people who oppose me. Those discussions happen day in and day out in blogs.In principle I never attack individuals either. But, I am not immune to personal attacks especially when they fall in to legality.

As a law abiding citizen my responsibility is to file an FIR. What police do with it is their choice.

In regard to google. Any company that is operating in India has to follow that country's laws. As part of their social responsibility I would expect them to take action(what ever it might be).

Malakpet Rowdy said...

Any company that is operating in India has to follow that country's laws
___________________________________

I dont disagree. But first thing is that the comment is posted in the US - not in India. I dont think a website is liable in India for a comment posted in the US.

Next, calling somebody by the name of the caste is an offense - but in this case the attack is about a facility availed by someone .. Though its socially and morally wrong, I am not sure whether it will be legally binding. Moreover Castism is not Racism, as per the Indian Govt's stance at the United Nations - I know its ridiculous but its the hard fact.

By the way I checked the few IP addresses I know but I dont have anybody with the one you mentioned - nothing on my list starts with 12.

Kathi Mahesh Kumar said...

@Malakpet Rowdy: The action is not against the comment but the individual who made that comment. He is Indian (at least by birth) and Telugu for sure. If he wishes not to come back to India anytime in future. Then no one can do any thing about it. But if he comes to India, then he will have little escape.

If "Durban declaration against Racism, Racial Discrimination, Xenophobia and
Related Intolerance" becomes effective in US, even castist remarks can be penalized.

Thank you for sharing the information.

vinod said...

మీరు ఇచ్చిన లింక్ లో ఆ comment లేదు.pustakam.netవాళ్ళు comment moderation పెట్టారు.ఐనా కేసు పెట్టొచ్చా.

Kathi Mahesh Kumar said...

@వినోద్: పుస్తకం వారు వారి నియమానికి అనుగుణంగా ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యని 'unapproved' చేశారు. 'Delete' చెయ్యలేదు.

నాకు అవసరమైన సమయంలో అప్రూవ్ చెయ్యడమో లేక వారి పద్ధతులకు అనుగుణంగా ఒక విశదమైన వివరణ లేఖ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తపరిచారు. ఈ సహకారానికి నేను వారికి నా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను.

Kathi Mahesh Kumar said...

@కొండముది సాయికిరణ్ కుమార్: Just few observations....
నేను భుజాలు తడుముకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ(http://amtaryaanam.blogspot.com/2009/06/immunity-in-name-of-law.html) తమరు రాసింది నాగురించే.
"self proclaimed ‘Intellectual Blogger’ of this World. " When are where have I proclaimed that?

" I am sure, this IB too used different IDs while posting certain comments against a particular community and certain individuals." పచ్చి బూతులు తిట్టాలన్నా నా ఐడెంటిటీతోనే రాస్తాను నేను. ఎందుకంటే నా చేతకానితనం,కోపం మీదకూడా నాకు గౌరవం ఉంది. నీ నమ్మకం కాదు. ఇప్పుడు నా వ్యాఖ్యతో నీకు లభిస్తున్న నా IP అడ్రసుతో మొత్తం బ్లాగులోకంలో వెతుకు నా "అనామక" కామెంట్ ఒక్కటీ కనబడదు.

"what about all those Hindus and Certain Community Persons who felt insulted by this IB’s pathetic and irritating articles and comments? "...ఇప్పటి వరకూ నేను రాసిన ఎ టపా "చట్టవ్యతిరేకం" కాదు.ఉంటే you are open to lodge a complain against me.I live in Hyderabad and mail me I shall give u my address.

Sravya V said...

:) :) All the best Mahesh !

Unknown said...

మహేష్ గారూ ! ఈ టపా రాసే ముందు మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించలేదని చెప్పకతప్పదు. ముఖ్యంగా మీ అసహనం మీ ఇమేజిని ఎలా దెబ్బ దీస్తుందనేది.

ఒకటి - ఆయన ఇండియా వచ్చినా ఆయన్ని మీరేమీ చెయ్యలేరు. మీ వాదన కోర్టులో నిలబడదు.

రెండు - మీరు ఏమైనా చెయ్యగలిగితే అది మీకే నష్టం, రెండు రకాలుగా ! ఒకటి, ఇక్కడ నివసిస్తున్న ఆయన తరఫువారు మిమ్మల్ని వెంటాడతారు. అవతలివాడి బలాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదు. రెండోది - మీరు తెలుగు బ్లాగ్ లోకంలో అందరిచేతా avoid చెయ్యబడతారు. ఎందుకంటే ఈ చర్య ద్వారా మీ సాంఘిక గుర్తింపు ఏంటనేది అందరికీ తెలుస్తుంది కనుక. ఇది మీకే కాక మీలాగా బ్లాగింగ్ చేస్తున్న అనేకమంది రిజర్వుడు క్యాండిడేట్లకి ఎంతో నష్టదాయకం.

