Tuesday, June 9, 2009

ఆక్రందన


ప్రతి కదలికా చర్యకో రూపమే
ప్రతి క్షణం సమయంలో బంధమే
ప్రతి స్థలం విశ్వంలో భాగమే
ప్రతి వ్యక్తీ అనంతంలో ఏకమే

ఏ భావమూ భావనతో విడిపోలేదు
ఏ సంఘటననూ ఘటనతో విడదీయలేము
ఏ చేతననూ చైతన్యంతో విడదీసి చూడలేము
ఏ ఆలోచనానూ స్పృహ నుంచీ విడగొట్టలేము

అందుకే...
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటే
‘నా’నుంచీ నన్ను కాపాడి
నీలో కలుపుకోమనే ఆక్రందనేతప్ప
స్వార్థమెలా అవుతుంది?

*****

10 comments:

భావన said...

చాలా చాలా బాగుంది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటే
‘నా’నుంచీ నన్ను కాపాడి
నీలో కలుపుకోమనే ఆక్రందనేతప్ప
స్వార్థమెలా అవుతుంది? "
గుండె గొంతుక లోకి వచ్చి ఈ పదం పాడి కళ్ళవెంబడి బయటకు వెళి పోతుందేమో....

భావన said...

ఆ పిక్చర్ చాలా బాగుంది. ఎక్కడ దొరుకుతాయి అండి మీకు అంత మంచి పిక్చర్స్ ఇస్కాన్ వాళ్ళ పిక్చర్ లా వుంది.

Vani said...

Good one. Last stanza is too good.

Padmarpita said...

"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటే
‘నా’నుంచీ నన్ను కాపాడి
నీలో కలుపుకోమనే ఆక్రందనేతప్ప
స్వార్థమెలా అవుతుంది? "చాల బాగుందండి!

మరువం ఉష said...

స్వాతి వార పత్రికలో ఆ మధ్య చదివిన "పాలెగత్తె" ధారావాహిక నవల్లోని చివరి అంకం గుర్తుకొచ్చింది. ప్రేమని గురించి ఇంతే సున్నితంగా, మరెంతో హత్తుకునేలా చెప్పారు రచయిత. మళ్ళీ మీ పలుకులు అదే భావ తీవ్రతలో వున్నాయి.

Prasad Chitta said...

అవ్యక్తమైన ప్రేమని చక్కగా వ్యక్తీకరించారు మహేష్ గారు.

అనుభవిస్తే గాని తెలియని ఇలాంటి అలౌకికమైన ప్రేమాక్రన్దనానుభూతిని 'భక్తి' అంటారు.

Ramani Rao said...

"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటే
‘నా’నుంచీ నన్ను కాపాడి
నీలో కలుపుకోమనే ఆక్రందనేతప్ప
స్వార్థమెలా అవుతుంది."

సుపర్బ్గా ఉంది. మాటలు లేవు ఇలా ఉంది అని చెప్పడానికి. సుపర్బ్ అనే పదం కూడా తక్కువే

Anonymous said...

ఇలాంటి కవితలను పొగడే గొప్ప మనసు నాకు లేదు :)
ఆ బొమ్మ మాత్రం భలే ఉంది.

ఇందులో ఆ భూమిని మధ్యలోనుంచి తీసేసి, డీప్ బ్లూ అలాగే వదిలేయాలి.లేకపోతే మోళ్టన్ లావాఫ్లో లాగా ఉండాలి

అటూ ఇటూ ఉన్న కొండలస్థానే, ఆ భూమి టైపులో గ్రహాలు, సూపర్ నోవాలు పెట్టేసి, (డీప్ బ్లూ నే ఉంటుంది, ఆ వైట్ షేడ్ గ్యాసియస్ గా ఉంటే ఓకే), అప్పుడు అలా ఎల్లో సన్రైజ్ ఆర్ సన్‌సెట్ షేడ్ ఉంటే, ఇంకా బావుండేది.

నా మనసులో వెదుకుతున్న విశ్వరూపం అనే చిహ్నానికి దగ్గరిగే ఉండేది. ఎక్కడ పట్టారు!?

కెక్యూబ్ వర్మ said...

I think the purity of love is nowhere in this universe. Just we feel it in like this poems. Ur poem touching my heart.

రాధిక said...

మహేష్ గారూ మీరు కవిత్వం లో కొత్త ఒరవడిని తెస్తున్నారు.ప్రతీ భావమ్యొక్క వ్యక్తీకరణ ఎంత సూటిగా వుంటుందో.
"ప్రతి వ్యక్తీ అనంతంలో ఏకమే"
"నా’నుంచీ నన్ను కాపాడి
నీలో కలుపుకోమనే ఆక్రందనేతప్ప"...wahh sir