మూడు - మీరు తెలుగుబ్లాగులకి కొత్త కావచ్చు గానీ అంతకుముందు చాలామంది ఇలాగే ఆవేశపడి ఆ తరువాత చప్పగా చల్లారారు. ముందు మీరు మ బ్లాగులో ఇతర వర్గాల్ని కించపరుస్తూ రాయడం ఆపండి. ఆ తరువాత మిమ్మల్ని అందరూ ఎలా గౌరవిస్తారో చూడండి. "అలా కాదు, అలా రాయడం నా జన్మహక్కు" అని వాదిస్తారా ? సరే ! Then face the music. వ్యాఖ్యల ద్వారా కాకపోతే మరో రకంగా మీ interests ని hurt చెయ్యాలని అవతలివారు ప్రయత్నిస్తారు. Hatred is a very costly proposition but you invited it. ఇప్పటికీ మీరు చేస్తున్నది అదే. మీలో మార్పు లేదు. పశ్చాత్తాపం లేదు. ఈ Cosmopolitan India లో మనుషులు వ్యవహరించాల్సిన పద్ధతి ఇది కాదు.

నాలుగు - మీరు ఏదో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది కూడా మీకే నష్టదాయకం. మీరు క్లెయిమ్ చేస్తున్నవిధంగా మీ గత రాతలు చట్టబద్ధాలు కావు. మీరు అనేక వర్గాల్ని నొప్పించే రాతలు అనేకం రాశారు. మీ క్లెయిముల సంగతెలా ఉన్నా అవన్నీ కూడా విచారణలోకి వస్తాయని మర్చిపోవద్దు. ఇందులోకి మీరూ గోపాలరాజుగారూ మాత్రమే కాక అనేక ఇతరేతర శక్తులు కూడా ప్రవేశిస్తాయి. మీక్కావాల్సింది అదే అయితే OK, Go ahead, Quick. Good Luck

Kathi Mahesh Kumar said...

@అభిషేక్: నేను టపా రాసేముందు చాలాచాలా ఆలోచించాను. స్నేహితులూ,న్యాయవాదుల సలహా తీసుకునే ఈ ఆరంభం చేశాను. కాబట్టి దాన్ని అసహనమో లేక తొందరపాటు తనమో అని కొట్టెయ్యాల్సిన పనిలేదు.

ఈ కేసుతో నేను తనని కోర్టు వరకూ తీసుకెళ్ళగలను. అది నిలబడుతుందా లేదా అనేది కోర్టువారు తప్ప మీరూ నేనూ నిర్ణయించలేము.

ఆయన తరఫున్నుంచీ ఎంత మంది ఇప్పటికే వెంటాడుతున్నారో ఒకసారి మూడ్రోజులుగా బ్లాగుల్లో వచ్చిన టపాలు పరిశీలించుకోండి తెలుస్తుంది. కాబట్టి కొత్తగా నన్ను వెంటాడటానికి మరో పదిమంది తయారయినా నాకొచ్చే నష్టం లేదు. నేను బ్లాగు రాసేది నాకోసం ఈ న్యాయబద్ధమైన పోరాటం కారణంగా నన్ను avoid చేసేవాళ్ళుంటే నాకొచ్చే లాభంగానీ నష్టంగానీ ఏమాత్రం లేదు.

నా ఐడెంటిటీతో నాకు సమస్య ఉందని ఎందుకనుకుంటున్నారు మీరు? ఇలాంటి సమస్య మిగతా దళితులకు ఉందని ఎలా అనుకుంటున్నారు? "కత్తి" అనే నా ఇంటిపేరు చాలు నేనెవరో చెప్పడానికి.
నేను ఆదిఆంధ్రుణ్ణి
నేను దళితుడ్ని
నేను మాదిగను
రిజర్వేషన్తో చదువుకున్నాను. భారతదేశంలో ఉన్న ఉత్తమమైన విద్యాలయాలూ,కళాశాలలూ,యూనివర్సిటీల్లో చదువుకున్నాను. I am proud of what I am and what I have accomplished so far.కానీ నా హక్కుని కించపరుస్తూ కులం కారణంగా "మాత్రమే" నేనున్నానంటే మాత్రం దాన్ని అమానవీయంగానే పరిగణిస్తాను. వివక్షగానే గుర్తిస్తాను. దానికి వ్యతిరేకంగా పోరాడతాను.

ఇతర వర్గాలను కించపరిచానని మీరంటున్నారు. అదే రాతలు చట్టబద్ధం కావనీ మీరంటున్నారు. అంటే ఏది నిజం? నేను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కొన్ని ప్రతిపాదనలూ చర్చలూ మాత్రమే చేస్తున్నట్లా లేక పనిగట్టుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లా? అలాంటప్పుడు నాలో రావలసిన మార్పేమిటి? నేను పశ్చాత్తాప్పడాల్సిన విషయం ఎమిటి? కాస్త సవివరంగా చెబుతారా!

నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చెయ్యడం వలన నాకొచ్చే లాభమేమిటి? నా బ్లాగుకు నేషనల్ అవార్డొస్తుందా లేకపోతే నాకు రాష్ట్రపతి బహుమానం వస్తుందా? నేను ఏ విచారణకైనా సిద్దమే. ఏ శక్తుల పేరుచెప్పి మీరు నన్ను జాగురుక పరుస్తున్నారో ఆశక్తులతో నేను ఒక సంవత్సరంగా బ్లాగుల్లో పుట్టినప్పటి నుంచీ జీవితంలో అనునిత్యం పోరాడుతూనే ఉన్నాను.

Thank you for your support and advice.

ఏక లింగం said...

Am I missing something here?

మీ టపా చదివితే, నాకు అర్థం కాని విషయాలు కొన్ని...

మీరు కేవలం రిజర్వేషన్ తో చదివారు అని అన్నందుకు కేసు పెట్టాలనుకున్నారా లేక మీ బ్లాగు అడ్రస్ ఇచ్చినందుకా?

రిజర్వేషంతో చదివావు అన్నది కులద్వేషం అవుతుందా?
లేదు.. మీ బ్లాగు అడ్రస్ ఇచ్చారే అనుకుందాము. అది కేసు పెట్టదగ్గ నేరమా?

ఒక వేళ ఆ కామెంట్ పెట్టినతను Anonymous proxy వాడి కామెంట్ పెట్టివుండవచ్చు కదా? అప్పుడు మీరు ఎవరో అనుకొని ఇంకెవరిపైననో కేసు పెట్టడానికి ఆస్కారం లేదా?

అయినా భారత దేశంలో ఎప్పుడయిన బ్లాగులో కామెంట్ల గొడవలు కోర్టులో పరిష్కరించ బడ్డాయా? (Forgive my ignorance. I have no idea.)

Anyway... good luck

Anil Dasari said...

@మహేష్‌పై దాడి చేస్తున్నవాళ్లు:

అతని అభిప్రాయాలు మీకు నచ్చకపోవచ్చు. అంతమాత్రానికే దళితుడనీ, దేశ ద్రోహనీ అవమానించటం దారుణం. ఒకసారి అదెంత ఘోరమైన అభియోగమో ఆలోచించుకోండి.

@మహేష్:

కులమతాల పేర్లతో దూషించటం, అవమానించటం హేయమైన చర్యే. సంస్కృతీ పరిరక్షకులుగా తమని తాము ప్రస్తుతించుకునేవాళ్లు అలా చెయ్యటం ఏం సంస్కృతో గ్రహించుకోవాలి.

అయితే, బ్లాగుల్లో రాసేవాళ్లు ఎందరో ఉండగా మీ మీదనే ఈ దాడులెందుకు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. మీ తరపు నుండీ ఎంతో కొంత ప్రేరేపణ లేకుండా ఇదంతా జరిగిందా? అదేమీ లేకపోతే మీపై దాడిని ఖండించటానికి ఒకరూ ముందుకు రావటం లేదేం? ఎవరికి వారు 'నాకేమిటిలే' అనుకోబట్టి మాత్రం కాదు. 'రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు' అనుకోబట్టి.

ఒకటి గుర్తు చేస్తాను. దాదాపు ఏడాది క్రితం - మీరు వ్యక్తీకరించిన కొన్ని భావాలని బహిరంగంగా ఖండించి, తీవ్ర స్థాయిలో మీతో వాగ్వివాదానికి తలపడ్డ మొదటి వ్యక్తిని నేను. అప్పట్లో దాదాపు అందరూ మీ రాతల్ని ఆహా ఓహో అని పొగిడేవాళ్లే. నాతో గళం కలిపినోళ్లు ఒకరిద్దరు మాత్రమే. ఇప్పుడు పరిస్థితి తారుమారెందుకయ్యింది? ఇప్పుడు మీకు వ్యతిరేకులు ఎక్కువెందుకయ్యారు?

ఏడాది క్రితం బ్లాగుల్లో ఓ సంచలనంలా ప్రవేశించిన మీరు అతి త్వరలో లభించిన పేరు ప్రఖ్యాతులతో ఉక్కిరిబిక్కిరై, ఆ తర్వాత సంచలనాల కోసమే రాయటం పనిగా పెట్టుకున్నారని అనేకమంది అభిప్రాయం. Simply put, you got carried away by instant fame. ఇప్పటికీ మీ రాతలంటే ఆసక్తి ఉన్నవారెందరో ఉన్నారు. వాళ్లంతా మీరు రాసే ప్రతిదానితోనూ ఏకీభవించకపోవచ్చు, అలాగని ప్రతిదానితోనూ విభేదించకపోవచ్చు. మీరు చెప్పదలచుకున్న వివాదాస్పద విషయాలనూ నొప్పించకుండా చెప్పవచ్చు (అలా చెప్పినా రాళ్లేసేవాళ్లు ఉంటారు. మీకు ప్రస్తుతం ఉన్న reputation అటువంటిది). మీరు కొన్ని విషయాలను నమ్మినంత గట్టిగానూ అవతలివారు వాటికి వ్యతిరేకమైన విషయాల్ని నమ్మొచ్చు. వాళ్ల గొడవేంటో కూడా కాస్త వినండి.

మీపై హిందూ వ్యతిరేకనే ముద్ర పడటానికి అవకాశం ఎందుకివ్వాలి? మతం అనేది చాలా సున్నితమైన వ్యవహారం. మన భారతీయుల విషయంలో అది మరీ సున్నితం. అటువంటి విషయాలపై వ్యాఖ్యానించేటప్పుడు ముందూ వెనకా చూసుకోకుండా వ్యవహరిస్తే ఎలా? మీ ఉద్దేశాలు సరైనవే కావచ్చు. వాటిని అందరూ అదే విధంగా అర్ధం చేసుకోవాలని లేదు కదా. (ఇక్కడో సరదా విషయం చెప్పేదా? నేను రాసిన ఒకానొక కామెడీ టపా చదివి ఒకాయన నన్ను హిందూ వ్యతిరేకనీ, మరొకాయన క్రైస్తవ వ్యతిరేకనీ ఏక కాలంలో తిట్టి పోశారు. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లర్ధం చేసుకున్నారన్నమాట :-) )

అహం పక్కనబెట్టి ఒకసారి ఆలోచించుకోండి. కయ్యానికి సయ్యనటం వల్ల ఒరిగేదేమిటి? బ్లాగు రాతలు కొట్లాటల కోసం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోటం కోసం కాదు. తగ్గటమంటే తల వంచటం కాదు.

మీకు, మీపై దాడులు చేస్తున్న వాళ్లకూ నా విన్నపం. మీ అందరికీ తెలుగంటే అభిమానముంది, కొందరికి అనేకానేక విషయాలపై అభిరుచి, అభినివేశం ఉన్నాయి, మంచి రచనలతో తెలుగు బ్లాగు లోకాన్ని వెలిగించగల సత్తా ఉంది. ఈ అనవసరమైన గొడవల్లో పడి దాన్నంతా వృధా చెయ్యటం ఎందుకు? ఇక్కడితోనైనా దీన్ని ఆపండి. ఆరేడు నెలల కిందటి వాతావరణాన్ని తెలుగు బ్లాగుల్లోకి తీసుకు రండి.

Anonymous said...

మలక్ పేట్ రౌడీ,
ఎక్కడ ఏమి గొడవ జరిగినా ముందు మీరెందుకు 'అవతలి వారి తరఫున" రంగంలోకి దిగుతారు? వారి తరఫున మీ పాత్ర ఎంతవరకూ ఉందని నమ్మవచ్చు? మీకు సంబంధం లేని విషయాల్లో మీరెందుకు తల దూరుస్తారు? leg pulling అనేది సరదా వరకైతే ఓకే! ఇలాంటి సీరియస్ విషయాల్లో మిమ్మల్ని ఎవరు పిలిచారని వచ్చి వారికి వత్తాసు పలుకుతున్నారు? అవతలి పక్షం మిమ్మల్ని ఏమైనా పిలిచిందా తోడు రమ్మని? ఇందులో మీరు కూడా భాగం కాదని నమ్మకమేమిటి?

Bolloju Baba said...

బ్లాగుల్లో కులవివక్ష ప్రత్యక్ష్యంగానో పరోక్షంగానో ఉన్నదన్న విషయం ఒక వాస్తవం.

దౌర్భాగ్యమేమిటంటే నిజాయితీగా తమతమ ఐడెంటిటీలను బ్లాగుల్లో చెప్పుకొన్నవారే టార్గెట్ అవుతున్నారు. అదిఒక పర్ణశాల కావొచ్చు మరొకటి కావొచ్చు.
ఇలా టార్గెట్ అయ్యేవారికి అనామకులుగా చెలామణీ అయ్యే డబుల్ స్టాండర్డ్స్ లేకపోవటం గమనార్హం.

మీ అభియోగానికి మద్దతు తెలుపుతున్నాను.
మీ ఆవేదనను అర్ధం చేసుకున్నాను.

పేరు బయటకు రాదుకదా అనే ధైర్యంతో చేసే ఇలాంటి మానసిక దౌర్భల్య వ్యాక్యలను ఎవరో ఒకరు ప్రశ్నించాల్సిందే.

మానవత్వం ఉన్నవారు అర్ధంచేసుకొంటారు. అసురులు మరింత అరాచకం సృష్టిస్తారు.
దానికి కూడా సిద్దపడాల్సిందే.

ఇదే తొలిరోజు కాదు కదా?
ఈ దేహాలనిండా ఎన్ని గాయాల మచ్చలు లేవూ?

బొల్లోజు బాబా

గీతాచార్య said...

అభిషేక్ గారూ,

మీరు చెప్పినది చాలా అసంబద్ధంగా ఉంది. ఎదుటివారి వాదనని అంగీకరించలేకపోతే మంచిదే. మన వాదనని వినిపించవచ్చు. అంతే కానీ కులం పేరుతో వ్యాఖ్యానించటం చాలా తప్పు. వాళ్ళు మానవతా స్థాయిని ఎప్పుడో దిగజారినట్టే.

మహేష్ గారు వారి రాతల్ని చదవమని ఎప్పుడూ ఎవరినీ కోరలేదు. U oughtta deal with personalities. Not with persons.

" మీరు తెలుగు బ్లాగ్ లోకంలో అందరిచేతా avoid చెయ్యబడతారు. ఎందుకంటే ఈ చర్య ద్వారా మీ సాంఘిక గుర్తింపు ఏంటనేది అందరికీ తెలుస్తుంది కనుక. ఇది మీకే కాక మీలాగా బ్లాగింగ్ చేస్తున్న అనేకమంది రిజర్వుడు క్యాండిడేట్లకి ఎంతో నష్టదాయకం."

This alone shows how prejudicial u r.

ఆయన ఎవరనేది మనకనవసరం. ఇష్టం ఉంటే చదువుతారు లేందే మానేస్తారు. ఆయన రాతల వల్ల దేశానికి ఏదో నష్టం అనుకుంటే, అది మీ ఫూలిష్నెస్.

@కత్తి గారు,

మీరు తీసుకునే చర్యల వల్ల లాభం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ అవతల వారి చర్య మాత్రం హేయమైనది. సాధ్యమైనంతలో ఇలాంటి వాటిని జరుగకుండా చూడవలసిన బాధ్యత అందరి మీదా ఉంది.

Kathi Mahesh Kumar said...

@ఏకలింగం: మీకు ఓర్కుట్ హేట్ గ్రూపు విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు గురించి తెలిసినట్లు లేదు.
http://www.alootechie.com/content/supreme-court-refuses-go-easy-hate-community-created-orkut

మీరు కెలుకుడు బ్లాగు సంఘం అని రెచ్చిపోయినా, మీలోనే ఎవడో ఒకడు ఇలాంటి తప్పు చేసి దొరికిపోతే మొదటికే ముప్పని గ్రహించండి.సైబర్ నేరాల విషయంలో అమెరికాకన్నా భారత దేశానికి ముఖ్యంగా హైదరాబాద్ కి చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

రిజర్వేషన్ తో చదివాను అన్నందుకు కాదు. తను ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది ఇక్కడ ముఖ్యం. కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి.

నా బ్లాగు అడ్రస్ ఇస్తూ incriminating వ్యాఖ్యలు చేస్తే that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి.

కేసు పెట్టడానికి నేను వ్యక్తెవరో కనుక్కోనవసరం లేదు.IP అడ్రస్ ఒకటిస్తే చాలు. వాడ్ని కనుక్కునే పని పోలీసులది. కానీ ఇక్కడ క్రాస్ రెఫరెన్సులతో సహా నాకు ఆవ్యక్తి తెలుసు. ఆ వ్యక్తిరాసే బ్లాగులు తెలుసు. ఆ వ్యక్తి మిగతా బ్లాగుల్లో ఎక్కడెక్కడ నాగురించి కులపరమైన వ్యాఖ్యలు చేశాడో తెలుసు. కాబట్టి అవన్నీ కేవలం కేసు గట్టిపడటానికే ఉపయోగపడతాయి.

ఇక్కడ కొందరు ఆ వ్యక్తి తెలిసీ నాటకాలాడుతున్నారుగానీ. వాళ్ళందరికీ ఆ IP అడ్రస్ సుపరిచితమే. ఆ వ్యక్తిని "అధ్యాక్షా" "అన్నా" అనే పిలుచుకుంటారు. వీళ్లకు తెలీని విషయం ఏమిటంటే అమెరికా పెద్ద దూరదేశం కాదు. దళిత ఉద్యమాలు రీచ్ అవని దేశమూ కాదు.

@అబ్రకదబ్ర: మీరు చాలా విశాలస్వభావులు. నేను చర్చలవరకే ఆవిశాలత్వాన్ని ప్రదర్శిస్తాను. వ్యక్తిగత ధూషణలకొస్తే ఔదార్యం ప్రదర్శించే వైశాల్యం ఇంకా రాలేదు.ముఖ్యంగా చట్టవ్యతిరేక ఆరోపణలూ నిందలూ చేసినా సహించే విశాలత్వం అస్సలు లేదు.

చర్చల వరకూ విషయ భేధాభిప్రాయాలవరకూ ఎంతటి తీవ్రమైన పదజాలానికైనా నవ్వుతూనే సమాధానం ఇస్తాను. కానీ నా వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సహించను. అంతే తప్ప మీరన్న instant fame is nothing for me and there is none in this matter.

నన్ను వ్యతిరేకిస్తున్నవారి గొప్పతనం పట్ల మీకు అపారమైన నమ్మకం ఉందేమో, కానీ వీళ్ళు ఎలాంటివాళ్ళో ఒకసారి నేను ఆ వ్యక్తిని బయటపెట్టిన తరువాత గానీ మీకు తెలీదు. వీళ్ళు వేదాలు వల్లించే దయ్యాలు. అంతకు మించి మరేమీ కాదు.

జీడిపప్పు said...

ఎందుకు ఇలా జరిగింది అన్న సంగతి అబ్రకదబ్ర గారు సుస్పష్టంగా చెప్పారు. మీరు కూడా ఒకసారి మీ రాతల గురించి ఆలోచించుకోవలసిన తరుణం ఆసన్నమయినది మహేష్ గారూ. ఇప్పటివరకు బ్లాగులోకంలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా మిమ్మల్నే ఎందుకు పేరుకొంటున్నారో ఆలోచించండి. రెచ్చకొట్టే రాతలు ఇకనయినా మానండి. take a vacation!!

ఇక కేసు, FIR, జైలు .. హ హ్హ హ్హా భలే జోకు.

Kathi Mahesh Kumar said...

@జీడిపప్పు: బాగా నవ్వుకోండి. ఇంకా నవ్వుకోండి. ఎందుకు జరిగినా ఎలా జరిగినా దేశద్రోహులెవరో నేరస్తులు ఎవరో ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. I am on vacation all the time. Now its their turn.

vinod said...

మీరు ఒక సందర్భం లో Brahminical Attitude అన్న పదప్రయోగాన్ని చాలా సంతోషంగా వెనకేసుకొచ్చారు.
http://rayraj.wordpress.com/2009/05/07/%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%A1/

అప్పుడు అది బ్రాహ్మణులని దూషించినట్లుగా అనిపించలేదా?మీరన్న మాట చట్ట ప్రకారం తప్పు కాకపోవచ్చు కానీ అనైతికం.especially when you threaten to raise a police complaint on a slightest(indirect) remark made aginst your cast.
"ఇతర వర్గాలను కించపరిచానని మీరంటున్నారు. అదే రాతలు చట్టబద్ధం కావనీ మీరంటున్నారు. అంటే ఏది నిజం?
నేను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కొన్ని ప్రతిపాదనలూ చర్చలూ మాత్రమే చేస్తున్నట్లా లేక పనిగట్టుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లా? అలాంటప్పుడు నాలో రావలసిన మార్పేమిటి? నేను పశ్చాత్తాప్పడాల్సిన విషయం ఎమిటి?
కాస్త సవివరంగా చెబుతారా!"

కులాలు మతాలు చర్చకు పెట్టడం అవసరమా?బ్లాగనేది నా అభిప్రాయాలు తెలపడానికని మీరొకసారన్నారు.ఎప్పుడైతే

మీ భావాలని పబ్లిష్ చేస్తారో ఆ భావం భావజాలంగా మారినట్టే.
రాముడికి సీత భార్య అవుతుందని గుడ్డిగా నమ్మి ఇప్పుడెవరైనా జీవితాలు నాశనం చేసుకుంటున్నారా దాని గూర్చి
చర్చించడానికి.రామాయణ మహాభారతాలు నిజంగా జరిగినవేననీ,అందులో పాత్రలు దేవతా స్వరూపులేననీ కొన్ని
కోట్లమంది నమ్మకం.ఇప్పుడు వీటి ప్రామిణికత మీద చర్చ అవసరమా?మా నమ్మకం లోనే మాకు శాంతి.
లేదూ బాల్య వివాహాలు,వరకట్నం లాగా ఇదీ ఒక దురాచారమనుకుంటే అప్పుడు చర్చించి జనాన్ని జాగరూకుల్ని
చేయొచ్చు.ఇది అలా కాదే.

నిజానికి పై విషయాలలో మీతో మీ విరొధులు కూడా ఏకీభవిస్తారనే అనుకుంటున్నాను.కానీ చిక్కెక్కడంటే మీరు దాన్ని
భావజాలం లెవెల్ కి తీసుకెళ్ళి కొన్ని వర్గాలని offend చేయడమే.ఈ భావజాలం పంచేది కత్తి మహేష్ ఐనా కొడవటిగంటి
కుటుంబరావైనా జనాలు ఇలానే రియాక్ట్ అవుతారు.

కేసు పెడితే సైబర్ క్రైం గురించి పెట్టండి కానీ sc/st చట్టాలు వాడకండి.దేశంలో ఉత్త పుణ్యానికే బలయ్యే దళితులు చాలామంది వున్నారు.ఆ చట్టాలు వాళ్ళకోసం.మీలా ఎదుటి వర్గాన్ని రెచ్చగొట్టే వాళ్ళకు కాదు.

మళ్ళీ ఏమిటి నేను పంచిన భావజాలం?ఏ వర్గాల్ని నేను రెచ్చగొట్టింది అంటారా?excuse me.

Anonymous said...

Bullies do not need a reason to harass someone. They are just bullies by nature and are always on the lookout for preys.
I've been a regular reader of telugu blogs for some time and am plain disgusted with the nastiness that's going around lately.
And as to how come Katti mahesh does not get a lot of support- who in the right mind wants to throw a stone on "aSuddhaM"

Good Luck katti mahesh!

Anonymous said...

మహేష్ గారు పెద్ద వివాదాస్పదమైన విషయాలేమీ వ్రాయలేదు. ముహమ్మద్ ప్రవక్తకి వ్యతిరేకంగా వచ్చిన blasphemous cartoons చూసి ఆందోళన చెందేవాళ్ళ లాగ మీకు ఎందుకంత బాధ? మహేష్ హిందూ మతం పై తన అభిప్రాయాలు తాను చెప్పాడు అంతే.

Kathi Mahesh Kumar said...

@వినోద్:Its so naive of you to think they are fighting an ideological war.

There is a pattern to it and this is not the first time they are doing it. I have only been quite and trying to ignore their tantrums so far.

ఇప్పుడు మరీ బరితెగించిన తరువాత నాకు ఇలా తప్పడం లేదు. భారతీయ సంస్కృతీ,చరిత్రా,సాంప్రదాయాలకు వీళ్ళు ప్రతినిధులూ కాదు. వీరి కోపం వాటిని నేను వ్యతిరేకించడమూ కాదు. If they have a case, they could have always put me in place through legitimate arguments.

వారి ఉద్దేశం సంస్కృతి ముసుగులో రాజకీయ భావజాలానికి ఊతమివ్వడం. దేశభక్తి ముసుగులో కులవైషమ్యాలను రెచ్చగొట్టడం.సాంప్రదాయాల పేరుతో మనుషుల్ని కించపరచడం. నాపై వీరి planned attack కులపరమైనదని నిరూపించడానికి నాదగ్గర తగిన ఆధారాలున్నాయి. ఒక్కొక్కటిగా బయటికొస్తాయి వేచిచూడండి.

పునర్వసు said...

గీతాచార్య గారూ,
బ్లాగులలో వ్రాయడం చదవడానికి, స్పందించడానికీ కాదా? స్పందించవద్దు అంటే సొంత వెబ్ సైటు పెట్టుకోవాలి. వేరేవాళ్ళు ధర్మంగా ఇచ్చిన సైటులో వ్రాస్తే ఏవరయినా స్పందిస్తారు. వ్యక్తిగత దూషణ తప్పు. ఐతే నాదొక సందేహం. కులము, మతము వ్యక్తిగతాలా? వాటిని మార్చుకోలేరా? సమాజంలో తక్కువకులాల గుర్తింపుతో అవమానాలు పొందుతున్నామని బాధపడేవారు, కులాలను రద్దుచేయాలని, కులవ్యవస్త రద్దుచేయాలని ప్రభుత్వాన్ని ఎప్పుడయినా కోరారా? కులవ్యవస్థద్యారా లాభం పొందేవారే కులవ్యవస్థ కావాలంటారు. గౌరవం సమానత్వం కావాలన్న వాళ్ళు వాటికోసం పోరాడాలి, అదేసమయంలో అసామానత్వానికి కారణంగా భావిస్తున్న కులవ్యవస్థ రద్దుకావాలంటూ కూడా నినదించాలి.

భావన said...

మహేష్ good luck

Anonymous said...

మహేష్ గారు,
మన దేశంలో కుల వివక్ష గురించి మనకు తెలియంది కాదు.
హైదరాబాదులాంటి నగరాలలో కూడా ఇలాంటి కుల వివక్షను నేను గమనించాను.
నువ్వు X పుట్టుక పుట్టావా లేక Y పుట్టుక పుట్టావా అని తిట్టుకోవడం నేను చాలా సార్లు విన్నాను. (X,Y లున్న స్థానంలో ఒక నిమ్న కులాన్ని, ఒక ఉన్నత కులాన్ని వూహించుకోండి.).
అలా అని ప్రతీదాన్నీ బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ అనడం, U.G.C పాఠాలలో కూడా అలానే వుంది అనడం మంచిదా చెప్పండి? మన వాల్లకు కులం అంటే వున్న అభిమానం మనకు తెలియంది కాదు. మరివాల్లుకూడా దాన్ని తమ కులం మీద జరిగిన దాడిగా భావిస్తారు కదా?
వ్యక్తిగత దాడులను నేను సమర్దించను. కానీ దాడి కి ప్రతిదాడి సహజమే కదా? తేడా ఏమిటంటే ఒక వర్గంవారు చేసే దాడి చట్టప్రకారం నేరమవుతుంది, మరో వర్గం వారు చేసే దాడిని చట్టం గుర్తిచదు. అంతమాత్రం చేత దాన్ని సరర్దించగూడదు కదా..? ఏది ఏమైనా అతను అలా మీమీద వ్యక్తిగత దూషణకు దిగడం తప్పే, మీరు పెట్టే కేసు ఖచ్చితంగా నిలుస్తుంది నాకు అందులో ఎటువంటి సందేహం లేదు. అమెరికాలోనో ఎక్కడో వున్నంత మాత్రాన ఏమైన చెయ్యొచ్చను

Anonymous said...

మహేష్ గారు,
మన దేశంలో కుల వివక్ష గురించి మనకు తెలియంది కాదు.
హైదరాబాదులాంటి నగరాలలో కూడా ఇలాంటి కుల వివక్షను నేను గమనించాను.
నువ్వు X పుట్టుక పుట్టావా లేక Y పుట్టుక పుట్టావా అని తిట్టుకోవడం నేను చాలా సార్లు విన్నాను. (X,Y లున్న స్థానంలో ఒక నిమ్న కులాన్ని, ఒక ఉన్నత కులాన్ని వూహించుకోండి.).
అలా అని ప్రతీదాన్నీ బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ అనడం, U.G.C పాఠాలలో కూడా అలానే వుంది అనడం మంచిదా చెప్పండి? మన వాల్లకు కులం అంటే వున్న అభిమానం మనకు తెలియంది కాదు. మరివాల్లుకూడా దాన్ని తమ కులం మీద జరిగిన దాడిగా భావిస్తారు కదా?
వ్యక్తిగత దాడులను నేను సమర్దించను. కానీ దాడి కి ప్రతిదాడి సహజమే కదా? తేడా ఏమిటంటే ఒక వర్గంవారు చేసే దాడి చట్టప్రకారం నేరమవుతుంది, మరో వర్గం వారు చేసే దాడిని చట్టం గుర్తిచదు. అంతమాత్రం చేత దాన్ని సరర్దించగూడదు కదా..? ఏది ఏమైనా అతను అలా మీమీద వ్యక్తిగత దూషణకు దిగడం తప్పే, మీరు పెట్టే కేసు ఖచ్చితంగా నిలుస్తుంది నాకు అందులో ఎటువంటి సందేహం లేదు. అమెరికాలోనో ఎక్కడో వున్నంత మాత్రాన ఏమైన చెయ్యొచ్చనుకుంటే అది పొరబాటే. కాకపోతే కాస్త సమ్యమనం పాటించమని మాత్రం నేను కోరుతున్నాను.

Anonymous said...

నా మాటలు కూడా కాంట్రవర్షియల్ గా భావిస్తున్న ఈ తరుణంలో, నేను అబ్రకదబ్రాగారి నుంచి రెండు మాటలు అరువు తెచ్చుకుంటున్నాను.:
౧. నా పోస్టులను కూడా ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లర్ధం చేసుకున్నారు :-) )
౨. తగ్గటమంటే తల వంచటం కాదు.

పైనెవరో నా పోస్టొకటి ఉదహరించారు. ఆ పోస్టు కొచ్చిన అన్ని వ్యాఖ్యలను అప్పుడు ప్రచురించలేదు గానీ, అలా వ్యాఖ్యానించగల మనిషి తన బ్లాగులో "అద్వైతం" గురించిన చర్చ చేయడం చూసి, అప్పుడే బోళ్డు ఆశ్చర్యపోయాను.

I know i am not capable to advise on this issue. But i thought i can share the following quotes from Khalil Gibran: Prophet :

" Oftentimes have I heard you speak of one who commits a wrong as though he were not one of you, but a stranger unto you and an intruder upon your world.
But I say that even as the holy and the righteous cannot rise beyond the highest which is in each one of you,
So the wicked and the weak cannot fall lower than the lowest which is in you also.
And as a single leaf turns not yellow but with the silent knowledge of the whole tree,
So the wrong-doer cannot do wrong without the hidden will of you all. "

http://leb.net/~mira/works/prophet/prophet12.html

మిమ్మల్ని వ్యతిరేకించే విషయాలతో ఇంత వరకు నేను ఏ పోస్టు వేయలేదు. మరో రచయత్రిని కలిపి విమర్శిద్దామని ఉంది. బహుశా నా కామెంటులో మాటలు నచ్చక ఆవిడే తీసేసారు. ఇక మొన్న మీ బ్లాగులో వేయ ప్రయత్నించిన కామెంటును, మీ వెనకటి పోస్టు మీదే మళ్ళీ వేయటానికి ట్రై చేస్తున్నాను. స్టాండ్‌అలోన్ గా అర్ధం చేసుకుంటారనే అనుకుంటున్నాను :)

Anonymous said...

మిమ్మల్ని బ్లాగు లోకము ఒక విలన్ గా ఎందుకు చూస్తుందో అర్థం కావడం లేదు....మీరేమీ చేసినా తప్పని వాదించే అపఖ్యాతి మీరెలా మూటగట్టుకున్నారో అని ఆశ్చర్యంగా ఉంది.
@post
ఈ విషయం లో మాత్రం నేను మిమ్మల్ని సమర్థిస్తున్నాను...